PickleBall
-
అట్లాంటాలో దిగ్వియంగా నాట్స్ పికిల్ బాల్ టోర్నీలు
అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) తాజాగా క్రీడా టోర్నీతో ఆకట్టుకుంది. ఇటీవలి కాలంలో అమెరికా అంతటా ఆట అత్యంత ప్రాచుర్యం పొందుతున్న పికిల్ బాల్ టోర్నమెంట్‌ను నిర్వహించింది. అట్లాంట నాట్స్ విభాగం పురుషుల, మహిళల విభాగాల్లో ఈ టోర్నీని నిర్వహించగా.. మొత్తం 52 జట్లు పోటీ పడ్డాయి.ఇక అట్లాంట తెలుగు సంఘాల చరిత్రలోనే ఇంత భారీ స్థాయిలో నిర్వహించిన పికిల్ బాల్ టోర్నమెంట్ ఇదే మొదటిది కావడం విశేషం. కాగా నాట్స్ అట్లాంటలో ఆవిర్భించిన తొలినాళ్లలోనే ఇంత పెద్ద టోర్నమెంట్లను దిగ్విజయంగా నిర్వహించడంపై స్థానిక తెలుగు క్రీడాకారులు ప్రశంసల వర్షం కురిపించారు. ఈ టోర్నమెంట్ల విజయంలో నాట్స్ సభ్యులు, వాలంటీర్ల పాత్ర మరువలేనిదని నాట్స్ అట్లాంట చాప్టర్ కో ఆర్డినేటర్ వెంకట కృష్ణ మాలపాటి కొనియాడారు. టోర్నీ ఇంతటి ఘన విజయం సాధించటం సంతోషంగా ఉందన్నారు. ఇదే స్ఫూర్తితో అట్లాంటలో నాట్స్ సేవా, సాంస్కృతిక, క్రీడా కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు.ఇక టోర్నమెంట్ల ముగింపు కార్యక్రమంలో నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ సురేష్ పెద్ది, అట్లాంటా చాప్టర్ జాయింట్ కోఆర్డినేటర్ రజిని మాదాల, చాప్టర్ సెక్రటరీ నాగరాజు మంతెన, దుష్యంత్ నర్రావుల, శ్రీనివాసరావు యడ్లపల్లి, గౌతమ్ రెడ్డి గాదిరెడ్డి, శిల్పా కోనేరు, శశిధర్ ఉప్పల, రంజిత్ కుమార్ గుజ్జర్లపూడి, హితేష్ చింత, రేష్మా ఫర్హీన్, అభిలాష్ ఏడుపుగంటి, విద్య కాట్రగడ్డ, శశాంక్ చదలవాడ, లోహిత్ మంతెన తదితరులు పాల్గొన్నారు.ఈ పికిల్ బాల్ టోర్నమెంట్లలో 52 జట్లు వివిధ కేటగిరీల్లో పోటీ పడగా.. అడ్వాన్స్ క్యాటగిరిలో ఏసెస్ జట్టు విజయం సాధించింది. పికిల్ టిక్లర్స్ జట్టు రన్నరప్‌గా నిలిచింది. బిగినర్స్, ఇంటర్మీడియట్ కేటగిరి నుండి ఎన్.సి.టి టీం విజేతగా, బ్రూక్ వ్యూ బ్రదర్స్ జట్టు రన్నరప్‌గా నిలిచింది.. అలాగే సెమీ-ఫైనల్ రన్నరప్ క్యాటగిరి నుండి రాయల్ చాలెంజర్స్ జట్టు విజేతగా మౌంటైన్క్రస్ట్ మాన్ట్సర్స్ జట్టు రన్నప్‌గా నిలిచాయి.పికిల్ బాల్ టోర్నమెంట్లను అద్భుతంగా నిర్వహించిన అట్లాంట చాప్టర్ జట్టుని నాట్స్ సలహా మండలి సభ్యులు సతీష్ ముసునూరి, శ్రీకాంత్ వల్లభనేని, హరి కరియావుల ప్రశంసించారు.. చాప్టర్ కోఆర్డినేటర్ వెంకట కృష్ణ మాలపాటి, శశి ఉప్పల, హితేష్ చింత, రంజిత్ గుజ్జర్లపూడి, స్పోర్ట్స్ టీం నుండి శ్రీనివాస్ ఎడ్లవల్లి, గౌతం రెడ్డి గాదిరెడ్డి తదితరులు చేసిన కృషిని వారు ప్రత్యేకంగా అభినందించారు.పికిల్‌బాల్ టోర్నమెంట్ల నిర్వహణకు ప్రోత్సాహం అందించిన నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని,నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటికి అట్లాంటా చాప్టర్ టీం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. ఈ టోర్నమెంట్లు విజయవంతం కావటంలో తమ వంతు సహాయం అందించిన నాట్స్ సెక్రటరీ రాజేష్ కండ్రు, నాట్స్ ఈసీ వెబ్ టీం నుండి రవికిరణ్ తుమ్మల, నాట్స్ ఈసీ మీడియా టీం నుండి మురళి మేడిచర్ల, కిషోర్ నారె, సంకీర్త్ కటకం లకు అట్లాంట నాట్స్ విభాగం ధన్యవాదాలు తెలిపింది. -
న్యూజెర్సీలో విజయవంతంగా నాట్స్ పికిల్‌బాల్ టోర్నీ
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) తెలుగు వారిలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు న్యూజెర్సీలో తాజాగా పికిల్ బాల్ టోర్నమెంట్ నిర్వహించింది. ఇందులో 30 జట్లు పాల్గొన్నాయి. వీటిని నాలుగు గ్రూపులుగా విభజించి నిర్వహించిన ఈ మ్యాచ్‌ల్లో.. 16 టీమ్‌లు నాకౌట్ మ్యాచ్‌లకు అర్హత సాధించాయి. తరువాతి రౌండ్లలో 8 జట్లు పోటీ పడ్డాయి. చివరకు నాలుగు జట్లు సెమీ ఫైనల్స్ ఆడాయి.విజేత చెస్టర్‌ఫీల్డ్ అద్భుత ప్రదర్శనతో ఈ టోర్నీ ఫైనల్‌కు చేరుకున్న మన్రో, చెస్టర్‌ఫీల్డ్ జట్ల మధ్య ఆఖరి మ్యాచ్ మరింత రసవత్తరంగా సాగింది. ఈ ఆసక్తికర పోరులో చెస్టర్‌ఫీల్డ్ జట్టు విజేతగా నిలవగా... మన్రో జట్టు రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఇక తుది పోరులో నిలిచిన విన్నర్, రన్నర్ అప్ టీమ్‌లకు నాట్స్ నాయకులు ట్రోఫీలు, బహుమతులు అందించారు. టోర్నమెంట్లో అత్యుత్తమ ప్రదర్శన చేసి తొలి స్థానంలో నిలిచిన వంశీ కొండరాజు, నాగరాజు ఆకారపు, రెండవ స్థానంలో నిలిచిన మౌర్య యలమంచిలి, కీర్తన సంగం, మూడవ స్థానంలో తన్మయ్ షా, రాజా శశాంక్ ముప్పిరాలను నాట్స్ నాయకులు ప్రత్యేకంగా అభినందించారు. వారికి బహుమతులు అందించారు.న్యూజెర్సీ విభాగానికి అభినందనలుఈ కార్యక్రమంలో నాట్స్ మాజీ అధ్యక్షులు మోహన కృష్ణ మన్నవ, గంగాధర్ దేసు, నాట్స్ మాజీ చైర్ వుమెన్ అరుణ గంటి, నాట్స్ బోర్డ్ డైరెక్టర్ బిందు యలమంచిలి పాల్గొని ఆటగాళ్లను ప్రోత్సహించారు. వారిలో క్రీడా స్ఫూర్తి పట్ల ప్రశంసల వర్షం కురిపించారు. నాట్స్ పికిల్ బాల్ టోర్నమెంట్ విజయవంతంగా నిర్వహించిన నాట్స్ న్యూజెర్సీ విభాగాన్ని అభినందించారు. ఈ టోర్నమెంట్ విజయవంతం కావడంలో నాట్స్ న్యూజెర్సీ చాప్టర్ ఈవెంట్స్ ఎగ్జిక్యూషన్ కో-ఛైర్ క్రాంతి యడ్లపూడి, నాట్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీహరి మందాడిలు కీలక పాత్ర పోషించారు.ఈ టోర్నమెంట్ నిర్వహణలో న్యూజెర్సీ చాప్టర్ కో ఆర్డినేటర్ మోహన్ కుమార్ వెనిగళ్ల, జాయింట్ కో ఆర్డినేటర్ ప్రసాద్ టేకి, వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ భీమినేని, నాట్స్ మార్కెటింగ్ నేషనల్ కో ఆర్డినేటర్ కిరణ్ మందాడి, నాట్స్ నార్త్ ఈస్ట్ జోనల్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మెంట, నాట్స్ న్యూజెర్సీ టీమ్ రమేష్ నూతలపాటి, వంశీ వెనిగళ్ల , చంద్రశేఖర్ కొణిదెల, విష్ణు ఆలూరు, రాజేష్ బేతపూడి, వెంకటేష్ కోడూరి, శ్రీనివాస్ చెన్నూరి, శ్రీకాంత్ పొనకల, రమేష్ నెలూరి, కృష్ణ గోపాల్ నెక్కంటి, బ్రహ్మానందం పుసులూరి, ప్రశాంత్ కూచు, ప్రసూన మద్దాలి, ప్రణీత పగిడిమరి, రవి తుబాటి, శంకర్ జెర్రిపోతుల, శ్రీనివాస్ నీలం, సుకేష్ సుబ్బాని, గోపాల్ రావు చంద్ర, వెంకట్ గోనుగుంట. కృష్ణ సాగర్ రాపర్ల, రామకృష్ణ బోను, హరీష్ కొమ్మాలపాటి తదితరులు చేసిన కృషి విజయానికి దోహదపడింది. ఈ టోర్నమెంట్ దిగ్విజయం చేయడంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికి నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. -
ప్లేయర్‌గా మారిన సమంత.. ప్రాక్టీస్ మొదలు పెట్టేసింది!
టాలీవుడ్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సిటాడెల్: హనీ బన్నీ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు. ఈ సిరీస్‌లో వరుణ ధావన్ సరసన నటిస్తున్నారు. ఇటీవల తాను ఓ ఫ్రాంజైజీని కొనుగోలు చేసినట్లు వెల్లడించింది. క్రీడారంగంలోకి ఎంట్రీ ఇస్తున్నట్లు వెల్లడించింది. వరల్డ్ పికిల్ బాల్ లీగ్‌లో చెన్నై ఫ్రాంచైజీని కొనుగోలు చేసినట్లు తెలిపింది. ఈ లీగ్‌లో తాను చెన్నై ఫ్రాంచైజీ యజమానిగా ఉన్నందుకు సంతోషంగా ఉందని పోస్ట్ చేసింది.తాజాగా పికిల్ బాల్ లీగ్‌లో సందడి చేసింది. బ్యాట్ చేత పట్టుకుని ప్లేయర్‌గా ఆడుతూ కనిపించింది. పికిల్ బాల్ ఆడుతూ డ్యాన్స్ చేస్తూ ఆటను ఎంజాయ్ చేస్తోంది. దీనికి సంబంధించిన వీడియోను సమంత తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. కొద్దిరోజుల క్రితమే బిగ్ సర్ప్రైజ్ అంటూ ఈ లీగ్ పార్ట్నర్గా అడుగుపెడుతున్న సామ్ తన అభిమానులతో పంచుకున్న సంగతి తెలిసిందే. -
పికిల్‌బాల్ ఎప్పుడైనా విన్నారా.. అమెరికాలో ఎందుకంత క్రేజ్!
క్రికెట్, ఫుట్‌బాల్, టెన్నిస్.. ఇలా చెప్పుకుంటే పోతే చాలా క్రీడలు ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యాయి.యూరోపియన్ దేశాల్లో ఫుట్‌బాల్‌కు అత్యంత ఆదరణ ఉంటే.. ఆసియా ఖండంలో క్రికెట్‌కు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఇక అమెరికా, న్యూజిలాండ్ లాంటి దేశాల్లో రగ్బీ, బాస్కెట్‌బాల్ క్రీడలకు ఉండే ఆదరణ గురించి చెప్పనవసరం లేదు. మొత్తానికి ఫుట్‌బాల్, క్రికెట్, టెన్నిస్ సహా ఇతర క్రీడలు ఇవాళ విశ్వవ్యాప్తంగా ఆదరణకు నోచుకుంటున్నాయి. అయితే మనకు తెలియని క్రీడలు చాలానే ఉన్నాయి. ఒక క్రీడాభిమానిగా వాటి గురించి తెలుసుకోవాలనే కుతూహలం తప్పకుంటా ఉంటుంది. తాజాగా అమెరికాలో పికిల్‌బాల్ అనే క్రీడకు ప్రస్తుతం యమా క్రేజ్ ఉంది. అక్కడ ఇప్పుడు పికిల్‌బాల్ దూసుకెళ్తుంది. పిల్లల నుంచి పెద్దవాళ్ల దాకా ఈ పికిల్‌బాల్ క్రీడపై విపరీతమైన ఆదరణ కనబరుస్తున్నారు. పికిల్‌బాల్ చూడడానికి అచ్చం టెన్నిస్ ఆటలాగే ఉన్నప్పటికి ఇందులో ఉండే రూల్స్ వేరు. బంతి కొట్టే విధానం నుంచి బ్యాట్ పట్టుకునే విధానం వరకు.. షాట్స్, సర్వ్ చేసే తీరులో కూడా చాలా మార్పులు ఉన్నాయి. అసలు పికిల్‌బాల్ అంటే ఏంటి? పికిల్‌బాల్ ఇప్పుడు పుట్టిన క్రీడ మాత్రం కాదు. చాలా ఏళ్ల క్రితమే అమెరికాలోని వాషింగ్టన్లో ఉండే బెయిన్‌బ్రిడ్జ్ ఐలాండ్‌కు చెందిన ఒక కుటుంబం పికిల్‌బాల్‌ను కనిపెట్టింది. టెన్నిస్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్ కలగలిపి ఆడే క్రీడ పికిల్‌బాల్. కాగా పికిల్‌బాల్ కోర్టు టెన్నిస్ కోర్టు కంటే కాస్త చిన్నగా ఉంటుంది. పాడిల్ రూపంలో రాకెట్.. బంతి చుట్టూ హోల్స్.. పికిల్ బాల్ స్పోర్ట్స్‌ను ఇండోర్, ఔట్‌డోర్ గేమ్స్‌లో ఆడే అవకాశం ఉంటుంది. టెన్నిస్ రాకెట్లా కాకుండా పాడిల్‌ను(చిన్న రాకెట్) ఉపయోగిస్తారు. ఇక ప్లాస్టిక్ పదార్థంతో తయారయ్యే పికెల్ బాల్‌పై చుట్టూ హోల్స్ ఉంటాయి. ఈ రెండింటితో పాటు నెట్, మంచి గ్రౌండ్ అందుబాటులో ఉండాల్సిందే. ఇక పికిల్‌బాల్ కోర్ట్ డబుల్స్ బ్యాడ్మింటన్ కోర్ట్‌తో సమానంగా ఉంటుంది. 20×44 అడుగుల కొలతలు కలిగి ఉంటుంది. నికర ఎత్తు సైడ్‌లైన్‌లో 36 అంగుళాలు..మధ్యలో 34 అంగుళాలు పొడవు. కోర్ట్ టెన్నిస్ కోర్ట్ లాగా కుడి, ఎడమ సర్వీస్ కోర్ట్లతో పాటు నెట్ ముందు 7-అడుగుల నాన్-వాలీ జోన్ కలిగి ఉంటుంది. పికిల్‌బాల్ రూల్స్.. ఆడే విధానం: ►అండర్హ్యాండ్ సర్వ్‌ని మాత్రమే ఉపయోగించాలి ►సర్వ్, రిటర్న్ ఆఫ్ సర్వ్ రెండూ తప్పనిసరిగా బౌన్స్ కావాలి. ►సర్వ్ చేజే జట్టు మాత్రమే పాయింట్లను స్కోర్ చేయగలదు. ►పాయింట్ గెలిచిన తర్వాత సర్వ్ చేసే బృందం తప్పనిసరిగా తమ దిశను మార్చుకోవాలి ►సర్వర్ చేయడానికి ముందు సర్వర్ బిగ్గరగా స్కోర్‌ని పిలవాలి ►నాన్-వాలీ జోన్‌తో సంప్రదింపులు జరుపుతున్నప్పుడు వాలీలు అనుమతించబడవు. ►నాన్-వాలీ జోన్లో పికిల్‌బాల్ బౌన్స్ అయిన తర్వాతే షాట్లు కొట్టడానికి అనుమతి ఉంటుంది ►పికిల్‌బాల్ ఎక్కడా తగిలినా (మణికట్టు క్రింద కాకుండా)..అప్పుడు ర్యాలీని కోల్పోయే అవకాశం ఉంటుంది.