Telangana girl
-
కత్తి మీద సాము అన్నట్టుగా కత్తి తిప్పిన తెలంగాణ చెల్లెమ్మ
-
రుత్విక–రోహన్ జోడీ ముందంజ
సాక్షి, హైదరాబాద్: ఎన్ఎండీసీ తెలంగాణ ఇంటర్నేషనల్ చాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో భారత జట్టు మాజీ సభ్యురాలు, తెలంగాణ అమ్మాయి గద్దె రుత్విక శివాని సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. గచి్చ»ౌలిలోని కొటక్ పుల్లెల గోపీచంద్ అకాడమీలో ఈ టోర్నీ జరుగుతోంది.శుక్రవారం జరిగిన మిక్స్డ్ డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో రుత్విక శివాని–రోహన్ కపూర్ (భారత్) ద్వయం 21–14, 14–21, 21–17తో భారత్‌కే చెందిన ధ్రువ్ రావత్–రాధిక శర్మ జోడీపై గెలిచింది. పురుషుల సింగిల్స్‌లో తెలంగాణకు చెందిన కాటం తరుణ్ రెడ్డి, రుషీంద్ర తిరుపతి సెమీఫైనల్లోకి అడుగు పెట్టారు. క్వార్టర్ ఫైనల్స్‌లో రుషీంద్ర 21–9, 21–10తో సంస్కార్ సరస్వత్ (భారత్)పై, తరుణ్ రెడ్డి 22–20, 22–24, 21–15తో రవి (భారత్)పై గెలిచారు.మహిళల సింగిల్స్‌లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి తామిరి సూర్య చరిష్మా పోరాటం క్వార్టర్ ఫైనల్లో ముగిసింది. సూర్య చరిష్మా 21–18, 16–21, 21–23తో రక్షిత శ్రీ (భారత్) చేతిలో పోరాడి ఓడిపోయింది. భారత నంబర్‌వన్ అన్మోల్ ఖరబ్, అనుపమా, ఇషారాణి కూడా సెమీఫైనల్లోకి ప్రవేశించారు.క్వార్టర్ ఫైనల్స్‌లో అన్మోల్ 16–21, 21–14, 21–19తో దేవిక (భారత్)పై, అనుపమ 21–18, 27–25తో శ్రేయా (భారత్)పై, ఇషారాణి 21–18, 17–21, 21–18తో మాన్సి (భారత్)లపై నెగ్గారు. పురుషుల డబుల్స్‌లో తెలంగాణకు చెందిన పంజాల విష్ణువర్ధన్ గౌడ్ తన భాగస్వామి ఎం.ఆర్.అర్జున్‌తో కలిసి సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకున్నాడు. క్వార్టర్ ఫైనల్లో విష్ణువర్ధన్ గౌడ్–అర్జున్ ద్వయం 21–11, 21–8తో గణేశ్ కుమార్–అర్జున్ (భారత్) జోడీపై గెలిచింది. -
భారత సాఫ్ట్‌బాల్ జట్టులో తెలంగాణ అమ్మాయి
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక ఆసియా క్రీడల్లో అరంగేట్రం చేయనున్న సాఫ్ట్‌బాల్ క్రీడాంశంలో పాల్గొనే భారత మహిళల సాఫ్ట్‌బాల్ జట్టును సోమవారం ప్రకటించారు. 16 మంది సభ్యులతో కూడిన భారత జట్టులో తెలంగాణ అమ్మాయి మమత గుగులోత్‌కు చోటు దక్కింది. నిజామాబాద్ జిల్లాకు చెందిన మమత గత ఎనిమిదేళ్లుగా జాతీయస్థాయిలో నిలకడగా రాణిస్తోంది. అండర్–14, అండర్–17, అండర్–19 వయో విభాగాల్లో కలిపి మొత్తం 18 సార్లు జాతీయ పోటీల్లో పాల్గొన్న ఆమె పలుమార్లు ‘ఉత్తమ క్యాచర్’గా అవార్డులు అందుకుందని తెలంగాణ రాష్ట్ర సాఫ్ట్‌బాల్ సంఘం ప్రధాన కార్యదర్శి కె. శోభన్ బాబు తెలిపారు. నిజామాబాద్ సుద్దపల్లిలోని సాంఘిక సంక్షేమ స్పోర్ట్స్ అకాడమీలో నీరజ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ తీసుకున్న మమత ప్రస్తుతం భువనగిరిలోని సోషల్ వెల్ఫేర్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ప్రిపరేటరీ డిగ్రీ కాలేజీలో బీఏ రెండో సంవత్సరం చదువుతోంది. ఆసియా చాంపియన్íÙప్లో భారత జట్టు రెగ్యులర్ గా పోటీపడుతుండటంతో ఆసియా సాఫ్ట్‌బాల్ సంఘం భారత జట్టుకు వైల్డ్ కార్డు ఎంట్రీ కేటాయించింది. ఆసియా క్రీడలు సెపె్టంబర్ 23 నుంచి అక్టోబర్ 8 వరకు చైనాలోని హాంగ్జౌలో జరుగుతాయి. -
తెలంగాణ: ఈ నలుగురు ‘యంగ్ అచీవర్స్’..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి చెందిన నలుగురు విద్యార్థినులు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా కేంద్ర మానవ వనరుల విభాగం, కేంద్ర విద్యా విభాగం వర్చువల్ విధానంలో ‘యంగ్ అచీవర్స్’ పోటీని సోమవారం నిర్వహించింది. దేశవ్యాప్తంగా 75 మంది బాలికలు పోటీలో పాల్గొన్నారు. ఎంహెచ్ఆర్డీ సెక్రటరీ అనితా అగర్వాల్ సహా పలువురు కేంద్ర విద్యారంగ నిపుణులు నిర్వహించిన ఈ సెమినార్లో మన ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న బాలికలు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. నలుగురు బాలికలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి సందీప్ సుల్తానియా, పాఠశాల విద్య డైరెక్టర్ శ్రీదేవసేన అభినందించారు. భయాన్ని అధిగమించి.. కె.సోను (మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల కేజీబీవీ)ది నిరుపేద కుటుంబం. తండ్రి వ్యవసాయదారుడు. ఆమె 5వ తరగతిలో ఉన్నప్పుడే తల్లి చనిపోయింది. ఆన్లైన్ జూమ్ కోచింగ్ ద్వారా కేజీబీవీలో సీటు పొందింది. అక్కడ అంతా ఇంగ్లిష్ మాట్లాడుతుంటే భయపడింది. వార్డెన్ ఇతర టీచర్ల సాయంతో ఆ భయాన్ని అధిగమించింది. తర్వాత ఆమె ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజీలో సీటు సంపాదించింది. ‘సైబర్’పై సమరం కషిష్ సింగ్.. హైదరాబాద్ గన్‌ఫౌండ్రీలోని జీజీహెచ్‌ఎస్‌లో 8వ తరగతి విద్యార్థిని. రాష్ట్ర ప్రభుత్వం, మహిళా రక్షణ విభాగం, తెలంగాణ పోలీసు, స్కూల్ ఎడ్యుకేషన్ విభాగం సంయుక్తంగా నిర్వహించిన సైబర్ కాంగ్రెస్‌లో శిక్షణ పొందింది. సైబర్ సెక్యూరిటీలో అత్యుత్తమ ప్రతిభను సొంతం చేసుకుంది. సైబర్ సెక్యూరిటీపై స్కూల్స్, తన పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తోంది. చదవండి: హైదరాబాద్: కుటుంబ కలహాలు.. ఇద్దరు పిల్లలతో తల్లి.. శానిటరీ ప్యాడ్స్ చేసి.. ధీరావత్ అనిత యాదాద్రి జిల్లా ముల్కలపల్లి జెడ్పీహెచ్ఎస్లో టెన్త్ చదువుతోంది. తండాల్లో ఉండే గిరిజన మహిళలు రుతుస్రావ సమయంలో సాధారణ బట్టవాడుతూ అనారోగ్యానికి గురవుతున్నారు. వారి వేదనను దగ్గర్నుంచి చూసిన ఈ బాలిక... స్థానికంగా లభించే వేపాకులు, మెంతులు, కొన్ని రకాల పూలు, పసుపు పొడి, వృథా పేపర్లను వాడి శానిటరీ ప్యాడ్స్‌ను తయారుచేసి అందించింది. ‘వలస’ వెతలపై.. జి.శ్రీజ.. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం కుర జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో 9వ తరగతి చదువుతోంది. 6వ తరగతి నుంచి సామాజిక ఇతివృత్తంతో కథలు రాసేది. 20 కథలతో ఓ పుస్తకం కూడా ప్రచురితమైంది. కరోనా సమయంలో ఆమె రాసిన వలస కూలీలు కథనం రాష్ట్రస్థాయి పోటీల్లో గెలుపొందింది. ఇద్దరు తెలుగు బాలలకు ‘బాల పురస్కారాలు’ ప్రదానం సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ఇద్దరు బాలలకు ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలు ప్రదానం చేశారు. సోమవారం వర్చువల్‌గా జరిగిన కార్యక్రమంలో 2021–2022కి గాను 29 మంది రాష్ట్రీయ బాల పురస్కార్ గ్రహీతలతో ప్రధాని మోదీ మాట్లాడారు. బ్లాక్‌చైన్ టెక్నాలజీ ద్వారా సర్టిఫికెట్లు అందించారు. తెలంగాణలోని హైదరాబాద్‌కు చెందిన తేలుకుంట విరాట్ చంద్రతోపాటు ఏపీకి చెందిన గురుగు హిమప్రియ ఈ పురస్కారాలను అందుకున్నారు. గత మార్చిలో విరాట్ ఆఫ్రికా ఖండంలో ఎత్తైన కిలీ మంజారో పర్వతాన్ని అధిరోహించాడు. కాగా, జమ్మూలోని సుంజువన్ మిలిటరీ క్యాంపుపై టెర్రరిస్టుల దాడిలో చాకచక్యంగా వ్యవహరించి ధైర్యసాహసాలు ప్రదర్శించిన గురుగు హిమప్రియకూ ఈ పురస్కారం అందించారు. వీళ్లు ఈ నెల 26న ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ కవాతులో పాల్గొననున్నారు. -
‘మిస్ ఇండియా’ కిరీటం.. విన్నర్‌గా తెలుగమ్మాయి
సాక్షి, హైదరాబాద్: ‘పుట్టుకతో వచ్చినది కాదు మనల్ని మనం సరికొత్తగా ఆవిష్కరించుకోవడంలో అందం ప్రతిఫలిస్తుంది’ అని నిరూపిస్తోంది మానస వారణాసి. హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన మానస విఎల్‌సిసి ఫెమినా మిస్ ఇండియా 2020 పోటీలో గెలిచి తన సత్తా చాటింది. ఇప్పుడీ తెలుగు అమ్మాయి పేరు దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. ముంబయ్ హయ్యత్ రిజెన్సీలో బుధవారం జరిగిన విఎల్‌సిసి ఫెమినా మిస్ ఇండియా 2020 వేడుకలో తెలంగాణ అమ్మాయి మానస వారణాసి మొదటి స్థానం లో నిలిచి అందాల కిరీటం గెలుచుకోగా, ఉత్తరప్రదేశ్‌కు చెందిన మాన్యా సింగ్ రన్నరప్‌గా, హర్యానాకు చెందిన మనికా షియోకండ్ ఫెమినా మిస్ గ్రాండ్ ఇండియా కిరీటం దక్కించుకున్నారు. 23 ఏళ్ల మానస హైదరాబాద్‌లోని గ్లోబల్ ఇండియన్ లో స్కూల్ చదువు, వాసవి ఇంజినీరింగ్ కాలేజీ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్ పూర్తి చేసింది. ఇంజనీరింగ్ చేసిన మానస ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ఛేంజ్ అనలిస్ట్‌గా పనిచేస్తోంది. నిత్య సాధనం... నిత్య వినూత్నం సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడూ చురుకుగా ఉండే మానస తన ప్రాక్టీస్‌ను నిత్యం కొనసాగిస్తూ, ఆ అనుభవాలను పంచుకుంటూనే ఉంటుంది. ‘సాధన చేస్తూ ఉంటే జీవితం ఏం ఇస్తుందో ఎవరూ చెప్పరు. రాయడం, చిత్రలేఖనం, పరిగెత్తడం, పాడటం వంటివి మాత్రమే కాదు స్నేహితులను ఎలా సంపాదించుకోవాలో కూడా సాధన చేయాలి. మంచి ఫ్రెండ్‌గా, మంచి తోబుట్టువుగా, మంచి వ్యక్తిగా ఎలా ఉండాలో కూడా సాధన చేయాలి. ప్రజలు దానిని గుర్తించేంత వరకు సాధన ఆపకూడదు. అవసరమైన చోట కోపం చూపడం, అవసరమైన వారికి దయను ఎలా అందించాలో కూడా నేర్చుకోవాలి. ఇవన్నీ మనల్ని శక్తింతులను చేసేవే, ఇవే మరిన్ని ఉన్నత శిఖరాలకు చేర్చుతాయని నేను గ్రహించాను’ అని చెప్పారామె. View this post on Instagram A post shared by Femina Miss India (@missindiaorg) కళల కసరత్తు ఇంజినీరింగ్ చదువు పూర్తి కాగానే మానస ఎఫ్‌బిబి–ఇండియా ఫ్యాషన్ హబ్ కలర్స్ టివి ఫెమినా మిస్ ఇండియా 2019 తెలంగాణ ఫైనలిస్ట్‌గా ఎంపికయ్యారు. ఫెమినా మిస్ ఇండియా పోటీలో గెలుపొందిన ఈ అందాల రాశి కసరత్తులు చేయడంతో పాటు రాయడం, చదవడం, సంగీతం, యోగా, భరతనాట్యంలోనూ రాణిస్తోంది. కొత్తవాటిని తెలుసుకోవాలనే ఉత్సుకత ఎన్నింటినో నేర్పుతుంది. మనల్ని బలవంతుల్ని చేస్తుంది అని నమ్ముతుంది. ఎప్పుడూ ఓ కొత్త కళను సాధన చేయడంలో బిజీగా ఉండే మానస ‘నా చిన్నతనంలో చాలా సిగ్గుగా, నలుగురిలోకి వెళ్లాలన్నా భయంగా ఉండేదాన్ని. టీనేజ్‌లో ఏదో తెలియని ఒక ఆరాటం, ఎప్పుడూ నాకు సౌకర్యంగా అనిపించిన ప్లేస్లోనే ఉండిపోవడానికి ప్రయత్నించేదాన్ని. View this post on Instagram A post shared by Femina Miss India (@missindiaorg) కాస్త పెద్దయ్యాక ప్రతిరోజూ నన్ను నేను ప్రశ్నించుకుంటూ, మెరుగుపరుచుకోవడం మొదలయ్యింది. ఇప్పటికీ ఈ అలవాటును కొనసాగిస్తూనే ఉన్నాను. దీనివల్ల ప్రతియేటా నన్ను మరింత శక్తిమంతురాలిగా ఈ లోకం ముందు నిలబెడుతుంది’ అంటూ తన ఆలోచనలు పంచుకుంటారు ఆమె. ఈ అందాల రాశి ఒక స్వచ్ఛంద సంస్థలో చేరి, పిల్లలకు విద్యాబోధన కూడా చేసింది. పిల్లలతో ఉండడం వల్ల, వారి చిరునవ్వుల నుంచి ఎంతో నేర్చుకోవచ్చని, ఎంతో సంతోషాన్ని పంచుకోవచ్చని అంటుంది మానస. కళలపై ఉన్న అభిరుచి, సాధన ఈ రోజు ఆమెకు కిరీటాన్ని తెచ్చిపెట్టాయి. మానస వారణాసి మరిన్ని విజయశిఖరాలను అధిరోహించాలని తెలుగువారి అభిలాష, అకాంక్ష. -
ఉరుముతున్న మెరుపు
చారిత్రక పునాదుల మీద జీవించే వర్తమానం రేపటికి చరిత్ర అవుతుంది. చరిత్ర మిగిల్చిన ఆనవాళ్లను, అనుభవాలను ఆధారం చేసుకుని ముందుకు నడిచే వాళ్లు లెక్కకు మించినంత మంది ఉంటారు. చరిత్రను సృష్టించే వాళ్లు కొందరే ఉంటారు. చరిత్ర సృష్టించిన కొందరిలో ఒకమ్మాయి గుగులోత్ సౌమ్య. మహిళల ఫుట్‌బాల్ విభాగంలో ఇంటర్నేషనల్ టోర్నమెంట్ ఆడిన తొలి తెలంగాణ అమ్మాయి సౌమ్య. తండాలోని ఈ మెరుపు అంతర్జాతీయంగా ఉరుముతోంది. సౌమ్య సొంతూరు నిజామాబాద్ జిల్లాలోని కిషన్‌తండా. సౌమ్య తల్లిదండ్రుల కల ఆమెను క్రీడాకారిణిని చేసింది. అయితే వాళ్లు కలగన్నది ఆమె క్రీడాకారిణి కావాలని కాదు. ఆమె క్రీడాకారిణి అవుతుందని వాళ్లు కలలో కూడా అనుకోలేదు. వాళ్లుండే తండాలో ఆడపిల్లల చదువు.. కంటికి కనిపిస్తూ కురవకుండా తేలిపోయే మేఘమే. సౌమ్య తండ్రి గోపి సెకండరీ గ్రేడ్ టీచర్. ఆమె తల్లి ధనలక్ష్మి చదువుకోలేదు. వాళ్లకు సౌమ్యకంటే ముందు ఇద్దరమ్మాయిలున్నారు. సౌమ్య తర్వాత ఒక అబ్బాయి. మొత్తం నలుగురు పిల్లలు. ఆ అమ్మానాన్నల కల... పిల్లలందర్నీ చదివించి తీరాలని. అందుకోసం వాళ్లు పడిన శ్రమ చిన్నదేమీ కాదు. సౌమ్య తండ్రి తనకు పోస్టింగ్ ఉన్న చోట ఉద్యోగానికి వెళ్లాలి. సొంతూర్లో ఉన్న పొలం పనులు చూసుకోవాలి. వాటి చుట్టూ జీవితాన్ని అల్లుకుంటే పిల్లలను చదివించడం కుదరని పని. అందుకే ధైర్యం చేసి ఓ నిర్ణయానికి వచ్చారా దంపతులు. ధనలక్ష్మి నిజామాబాద్‌లో ఓ చిన్న ఇంటిని అద్దెకు తీసుకుని నలుగురు పిల్లలను స్కూలుకు పంపించింది. గోపి తన ఉద్యోగం, సొంతూర్లో పనులు చూసుకుంటూ వారానికోసారి నిజామాబాద్‌కు వచ్చి భార్యాపిల్లలను చూసుకునేవాడు. అమ్మానాన్నల కష్టం పిల్లలకు తెలుస్తూనే ఉంది. సంపన్నులు కాకపోయినప్పటికీ తమ కోసం వాళ్లు అమరుస్తున్న సౌకర్యాలను అర్థం చేసుకున్నారు పిల్లలు. చక్కగా చదువుకుంటున్నారు. అప్పుడు జరిగిందో మిరకిల్. కాలం నిర్ణయించింది సౌమ్య సిక్స్›్త క్లాస్ వరకు నిజామాబాద్ జిల్లా నవీపేటలోని జిల్లా పరిషత్ స్కూల్లో చదివింది. సెవెన్త్ క్లాస్‌కి నిజామాబాద్‌లోని రాఘవ స్కూల్లో చేరింది. జూన్‌లో చేరింది. జూలైలో ఇంటర్ స్కూల్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ టోర్నమెంట్‌కు సెలక్షన్ జరగాలి. వరుసగా వర్షాలు. స్టూడెంట్స్ సెలక్షన్స్‌కి కూడా తెరిపినివ్వడం లేదు. ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ నాగరాజుకు టెన్షన్ పెరిగిపోతోంది. పాత స్టూడెంట్స్ కొందరుంటారు, మరికొందరు కొత్త వారిని సెలెక్ట్ చేస్తే బావుంటుంది, వాతావరణం సహకరించడం లేదు. తోటి టీచర్లతో పిచ్చాపాటి కబుర్లలో మనసులో మాట బయటకొచ్చింది. అప్పుడు ఓ టీచర్ ‘కొత్తగా చేరిన ఓ అమ్మాయి పీఈటీ క్లాసుల్లేనప్పుడు కూడా గ్రౌండ్లో పరుగెడుతుంటుంది. పరుగులో ఒడుపు కూడా ఉంద’ని చెప్పారు. అలా సౌమ్య కోచ్ నాగరాజు దృష్టిలోకి వచ్చింది. వాళ్లు ఊహించినట్లే ఆమె ఆ ఏడాది జరిగిన వంద మీటర్లు, రెండు వందలు, నాలుగు వందల మీటర్ల పరుగు పందెంలో బంగారు పతకాలందుకుంది. కోచింగ్ ఇస్తే మంచి క్రీడాకారిణి అవుతుందనిపించింది నాగరాజుకి. స్కూల్లో అన్ని రకాల ఆటలనూ ప్రాక్టీస్ చేయిస్తున్నప్పుడు సౌమ్య ఫుట్‌బాల్ కిక్ చాలా మెళుకువగా ఇస్తోందని గమనించారాయన. సౌమ్య ఫుట్‌బాల్ క్రీడాకారిణి కావడానికి అది తొలి ఘట్టం. అయితే... అసలైన ట్విస్ట్‌లు కూడా అక్కడే మొదలయ్యాయి. అమ్మ ‘ససేమిరా’ ‘మీ అమ్మాయి బాగా ఆడుతోంది. రొటీన్‌గా స్కూల్లో అందరితో కలిపి ఓ గంటసేపు ఆడించడం కాదు, ఆమెకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తాను’ అని సౌమ్య తల్లి ధనలక్ష్మితో చెప్పారు నాగరాజు. ఆయన మాట పూర్తయ్యేలోపే ఆమె వీల్లేదంటే వీల్లేదని ఖండితంగా చెప్పేసింది. ఆమె ఆందోళన కూడా సమంజసమే. పిల్లల్ని చదివించుకోవడానికి సొంత ఊరు కాదని, భర్త ఉద్యోగం చేసే ఊరు కూడా కాదని నిజామాబాద్‌కి వచ్చింది. నలుగురిలో ముగ్గురు ఆడపిల్లలు. ఇప్పటి దాకా సాకింది ఒక ఎత్తయితే, ఇక ముందు సంరక్షణ ఒక ఎత్తు. వయసొచ్చిన పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకోవాలి. తమ దారిన తాము నడిచి పోతున్న ఆడపిల్లలకు.. తమ దారిలో ఎన్ని ప్రమాదాలు పొంచి ఉంటాయో తెలియదు. తల్లిగా తనకు తెలుసు. అందుకే ఆమె అంత కచ్చితంగా వ్యతిరేకించింది. పైగా ఏ పొరపాటు జరిగినా... తండాలో ఉన్న అందరిలా గోప్యంగా బతుకు వెళ్లదీయకుండా చదువులంటూ పట్టణం బాట పట్టారని నలుగురూ నాలుగు మాటలు అంటారేమోననే భయం. సౌమ్య ఫుట్‌బాల్ ప్రాక్టీస్ చేయడానికి సౌమ్య తల్లి ఏ మాత్రం సుముఖంగా లేదని నిర్ధారణ అయిన తర్వాత సౌమ్య తండ్రి నిజామాబాద్‌కి వచ్చే వరకు ఎదురు చూశారు కోచ్. ధనలక్ష్మి చెప్పినంత ఖండితంగా చెప్పలేదు కానీ గోపి కూడా దాదాపుగా అదే మాట చెప్పారు. ఆ మాటతో నాగరాజుకి ఆశ వదులుకోక తప్పలేదు. అయితే... తన ఆశ స్టేడియంలోకి వస్తుందని అతడు ఊహించలేదు. బ్యాగ్ వదిలేసి పరుగెత్తింది సౌమ్య కళ్ల ముందే అంతా జరుగుతోంది. కోచ్ ఇంటికి వచ్చి తల్లిని, తండ్రిని అడగడం చూసింది. తల్లి ఒప్పుకోకపోయినా తండ్రి ఒప్పుకుంటాడేమోనని ఆశపడింది. అమ్మానాన్నలు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడమూ విన్నది. ఫుట్‌బాల్ కోచింగ్‌కి అన్ని దారులూ మూసుకుపోతున్నట్లు అర్థమైంది. ఓ రోజు ఉదయం స్కూలుకి రెడీ అవుతోంది. ఆమె ఇంటి ముందు నుంచే పొరుగున ఉంటున్న ముగ్గురు అక్కచెల్లెళ్లు స్నేహ, నమ్రత, మేఘన వెళ్తున్నారు. వాళ్లు వెళ్తున్నది స్పోర్ట్స్ స్టేడియంకేనని, ఫుట్‌బాల్ ప్రాక్టీస్కేనని సౌమ్యకు తెలుసు. వాళ్లను రోజూ చూస్తూనే ఉంటుంది. ఆ రోజు ఎప్పటిలా చూస్తూ ఊరుకోవడం సాధ్యం కాలేదామెకి. స్కూలు బ్యాగ్ ఇంట్లోనే వదిలేసి, వాళ్లమ్మ అరుస్తున్నా పట్టించుకోకుండా స్టేడియానికి పరుగెత్తింది. కోచ్ ముందు నిలబడి ‘నేను ప్రాక్టీస్ చేస్తా’నని చెప్పింది. ఇంతటి సినీఫక్కీలో మొదలైంది సౌమ్య ఫుట్‌బాల్ ప్రస్థానం.అండర్ ఫోర్టీన్తో మొదలైన సౌమ్య ఫుట్‌బాల్ కెరీర్ అండర్ సిక్స్టీన్లను దాటి అండర్ నైన్టీన్కి చేరింది. కోల్‌కతా టోర్నమెంట్లో మంచి స్కోర్ చేసింది. ముంబయిలో జరిగిన ఉమెన్ ఇండియన్ లీగ్ టోర్నమెంట్‌తోపాటు దేశంలో అనేక టోర్నమెంట్లు ఆడింది. సౌతాఫ్రికాలోని జోహన్నాస్బెర్గ్లో జరిగిన బ్రిక్స్ అండర్ సెవెంటీన్లో ఆడింది. బ్రెజిల్, రష్యా, చైనాలతో పోటీ పడింది. అండర్ ఎయిటీన్ సాఫ్ (సౌత్ ఏషియన్ ఫుట్‌బాల్ ఫెడరేషన్) కప్ టోర్నమెంట్లో ఆడింది. ఆ పోటీలో మనదేశానికి కాంస్య పతకం వచ్చిది. భారత మహిళల ఫుట్‌బాల్ టీమ్ గెలుచుకున్న తొలి ఇంటర్నేషనల్ మెడల్ అది.ఈ మే నెల ఐదు నుంచి 22 వరకు పంజాబ్‌లో నేషనల్ లెవెల్ టోర్నమెంట్లు జరగనున్నాయి. మెరుపువేగంతో కదిలి తల అడ్డం వేసి బంతిని ఆపి ప్రత్యర్థి జట్టుని నిలువరించడానికి సౌమ్య సిద్ధంగానే ఉంది. పాదరసంలా కదులుతూ బంతిని గోల్ చేయడానికి ఆమె పాదాలు చురుగ్గా ఉన్నాయి. ఎటొచ్చీ ధర్మసంకటం పరీక్షల రూపంలో ఎదురైంది. ఆమెకు డిగ్రీ ఫస్టియర్ పరీక్షలు కూడా అప్పుడే ఉన్నాయి. ‘‘స్కూల్లో అయితే టోర్నమెంట్‌కు అనుమతించి పరీక్షలు మళ్లీ పెట్టేవాళ్లు. ఇప్పుడేం చేయాలో తెలియడం లేదు’’ అన్నది సౌమ్య. ప్రకృతి పరీక్షనూ నెగ్గింది సౌమ్య ఇష్టంతో, తల్లిదండ్రుల అయిష్టంతో మొదలైన ఫుట్‌బాల్ ప్రాక్టీస్‌కు అన్నీ అనుకూలంగా ఏమీ కలిసి రాలేదు. ప్రకృతి కూడా తనవంతు పరీక్ష పెట్టింది. అది 2015. నేపాల్‌లో అండర్ ఫోర్టీన్ టోర్నమెంట్‌కి వెళ్లింది సౌమ్య. ఖాట్మండులోని దశరథ స్టేడియంలో ఆడాలి. ఆటకు అంతా సిద్ధమవుతున్నారు. ఒక్కసారిగా పెళపెళమంటూ పెద్ద శబ్దం. ‘ఏమై ఉంటుందీ’ అని అందరూ దిక్కులు చూశారు. కాళ్ల కింద భూమి కదులుతోంది. స్టేడియం ఉయ్యాలలా ఊగుతోంది. అది భూకంపం అని తెలిసింది. ఆ సంఘటనను గుర్తు చేసుకుంటూ ‘భూకంపం ఎలా ఉంటుందో నేపాల్కెళ్లి చూసొచ్చాను’ అని నవ్వుతూ అంది సౌమ్య. ‘‘భూకంపం కారణంగా ఆ టోర్నమెంట్ ఆగిపోయింది. మా టీమ్‌లో ఎవరికీ ఏమీ కాలేదు. నిజామాబాద్‌కి వచ్చిన తర్వాత తెలిసిన వాళ్లంతా వచ్చి, మేము క్షేమంగా తిరిగి వచ్చినందుకు సంతోషించారు’’ అన్నది. భూకంపం కారణంగా సౌమ్య అప్పుడు ఆడలేకపోయింది. ఇప్పుడు మళ్లీ కాలం పరీక్ష పెట్టిందామెకు. పుస్తకాలా, ఫుట్‌బాలా తేల్చుకోమంటోంది. ఆమె తండ్రి గోపికి కూతురు పరీక్షలు రాస్తే బావుణ్ననే ఉంది. సౌమ్య పెద్దక్క స్వప్న బీటెక్ చేసి సివిల్స్‌కి ప్రిపేరవుతోంది. రెండో అక్క స్వర్ణ బీఎస్సీ నర్సింగ్ చేసి పారామెడికల్ కోచింగ్ తీసుకుంటోంది. సౌమ్యను ఐపీఎస్‌గా చూడాలని ఆ తండ్రి కల. సౌమ్యకు మాత్రం ఉమెన్ ఫుట్‌బాల్ టీమ్‌లో సీనియర్ లెవెల్లో దేశం తరఫున ఆడాలని ఉంది. క్రిస్టియానో రోనాల్డ్ ఆమెకు ఇష్టమైన ఫుట్‌బాల్ క్రీడాకారుడు. ఆమె కెరీర్ కల క్రీడల చుట్టూ తిరుగుతోంది. మహిళల క్రికెట్ అనగానే మిథాలీరాజ్ గుర్తుకు వచ్చినట్లే భవిష్యత్తు తరానికి మహిళల ఫుట్‌బాల్ అంటే గుగులోత్ సౌమ్య గుర్తుకు రావాలని ఆశిద్దాం. వాకా మంజులారెడ్డి ఫొటోలు: రాజ్‌కుమార్, సాక్షి, నిజామాబాద్ వాళ్లమ్మగారి కోపం తగ్గింది సౌమ్య పేరెంట్స్ ఫుట్‌బాల్ ప్రాక్టీస్‌కి ఎంతకీ ఒప్పుకోకపోవడంతో ఆ అమ్మాయి ఫీజు మాఫీ చేయమని స్కూల్ ప్రిన్సిపల్‌ని రిక్వెస్ట్ చేశాను. ఆయన ఒప్పుకున్నారు కూడా. అప్పటికే ఎయిత్ క్లాస్ ఫీజు కట్టేశారు వాళ్ల నాన్న. నైన్త్, టెన్త్ క్లాసులకు ఫీజు రద్దు చేశారు ప్రిన్సిపల్. అలా ఏదో ఒక ప్రోత్సాహకం ఉంటేనయినా ఆ అమ్మాయిని ప్రాక్టీస్‌కి పంపిస్తారని నా ప్రయత్నం. నేషనల్స్‌కి సెలెక్ట్ అయిన తర్వాత కానీ వాళ్లమ్మగారు ప్రసన్నం కాలేదు. అప్పటి వరకు కోపంగానే ఉన్నారామె. సౌమ్య టోర్నమెంట్స్‌కి వెళ్తూనే టెన్త్ క్లాస్‌లో 7.3 జీపీఏ, ఇంటర్లో 902 మార్కులు తెచ్చుకుంది. ఇప్పుడు బీఎస్సీ ఫస్టియర్. కేర్ అకాడమీ కూడా ఆమెకు ప్రోత్సహిస్తోంది. ఫీజు మాఫీ చేయడమే కాకుండా స్పోర్ట్స్ ఎక్స్పెండిచర్ కోసం ఏటా పాతికవేలిస్తోంది. వచ్చే నెలలో పంజాబ్‌లో టోర్నమెంట్ ఉంది. ఇప్పటికే ఒరిస్సా రైజింగ్ స్టార్, కోలాపూర్ ఎఫ్‌సి క్లబ్‌లు ఆమెకు ఆఫర్ ఇచ్చాయి. నాగరాజు, కోచ్, కేర్ ఫుట్‌బాల్ అకాడమీ, నిజామాబాద్ -
కాంస్యం నెగ్గిన జిమ్నాస్ట్ మేఘన
పుణే: ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో తెలంగాణ అమ్మాయి గుండ్లపల్లి మేఘన రెడ్డి కాంస్య పతకాన్ని సాధించింది. అండర్–21 రిథమిక్ జిమ్నాస్టిక్స్ ఆల్ అరౌండ్ విభాగంలో మేఘన 39.30 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో నిలిచింది. అదితి దండేకర్ (మహారాష్ట్ర–46.40 పాయింట్లు) స్వర్ణం సాధించగా... కిమాయ కదమ్ (మహారాష్ట్ర–41 పాయింట్లు) రజత పతకం గెల్చుకుంది. బ్యాడ్మింటన్ అండర్–17 బాలుర సింగిల్స్‌లో తెలంగాణ కుర్రాడు గంధం ప్రణవ్ రావు స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించాడు. సెమీఫైనల్లో ప్రణవ్ రావు 21–19, 12–21, 21–12తో టుకుమ్ లా (అరుణాచల్ ప్రదేశ్)పై గెలుపొందాడు. నేడు జరిగే ఫైనల్లో రవి (హరియాణా)తో ప్రణవ్ తలపడతాడు. -
నానమ్మ.. బతుకమ్మ
బిలోల శరణ్య ఉరఫ్ ‘తీన్మార్’ లచ్చవ్వ.. తెలంగాణ యాసను పోతపోసుకున్న అచ్చ తెలంగాణ పిల్ల! గా పిల్లకు బతుకమ్మ అంటే నానమ్మ.. నానమ్మ అంటే బతుకమ్మ! గా యాది గీమె మాటల్లనే ఇందాం.. మా సొంతూరు నిజామాబాద్. వన్ ఇయర్ నుంచి ఇక్కడుంటున్నాను. నాకు బతుకమ్మ పండుగ అనగానే మా నానమ్మే గుర్తొస్తది. ఆమె నాకు మంచి ఫ్రెండే కాదు గైడ్ కూడా! బతుకమ్మ పండుగొచ్చిందంటే చాలు నానమ్మ వెనకాలే తిరిగేదాన్ని. బతుకమ్మ పండుగకి అందరం కలుస్తాం. పొద్దున్నే నాన్న, బాబాయ్‌లతో కలిసి నేనూ పూలు తేవడానికి వెళ్లేదాన్ని. ఒక్కో పువ్వుకి ఒక్కో కథ ఉంటది.. అవి మా నానమ్మ చెప్తేనే వినాలి. ఇక ప్రసాదాలైతే.. చెప్తుంటేనే నీళ్లూరుతున్నాయి. అటుకులు, పుట్నాలు, చక్కెరతో మొదలు సత్తుపిండి, పులిహోర దాకా అన్ని ప్రసాదాలు.. యుమ్మీ! షాపింగ్ ఏవి ఎట్లున్నా ఇదైతే మస్ట్. కొత్త బట్టలు.. వాటికి మ్యాచింగ్ గాజులు.. వగైరా ఉంటేనే బతుకమ్మ పండుగ కలర్ఫుల్గా జరిగినట్టు. నేను రెడీ అవడం ఒకెత్తయితే మా చెల్లెలిని రెడీ చేయడం ఇంకొకెత్తు. నానమ్మ, పెద్దమ్మ, అమ్మ, పిన్ని, అత్త వాళ్లంతా బతుకమ్మను పేర్చడంలో బిజీగా ఉంటే మేమేమో మమ్మల్ని మేం సవరించుకోవడంలో బిజీగా ఉంటాం. బతుకమ్మ పాట.. ఇందులో కూడా నానమ్మే బెస్ట్ అండ్ ఫస్ట్. ఎన్ని పాటలు పాడుతుందో!.. మంచి గొంతు. తను ఒక్కో లైను చెప్తుంటే మేమంతా ఉయ్యాల అని కోరస్ ఇస్తూ తను చెప్పిన లైన్‌నే మళ్లీ రిపీట్ చేస్తాం. సద్దుల బతుకమ్మ రోజు మా ఇంట్లోనే నిమజ్జనం చేస్తాం. మా వాకిట్లో బావి ఉంటుంది. సాయంత్రం వాకిలి ఊడ్చి, చాన్పిచల్లి పెద్ద ముగ్గేస్తాం. అంతకుముందే పేర్చిన బతుకమ్మను, పసుపు గౌరమ్మనూ దేవుడి ముందు పెట్టి పూజచేసి తర్వాత ఆ బతుకమ్మలో గౌరమ్మనుంచి వాకిట్లోకి తెస్తాం. ముగ్గుమీద పీటపెట్టి ఆ పీటమీద బతుకమ్మను పెడతాం. ఆ బావికీ పూజచేసి బతుకమ్మ ఆడతాం. ఆ తర్వాత బావి చుట్టు కూడా అయిదు చుట్లు తిరిగి బతుకమ్మను అందులో నిమజ్జనం చేస్తాం. హైదరాబాద్‌లో.. ఇక్కడ బతుకమ్మను చూడ్డం ఇదే ఫస్ట్ టైమ్. వండర్ఫుల్ ఎక్స్‌పీరియెన్స్. తెలంగాణ రాష్ట్రం.. బతుకమ్మను గవర్నమెంట్ సెలబ్రేట్ చేయడం భలే అనిపిస్తోంది. సెంటర్స్‌లో బతుకమ్మలను పెట్టి డెకరేట్ చేయడం.. నెక్లెస్ రోడ్, హుస్సేన్ సాగర్‌ను డెకరేట్ చేయడం.. మామూలు టైమ్‌లో హైదరాబాద్‌కి.. ఇప్పటి హైదరాబాద్ లుక్‌కి ఎంతో డిఫరెన్స్. ఎక్కడెక్కడి నుంచో వచ్చి అందరూ కలిసి ఏ ట్యాంక్‌బండ్ మీదో.. నెక్లెస్‌రోడ్ దగ్గరో బతుకమ్మ ఆడ్డం.. ఎంత అద్భుతమైన అనుభూతి. కాంక్రీట్ జంగిల్‌లాంటి ఈ హైదరాబాద్‌లో చీకటి పడిందంటే చాలు ఏ మూల చూసినా.. కలర్‌ఫుల్ బతుకమ్మలు.. పూల రథాలు కదులుతున్నట్లు! ఈ బంగారు బతుకమ్మ ఇట్లనే ప్రతియేడూ రావాలని ఆ అమ్మవారిని కోరుకుంటున్న! - సరస్వతి రమ