న్యూజెర్సీలో విజయవంతంగా నాట్స్ పికిల్‌బాల్ టోర్నీ | NATS Hosted Pickleball Tournament In New Jersey Check Details | Sakshi
Sakshi News home page

న్యూజెర్సీలో విజయవంతంగా నాట్స్ పికిల్‌బాల్ టోర్నమెంట్‌

Published Mon, Sep 23 2024 6:45 PM | Last Updated on Mon, Sep 23 2024 6:51 PM

NATS Hosted Pickleball Tournament In New Jersey Check Details

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) తెలుగు వారిలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు న్యూజెర్సీలో తాజాగా పికిల్ బాల్ టోర్నమెంట్ నిర్వహించింది. ఇందులో 30 జట్లు పాల్గొన్నాయి. వీటిని నాలుగు గ్రూపులుగా విభజించి నిర్వహించిన ఈ మ్యాచ్‌ల్లో..  16 టీమ్‌లు నాకౌట్ మ్యాచ్‌లకు అర్హత సాధించాయి. తరువాతి రౌండ్లలో 8 జట్లు పోటీ పడ్డాయి.  చివరకు నాలుగు జట్లు సెమీ ఫైనల్స్ ఆడాయి.

విజేత  చెస్టర్‌ఫీల్డ్ 
అద్భుత ప్రదర్శనతో ఈ టోర్నీ ఫైనల్‌కు చేరుకున్న మన్రో, చెస్టర్‌ఫీల్డ్ జట్ల మధ్య ఆఖరి మ్యాచ్ మరింత రసవత్తరంగా సాగింది. ఈ ఆసక్తికర పోరులో చెస్టర్‌ఫీల్డ్ జట్టు విజేతగా నిలవగా... మన్రో జట్టు రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఇక తుది పోరులో నిలిచిన విన్నర్, రన్నర్ అప్ టీమ్‌లకు నాట్స్ నాయకులు ట్రోఫీలు, బహుమతులు అందించారు. టోర్నమెంట్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేసి తొలి స్థానంలో నిలిచిన వంశీ కొండరాజు, నాగరాజు ఆకారపు, రెండవ స్థానంలో నిలిచిన మౌర్య యలమంచిలి, కీర్తన సంగం, మూడవ స్థానంలో తన్మయ్ షా, రాజా శశాంక్ ముప్పిరాలను నాట్స్ నాయకులు ప్రత్యేకంగా అభినందించారు. వారికి బహుమతులు అందించారు.

న్యూజెర్సీ విభాగానికి అభినందనలు
ఈ కార్యక్రమంలో నాట్స్ మాజీ అధ్యక్షులు మోహన కృష్ణ మన్నవ, గంగాధర్ దేసు, నాట్స్ మాజీ చైర్ వుమెన్ అరుణ గంటి, నాట్స్ బోర్డ్ డైరెక్టర్ బిందు యలమంచిలి పాల్గొని ఆటగాళ్లను ప్రోత్సహించారు. వారిలో క్రీడా స్ఫూర్తి పట్ల ప్రశంసల వర్షం కురిపించారు. నాట్స్ పికిల్ బాల్ టోర్నమెంట్ విజయవంతంగా నిర్వహించిన నాట్స్ న్యూజెర్సీ విభాగాన్ని అభినందించారు. ఈ టోర్నమెంట్ విజయవంతం కావడంలో నాట్స్ న్యూజెర్సీ చాప్టర్ ఈవెంట్స్ ఎగ్జిక్యూషన్ కో-ఛైర్ క్రాంతి యడ్లపూడి, నాట్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీహరి మందాడిలు కీలక పాత్ర పోషించారు.

ఈ టోర్నమెంట్ నిర్వహణలో న్యూజెర్సీ చాప్టర్ కో ఆర్డినేటర్ మోహన్ కుమార్ వెనిగళ్ల, జాయింట్ కో ఆర్డినేటర్  ప్రసాద్ టేకి, వైస్ ప్రెసిడెంట్  శ్రీనివాస్ భీమినేని, నాట్స్ మార్కెటింగ్ నేషనల్ కో ఆర్డినేటర్ కిరణ్ మందాడి, నాట్స్ నార్త్ ఈస్ట్ జోనల్ వైస్ ప్రెసిడెంట్  శ్రీనివాస్ మెంట,  నాట్స్ న్యూజెర్సీ టీమ్ రమేష్ నూతలపాటి, వంశీ వెనిగళ్ల , చంద్రశేఖర్ కొణిదెల, విష్ణు ఆలూరు, రాజేష్ బేతపూడి, వెంకటేష్ కోడూరి, శ్రీనివాస్ చెన్నూరి, శ్రీకాంత్ పొనకల, రమేష్ నెలూరి, కృష్ణ గోపాల్ నెక్కంటి, బ్రహ్మానందం పుసులూరి, ప్రశాంత్ కూచు, ప్రసూన మద్దాలి, ప్రణీత పగిడిమరి, రవి తుబాటి, శంకర్ జెర్రిపోతుల, శ్రీనివాస్ నీలం, సుకేష్ సుబ్బాని, గోపాల్ రావు చంద్ర, వెంకట్ గోనుగుంట. కృష్ణ సాగర్ రాపర్ల, రామకృష్ణ బోను, హరీష్ కొమ్మాలపాటి తదితరులు చేసిన కృషి  విజయానికి దోహదపడింది. ఈ టోర్నమెంట్ దిగ్విజయం చేయడంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికి నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement