క్రికెట్, ఫుట్‌బాల్, టెన్నిస్.. ఇలా చెప్పుకుంటే పోతే చాలా క్రీడలు ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యాయి.యూరోపియన్ దేశాల్లో ఫుట్‌బాల్‌కు అత్యంత ఆదరణ ఉంటే.. ఆసియా ఖండంలో క్రికెట్‌కు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఇక అమెరికా, న్యూజిలాండ్ లాంటి దేశాల్లో రగ్బీ, బాస్కెట్‌బాల్ క్రీడలకు ఉండే ఆదరణ గురించి చెప్పనవసరం లేదు. మొత్తానికి ఫుట్‌బాల్, క్రికెట్, టెన్నిస్ సహా ఇతర క్రీడలు ఇవాళ విశ్వవ్యాప్తంగా ఆదరణకు నోచుకుంటున్నాయి. అయితే మనకు తెలియని క్రీడలు చాలానే ఉన్నాయి.
ఒక క్రీడాభిమానిగా వాటి గురించి తెలుసుకోవాలనే కుతూహలం తప్పకుంటా ఉంటుంది. తాజాగా అమెరికాలో పికిల్‌బాల్ అనే క్రీడకు ప్రస్తుతం యమా క్రేజ్ ఉంది. అక్కడ ఇప్పుడు పికిల్‌బాల్ దూసుకెళ్తుంది. పిల్లల నుంచి పెద్దవాళ్ల దాకా ఈ పికిల్‌బాల్ క్రీడపై విపరీతమైన ఆదరణ కనబరుస్తున్నారు. పికిల్‌బాల్ చూడడానికి అచ్చం టెన్నిస్ ఆటలాగే ఉన్నప్పటికి ఇందులో ఉండే రూల్స్ వేరు. బంతి కొట్టే విధానం నుంచి బ్యాట్ పట్టుకునే విధానం వరకు.. షాట్స్, సర్వ్ చేసే తీరులో కూడా చాలా మార్పులు ఉన్నాయి.
అసలు పికిల్‌బాల్ అంటే ఏంటి?
పికిల్‌బాల్ ఇప్పుడు పుట్టిన క్రీడ మాత్రం కాదు. చాలా ఏళ్ల క్రితమే అమెరికాలోని వాషింగ్టన్‌లో ఉండే బెయిన్‌బ్రిడ్జ్ ఐలాండ్‌కు చెందిన ఒక కుటుంబం పికిల్‌బాల్‌ను కనిపెట్టింది. టెన్నిస్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్ కలగలిపి ఆడే క్రీడ పికిల్‌బాల్. కాగా పికిల్‌బాల్ కోర్టు టెన్నిస్ కోర్టు కంటే కాస్త చిన్నగా ఉంటుంది.
పాడిల్ రూపంలో రాకెట్.. బంతి చుట్టూ హోల్స్..
పికిల్ బాల్ స్పోర్ట్స్‌ను ఇండోర్, ఔట్‌డోర్ గేమ్స్‌లో ఆడే అవకాశం ఉంటుంది. టెన్నిస్ రాకెట్‌లా కాకుండా పాడిల్‌ను(చిన్న రాకెట్) ఉపయోగిస్తారు. ఇక ప్లాస్టిక్ పదార్థంతో తయారయ్యే పికెల్ బాల్‌పై చుట్టూ హోల్స్ ఉంటాయి. ఈ రెండింటితో పాటు నెట్, మంచి గ్రౌండ్ అందుబాటులో ఉండాల్సిందే. ఇక పికిల్‌బాల్ కోర్ట్ డబుల్స్ బ్యాడ్మింటన్ కోర్ట్‌తో సమానంగా ఉంటుంది. 20×44 అడుగుల కొలతలు కలిగి ఉంటుంది. నికర ఎత్తు సైడ్‌లైన్‌లో 36 అంగుళాలు..మధ్యలో 34 అంగుళాలు పొడవు. కోర్ట్ టెన్నిస్ కోర్ట్ లాగా కుడి, ఎడమ సర్వీస్ కోర్ట్‌లతో పాటు నెట్ ముందు 7-అడుగుల నాన్-వాలీ జోన్ కలిగి ఉంటుంది.
పికిల్‌బాల్ రూల్స్.. ఆడే విధానం:
►అండర్‌హ్యాండ్ సర్వ్‌ని మాత్రమే ఉపయోగించాలి
►సర్వ్, రిటర్న్ ఆఫ్ సర్వ్ రెండూ తప్పనిసరిగా బౌన్స్ కావాలి.
►సర్వ్ చేజే జట్టు మాత్రమే పాయింట్లను స్కోర్ చేయగలదు.
►పాయింట్ గెలిచిన తర్వాత సర్వ్ చేసే బృందం తప్పనిసరిగా తమ దిశను మార్చుకోవాలి
►సర్వర్ చేయడానికి ముందు సర్వర్ బిగ్గరగా స్కోర్‌ని పిలవాలి
►నాన్-వాలీ జోన్‌తో సంప్రదింపులు జరుపుతున్నప్పుడు వాలీలు అనుమతించబడవు.
►నాన్-వాలీ జోన్‌లో పికిల్‌బాల్ బౌన్స్ అయిన తర్వాతే షాట్‌లు కొట్టడానికి అనుమతి ఉంటుంది
►పికిల్‌బాల్ ఎక్కడా తగిలినా (మణికట్టు క్రింద కాకుండా)..అప్పుడు ర్యాలీని కోల్పోయే అవకాశం ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment