north america telugu society
-
డల్లాస్‌లో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్ టోర్నీ
అమెరికాలో తెలుగు వారిని ఒక్కటి చేసే విధంగా నాట్స్ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే నాట్స్ డల్లాస్ విభాగం గాంధీ జయంతి పురస్కరించుకుని వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించింది. డల్లాస్‌లో నాట్స్ నిర్వహించిన ఈ 16వ వాలీబాల్ టోర్నమెంట్‌కు మంచి స్పందన లభించింది. దసరా పండుగ రోజు దాదాపు 200 మంది వాలీబాల్ ప్లేయర్స్ ఈ టోర్నీలో పాల్గొన్ని క్రీడా స్ఫూర్తిని చాటారు.డల్లాస్ చాప్టర్ క్రీడా కోఆర్డినేటర్లు గౌతమ్ కాశిరెడ్డి, విజయ్ బల్లా తమ అపార అనుభవం, ప్రతిభాపాటవాలు రంగరించి ప్రణాళిక నుండి కార్యాచరణ వరకు టోర్నీని దిగ్విజయం చేశారు. నాట్స్ మాజీ అధ్యక్షులు బాపు నూతి, నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ రాజేంద్ర మాదాల అందించిన మద్దత్తు దిశానిర్దేశం వల్ల తమ మొదటి కార్యక్రమం ఇంత విజయవంతం అయిందని నాట్స్ డల్లాస్ చాప్టర్ కోఆర్డినేటర్ స్వప్న కాట్రగడ్డ తెలిపారు. అందరి క్రీడా స్ఫూర్తి వల్ల నాట్స్ డల్లాస్ చాప్టర్ సభ్యులకు ఈ టోర్నమెంట్ మరిచిపోలేని అనుభవంగా మిగిలిందని, మరిన్ని మంచి కార్యక్రమాలు చేయటానికి ప్రోత్సాహం ఇచ్చిందని డల్లాస్ చాప్టర్ జాయింట్ కోఆర్డినేటర్ శ్రావణ్ నిడిగంటి అన్నారు.నాట్స్ డల్లాస్ 16వ వాలీబాల్ టోర్నమెంట్లో పాల్గొన్న క్రీడాకారులను, సహకరించిన వాలంటీర్స్, వారిని ప్రోత్సహించడానికి వచ్చిన వారి స్నేహితులు, కుటుంబ సభ్యులకు డల్లాస్ చాప్టర్ టీం తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.ఈ టోర్నమెంట్లో తలపడిన జట్లని రెండు విభాగాలుగా విభజించారు. ప్రో కేటగిరీ విభాగంలో విజేతలుగా వాలీ వోల్ఫ్స్ జట్టు, రన్నర్స్ గా వజ్రాస్ జట్టు నిలిచాయి. అలానే, అడ్వాన్స్డ్ విభాగంలో విజేతలుగా వికింగ్స్ జట్టు నిలవగా, రన్నర్స్ గా వాలీ డూడ్స్ జట్టు నిలిచింది.విజేతలకు, రన్నర్స్ కు ఈ టోర్నమెంట్ లో పాల్గొన్న నాట్స్ నాయకులు బహుమతి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా నాట్స్ మాజీ అధ్యక్షులు బాపు నూతి,నాట్స్ బోర్డ్ డైరెక్టర్ రాజేంద్ర మాదాలలు ఈ టోర్నమెంట్ లో పాల్గొన్న విద్యార్థులు , యువతతో కూడిన జట్టులను ప్రత్యేకంగా అభినందించారు. అలాగే పెద్దవారితో పోటీపడి అత్యంత ప్రతిభని ప్రదర్శించిన 8వ తరగతి విద్యార్థి కార్తీక్ కు ప్రత్యేక గుర్తింపునిస్తూ గిఫ్ట్ కార్డుని బహుమతిగా ఇవ్వడం జరిగింది.ఇక ఈ టోర్నమెంటు నిర్వహణలో నాట్స్ డల్లాస్ చాప్టర్ టీం నుండి గౌతమ్ కాశిరెడ్డి, విజయ్ బల్లా, స్వప్న కాట్రగడ్డ, శ్రావణ్ నిడిగంటిలతో పాటు జాతీయ కార్యవర్గ సభ్యులు రవి తాండ్ర మరియు కిషోర్ నారెలు, డల్లాస్ చాప్టర్ సభ్యులు శ్రీధర్ విన్నమూరి, పవన్ కొతారు, త్రినాథ్ పెద్ది, వంశీ వేణాటి, కావ్య, బద్రి బియ్యపు,ఇతర సభ్యులు తమ వంతు సహకారాన్ని అందించారు.ఇదే విధంగా భవిష్యత్తులో మరెన్నో సాంసృతిక మరియు క్రీడా కార్యక్రమాలకు చేపట్టబోతున్నామని డల్లాస్ చాప్టర్ టీం తెలిపింది. ఈ టోర్నమెంట్ కు సహకరించిన దాతలు స్వాగత్ బిర్యానీస్, వేల్యూ ఫైనాన్సియల్ సర్వీసెస్, ఆర్కా చిల్డ్రన్స్ అకాడమి, హింద్ సైట్, కోపెల్ చెస్ క్లబ్, మరియు ఫార్మ్2కుక్ లకు డల్లాస్ చాప్టర్ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.ఈ వాలీబాల్ టోర్నమెంట్ విజయవంతం చేసినందుకు నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షులు మదన్ పాములపాటి డల్లాస్ టీంకి ప్రత్యేక అభినందనలు తెలిపారు. -
అట్లాంటాలో దిగ్వియంగా నాట్స్ పికిల్ బాల్ టోర్నీలు
అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) తాజాగా క్రీడా టోర్నీతో ఆకట్టుకుంది. ఇటీవలి కాలంలో అమెరికా అంతటా ఆట అత్యంత ప్రాచుర్యం పొందుతున్న పికిల్ బాల్ టోర్నమెంట్‌ను నిర్వహించింది. అట్లాంట నాట్స్ విభాగం పురుషుల, మహిళల విభాగాల్లో ఈ టోర్నీని నిర్వహించగా.. మొత్తం 52 జట్లు పోటీ పడ్డాయి.ఇక అట్లాంట తెలుగు సంఘాల చరిత్రలోనే ఇంత భారీ స్థాయిలో నిర్వహించిన పికిల్ బాల్ టోర్నమెంట్ ఇదే మొదటిది కావడం విశేషం. కాగా నాట్స్ అట్లాంటలో ఆవిర్భించిన తొలినాళ్లలోనే ఇంత పెద్ద టోర్నమెంట్లను దిగ్విజయంగా నిర్వహించడంపై స్థానిక తెలుగు క్రీడాకారులు ప్రశంసల వర్షం కురిపించారు. ఈ టోర్నమెంట్ల విజయంలో నాట్స్ సభ్యులు, వాలంటీర్ల పాత్ర మరువలేనిదని నాట్స్ అట్లాంట చాప్టర్ కో ఆర్డినేటర్ వెంకట కృష్ణ మాలపాటి కొనియాడారు. టోర్నీ ఇంతటి ఘన విజయం సాధించటం సంతోషంగా ఉందన్నారు. ఇదే స్ఫూర్తితో అట్లాంటలో నాట్స్ సేవా, సాంస్కృతిక, క్రీడా కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు.ఇక టోర్నమెంట్ల ముగింపు కార్యక్రమంలో నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ సురేష్ పెద్ది, అట్లాంటా చాప్టర్ జాయింట్ కోఆర్డినేటర్ రజిని మాదాల, చాప్టర్ సెక్రటరీ నాగరాజు మంతెన, దుష్యంత్ నర్రావుల, శ్రీనివాసరావు యడ్లపల్లి, గౌతమ్ రెడ్డి గాదిరెడ్డి, శిల్పా కోనేరు, శశిధర్ ఉప్పల, రంజిత్ కుమార్ గుజ్జర్లపూడి, హితేష్ చింత, రేష్మా ఫర్హీన్, అభిలాష్ ఏడుపుగంటి, విద్య కాట్రగడ్డ, శశాంక్ చదలవాడ, లోహిత్ మంతెన తదితరులు పాల్గొన్నారు.ఈ పికిల్ బాల్ టోర్నమెంట్లలో 52 జట్లు వివిధ కేటగిరీల్లో పోటీ పడగా.. అడ్వాన్స్ క్యాటగిరిలో ఏసెస్ జట్టు విజయం సాధించింది. పికిల్ టిక్లర్స్ జట్టు రన్నరప్‌గా నిలిచింది. బిగినర్స్, ఇంటర్మీడియట్ కేటగిరి నుండి ఎన్.సి.టి టీం విజేతగా, బ్రూక్ వ్యూ బ్రదర్స్ జట్టు రన్నరప్‌గా నిలిచింది.. అలాగే సెమీ-ఫైనల్ రన్నరప్ క్యాటగిరి నుండి రాయల్ చాలెంజర్స్ జట్టు విజేతగా మౌంటైన్క్రస్ట్ మాన్ట్సర్స్ జట్టు రన్నప్‌గా నిలిచాయి.పికిల్ బాల్ టోర్నమెంట్లను అద్భుతంగా నిర్వహించిన అట్లాంట చాప్టర్ జట్టుని నాట్స్ సలహా మండలి సభ్యులు సతీష్ ముసునూరి, శ్రీకాంత్ వల్లభనేని, హరి కరియావుల ప్రశంసించారు.. చాప్టర్ కోఆర్డినేటర్ వెంకట కృష్ణ మాలపాటి, శశి ఉప్పల, హితేష్ చింత, రంజిత్ గుజ్జర్లపూడి, స్పోర్ట్స్ టీం నుండి శ్రీనివాస్ ఎడ్లవల్లి, గౌతం రెడ్డి గాదిరెడ్డి తదితరులు చేసిన కృషిని వారు ప్రత్యేకంగా అభినందించారు.పికిల్‌బాల్ టోర్నమెంట్ల నిర్వహణకు ప్రోత్సాహం అందించిన నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని,నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటికి అట్లాంటా చాప్టర్ టీం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. ఈ టోర్నమెంట్లు విజయవంతం కావటంలో తమ వంతు సహాయం అందించిన నాట్స్ సెక్రటరీ రాజేష్ కండ్రు, నాట్స్ ఈసీ వెబ్ టీం నుండి రవికిరణ్ తుమ్మల, నాట్స్ ఈసీ మీడియా టీం నుండి మురళి మేడిచర్ల, కిషోర్ నారె, సంకీర్త్ కటకం లకు అట్లాంట నాట్స్ విభాగం ధన్యవాదాలు తెలిపింది. -
న్యూజెర్సీలో విజయవంతంగా నాట్స్ పికిల్‌బాల్ టోర్నీ
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) తెలుగు వారిలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు న్యూజెర్సీలో తాజాగా పికిల్ బాల్ టోర్నమెంట్ నిర్వహించింది. ఇందులో 30 జట్లు పాల్గొన్నాయి. వీటిని నాలుగు గ్రూపులుగా విభజించి నిర్వహించిన ఈ మ్యాచ్‌ల్లో.. 16 టీమ్‌లు నాకౌట్ మ్యాచ్‌లకు అర్హత సాధించాయి. తరువాతి రౌండ్లలో 8 జట్లు పోటీ పడ్డాయి. చివరకు నాలుగు జట్లు సెమీ ఫైనల్స్ ఆడాయి.విజేత చెస్టర్‌ఫీల్డ్ అద్భుత ప్రదర్శనతో ఈ టోర్నీ ఫైనల్‌కు చేరుకున్న మన్రో, చెస్టర్‌ఫీల్డ్ జట్ల మధ్య ఆఖరి మ్యాచ్ మరింత రసవత్తరంగా సాగింది. ఈ ఆసక్తికర పోరులో చెస్టర్‌ఫీల్డ్ జట్టు విజేతగా నిలవగా... మన్రో జట్టు రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఇక తుది పోరులో నిలిచిన విన్నర్, రన్నర్ అప్ టీమ్‌లకు నాట్స్ నాయకులు ట్రోఫీలు, బహుమతులు అందించారు. టోర్నమెంట్లో అత్యుత్తమ ప్రదర్శన చేసి తొలి స్థానంలో నిలిచిన వంశీ కొండరాజు, నాగరాజు ఆకారపు, రెండవ స్థానంలో నిలిచిన మౌర్య యలమంచిలి, కీర్తన సంగం, మూడవ స్థానంలో తన్మయ్ షా, రాజా శశాంక్ ముప్పిరాలను నాట్స్ నాయకులు ప్రత్యేకంగా అభినందించారు. వారికి బహుమతులు అందించారు.న్యూజెర్సీ విభాగానికి అభినందనలుఈ కార్యక్రమంలో నాట్స్ మాజీ అధ్యక్షులు మోహన కృష్ణ మన్నవ, గంగాధర్ దేసు, నాట్స్ మాజీ చైర్ వుమెన్ అరుణ గంటి, నాట్స్ బోర్డ్ డైరెక్టర్ బిందు యలమంచిలి పాల్గొని ఆటగాళ్లను ప్రోత్సహించారు. వారిలో క్రీడా స్ఫూర్తి పట్ల ప్రశంసల వర్షం కురిపించారు. నాట్స్ పికిల్ బాల్ టోర్నమెంట్ విజయవంతంగా నిర్వహించిన నాట్స్ న్యూజెర్సీ విభాగాన్ని అభినందించారు. ఈ టోర్నమెంట్ విజయవంతం కావడంలో నాట్స్ న్యూజెర్సీ చాప్టర్ ఈవెంట్స్ ఎగ్జిక్యూషన్ కో-ఛైర్ క్రాంతి యడ్లపూడి, నాట్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీహరి మందాడిలు కీలక పాత్ర పోషించారు.ఈ టోర్నమెంట్ నిర్వహణలో న్యూజెర్సీ చాప్టర్ కో ఆర్డినేటర్ మోహన్ కుమార్ వెనిగళ్ల, జాయింట్ కో ఆర్డినేటర్ ప్రసాద్ టేకి, వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ భీమినేని, నాట్స్ మార్కెటింగ్ నేషనల్ కో ఆర్డినేటర్ కిరణ్ మందాడి, నాట్స్ నార్త్ ఈస్ట్ జోనల్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మెంట, నాట్స్ న్యూజెర్సీ టీమ్ రమేష్ నూతలపాటి, వంశీ వెనిగళ్ల , చంద్రశేఖర్ కొణిదెల, విష్ణు ఆలూరు, రాజేష్ బేతపూడి, వెంకటేష్ కోడూరి, శ్రీనివాస్ చెన్నూరి, శ్రీకాంత్ పొనకల, రమేష్ నెలూరి, కృష్ణ గోపాల్ నెక్కంటి, బ్రహ్మానందం పుసులూరి, ప్రశాంత్ కూచు, ప్రసూన మద్దాలి, ప్రణీత పగిడిమరి, రవి తుబాటి, శంకర్ జెర్రిపోతుల, శ్రీనివాస్ నీలం, సుకేష్ సుబ్బాని, గోపాల్ రావు చంద్ర, వెంకట్ గోనుగుంట. కృష్ణ సాగర్ రాపర్ల, రామకృష్ణ బోను, హరీష్ కొమ్మాలపాటి తదితరులు చేసిన కృషి విజయానికి దోహదపడింది. ఈ టోర్నమెంట్ దిగ్విజయం చేయడంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికి నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. -
చికాగోలో దిగ్విజయంగా నాట్స్ క్రికెట్ టోర్నమెంట్
చికాగో: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) చికాగోలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించింది. ఈ టోర్నమెంట్లో దాదాపు 150 మందికి పైగా క్రికెటర్లు తమ ప్రతిభను చాటేందుకు పోటీపడ్డారు. ఇక ఈ టోర్నీలో ఎస్ఆర్కె జట్టు చాంపియన్‌గా నిలిచింది. టోర్నమెంట్ ఆసాంతం అద్భుతంగా ఆడిన ఆటగాళ్లను, రన్నరప్‌గా నిలిచిన లయన్స్ టీంను నాట్స్ అధ్యక్షులు మదన్ పాములపాటి అభినందించారు.అదే విధంగా.. నాట్స్ చికాగో విభాగం ఈ క్రికెట్ టోర్నమెంట్‌ను చక్కగా నిర్వహించినందుకు నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేనికి, ఇందులో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. నాట్స్ కార్యవర్గ సభ్యుడు శ్రీహరీష్ జమ్ముల, చికాగో చాప్టర్ సమన్వయకర్త వీర తక్కెళ్లపాటి లు చక్కటి ప్రణాళిక, సమన్వయంతో ఈ టోర్నమెంట్ నిర్వహించారని స్థానిక తెలుగు వారి నుంచి ప్రశంసలు లభించాయి.కాగా ఈ టోర్నమెంట్ నిర్వహణలో చికాగో చాప్టర్ టీమ్ నుంచి నరేంద్ర కడియాల, అంజయ్య వేలూరు, చెన్నయ్య కంబాల, నవీన్ జరుగుల, సింధు కంఠంనేని, గ్రహిత బొమ్మిరెడ్డి, ప్రియాంక పొన్నూరు తదితరులు కీలక పాత్ర పోషించినందుకు నాట్స్ నాయకత్వం వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. నాట్స్ బోర్డ్ డైరెక్టర్ శ్రీనివాస్ పిడికిటి, నాట్స్ కార్యవర్గ సభ్యులు ఆర్కే బాలినేని, ఇమ్మాన్యుయేల్ నీల, నాట్స్ మాజీ కార్యవర్గ సభ్యుడు కృష్ణ నిమ్మగడ్డ, నాట్స్ మాజీ బోర్డ్ డైరెక్టర్లు మూర్తి కొప్పాక, శ్రీనివాస్ అరసాడ, శ్రీనివాస్ బొప్పన లు ఈ టోర్నమెంట్ విజయానికి తమ వంతు సహకారం అందించారు.సతీష్ త్రిపురనేని, పాండు చెంగలశెట్టి, అరవింద్ కోగంటి, సంతోష్ పిండి, సునీల్ ఆకులూరి, సునీల్ ఆరుమిల్లి, అరుల్ బాబు, వినోద్ బాలగురు, గోపి ఉలవ, శ్రీనివాస్ పిల్ల, సుమంత్ పోపూరి, సాయి, హరి, నాగ తదితర వాలంటీర్లు ఈ టోర్నమెంట్ విజయానికి కృషి చేసినందుకు నాట్స్ వారిని ప్రత్యేకంగా అభినందించింది. ఈ టోర్నమెంట్లో విజేతలకు నాట్స్ అధ్యక్షులు మదన్ పాములపాటి, నాట్స్ మాజీ బోర్డ్ డైరెక్టర్ శ్రీనివాస్ అరసాడ టోర్నమెంట్ విజేతలకు, రన్నర్లకు ట్రోఫీలను అందజేశారు. -
తెలుగు జాతి ఆత్మగౌరవం చాటాలి
నాట్స్ సభలో నటుడు బాలకృష్ణ లాస్ ఏంజెలిస్ నుంచి సాక్షి ప్రతినిధి: నాట్స్ (నార్త్ అమెరికా తెలుగు సొసైటీ) సభలు రెం డో రోజూ వైభవంగా జరిగాయి. సభకు ముఖ్య అతిథిగా హాజరైన సినీనటుడు నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ తరతరాల చరిత్ర కలి గిన తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచం నలుమూలలా చాటిచెప్పాలని, తెలుగు భాష తీయదనాన్ని ప్రపంచ ప్రజలు గుర్తించేటట్లు చేయాలని పిలుపునిచ్చారు. అమెరికాలో ప్రవా స తెలుగువారు వివిధ రంగాల్లో ముందుకు దూసుకెళ్ళడం సంతోషించదగ్గ పరిణామమన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి తరుణమని, ప్రవాసాంధ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నాట్స్ ఆధ్వర్యంలో అమెరికా, భారత్‌లో చేపడుతున్న సేవా కార్యక్రమాలను కొనియాడారు. పారిశ్రామికవేత్త గ్రంధి మల్లికార్జునరావు (బీఎంఆర్), హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నూతి రామమోహన్రావులు ముఖ్య అతిథులుగా వ్యాపార సదస్సు జరిగింది. మెగా ఇంజనీర్ కంపెనీ అధినేత పి.పి.రెడ్డి, మా టీవీ అధినేత నిమ్మగడ్డ ప్రసాద్, పారిశ్రామికవేత్తలు ఎన్టీ చౌదరి, ఏవీఆర్ చౌదరి, రాజురెడ్డి తదితరులు ఈ సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వ్యాపార వాణిజ్య రంగానికి సంబంధించిన స్టాళ్ల వద్ద ప్రవాసులు సందడి చేస్తున్నారు. -
ఏఎన్నార్ మృతికి నాట్స్ సంతాపం
అమెరికా: తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డ, మహానటుడు, నటసామ్రాట్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు మృతి పట్ల ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) ప్రగాఢ సంతాపం తెలిపింది. కృష్ణా జిల్లా వెంకటరాఘవాపురంలో సెప్టెంబర్ 20, 1924న ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన ఆయన మే 8, 1944లో సినీ నటుడిగా అరంగేట్రం చేసి, తన తుది శ్వాస విడిచే వరకు అవిశ్రాంతంగా నటిస్తునే ఉన్నారని తెలిపింది. ఆయన సినీ ప్రస్థానంలో సుమారు 256 పైగా చిత్రాలలో హీరోగా, పౌరాణిక,జానపద, సాంఘిక,సామాజిక పాత్రలలో నటించారని పేర్కొంది. ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే, రఘుపతి వెంకయ్య , ఎన్టీఆర్ జాతీయ అవార్డు, పద్మ విభూషణ్ తదితర పురస్కారాలను ఏఎన్నార్ అందుకున్నారని నాట్స్ వెల్లడించింది. తన నటనతో తెలుగువారి గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న అక్కినేని నాగేశ్వరరావు మరణం.. అమెరికాలోని తెలుగువారిని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని నాట్స్ అధ్యక్షుడు గంగాధర్ దేసు శుక్రవారం వెల్లడించారు. అక్కినేని మరణించారన్నా వార్తా ఇప్పటికీ తాము జీర్ణించుకో లేక పోతున్నామన్నారు. ఈ సందర్బంగా అక్కినేని కుటుంబానికి నాట్స్ ప్రగాఢ సానుభూతిని తెలుపుతుందని గంగాధర్ దేసు తెలిపారు.