అమెరికన్ తెలుగు అసోసియేషన్ - మాటా క్యారమ్ ఛాంపియన్‌షిప్ పోటీలు విజయవంతంగా ముగిసాయి. న్యూజెర్సీలోని ఎడిసన్‌లో ‘మాటా’ అధ్యక్షులు శ్రీనివాస్ గనగొని ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహించారు. ఫస్ట్ టైం తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో అమెరికా క్యారం బోర్డు.. ఈ పోటీలను నిర్వహించటం విశేషం.
పండితుల వేద మంత్రోచ్ఛారణల మధ్య అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ క్యారమ్ పోటీల్లో మొత్తం 40 జట్లు పాల్గొని సత్తా చాటాయి. జాతీయస్థాయి క్రీడాకారులూ పాల్గొని తమ ప్రతిభను చాటారు. ప్రతి జట్టు కేవలం డబుల్స్‌లోనే పాల్గొనగా, ప్రథమ బహుమతిగా 1,116 డాలర్లు, రెండో బహుమతిగా 516 డాలర్లు, మూడవ స్థానం గెలుచుకున్న వారికి ట్రోఫీ అందజేసి.. సత్కరించారు.
ఈ కార్యక్రమం క్రీడాకారుల్లో మరింత స్ఫూర్తిని నింపిందని గ్రాండ్ స్పాన్సర్ రియల్ టెక్ సర్వీసెస్ సీఈవో, ప్రెసిడెంట్ రఘు వీరమల్లు అన్నారు. క్రీడల్ని ప్రతి ఒక్కరూ తమ జీవన విధానంలో భాగం చేసుకోవాలన్నారు. హెడ్ ఆఫ్ డిజిటల్ టెక్నాలజీ ఆదిత్య లోధా ఈ కార్యక్రమంలో భాగమయ్యారు. మానసిక ఉల్లాసాన్ని కలిగించే క్రీడలను ప్రోత్సహించాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా న్యూజెర్సీ సెనేటర్ పాట్ డిగ్నాన్, అసెంబ్లీమన్ స్టెర్లే స్టాన్లీ, మిడిల్‌సెక్స్ కౌంటీ కమిషనర్ శాంతి నర్రా, ఎడిసన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ నితేష్ పటేల్, ఎడిసన్ కౌన్సిలర్ అజయ్ పాటిల్, డా. ఉపేంద్ర చివుకులా, చీఫ్ కంప్లేన్స్ ఆఫీసర్ ఉదయ్ కులకర్ణి, తదితరులు హజరై.. విజేతలకు బహుమతులు అందజేశారు.
ఈ పోటీ నిర్వహణకు మాటా స్పోర్ట్స్ కో-ఆర్డినేటర్ సురేష్ బాబు కజానా ముఖ్య సమన్వయకర్తగా వ్యవహరించి విజయవంతం కావడంలో కీలక పాత్ర వహించారు. మాటా వ్యవస్థాపకులు, అధ్యక్షులు శ్రీనివాస్ గనగొని విజేతలకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన అతిథులకు, క్రీడాకారులకు మాటా సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. మాటా సంస్థ తరుపున చేపడుతున్న పలు కార్యక్రమాలను ఈ సందర్భంగా వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment