Srinivas Kuchibhotla
-
కూచిభొట్ల హంతకుడికి అమెరికా కోర్టు జీవిత ఖైదు
-
కూచిభొట్ల హంతకుడికి జీవిత ఖైదు
కన్సాస్, అమెరికా : హైదరాబాద్ టెకీ శ్రీనివాస్ కూచిభొట్ల(33) హంతకుడికి అమెరికా కోర్టు జీవిత ఖైదు విధించింది. స్నేహితుడితో కలసి బార్లో ఉన్న శ్రీనివాస్‌పై అమెరికా నేవీ మాజీ సైనికుడు ఆడమ్ ప్యురిన్‌టన్(52) ‘నా దేశం నుంచి వెళ్లిపోండి’అంటూ కాల్పులకు తెగబడిన విషయం తెల్సిందే. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన కూచిభొట్ల చికిత్సపొందుతూ ఆసుపత్రిలో ప్రాణాలు వదిలారు. శ్రీనివాస్‌తో పాటు బార్లో ఉన్న అలోక్ మాదసాని గాయాలతో బయటపడ్డారు. వీరిపై దాడిని అడ్డుకునేందుకు వచ్చిన ఇయాన్ గ్రిలట్ అనే వ్యక్తికి కూడా బుల్లెట్ గాయాలయ్యాయి. శ్రీనివాస్ హత్యపై అంతర్జాతీయ స్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తం అయ్యాయి. ఈ ఏడాది జనవరిలో కూచిభొట్ల భార్య సునయనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలి స్టేట్ ఆఫ్ యూనియన్ ప్రసంగానికి ఆహ్వానించారు. ఈ వేదికపై నుంచి ట్రంప్ కూచిభొట్లపై జరిగిన దాడిని ఖండించారు. ప్యూరింగ్‌టన్ శిక్షపై మాట్లాడిన న్యాయవాదులు 50 ఏళ్ల తర్వాత అతనికి పెరోల్‌పై బయటకు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పారు. ఆడమ్‌కు జీవిత ఖైదు విధించడాన్ని శ్రీనివాస్ భార్య సునయన ఆహ్వానించదగ్గ విషయంగా పేర్కొన్నారు. విదేశీయులపై దాడులకు పాల్పడేవారికి కఠిన శిక్షలు విధించాలని అన్నారు. -
శ్రీనివాస్ కూచిభొట్లను నేనే చంపాను!
అమెరికాలోని కాన్సన్ నగరంలో ప్రవాస తెలుగు వ్యక్తి శ్రీనివాస్ కూచిభొట్లను కాల్చిచంపేసిన కేసులో నిందితుడు కోర్టులో నేరాన్ని అంగీకరించాడు. నిందితుడు ఆడం పురింటన్‌కు మే 4న శిక్ష ఖరారు కానుంది. పథకం ప్రకారం చేసిన ఈ హత్యకు గాను అతనికి పెరోల్ లేకుండా 50 ఏళ్ల వరకు యావజ్జీవ కారాగార శిక్ష పడే అవకాశముంది. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడైన తర్వాత ఆ దేశమంతటా విదేశీయులపై విద్వేషం వ్యక్తమైన నేపథ్యంలో కాన్సస్ నగరంలో శ్రీనివాస్ కూచిభొట్ల, అతని స్నేహితుడు అలోక్ మాదసానిపై కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. విద్యార్థి వీసా మీద అమెరికాకు వెళ్లిన శ్రీనివాస్, అలోక్ అనంతరం అక్కడి జీపీఎస్ తయారీ కంపెనీ గార్మిన్‌లో ఇంజినీర్లుగా పనిచేసేవారు. ఈ క్రమంలో గత ఏడాది ఫిబ్రవరి 27న ఉద్యోగాన్ని ముగించుకొని స్నేహితులిద్దరు కాన్సస్‌లోని ఆస్టిన్స్ బార్ అండ్ గ్రిల్‌లోకి మద్యం సేవించేందుకు వెళ్లారు. అక్కడ వారిని చూసిన నిందితుడు పూరింటన్ జాతివిద్వేషంతో దూషణలకు దిగాడు. ‘నా దేశం నుంచి వెళ్లిపోండి’ అంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో అతన్ని బార్ నుంచి వెళ్లిపోవాల్సిందిగా సిబ్బంది చెప్పారు. ఇలా బయటకు వెళ్లిన పూరింటన్ అనంతరం తుపాకీ తీసుకొని వచ్చి శ్రీనివాస్ కూచిభొట్ల, అలోక్‌పై కాల్పులు జరిపాడు. ఈ సమయంలో జోక్యం చేసుకొని.. వారిని కాపాడేందుకు ప్రయత్నించిన సాటి శ్వేతజాతీయుడు ఇయాన్ గ్రిలాట్‌పై ఆ కిరాతకుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో శ్రీనివాస్ కూచిభొట్ల ప్రాణాలు విడువగా అలోక్, ఇయాన్ గాయాలపాలయ్యారు. ఈ ఘటన నేపథ్యంలో అమెరికాలోని ప్రవాస భారతీయుల భద్రతపై భారత ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ కేసులో తాజాగా నిందితుడు నేరాన్ని అంగీకరించిన నేపథ్యంలో శ్రీనివాస్ కూచిభొట్ల భార్య సునయన దుమల స్పందించారు. ఈ కేసులో నిందితుడు నేరాన్ని ఒప్పుకున్న నేపథ్యంలో విద్వేషం ఎప్పటికీ ఆమోదయోగ్యం కాదనే బలమైన సందేశాన్ని అందించాలని, మనమంతా పరస్పరం ప్రేమించుకోవాలిగానీ ద్వేషించుకోకూడదని ఆమె ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
కూచిభొట్ల భార్యకు తాత్కాలిక వర్క్ వీసా
వాషింగ్టన్: అమెరికాలో దారుణ హత్యకు గురైన సాఫ్ట్వేర్ ఇంజనీర్ శ్రీనివాస్ కూచిభొట్ల భార్య సునయన దుమలా అమెరికా నివాస హక్కులపై సందిగ్ధతలు తొలగిపోయాయి. కాంగ్రెస్ సభ్యుడు కెవిన్ యోడర్ సహాయంతో ఇటీవల ఆమె అమెరికా తాత్కాలిక వర్క్ వీసా పొందారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కాన్సాస్ బార్లో శ్రీనివాస్ హత్యకు గురైన విషయం తెలిసిందే. భర్త శ్రీనివాస్ మరణించడంతో అమెరికాలో నివసించే హక్కును సునయన కోల్పోయారు. ఈ పరిస్థితుల్లో తాత్కాలిక వీసా పొందేందుకు యోడర్ సహాయం చేశారు. ‘సునయన బాధపడింది చాలు. ఆమెకు సహాయపడాలని భావించాము. ఇకపై శాశ్వత వీసా వచ్చేలా ప్రయత్నిస్తాం’ అని యోడర్ ఫేస్బుక్లో తెలిపారు. -
కూచిభొట్ల హత్య కేసు: కోర్టుకు నిందితుడు
విచారణ మే 9కి వాయిదా హూస్టన్: హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూచిభొట్ల శ్రీనివాస్‌ను కాల్చిచంపిన నౌకాదళ విభాగం మాజీ ఉద్యోగి ఆడం పూరింటన్ గురువారం స్థానిక న్యాయస్థానం ఎదుట హాజరయ్యాడు. నారింజ రంగుతో కూడిన జంప్‌సూట్ ధరించిన పూరింటన్ విచారవదనంతో కనిపించాడు. అయితే ఈ కేసుకు సంబంధించి సాక్ష్యాలను పరిశీలించాల్సి ఉన్నందువల్ల మరికొంత సమయం కావాలని హంతకుడి తరఫు న్యాయవాది కోర్టును కోరారు. దీంతో ఈ కేçసు తదుపరి విచారణను కోర్టు మే నెల తొమ్మిదో తేదీకి వాయిదావేసింది. శ్రీనివాస్, అతని స్నేహితుడు మేడసాని అలోక్.ఫిబ్రవరి 22వ తేదీ రాత్రి కన్సాస్‌లోని ఓ బార్‌కు వెళ్లడం. అక్కడ నిందితుడు పూరింటన్ వీరికి తారసపడడం తెలిసిందే. ‘మీరు మధ్యప్రాచ్యానికి చెందినవారు కదా. మా దేశం విడిచివెళ్లిపోండి’ అంటూ తొలుత శ్రీనివాస్, అలోక్‌లతో గొడవకు దిగాడు. ఆ తర్వాత బార్ నిర్వాహకులు అతనిని అక్కడి నుంచి బలవంతంగా బయటికి పంపగా కొద్దిసేపటి తర్వాత మళ్లీ అక్కడకు చేరుకుని ఆకస్మికంగా వీరిరువురిపై కాల్పులు జరపగా శ్రీనివాస్ చనిపోవడం తెలిసిందే. -
నిన్ను చాలా మిస్సవుతున్నా: సునయన
హైదరాబాద్: ప్రవాస భారతీయుడు, ఏవియేషన్ ఇంజనీర్ శ్రీనివాస్ కూచిభొట్ల ఈ లోకంలో ఉన్నట్టయితే ఈ రోజు (గురువారం) తన 33వ పుట్టినరోజు వేడుకను చేసుకునేవారు. ఇప్పుడు శ్రీనివాస్ లేరు. అతని జ్ఞాపకాలే మిగిలున్నాయి. అమెరికాలోని కాన్సాస్‌లో ఓ శ్వేతిజాతి దుండగుడు జాతివివక్షతో జరిపిన కాల్పుల్లో ఆయన మరణించిన సంగతి తెలిసిందే. శ్రీనివాస్ కుటుంబ సభ్యులు, భార్య సునయన ఇంకా ఈ విషాదం నుంచి కోలుకోలేదు. సునయన కన్నీటి జ్ఞాపకాలతో భర్తను గుర్తు చేసుకుంటూ విషెష్ చెప్పారు. శ్రీనివాస్ జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ ఫేస్బుక్లో ఓ లేఖను పోస్ట్ చేశారు. 'హ్యాపీ బర్త్ డే మై లవ్. ఇలా శుభాకాంక్షలు చెబుతున్నందుకు బాధగా ఉంది. నిన్ను చాలా మిస్సవుతున్నా' అంటూ సునయన పోస్ట్ చేశారు. శ్రీనివాస్ కుటుంబ సభ్యులు ఇంకా విషాదం నుంచి కోలుకోలేదని సమీప బంధువు కృష్ణమోహన్ చెప్పారు. శ్రీనివాస్ బతికున్న రోజుల్లో ప్రతీ పుట్టినరోజున స్కైప్ ద్వారా వీడియో కాల్ చేసి కుటుంబ సభ్యులందరితో మాట్లాడేవారని కుటుంబ సభ్యులు గుర్తు చేసుకున్నారు. తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకునేవారని తెలిపారు. శ్రీనివాస్ జయంతి సందర్భంగా ఈ రోజు సాయంత్రం హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్‌లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించనున్నారు. -
అమెరికాలోని మనవారిపై మరో విద్వేషపు పడగ!
ఓహిలోని భారతీయుల విద్వేషపు వీడియో పెరిగిపోతున్న జాత్యాంహకారంపై ఎన్నారైల్లో గుబులు తెలుగు ఇంజినీర్ శ్రీనివాస్ కూచిభొట్ల దారుణమైన హత్యోదంతం కళ్లుముందు కదలాడుతుండగానే.. అమెరికాలో విద్వేషపు పడగలు విచ్చుకుంటున్నాయి. అక్కడ ఉన్న భారతీయుల భద్రతపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. అధ్యక్షుడు ట్రంప్ ఎగజిమ్ముతున్న జాత్యాంహకారాన్ని నిలువెల్లా ఒంటబట్టించుకుంటున్న అమెరికన్లు.. తమ ఉద్యోగాలను కొల్లగొడుతున్నారని భారతీయులపై విద్వేషం పెంచుకుంటున్నారు. వారు లక్ష్యంగా దాడులకు తెగబడుతున్నారు. తాజాగా అమెరికాకు చెందిన ఓ ప్రవాస వ్యతిరేకుల వెబ్సైట్ అక్కడ ఉన్న మనవారిలో మరింత గుబులు రేపుతోంది. ఓహిలోని కొలంబస్ నగరంలో విశ్రాంతి తీసుకుంటున్న భారతీయుల ఫొటోలు, వీడియోలు ఈ వెబ్సైట్లో దర్శనమివ్వడమే కాదు.. మనవారికి వ్యతిరేకంగా విద్వేషపూరిత వ్యాఖ్యలు ఉన్నాయి. సేవ్అమెరికాఐటీజాబ్స్.కామ్ పేరిట ఉన్న ఈ సైట్లో.. ఓహిలోని ఓ పార్కులో కాలక్షేపం చేస్తున్న భారతీయుల కుటుంబాల వీడియోను పోస్ట్ చేశారు. సంపన్న భారతీయులు ఓహి పట్టణాల్లోకి చొరబడి.. స్థానిక అమెరికన్లను నిర్వాసితులను చేశారంటూ విద్వేషపూరిత వ్యాఖ్యలను ఈ వీడియోలో జోడించారు. మార్చ్ 6నాటికి ఈ వీడియోను 40వేలకుపైగా మంది యూట్యూబ్‌లో చూశారు. వర్జినీయాకు చెందిన 66 ఏళ్ల కంప్యూటర్ ఇంజినీర్ స్టీవ్ పుషర్ ఈ వెబ్‌సైట్‌ను రూపొందించినట్టు తెలుస్తోంది. వాలీబాల్ ఆడుతున్న పెద్దలు, సైకిల్ తొక్కుతున్న చిన్న పిల్లల్ని వీడియోలో చూపిస్తూ.. 'ఇక్కడ ఎంతమంది విదేశీయులు ఉన్నారో చూస్తే నా దిమ్మ తిరిగిపోతోంది. ఈ ప్రాంతమంతా భారతీయులే ఉన్నారు. అమెరికన్ల నుంచి పెద్దసంఖ్యలో ఉద్యోగాలను వాళ్లు కొల్లగొట్టారు. భారతీయ జనాలు ఈ ప్రాంతాన్ని చెరపట్టారు. ఇది టేకోవర్ చేసుకోవడం లాంటిదే' అంటూ పుషర్ విద్వేష వ్యాఖ్యలు చేశాడు. అంతేకాకుండా ఈ ప్రాంతాన్ని వ్యంగ్యంగా 'మినీ ముంబై' అంటూ అభివర్ణించాడు. గత ఆగస్టులోనే అతను భారతీయులకు వ్యతిరేకంగా విద్వేషపూరిత వీడియోను, ఓ పీడీఎఫ్ డాక్యుమెంట్‌ను కూడా పోస్టు చేశాడు. ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత అమెరికాలో విదేశీయులపై వ్యతిరేకత పెరిగిపోవడం, ఈ క్రమంలోనే శ్రీనివాస్ కూచిభొట్ల హత్య జరిగిన నేపథ్యంలో ఈ విద్వేషపూరిత వెబ్సైట్లో ఉన్న భారతీయుల ఫొటోలు, వీడియోలు ఉండటం అక్కడున్న మనవారిలో మరింత గుబులురేపుతోంది. -
‘భారతీయులు మాకు చాలా ముఖ్యం’
న్యూయార్క్: భారతీయులు తమ పట్టణానికి చాలా ముఖ్యమైన వారని అమెరికాలోని కాన్సాస్ గవర్నర్ శ్యామ్ బ్రౌన్ బ్యాక్ అన్నారు. వారికి తమ నగరంలోకి అన్ని వేళలా స్వాగతం పలుకుతామని చెప్పారు. ఇటీవల కాన్సాస్ నగరంలోని ఆస్ట్రిచ్ బారులో తెలుగువారిపై ఓ తెల్లజాతి దురహంకారి కాల్పులు జరపడంతో శ్రీనివాస్ కూచిబొట్ల అనే ఇంజినీర్ చనిపోగా.. మరో తెలుగువాడు అలోక్ మాదసాని గాయపడ్డాడు. వీరిని రక్షించే క్రమంలో అమెరికన్ కూడా గాయపడ్డాడు. ట్రంప్ తీసుకున్న వలస దారుల వ్యతిరేక నిర్ణయాల అనంతరం జరిగిన ఈ ఘటన తీవ్ర సంచలనం రేపింది. ఈ నేపథ్యంలో కాన్సాస్ గవర్నర్ ప్రత్యేకంగా భారతీయ దౌత్యాధికారులు, భారత కమ్యూనిటీకి చెందిన ముఖ్యులతో ప్రత్యేకంగా సమావేశమై భరోసా ఇచ్చారు. ఎన్నో దేశాల నుంచి తమ పట్టణానికి వస్తుంటారని, కానీ, భారతీయులు తమకు చాలా ముఖ్యమైన వారని ఆయన అన్నారు. అలాంటివారిపై జాతి విచక్షణ పేరుతో హింస జరగడాన్ని తాము అంగీకరించబోమని, మొన్న జరిగిన ఘటనకు సిగ్గుపడుతున్నామని అన్నారు. ఎప్పుడు ఎలాంటి సహాయం కావాలన్న తాము ఇండియన్స్‌కు అందిస్తామని చెప్పారు. ఇక భారతీయ కాన్సులేట్ తరుపున పనిచేసే కాన్సుల్ జనరల్ అనుపమ్ రాయ్ మాట్లాడుతూ గన్‌మేన్ నుంచి భారతీయులను కాపాడేందుకు అసమాన ధైర్యం చూపించి తీవ్రంగా గాయపడిన ఇయాన్ గ్రిల్లాట్‌ను గురువారం కలుసుకోబోతున్నానని చెప్పారు. అలాంటి వ్యక్తిని ఇప్పటి వరకు నా జీవితంలో ఒక్కసారి కూడా చూడలేదన్నారు. మరో వ్యక్తి కోసం బుల్లెట్‌కు ఎదురెళ్లిన గొప్ప సాహసి అని అన్నారు. సంబంధిత వార్తా కథనాలకై చదవండి.. రక్షించేందుకు కాల్పులకు ఎదురెళ్లిన హీరో ఇతడే ‘కాలుస్తుంటే ఏదో ఒకటి చేయాలనిపించింది’ శ్రీనివాస్ మృతిపట్ల యూఎస్ కంపెనీ తీవ్ర దిగ్భ్రాంతి అమెరికాలో జాతి విద్వేష కాల్పులు శ్రీనివాస్ కుటుంబానికి ఎన్ఆర్ఐల బాసట -
కాన్సాస్ హీరోకు భారత్ ఆహ్వానం
హ్యూస్టన్: అమెరికాలో కాన్సాస్ కాల్పుల్లో తెలుగువారిని రక్షించే ప్రయత్నంలో గాయపడ్డ ఆ దేశ పౌరుడు ఇయాన్ గ్రిల్లాట్ (24)ను భారత్‌కు ఆహ్వానించారు. హ్యూస్టన్‌లోని భారత రాయబార కార్యాలయం దౌత్యాధికారి అనుపమ్ రే.. గ్రిల్లాట్‌ను కలిశారు. ఆస్పత్రిలో వారం రోజులు చికిత్స పొందిన గ్రిల్లాట్‌ను గత మంగళవారం డిశ్చార్జి చేసి ఇంటికి పంపారు. గ్రిల్లాట్ పూర్తిగా కోలుకునేందుకు సమయం పడుతుందని కాన్సాస్ యూనివర్శిటీ ఆరోగ్య విభాగం వెల్లడించింది. శుక్రవారం గ్రిల్లాట్ కుటుంబ సభ్యులతో కలసి ఆస్పత్రికి వెళ్లి అనుపమ్ రేను కలిశారు. తెలుగువారిని రక్షించేందుకు గ్రిల్లాట్ చూపిన తెగువను భారతీయులు అభినందిస్తున్నారని ఈ సందర్భంగా రే వారితో చెప్పినట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. గ్రిల్లాట్ కోలుకున్న తర్వాత అతను, కుటుంబ సభ్యులు భారత్‌కు రావాల్సిందిగా ఆహ్వానించారు. కాన్సాస్‌లోని ఓ బార్లో శ్వేతజాతి దుండగుడు అడామ్ పురింటన్ (51) జాతివిద్వేషంతో జరిపిన కాల్పుల్లో శ్రీనివాస్ కూచిబొట్ల చనిపోగా అలోక్ మాదసాని గాయపడ్డాడు. వీరిని కాపాడేందుకు ప్రయత్నించిన గ్రిల్లాట్ గాయపడ్డాడు. ఛాతీ, చేతిలోకి రెండు బుల్లెట్లు దూసుకెళ్లాయి. సంబంధిత వార్తలు చదవండి కాలుస్తుంటే ఏదో ఒకటి చేయాలనిపించింది రక్షించేందుకు కాల్పులకు ఎదురెళ్లిన హీరో ఇతడే -
వైట్ హౌస్ ఒప్పుకుంది
వాషింగ్టన్: తెలుగు ఇంజనీర్ కూచిభొట్ల శ్రీనివాస్ హత్యను అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ ఖండిచింది. కూచిభొట్ల శ్రీనివాస్ ది జాత్యంహకార హత్యగా అంగీకరించింది. జాతి వివక్షతో కూడిన దాడిగా వర్ణించింది. ఇలాంటి ఘటనలను సహించబోమని స్పష్టం చేసింది. ‘ఇప్పటివరకు వెల్లడైన వాస్తవాలను బట్టి చూస్తే కాన్సస్ కాల్పులు.. జాతి వివక్షతో కూడిన విద్వేష దాడిగా రూడీ అవుతోంది. జాత్యంహకార దాడులను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ఖండిస్తారు. ఇటువంటి దాడులను సహింబోమ’ని వైట్ హౌస్ అధికార ప్రతినిధి సారా శాండర్స్ మీడియాతో అన్నారు. మరోవైపు కూచిభొట్ల శ్రీనివాస్ మృతికి అమెరికా కాంగ్రెస్ సంతాపం తెలిపింది. కాన్సస్ కాల్పులు బాధితుల కోసం అమెరికా చట్టసభ సభ్యులు నిమిషం మౌనం పాటించారు. గత బుధవారం రాత్రి కాన్సస్ లోని ఆస్టిన్స్ బార్లో ఆడమ్ పూరింటన్ అనే వ్యక్తి జరిపిన కాల్పుల్లో కూచిభొట్ల శ్రీనివాస్ మృతి చెందాడు. మరో తెలుగు ఇంజనీర్ అలోక్ రెడ్డి, అమెరికన్ ఇయాన్ గ్రిల్లాట్ గాయపడ్డారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నట్టు ఎఫ్ బీఐ తెలిపింది. జాత్యంహకార దాడిగానే భావించి విచారణ చేపట్టామని ఎఫ్ బీఐ వెల్లడించింది. -
అమెరికా సిద్ధంగా ఉంది: ట్రంప్
అమెరికన్ కాంగ్రెస్‌లో బుధవారం ట్రంప్ తన మొదటి ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా కూచిభొట్ల శ్రీనివాస్ హత్యను ట్రంప్ ఖండించారు. శ్రీనివాస్ మృతి పట్ల అమెరికన్ కాంగ్రెస్ నిమిషం పాటు మౌనం పాటించి సంతాపం తెలిపింది. విద్వేష దాడులకు అమెరికాలో చోటు లేదని.. విద్వేషాలను అందరూ ఖండించాలని ట్రంప్ పిలుపునిచ్చారు. ఒబామా పాలనా కాలంలోనే ఉగ్రవాద దాడులు పెరిగాయని తొలి కాంగ్రెస్ ప్రసంగంలో ట్రంప్ విమర్శించారు. అమెరికా పౌరులకు రక్షణ, ఉద్యోగాల కల్పనే తన తొలి ప్రాధాన్యత అని ట్రంప్ పునరుద్ఘాటించారు. యూదులపై జరుగుతున్న దాడులను ట్రంప్ ఖండించారు. అధ్యక్ష ఎన్నికల తరువాత పరిస్థితి సానుకూలంగా మారుతుందని వెల్లడించారు. మాదకద్రవ్య వ్యాపారులు, రౌడీలను నిర్మూలించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. తమ పాలనలో అవినీతికి తావు లేదని, లాబీయింగ్‌పై ఐదేళ్లు నిషేధం అని ట్రంప్ తెలిపారు. అమెరికా శక్తివంతమైన, స్వేచ్ఛాదేశం అని ట్రంప్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. అమెరికా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తానని ట్రంప్ స్పష్టం చేశారు. ఈ నెలరోజుల్లో తన పనితీరుపై ట్రంప్ సంతృప్తి వ్యక్తం చేశారు. స్టాక్ మార్కెట్లు పుంజుకుంటున్నాయని తెలిపారు. దేశ దక్షిణ దిశలో గోడను నిర్మించి సరిహద్దులను బలోపేతం చేస్తామని, ఇస్లామిక్ తీవ్రవాదంపై ఉక్కుపాదం మోపుతామని తెలిపిన ట్రంప్.. ప్రపంచాన్ని ముందుండి నడిపేందుకు అమెరికా సిద్ధంగా ఉందన్నారు. -
కూచిభొట్ల శ్రీనివాస్‌కు కన్నీటి వీడ్కోలు
-
ట్రంప్ నోరు విప్పాలి
శ్రీనివాస్ కూచిభొట్ల హత్యపై హిల్లరీ డిమాండ్ ♦ ట్రంప్ మౌనం విద్వేషపూరిత నేరాలకు ఆజ్యం: న్యూయార్క్ టైమ్స్ ♦ కోర్టు విచారణకు హాజరైన హంతకుడు ప్యూరింటన్ ♦ నేరం రుజువైతే 50 ఏళ్ల జైలు శిక్ష వాషింగ్టన్ : జాత్యాహంకార దాడిలో హత్యకు గురైన శ్రీనివాస్ ఉదంతంపై అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ స్పందించారు. అమెరికాలో కొనసాగుతున్న విద్వేషపూరిత నేరాలపై అధ్యక్షుడు ట్రంప్ నోరు విప్పాలని డిమాండ్ చేశారు. ‘బెదిరింపులు, విద్వేషపూరిత నేరాలు పెరిగాయి. ఈ విషయం ట్రంప్‌కు మనం చెప్పాల్సిన అవసరం లేదు. ట్రంప్ నోరు విప్పాలి’ అని ఆమె ట్వీట్ చేశారు. శ్రీనివాస్ హత్యపై ట్రంప్ ఇంతవరకూ స్పందించలేదు. అయితే శ్రీనివాస్ హత్యపై వైట్‌హౌస్ స్పందించింది. వలసలపై నిషేధాజ్ఞలకు కాన్సస్ కాల్పులకు సంబంధంలేదని వాదించిన సర్కారు... కాల్పుల ఘటన ఆందోళన కలిగించిందని తెలిపింది. ఆ మేరకు వైట్‌హౌస్ మీడియా కార్యదర్శి సీన్ స్పైసర్ మీడియాతో మాట్లాడుతూ... కాన్సస్ నుంచి అందుతున్న ప్రాథమిక వివరాలు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. విద్వేషాల్ని అణచకుండా ఆజ్యం పోస్తున్నారు: న్యూయార్క్ టైమ్స్ భారతీయ ఇంజనీరు హత్యపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మౌనం వహించి... అమెరికాలో విద్వేషపూరిత నేరాలకు ఆజ్యం పోశారని ప్రముఖ వార్తాపత్రిక న్యూయార్క్ టైమ్స్ అభిప్రాయపడింది. ‘అధ్యక్షుడు ట్రంప్, అతని యంత్రాంగం చాలా మంది వలసదారులు, విదేశీ పర్యాటకుల్ని దేశం నుంచి పంపేందుకు ప్రయత్నించడం ఒక్కటే కాదు... వారిని నేరస్తులుగా, ఉగ్రవాదులుగా, అక్రమంగా నివసిస్తున్నవారిగా ముద్ర వేస్తోంది. విద్వేషాన్ని అణచివేయకుండా... అధ్యక్షుడు ఆజ్యం పోస్తున్నారు. కాన్సస్ కాల్పులకు సంబంధించి కనీసం ఏమీ మాట్లాడలేదు. విద్వేషపూరిత నేరం జరిగితే నేరస్తుడి మానసిక స్థితి సరిగాలేదని సులువుగా చెప్పేస్తున్నారు. ఒకవేళ ఇలాంటి నేరాలు ముస్లింలు గానీ, సరైన పత్రాలు లేకుండా నివసిస్తున్నవారు చేస్తే... తాను చెప్పినట్లే జరుగుతుందని ట్రంప్ తప్పకుండా అంటారు’ అని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. ట్రంప్ ఎలాంటి చర్యలు తీసుకోకపోతే... విద్వేష పూరిత నేరాలు చేసేందుకు నేరస్తులకు అధికారమిచ్చినట్లు అవుతుందని తన వ్యాసంలో తప్పుపట్టింది. ‘ట్రంప్ అమెరికా’లో విద్వేష పూరిత నేరాలు, పక్షపాతంతో కూడిన సంఘటనలు ఎక్కువవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. మీతో ఉండనివ్వండి: బార్టెండర్తో ప్యూరింటన్ శ్రీనివాస్ హత్య తర్వాత రెస్టారెంట్లో తలదాచుకున్న ప్యూరింటన్ ... బార్టెండర్ సామ్‌తో ఏం మాట్లాడింది వెలుగులోకి వచ్చింది. ‘నేను మీతో ఉండవచ్చా అని ప్యూరింటన్ నన్ను అడిగాడు. ఏంచేశాడో చెప్పలేదు. నేను అతన్ని అడుగుతూనే ఉన్నాను. మాతో ఉండనిస్తేనే ఏం జరిగిందో∙చెపుతానన్నాడు. చివరికి ఒలేతేలో ఇద్దరు ఇరానియన్లను చంపానన్నాడు’ అని సామ్ పోలీసులకు ఫోన్ లో వెల్లడించింది. సాక్ష్యాధారాల సేకరణ కోసం రంగంలోకి ఎఫ్‌బీఐ అమెరికాలోని కాన్సస్‌లో శ్రీనివాస్ కూచిభొట్లను హత్య చేసి, మరో ఇద్దరిని గాయపరిచిన కేసులో నిందితుడు ఆడమ్ ప్యూరింటన్ ర్చారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిందితుడ్ని జాన్సన్ కౌంటీ డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జి సోమవారం విచారించారు. ప్యూరింటన్ పై ఒక ఫస్ట్–డిగ్రీ మర్డర్(హత్య), రెండు ఫస్ట్ డిగ్రీ మర్డర్ అటెంప్ట్(హత్యాయత్నం) కేసులు నమోదైన సంగతి తెలిసిందే. జాన్సన్ కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ వెల్లడించిన వివరాల ప్రకారం... నేరం రుజువైతే ప్యూరింటన్ కు గరిష్టంగా 50 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశముంది. మరోవైపు, సాక్ష్యాధారాల సేకరణలో స్థానిక పోలీసులకు ఎఫ్‌బీఐ సాయమందిస్తోంది. ఈ హత్యను జాత్యహంకార నేరంగా ఎఫ్‌బీఐ రుజువు చేస్తే ఫెడరల్ అభియోగాల మేరకు ప్యూరింటన్ కు మరణశిక్ష విధించే అవకాశముంది. ప్రస్తుతం అతను జాన్సన్ కౌంటీ జైలులో రిమాండ్‌లో ఉన్నాడు. తెలుగులో మాట్లాడొద్దు: ‘టాటా’ హైదరాబాద్: అమెరికాలో నివసించే తెలుగు ప్రజలు బహిరంగ స్థలాల్లో తెలుగులో మాట్లాడ వద్దని తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టాటా) సూచించింది. ‘మాతృభాషలో మాట్లాడడాన్ని మనం ఎంతో ఇష్టపడ తాం. కొన్నిసార్లు తప్పుగా అర్థం చేసుకు నే అవకాశముంది. బహి రంగ ప్రదేశాల్లో ఇంగ్లిషులో మాట్లాడండి’ అని ఫేస్బుక్ పేజీలో కోరింది. బహిరంగ ప్రదేశాల్లో ఇతరులతో వాగ్వాదం పెట్టుకోవద్దని సూచించింది. జనసంచారం లేని ప్రాంతాల్నిలక్ష్యంగా చేసుకుంటున్నారని, తప్పనిసరైతే అలాంటి ప్రదేశాలకు ఒంటరిగా వెళ్లవద్దని సూచించింది. -
శ్రీనివాస్‌కు కన్నీటి వీడ్కోలు
-
తొమ్మిదేళ్ల మా స్నేహాన్ని చిదిమేశారు
-
తొమ్మిదేళ్ల మా స్నేహాన్ని చిదిమేశారు
► ఇదంతా కల అయి ఉంటే ఎంత బాగుండేది ► నేను కారు కొనేవరకు శ్రీనివాస్ కూడా కొనలేదు ► చొక్కాతో కట్టు కట్టకపోతే నా ప్రాణాలూ పోయేవి ► అమెరికా కాల్పుల్లో గాయపడిన అలోక్ రెడ్డి ► చేతి కర్రలతో వచ్చి సంస్మరణ సభలో పాల్గొన్న అలోక్ ఓలేత్ (అమెరికా): ప్రాణస్నేహితుడిని పోగొట్టుకున్న బాధ అలోక్ రెడ్డి గుండెలను పిండేసింది. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అవుతూనే కూచిభొట్ల శ్రీనివాస్ సంస్మరణార్థం ఏర్పాటుచేసిన కార్యక్రమానికి చేతికర్రల సాయంతో నడుస్తూ వచ్చారు. శ్రీనివాస్‌తో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. ఓలేత్ నగరంలోని బాల్ కాన్ఫరెన్స్ సెంటర్లో ఇండియా అసోసియేషన్ ఆఫ్ కాన్సాస్ సిటీ వాళ్లు ఏర్పాటుచేసిన ఈ సంస్మరణ సభలో అలోక్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. ''ఇదంతా ఓ కల అయితే బాగుండనిపిస్తోంది. అసలు నేను ఇక్కడకు రావడానికి ప్రధాన కారణం శ్రీనివాసే. అతడు కూడా ఇప్పుడు నాతో ఉండి ఉంటే ఎంత బాగుంటుందో అనిపిస్తోంది. తొమ్మిదేళ్ల నుంచి మేమిద్దరం మంచి స్నేహితులం. ఇద్దరం కలిసే ఉద్యోగానికి వెళ్లేవాళ్లం, తిరిగి వచ్చేటప్పుడు సరదాగా గడిపేవాళ్లం. ఇక్కడ కష్టంగా ఉందని గానీ, తిరిగి వెళ్లిపోదామని గానీ శ్రీనివాస్ ఏరోజూ చెప్పలేదు. గత ఆరు నెలలుగా ప్రతిరోజూ నా అపార్టుమెంటు దగ్గరకు వచ్చి, తన కారులో ఎక్కించుకుని ఆఫీసుకు తీసుకెళ్లేవాడు. నేను కారు కొనేవరకు కూడా తను కొనకుండా ఆగాడు. అంత మంచి మనసు మా శ్రీనుది. నేను కారు కొన్నా కూడా దాన్ని బయటకు తీయాల్సిన అవసరం రాలేదు'' అని అలోక్ చెప్పారు. పిచ్చి ఆవేశంలో ఒక వ్యక్తి చేసిన నేరం వల్ల తాను తన ప్రాణస్నేహితుడిని కోల్పోయి ఇక్కడ ఒంటరిగా మిగిలిపోవాల్సి వచ్చిందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కేవలం ఒక వ్యక్తి చేసిన ఘటనే తప్ప కాన్సాస్ ప్రాంత అసలైన స్ఫూర్తిని ఏమాత్రం దెబ్బతీయలేదని అన్నారు. దాంతో ఒక్కసారిగా ఆ సదస్సు జరిగిన హాల్ చప్పట్లతో మార్మోగింది. అమెరికాలో నిస్వార్థపరులు, కష్ట జీవులు ఉంటారని, ఆరోజు రాత్రి జరగకూడని ఘటన జరిగిందని అలోక్ చెప్పారు. ఆ షర్టు లేకపోతే... కాల్పులు జరిగిన రోజున తమను కాపాడేందుకు వచ్చింది ఒకరు కాదు.. ఇద్దరని అలోక్ రెడ్డి తెలిపారు. ఆ వ్యక్తి ఎవరో తనకు తెలియదు గానీ, ఆయన తాను వేసుకున్న షర్టు తీసి, తనకైన బుల్లెట్ గాయం నుంచి అవుతున్న రక్తస్రావాన్ని ఆపడానికి కట్టుకట్టారని చెప్పారు. ఆయన అలా కట్టకపోతే.. తీవ్ర రక్తస్రావం కారణంగా తన ప్రాణాలు కూడా పోయి ఉండేవని అంబులెన్సులో ఉన్నవాళ్లు తనకు తెలిపారన్నారు. అమెరికన్లంతా సహనం కలిగి ఉండాలని, మానవత్వం పట్ల గౌరవం ఉండాలని చెబుతూ.. తాను ఎక్కువ ఏమీ అడగట్లేదని, తన స్నేహితుడు కూడా ఇదే కోరుకుంటాడని అలోక్ చెప్పారు. అమెరికాలో జాతివిద్వేషంపై మరిన్ని కథనాలు చూడండి... హైదరాబాద్‌కు చేరుకున్న శ్రీనివాస్ మృతదేహం ‘కాలుస్తుంటే ఏదో ఒకటి చేయాలనిపించింది’ అమెరికాలో ప్రమాదం ఇలా తప్పించుకోండి అమెరికాలో భారతీయులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అమెరికాలో జాతి విద్వేష కాల్పులు విద్వేషపు తూటా! మనం అమెరికాకు చెందిన వాళ్లమేనా? భారతీయుల రక్షణకు కట్టుబడి ఉండాలి కాల్పులపై శ్వేతసౌదం ఏం చెబుతుందో? నా భర్త మరణానికి సమాధానం చెప్పాలి ‘తరిమేయండి.. లేదా తలలో బుల్లెట్లు దించండి’ -
కాటేసిన జాత్యహంకారం
అమెరికాలో గత కొన్నేళ్లుగా నెలకొని ఉన్న విద్వేషపూరిత వాతావరణం చివరకు ఒక యువ ఇంజనీర్ ప్రాణాలను బలిగొంది. మెరుగైన అవకాశాల కోసం ఖండాం తరాలు వలసపోయిన తెలుగు యువకుడు కూచిభొట్ల శ్రీనివాస్‌ను జాతి విద్వేషం తలకెక్కించుకున్న దుండగుడు అడమ్ పూరింటన్ మొన్న శుక్రవారం పొట్టనబెట్టుకు న్నాడు. అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని చేజిక్కించుకోవడానికి రెండేళ్లక్రితం డోనాల్డ్ ట్రంప్ రంగంలోకి దిగుతూ ఈ రకమైన ఉన్మాదానికి నారూ నీరూ పోశారు. అది రోజులు గడుస్తున్నకొద్దీ పెరిగిందే తప్ప తగ్గలేదు. పొరుగునున్న మెక్సికన్లతో మొద లుబెట్టి ముస్లింల వరకూ డోనాల్డ్ ట్రంప్ ఎవరినీ వదల్లేదు. భారతీయులు, చైనీ యులు కూడా మినహాయింపు కాదు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం చేసిన ఆయన చేసిన ప్రసంగాలన్నీ విద్వేషాన్ని వెదజల్లాయి. భయపెట్టడం, బెదర గొట్టడం, రెచ్చగొట్టడం, పూనకం వచ్చినట్టు మాట్లాడటం ఆయనొక కళగా అభి వృద్ధి చేసుకున్నాడు. ఆ ప్రసంగాల్లో మంచీ మర్యాదా మచ్చుకైనా కనబడవు. సంస్కారం జాడే ఉండదు. మహిళలన్నా, నల్లజాతీయులన్నా, వికలాంగులన్నా ట్రంప్‌కు కంపరం. ఎంత తోస్తే అంతా మాట్లాడటం... అసాధ్యమైనవాటిని అవ లీలగా చేయగలనని నమ్మించడంలో దిట్ట. ‘మీ ఉద్యోగాలు మరొకరు కొల్లగొడు తున్నారు... మీ బతుకుల్ని బయటి దేశాలనుంచి వచ్చినవారు నాశనం చేస్తు న్నారు... మీ భవిష్యత్తునంతటినీ ఛిద్రం చేస్తున్నారు’ అంటూ ఆయన అమెరికన్ పౌరులనుద్దేశించి మాట్లాడిన మాటలు సమాజాన్ని భయకంపితం చేశాయి. దాన్ని నిట్టనిలువునా చీల్చి పరస్పర అవిశ్వాసాన్ని పెంచాయి. ‘అమెరికాను మళ్లీ గొప్ప దేశంగా చేద్దామ’ంటూ ట్రంప్ ఇచ్చిన మతిమాలిన పిలుపు ఉన్మాదుల పాలిట ఆక్సిజన్ అయింది. అది తొలుత ట్రంప్‌కు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వాన్ని, ఆ తర్వాత అధ్యక్ష పీఠాన్ని కట్టబెట్టింది. కానీ అక్కడికి ఉపాధి కోసం దేశదేశాలనుంచి వలస పోయిన సాధారణ పౌరులకు క్షణక్షణం భయంగా బతికే దుస్థితిని కల్పించింది. నిజానికి ట్రంప్‌కు ముందు నుంచీ అమెరికాలో ఇలాంటి ధోరణులున్నాయి. ట్రంప్ చేసిందల్లా వాటిని ఉన్మాద స్థాయికి తీసుకెళ్లడం. ఉన్మాది తుపాకి గుళ్లకు బలైన శ్రీనివాస్ భార్య సునయన ఆవేదనంతా అదే. కొంతకాలంగా అమెరికాలో జరుగుతున్న ఉదంతాలు గమనిస్తుంటే తాము ఇక్కడి వారమా... కాదా అన్న అనుమానం కలుగుతోందని ఆమె చెప్పడంలో వాస్తవం ఉంది. అంతకు ముందు సైతం జాత్యహంకారం రెచ్చగొట్టే వ్యక్తులు, గ్రూపుల ఉనికి లేకపోలేదు. ప్రపం చంలో అమెరికా పాలకులు సాగిస్తున్న దుష్కృత్యాలను సమర్ధించడం... దేశంలో నల్ల జాతీయులపైనా, ముస్లింలపైనా, యూదులపైనా, ఇతర మైనారిటీలపైనా దౌర్జన్యం చలాయించడం వంటివి ఆ గ్రూపులు ఎప్పటినుంచో సాగిస్తున్నాయి. వీరి ఉన్మాదానికి అనేకమంది బలయ్యారు. ఇలాంటి ఉన్మాదుల గుంపు ట్రంప్ ప్రవేశ పెట్టిన ద్వేషపూరిత ధోరణులతో మరింత బరితెగించింది. వలసలపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలకూ, ఈ ఉదంతానికీ సంబంధం లేదంటూ శ్వేత సౌధం చేస్తున్న తర్కం నిలబడేది కాదు. ఇది జరిగిన దుర్మార్గం తీవ్రతనూ, విస్తృతినీ దాచే యత్నం. అసలు దోషిని మరుగుపరచడానికి చేసే వృథా ప్రయాస. తమ బాధ్యతేమీ లేదని తప్పించుకోవడానికి చేసే పని. శ్రీనివాస్‌పై గుళ్ల వర్షం కురిపించే ముందు ఉన్మాది పూరింటన్ అన్న మాటలేమిటి? ఆ మాటలకూ, ట్రంప్ రెండేళ్లుగా అడ్డూ ఆపూ లేకుండా సాగిస్తున్న ప్రసంగాల్లోని మాటలకూ తేడా ఏమైనా ఉందా? ట్రంప్ అధ్యక్షుడయ్యాక వేలాదిమందిని రంగంలోకి దించి చెక్‌పోస్టులు పెట్టి విదేశీయు లన్న అనుమానం కలిగినవారిని ఆపి అడుగుతున్న ప్రశ్నలకూ, పూరింటన్ కాల్పు లకు తెగబడే ముందు వేసిన ప్రశ్నలకూ పోలిక లేదా? అమెరికాలో అక్రమంగా ఉంటున్నారని, స్థానికుల ఉద్యోగాలు కొల్లగొడుతున్నారని పూరింటన్ మద్యం మత్తులోనో, మాదకద్రవ్యాల మత్తులోనో అన్నాడని చెబుతున్నారుగానీ... వాటి ప్రమేయం లేకుండానే వలసవచ్చినవారితో అతిగా, అమర్యాదకరంగా ప్రవర్తిస్తున్న గుంపులు చాలా ఉన్నాయి. అవి రోజురోజుకూ పెరుగుతున్నాయి. అధ్యక్ష ఎన్నికలు పూర్తయిన నవంబర్ 9 తర్వాత తొలి పది రోజుల్లోనే దేశం లోని వేర్వేరు రాష్ట్రాల్లో జాత్యహంకార ఉదంతాలు 867 జరిగాయని సదరన్ పావర్టీ లా సెంటర్ చెబుతోంది. 37 శాతం ఉదంతాల్లో ఉన్మాదులు ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలో చేసిన నినాదాలను వల్లించారని ఆ సంస్థ అంటున్నది. తమకు తారస పడుతున్న వారిని వీసా వివరాలు అడుగుతుండటం, దేశం వదిలి పొమ్మనడం, దొంగలు దోపిడీదారులంటూ వారి నివాసాలపై దాడులు చేయడం వంటివి ఈ మధ్యే ఎందుకు పెరిగాయో శ్వేత సౌధం సంజాయిషీ ఇవ్వగలదా? ఇది యథాలా పంగా జరిగిన ఉదంతంగా తేల్చడానికి ట్రంప్ బృందం చేసిన ప్రయత్నాలన్నీ సున యన ప్రకటన ముందు తేలిపోయాయి. నా భర్త మరణానికి సమాధానం చెప్పా లన్న ఆమె డిమాండుకు జవాబివ్వడం తెలియక ఆ బృందం నీళ్లు నములుతోంది. తమకు నచ్చని అభిప్రాయాలున్నా, తమకు పొసగని సిద్ధాంతాలు ఆచరిస్తున్నా ద్వేషించడం, దౌర్జన్యం చేయడం ఇటీవలికాలంలో పెరిగిపోయింది. రూపం వేరు కావొచ్చుగానీ అమెరికాలోనైనా, యూరప్ దేశాల్లోనైనా, మన దేశంలోనైనా ఇలాంటి అసహనం రాను రాను మితిమీరుతోంది. ఈ అసహన వాతావరణం సామాన్యుల్లో కూడా అకారణ ద్వేష భావనను రగులుస్తుంది. హింసను ప్రేరే పిస్తుంది. చుట్టూ జరుగుతున్న ఉదంతాలపై ఉదాసీనతను ఏర్పరుస్తుంది. ఉన్మాదు లకు కావాల్సింది ఇదే. మైనారిటీలుగా ఉన్న పౌరులను అనిశ్చితిలో, అభద్రతలో పడేసే ఇలాంటి పోకడలు అంతిమంగా మెజారిటీగా ఉన్న పౌరులను కూడా తాకక మానవు. శ్రీనివాస్‌పై దాడి జరిగిన క్షణంలో అడ్డుకోవడానికి ప్రయత్నించి గాయ పడిన అమెరిన్ యువకుడు గ్రిలట్... ‘సాటి మనిషి కోసం ఏం చేయాలో నేను అది చేశాన’ని చెప్పాడు. మానవత్వాన్ని చాటాడు. ఇలాంటివారే ట్రంప్ బారి నుంచి, ఆయన విద్వేష భావాలనుంచి అంతిమంగా అమెరికాను రక్షించుకోగలుగుతారు. అది అక్కడి సమాజ తక్షణావసరం. -
అమెరికాలో భారతీయులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
డల్లాస్ (టెక్సాస్) : ఇటీవల కాన్సాస్ లో జరిగిన కాల్పుల సంఘటన దురదృష్టకరమని 'ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్ షిప్ కౌన్సిల్' జాతీయ సంఘానికి అధ్యక్షులు, తానా మాజీ అధ్యక్షులు డాక్టర్. ప్రసాద్ తోటకూర పేర్కొన్నారు. ఈ దుర్ఘటనలో ప్రాణాలను కోల్పోయిన శ్రీనివాస్ కూచిబొట్ల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. ఇదే సంఘటనలో గాయపడిన అలోక్ రెడ్డి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. తన ప్రాణాలు సైతం పణంగా పెట్టి ఎంతో సాహసోపేతంగా అలోక్ రెడ్డి ప్రాణాన్ని కాపాడిన ఇయాన్ గ్రిల్లాట్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్ షిప్ కౌన్సిల్ తరపున అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తోపాటూ ఇటీవల యూఎస్ కాంగ్రెస్ కు ఎన్నికైన భారత సంతతికి చెందిన కమల హారిస్, ప్రమీల జయపాల్, రాజా కృష్ణమూర్తి, రో ఖన్నా, డాక్టర్. అమీ బెరాలకు ఈ దాడులను తీవ్రంగా పరిగణించి, మున్ముందు ఇలాంటివి జరగకుండా కఠిన చట్టాలను అమలు చేయాలని లేఖ రాశారు. ఇటీవలి కాలంలో ఇలాంటి దాడులు పెరుగుతున్న నేపథ్యంలో భారతీయ అమెరికన్లు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 1. ఇరుగు పొరుగు వారితో పరిచయం: ► కనీసం మీ ఇంటి చుట్టుపక్కల నివసిస్తున్న వారి పేర్లు , వివరాలు తెలుసుకోండి. ► వారిని మీరు జరుపుకొనే కొన్ని భారతీయ సంప్రదాయ వేడుకులకు ఆహ్వానించి మన సంస్కృతితో అనుబంధం ఏర్పాటు చేయండి. ► వీకెండ్ పార్టీలు, విందులు, వినోదాలు చేసుకుంటున్నప్పుడు లౌడ్ మ్యూజిక్ పాటలతో మీ ఇరుగు పొరుగు వారికి అసౌకర్యం కలిగించకండి. ► తెల్లవారకముందే శబ్దంతో మీ గార్డెన్ , లాన్ మొయింగ్ పరికరాలతో ఇతరుల నిద్రకు భంగం కలిగించకండి. ► మీ కార్లు, మీ అతిథుల కార్లను మీ ఇరుగు పొరుగు వాళ్ల ఇంటి రాకపోకలకు ఇబ్బంది కలగకుండా పార్కింగ్ చేయండి. 2. అమెరికా జాతీయ జెండాను ఎల్లప్పుడు గౌరవించడం: ► ఎప్పుడూ భారతదేశపు జెండాను ఒంటరిగా ఎగరవేయకండి. దాని పక్కనే అమెరికన్ జాతీయ జెండాను కూడా ఎగరవేయండి. ► ఇరు దేశాల జెండాలను ఎగరవేసేటప్పుడు, జాతీయ గీతాలను ఆలాపించేటప్పుడు నిర్దిష్టమైన నియమావళిని పాటించండి. ► ఎల్లప్పుడూ అమెరికా రాజ్యాంగానికి, చట్టాలకు కట్టుబడి ఉండండి. 3. దుస్తులను ధరించే విధానం: ► మనం ధరించే దుస్తులు బహిరంగ ప్రదేశాల్లో ఇతరులకు వింతగా, ఇబ్బంది కలిగించే విధంగా ఉండనివ్వకండి. 4. ఇతరుల శాంతికు భంగం కలిగించకండి: ► కొన్ని సందర్భాలలో ప్రముఖ రాజకీయ నాయకులు, సినిమా నటీనటులు వచ్చినప్పుడు అత్యుత్సాహముతో కేరింతలు, నినాదాలు, బ్యానర్లు, ర్యాలీలతో వందల కొద్దీ సమూహంగా చేరి వారు బస చేస్తున్న హోటళ్లలోనూ, సినిమా హాళ్లలోనూ, ప్రధాన బహిరంగ వేదికల వద్ద నినాదాలతో హోరెత్తించడం తగని చర్య. ఇలాంటి కొన్ని సందర్భాలలో పోలీసులు వచ్చి అందరిని చెల్లాచెదురు చేసిన సంఘటనలు మన గౌరవ ప్రతిష్టను దెబ్బ తీశాయి. 5. భారత దేశం నుంచి వచ్చే సందర్శకులు: తమ కుటుంబసభ్యులను చూడటానికి వచ్చే తల్లిదండ్రులకు, అతిథులకు ముందు గానే ఆమెరికా సంస్కృతీ సంప్రదాయాల పట్ల ఒక రకమైన అవగాహన కల్పించడం విధిగా చేయవలసిన పని. ఉదాహరణకు: ► అమెరికన్ల వైపు ముఖ్యంగా వారు స్విమ్ దుస్తుల్లో ఉన్నప్పుడు తదేకంగా వారి వైపు చూడటం గాని, వారిపై అపహాస్యంగా నవ్వడంగాని, పరాయి భాషలో మాట్లాడటం గాని తగని పని. ► అలవాటు ప్రకారం పిల్లలు ముద్దుగా ఉన్నారు కదా అని అమెరికన్ చిన్న పిల్లలను పట్టుకోవడం, ముద్దాడటం, మన తినుబండారాలు పెట్టడం చేయకూడదు. ► భారతదేశం నుంచి వచ్చిన తల్లిదండ్రులు / అతిథులు ను మన చుట్టూ ఉన్న పరిసరాలకు అలవాటు పడేవరకు ఒంటరిగా వదలకండి. 6. గుర్తింపు కార్డు: ► ఎల్లప్పుడూ మీ చట్టపరమైన పాస్ పోర్ట్ లేదా ఐడి కాపీలను , సెల్ ఫోన్‌ను అందుబాటులో మీ దగ్గరే ఉంచుకోండి. ► ఎల్లప్పుడూ పోలీసు, భద్రతాధికారుల సూచనలను అనుసరించండి. 7. వికలాంగ సంబంధిత: ► వికలాంగులకు కేటాయించిన స్థానాలను వారికే వదిలేయండి. ► కొన్ని నిముషాలకైనా వారి పార్కింగ్ స్థానాలను ఉపయోగించకండి. ► వాహనాలను నడిపేటప్పుడు పాదచారులకు ఎప్పుడు దారి ఇవ్వండి. ► పాఠశాల దగ్గర వేగ పరిమితుల ను అనుసరించండి. ► అడ్డదిడ్డంగా రోడ్లను దాట రాదు. 8. సామాజిక ప్రవర్తన: ► ఎల్లప్పుడూ వాస్తవాలను మాత్రమే చెప్పండి. ► సంబంధిత అధికారుల తో వ్యవహరించేటప్పుడు వారికి చాలా గౌరవ మర్యాదలు ఇవ్వండి. న్యాయం మీ పక్షాన ఉన్నప్పటికీ మీరు చెప్పే విషయం సరైనది అయినప్పటికీ అవతల వారితో ఎటువంటి వాదనకు, ఘర్షణకు దిగకండి. ► విమానాశ్రయాలు, రెస్టారెంట్లు, బార్లు, పార్కులు తదితర ప్రాంతాల్లోఎప్పుడూ జోక్స్, తమాషాలు చేయకండి. ► బహిరంగ ప్రదేశాల్లో మందు తాగడం, గట్టిగా అరవడం, మాట్లాడటం చేయడం చట్ట విరుద్ధం. ► మనకున్న మత / ఆధ్యాత్మిక స్వేచ్ఛను సద్వినియోగ పరచుకుంటూనే ఇతరుల మనోభిప్రాయాలకు విఘాతం కలగకుండా చూడండి. ► అర్థరాత్రుల వరకు బార్లు, రెస్టారెంట్లు, పబ్బులలో ఉండడం నివారించండి. 9. సాంఘిక ప్రసార మాధ్యమం ► సాంఘిక ప్రసార మాధ్యమాలైన వాట్సాప్ , ఫేస్ బుక్ , ట్విట్టర్ లలో ఈమెయిల్స్ , మెసేజెస్ ద్వారా పుకార్లను సరదాకు అయినా వ్యాప్తి చేయరాదు. ► అశ్లీల వెబ్ సైట్లలలో చాట్ చేయరాదు. అలా చేసిన వారిని రహస్యంగా అధికారులు పట్టుకొని వెంటనే దేశమునుండి బహిష్కరించిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. 10. చట్టపరమైన హక్కులు: ► మీ ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లుతున్నదని భావించినప్పుడు చట్టాలను ఆశ్రయించండి. ► మిమ్మల్ని మీరు రక్షించు కొనే పరిస్థితిలో లేకపోతే వాటిని ఎదుర్కొనేందుకు ఎటువంటి వాదనకు, ఘర్షణలకు, సాహసాలకు పోకండి. ► మీ దగ్గర ఉన్న నగదు, విలువైన వస్తువులు కన్నా ఎల్లప్పుడూ మీ ప్రాణం అత్యంత విలువైనదని భావించండి. 11. చట్ట వ్యతిరేకపు ప్రవర్తన: ► వైద్య, ఆరోగ్య, న్యాయ, ఆర్ధిక, ఐటి రంగాలలో ఉన్న ప్రముఖులు కొంత మంది దురాశకు పోయి చట్ట వ్యతిరేక పనులకు పాల్పడి, ఆర్ధిక నేరాల్లో ఇరుక్కొని జైళ్లలో మగ్గుతున్న వారు ఎందరో ఉన్నారు. ► అమెరికా లో అక్రమంగా నివసించే వారికి ఎటువంటి ఆశ్రయం ఇవ్వడం కానీ, ఉద్యోగంలో పెట్టడం కానీ చేయకూడదు. ఇలాంటి ఘటనలకు పాల్పడితే దేశం నుంచి వెనువెంటనే వారిని బయటకు పంపుతారు/బహిష్కరిస్తారు. 12. వ్యక్తిగత భద్రత: ► ఎల్లప్పుడూ ఇంటి తలుపులు వేసుకొని ఉండండి. ► ఎవరైనా తెలియనివారు, క్రొత్త వారు వచ్చినప్పుడు తలుపు తీయకండి. ► అతి తక్కువ సమయానికి ఇంటి నుండి బయటకు వెళ్ళవలసివచ్చినప్పుడు ఇంటికి సంబంధించిన భద్రత అలారం ను ఆన్ చేయాలి. ► పార్టీలకు, శుభ కార్యాలకు వెళ్ళినప్పుడు మనకు బంగారం బాగా ధరించడం అలవాటు. ఇది మన భద్రతకు చాలా ముప్పు. అమెరికాలో ప్రస్తుతం కొనసాగుతున్న ఎన్నో వేలాది దొంగతనాలు జరగడానికి ఇదొక కారణం. కాబట్టి, మన విలువైన వస్తువులను, బంగారు నగలను బ్యాంకు లాకర్ లలో సంరక్షించుకోవాలి. ► ఇంటి బయటకు కానీ, లోపలకు కాని వచ్చేటప్పుడు మన పరిసర ప్రాంతాలను జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి. 13. పిల్లల సంరక్షణ: ► మన కోపాన్ని, విసుగును, నిరాశ ను మన పిల్లల మీద చూపించకండి. ► పిల్లలను ఏనాడూ కొట్టడం లాంటివి చేయకండి. ► పిల్లలను ఒంటరిగా ఏనాడూ ఇంట్లో వదలరాదు. అలాగే బయటకు వెళ్ళినప్పుడు మన వాహనాలలో కొన్ని నిముషాలకైనా సరే, వాళ్ళని ఒంటరిగా వదిలేయకండి. ► పిల్లల పై దురుసుగా ప్రవర్తిస్తే, పిల్లల రక్షిత సేవా సంస్థ (చైల్డ్ ప్రొటెక్టీవ్ సర్వీసెస్) వారు పిల్లలను తీసుకొని వెళ్లి పోతారు. పేరెంట్స్ ను కూడా శిక్షిస్తారు. 14. పౌరులుగా మన భాద్యత: ► మనం అమెరికాలోనే స్థిరపడటానికి నిర్ణయం తీసుకున్నాం కాబట్టి, ఈ దేశపు జన జీవన స్రవంతిలో మనము కలిసిపోవాలి. ►మన దేశపు సంప్రదాయ విలువలను కాపాడుతూ, వాటిని పాటిస్తూనే, ఇక్కడి సమాజంలో ఇమడగలగాలి. ►స్థానిక అధికారులు, రాజకీయ నాయకులతో పరిచయం కలిగి ఉండండి. ►అలాగే మనము కొంత సమయాన్ని స్వచ్ఛందంగా సామజిక సేవ కోసం కేటాయించగలగాలి. ఉదాహరణకు వివిధ పాఠశాలలో, గ్రంథాలయాల్లో, ఆసుపత్రుల్లో, ప్రభుత్వ కార్యకలాపాలలో పాలుపంచుకోవడానికి స్వచ్ఛదంగా కృషి చేయాలి. సంబంధిత వార్తా కథనాలకై చదవండి.. రక్షించేందుకు కాల్పులకు ఎదురెళ్లిన హీరో ఇతడే ‘కాలుస్తుంటే ఏదో ఒకటి చేయాలనిపించింది’ శ్రీనివాస్ మృతిపట్ల యూఎస్ కంపెనీ తీవ్ర దిగ్భ్రాంతి అమెరికాలో జాతి విద్వేష కాల్పులు శ్రీనివాస్ కుటుంబానికి ఎన్ఆర్ఐల బాసట అమెరికాలో ప్రమాదం ఇలా తప్పించుకోండి -
అమెరికాలో ప్రమాదం ఇలా తప్పించుకోండి
న్యూయార్క్: అమెరికాలో ఉంటున్న భారతీయులు బహిరంగ ప్రదేశాలకు వెళ్లినప్పుడు మాతృభాషలో మాట్లాడకుండా ఉండటం ద్వారా దాడుల నుంచి బయటపడొచ్చని తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్(టాటా) సూచించింది. భారతీయులపై ముఖ్యంగా తెలుగువారిపై జాతి వివక్ష పూరిత దాడులు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ ఉంటున్న తెలుగువారికి, భారతీయులకు కొన్ని సలహాలు, సూచనలు, జాగ్రత్తలు టాటా చెప్పింది. ముఖ్యంగా భారతీయులు బయట సమూహాల్లో కలుసుకునే సందర్భాల్లో వీలైనంత వరకు మాతృభాషను తక్కువగా ఉపయోగించాలని సలహా ఇచ్చింది. ప్రస్తుతం అమెరికాలో సవాళ్లను ఎదుర్కొనే పరిస్థితులు ఉన్నాయని ఈ నేపథ్యంలో ఎవరికి వారు అప్రమత్తంగా ఉండటం మంచిదని జాగ్రత్తలు చెప్పింది. చుట్టుపక్కల అనుమానపూర్వక కదలికలపై, వ్యక్తులపై ఓ కన్నేసి ఉంచాలని, తమ చుట్టూ అలుముకుంటున్న పరిస్థితులను అంచనా వేయగలగాలని సూచించింది. వీలైనంత మేరకు ఎలాంటి వాదనలకు దిగొద్దని, బహిరంగ ప్రదేశాల్లో గొడవపడొద్దని, చాలామంది రెచ్చగొట్టేందుకు ప్రయత్నాలు చేస్తుంటారని, ఆ సమయంలో సాధ్యమైనంతవరకు ఆంగ్ల భాషలోనే మాట్లాడాలని గట్టిగా చెప్పింది. మనుషుల కదలిక తక్కువగా ఉండే నిర్మానుష్య ప్రాంతాలకు గుంపులుగా వెళ్లాలని, ఒంటరిగా వెళ్లకూడదని కూడా సూచించింది. అత్యవసరం అనిపిస్తే 911 నంబర్‌కు ఫోన్ చేసేందుకు అస్సలు సంకోచించవద్దని కూడా సలహా ఇచ్చింది. ఇటీవల అమెరికా దుండగుడి కాల్పుల్లో ప్రాణాలుకోల్పోయిన శ్రీనివాస్ కూచిబొట్ల స్మృతి చిత్రంతో ఈ సలహాలు, సూచనలను టాటా సెక్రటరీ విక్రమ్ జంగం ఫేస్బుక్ ద్వారా తెలియజేశారు. సంబంధిత వార్తా కథనాలకై చదవండి.. రక్షించేందుకు కాల్పులకు ఎదురెళ్లిన హీరో ఇతడే ‘కాలుస్తుంటే ఏదో ఒకటి చేయాలనిపించింది’ శ్రీనివాస్ మృతిపట్ల యూఎస్ కంపెనీ తీవ్ర దిగ్భ్రాంతి అమెరికాలో జాతి విద్వేష కాల్పులు శ్రీనివాస్ కుటుంబానికి ఎన్ఆర్ఐల బాసట -
‘కాలుస్తుంటే ఏదో ఒకటి చేయాలనిపించింది’
న్యూయార్క్: తోటివారిని రక్షించడం కోసం తన ప్రాణాలు సైతం ఇబ్బందుల్లో పెట్టుకోవడం తనకు సంతోషంగానే అనిపించదని కాన్సాస్ కాల్పుల్లో గాయపడిన ఇయాన్ గ్రిల్లాట్ చెప్పాడు. దుండగుడు భయంకరంగా కాల్పులు జరుపుతుంటే చూస్తూ ఉండలేకపోయానని, ఏదో ఒకటి చేయాలనే తాను అతడిపైకి వెళ్లేందుకు ప్రయత్నించినట్లు తెలిపారు. జాత్యహంకారంతో కాన్సాస్‌లోని ఆస్టిన్ బార్లో మా దేశం విడిచి వెళ్లిపోండి అని గట్టిగా అరుస్తూ ఇద్దరు తెలుగువారిపై దుండగుడు కాల్పులకు తెగబడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో శ్రీనివాస్ కూచిబొట్ల చనిపోగా అలోక్ మాదసాని గాయపడ్డాడు. ఈ దాడిలోనే అలోక్ కంటే కూడా దారుణంగా ఇయాన్ తీవ్రంగా గాయపడ్డాడు. వీరంతా ఒక టేబుల్‌పై కూర్చుని ఉండగా దుండగులు కాల్పులు ప్రారంభించి తొమ్మిది రౌండ్లు కాల్చిన అనంతరం ఎక్కడివారు అక్కడ భయాందోళనలతో చెల్లాచెదురుగా పరుగెడుతుండగా ఒక్క ఇయాన్ మాత్రం ఆ దుండగుడిపైకి ఉరికాడు. దాంతో అతడిపైకి కూడా దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ క్రమంలో ఒక బుల్లెట్ అతడి చాతీలోకి, మరొకటి చేతిలోకి దూసుకెళ్లింది. ప్రస్తుతం ఆస్పత్రిలో కోలుకుంటున్న అతడిని మీడియా పలకరించింది. మీకు జరిగిన హానీని ఊహించుకొని బాధపడుతున్నారా అని మీడియా ప్రశ్నించగా.. ‘ఇతరుల ప్రాణాలు రక్షించేందుకు నా ప్రాణాలు పణంగా పెట్టే ప్రయత్నం చేసినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఆ సమయంలో బార్లో చాలా కుటుంబాలు ఉన్నాయి. పిల్లలు కూడా లోపల ఉన్నారు. అతడు అలా కాల్పులు జరుపుతుంటే చూస్తూ ఉండలేకపోయాను. ఏదో ఒకటి చేయాలనిపించింది. అందుకే నేను చేయాలనుకుంది చేసేశాను’ అని చెప్పాడు. సంబంధిత వార్తా కథనాలకై చదవండి.. రక్షించేందుకు కాల్పులకు ఎదురెళ్లిన హీరో ఇతడే శ్రీనివాస్ మృతిపట్ల యూఎస్ కంపెనీ తీవ్ర దిగ్భ్రాంతి అమెరికాలో జాతి విద్వేష కాల్పులు శ్రీనివాస్ కుటుంబానికి ఎన్ఆర్ఐల బాసట -
వర్ణవివక్షకు తావులేదు
కాన్సస్ ఘటనను ఖండించిన భారతీయ–అమెరికన్లు ► ఘటన విద్వేషపూరితమే: కాంగ్రెస్ సభ్యుడు అమీ బెరా ► మరో కూచిభొట్ల చనిపోకముందే మేల్కొందామన్న బార్ అసోసియేషన్ వాషింగ్టన్ : అమెరికాలోని కాన్సస్‌లో బుధవారం రాత్రి భారత ఇంజనీర్లపై జరిగిన కాల్పుల ఘటనను భారత–అమెరికన్ సమాజం ముక్తకంఠంతో ఖండించింది. అమెరికాలో వర్ణవివక్ష, విదేశీయులంటే భయం వంటి వాటికి తావులేదని.. భారత అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు అమీ బెరా తెలిపారు. ‘కాన్సస్ దుర్ఘటనకు సంబంధించి విచారణ సంస్థలు విచారణ జరిపి వాస్తవాలను వెల్లడిస్తాయని భావిస్తున్నాను. అమెరికాలో విదేశీయులంటే భయం, వర్ణవివక్షలకు చోటులేదు. ఇప్పటివరకు వెల్లడైన వివరాల ప్రకారం.. విద్వేషపూరితంగానే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఇది అమెరికన్లందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తోంది’ అని అమీ బెరా వెల్లడించారు. వలసవాదుల దేశంగా ఉన్న అమెరికాలో.. వ్యక్తుల రంగు, వారి రూపురేఖల ఆధారంగా దాడి చేయటం అమానుషమని ఆయన అన్నారు. మృతుడు శ్రీనివాస్ కూచిభొట్ల కుటుంబానికి అండగా నిలబడతామని అమీ బేరా తెలిపారు. మూడుసార్లు కాలిఫోర్నియా నుంచి కాంగ్రెస్‌కు ఎన్నికైన అమీ బెరా.. భారతీయ అమెరికన్లపై అమెరికా కాంగ్రెస్ కమిటీకి ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. విద్వేషపు తూటా! నోర్మూసుకుని కూర్చోవద్దు: సాబా కాన్సస్ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరగాలని బాధితులకు, వారి కుటుంబాలకు న్యాయం జరగాలని దక్షిణాసియా బార్ అసోసియేషన్ (ఎస్ఏబీఏ–సాబా) డిమాండ్ చేసింది. అమెరికాలో మైనారిటీల హక్కులను కాపాడే బాధ్యత ప్రభుత్వమే తీసుకుని పక్కాగా అమలుచేయాలని ఓ ప్రకటనలో కోరింది. ‘ఈ ఘటనపై మనం నోర్మూసుకుని కూర్చోవద్దు. ఎవరినీ క్షమించొద్దు. నిరాశ చెందొద్దు. మన దేశం (అమెరికా)లో వేళ్లూనుకుపోయిన విద్వేషం, విడగొట్టి చూసే ఆలోచనలను కూకటివేళ్లతో పెకిలించివేయాలి. మరో కూచిభొట్ల శ్రీనివాస్ తన ప్రాణాన్ని కోల్పోకముందే మేల్కొనాలి’ అని పేర్కొంది. కాన్సస్ ఘటన దురదృష్టకరమని.. ఈ కేసులో పూర్తిస్థాయి విచారణ జరుగుతోందని కాన్సస్, మిస్సోరీ రాష్ట్రాల గవర్నర్లు చెప్పారు. ట్రంప్‌తో భారత రాయబారి భేటీ అమెరికాలోని భారత రాయబారి నవతేజ్ సర్నా వైట్‌హౌస్‌లోని ఓవల్ ఆఫీసులో అధ్యక్షుడు ట్రంప్‌తో భేటీ అయ్యారు. ట్రంప్ అధికారంలోకి వచ్చాక సర్నా ఆయనను కలుసుకోవడం ఇదే తొలిసారి. అమెరికాలో భారతీయులు సహా పలువురు విదేశీయులపై విద్వేష దాడులు జరుగుతున్న నేపథ్యంలో సర్నా భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. -
మనం అమెరికాకు చెందిన వాళ్లమేనా..?
-
ఇండియన్ అమెరికన్ ఎంపీల తీవ్ర స్పందన
-
డోనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!
-
కాన్సాస్ కాల్పులపై సత్య నాదెళ్ల స్పందన
-
వైట్‌హౌస్ సంప్రదాయాలు కాలరాస్తున్న ట్రంప్!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తనకు వ్యతిరేకంగా వార్తలు రాసే మీడియా సంస్థలపై చర్యలు తీసుకున్నారు. ఇన్నాళ్లూ మీడియా తనకు వ్యతిరేకంగా వార్తలు రాస్తోందని తీవ్ర ఆరోపణలు చేస్తూ వచ్చిన ట్రంప్ ఈసారి ఏకంగా పలు మీడియా సంస్థలను శ్వేతసౌధంలో రోజూ జరిగే ప్రెస్ కాన్ఫరెన్స్‌కు అనుమతించకుండా నిషేధం విధించారు. వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ సీన్ స్పైసర్ మీడియా సమావేశం నుంచి సీఎన్ఎన్, న్యూయార్క్ టైమ్స్, లాస్ఏంజిల్స్ టైమ్స్ సహా పలు మీడియా సంస్థలను మినహాయించారు. తనకు అనుకూల కథనాలు ప్రసారం చేసే కొన్ని మీడియా సంస్థలనే ఈవెంట్లకు ఆహ్వానిస్తున్నారు. మరోవైపు వైట్‌హౌస్ సంప్రదాయాలను ట్రంప్ కాలరాస్తున్నారు. ప్రెస్ బ్రీఫింగ్ గదిలో నిత్యం జరిగేలా ఆన్-కెమెరా సమావేశం కాకుండా ఆఫ్-కెమెరా కెమెరా సమావేశం నిర్వహించారు. దీన్నిబట్టి చూస్తే మీడియాపై తన అధికారాలను మరింత విస్తృతం చేస్తూ అధ్యక్షుడు ట్రంప్ తన ఇష్ట రీతిన వ్యవహిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు జాతి విద్వేషంతో శ్వేతజాతి ఉన్మాది భారతీయ ఇంజినీర్ శ్రీనివాస్ కుచిభోట్లను కాల్చి హత్య చేయడంపై అమెరికాలో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ ప్రమాణం చేసినప్పటి నుంచి దేశంలో విద్వేష నేరాలు, జాతి వివక్ష దాడులు పెరిగిపోయాయని ఇక్కడ నివాసం ఉంటున్న విదేశీయులు ఆందోళన వ్యక్తం చేశారు. గతేడాది అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం సమయంలోనూ మీడియా తనపై కావాలనే ఉద్దేశపూర్వకంగా తప్పుడు కథనాలు ప్రచారం చేస్తుందని ట్రంప్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఓ సందర్భంలోనైతే ఏకంగా ఓ మీడియా ప్రతినిధిపై ట్రంప్ ఆదేశాలతో ఓ అధికారి దాడికి పాల్పడి చెయ్యి చేసుకోవడం వివాదానికి దారి తీసింది. తాజాగా భారతీయ ఇంజినీర్ శ్రీనివాస్ కుచిభోట్లను దారుణంగా కాల్చిచంపిన ఘటనపై ట్రంప్ పరోక్షంగా వ్యాఖ్యలు చేసి తీవ్ర విమర్శల పాలయ్యారు. తాను కేవలం అమెరికాకే ప్రతినిధినని.. అమెరికా ప్రజలకు రక్షణ కల్పించడం, వారికి మాత్రమే ఉద్యోగాలు వచ్చేలా చేయడం తన పని అంటూ కన్సర్వేటీవ్ పొలిటికల్ యాక్షన్ కాన్ఫరెన్స్ (సీపీఏసీ)లో పాల్గొన్న సందర్భంగా విదేశీ వలసదారులపై ట్రంప్ ఈ విద్వేష పూరిత వ్యాఖ్యలుచేశారు. -
తెలుగువారిపై కాల్పులు: స్పందించిన సత్య నాదెళ్ల
వాషింగ్టన్: తెలుగు ఇంజినీర్ శ్రీనివాస్ కూచిభొట్ల ప్రాణాలను పొట్టనబెట్టుకున్న కాన్సాస్ కాల్పులపై మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల స్పందించారు. మన సమాజంలో ఇలాంటి మతిలేని హింసకు, మతవిద్వేషానికి తావులేదని పేర్కొన్నారు. ఈ ఘటనలో బాధితులైన కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారికి అండగా ఉంటానని ట్విట్టర్లో తెలిపారు. తమ ఉద్యోగాలు కొల్లగొడుతున్నారన్న ఆక్రోశంతో ఓ శ్వేతజాతి ఉన్మాది జరిపిన కాల్పుల్లో హైదరాబాద్‌కు చెందిన ఇంజనీర్ శ్రీనివాస్ కూచిభొట్ల మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో శ్రీనివాస్ స్నేహితుడు అలోక్‌రెడ్డి తీవ్ర గాయాలపాలయ్యారు. ఉన్మాదిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన మరో అమెరికన్‌కూ గాయాలయ్యాయి. అమెరికాలోని కన్సాస్ రాష్ట్రం ఒథాలే ప్రాంతంలో ఉన్న ఆస్టిన్స్ బార్లో బుధవారం అర్ధరాత్రి ఈ దారుణం చోటు చేసుకుంది. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ ఘటనను ఇప్పటికే భారత సంతతికి చెందిన అమెరికన్ చట్టసభ సభ్యులు ఖండించారు. -
ఇండియన్ అమెరికన్ ఎంపీల తీవ్ర స్పందన
వాషింగ్టన్: జాతి విద్వేషంతో శ్వేతజాతి ఉన్మాది భారతీయ ఇంజినీర్ శ్రీనివాస్ కుచిభోట్ల (32)ను దారుణంగా కాల్చిచంపిన ఘటనపై ఇండియన్ అమెరికన్ ప్రజాప్రతినిధులు తీవ్రంగా స్పందించారు. శ్రీనివాస్ కుచిభోట్ల హత్యను తీవ్రంగా ఖండించారు. దేశంలో మతిలేని హింసకు తావులేదని తేల్చిచెప్పారు. 'కాన్సాస్‌లో జరిగిన కాల్పుల ఘటన తీవ్రంగా బాధ కలిగించింది. బాధితుల కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. విద్వేషం విజయం సాధించకుండా చూడాల్సిన అవసరముంది' అని భారత సంతతికి చెందిన కాలిఫోర్నియా సెనేటర్ కమల్ హారిస్ ట్వీట్ చేశారు. 'కాన్సాస్ కాల్పులతో ఛిన్నాభిన్నమైన కుటుంబం గురించే నేను మథనపడుతున్నా. మతిలేని హింసకు మన దేశంలో తావులేదు. జరిగిన ఘోరంతో నా గుండె పగిలింది' అని కాంగ్రెస్‌వుమెన్ పరిమళ జయపాల్ వ్యాఖ్యానించారు. అమెరికా ప్రతినిధుల సభకు ఎన్నికైన తొలి భారతీయురాలిగా పరిమళ జయపాల్ నిలిచిన సంగతి తెలిసిందే. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన నాటి నుంచి దేశంలో విద్వేష నేరాలు పెరిగిపోయాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. కాన్సాస్ నగరంలో జరిగిన కాల్పులను ఇండియన్ అమెరికన్ చట్టసభ సభ్యుడు రో ఖన్నా ఖండించారు. ఈ మతిలేని హింసలో బాధితులైన కుటుంబసభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. తమ ఉద్యోగాలు కొల్లగొడుతున్నారన్న ఆక్రోశంతో ఓ శ్వేతజాతి ఉన్మాది జరిపిన కాల్పుల్లో హైదరాబాద్‌కు చెందిన ఇంజనీర్ శ్రీనివాస్ కూచిభొట్ల మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో శ్రీనివాస్ స్నేహితుడు అలోక్‌రెడ్డి తీవ్ర గాయాలపాలయ్యారు. ఉన్మాదిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన మరో అమెరికన్‌కూ గాయాలయ్యాయి. అమెరికాలోని కన్సాస్ రాష్ట్రం ఒథాలే ప్రాంతంలో ఉన్న ఆస్టిన్స్ బార్లో బుధవారం అర్ధరాత్రి ఈ దారుణం చోటు చేసుకుంది -
మనం అమెరికాకు చెందిన వాళ్లమేనా?
-
మనం అమెరికాకు చెందిన వాళ్లమేనా?
మనది అమెరికానేనా.. మనం అమెరికాకు చెందిన వాళ్లమా? ఇక్కడ మనకు భద్రత ఉందా?.. ఇవి కన్సాస్‌లో శ్వేతజాతి ఉన్మాది చేతిలో ప్రాణాలు కోల్పోయిన శ్రీనివాస్ కూచిభోట్ల భార్య సునయన దుమల అడిగిన ప్రశ్నలు. అమెరికాలో చోటుచేసుకున్న విద్వేష కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన శ్రీనివాస్ కూచిభోట్ల ఉద్యోగం చేసే గార్మిన్ కంపెనీ నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన భార్య సునయన మాట్లాడారు. అమెరికాలో జరుగుతున్న కాల్పుల ఘటనలు తనను ఆందోళనకు గురిచేశాని, ఒకదశలో ఈ దేశంలో మనం ఉండగలమా? అని తన భర్తని అడిగితే.. ఏం కాదు అమెరికాలో మంచి రోజులు వస్తాయని ఆయన చెప్పేవారని ఆమె గుర్తుచేసుకున్నారు. అమెరికాలో మైనారిటీలు, విదేశీయులపట్ల వివక్ష చూపుతున్న ఘటనలు భయాందోళనకు గురిచేస్తున్నాయని, మేం ఇక్కడి వాళ్లమేనా? అన్న సందేహాలు కలిగిస్తున్నాయని ఆమె అన్నారు. ఇప్పటికైనా ఈ విద్వేష నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు అమెరికా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా? అని ఆమె ప్రశ్నించారు. విద్వేష దారుణాలపై అమెరికా ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తన భర్తకు ఇలా జరుగుతుందని కలలో కూడా అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇండియాకు వెళ్లిపోదామని తాను గతంలో ఎన్నోసార్లు చెప్పినా తన భర్త ఒప్పుకోలేదని ఆమె అన్నారు. ఇంత జరిగాక, ఇంకా అమెరికాలో ఉండటం అవసరమా? అని ఆమె వ్యాఖ్యానించారు. తమకు పిల్లలు కూడా లేరని, తన భర్త జ్ఞాపకాలే ఇప్పుడు తమకు మిగిలాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు మృతుడు శ్రీనివాస్ కుటుంబానికి ఆదుకునేందుకు అమెరికాలోని భారత రాయబార కార్యాలయం రంగంలోకి దిగింది. హుస్టన్‌లోని భారత కౌన్సెల్ జనరల్ అనుపమ రాయ్ ప్రస్తుత పరిస్థితిని పర్యవేక్షిస్తూ.. శ్రీనివాస్ కుటుంబానికి అన్ని విధాల సాయం చేసేందుకు కృషి చేస్తున్నారు. తమ ఉద్యోగాలు కొల్లగొడుతున్నారన్న ఆక్రోశంతో ఓ శ్వేతజాతి ఉన్మాది జరిపిన కాల్పుల్లో హైదరాబాద్‌కు చెందిన ఇంజనీర్ శ్రీనివాస్ కూచిభొట్ల మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో శ్రీనివాస్ స్నేహితుడు అలోక్‌రెడ్డి తీవ్ర గాయాలపాలయ్యారు. ఉన్మాదిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన మరో అమెరికన్‌కూ గాయాలయ్యాయి. అమెరికాలోని కన్సాస్ రాష్ట్రం ఒథాలే ప్రాంతంలో ఉన్న ఆస్టిన్స్ బార్లో బుధవారం అర్ధరాత్రి ఈ దారుణం చోటు చేసుకుంది\ -
డోనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!
వాషింగ్టన్: అమెరికాలో విద్వేషపూరితంగా విదేశీయులపై తూటాలు పేలుతున్నా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీరు ఏ మాత్రం మారలేదు. తమ ఉద్యోగాలు కొల్లగొడుతున్నారన్న ఆవేశంతో యూఎస్ నేవీ మాజీ ఉద్యోగి జరిపిన కాల్పుల్లో హైదరాబాద్‌కు చెందిన ఇంజినీర్ మరణించిన మరుసటిరోజు ట్రంప్ మరింత దురుసుగా ప్రవర్తించారు. కన్సర్వేటీవ్ పొలిటికల్ యాక్షన్ కాన్ఫరెన్స్ (సీపీఏసీ)లో పాల్గొన్న ట్రంప్ ప్రసంగిస్తూ.. తానేమీ ప్రపంచానికి ప్రతినిధిని కాదని, కేవలం అమెరికాకు మాత్రమే అధ్యక్షుడిని అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గన్ ఓనర్షిప్ రైట్స్ కోసం చర్యలు తీసుకుంటానని, అమెరికా పౌరుల రక్షణ కోసం పాటు పడతానని, అమెరికన్లకే ఉద్యోగాలు కల్పిస్తామని ఈ సందర్భంగా ట్రంప్ ప్రతిజ్ఞ చేశారు. అయితే ట్రంప్ గానీ, వైట్ హౌస్ గానీ కన్సాస్ కాల్పుల ఘటనపై ఎలాంటి ప్రకటన చేయలేదు. 'ప్రపంచమంతటా అన్ని దేశాలకూ కలిసి ఒకే గీతం ఉందా.. అదే విధంగా ఒకే రకమైన కరెన్సీ ఉందా.. ఒకే జెండా లాంటివి ఉన్నాయా' అని ట్రంప్ ప్రశ్నించారు. చికాగోలోని పలు ప్రాంతాల్లో తుపాకీ కాల్పుల్లో ఏడుగురు మృతిచెందడంపై ట్రంప్ ట్విట్టర్లో స్పందించారు. వారి మృతిపట్ల సంతాపం ప్రకటించారు. 'అసలు చికాగోలో ఏం జరుగుతుంది. పరిస్థితులు అదుపు తప్పుతున్నాయి. చికాగోకు ఇప్పుడు సహాయం అవసరం' అని ట్రంప్ తన ట్వీట్లో రాసుకొచ్చారు. అమెరికా గ్రేట్ అగైన్ అనే నినాదంతో అధ్యక్ష ఎన్నికల్లో నెగ్గిన ట్రంప్.. ఇతర దేశస్తులను అమెరికా నుంచి వెల్లగొట్టేందకు సాధ్యమైనంత వరకు చర్యలు తీసుకుంటూ విదేశీయులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ట్రావెల్ బ్యాన్, వీసా రూల్స్, జాబ్ రూల్స్ అంటూ ఏదో రకంగా విదేశీయులను వారి స్వస్తలాలకు పంపించేసి.. దేశ పౌరులతోనే అన్ని ఉద్యోగాలను భర్తీ చేయాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో విదేశీయులపై ఎలాంటి దాడులు జరిగినా పట్టించుకునే ప్రసక్తే లేదని, కేవలం అమెరికా ప్రజల కోరకు మాత్రమే తాను పని చేయనున్నట్లు ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై స్థానికంగానూ తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సంబంధిత వార్తా కథనాలకై చదవండి.. (జాతి వివక్షకు 'అధికారం' తోడైతే..) (‘కూచిబొట్ల’కు కొండంత అండ) శ్రీనివాస్ మృతిపట్ల యూఎస్ కంపెనీ తీవ్ర దిగ్భ్రాంతి అమెరికాలో జాతి విద్వేష కాల్పులు శ్రీనివాస్ కుటుంబానికి ఎన్ఆర్ఐల బాసట -
అమెరికాలో మళ్లీ విద్వేషపు తూటా పేలింది
-
జాతి వివక్షకు 'అధికారం' తోడైతే..
- ట్రంప్ వచ్చాక అమెరికాలో పెరిగిపోతున్న జాతి వివక్ష దాడులు - ఇప్పటిదాకా ఏకంగా 1,094 ఘటనలు - అత్యధికం యూనివర్సిటీ క్యాంపస్‌లలోనే.. - భారతీయ విద్యార్థులకు కరువవుతున్న భద్రత ‘మా దేశం నుంచి వెళ్లిపొండి...’ తెలుగు ఇంజనీర్ కూచిబొట్ల శ్రీనివాస్‌ను కాల్చి చంపుతూ దుండగుడు అడమ్ పూరింటన్ గట్టిగా అరుస్తూ అన్న మాటలివి! వీటిలో అతడి నరనరాన జీర్ణించుకుపోయిన జాతి వివక్ష ధ్వనిస్తోంది. ‘అమెరికా మాది. ఎక్కడెక్కడి నుంచో వచ్చి మా ఉద్యోగాలను కొల్లగొడుతున్నారు. మా పొట్ట కొడుతున్నారు. విదేశీయులకు ఇక్కడ స్థానం లేదు. వెళ్లిపోవాల్సిందే...’ అన్నది ఇలాంటి వారి ఆక్రోశం. శ్వేత జాత్యహంకార భావజాలం. అయితే ఇది ఏ కొద్దిమందికో పరిమితమైంది కాదు. శ్వేత జాతీయుల్లో అంతర్లీనంగా విస్తరించి.. బలపడుతోంది. అందుకే ‘ఫస్ట్ అమెరికా...’ అన్న డొనాల్డ్ ట్రంప్ వీరికి నచ్చాడు. విద్వేషపూరిత భావజాలమున్న వారిని ట్రంప్ తన బృందంలో చేర్చుకోవడంతో.. అధికారంపై ఈ అతివాదుల పట్టు బిగుస్తోంది. భవిష్యత్తులో ద్వేషపూరిత దాడులు మరింత తీవ్రమవుతాయేమోననే భయాన్ని రేకెత్తిస్తోంది. ఈ భయం సహేతుకమే అని చెప్పడానికి తగిన ఆధారాలూ ఉన్నాయి. ట్రంప్ వచ్చాక ఇదీ పరిస్థితి.. ట్రంప్ గెలుపు ఖాయమైన రోజు(నవంబర్ 9) నుంచి తీసుకుంటే.. మొత్తం 1,094 ద్వేషపూరిత ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇందులో దూషణలు మొదలుకుని దాడులు చేయడం, కాల్పులకు తెగబడటం దాకా అన్నిరకాల విద్వేషపూరిత ఘటన లున్నాయి. మత, జాతి వివక్ష, వలస జీవులపై వ్యతిరేకత, స్వలింగసంపర్కులపై ఏహ్యభావం, మహిళల పట్ల చులకన భావం వంటివి ఎన్నో రకాల ద్వేషపూరిత దాడులున్నాయి. సదరన్ పావర్టీ లా సెంటర్ ఇలాంటి ఘటనలను నమోదు చేస్తుంది. ఇందులో వలసలపై వ్యతిరేకతతో జరిగిన ఘటనలే 315. తర్వాతి స్థానం జాతి వివక్షది. నల్ల జాతీయులపై దాడులు, దూషణలకు దిగిన ఘటనలు 221. న్యూయార్క్ పోలీసు విభాగానికి చెందిన డిటెక్టివ్స్ చీఫ్ రాబర్ట్ బోయెస్ కూడా ద్వేషపూరిత దాడులు 115% పెరిగాయని(ట్రంప్ గెలిచాక) అంగీకరించారు. అంతకుముందు అమెరికావ్యాప్తంగా తీసుకున్నా ఇలాంటి ఘటనలు రెండంకెలకు మించలేదు. ట్రంప్ గెలిచిన రోజున ఏకంగా 200 పైగా ఘటనలు నమోదయ్యాయి. ద్వేషపూరిత దాడుల్లో చాలావాటిలో దుండగులు ట్రంప్ పేరును వాడటం.. ‘మా వాడొచ్చాడు, మీకిక మూడినట్లే..’ అని అనడం శ్వేతజాత్యహంకారుల్లో బలపడిన నమ్మకాన్ని రుజువు చేస్తోందని విశ్లేషకుల అభిప్రాయం. శ్వేతసౌధంలో అతివాదులు... ట్రంప్ ఎన్నిక... రాజకీయాల్లో అతివాదులకు మార్గం సుగమం చేసింది. స్వలింగ సంపర్కాన్ని గట్టిగా వ్యతిరేకించే కెన్నెత్ బ్లాక్వెల్ను అధికార మార్పిడి బృందానికి సారథిగా ట్రంప్ నియమించారు. ఇస్లాంను ‘భయంకరమైన క్యాన్సర్’గా పోల్చిన, ముస్లింలను చూసి భయపడటం సహేతుకమేనన్న మైక్ ఫ్లిన్‌ను జాతీయ భద్రతా సలహాదారుగా నియమించారు (ఈయన కొద్దిరోజులకే వివాదంలో ఇరుక్కొన్ని పదవిని పోగొట్టుకున్నారు). ముస్లింలను తీవ్రంగా వ్యతిరేకించే సంస్థలతో సన్నిహిత సంబంధాలున్న మైక్ పాంపియోను సీఐఏ డైరెక్టర్‌గా ట్రంప్ ఎంచుకున్నారు. వీటన్నింటి కంటే ముఖ్యమైనది... చీఫ్ స్ట్రాటజిక్ అడ్వైజర్‌గా స్టీఫెన్ బానన్‌ను నియమించడం. అందరికంటే శ్వేతజాతి గొప్పదని, అమెరికా వాళ్లకే చెందినదనే భావజాలాన్ని ప్రచారం చేసే ‘బ్రీయిట్బార్ట్’ వెబ్‌సైట్‌కు బానన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా పనిచేశారు. తీవ్ర జాత్యహంకార భావజాలమున్న వ్యక్తి. తాను అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక ద్వేషపూరిత దాడులు పెరిగాయనే వార్తలు రావడంతో ‘వాటిని ఆపండి’ అంటూ ట్రంప్ ఖండించారు. అయితే అధ్యక్షుడికి కనులు, చెవులుగా స్టీఫెన్ బానన్ లాంటి వ్యక్తి శ్వేతసౌధంలో ఉండగా... ఈ శక్తులు తగ్గుతాయా అనేదే ప్రశ్న. ఆజ్యం పోస్తున్న ట్రంప్ మాటలు...చేతలు నేషనల్ పాలసీ ఇనిస్టిట్యూట్ అనే సంస్థ ద్వారా శ్వేత జాత్యహంకార భావజాలాన్ని రిచర్డ్ స్పెన్సర్ లాంటి అతివాదులు ప్రచారం చేస్తున్నప్పటికీ... వీరికి ట్రంప్ రూపంలో పెద్ద అండ కనబడింది. కాబట్టే ఈ భావజాలంతో ఉన్న గ్రూపులు, సంస్థలు ట్రంప్ విజయానికి శాయశక్తులా దోహదపడ్డాయి. ‘ఐడెంటిటీ ఎవ్రోపా’ అనే కాలిఫోర్నియా కేంద్రంగా ఉన్న క్యాంపస్ గ్రూపు, ది రైట్ స్టఫ్, అమెరికన్ వాన్గార్డ్ అనే సంస్థలు ఇంటర్నెట్ కార్యక్షేత్రంగా ట్రంప్‌కు అనుకూలంగా విస్తృత ప్రచారం చేశాయి. ద్వేషపూరిత భావజాలాన్ని వ్యాప్తి చేసే సైట్లలో నంబర్ వన్‌గా ఉన్న ‘డైలీ స్ట్రోమర్’ ట్రంప్‌ను మోసింది. ‘అమెరికాను మళ్లీ గొప్పదేశంగా నిలబెడదాం’ అనే నినాదంతో ఎన్నికల బరిలోకి దిగిన ట్రంప్ ప్రచారపర్వం ఆద్యంతం వ్యతిరేక భావజాలాన్నే రెచ్చగొట్టారు. మెక్సికన్లను రేపిస్టులు, డ్రగ్ డీలర్లుగా అభివర్ణిస్తూ... వలసలను అడ్డుకోవడానికి సరిహద్దుల్లో గోడ కడతానని వాగ్దానం చేశారు. అమెరికా ఉద్యోగాలు అమెరికన్లకే అన్నారు. ముస్లింలు అమెరికాలోకి అడుగుపెట్టకుండా అడ్డుకుంటామన్నారు. అన్నట్లుగానే ఏడు ముస్లిం ఆధిక్య దేశాల నుంచి వచ్చేవారిని అమెరికాలోకి రానీయకుండా నిషేధాజ్ఞలు జారీచేశారు. కోర్టులు దీన్ని కొట్టివేసినా.. దానిపై ముందుకే వెళుతున్నారు. హెచ్1–బీ వీసాలపై ఆంక్షలు పెట్టడం ద్వారా వలసలను అడ్డుకొనే ప్రయత్నం చేస్తున్నారు. అక్రమంగా అమెరికాలో నివసిస్తున్న వారిని స్వదేశానికి పంపే ఏర్పాట్లు చేస్తున్నారు. వీటన్నింటిని కారణంగా... జాత్యహంకార భావజాలమున్న వ్యక్తులు, సంస్థలు ట్రంప్ రూపంలో తమకో అండ ఉందనే భరోసాతో రెచ్చిపోతున్నారు. ఆర్థిక అసమానతలు కూడా అమెరికన్లలో అసంతృప్తిని పెంచి అతివాదం వైపు మొగ్గేలా చేస్తున్నాయి. క్యాంపస్‌లలో భద్రత ఏది? ఈ ఘటనల్లో ఏకంగా 74% యూనివర్సిటీ క్యాంపస్‌లలోనే చోటుచేసుకున్నాయని ఎస్‌పీఎల్‌సీ సంస్థ గణాంకాలు చెబుతున్నాయి. అమెరికన్ వర్సిటీల్లో దాదాపు లక్షా 65 వేల మంది భారతీయులు చదువుతున్నారు. వీరిలో తెలుగు విద్యార్థులు గణనీయంగా ఉంటారు. ఇది మనకు ఆందోళన కలిగించే విషయం. భారత విద్యార్థుల భద్రతపై భయాలను పెంచుతోంది. పెరుగుతున్న వలసలు... విదేశాల్లో జన్మించిన అమెరికా పౌరులు 1970లో ఆ దేశ జనాభాలో 4.7 శాతం ఉండగా... 2015లో ఇది ఏకంగా 13.7 శాతం. వలసలు పెరిగిన తీరుకు ఇది అద్దం పడుతుంది. అలాగే అమెరికా జనాభాలో శ్వేత జాతీయుల (మెక్సికో, లాటిన్ అమెరికా మూలాలున్న వారు కాకుండా) శాతం 1960ల దాకా 90 ఉండేది. ఇప్పుడిది 62 శాతానికి పడిపోయింది. 2043 కల్లా ఇది జనాభాలో వీరి శాతం 50 లోపునకు పడిపోతుందని సెన్సెస్ బ్యూరో అంచనా. పెరుగుతున్న గ్రూపులు ద్వేషపూరిత భావజాలాన్ని ప్రచారం చేసే సంస్థలు, గ్రూపులు 1999లో 457 ఉండగా 2016 కల్లా ఇవి రెట్టింపయ్యాయి. 917 గ్రూపులు ప్రస్తుతం పనిచేస్తున్నాయి. ఉగ్రదాడులు, ముస్లింలు కాల్పులకు తెగబడి పదుల సంఖ్యలో జనాలను చంపడం లాంటి ఘటనలతో ముస్లిం వ్యతిరేకతను ప్రచారం చేసే గ్రూపులు ఒక్క ఏడాదిలోనే అనూహ్యంగా పెరిగిపోయాయి. 2015లో 34 ముస్లిం వ్యతిరేక గ్రూపులుంటే 2016 కల్లా వీటి సంఖ్య 101కి చేరింది. - సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
విద్వేషపు తూటా!
