సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక ఆసియా క్రీడల్లో అరంగేట్రం చేయనున్న సాఫ్ట్‌బాల్ క్రీడాంశంలో పాల్గొనే భారత మహిళల సాఫ్ట్‌బాల్ జట్టును సోమవారం ప్రకటించారు. 16 మంది సభ్యులతో కూడిన భారత జట్టులో తెలంగాణ అమ్మాయి మమత గుగులోత్‌కు చోటు దక్కింది. నిజామాబాద్ జిల్లాకు చెందిన మమత గత ఎనిమిదేళ్లుగా జాతీయస్థాయిలో నిలకడగా రాణిస్తోంది.
అండర్–14, అండర్–17, అండర్–19 వయో విభాగాల్లో కలిపి మొత్తం 18 సార్లు జాతీయ పోటీల్లో పాల్గొన్న ఆమె పలుమార్లు ‘ఉత్తమ క్యాచర్’గా అవార్డులు అందుకుందని తెలంగాణ రాష్ట్ర సాఫ్ట్‌బాల్ సంఘం ప్రధాన కార్యదర్శి కె. శోభన్ బాబు తెలిపారు. నిజామాబాద్ సుద్దపల్లిలోని సాంఘిక సంక్షేమ స్పోర్ట్స్ అకాడమీలో నీరజ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ తీసుకున్న మమత ప్రస్తుతం భువనగిరిలోని సోషల్ వెల్ఫేర్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ ప్రిపరేటరీ డిగ్రీ కాలేజీలో బీఏ రెండో సంవత్సరం చదువుతోంది. ఆసియా చాంపియన్íÙప్‌లో భారత జట్టు రెగ్యులర్ గా పోటీపడుతుండటంతో ఆసియా సాఫ్ట్‌బాల్ సంఘం భారత జట్టుకు వైల్డ్ కార్డు ఎంట్రీ కేటాయించింది. ఆసియా క్రీడలు
సెపె్టంబర్ 23 నుంచి అక్టోబర్ 8 వరకు చైనాలోని హాంగ్జౌలో జరుగుతాయి.
Comments
Please login to add a commentAdd a comment