డాక్టర్ అన్న కోరికతో విదేశాలకు వెళ్లిన 20 ఏళ్ల యువతి అనూహ్య మరణం అనేక అనుమానాలకు తావిస్తోంది. తెలంగాణకు కెందిన స్నిగ్ధ వైద్య విద్య అభ్యసించ డానికి ఫిలిప్పీన్స్ వెళ్లింది. పుట్టినరోజు నాడే అనుమానాస్పదంగా మృతి చెందడంతో శోకసంద్రంలో మునిగిపోయింది.
పటాన్‌చెరు మండలం ఇంద్రేశం గ్రామంలో పంచాయతీ పరిధిలో నివాస ముంటున్నారు చింత అమృత్ రావు. మెదక్‌లోని ట్రాన్స్‌కో డీఈ అమృతరావు కుమార్తె స్నిగ్ధ రెండేళ్ల క్రితం ఎంబీబీఎస్ చేసేందుకు ఫిలిప్పీన్స్ వెళ్లింది. పర్ఫెచువల్ హెల్ప్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఏం జరిగిందో తెలియదు కానీ పుట్టిన రోజు విషెస్ చెబుతామని ఫోన్ చేస్తే అనారోగ్యానికి గురైన ఆమెను ఆసుపత్రికి తరలించే సమయానికి కన్నుమూసినట్టు తెలుస్తోంది. ఏం జరిగిందో అర్థంకావడం లేదని, తమ పాప చాలా ధైర్యవంతురాలని స్నిగ్ద తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై విచారణ జరపాలని, తమ బిడ్డ మృతదేహాన్ని ఇంటికి చేర్చేందుకు సాయం చేయాలని కోరుతున్నారు.
మరోవైపు ఫిలిప్పీన్స్‌లోని భారత రాయబార కార్యాలయంతో మాట్లాడిన అధికారులు ఆమె మృతదేహాన్ని భారతదేశానికి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. స్నిగ్ధ మరణానికి గల కారణాలపై వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment