బీఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ ఆధ్వర్యంలో మెల్‌బోర్న్‌లో మూడు వారాల పాటు జరిగిన కేసీఆర్ క్రికెట్ కప్ టోర్నమెంట్ ఆదివారం(సెప్టెంబర్17)తో దిగ్విజయంగా ముగిసింది. జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని పురస్కరించుకుని మెల్బోర్న్ లోని అల్కాక్ రిజర్వ్ లోని పెవిలియన్ లో ఈ టోర్నీ ఫైనల్ మ్యాచ్‌ను నిర్వహించారు.
ఈ ఫైనల్ మ్యాచ్‌ను వీక్షించేందుకు పెద్ద ఎత్తున ఎన్నారైలు హాజరయ్యారు. ఈ సందర్భంగా బీ ఆర్ ఎస్ ఆస్ట్రేలియా శాఖ అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి మాట్లాడుతూ.. "ఆస్ట్రేలియాలో స్థిరపడిన 29 రాష్ట్రాలకు చెందిన ఎన్నారైలతో మూడు వారాల పాటు ఈ టోర్నీ ఘనంగా జరిగింది. టీఆర్ఎస్ నుండి బీఆర్ఎస్ కు మార్పు గల ముఖ్య ఉద్దేశాన్ని అందరికీ తెలియజేయాలని ఈ టోర్నమెంట్‌ను నిర్వహించామని" ఆయన తెలిపారు.
అదే విధంగా తెలంగాణా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది, సంక్షేమం పై విక్టోరియా స్టేట్ కన్వీనర్ ఉప్పు సాయిరాం చేసిన పవర్ ప్రెజెంటేషన్ పలువురిని ఆకట్టుకుంది. మరోవైపు కేసీఆర్ క్రికెట్ కప్ టోర్నీని విజయవంతంగా ముగించిన బీఆర్ఎస్ ఆస్ట్రేలియా బృందాన్ని పలువురు ప్రశంసించారు.
ముగింపు వేడుకల్లో బీఆర్‌ఎస్ ఆస్ట్రేలియా ముఖ్య నాయకులు సాయిరాం ఉప్పు, వినయ్ సన్నీ గౌడ్,సాయికృష్ణ కల్వకుంట్ల, ప్రవీణ్ లేదెళ్ల ,వంగపల్లి సురేందర్ రెడ్డి, విశ్వామిత్ర మంత్రి ప్రగడ , సూర్య రావు , అశోక్ ,రాకేష్ , అమిత్ , వినోద్ కత్తుల ,విజయ్ నడదూర్ , సతీష్ ,శివ హైదరాబాద్ , హరి పల్ల, కరుణాకర్ నందవరం ,వివిధ సంఘాల నాయకులు, ప్రవాస భారతీయులు పాల్గొన్నారు.
చదవండి: IND vs AUS: ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా.. షెడ్యూల్, ఆరంభ సమయం, జట్లు.. పూర్తి వివరాలివే
Comments
Please login to add a commentAdd a comment