కాన్సస్‌లో దిగ్విజయంగా నాట్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌ | NATS Held Badminton Tourney In Kansas Check Winners List And Other Details Inside | Sakshi
Sakshi News home page

కాన్సస్‌లో దిగ్విజయంగా నాట్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌

Published Thu, Jan 23 2025 4:09 PM | Last Updated on Thu, Jan 23 2025 4:59 PM

NATS Held Badminton Tourney In Kansas Check Winners List

అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్.. కాన్సస్‌లో  తాజాగా బాడ్మింటన్ టోర్నమెంట్ నిర్వహించింది.  ఈ టోర్నమెంట్ కి  విశేష స్పందన లభించింది. స్ప్రింట్ ఇండోర్ జిమ్నాసియం ప్రాంగణంలో జరిగిన ఈ పోటీల్లో 100 మందికి పైగా తెలుగు బాడ్మింటన్ ప్లేయర్స్ ఎంతో ఉత్సాహంగా పాల్గొని క్రీడా స్ఫూర్తిని చాటారు.  

యూత్ సింగిల్స్, యూత్ డబుల్స్, మెన్స్ సింగిల్స్, మెన్స్ డబుల్స్, సినీయర్ మెన్స్ డబుల్స్, ఉమెన్స్ డబుల్స్, మిక్సుడ్  డబుల్స్ విభాగాల్లో బ్యాడ్మింటన్ పోటీలు జరిగాయి. యువతను భాగస్వామ్యం చేస్తూ నిర్వహించిన ఈ పోటీలు ఆద్యంత్యం ఉత్కంఠభరితంగా సాగాయి. ఈ టోర్నమెంట్ కి ప్రేక్షకులు కూడా భారీగా విచ్చేసి క్రీడాకారులను ఉత్తేజ పరిచారు. పోటాపోటీగా జరిగిన ఈ టోర్నమెంట్స్‌లో గెలిచిన విజేతలకు నాట్స్ మెడల్స్, ప్రత్యేక ప్రోత్సాహక బహుమతులు అందజేసింది.

కాన్సస్ నగరంలో నాట్స్ కాన్సస్ కోఆర్డినటర్ ప్రసాద్ ఇసుకపల్లి, స్పోర్ట్స్ కోఆర్డినేటర్ మదన్ సానె, సందీప్ మందుల నేతృత్వంలో ఈ పోటీలు దిగ్విజయంగా నిర్వహించారు.  శ్రీనివాస్ దామ, సాయిరాం గండ్రోతుల, నాగార్జున మాచగారి, విజయ్ రంగిణి తదితరులు ఈ టోర్నమెంట్ నిర్వహణలో విశేషంగా కృషి చేశారు. ప్రముఖ రియల్టర్స్ భారతి రెడ్డి, కృష్ణ చిన్నం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో సేవలు అందిస్తున్న మంత్రి ఇంక్, స్టాఫింగ్ ట్రీ, పక్షీ ఇంక్ తదితర సంస్థలు స్పాన్సర్స్  గా తమ సహకారం అందించారు.

కేసీ దేశీ డాట్కాం మీడియా పరంగా మద్దతు ఇచ్చింది.. ప్రశాంత్ కోడూరు, జగన్ బొబ్బర్ల, మనశ్విని కోడూరు, మూర్తి కాశి, తిరుమలేశ్ , కార్తీక్ అయ్యర్, శ్రీకాంత్ కుప్పిరెడ్డి, మధు జిల్లాల, సురేందర్ చిన్నం, నాట్స్ నేషనల్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ వెబ్ రవి కిరణ్ తుమ్మల,  నాట్స్ నేషనల్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ మీడియా మురళీ కృష్ణ మేడిచెర్ల, నాట్స్ సెక్రటరీ రాజేష్ కాండ్రు, నాట్స్ నేషనల్ మార్కెటింగ్ కోఆర్డినేటర్ కిరణ్ మందాడి తదితరులు ఈ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ తమ వంతు సహకారాన్ని అందించారు.

నాట్స్ బోర్డు సభ్యులు రవి గుమ్మడిపూడి, నాట్స్ (ఇండియా లైసోన్) నేషనల్ కోఆర్డినేటర్ వెంకట్ మంత్రి నాట్స్ కాన్సస్ కోఆర్డినటర్ ప్రసాద్ ఇసుకపల్లి తదితరులు ఈ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ముగింపు సభలో నాట్స్ తెలుగు వారి కోసం చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. ప్రముఖ సైంటిస్ట్, సంఘ సేవకులు యువతకు క్రీడా  డాక్టర్ ఆనంద్ వొడ్నాల, ఆంధ్రాబ్యాంక్ రిటైర్డ్ జనరల్ మేనేజర్ మల్లవరపు నరసింహారావు (తిరుపతి) ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసి క్రీడాకారుల్లో స్ఫూర్తిని నింపేలా మాట్లాడారు. నాట్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ దిగ్విజయంగా నిర్వహించడంలో కృషి చేసిన ప్రతి ఒక్కరికి నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

కాన్సస్ బ్యాడ్మింటన్ విజేతల వివరాలు:
యూత్ సింగిల్స్
దేవ్ దర్శన్ ఆర్బి (విన్నర్స్ 1st), అంకిత అరుణ్ శౌరి (2nd), లాస్య రాపోలు (3rd)

యూత్ డబుల్స్:
దేవ్ దర్శన్ ఆర్బీ & జస్వంత్ ఆర్బీ (విన్నర్స్ 1st), నిత్య వి & అవంతిక అరున్ష (2nd)

ఉమన్ డబుల్స్:
భవాని రామచంద్రన్ & ప్రదీప ప్రవీణ్ (విన్నర్స్ 1st), అనురాధా పురుషోత్తం & విద్య (2nd),

మెన్స్ సింగిల్స్:
స్టాన్లీ  (విన్నర్స్ 1st), దివాకర్ చెన్నారెడ్డి (2nd), సతీష్ మీసా (3rd)

మెన్స్ డబుల్స్:
యశ్ & నందు(విన్నర్స్ 1st), సందీప్ మందుల & మనోజ్

సినీయర్ మెన్స్ డబుల్స్:
దివాకర్ చెన్నారెడ్డి & సతీష్ మీసా (విన్నర్స్ 1st), మనోజ్ & కార్తీక్ అయ్యర్ (2nd), సిరాజ్ & సందీప్ మందుల (3rd).

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement