అమెరికాలో తెలుగు విద్యార్థి అదృశ్యం కావడం కలకల రేపుతోంది. ఉన్నత విద్య కోసం చికాగో వెళ్లిన తెలంగాణకు చెందిన 25 ఏళ్ల రూపేష్ చంద్ర చింతకింది అదృశ్యం అయ్యాడు. అతని అచూకీ కోసం కుటుంబ సభ్యులు భారత రాయబార వర్గాలను సంప్రదించారు. చికాగోలోని ఎన్ షెరిడాన్ రోడ్ 4300 బ్లాక్ నుంచి అతను తప్పిపోయినట్లు తెలుస్తోంది. టెక్సాస్ నుండి కలవడానికి వచ్చిన ఒకరిని కలవబోతున్నాడని చెప్పినట్లు సమాచారం.
‘‘మే 2 మధ్యాహ్నం వాట్సాప్‌లో మాట్లాడాను. ఏదో పని మీద ఉన్నా అని చెప్పాడు. అంతే అప్పటినుంచి ఆఫ్‌లైన్‌లో ఉన్నాడు" రూపేష్ తండ్రి సదానందం
తెలంగాణలోని హన్మకొండకు చెందిన రూపేశ్ విస్కాన్సిన్ లోని కాంకార్డియా యూనివర్శిటీలో మాస్టర్స్ చదువుతున్నాడు. వారం రోజులుగా రూపేశ్ ఆచూకీ లభించకపోవడంతో హైదరాబాద్‌లోఉంటున్న అతని తల్లిదండ్రలు ఆందోళనకు గురయ్యారు. తమ కుమారుడి ఆచూకీ కనుగొనాలంటూ భారత విదేశాంగా శాఖను కోరింది. త్వరలోనే రూపేశ్ అచూకీ తెలుస్తుందని ఆశిస్తున్నామని చికాగోలోని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది.
The Consulate is deeply concerned learning that Indian student Rupesh Chandra Chintakindi is incommunicado since 2nd May. Consulate is in touch with the police and the Indian diaspora hoping to locate/reestablish contact with Rupesh.@IndianEmbassyUS @MEAIndia
— India in Chicago (@IndiainChicago) May 8, 2024
మే 2 నుంచి రూపేశ్ మిస్సయినట్లు చికాగోలోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా తెలిపింది. అతడి ఆచూకి కోసం పోలీసులు ప్రవాస భారతీయులతో నిరంతరం చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు. రూపేష్ ఆచూకీ తెలిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని స్థానిక పోలీసులు ప్రకటన విడుదల చేశారు.
Comments
Please login to add a commentAdd a comment