కాన్సాస్ హీరోకు భారత్ ఆహ్వానం
హ్యూస్టన్: అమెరికాలో కాన్సాస్ కాల్పుల్లో తెలుగువారిని రక్షించే ప్రయత్నంలో గాయపడ్డ ఆ దేశ పౌరుడు ఇయాన్ గ్రిల్లాట్ (24)ను భారత్‌కు ఆహ్వానించారు. హ్యూస్టన్‌లోని భారత రాయబార కార్యాలయం దౌత్యాధికారి అనుపమ్ రే.. గ్రిల్లాట్‌ను కలిశారు.
ఆస్పత్రిలో వారం రోజులు చికిత్స పొందిన గ్రిల్లాట్ను గత మంగళవారం డిశ్చార్జి చేసి ఇంటికి పంపారు. గ్రిల్లాట్ పూర్తిగా కోలుకునేందుకు సమయం పడుతుందని కాన్సాస్ యూనివర్శిటీ ఆరోగ్య విభాగం వెల్లడించింది. శుక్రవారం గ్రిల్లాట్ కుటుంబ సభ్యులతో కలసి ఆస్పత్రికి వెళ్లి అనుపమ్ రేను కలిశారు. తెలుగువారిని రక్షించేందుకు గ్రిల్లాట్ చూపిన తెగువను భారతీయులు అభినందిస్తున్నారని ఈ సందర్భంగా రే వారితో చెప్పినట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. గ్రిల్లాట్ కోలుకున్న తర్వాత అతను, కుటుంబ సభ్యులు భారత్‌కు రావాల్సిందిగా ఆహ్వానించారు.
కాన్సాస్‌లోని ఓ బార్‌లో శ్వేతజాతి దుండగుడు అడామ్ పురింటన్ (51) జాతివిద్వేషంతో జరిపిన కాల్పుల్లో శ్రీనివాస్ కూచిబొట్ల చనిపోగా అలోక్ మాదసాని గాయపడ్డాడు. వీరిని కాపాడేందుకు ప్రయత్నించిన గ్రిల్లాట్ గాయపడ్డాడు. ఛాతీ, చేతిలోకి రెండు బుల్లెట్లు దూసుకెళ్లాయి.
సంబంధిత వార్తలు చదవండి
కాలుస్తుంటే ఏదో ఒకటి చేయాలనిపించింది
రక్షించేందుకు కాల్పులకు ఎదురెళ్లిన హీరో ఇతడే