చికాగోలో దిగ్విజయంగా నాట్స్ క్రికెట్ టోర్నమెంట్‌ | NATS Held Cricket Tournament In Chicago USA | Sakshi

చికాగోలో దిగ్విజయంగా నాట్స్ క్రికెట్ టోర్నమెంట్‌

Sep 5 2024 4:19 PM | Updated on Sep 5 2024 4:42 PM

NATS Held Cricket Tournament In Chicago USA

చికాగో: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) చికాగోలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించింది. ఈ టోర్నమెంట్‌లో దాదాపు 150 మందికి పైగా క్రికెటర్లు తమ ప్రతిభను చాటేందుకు పోటీపడ్డారు. ఇక ఈ టోర్నీలో ఎస్ఆర్కె  జట్టు చాంపియన్‌గా నిలిచింది. టోర్నమెంట్‌ ఆసాంతం అద్భుతంగా ఆడిన ఆటగాళ్లను, రన్నరప్‌గా నిలిచిన లయన్స్ టీంను నాట్స్ అధ్యక్షులు మదన్ పాములపాటి అభినందించారు.

అదే విధంగా.. నాట్స్ చికాగో విభాగం ఈ క్రికెట్ టోర్నమెంట్‌ను చక్కగా నిర్వహించినందుకు  నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేనికి, ఇందులో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. నాట్స్ కార్యవర్గ సభ్యుడు శ్రీహరీష్ జమ్ముల, చికాగో చాప్టర్ సమన్వయకర్త వీర తక్కెళ్లపాటి లు చక్కటి ప్రణాళిక, సమన్వయంతో ఈ టోర్నమెంట్ నిర్వహించారని స్థానిక తెలుగు వారి నుంచి ప్రశంసలు లభించాయి.

కాగా ఈ టోర్నమెంట్ నిర్వహణలో  చికాగో చాప్టర్ టీమ్ నుంచి నరేంద్ర కడియాల, అంజయ్య వేలూరు, చెన్నయ్య కంబాల, నవీన్ జరుగుల, సింధు కంఠంనేని, గ్రహిత బొమ్మిరెడ్డి, ప్రియాంక పొన్నూరు తదితరులు కీలక పాత్ర పోషించినందుకు  నాట్స్ నాయకత్వం వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. 

నాట్స్ బోర్డ్ డైరెక్టర్ శ్రీనివాస్ పిడికిటి,  నాట్స్ కార్యవర్గ సభ్యులు ఆర్కే బాలినేని, ఇమ్మాన్యుయేల్ నీల, నాట్స్ మాజీ కార్యవర్గ సభ్యుడు కృష్ణ నిమ్మగడ్డ, నాట్స్ మాజీ బోర్డ్ డైరెక్టర్లు మూర్తి కొప్పాక, శ్రీనివాస్ అరసాడ, శ్రీనివాస్ బొప్పన లు ఈ టోర్నమెంట్ విజయానికి తమ వంతు సహకారం అందించారు.

సతీష్ త్రిపురనేని, పాండు చెంగలశెట్టి, అరవింద్ కోగంటి, సంతోష్ పిండి, సునీల్ ఆకులూరి, సునీల్ ఆరుమిల్లి, అరుల్ బాబు, వినోద్ బాలగురు, గోపి ఉలవ, శ్రీనివాస్ పిల్ల, సుమంత్ పోపూరి, సాయి, హరి, నాగ తదితర వాలంటీర్లు ఈ టోర్నమెంట్ విజయానికి కృషి చేసినందుకు నాట్స్ వారిని ప్రత్యేకంగా అభినందించింది. ఈ టోర్నమెంట్‌లో విజేతలకు నాట్స్ అధ్యక్షులు మదన్ పాములపాటి, నాట్స్ మాజీ బోర్డ్ డైరెక్టర్ శ్రీనివాస్ అరసాడ టోర్నమెంట్ విజేతలకు, రన్నర్లకు ట్రోఫీలను అందజేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement