ప్లేయర్‌గా మారిన సమంత.. ప్రాక్టీస్‌ మొదలు పెట్టేసింది! | Samantha Practice Pickle Ball Game at Court Video Goes Viral | Sakshi
Sakshi News home page

కోర్టులో సమంత సందడి.. ప్రాక్టీస్‌ చేస్తూ.. డ్యాన్స్‌ కూడా!

Aug 28 2024 7:07 AM | Updated on Aug 28 2024 9:23 AM

Samantha Practice Pickle Ball Game at Court Video Goes Viral

టాలీవుడ్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సిటాడెల్: హనీ బన్నీ వెబ్‌ సిరీస్‌లో నటిస్తున్నారు. ఈ సిరీస్‌లో వరుణ ధావన్‌ సరసన నటిస్తున్నారు. ఇటీవల తాను ఓ ఫ్రాంజైజీని కొనుగోలు చేసినట్లు వెల్లడించింది. క్రీడారంగంలోకి ఎంట్రీ ఇస్తున్నట్లు వెల్లడించింది. వరల్డ్‌ పికిల్ బాల్‌ లీగ్‌లో చెన్నై ఫ్రాంచైజీని కొనుగోలు చేసినట్లు తెలిపింది. ఈ లీగ్‌లో తాను చెన్నై ఫ్రాంచైజీ యజమానిగా ఉన్నందుకు సంతోషంగా ఉందని పోస్ట్ చేసింది.

తాజాగా పికిల్‌ బాల్ లీగ్‌లో సందడి చేసింది. బ్యాట్ చేత పట్టుకుని ప్లేయర్‌గా ఆడుతూ కనిపించింది. పికిల్‌ బాల్‌ ఆడుతూ డ్యాన్స్ ‍చేస్తూ ఆటను ఎంజాయ్ చేస్తోంది. దీనికి సంబంధించిన వీడియోను సమంత తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. కొద్దిరోజుల క్రితమే బిగ్ సర్‌ప్రైజ్‌ అంటూ ఈ లీగ్‌ పార్ట్‌నర్‌గా అడుగుపెడుతున్న సామ్ తన అభిమానులతో పంచుకున్న సంగతి తెలిసిందే. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement