చికిత్స పొందుతూ మృతి
రేపు లేదా ఎల్లుండి మృతదేహం ఇండియాకు రాక
కురవి : అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహబూబాబాద్ జిల్లా కురవి మండలం గుండ్రాతిమడుగు(విలేజి) గ్రామానికి చెందిన బండి రోహిత్‌రెడ్డి (27) తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
గుండ్రాతిమడుగు(విలేజి)కి చెందిన బండి అనిల్‌రెడ్డి–అనితారెడ్డి దంపతుల పెద్ద కుమారుడు రోహిత్‌రెడ్డి ఈ ఏడాది ఏప్రిల్ 14న టెక్సాస్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఈ క్రమంలో రోహిత్‌రెడ్డి చికిత్ప పొందుతూ ఈనెల 24న మృతి చెందాడు. రోహిత్‌రెడ్డి తల్లిదండ్రులు అనిల్‌రెడ్డి, అనితారెడ్డితోపాటు చిన్న కుమారుడు అమెరికా నుంచి సోమవారం ఇండియాకు చేరుకున్నారు. కుమారుడి మృతదేహం ఈనెల 31లేదా ఆగస్టు 1వ తేదీన ఇండియాకు వస్తుందని కుటుంబీకులు తెలియజేశారు. గుండ్రాతిమడుగులో రోహిత్‌రెడ్డి అంత్యక్రియలు జరుగుతాయని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment