తెలుగు జాతి ఆత్మగౌరవం చాటాలి | Knots in the House actor Balakrishna | Sakshi
Sakshi News home page

తెలుగు జాతి ఆత్మగౌరవం చాటాలి

Published Sun, Jul 5 2015 1:44 AM | Last Updated on Wed, Aug 29 2018 1:59 PM

తెలుగు జాతి ఆత్మగౌరవం చాటాలి - Sakshi

తెలుగు జాతి ఆత్మగౌరవం చాటాలి

నాట్స్ సభలో నటుడు బాలకృష్ణ
 
లాస్ ఏంజెలిస్ నుంచి సాక్షి ప్రతినిధి: నాట్స్ (నార్త్ అమెరికా తెలుగు సొసైటీ) సభలు రెం డో రోజూ వైభవంగా జరిగాయి. సభకు ముఖ్య అతిథిగా హాజరైన సినీనటుడు నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ తరతరాల చరిత్ర కలి గిన తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచం నలుమూలలా చాటిచెప్పాలని, తెలుగు భాష తీయదనాన్ని ప్రపంచ ప్రజలు గుర్తించేటట్లు చేయాలని పిలుపునిచ్చారు. అమెరికాలో ప్రవా స తెలుగువారు వివిధ రంగాల్లో ముందుకు దూసుకెళ్ళడం సంతోషించదగ్గ పరిణామమన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి తరుణమని, ప్రవాసాంధ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

నాట్స్ ఆధ్వర్యంలో అమెరికా, భారత్‌లో చేపడుతున్న సేవా కార్యక్రమాలను కొనియాడారు. పారిశ్రామికవేత్త గ్రంధి మల్లికార్జునరావు (బీఎంఆర్), హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నూతి రామమోహన్‌రావులు ముఖ్య అతిథులుగా వ్యాపార సదస్సు జరిగింది.  మెగా ఇంజనీర్ కంపెనీ అధినేత పి.పి.రెడ్డి, మా టీవీ అధినేత నిమ్మగడ్డ ప్రసాద్, పారిశ్రామికవేత్తలు ఎన్‌టీ చౌదరి, ఏవీఆర్ చౌదరి, రాజురెడ్డి తదితరులు ఈ సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వ్యాపార వాణిజ్య రంగానికి సంబంధించిన స్టాళ్ల వద్ద ప్రవాసులు సందడి చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement