అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) తాజాగా క్రీడా టోర్నీతో ఆకట్టుకుంది. ఇటీవలి కాలంలో అమెరికా అంతటా ఆట అత్యంత ప్రాచుర్యం పొందుతున్న పికిల్ బాల్ టోర్నమెంట్ను నిర్వహించింది. అట్లాంట నాట్స్ విభాగం పురుషుల, మహిళల విభాగాల్లో ఈ టోర్నీని నిర్వహించగా.. మొత్తం 52 జట్లు పోటీ పడ్డాయి.
ఇక అట్లాంట తెలుగు సంఘాల చరిత్రలోనే ఇంత భారీ స్థాయిలో నిర్వహించిన పికిల్ బాల్ టోర్నమెంట్ ఇదే మొదటిది కావడం విశేషం. కాగా నాట్స్ అట్లాంటలో ఆవిర్భించిన తొలినాళ్లలోనే ఇంత పెద్ద టోర్నమెంట్లను దిగ్విజయంగా నిర్వహించడంపై స్థానిక తెలుగు క్రీడాకారులు ప్రశంసల వర్షం కురిపించారు.
ఈ టోర్నమెంట్ల విజయంలో నాట్స్ సభ్యులు, వాలంటీర్ల పాత్ర మరువలేనిదని నాట్స్ అట్లాంట చాప్టర్ కో ఆర్డినేటర్ వెంకట కృష్ణ మాలపాటి కొనియాడారు. టోర్నీ ఇంతటి ఘన విజయం సాధించటం సంతోషంగా ఉందన్నారు. ఇదే స్ఫూర్తితో అట్లాంటలో నాట్స్ సేవా, సాంస్కృతిక, క్రీడా కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు.
ఇక టోర్నమెంట్ల ముగింపు కార్యక్రమంలో నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ సురేష్ పెద్ది, అట్లాంటా చాప్టర్ జాయింట్ కోఆర్డినేటర్ రజిని మాదాల, చాప్టర్ సెక్రటరీ నాగరాజు మంతెన, దుష్యంత్ నర్రావుల, శ్రీనివాసరావు యడ్లపల్లి, గౌతమ్ రెడ్డి గాదిరెడ్డి, శిల్పా కోనేరు, శశిధర్ ఉప్పల, రంజిత్ కుమార్ గుజ్జర్లపూడి, హితేష్ చింత, రేష్మా ఫర్హీన్, అభిలాష్ ఏడుపుగంటి, విద్య కాట్రగడ్డ, శశాంక్ చదలవాడ, లోహిత్ మంతెన తదితరులు పాల్గొన్నారు.
ఈ పికిల్ బాల్ టోర్నమెంట్లలో 52 జట్లు వివిధ కేటగిరీల్లో పోటీ పడగా.. అడ్వాన్స్ క్యాటగిరిలో ఏసెస్ జట్టు విజయం సాధించింది. పికిల్ టిక్లర్స్ జట్టు రన్నరప్‌గా నిలిచింది. బిగినర్స్, ఇంటర్మీడియట్ కేటగిరి నుండి ఎన్.సి.టి టీం విజేతగా, బ్రూక్ వ్యూ బ్రదర్స్ జట్టు రన్నరప్‌గా నిలిచింది.. అలాగే సెమీ-ఫైనల్ రన్నరప్ క్యాటగిరి నుండి రాయల్ చాలెంజర్స్ జట్టు విజేతగా మౌంటైన్‌క్రస్ట్ మాన్ట్సర్స్ జట్టు రన్నప్‌గా నిలిచాయి.
పికిల్ బాల్ టోర్నమెంట్లను అద్భుతంగా నిర్వహించిన అట్లాంట చాప్టర్ జట్టుని నాట్స్ సలహా మండలి సభ్యులు సతీష్ ముసునూరి, శ్రీకాంత్ వల్లభనేని, హరి కరియావుల ప్రశంసించారు.. చాప్టర్ కోఆర్డినేటర్ వెంకట కృష్ణ మాలపాటి, శశి ఉప్పల, హితేష్ చింత, రంజిత్ గుజ్జర్లపూడి, స్పోర్ట్స్ టీం నుండి శ్రీనివాస్ ఎడ్లవల్లి, గౌతం రెడ్డి గాదిరెడ్డి తదితరులు చేసిన కృషిని వారు ప్రత్యేకంగా అభినందించారు.
పికిల్‌బాల్ టోర్నమెంట్ల నిర్వహణకు ప్రోత్సాహం అందించిన నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని,నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటికి అట్లాంటా చాప్టర్ టీం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. ఈ టోర్నమెంట్లు విజయవంతం కావటంలో తమ వంతు సహాయం అందించిన నాట్స్ సెక్రటరీ రాజేష్ కండ్రు, నాట్స్ ఈసీ వెబ్ టీం నుండి రవికిరణ్ తుమ్మల, నాట్స్ ఈసీ మీడియా టీం నుండి మురళి మేడిచర్ల, కిషోర్ నారె, సంకీర్త్ కటకం లకు అట్లాంట నాట్స్ విభాగం ధన్యవాదాలు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment