Gadde Ruthvika Shivani
-
ఫైనల్లో రుత్విక–రోహన్ జంట
సాక్షి, హైదరాబాద్: ఎన్ఎండీసీ తెలంగాణ ఇంటర్నేషనల్ చాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో భారత క్రీడాకారిణి గద్దె రుత్విక శివాని ఫైనల్‌కు దూసుకెళ్లింది. గచ్చి»ౌలిలోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో జరుగుతున్న ఈ టోర్నీ మిక్స్డ్ డబుల్స్ సెమీ ఫైనల్లో శనివారం రుత్విక శివాని–రోహన్ కపూర్ (భారత్) జంట 21–16, 21–13తో అమృత–సూర్య (భారత్) జోడీపై గెలుపొందింది. పురుషుల సింగిల్స్‌లో తెలంగాణ షట్లర్ కాటం తరుణ్ రెడ్డి ఫైనల్లో అడుగు పెట్టాడు.సెమీస్‌లో తరుణ్ 14–21, 21–13, 21–14తో తెలంగాణకే చెందిన రుషీంద్ర తిరుపతిపై గెలిచాడు. మరో సెమీస్‌లో రితి్వక్ సంజీవి సతీశ్ కుమార్ (భారత్) 21–18–21–13తో మైరాబాలువాంగ్ మైస్నమ్ (భారత్)పై విజయం సాధించాడు. మహిళల సింగిల్స్‌లో ఇషారాణి బారువా (భారత్) 15–21, 21–18, 21–11తో అనుపమా ఉపాధ్యాయ్ (భారత్)పై, రక్షిత శ్రీ సంతోష్ రామరాజ్ (భారత్) 21–11, 21–17తో అన్మోల్ ఖరబ్ (భారత్)పై గెలిచి ఫైనల్లో అడుగు పెట్టారు.పురుషుల డబుల్స్‌లో తెలంగాణకు చెందిన పంజాల విష్ణువర్ధన్ గౌడ్ తన భాగస్వామి ఎం.ఆర్.అర్జున్‌తో కలిసి ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకున్నాడు. సెమీ ఫైనల్లో విష్ణువర్ధన్ గౌడ్–అర్జున్ ద్వయం 21–12, 14–21, 21–18తో సూరజ్–ధ్రువ్ రావత్ (భారత్) జంటపై, పృథ్వీ కృష్ణమూర్తి–సాయిప్రతీక్ (భారత్) జోడీ 21–18, 21–19తో హరిహరన్–రూబన్ కుమార్ (భారత్) జంటపై గెలిచి టైటిల్ ఫైట్‌కు చేరుకున్నారు. మహిళల డబుల్స్‌లో ప్రియ–శృతి (భారత్) ద్వయం 21–10, 21–18తో ప్రగతి–విశాఖ (భారత్) జంటపై, ఆరతి సారా–వర్షిణి (భారత్) జోడీ 21–13, 16–21, 21–15తో అమృత–సోనాలీ (భారత్)ద్వయంపై గెలిచి తుదిపోరుకు అర్హత సాధించింది. -
రుత్విక–రోహన్ జోడీ ముందంజ
సాక్షి, హైదరాబాద్: ఎన్ఎండీసీ తెలంగాణ ఇంటర్నేషనల్ చాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో భారత జట్టు మాజీ సభ్యురాలు, తెలంగాణ అమ్మాయి గద్దె రుత్విక శివాని సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. గచి్చ»ౌలిలోని కొటక్ పుల్లెల గోపీచంద్ అకాడమీలో ఈ టోర్నీ జరుగుతోంది.శుక్రవారం జరిగిన మిక్స్డ్ డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో రుత్విక శివాని–రోహన్ కపూర్ (భారత్) ద్వయం 21–14, 14–21, 21–17తో భారత్‌కే చెందిన ధ్రువ్ రావత్–రాధిక శర్మ జోడీపై గెలిచింది. పురుషుల సింగిల్స్‌లో తెలంగాణకు చెందిన కాటం తరుణ్ రెడ్డి, రుషీంద్ర తిరుపతి సెమీఫైనల్లోకి అడుగు పెట్టారు. క్వార్టర్ ఫైనల్స్‌లో రుషీంద్ర 21–9, 21–10తో సంస్కార్ సరస్వత్ (భారత్)పై, తరుణ్ రెడ్డి 22–20, 22–24, 21–15తో రవి (భారత్)పై గెలిచారు.మహిళల సింగిల్స్‌లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి తామిరి సూర్య చరిష్మా పోరాటం క్వార్టర్ ఫైనల్లో ముగిసింది. సూర్య చరిష్మా 21–18, 16–21, 21–23తో రక్షిత శ్రీ (భారత్) చేతిలో పోరాడి ఓడిపోయింది. భారత నంబర్‌వన్ అన్మోల్ ఖరబ్, అనుపమా, ఇషారాణి కూడా సెమీఫైనల్లోకి ప్రవేశించారు.క్వార్టర్ ఫైనల్స్‌లో అన్మోల్ 16–21, 21–14, 21–19తో దేవిక (భారత్)పై, అనుపమ 21–18, 27–25తో శ్రేయా (భారత్)పై, ఇషారాణి 21–18, 17–21, 21–18తో మాన్సి (భారత్)లపై నెగ్గారు. పురుషుల డబుల్స్‌లో తెలంగాణకు చెందిన పంజాల విష్ణువర్ధన్ గౌడ్ తన భాగస్వామి ఎం.ఆర్.అర్జున్‌తో కలిసి సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకున్నాడు. క్వార్టర్ ఫైనల్లో విష్ణువర్ధన్ గౌడ్–అర్జున్ ద్వయం 21–11, 21–8తో గణేశ్ కుమార్–అర్జున్ (భారత్) జోడీపై గెలిచింది.