ian grillot
-
తూటాలకు ఎదురెళ్లి.. నేడు ఘన సత్కారాలు
-
తూటాలకు ఎదురెళ్లి.. నేడు ఘన సత్కారాలు
హ్యూస్టన్ : నాడు అమెరికాలో జరిగిన కాల్పుల్లో తుటాలకు ఎదురెళ్లి భారతీయుడిని కాపాడిన కాన్సాస్కు చెందిన అమెరికన్ పౌరుడు ఇయాన్ గ్రిల్లాట్‌కు ఘన సన్మానం జరిగింది. 5 హీరోస్ హు గేవ్ అస్ హోప్ ఇన్ 2017' అనే పేరిట టైమ్ మేగజీన్ సత్కారం చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో కాన్సాస్‌లోని ఓ బార్లో పెద్ద ఎత్తున కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. నేవీలో పనిచేసిన ఓ మాజీ అధికారి భారతీయులను లక్ష్యంగా చేసుకొని కాల్పులకు తెగబడ్డాడు. ఆ సమయంలో గ్రిల్లాట్(24) ఆ కాల్పులు జరుపుతున్న వ్యక్తికి అడ్డుపడ్డాడు. అప్పటికీ తెలుగువాడైన శ్రీనివాస్ కూచిబొట్ల ప్రాణాలు కోల్పోగా అలోక్ మాదసాని తీవ్రంగా గాయపడ్డాడు. అయితే, ఎక్కువగా ప్రాణ నష్టం జరగకుండా గ్రిల్లాట్ అడ్డుకోగలిగాడు. ఈ ఏడాది ప్రారంభంలో కూడా గ్రిల్లాట్‌ను ఇండియన్ అమెరికన్ల కమ్యూనిటి హ్యూస్టన్‌లో ఏ ట్రూ అమెరికన్ హీరో అంటే పెద్ద సత్కారం చేసిన విషయం తెలిసిందే. ఆ సందర్భంలో కాన్సాస్‌లో అతడు ఓ ఇళ్లు కొనుగులో చేసుకునేందుకు లక్ష డాలర్లు బహుమతిగా కూడా ఇచ్చారు. -
కన్సాస్ హీరోకు లక్ష డాలర్లు
భారీగా విరాళాలు సమకూర్చిన భారతీయులు హూస్టన్: కన్సాస్ కాల్పుల ఘటనలో తుపాకీకి వెరవకుండా అలోక్ మేడసాని ప్రాణాలను కాపాడిన అమెరికావాసి ఇయాన్ గ్రిల్లట్పై వెల్లువెత్తిన సానుభూతి... అతనిని లక్ష్మీదేవి రూపంలో వరించింది. స్వస్థలమైన కన్సాస్‌లో ఇంటిని కొనుగోలు చేసుకునేందుకు అమెరికాలోని భారతీయులంతా చేయిచేయి కలిపి లక్ష డాలర్ల మేర విరాళాలు సేకరించారు. గార్మిన్ కంపెనీలో పనిచేసే శ్రీనివాస్, అతని స్నేహితుడు మేడసాని అలోక్..ఫిబ్రవరి 22వ తేదీ రాత్రి కన్సాస్‌లోని ఓ బార్‌కు వెళ్లడం. అక్కడ నిందితుడు ఆడం పూరింటన్ వీరికి తారసపడడం తెలిసిందే. ‘మీరు మధ్యప్రాచ్యానికి చెందినవారు కదా. మా దేశం విడిచివెళ్లిపోండి’ అంటూ తొలుత శ్రీనివాస్, అలోక్‌లతో గొడవకు దిగాడు. ఆ తర్వాత బార్ నిర్వాహకులు అతనిని అక్కడి నుంచి బలవంతంగా బయటికి పంపగా కొద్దిసేపటి తర్వాత మళ్లీ అక్కడకు చేరుకుని ఆకస్మికంగా వీరిరువురిపై కాల్పులు జరపగా శ్రీనివాస్ చనిపోయాడు. నిందితుడిని అడ్డుకునేందుకు యత్నించిన గ్రిల్లట్‌తోపాటు అలోక్‌కు గాయాలవగా ఆస్పత్రికి తరలించగా వారిరువురు ప్రాణాలతో బయటపడడం తెలిసిందే. గ్రిల్లట్‌కు కృతజ్ఞతగా ఈ కానుకను అందజేస్తున్నామని తమ ఫేస్బుక్ పేజీలో ఇండియాహౌస్ హూస్టన్ పేర్కొంది. ఈ విరాళాల సేకరణకు హూస్టన్‌లోని భారత కాన్సులర్ జనరల్ డాక్టర్ అనుపమ్ రే చొరవ తీసుకోవడం గమనార్హం. అమెరికాలోని భారత రాయబారి నవ్‌తేజ్ సర్నా ఈ చెక్కును ఇయాన్కు అందజేశారు. -
కాన్సాస్ హీరోకు భారత్ ఆహ్వానం
హ్యూస్టన్: అమెరికాలో కాన్సాస్ కాల్పుల్లో తెలుగువారిని రక్షించే ప్రయత్నంలో గాయపడ్డ ఆ దేశ పౌరుడు ఇయాన్ గ్రిల్లాట్ (24)ను భారత్‌కు ఆహ్వానించారు. హ్యూస్టన్‌లోని భారత రాయబార కార్యాలయం దౌత్యాధికారి అనుపమ్ రే.. గ్రిల్లాట్‌ను కలిశారు. ఆస్పత్రిలో వారం రోజులు చికిత్స పొందిన గ్రిల్లాట్‌ను గత మంగళవారం డిశ్చార్జి చేసి ఇంటికి పంపారు. గ్రిల్లాట్ పూర్తిగా కోలుకునేందుకు సమయం పడుతుందని కాన్సాస్ యూనివర్శిటీ ఆరోగ్య విభాగం వెల్లడించింది. శుక్రవారం గ్రిల్లాట్ కుటుంబ సభ్యులతో కలసి ఆస్పత్రికి వెళ్లి అనుపమ్ రేను కలిశారు. తెలుగువారిని రక్షించేందుకు గ్రిల్లాట్ చూపిన తెగువను భారతీయులు అభినందిస్తున్నారని ఈ సందర్భంగా రే వారితో చెప్పినట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. గ్రిల్లాట్ కోలుకున్న తర్వాత అతను, కుటుంబ సభ్యులు భారత్‌కు రావాల్సిందిగా ఆహ్వానించారు. కాన్సాస్‌లోని ఓ బార్లో శ్వేతజాతి దుండగుడు అడామ్ పురింటన్ (51) జాతివిద్వేషంతో జరిపిన కాల్పుల్లో శ్రీనివాస్ కూచిబొట్ల చనిపోగా అలోక్ మాదసాని గాయపడ్డాడు. వీరిని కాపాడేందుకు ప్రయత్నించిన గ్రిల్లాట్ గాయపడ్డాడు. ఛాతీ, చేతిలోకి రెండు బుల్లెట్లు దూసుకెళ్లాయి. సంబంధిత వార్తలు చదవండి కాలుస్తుంటే ఏదో ఒకటి చేయాలనిపించింది రక్షించేందుకు కాల్పులకు ఎదురెళ్లిన హీరో ఇతడే -
‘కాలుస్తుంటే ఏదో ఒకటి చేయాలనిపించింది’
న్యూయార్క్: తోటివారిని రక్షించడం కోసం తన ప్రాణాలు సైతం ఇబ్బందుల్లో పెట్టుకోవడం తనకు సంతోషంగానే అనిపించదని కాన్సాస్ కాల్పుల్లో గాయపడిన ఇయాన్ గ్రిల్లాట్ చెప్పాడు. దుండగుడు భయంకరంగా కాల్పులు జరుపుతుంటే చూస్తూ ఉండలేకపోయానని, ఏదో ఒకటి చేయాలనే తాను అతడిపైకి వెళ్లేందుకు ప్రయత్నించినట్లు తెలిపారు. జాత్యహంకారంతో కాన్సాస్‌లోని ఆస్టిన్ బార్లో మా దేశం విడిచి వెళ్లిపోండి అని గట్టిగా అరుస్తూ ఇద్దరు తెలుగువారిపై దుండగుడు కాల్పులకు తెగబడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో శ్రీనివాస్ కూచిబొట్ల చనిపోగా అలోక్ మాదసాని గాయపడ్డాడు. ఈ దాడిలోనే అలోక్ కంటే కూడా దారుణంగా ఇయాన్ తీవ్రంగా గాయపడ్డాడు. వీరంతా ఒక టేబుల్‌పై కూర్చుని ఉండగా దుండగులు కాల్పులు ప్రారంభించి తొమ్మిది రౌండ్లు కాల్చిన అనంతరం ఎక్కడివారు అక్కడ భయాందోళనలతో చెల్లాచెదురుగా పరుగెడుతుండగా ఒక్క ఇయాన్ మాత్రం ఆ దుండగుడిపైకి ఉరికాడు. దాంతో అతడిపైకి కూడా దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ క్రమంలో ఒక బుల్లెట్ అతడి చాతీలోకి, మరొకటి చేతిలోకి దూసుకెళ్లింది. ప్రస్తుతం ఆస్పత్రిలో కోలుకుంటున్న అతడిని మీడియా పలకరించింది. మీకు జరిగిన హానీని ఊహించుకొని బాధపడుతున్నారా అని మీడియా ప్రశ్నించగా.. ‘ఇతరుల ప్రాణాలు రక్షించేందుకు నా ప్రాణాలు పణంగా పెట్టే ప్రయత్నం చేసినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఆ సమయంలో బార్లో చాలా కుటుంబాలు ఉన్నాయి. పిల్లలు కూడా లోపల ఉన్నారు. అతడు అలా కాల్పులు జరుపుతుంటే చూస్తూ ఉండలేకపోయాను. ఏదో ఒకటి చేయాలనిపించింది. అందుకే నేను చేయాలనుకుంది చేసేశాను’ అని చెప్పాడు. సంబంధిత వార్తా కథనాలకై చదవండి.. రక్షించేందుకు కాల్పులకు ఎదురెళ్లిన హీరో ఇతడే శ్రీనివాస్ మృతిపట్ల యూఎస్ కంపెనీ తీవ్ర దిగ్భ్రాంతి అమెరికాలో జాతి విద్వేష కాల్పులు శ్రీనివాస్ కుటుంబానికి ఎన్ఆర్ఐల బాసట -
కాల్పులకు ఎదురెళ్లిన హీరో ఇతడే
-
రక్షించేందుకు కాల్పులకు ఎదురెళ్లిన హీరో ఇతడే
కాన్సాస్: అమెరికాలోని కాన్సాస్‌లో చోటు చేసుకున్న జాత్యహంకార కాల్పుల్లో ఓ అమెరికన్ పౌరుడు హీరో అయ్యాడు. కాల్పులకు కూడా భయపడకుండా దుండగుడిని కిందపడేసి బంధించే ప్రయత్నం చేశాడు. అతడి చేతులోని తుపాకీని లాక్కునే ప్రయత్నం చేశాడు. అప్పటికే అతడి తుపాకీ నుంచి తొమ్మిది బుల్లెట్లు దూసుకెళ్లాయి. ఆ తూటాల్లో రెండు అతడి ఒంట్లోకి దూసుకెళ్లాయి. అందులో ఒకటి చాతీలోకి మరొకటి చేతిలోకి. వివరాల్లోకి వెళితే.. అమెరికా నేవీలో పనిచేసిన మాజీ సైనికుడు అడామ్ పురింటన్ (51) ఆస్టిన్ బార్ అండ్ గ్రిల్ లో ఇద్దరు తెలుగువారిపై కాల్పులు జరిపాడు. తమ దేశాన్ని విడిచి వెళ్లిపోండి అని గట్టిగా అరుస్తూ కాల్పులు కొనసాగించాడు. అదే సమయంలో అందులో బీర్ తాగేందుకు వచ్చిన ఇయాన్ గ్రిలియట్(24) వెంటనే పురింటన్పైకి దూకాడు. అతడిని తుపాకీ లాక్కునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో అతడు ట్రిగర్ నొక్కడంతో రెండు బుల్లెట్లు దూసుకెళ్లాయి. అయినప్పటికీ అతడిపై విరోచితంగా పోరాడి కిందపడేశాడు. అయినప్పటికీ గాయాల కారణంగా గ్రిలియట్ స్పృహకోల్పోతుండగా పురింటన్ పారిపోయాడు. ఐదు గంటల అనంతరం పోలీసులు దుండగుడిని అరెస్టు చేశారు. స్పృహకోల్పోయిన గ్రిలియట్ను ఆస్పత్రికి తరలించగా అతడు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. వాస్తవానికి అతడు అడ్డుకోకుంటే అలోక్ కూడా చనిపోయే పరిస్థితి ఉండేదట. ‘ఇతరులు ఏం చేయాలో నేను సరిగ్గా అదే చేశాను. అతడు ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు. అతడు జాతి కూడా మాకు తెలియదు. కానీ మనందరం మనుషులం. నేను బ్రతికి బయటపడటం నిజంగా అదృష్టమే. ఇది చాలా గొప్ప విషయం. ఆ ఘటనను నేను వర్ణించలేను. అలోక్ మాదసాని నిన్న నన్ను పరామర్శించి వెళ్లాడు. అతడి భార్య ఐదు నెలల గర్భవతి అని చెప్పాడు. అతడికి ఏదైనా జరిగి ఉంటే పరిస్థితి దారుణంగా ఉండేది’ అంటూ గ్రిలియట్ ఆస్పత్రిలో బెడ్‌పై ఉండి మాట్లాడాడు. సంబంధిత వార్తా కథనాలకై చదవండి.. శ్రీనివాస్ మృతిపట్ల యూఎస్ కంపెనీ తీవ్ర దిగ్భ్రాంతి అమెరికాలో జాతి విద్వేష కాల్పులు శ్రీనివాస్ కుటుంబానికి ఎన్ఆర్ఐల బాసట