- అమెరికాలో కాల్పుల ఉదంతం.. జాతి వివక్ష కోణంలో ఎఫ్‌బీఐ దర్యాప్తు - మృతుడు శ్రీనివాస్, గాయపడ్డ అలోక్‌రెడ్డి ఇద్దరూ హైదరాబాదీలే - తమ ఉద్యోగాలు కొల్లగొడుతున్నారంటూ అమెరికన్ ఘాతుకం - వారిని కాపాడేందుకు ప్రయత్నించిన మరో అమెరికన్‌కూ గాయాలు - కాల్పులు జరిపిన పూరింటన్ అరెస్ట్.. నేవీ మాజీ ఉద్యోగిగా గుర్తింపు - విషాదంలో మునిగిపోయిన శ్రీనివాస్ కుటుంబం - ఘటనపై కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ దిగ్భ్రాంతి.. ‘మా ఉద్యోగాలు మాకే..’ అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల్లో ఇచ్చిన నినాదం వెర్రితలలు వేస్తోందా? గద్దెనెక్కాక ఆయన తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాలు అమెరికాలో జాత్యహంకార భావజాలానికి మరింత ఊతమిస్తున్నాయా? కన్సాస్‌లో ఇద్దరు తెలుగు ఇంజనీర్లపై జరిగిన కాల్పుల ఘటన చూస్తుంటే ఇది నిజమేనని అన్పిస్తోంది! బార్లోకి వచ్చిన అమెరికన్.. జాతి వివక్ష వ్యాఖ్యలు చేస్తూ ఇంజనీర్లపై కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనతో అమెరికాలో ఉంటున్న భారతీయులు ముఖ్యంగా తెలుగువారు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. హ్యూస్టన్/వాషింగ్టన్/హన్మకొండ/ సాక్షి, హైదరాబాద్: అమెరికాలో మళ్లీ విద్వేషపు తూటా పేలింది. తమ ఉద్యోగాలు కొల్లగొడుతున్నారన్న ఆక్రోశంతో ఆడమ్ పూరింటన్ అనే ఓ శ్వేతజాతి ఉన్మాది కాల్పులకు తెగబడ్డాడు. హైదరాబాద్‌కు చెందిన శ్రీనివాస్ కూచిభొట్ల అనే ఇంజనీర్‌ను పొట్టన పెట్టుకున్నాడు. ఈ ఘటనలో శ్రీనివాస్ స్నేహితుడు అలోక్‌రెడ్డి తీవ్ర గాయాలపాలయ్యారు. ఉన్మాదిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన మరో అమెరికన్‌కూ గాయాలయ్యాయి. అమెరికాలోని కన్సాస్ రాష్ట్రం ఒథాలే ప్రాంతంలో ఉన్న ఆస్టిన్స్ బార్లో బుధవారం అర్ధరాత్రి ఈ దారుణం చోటు చేసుకుంది. కాల్పులు జరిపిన పూరింటన్ అమెరికా నేవీ మాజీ ఉద్యోగి అని గుర్తించారు. ఘటన జరిగిన 5 గంటల్లోనే మిస్సోరి ప్రాంతంలోని ఓ బార్లో అతడిని అరెస్టు చేశారు. మీరు నాకంటే ఎక్కువా..? హైదరాబాద్‌కు చెందిన శ్రీనివాస్, మేడసాని అలోక్‌రెడ్డి అమెరికాలోని కన్సాస్ రాష్ట్రంలో ఉన్న ఓవర్‌ల్యాండ్ పార్క్‌లో నివసిస్తున్నారు. జీపీఎస్ వ్యవస్థలను తయారు చేసే గార్నిమ్ అనే సంస్థలో ఉద్యోగం నిర్వస్తున్నారు. ఇద్దరూ మంచి స్నేహితులు కూడా. ఇద్దరూ కలసి బుధవారం రాత్రి అక్కడి ఒథాలే ప్రాంతంలోని ఆస్టిన్స్ బార్‌కు వెళ్లారు. కొంతసేపటి తర్వాత çపూరింటన్ అనే అమెరికన్ వారి వద్దకు వచ్చి వాదనకు దిగాడు. తాము (అమెరికన్లు) మేధావులమేనని, తమకు ప్రతిభ ఉన్నా విదేశాల వారి కారణంగా తమకు ఉద్యోగాలు రావట్లేదని అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘మీరు మా ఉద్యోగాలను కాజేస్తున్నారు. తక్షణం అమెరికా విడిచివెళ్లిపోండి. ఉగ్రవాదులు.. మీరు నాకంటే ఎలా ఎక్కువ? అమెరికాలో ఎందుకుంటున్నారు, ఏం చేస్తున్నారు..’అంటూ గొడవకు దిగాడు. దీంతో శ్రీనివాస్, అలోక్‌రెడ్డిలు బార్ మేనేజర్‌కు ఫిర్యాదు చేశారు. అక్కడికి వచ్చిన బార్ మేనేజర్, సిబ్బంది పూరింటన్‌ను బయటికి పంపేశారు. కొద్దిసేపటికే తిరిగొచ్చి.. బార్ నుంచి బయటికి వెళ్లగొట్టినా.. పూరింటన్ కొద్దిసేపటికి తుపాకీతో తిరిగి వచ్చాడు. ‘మా దేశం విడిచి వెళ్లిపోండి.. ఉగ్రవాదులారా..’ అని అరుస్తూ శ్రీనివాస్, అలోక్‌రెడ్డిలపై కాల్పులు జరిపాడు. శ్రీనివాస్ ఛాతీలో బుల్లెట్ దిగడంతో అక్కడే కుప్ప కూలిపోయారు. అలోక్‌కి తొడ భాగంలో తూటా దూసుకుపోయింది. ఈ సమయంలో అక్కడే ఉన్న ఇయాన్ గ్రిలట్ అనే మరో అమెరికన్.. పూరింటన్‌ను అడ్డుకోవడానికి ప్రయత్నించాడు. దాంతో అతడి చేతిపై బుల్లెట్ గాయమైంది. వారందరినీ వెంటనే ఆస్పత్రికి తరలించగా.. శ్రీనివాస్ అప్పటికే మరణించారు. అలోక్‌రెడ్డి, ఇయాన్ గ్రిలట్‌లు చికిత్స పొంది డిశ్చార్జి అయ్యారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ అధికారంలోకి వచ్చాక జాతి, మత విద్వేష నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో జరిగిన ఈ కాల్పుల ఘటన భారతీయ అమెరికన్లలో భయాందోళన నింపుతోంది. కాగా.. తమ ఏవియేషన్ ఇంజనీరింగ్ టీమ్‌లో పనిచేస్తున్న శ్రీనివాస్ కాల్పుల్లో మృతిచెందడం, అలోక్ గాయపడ్డం తమను కలచివేసిందని గార్మిన్ కంపెనీ తెలిపింది. 1.చికిత్స అనంతరం విశ్రాంతి తీసుకుంటున్న అలోక్‌రెడ్డి 2.కుమారుడి మరణవార్త తెలిసి విలపిస్తున్న శ్రీనివాస్ తల్లిదండ్రులు 3.శ్రీనివాస్, అలోక్రెడ్డిపై కాల్పులు జరిగింది ఈ బార్లోనే.. శ్రీనివాస్ కుటుంబానికి వెల్లువలా సాయం.. శ్రీనివాస్ కూచిభొట్ల కుటుంబాన్ని ఆదుకోవడానికి, ఆయన మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు సహాయం చేసేందుకు చాలా మంది ముందుకొచ్చారు. ఆయన స్నేహితురాలు కవిప్రియ మథురమాలింగం సోషల్ మీడియాలో ఏర్పాటు చేసిన ‘గోఫండ్‌మి’పేజీ ద్వారా పలువురు అమెరికన్లు సహా దాదాపు 7,200 మంది 2,61,996 డాలర్ల (సుమారు రూ.కోటి 80 లక్షలు) సాయం అందించారు. శ్రీనివాస్ స్నేహశీలి అని, ఎవరినీ పల్లెత్తుమాట అనేవాడు కాదని అమెరికాలో ఆయన ఇంటి పొరుగువారు చెప్పారు. 1. ప్రణీత్ నేచర్స్ బౌంటీలోని శ్రీనివాస్ నివాసం 2. ఆర్కేపురంలోని అలోక్‌రెడ్డి నివాసం పదేళ్ల కింద అమెరికా వెళ్లి.. అమెరికాలో మరణించిన శ్రీనివాస్ తండ్రి కూచిభొట్ల మధుసూదనరావు ఐడీపీఎల్ విశ్రాంత ఉద్యోగి. వారు ఐదేళ్లుగా హైదరాబాద్ శివార్లలోని బాచుపల్లి మల్లంపేట గ్రామ పరిధిలో ఉన్న ప్రణీత్ నేచర్స్ బౌంటీ ఫేజ్–1లో నివసిస్తున్నారు. వారికి శ్రీనివాస్ తోపాటు పరశురామశాస్త్రి, సాయి కిశోర్ సంతానం. పరశు రామశాస్త్రి హైదరాబాద్‌లోనే స్థిరపడగా.. శ్రీనివాస్, సాయి కిశోర్ అమెరికాలో ఉంటున్నారు. శ్రీనివాస్ హైదరాబాద్ శివార్లలోని విద్యా జ్యోతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎలక్ట్రికల్ ఇంజనీ రింగ్ చదివారు. పదేళ్ల క్రితం అమెరికా వెళ్లి మాస్టర్స్ పూర్తి చేశారు. తొలుత అమెరికాలోని రాక్వెల్ కొలిన్స్ సంస్థలో సిస్టమ్స్ ఇంజనీర్‌గా పనిచేసి.. అనంతరం గార్నిమ్ సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా చేరారు. శ్రీనివాస్‌కు నాలుగేళ్ల క్రితం హైదరాబాద్‌కే చెందిన సునయనతో వివాహం జరిగింది. వారికి ఇంకా సంతానం లేదు. శ్రీనివాస్ మరణవార్త విని వారి కుటుంబం దుఃఖ సాగరంలో మునిగిపోయింది. స్నేహితుడితో కలసి.. అమెరికన్ కాల్పుల్లో గాయపడిన అలోక్ కుటుంబం హైదరాబాద్‌లోని చైతన్యపురి పరిధిలో ఉన్న ఆర్కే పురంలో నివసిస్తోంది. ఆయన తండ్రి మేడసాని జగన్మోహన్రెడ్డి, తల్లి రేణుక. వీరి స్వస్థలం వరంగల్ జిల్లా హన్మకొండలోని అడ్వొకేట్స్ కాలనీ. పదేళ్లుగా వారి కుటుంబం హైదరాబాద్‌లో నివాసం ఉంటోం ది. మిషన్ భగీరథ ప్రాజెక్టులో చీఫ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న జగన్మోహన్రెడ్డికి ఇద్దరు కుమారులు అలోక్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి. అలోక్‌రెడ్డి హైదరాబాద్ లోని వాసవి కాలేజీలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూని కేషన్స్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. 2006లో అమెరికా వెళ్లి మాస్టర్స్ డిగ్రీ చేశారు. శ్రీనివాస్‌తో కలసి రాక్వెల్ కొలిన్స్ సంస్థలో పనిచేసిన ఆయన.. తర్వాత శ్రీనివాస్ మాదిరిగానే గార్నిమ్ సంస్థలో చేరారు. ప్రస్తుతం కో–ఆర్డినేటర్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. అలోక్రెడ్డికి రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. భార్య దీప్తి అమెరికాలోనే సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. ఆమె ప్రస్తుతం గర్భవతి. ఐదు గంటల్లోనే దుండగుడు అరెస్ట్.. ఎఫ్‌బీఐ దర్యాప్తు శ్రీనివాస్ కూచిభొట్ల, అలోక్‌రెడ్డిలపై కాల్పులు జరిపిన జాత్యహంకారి పూరింటన్ (51)ను అమెరికా పోలీసులు గురువారం ఉదయం అరెస్టు చేశారు. పూరింటన్‌పై హత్య (ఫస్ట్ డిగ్రీ మర్డర్), హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. కాల్పుల ఘటన జరిగిన తర్వాత ఐదు గంటల్లోనే దుండగుడిని పట్టుకోవడం గమనార్హం. కాల్పుల ఘటన తర్వాత మిస్సోరీలోని క్లింటన్లో ఉన్న ఓ బార్లో దాక్కున్న పూరింటన్ తాను తూర్పుఆసియా వాసులిద్దరిని చంపానని అక్కడి ఉద్యోగితో చెప్పాడని అమెరికన్ స్థానిక మీడియా పేర్కొంది. కాల్పుల ఘటనపై అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) కూడా దర్యాప్తు చేపట్టింది. ఈ ఘటన వెనుక జాతి వివక్ష కోణం ఉందా, లేదా అన్నదానిపై దర్యాప్తు చేస్తున్నామని కన్సాస్ నగరంలోని ఎఫ్‌బీఐ ప్రతినిధి ఎరిక్ జాక్స్ వెల్లడించారు. ఈ దుర్ఘటన జరిగిన బార్‌ను నిరవధికంగా మూసివేశారు. దుండగుడు అమెరికన్ నేవీ మాజీ ఉద్యోగి! కాల్పులు జరిపిన పూరింటన్ అమెరికా నావికాదళం మాజీ ఉద్యోగి అని స్థానిక మీడియా వెల్లడించింది. అతడి వద్ద పైలట్ లైసెన్స్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ సర్టిఫికెట్లు కూడా ఉన్నాయని తెలిపింది. అతను ఒథాలేలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌గా పనిచేశాడని, ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్‌లోనూ పనిచేసి 2010లో బయటికొచ్చాడని పేర్కొంది. మానవత్వమున్న మనిషిని.. దుండగుడిని అడ్డుకున్న అమెరికన్‌పై ప్రశంసలు కాల్పులు జరిపిన పూరింటన్‌ను ప్రాణాలకు తెగించి అడ్డుకున్న 24 ఏళ్ల అమెరికన్ యువకుడు ఇయాన్ గ్రిలట్‌కు ప్రశంసలు లభిస్తున్నా యి. ఒక అమెరికన్ జాతి విద్వేషంతో కాల్పులు జరపగా.. మరో అమెరికన్ మానవత్వంతో అడ్డుకోవడాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు. పూరింటన్ కాల్పులు మొదలుపెట్టడంతో టేబుల్ వెనక దాక్కున్న గ్రిలట్.. ఒక్కసారిగా విసురుగా వెళ్లి అతడిని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. దుండగుడు అతడిపైనా కాల్పులు జరపడంతో.. గ్రిలట్ చేతి గుండా ఛాతీలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. ఆస్పత్రిలో గ్రిలట్‌ను యూనివర్సిటీ ఆఫ్ కన్సాస్ హెల్త్ సిస్టమ్ ఇంటర్వూ్య చేసింది. అందు లో.. ‘సాటి మనిషి కోసం నేనేం చేయాలో అదే చేశాను. అతడు (బాధితుడు) ఎక్కడి వాడు, ఏ జాతి వాడదన్నది ముఖ్యం కాదు. మనమంతా మనుషులం. దుండగుడు మరొకరి వైపు వెళ్లకుండా ఏం చేయాలో అది చేశాను’ అని గ్రిలట్ పేర్కొన్నారు. శ్రీనివాస్ కుటుంబానికి అండగా ఉంటాం: కాల్పుల ఘటనపై సుష్మ దిగ్భ్రాంతి సాక్షి, న్యూఢిల్లీ: అమెరికాలో తెలుగువారిపై జాతి విద్వేష కాల్పుల పట్ల విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుడు శ్రీనివాస్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ విషయం తెలిసిన వెంటనే అమెరికాలోని భారత రాయబారి నవతేజ్ సర్నాతో మాట్లాడానని, అక్కడి అధికారులు కన్సాస్‌కు చేరుకున్నారని ట్విటర్లో పేర్కొన్నారు. శ్రీనివాస్ భౌతిక కాయాన్ని హైదరాబాద్‌కు చేర్చడానికి ఏర్పాట్లు చేస్తున్నామని, ఆయన కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని చెప్పారు. కన్సాస్‌లో కాల్పులను ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం ఖండించింది. ఈ ఘటనపై అమెరికా దర్యాప్తు సంస్థలు విచారణ జరుపుతున్నాయని రాయబార కార్యాలయ అధికారి మ్యారికే కార్లసన్∙ పేర్కొన్నారు. కాగా, అమెరికాలో జాత్యహంకార దాడుల పట్ల సీపీఐ ఆందోళన వ్యక్తం చేసింది. జాత్యహంకారం, ట్రంప్ విధానాలపై పోరాడాలని అమెరికాలోని ప్రజాస్వామ్య శక్తులకు విన్నవించింది. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి సాక్షి, హైదరాబాద్: అమెరికాలోని కన్సాస్‌లో దుండగుడు ఇద్దరు తెలుగు విద్యార్థులపై కాల్పులు జరపడం, ఈ ఘటనలో ఒకరు మరణించడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ కాల్పుల ఘటనలో శ్రీనివాస్ కూచిభొట్ల అనే విద్యార్థి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా అలోక్ మేడసాని అనే విద్యార్థి గాయపడ్డారు. కన్సాస్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అలోక్‌కు రక్షణ కల్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా వైఎస్ జగన్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఇలాంటివి మళ్లీ జరగకుండా చూడాలి: కృష్ణమోహన్, శ్రీనివాస్ బంధువు ‘‘ఇప్పటికే అమెరికాలో నలుగురు జాత్యహంకార దాడుల్లో చనిపోయారు. ఇలాంటివి మళ్లీ జరగకుండా చూడాలి. శ్రీనివాస్ మృతదేహాన్ని మూడు, నాలుగు రోజుల్లో రప్పించేలా చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ హామీ ఇచ్చారు..’’ తెలుగు ప్రజలు కలసికట్టుగా ఉండాలి: జగన్మోహన్రెడ్డి, అలోక్‌రెడ్డి తండ్రి ‘‘అమెరికాలో ఉన్న తెలుగు ప్రజలంతా కలసికట్టుగా ఉండాలి. అమెరికా వాళ్లు పిచ్చివాళ్లలా మారిపోతున్నారు. ఏ విషయమైనా వారితో వాదించవద్దు. ట్రంప్ తీసుకున్న నిర్ణయాలతోనే ఇలాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయి. భారత యువత పునరాలోచన చేసుకుని స్వదేశానికి తిరిగి రావాలి..’’ సంబంధిత వార్తా కథనాలకై చదవండి.. (జాతి వివక్షకు 'అధికారం' తోడైతే..) (‘కూచిబొట్ల’కు కొండంత అండ) శ్రీనివాస్ మృతిపట్ల యూఎస్ కంపెనీ తీవ్ర దిగ్భ్రాంతి అమెరికాలో జాతి విద్వేష కాల్పులు శ్రీనివాస్ కుటుంబానికి ఎన్ఆర్ఐల బాసట -
‘కూచిబొట్ల’కు కొండంత అండ
- గోఫండ్ మీ పేజీకి వెల్లువెత్తిన విరాళాలు - పరిమళించిన మానవత్వం - మృతుడి భార్యకు అందజేయనున్న రూపకర్తలు హోస్టన్/న్యూఢిల్లీ/హైదరాబాద్: అమెరికాలోని కన్సాస్ బార్లో జరిగిన కాల్పుల్లో చనిపోయిన తెలుగు వ్యక్తి కూచిబొట్ల శ్రీనివాస్ (32) కుటుంబానికి కుటుంబానికి ఆర్థిక సహాయం చేసేందుకు వేలాది మంది మానవతావాదులు ముందుకొచ్చారు. గతంలో శ్రీనివాస్‌తో కలసి పనిచేసిన కవిప్రియ ముతురామలింగం విరాళాల కోసం గోఫండ్‌మీ పేజీని రూపొందించగా కేవలం ఆరు గంటల వ్యవధిలోనే 6,100 మంది స్పందించి 2,27,500 డాలర్లు పంపారు. లక్షా 50 వేల డాలర్ల కోసం ఈ పేజీని ఏర్పాటుచేయగా రెండు లక్షలకు పైగా వచ్చాయి.ఈ సొమ్మును మృతుడి భార్య సునయనకు అందజేయనున్నారు. మృతదేహాన్ని భారత్‌కు పంపడానికి ఆయన కుటుంబం ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఈ డబ్బును ఉపయోగించనున్నట్లు వారు చెప్పారు. ‘శ్రీనివాస్ అత్యంత కరుణాస్వభావం కలిగిన వ్యక్తి. అందరితోనూ ఎంతో ప్రేమగా మెలిగేవాడు. ద్వేషం అనే పదమే అతనికి తెలియదు, ఎంతో తెలివైన వ్యక్తి’ అని సదరు పేజీలో పోస్టు చేశారు. అలాగే అలోక్ చికిత్స కోసం, శ్రీనివాస్ కుటుంబానికి సహాయం కోసం బ్రియాన్ ఫోర్డ్ అనే వ్యక్తి ఫండ్ పేజీని ఏర్పాటు చేయగా 32,660 డాలర్లు వచ్చాయి. ఈ ఇద్దరు యువకులను కాపాడేందుకు ఇయాన్ గ్రిల్లట్ అనే అమెరికన్ యువకుడు ప్రయత్నించి గాయపడడం తెలిసిందే. గ్రిల్లట్ వైద్యసేవలకోసం అతని బంధువులు గోఫండ్ మీ పేజీని ప్రారంభించగా దానికి 99వేల డాలర్లు వచ్చాయి. తోచిందే చేశా: గ్రిల్లట్ ఆ సమయంలో తనకు తోచిందే చేశానని ప్రాణాలకు తెగించి నిందితుడిని అడ్డుకునేందుకు యత్నించిన అమెరికావాసి ఇయాన్ గ్రిల్లట్ గురువారం మీడియాకు చెప్పాడు. ఆస్టిన్స్ బార్ అండ్ గ్రిల్‌లోకి తిరిగివచ్చిన నిందితుడు పూరింటన్ కాల్పులు జరిపేందుకు సన్నద్ధమవుతున్న సమయంలో గ్రిల్లట్ అతని వెనక కుర్చీలోనే ఉన్నాడు. పూరింటన్ కాల్పులు ప్రారంభించగానే రంగంలోకి దిగిన గ్రిల్లట్ అడ్డుకునేందుకు యత్నించగా ఓ తూటా తగలడంతో గాయపడడం తెలిసిందే. ‘పైకి లేచి వెనుకనుంచి అతనిని లొంగదీసుకునేందుకు యత్నించా. దీంతో అతను నావైపు తిరిగి కాల్పులు జరిపాడు’ అని తెలిపాడు. బాధితుడి ఏ దేశానికి లేదా ఏ జాతికి చెందినవాడనేది అనవసరమని, మనమంతా మనుషులమేనంటూ తన విశాల హృదయాన్ని చాటుకున్నాడు. అమెరికాలో జాతి విద్వేష కాల్పులు దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సుష్మ కాల్పుల ఘటనలో భారతీయుడు చనిపోవడంపై విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ‘అమెరికాలోని భారతీయ రాయబారి నవ్‌తేజ్ సర్నాతో మాట్లాడానన్నారు. ‘కాన్సులేట్ కార్యాలయంలో పనిచేసే ఆర్డీ జోషి అక్కడికి చేరుకున్నారు, బాధిత కుటుంబాలకు అండదండగా నిలుస్తారు. జోషితోపాటు మరో అధికారి హర్పాల్సింగ్ కూడా చేయూతనిస్తారు. వారిరువురు స్థానిక పోలీసులతో వీళ్లిద్దరు సంప్రదింపులు జరుపుతున్నారు. అవసరమైన చర్యలు తీసుకుంటారు’ అని ఆమె ట్వీటర్లో పేర్కొన్నారు. ఖండించిన అమెరికా రాయబార కార్యాలయం కన్సాస్ జాతి విద్వేష కాల్పులను భారత్ లోని అమెరికా రాయబార కార్యాలయం ఖండించింది. ఈ ఘటనపై తమ దేశ దర్యాప్తు సంస్థలు విచారణ జరుపుతున్నాయని అమెరికా ఎంబసీ అధికారి మ్యారీకే ఎల్ కార్లసన్ వెల్లడించారు. కేసుపై వేగంగా దర్యాప్తు జరుపుతుందని అన్నారు. ఈ ఘటనలో తెలుగు వ్యక్తి శ్రీనివాస్ కూచిభొట్ల ప్రాణాలు కోల్పోవడం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. అలోక్‌ను పరామర్శించిన భారత అధికారులు అమెరికాలోని భారత రాయబార కార్యాలయం వెంటనే స్పందించింది. గాయపడిన మేడసాని అలోక్ ఇంటికి వెళ్లిన భారత కాన్సులేట్ జనరల్ ఆర్డీ జోషి అతడిని పరామర్శించారు. అలోక్ క్షేమంగా ఉన్నాడని, అతడికి అవసరమైన సహాయం అందిస్తామని హోస్టన్‌లోని భారత రాయబార కార్యాలయ అధికారి అనుమప్ రే హామీయిచ్చారు. శ్రీనివాస్ మృతదేహాన్ని స్వస్థలానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి సాక్షి, హైదరాబాద్: అమెరికాలోని కన్సాస్‌లో దుండగుడు అడమ్ పూరింటన్ తెలుగు విద్యార్ధులపై కాల్పులు జరపడం పట్ల వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అప్రమత్తంగా ఉండాలి అమెరికాలో నివసిస్తున్న తెలుగువారు అప్రమత్తంగా ఉండాలని మేడసాని అలోక్ తండ్రి జగన్మోహన్ రెడ్డి సూచించారు. హైదరాబాద్‌లో శుక్రవారం సాక్షితో మాట్లాడుతూ అమెరికాలో భారతీయులపై ఇటీవల దాడులు పెరిగిపోవడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కన్సాస్ లో దుండగుడు జరిపిన కాల్పుల నుంచి తన కుమారుడు ప్రాణాలతో బయటపడ్డాడని చెప్పారు. ఘటనాస్థలి వద్ద ఉన్న తన కుమారుడు అలోక్ అక్కడి నుంచి పరుగెత్తుకుని వెళ్లిపోయి ప్రాణాలు దక్కించుకున్నాడని తెలిపారు.ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని కోరారు. బయటకు వెళ్లినప్పుడు ఎవరితోనూ వాదనలు దిగొద్దని అమెరికాలో ఉంటున్న తెలుగువారికి ఆయన సూచించారు. -
‘పరుగెత్తి ప్రాణాలు దక్కించుకున్నాడు’
హైదరాబాద్: అమెరికాలో నివసిస్తున్న తెలుగువారు అప్రమత్తంగా ఉండాలని మేడసాని అలోక్ తండ్రి జగన్మోహన్ రెడ్డి సూచించారు. అమెరికాలో భారతీయులపై ఇటీవల దాడులు పెరిగిపోవడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కన్సాస్ లో దుండగుడు జరిపిన కాల్పుల నుంచి తన కుమారుడు ప్రాణాలతో బయటపడ్డాడని ‘సాక్షి’తో చెప్పారు. ఆస్టిన్ బార్ అండ్ గ్రిల్ లో బుధవారం దుండగుడు ఆడమ్ పూరింటన్ కాల్పులు జరపడంతో తెలుగు వ్యక్తి శ్రీనివాస్ కూచిభొట్ల ప్రాణాలు కోల్పోయాడు. తమ దేశం విడిచి వెళ్లిపోవాలని శ్రీనివాస్, అలోక్ తో ఆడమ్ వాగ్వాదానికి దిగాడని అలోక్ తండ్రి తెలిపారు. బార్ సిబ్బంది జోక్యం చేసుకుని ఆడమ్ ను బయటకు పంపించారని, కొంతసేపటి తర్వాత తిరిగొచ్చిన అతడు తుపాకీతో కాల్పులకు దిగినట్టు వెల్లడించారు. తన కుమారుడు అలోక్ అక్కడి నుంచి పరుగెత్తుకుని వెళ్లిపోయి ప్రాణాలు దక్కించుకున్నాడని తెలిపారు. అలోక్ క్షేమంగా ఉన్నాడని, అతడితో ఫోన్ లో మాట్లాడానని చెప్పారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని కోరారు. బయటకు వెళ్లినప్పుడు ఎవరితోనూ వాదనలు దిగొద్దని అమెరికాలో ఉంటున్న తెలుగువారికి ఆయన సూచించారు. సంబంధిత కథనాలు ఇక్కడ చదవండి.. శ్రీనివాస్ మృతిపట్ల యూఎస్ కంపెనీ తీవ్ర దిగ్భ్రాంతి అమెరికాలో జాతి విద్వేష కాల్పులు శ్రీనివాస్ కుటుంబానికి ఎన్ఆర్ఐల బాసట రక్షించేందుకు కాల్పులకు ఎదురెళ్లిన హీరో ఇతడే కాల్పులను ఖండించిన అమెరికా అలోక్ కు పరామర్శ -
కాల్పులను ఖండించిన అమెరికా
న్యూఢిల్లీ: కన్సాస్ జాతి విద్వేష కాల్పులను భారత్ లోని అమెరికా రాయబార కార్యాలయం ఖండించింది. ఈ ఘటనపై తమ దేశ దర్యాప్తు సంస్థలు విచారణ జరుపుతున్నాయని అమెరికా ఎంబసీ అధికారి మ్యారీకే ఎల్ కార్లసన్ వెల్లడించారు. కేసుపై వేగంగా దర్యాప్తు జరుపుతుందని అన్నారు. ఈ ఘటనలో తెలుగు వ్యక్తి శ్రీనివాస్ కూచిభొట్ల ప్రాణాలు కోల్పోవడం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. మరోవైపు అమెరికాలోని భారత రాయబార కార్యాలయం వెంటనే స్పందించింది. గాయపడిన మేడసాని అలోక్ ఇంటికి భారత కాన్సులేట్ జనరల్ ఆర్డీ జోషి వెళ్లి అతడిని పరామర్శించారు. అలోక్ క్షేమంగా ఉన్నాడని, అతడికి అవసరమైన సహాయం అందిస్తామని హూస్టన్ లోని భారత రాయబార కార్యాలయ అధికారి అనుమప్ రే హామీయిచ్చారు. శ్రీనివాస్ మృతదేహాన్ని స్వస్థలానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్న భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. -
‘పరుగెత్తి ప్రాణాలు దక్కించుకున్నాడు’