రుత్విక–రోహన్‌ జోడీ ముందంజ | Telangana Badminton Player Gadde Ruthvika Shivani Has Entered Semis Of NMDC, Check Out More Details | Sakshi
Sakshi News home page

రుత్విక–రోహన్‌ జోడీ ముందంజ

Published Sat, Nov 9 2024 11:32 AM | Last Updated on Sat, Nov 9 2024 12:28 PM

Telangana Badminton Player Gadde Ruthvika Shivani Has Entered Semis Of NMDC

సాక్షి, హైదరాబాద్‌: ఎన్‌ఎండీసీ తెలంగాణ ఇంటర్నేషనల్‌ చాలెంజ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో భారత జట్టు మాజీ సభ్యురాలు, తెలంగాణ అమ్మాయి గద్దె రుత్విక శివాని సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. గచి్చ»ౌలిలోని కొటక్‌ పుల్లెల గోపీచంద్‌ అకాడమీలో ఈ టోర్నీ జరుగుతోంది.

శుక్రవారం జరిగిన మిక్స్‌డ్‌ డబుల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో రుత్విక శివాని–రోహన్‌ కపూర్‌ (భారత్‌) ద్వయం 21–14, 14–21, 21–17తో భారత్‌కే చెందిన ధ్రువ్‌ రావత్‌–రాధిక శర్మ జోడీపై గెలిచింది. పురుషుల సింగిల్స్‌లో తెలంగాణకు చెందిన కాటం తరుణ్‌ రెడ్డి, రుషీంద్ర తిరుపతి సెమీఫైనల్లోకి అడుగు పెట్టారు. క్వార్టర్‌ ఫైనల్స్‌లో రుషీంద్ర 21–9, 21–10తో సంస్కార్‌ సరస్వత్‌ (భారత్‌)పై, తరుణ్‌ రెడ్డి 22–20, 22–24, 21–15తో రవి (భారత్‌)పై గెలిచారు.

మహిళల సింగిల్స్‌లో ఆంధ్రప్రదేశ్‌ క్రీడాకారిణి తామిరి సూర్య చరిష్మా పోరాటం క్వార్టర్‌ ఫైనల్లో ముగిసింది. సూర్య చరిష్మా 21–18, 16–21, 21–23తో రక్షిత శ్రీ (భారత్‌) చేతిలో పోరాడి ఓడిపోయింది. భారత నంబర్‌వన్‌ అన్‌మోల్‌ ఖరబ్, అనుపమా, ఇషారాణి  కూడా సెమీఫైనల్లోకి ప్రవేశించారు.

క్వార్టర్‌ ఫైనల్స్‌లో అన్‌మోల్‌ 16–21, 21–14, 21–19తో దేవిక (భారత్‌)పై, అనుపమ 21–18, 27–25తో శ్రేయా (భారత్‌)పై, ఇషారాణి 21–18, 17–21, 21–18తో మాన్సి (భారత్‌)లపై నెగ్గారు. పురుషుల డబుల్స్‌లో తెలంగాణకు చెందిన పంజాల విష్ణువర్ధన్‌ గౌడ్‌ తన భాగస్వామి ఎం.ఆర్‌.అర్జున్‌తో కలిసి సెమీఫైనల్‌ బెర్త్‌ను ఖరారు చేసుకున్నాడు. క్వార్టర్‌ ఫైనల్లో విష్ణువర్ధన్‌ గౌడ్‌–అర్జున్‌ ద్వయం 21–11, 21–8తో గణేశ్‌ కుమార్‌–అర్జున్‌ (భారత్‌) జోడీపై గెలిచింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement