
హ్యూస్టన్ : నాడు అమెరికాలో జరిగిన కాల్పుల్లో తుటాలకు ఎదురెళ్లి భారతీయుడిని కాపాడిన కాన్సాస్‌కు చెందిన అమెరికన్ పౌరుడు ఇయాన్ గ్రిల్లాట్‌కు ఘన సన్మానం జరిగింది. 5 హీరోస్ హు గేవ్ అస్ హోప్ ఇన్ 2017' అనే పేరిట టైమ్ మేగజీన్ సత్కారం చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో కాన్సాస్‌లోని ఓ బార్‌లో పెద్ద ఎత్తున కాల్పులు జరిగిన విషయం తెలిసిందే.
నేవీలో పనిచేసిన ఓ మాజీ అధికారి భారతీయులను లక్ష్యంగా చేసుకొని కాల్పులకు తెగబడ్డాడు. ఆ సమయంలో గ్రిల్లాట్(24) ఆ కాల్పులు జరుపుతున్న వ్యక్తికి అడ్డుపడ్డాడు. అప్పటికీ తెలుగువాడైన శ్రీనివాస్ కూచిబొట్ల ప్రాణాలు కోల్పోగా అలోక్ మాదసాని తీవ్రంగా గాయపడ్డాడు. అయితే, ఎక్కువగా ప్రాణ నష్టం జరగకుండా గ్రిల్లాట్ అడ్డుకోగలిగాడు. ఈ ఏడాది ప్రారంభంలో కూడా గ్రిల్లాట్‌ను ఇండియన్ అమెరికన్ల కమ్యూనిటి హ్యూస్టన్‌లో ఏ ట్రూ అమెరికన్ హీరో అంటే పెద్ద సత్కారం చేసిన విషయం తెలిసిందే. ఆ సందర్భంలో కాన్సాస్‌లో అతడు ఓ ఇళ్లు కొనుగులో చేసుకునేందుకు లక్ష డాలర్లు బహుమతిగా కూడా ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment