చికాగో: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చికాగోలోని ట్రై-స్టేట్ తెలుగు అసోసియేషన్(టీటీఏ) ఆధ్వర్యంలో యాంకర్ సుమ కనకాలతో ‘సుమతో సందడి’ అనే కార్యక్రమాన్ని అమెరికాలో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని అమెరికా నలుమూలలా ఉన్న మహిళలతో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా టీటీఏ సంస్థ అధ్యక్షురాలు అపర్ణ అయ్యలరాజు ఈ కార్యక్రమ ప్రారంభోపన్యాసం చేస్తూ సంస్థ భవిష్యత్ ప్రణాళికలను వివరించారు. దాదాపు రెండు వందల మందికి పైగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో మహిళలు కూడా తమ మాటల్లో, పాటల్లో, చేతల్లో ఎంతో సృజనాత్మకతను చూపారు. మూడు గంటల పాటు జరిగిన ‘సుమతో సందడి’ లో ప్రశ్నలు-సమాధానాలు అనే పోటీ కార్యక్రమాన్ని యాంకర్ సుమ తనదైన శైలి, సమయస్ఫూర్తితో ఆద్యంతం రక్తికట్టించారు.
ఈ సందర్భంగా ట్రై-స్టేట్ అసోసియేషన్ తెలుగు ప్రజల తరఫున సుమకు ‘సకల కళాభినేత్రి’ అనే బిరుదు ఇచ్చి సత్కరించారు. అరవై నాలుగు కళల్లో వినోదం ఒక కళ అయితే, వినోద పరచడంలో అరవై నాలుగు కళలను ప్రదర్శించే సుమకు ఈ బిరుదు ఇవ్వటం గౌరవ ప్రదంగా భావిస్తున్నామని సంస్థ సమన్వయకర్త ప్రణతి కలిగోట్ల అన్నారు. చివరలో సంస్థ తరపున, ప్రణతి కలిగోట్ల వందన సమర్పణ చేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన రవి వేమూరి, రాధిక గరిమెళ్ళ, రాజేంద్ర రెడ్డి, దిలీప్ రాయలపూడి, రామకృష్ణ కొర్రపోలు, 13 ఏళ్ల వేమూరి రిషి కార్తీక్‌లకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
చదవండి:
సందీప్ వంగ డైరెక్షన్‌లో మహేష్!
జో బైడెన్‌కు కిమ్ సోదరి స్ట్రాంగ్ వార్నింగ్
Comments
Please login to add a commentAdd a comment