Mamata
-
‘ఇండియా’కు ఎవరు బెస్ట్? రాహుల్.. మమత బలాబలాలేమిటి?
న్యూఢిల్లీ: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఇండియా కూటమిలో చీలికలు మొదలయ్యాయి. అలాగే ఈ కూటమి నాయకత్వానికి సంబంధించిన చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఇదే నేపధ్యంలో ఇండియా కూటమి సారధ్యంపై అటు కాంగ్రెస్, ఇటు టీఎంసీల మధ్య వాగ్వాదం కొనసాగుతోంది.‘ఇండియా’ సారధ్యం ఎవరికి?కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికి వరుస అపజయాలు ఎదురవుతున్న నేపధ్యంలో ఇప్పుడు కూటమి సారధ్య బాధ్యతలు టీఎంసీ అధినేత మమతా బెనర్జీకి అప్పగించాలనే వాదన వినిపిస్తోంది. దీనికితోడు ఆమె కూడా ప్రతిపక్ష కూటమికి నాయకత్వ బాధ్యతలు వహించాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఇటువంటి తరుణంలో దేశంలోని పలువురు మేధావులు, రాజకీయ పార్టీలు మమతా బెనర్జీవైపు మొగ్గుచూపడం ప్రారంభించారు. ఈ విషయంలో ప్రముఖ నేతలు లాలూ ప్రసాద్ యాదవ్, శరద్ యాదవ్‌లు మమతకు తమ ఓటు వేశారు.రాహుల్ గాంధీ నాయకత్వ లోపంఅటు హర్యానా, ఇటు మహారాష్ట్రలలో బీజేపీతో జరిగిన ప్రత్యక్ష పోరులో కూటమి ఓటమికి కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ నాయకత్వ లోపమే కారణమంటూ పలువురు ఆరోపిస్తున్నారు. ఇవి తృణమూల్ అధినేత మమతకు ఎక్స్ ఫ్యాక్టర్‌గా మారుతున్నాయి. ఈ నేపధ్యంలో అటు రాహుల్ గాంధీ, ఇటు మమతా బెనర్జీలలో ఎవరి బలాలు ఏమిటనేది చర్చనీయాంశంగా మారింది.మమతకు పెరుగుతున్న మద్దతుమమతా బెనర్జీకి ఇండియా కూటమి బాధ్యతలు అప్పగించే ప్రయత్నాలు జోరుగా జరుగుతున్నాయనే మాట వినిపిస్తోంది. టీఎంసీ నేతలు కూడా మమతనే కూటమికి తగిన సారధి అంటూ ప్రచారం సాగిస్తున్నారు. మమతా బెనర్జీ ఏడుసార్లు ఎంపీగా, నాలుగుసార్లు కేంద్రమంత్రిగా, మూడుసార్లు సీఎంగా రాజకీయాల్లో అపార అనుభవం సంపాదించారని టీఎంసీ నేతలు, కార్యకర్తలు చెబుతున్నారు. అందుకే ఆమెనే కూటమికి తగిన సారధి అంటూ స్పష్టం చేస్తున్నారు. సుపరిపాలనలో ఆమె రికార్డు అద్భుతంగా ఉందని, గత ఎన్నికల్లో బీజేపీని ఆమె చిత్తుగా ఓడించారని పలువురు విశ్లేషిస్తున్నారు. దేశవ్యాప్తంగా పలువురు నేతలు కూడా కూటమి సారధిగా ఆమె ఉంటేనే అధికార పక్షానికి తగిన సమాధానం చెప్పగలమని అంటున్నారు. అంతేకాకుండా మమత నేతలనందరినీ తన వెంట తీసుకెళ్లగల సామర్థ్యాన్ని కలిగివున్నారని వారు విశ్లేషిస్తున్నారు. ఇండియా కూటమికి అధినేత్రిగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఉండేందుకు మద్దతు పలికిన ప్రతిపక్ష నేతల జాబితాలో రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, సమాజ్‌వాదీ నేతలు అఖిలేష్ యాదవ్, రామ్ గోపాల్ యాదవ్ ఉన్నారు.మమతా బెనర్జీ సత్తా ఇదే..మమతా బెనర్జీ ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2011లో తొలిసారిగా ఆమె ముఖ్యమంత్రి అయ్యారు. మూడు సార్లు సీఎంగా ఉన్నారు. ఆమె టీఎంసీ అధినేత్రిగానూ వ్యవహరిస్తున్నారు. 1998లో కాంగ్రెస్ నుంచి విడిపోయి టీఎంసీ అంటే తృణమూల్ కాంగ్రెస్‌ను స్థాపించారు. మమత పలుమార్లు కేంద్రంలో మంత్రిగా ఉన్నారు. రెండుసార్లు రైల్వే మంత్రిగా ఉన్నారు. బొగ్గు మంత్రిత్వ శాఖ, మానవ వనరుల మంత్రిత్వ శాఖ, మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖలకు కూడా సారధ్యం వహించారు. ఆమె 2011 నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. మమతా బెనర్జీ ఏడుసార్లు ఎంపీగా ఉన్నారు.రాహుల్ గాంధీ అనుభవంయూపీలోని రాయ్‌బరేలీ ఎంపీ రాహుల్ గాంధీ ప్రస్తుతం లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్నారు. మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ రాయ్‌బరేలీ, వయనాడ్ రెండు స్థానాల్లోనూ గెలుపొందారు. అయితే ఆయన తన పార్లమెంటరీ నియోజకవర్గంగా రాయ్‌బరేలీని ఎంచుకున్నారు. ఆయన సోదరి ప్రియాంక వయనాడ్ ఎంపీగా ఇటీవలే ఎన్నికయ్యారు. రాహుల్ గాంధీ 2017 నుంచి 2019 వరకు కాంగ్రెస్ అధ్యక్షునిగా ఉన్నారు. ఆయన 2004లో క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారు. అమేథీ నుంచి తొలిసారి ఎంపీగా గెలిచారు. 2009, 2014 ఎన్నికల్లో కూడా అమేథీ నుంచి గెలుపొందారు. 2019లో రాహుల్ గాంధీ అమేథీ స్థానం నుంచి స్మృతి ఇరానీ చేతిలో ఓటమిని చవిచూశారు. 2019లో ఆయన వయనాడ్ ఎంపీగా ఎన్నికయ్యారు. 2024 ఎన్నికల్లో రాయ్‌బరేలీ నుంచి పోటీ చేసిన ఆయన అక్కడి ఎంపీగా కొనసాగుతున్నారు. రాహుల్ గాంధీ ఒక్కసారి కూడా కేంద్ర మంత్రి కాలేదు.ఇది కూడా చదవండి: నేడు గీతా జయంతి: రూపాయికే భగవద్గీతను అందిస్తూ.. గీతాప్రెస్ వందేళ్ల ఘన చరిత్ర -
మహిళా జర్నలిస్ట్‌కు సుప్రీం బాసట
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో ప్రభుత్వ నియామకాల్లో రెండు కులాలకు మాత్రమే ప్రాధాన్యత దక్కుతోందని, ఇతర కులాల పట్ల వివక్ష చూపుతున్నారని విమర్శలు చేసినందుకు నాలుగు ఎఫ్ఐఆర్లను ఎదుర్కొంటున్న మహిళా పాత్రికేయురాలు మమతా త్రిపాఠికి సర్వోన్నత న్యాయస్థానం బాసటగా నిలిచింది. ఆమెపై కఠిన చర్యలకు ఉపక్రమించకుండా సుప్రీంకోర్టు ఆమెకు రక్షణగా నిలిచింది. తనపై నమోదైన ఎఫ్ఐఆర్లను కొట్టేయాలంటూ ఆమె పెట్టుకున్న పిటిషన్‌ను జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ పీకే మిశ్రా, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌ల సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం విచారించింది. ఈ అంశంలో మమతపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. ఈ అంశంలో మీ వైఖరేంటో తెలపాలని యూపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ నోటీసులు జారీచేసింది. రాజకీయ దురుద్దేశంతో, పత్రికా స్వేచ్ఛను కాలరాసేందుకు కుట్రపన్ని మమతపై నేరసంబంధ సెక్షన్ల కింద కేసులు నమోదుచేశారని ఈ సందర్భంగా మమత తరఫు సీనియర్ న్యాయవాది సిద్ధా్దర్థ్ దవే వాదించారు. మమత చేసిన వ్యాఖ్యలేంటి? కొన్ని వారాల క్రితం తన సామాజిక మాధ్యమ ఖాతా ‘ఎక్స్’లో మమత పలు పోస్ట్‌లు పెట్టారు. వాటిల్లో ‘యాదవ్ రాజ్ వర్సెస్ ఠాకూర్(సింగ్)రాజ్’ అంటూ ఉత్తరప్రదేశ్‌లో కేవలం రెండు వర్గాలకు మాత్రమే ప్రభుత్వ నియామకాల్లో ప్రాధాన్యత దక్కుతోందని విమర్శించారు. అంతకుముందు మరో జర్నలిస్ట్ అభిõÙక్ ఉపాధ్యాయ్ సైతం యోగి ఆదిత్యనాథ్ సర్కార్‌ను విమర్శిస్తూ ఒక భారీ కథనాన్ని వెలువరిచారు. ‘‘ అఖిలేశ్ యాదవ్ సీఎంగా ఉన్న కాలంలో రాష్ట్ర మీడియా మొత్తం యాదవుల గురించే ప్రత్యేక కథనాలను వండివార్చింది. ఇక యోగి ఆదిత్యనాథ్ హయాంలో ఠాకూర్ల రాజ్యం గురించిన చర్చ కొనసాగుతోంది’’ అని ఆయన పోస్ట్‌చేశారు. అఖిలేశ్‌యాదవ్ కాలంలో యాదవులకే ప్రభుత్వ నియామకాల్లో అధిక ప్రాధాన్యత దక్కిందని, అలాగే యోగి హయాంలో ఠాకూర్లకు కీలక పదవులు దక్కాయని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం కొలువుల్లో కొనసాగుతున్న సంబంధిత ఉన్నతాధికారుల జాబితాలో కొంత భాగాన్ని బహిర్గతంచేశారు. ‘కుల వివక్ష ఉందా? లేదంటే ఠాకూర్ కులస్తులకే కొలువులు కట్టబెడతారా?’ అని ప్రశ్నించారు. ఈ పోస్ట్‌పై స్పందిస్తూ మమత త్రిపాఠి మరికొన్ని పోస్ట్‌లుచేశారు. దీంతో ప్రభుత్వం వీరిపై కేసులు మోపింది. ప్రభుత్వం నేరుగా కేసులు బనాయించకుండా ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ పంకజ్ కుమార్ అనే వ్యక్తిమాటున ఫిర్యాదులు ఇప్పించి ఎఫ్ఐఆర్లు నమోదుచేయించిందని ఆరోపణలున్నాయి. ‘‘ ప్రజాస్వామ్యానికి నాలుగో మూలస్తంభమైన పత్రికాస్వేచ్ఛను అణగదొక్కి నిజాలు, వాస్తవాభిప్రాయాలను అణచివేయలేరు. ఎఫ్ఐఆర్లు నమోదుచేసినంత మాత్రాన ప్రభుత్వ తప్పులు ఒప్పులు అయిపోవు. ప్రభుత్వాలపై పాత్రికేయులు చేసే సద్విమర్శలపై ఎఫ్ఐఆర్లు నమోదుచేయలేరని రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)‘(భావప్రకటనాస్వేచ్చ) స్పష్టంచేస్తోంది’ అని ఆమె తన పిటిషన్లో పేర్కొన్నారు. ఇటీవల మరో జర్నలిస్ట్‌కూ రక్షణ ఇదే ఉదంతంలో అక్టోబర్ 4న లక్నోకు చెందిన మరో జర్నలిస్ట్ అభిõÙక్ ఉపాధ్యాయ్ సైతం తనపై మోపిన ఎఫ్ఐఆర్ను కొట్టేయాలని కోర్టును ఆశ్రయించిన విషయాన్ని న్యాయవాది దవే గుర్తుచేశారు. మమతపై నమోదైన ఎఫ్ఐఆర్లలో ఒకదాంట్లో అభిõÙక్ సహనిందితునిగా ఉన్నారని, ఈనెలలో ఆయనకు ఇచి్చనట్లే కఠిన చర్యల నుంచి రక్షణను మమతకు కూడా ఇవ్వాలని ఈ సందర్భంగా న్యాయవాది ధర్మాసనాన్ని కోరారు. ‘ఎక్స్’లో పోస్ట్‌లు పెట్టారన్న ఒకే ఒక్క కారణంతో పాత్రికేయులను ప్రభుత్వం వేధిస్తోందని ఆయన వాదించారు. దీంతో ‘‘ కేవలం ప్రభుత్వాన్ని విమర్శించారని పాత్రికేయులపై కేసులు మోపడం తగదు’ అని ఆనాడు సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. పాత్రికేయుల హక్కులను రాజ్యాంగం రక్షిస్తోంది: సుప్రీం ఇటీవల మరో జర్నలిస్ట్ అభిషేక్‌కు రక్షణ కల్పిస్తూ ఉత్తర్వులు ఇచి్చన సందర్బంగా సుప్రీంకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘ ప్రజాస్వామ్య దేశాల్లో ప్రతి వ్యక్తి భావప్రకటనా స్వేచ్ఛను గౌరవించాల్సిందే. పాత్రికేయుల హక్కులకు రాజ్యాంగంలోని ఆరి్టకల్ 19(1) (ఏ) కింద రక్షణ ఉంది. పాత్రికేయుల రచనలు ప్రభుత్వానికి విమర్శలుగా అనిపించినంత మాత్రాన వారిపై ప్రభుత్వం నేర సంబంధకేసులు మోపడం తగదు’’ అని కోర్టు స్పష్టంచేసింది. కేసు తదుపరి విచారణను కోర్టు 4 వారాలు వాయిదా వేసింది. -
విష్ణు విశాల్‌కు జంటగా.. 'మమిత బైజూ'
ఏ యాక్టర్‌కైనా బ్రేక్ అనేది ఒక చిత్రంతోనే వస్తుంది. ఆ తరువాత వారి లైఫే మారిపోతుంది. ఇలా చాలా మంది హీరోహీరోయిన్ల జీవితంలో జరిగింది. అలా ప్రేమలు అనే మలయాళ చిత్రంతో నటి మమిత బైజూ లైఫే మారిపోయింది. ఆ చిత్రం మలయాళంలోనే కాకుండా తమిళం, తెలుగు వంటి దక్షిణాది భాషల్లోనూ అనువాదం అయ్యి మంచి వసూళ్లను సాధించింది.ఆ విషయం పక్కన పెడితే అందులో నాయకిగా నటించిన మమిత బైజూకు పిచ్చ క్రేజ్ వచ్చింది. దీంతో అవకాశాలు తలుపు తడుతున్నాయి. అలా తమిళంలో ఇప్పటికే జీవీ ప్రకాశ్ కుమార్‌కు జంటగా రెబల్ చిత్రంలో నటించారు. తాజాగా విష్ణు విశాల్‌తో రొమాన్స్ చేస్తున్నట్లు సమాచారం. విష్ణు విశాల్ ప్రస్తుతం రామ్‌కుమార్ దర్శకత్వంలో నటిస్తున్నారు. వీరి కాంబోలో ఇంతకు ముందు వచ్చిన రాక్షసన్ చిత్రం సంచలన విజయాన్ని సాధించింది.దీంతో తాజాగా దర్శకుడు రామ్‌కుమార్, విష్ణు విశాల్ కలిసి మరో చిత్రం చేస్తున్నారు. ఇందులోనే నటి మమిత బైజూ నాయకిగా నటిస్తున్నట్లు తెలిసింది. ఇది నటుడు విష్ణువిశాల్ కథానాయకుడిగా నటిస్తున్న 21వ చిత్రం కావడం గమనార్హం. ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. కాగా నటి మమిత బైజూ దీంతో పాటు మరో తమిళ చిత్రంలోనూ నటిస్తున్నట్లు సమాచారం. మొత్తం మీద ఈ కేరళా కుట్టి కోలీవుడ్‌లో బాగానే పాగా వేస్తున్నారన్న మాట. -
బీజేడీ ఎంపీ మొహంతా రాజీనామా
న్యూఢిల్లీ: బిజూ జనతాదళ్ రాజ్యసభ ఎంపీ మమతా మొహంతా బుధవారం ఎగువసభలో తన సభ్యత్వానికి రాజీనామా చేశారు. మమత స్వదస్తూరీతో రాజీనామా లేఖను రాసి, తనను కలిసి అందజేశారని, నిబంధనల ప్రకారమే ఉండటంతో ఆమె రాజీనామాను తాను ఆమోదించానని రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ వెల్లడించారు. మమత బీజేపీలో చేరనున్నారని పారీ్టవర్గాలు వెల్లడించాయి. మమత రాజీనామాతో రాజ్యసభలో బీజేడీ బలం ఎనిమిదికి పడిపోయింది. ఒడిశాలో అధికారంలోకి వచి్చన బీజేపీ ఆ స్థానాన్ని దక్కించుకోనుంది. -
జస్ట్ బ్రేక్... అంతే!
మనసుకి నచ్చిన కథ వచ్చే వరకూ కొందరు స్టార్స్ ఖాళీగా ఉంటారు తప్ప ఏ సినిమా పడితే అది చేయరు. కొందరికి నచ్చిన కథ వచ్చినా ఆరోగ్యం బాగా లేక ఇంటిపట్టున ఉండాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. వేరే వ్యక్తిగత కారణాల వల్ల కూడా కొందరు బ్రేక్ తీసుకుంటారు. కారణాలు ఏమైనా ఈ మధ్య కొందరు స్టార్స్ సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. బ్రేక్ తర్వాత కెమెరా ముందుకి వచ్చి, ఆ తారామణులు చేస్తున్న, చేసిన చిత్రాల గురించి తెలుసుకుందాం. ⇒ తెలుగు ప్రేక్షకుల మనసుల్లో లేడీ సూపర్ స్టార్‌గా నిలిచిపోయారు నటి విజయశాంతి. ‘నాయుడమ్మ’ (2006) సినిమా తర్వాత పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి వెళ్లారామె. దాదాపు 14 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మహేశ్‌బాబు హీరోగా నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ (2020) సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు విజయశాంతి.ప్రోఫెసర్ భారతి పాత్రలో తనదైన నటనను, భావోద్వేగాలను ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారామె. ‘సరిలేరు నీకెవ్వరు’ తర్వాత మళ్లీ రాజకీయాల్లో బిజీ అయిన విజయశాంతి దాదాపు మూడున్నరేళ్ల తర్వాత ఓ సినిమా కమిట్ అయ్యారు. కల్యాణ్ రామ్ హీరోగా రూపొందుతున్న తాజా చిత్రంలో నటిస్తున్నారామె. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వైజయంతీ ఐపీఎస్ అనే పవర్ఫుల్ పాత్ర చేస్తున్నారు. ఈ నెల 24న విజయశాంతి పుట్టినరోజుని పురస్కరించుకుని ఆమె పాత్ర తాలూకు గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. ‘వైజయంతీ ఐపీఎస్. తాను పట్టుకుంటే పోలీస్ తుపాకీకి ధైర్యం వస్తుంది.. వేసుకుంటే యునిఫామ్కి ΄ûరుషం వస్తుంది.. తనే ఒక యుద్ధం. మేమే తన సైన్యం’ అంటూ విడుదలైన గ్లింప్స్‌కి అద్భుతమైన స్పందన వస్తోంది. ⇒ తెలుగులో జేజమ్మగా ప్రేక్షకుల మనసు దోచుకున్నారు అనుష్క. గత ఏడాది ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు ఈ బ్యూటీ. 2018లో విడుదలైన ‘భాగమతి’ మూవీ తర్వాత ‘నిశ్శబ్దం’ (2020)లో కథానాయికగా నటించారు. ఈ రెండు చిత్రాలకు మధ్య ‘సైరా’లో అతిథి పాత్ర చేశారు. ‘నిశ్శబ్దం’ తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని, ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ (2023) చేశారు. ఈ చిత్రం విడుదలైన ఏడాదికి కొత్త చిత్రాలు కమిట్ అయ్యారు.ప్రస్తుతం ఆమె ‘కథనార్–ది వైల్డ్ సోర్సెరర్’ అనే మలయాళ సినిమాలో నటిస్తున్నారు. తెలుగులో అంగీకరించిన చిత్రం ‘ఘాటీ’. ఈ చిత్రానికి క్రిష్ దర్శకుడు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ సినిమా రూపొందుతోంది. ఒడిశాలోని ఒక మహిళ జీవితంలో జరిగిన వాస్తవ ఘటన నేపథ్యంలో ‘ఘాటీ’ని తెరకెక్కిస్తున్నారని టాక్. అందుకే ఆంధ్రా–ఒడిశా బోర్డర్లో తొలి షెడ్యూల్ చిత్రీకరణ జరిపారట. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుగుతోంది. ⇒ ‘ఛాతీ మీద చటాకు మాంసం లేదు నువ్వు పెద్ద రౌడీవా?, రేయ్.. నీకంటే పెద్ద రౌడీరా నేను.. ముందు నాతో కొట్లాడు.. సిద్ధిపేటలో అడుగు చాందినీ గురించి చెబుతారు’ అంటూ ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రంలో నభా నటేశ్ చెప్పిన మాస్ డైలాగులు ప్రేక్షకుల మనసుల్లో లోతుగా గుచ్చుకున్నాయి. సుధీర్ బాబు హీరోగా నటించిన ‘నన్ను దోచుకుందువటే’ (2018) సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చారీ బ్యూటీ.ఆ తర్వాత ‘అదుగో, ఇస్మార్ట్ శంకర్, డిస్కో రాజా, సోలో బ్రతుకే సో బెటర్’ వంటి మూవీల్లో నటించారు. కాగా ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీతో హిట్‌ని తన ఖాతాలో వేసుకోవడంతో పాటు ప్రేక్షకుల్లో ‘ఇస్మార్ట్ బ్యూటీ’గా పేరు తెచ్చుకున్నారు నభా. ఓ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఆమె దాదాపు మూడేళ్లు సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. ప్రస్తుతం నిఖిల్ హీరోగా రూపొందుతున్న ‘స్వయంభూ’లో హీరోయిన్గా నటిస్తున్నారు నభా. ⇒ మలయాళ తార మమతా మోహన్‌దాస్ తెలుగులో హీరోయిన్గా నటించిన తొలి చిత్రం ‘యమదొంగ’(2007). ఈ చిత్రంలో ‘చంపేస్తాన్రా రేయ్.. ఆగండ్రా.. రేయ్ యాడికి పోతార్రా.. ఏదో ఒకరోజు దొరకాల.. నెల్లూరు ట్రంకు రోడ్డులో గుడ్డలూడదీసి తంతాను నాయాల్లారా..’ అంటూ ‘యమదొంగ’లో మమతా మోహన్‌దాస్ చెప్పిన డైలాగ్స్ బాగా పాపులర్ అయ్యాయి. ఆ తర్వాత తెలుగులో వరుస అవకాశాలు అందుకున్నారామె.నాగార్జున హీరోగా నటించిన ‘కేడీ (2009) తర్వాత మరో తెలుగు సినిమా చేయలేదు. దాదాపు 14 ఏళ్ల తర్వాత ‘రుద్రంగి’ (2023) చిత్రంతో తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చారు మమతా మోహన్‌దాస్. ఇటీవల ఆమె నటించిన ‘మహారాజ’ (విజయ్ సేతుపతి హీరో) సినిమా ఈ నెల 14న తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది. ⇒ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు శోభన. కృష్ణ, చిరంజీవి, మోహన్‌బాబు, నాగార్జున, వెంకటేశ్, బాలకృష్ణ, రాజేంద్ర ప్రసాద్, జగపతిబాబు వంటి హీరోలందరికీ జోడీగా నటించారామె. ప్రత్యేకించి కార్తీ హీరోగా నటించిన ‘అభినందన’ (1988) సినిమాలో ఆమె నటన అద్భుతం. ఇక ‘సూర్య పుత్రులు’ (1997) తర్వాత దాదాపు పదేళ్లు తెలుగు సినిమాల నుంచి విరామం తీసుకున్న ఆమె మోహన్‌బాబు, విష్ణు మంచు నటించిన ‘గేమ్’ (2006) మూవీతో రీ ఎంట్రీ ఇచ్చారు. ఆ చిత్రం తర్వాత తెలుగులో దాదాపు పద్దినిమిదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి 2898 ఏడీ’ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చారు శోభన. ఈ చిత్రంలో శంబాల రాజ్యానికి చెందిన నాయకురాలు మరియంగా తనదైన నటనతో ఆకట్టుకున్నారామె. ఈ చిత్రం ఈ గురువారం (మే 27) విడుదలైంది. -
పశ్చిమ బెంగాల్లో బీజేపీకి పట్టం? కారణాలివే?
2024 లోక్‌సభ ఎన్నికల ఏడు దశల ఓటింగ్ ముగిసింది. ఎగ్జిట్ పోల్స్ వెల్లడయ్యాయి. అయితే అందరి చూపు జూన్ 4న వెలువడనున్న తుది ఫలితాలపైనే ఉంది. ఇండియా టీవీ సీఎన్ఎక్స్ సర్వే ప్రకారం పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఆధిక్యంలో నిలవనుంది. బీజేపీకి 22-26 సీట్లు వస్తాయని తేలింది. టీఎంసీ 14-18 సీట్లు దక్కించుకునే అవకాశాలున్నాయి. కాంగ్రెస్ 1-2 సీట్లతో సరిపెట్టుకునేలా కనిపిస్తోంది. పశ్చి బెంగాల్లో బీజేపీ ఆధిక్యతకు కారణాలివేనంటూ పలువురు విశ్లేషకులు చెబుతున్నారు.పశ్చిమ బెంగాల్లో హిందూ ఓటర్లు మమతా బెనర్జీ ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారట. దీనికి రుజువుగా సోషల్ మీడియాలో పలు వీడియోలు కనిపిస్తాయి. మమత ప్రభుత్వం ఒక వర్గానికి చెందినవారిని ప్రోత్సహిస్తూ, హిందువులను అణచివేస్తున్నదనే ఆరోపణలున్నాయి.సందేశ్‌ఖాలీ బసిర్హత్ లోక్‌సభ స్థానం పరిధిలోకి వస్తుంది. ఇక్కడి మహిళలపై జరిగిన లైంగిక వేధింపుల ఘటనలో బీజేపీ తృణమూల్ కాంగ్రెస్‌ను కార్నర్ చేసింది. నిందితుడు షాజహాన్ షేక్‌కు టీఎంసీతో సంబంధం ఉందని, అందుకే అతని అరెస్టులో జాప్యంపై జాప్యం చేసిందని బీజేపీ దుమ్మెత్తిపోసింది.బెంగాల్లో ఎన్నికలు జరిగినప్పుడల్లా హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటాయి. దీనిని రాజకీయ పార్టీలు సద్వినియోగం చేసుకుంటున్నాయి. రామ నవమి సందర్భంగా ఊరేగింపుపై రాళ్లు రువ్వడం విషయంలో మమత ప్రభుత్వం మౌనం వహించడాన్ని పలువురు తప్పుబట్టారు. మమతా బెనర్జీపై ప్రజల్లో ఆగ్రహం పెరగడానికి ఇదే ప్రధాన కారణమంటారు.ఈ ఏడాది బెంగాల్‌లోని పలు ప్రాంతాల్లో రామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. రామమందిరంతో బీజేపీకి ప్రత్యక్ష సంబంధం ఉండటంతో బెంగాల్లో బీజేపీకి అనుకూల వాతావరణం ఏర్పడింది.ప్రధానమంత్రి నరేంద్రమోదీ, అమిత్ షా లోక్‌సభ ఎన్నికల సందర్భంగా పలు ర్యాలీలు నిర్వహించారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ ఓటమి తరువాత, ఆపార్టీ బెంగాల్లో మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది. దాని ఫలితంగా ఈ రోజు బీజేపీ బెంగాల్లో ఆధిక్యంలో ఉన్నట్లు సమాచారం.బెంగాల్లో అవినీతి, ఉపాధి లేకపోవడం, ఫ్యాక్టరీల మూసివేత, శాంతిభద్రతల సమస్యలు సర్వసాధారణంగా మారాయి. అటువంటి పరిస్థితిలో ప్రజల్లో అధికార ప్రభుత్వంపై ఆగ్రహం ఏర్పడింది. ఇది కూడా బీజేపీకి ఓట్లు పడేలా చేసిందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. -
‘మమత’ రాష్ట్రంలో మోదీ రికార్డు.. ఏ ప్రాంతాన్నీ వదలని ప్రధాని?
పశ్చిమ బెంగాల్లో ప్రధాని మోదీ సరికొత్త రికార్డు నెలకొల్పారు. మమతా బెనర్జీకి చెందిన టీఎంసీ అధికారంలో ఉన్న పశ్చిమ బెంగాల్‌లోని ఏ ప్రాంతాన్నీ విడిచిపెట్టకుండా ప్రధాని మోదీ ఈ ఏడాది ఏకంగా 22 ర్యాలీలు నిర్వహించారు. ఇంతకు ముందు పశ్చిమ బెంగాల్లో ఏ ప్రధాని కూడా ఇన్ని ర్యాలీలు చేపట్టలేదు.పశ్చిమ బెంగాల్లో మొత్తం 42 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ప్రధాని మోదీ తాను చేపట్టే ర్యాలీలతో పశ్చిమ బెంగాల్‌లోని ప్రతీ ప్రాంతాన్నీ కవర్చేసే ప్రయత్నం చేశారు. ఈసారి పెద్దఎత్తున కాంగ్రెస్ నేతలెవరూ ఇక్కడ ర్యాలీలు చేపట్టకపోవడం విశేషం. మార్చి 16న ఎన్నికల ప్రకటన వెలువడిన అనంతరం ప్రధాని మోదీ బెంగాల్లో భారీ ర్యాలీలు నిర్వహించారు. నేడు (బుధవారం) నిర్వహించే రెండు ర్యాలీలతో మోదీ పశ్చిమ బెంగాల్లో ఈ ఏడాది మొత్తం 22 ర్యాలీలు నిర్వహించినట్లవుతుంది.2021 అసెంబ్లీ ఎన్నికల నుంచి బీజేపీ బెంగాల్‌పై దృష్టి సారించింది. రాష్ట్రంలోని అవినీతి, బంగ్లాదేశ్ నుండి చొరబాట్లు తదితర అంశాలతో ప్రధాని మోదీ అధికార తృణమూల్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. అలాగే రాష్ట్రంలో సీఏఏపై నెలకొన్న గందరగోళాన్ని తొలగించేందుకు ప్రయత్నించారు. సందేశ్‌ఖాలీలోని మహిళల అణచివేతపై దుమ్మెత్తిపోశారు. సందేశ్‌ఖాలీ ప్రాంతంలోని మహిళలకు న్యాయం చేసే విధంగా ఆ ప్రాంతానికి చెందిన రేఖా పాత్రకు టికెట్ ఇచ్చారు. ఈ విధంగా ప్రధాని మోదీ మహిళలకు బీజేపీ అండగా ఉంటుందనే సందేశాన్ని అందించారు. -
తృణమూల్‌లో మమతా vs అభిషేక్ బెనర్జీ?
దేశంలో ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికలు జరుగుతుండగా, అదేసమయంలో తృణమూల్ కాంగ్రెస్‌లో వివాదాలు బహిర్గతమవుతున్నాయి. తాజాగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవి నుంచి కునాల్ ఘోష్‌ను తొలగించారు. పార్టీ అభిప్రాయాలను వ్యతిరేకించినందుకు కునాల్ ఘోష్‌ను ఆ పదవి నుంచి తొలగించినట్లు ప్రభుత్వం ఒక లేఖలో పేర్కొంది. ఈ నేపధ్యంలో తృణమూల్ కాంగ్రెస్‌లో మమత వర్సెస్ అభిషేక్ వివాదం నడుస్తోందని విపక్ష పార్టీ నేతలు పేర్కొంటున్నారు. కునాల్ ఘోష్‌ను ఆ పదవి నుంచి తొలగించిన తర్వాత ఈ అంశం మరింత చర్చనీయాంశంగా మారింది. కునాల్ ఘోష్ తొలగింపు వెనుక తృణమూల్ కాంగ్రెస్ లాబీ పనిచేస్తోందని ప్రతిపక్ష పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం తృణమూల్ కాంగ్రెస్‌లో రెండు లాబీలు ఉన్నాయని ఒకటి మమతా బెనర్జీ, మరొకటి అభిషేక్ బెనర్జీ అని వారంటున్నారు. కునాల్ ఘోష్ గతంలో మమతా బెనర్జీ లాబీ వర్గంలో ఉండేవాడని, ప్రస్తుతం అభిషేక్ బెనర్జీకి మద్దతుదారుగా మారారని ప్రతిపక్షాలు పేర్కొంటున్నాయి.ఇది అసలే అత్త, మేనల్లుడి మధ్య పోరు అని బీజేపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. అత్త, మేనల్లుడి మధ్య జరిగిన పోరులో కునాల్ ఘోష్‌ను తొలగింపునకు గురయ్యారని వారు అంటున్నారు. ఉత్తర కోల్‌కతా నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి సుదీప్ బందోపాధ్యాయ మమత వర్గానికి చెందినవాడని, అయితే సుదీప్ బెనర్జీ గెలవడం అభిషేక్ బెనర్జీకి ఇష్టం లేదని వారు ఆరోపిస్తున్నారు.ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల సమయంలో ఓ అరుదైన ఘట్టం కనిపించింది. ఇటీవల తపస్ రాయ్ తృణమూల్‌ను వీడి బీజేపీలో చేరి, కోల్‌కతా నార్త్ అభ్యర్థిగా మారారు. ఈ నేపధ్యంలో తృణమూల్ రాజ్యసభ మాజీ ఎంపీ, తృణమూల్ అధికార ప్రతినిధి కునాల్ ఘోష్.. తపస్ రాయ్‌పై ప్రశంసలు కురిపించారు. తపస్ రాయ్ టీఎంసీలోనే ఉండాలనుకున్నమని, అయితే అది కుదరలేదని కునాల్ పేర్కొన్నారు. ఆయన చాలా మంచి అభ్యర్థి అని, ప్రజలు కూడా అతనిని అర్థం చేసుకుని ఓటు వేస్తారని కూడా అన్నారు. ఈ వ్యాఖ్యల నేపధ్యంలోనే కునాల్‌పై పార్టీలో వేటు పడిందని, స్థానిక బీజేపీ నేతలు అంటున్నారు. -
ఆ ఐదు చోట్ల అమీతుమీ
పూర్ణియా (బిహార్) ఇక్కడ ఎన్డీఏ కూటమి నుంచి సిట్టింగ్ ఎంపీ, జేడీ(యూ) నేత సంతోష్ కుమార్ కుశ్వాహా ఈసారి హ్యాట్రిక్ కోసం ప్రయత్నిస్తున్నారు. విపక్ష ఇండియా కూటమి తరఫున ఆర్జేడీ నాయకురాలు బీమా భారతీ పోటీలో ఉన్నారు. ఆమె నెల క్రితమే జేడీ(యూ) నుంచి ఆర్జేడీలో చేరారు. కానీ బాహుబలి రాజేశ్ రంజన్ అలియాస్ పప్పూయాదవ్ రంగప్రవేశంతో పోటీ ఒక్కసారిగా ఆసక్తికరంగా మారిపోయింది. ఆయనపై లెక్కలేనన్ని హత్య, హత్యాయత్నం తదితర కేసులున్నాయి. ఐదుసార్లు లోక్‌సభ ఎంపీగా నెగ్గారు. పదేళ్ల తర్వాత మళ్లీ ఎన్నికల బరిలో దిగుతున్నారు. 2015లో ఆర్జేడీ నుంచి బహిష్కరణకు గురయ్యాక జన్ అధికార్ పార్టీ పేరుతో సొంత కుంపటి పెట్టుకున్నారు. కాంగ్రెస్ టికెట్‌పై ఆశతో దాన్ని ఇటీవలే ఆ పార్టీలో విలీనం చేశారు. కానీ కూటమి సర్దుబాటులో ఆ సీటు ఆర్జేడీకి వెళ్లడంతో ఆగ్రహించి స్వతంత్రునిగా రంగంలోకి దిగి ప్రధాన పార్టీల అభ్యర్థులకు పెనుసవాలు విసురుతున్నారు. గతంలో కూడా ఆయన స్వతంత్రునిగా నెగ్గడం విశేషం. సంతోష్ కుమార్‌పై ఓటర్లలో అసంతృప్తి, వ్యతిరేకత కొట్టొచ్చినట్టు కన్పిస్తున్నాయి. పైగా జేడీ(యూ) మాజీ నేత అయిన బీమా భారతీ కూడా ఆ పార్టీ ఓట్లను బాగానే చీల్చేలా కన్పిస్తున్నారు. ప్రణామ్ పూర్ణియా పేరిట పప్పూయాదవ్ చేస్తున్న ప్రచారానికి భారీ స్పందన లభిస్తుండటం విశేషం! రాజ్‌నంద్‌గావ్ (ఛత్తీస్‌గఢ్) ఈ స్థానం బీజేపీకి కంచుకోట. ఈసారి దాన్ని ఎలాగైనా బద్దలు కొట్టాలని కాంగ్రెస్ పట్టుదలగా ఉంది. అందులో భాగంగా తాజా మాజీ సీఎం భూపేశ్ బఘెల్‌ను బరిలో దింపింది. అయితే, కాకాగా ప్రసిద్ధుడైన ఆయన బహుముఖ సవాళ్లను ఎదుర్కొంటున్నారు. నిజానికి సీఎంగా ఈ ప్రాంతాన్ని బఘెల్ ఎంతగానో అభివృద్ధి చేశారు. పైగా ఈ లోక్‌సభ స్థానం పరిధిలోని 8 అసెంబ్లీ సీట్లలో ఏకంగా ఐదు కాంగ్రెస్ ఖాతాలోనే ఉన్నాయి. అయినా ఈసారి కూడా ఇక్కడ బీజేపీదే విజయమని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ఆ పార్టీ తరఫున బరిలో ఉన్న సిట్టింగ్ ఎంపీ సంతోష్ పాండే ఈసారి కూడా విజయంపై ధీమాగా ఉన్నారు. 2000లో రాష్ట్రం ఏర్పడ్డ నాటినుంచి ఒక్కసారి మినహా ఇక్కడ కాషాయ జెండాయే ఎగిరింది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య ఓటమి నేపథ్యంలో ఇక్కడ గెలుపు బఘెల్‌కు తప్పనిసరిగా మారింది. దాంతో ఈ పోరును ఆయన అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సుడిగాలి పర్యటనలతో నియోజకవర్గమంతా చుట్టేస్తున్నారు. నిత్యం ఓటర్లను కలుస్తూ ఓట్లడుగుతున్నారు. కాకపోతే మహదేవ్ బెట్టింగ్ యాప్ కుంభకోణం ఆరోపణలు ఆయన అవకాశాలకు మరింతగా గండికొట్టేలా కన్పిస్తున్నాయి. ఇక్కడి ఓటర్లలో ఆదివాసీలు ఏకంగా 35 శాతం, ఓబీసీలు 30 శాతమున్నారు. నాందేడ్ (మహారాష్ట్ర) ఈ లోక్‌సభ స్థానం కొన్నాళ్ల క్రితం దాకా కాంగ్రెస్‌కు పెట్టని కోట. కానీ ఆ పార్టీ అగ్ర నేత, మాజీ సీఎం అశోక్ చవాన్ ఇటీవల బీజేపీలో చేరడంతో ఇక్కడ సమీకరణాలు పూర్తిగా మారాయి. దానికి తోడు గత ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ పాగా వేసింది. అయితే సిట్టింగ్ బీజేపీ ఎంపీ ప్రతాప్‌రావ్ గోవిందరావ్ పాటిల్ చికలీకర్కు ఇండియా కూటమి తరఫున వసంత్ చవాన్ ఈసారి గట్టి పోటీ ఇస్తున్నారు. దీనికి తోడు ప్రకాశ్ అంబేడ్కర్ పార్టీ వంచిత్ బహుజన్ అఘాఢీ (వీబీఏ) కూడా బరిలో ఉండటంతో ముక్కోణపు పోరు నెలకొంది. ఈ సెగ్మెంట్లో సంఖ్యాధికులైన ఓబీసీలు బీజేపీకి గట్టి ఓటు బ్యాంకు. కానీ అదే సామాజిక వర్గానికి చెందిన వీబీఏ అభ్యర్థి అవినాశ్ భోసికర్ బీజేపీ ఓట్లను చీలుస్తారని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో చికలీకర్ను గెలిపించుకోవాల్సిన బాధ్యతను పార్టీ నాయకత్వం అశోక్ చవాన్‌పై ఉంచింది. దాంతో ఆయన సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. వీబీఏ అభ్యర్థి బీజేపీ వ్యతిరేక ఓట్లనే చీల్చి చికిలీకర్ విజయాన్ని సునాయాసం చేస్తారని చవాన్ చెబుతున్నారు. అమరావతి (మహారాష్ట్ర) రాష్ట్రంలో అత్యంత హోరాహోరీ పోరు నెలకొన్న స్థానాల్లో ఇదొకటి. సిట్టింగ్ ఎంపీ, సినీ నటి నవ్‌నీత్ కౌర్ రాణా ఈసారి బీజేపీ టికెట్‌పై బరిలో ఉన్నారు. ఆమె 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎన్సీపీ దన్నుతో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి కేంద్ర మాజీ మంత్రి ఆనంద్‌రావ్ అడ్సుల్‌పై నెగ్గి తొలిసారి లోక్‌సభలో ప్రవేశించారు. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈసారి మాత్రం ఎదురీదుతున్నారు. ఎందుకంటే ఆమెకు టికెటివ్వడంపై స్థానిక బీజేపీ నేతలు గుర్రుగా ఉన్నారు. ఇది చాలదన్నట్టు ఎన్డీఏ స్థానిక భాగస్వామి ప్రహార్ పార్టీ రాణా అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తమ పార్టీ తరఫున దినేశ్ బూబ్ను పోటీకి నిలిపింది! దీనికి తోడు మహావికాస్ అఘాఢీ కూటమి తరఫున బరిలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే బల్వంత్ వాంఖడేకు నియోజకవర్గమంతటా మంచి పేరుంది. పైగా ఈ లోక్‌సభ స్థానం పరిధిలోని ఆరు అసెంబ్లీ సీట్లలో మూడు కాంగ్రెస్ చేతిలోనే ఉన్నాయి. అయితే వంచిత్ బహుజన్ పార్టీ నుంచి బరిలో ఉన్న అంబేడ్కర్ మనవడు ఆనంద్‌రాజ్ అంబేడ్కర్ కాంగ్రెస్ ఓట్లను భారీగా చీలుస్తారని భావిస్తున్నారు. ఇది రాణాకు బాగా కలిసొచ్చే అంశం. బాలూర్ఘాట్ (పశ్చిమబెంగాల్) పశ్చిమబెంగాల్లో బీజేపీ, అధికార తృణమూల్ కాంగ్రెస్ నడుమ హోరాహోరీ పోటీ నెలకొన్న లోక్‌సభ స్థానాల్లో బాలూర్ఘాట్ ముఖ్యమైనది. ఇక్కడి నుంచి బీజేపీ తరఫున పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, సిట్టింగ్ ఎంపీ సుకాంత మజుందార్ పోటీ చేస్తున్నారు. 2019లో బీజేపీ తొలిసారిగా రాష్ట్రంలో భారీగా సీట్లను గెలుచుకోవడం తెలిసిందే. ఆ ఎన్నికల్లో తృణమూల్ అభ్యర్థి అర్పితా ఘోష్‌పై సుకాంత భారీ మెజారిటీతో నెగ్గారు. దాంతో ఈసారి బాలూర్ఘాట్ను తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సుకాంతను ఎలాగైనా ఓడించి తీరాలని పట్టుదలగా ఉన్నారు. రాష్ట్ర మంత్రి విప్లవ్ మిత్రాను మమత బరిలో దించడంతో పోరు మరింత ఆసక్తికరంగా మారింది. అయినా సుకాంత మాత్రం బాలూర్ఘాట్తో పాటు బెంగాల్ మొత్తాన్నీ మోదీ వేవ్‌లో బీజేపీ క్లీన్‌స్వీప్ చేస్తుందంటున్నారు. ఈసారి కూడా తనకు భారీ మెజారిటీ ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. తృణమూల్ నేతల అంతులేని అవినీతి, సందేశ్‌ఖాలీలో మహిళలపై వారి అకృత్యాలతో రాష్ట్ర ప్రజలు తీవ్రంగా విసిగిపోయారని చెబుతున్నారు. మీరట్ (ఉత్తరప్రదేశ్) ‘టీవీ రాముడు’ అరుణ్ గోవిల్ పోటీతో ఈ లోక్‌సభ స్థానం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. దూరదర్శన్‌లో సీరియల్‌గా వచ్చిన రామాయణంలో రాముని పాత్ర పోషించిన ఆయన దేశవ్యాప్త క్రేజ్ సంపాదించారు. బీజేపీ ఆయనను అనూహ్యంగా పార్టీలో చేర్చుకోవడమే గాక మీరట్ టికెట్ కూడా ఇచ్చింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో యూపీలో 80 స్థానాలకు గాను బీజేపీ 62 చోట్ల నెగ్గడం తెలిసిందే. ఈసారి దేశవ్యాప్తంగా సొంతంగా 370 లోక్‌సభ స్థానాల లక్ష్యాన్ని సాధించాలంటే యూపీలో క్లీన్‌స్వీప్ చేయడం తప్పనిసరని పార్టీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో మీరట్ పరిసరాల్లోని పలు లోక్‌సభ స్థానాల్లో గోవిల్ ప్రభావం చూపుతారన్న అంచనాతో ఆయన్ను బరిలోకి దింపింది. సమాజ్‌వాదీ నుంచి సునీతా వర్మ, బీఎస్పీ నుంచి దేవవ్రత్ కుమార్ త్యాగీ ఆయనకు ప్రత్యర్థులుగా బరిలో ఉన్నారు. -
‘మమత అక్క కాదు.. గయ్యాళి అత్త’
పశ్చిమ బెంగాల్లో సందేశ్‌ఖాలీ ఘటన వెలుగు చూసినప్పటి నుంచి మమత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ ఉద్యమించాయి. అయితే రాష్ట్రంలోని శాంతియుత వాతావరణాన్ని బీజేపీ చెడగొట్టిందని అధికార పార్టీ ఆరోపిస్తోంది. ఇప్పుడు బెంగాల్ రాజకీయాలన్నీ సందేశ్‌ఖాలీ చుట్టూ తిరుగుతున్నాయి. పశ్చిమ బెంగాల్ బీజేపీ సీనియర్ నేత శుభేందు అధికారి మరోసారి బెంగాల్ ముఖ్యమంత్రిని టార్గెట్ చేశారు. మమతా బెనర్జీ ఇప్పుడు అక్క(దీదీ) కాదని, గయ్యాళి అత్తగా మారిపోయారని ఆరోపించారు. ఇకపై మమతా బెనర్జీని ‘దీదీ’ అని పిలవడం మానేయాలని అన్నారు. ఇది అత్త, మేనల్లుడి ప్రభుత్వమని ఆరోపించారు. దీదీ అనే పేరులో మానవత్వం స్ఫురిస్తుందని, అయితే మమతా బెనర్జీలో క్రూరత్వం ప్రతిబింబిస్తోందని ఆరోపించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్‌లో ఆమెను ఓడించానని, అందుకే తనపై 42 కేసులు పెట్టారని శుభేందు అధికారి ఆరోపించారు. పశ్చిమ బెంగాల్‌లోని నార్త్ 24 పరగణ జిల్లాలో ఉన్న సందేశ్‌ఖాలీ గ్రామం నిరసనలకు సాక్షిగా మారింది. ఈ ప్రాంతానికి చెందిన మహిళలు ఇటీవల టీఎంసీ నేత షాజహాన్ షేక్‌తో పాటు ఇతర నేతలు తమ భూములను స్వాధీనం చేసుకున్నారని, లైంగిక దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. ఈ నేపధ్యంలోనే ఈ ప్రాంతం నిరసనలకు నిలయంగా మారింది. -
భారత సాఫ్ట్‌బాల్ జట్టులో తెలంగాణ అమ్మాయి
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక ఆసియా క్రీడల్లో అరంగేట్రం చేయనున్న సాఫ్ట్‌బాల్ క్రీడాంశంలో పాల్గొనే భారత మహిళల సాఫ్ట్‌బాల్ జట్టును సోమవారం ప్రకటించారు. 16 మంది సభ్యులతో కూడిన భారత జట్టులో తెలంగాణ అమ్మాయి మమత గుగులోత్‌కు చోటు దక్కింది. నిజామాబాద్ జిల్లాకు చెందిన మమత గత ఎనిమిదేళ్లుగా జాతీయస్థాయిలో నిలకడగా రాణిస్తోంది. అండర్–14, అండర్–17, అండర్–19 వయో విభాగాల్లో కలిపి మొత్తం 18 సార్లు జాతీయ పోటీల్లో పాల్గొన్న ఆమె పలుమార్లు ‘ఉత్తమ క్యాచర్’గా అవార్డులు అందుకుందని తెలంగాణ రాష్ట్ర సాఫ్ట్‌బాల్ సంఘం ప్రధాన కార్యదర్శి కె. శోభన్ బాబు తెలిపారు. నిజామాబాద్ సుద్దపల్లిలోని సాంఘిక సంక్షేమ స్పోర్ట్స్ అకాడమీలో నీరజ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ తీసుకున్న మమత ప్రస్తుతం భువనగిరిలోని సోషల్ వెల్ఫేర్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ప్రిపరేటరీ డిగ్రీ కాలేజీలో బీఏ రెండో సంవత్సరం చదువుతోంది. ఆసియా చాంపియన్íÙప్లో భారత జట్టు రెగ్యులర్ గా పోటీపడుతుండటంతో ఆసియా సాఫ్ట్‌బాల్ సంఘం భారత జట్టుకు వైల్డ్ కార్డు ఎంట్రీ కేటాయించింది. ఆసియా క్రీడలు సెపె్టంబర్ 23 నుంచి అక్టోబర్ 8 వరకు చైనాలోని హాంగ్జౌలో జరుగుతాయి. -
ఆదర్శంగా నిలుస్తున్న ఫారెస్ట్ అధికారి మమతా ప్రియదర్శి
డ్యూటీ సమయంలో బుద్ధిగా కూర్చుని తమ పని తాము చేసుకుని సమయం అయిపోగానే ఇంటికి వెళ్లిపోయే అధికారులు కొందరయితే, ఆఫీసు పని వేళల తరవాత కూడా పని గురించి ఆలోచించి వినూత్న నిర్ణయాలతో అందరికి ఆదర్శంగా నిలుస్తుంటారు మరికొందరు. ఈ రెండో కోవకు చెందిన వ్యక్తే జార్ఖండ్ ఫారెస్ట్ అధికారి మమతా ప్రియదర్శి. పర్యావరణం గురించి అవగాహన కల్పించడంతో పాటు జంతువులకు మనుషులకు మధ్యన సంధి కుదురుస్తూ అందరికీ ప్రేరణగా నిలుస్తోంది. జంషెడ్పూర్ డివిజినల్ ఫారెస్ట్ అధికారిగా పనిచేస్తోంది మమతా ప్రియదర్శి. ఫారెస్ట్ అధికారిగా అడవులను సంరక్షించడంతో పాటు పర్యావరణం దెబ్బతినకుండా ఉండేందుకు శాయశక్తులా కృషిచేస్తోంది. ప్రకృతి ప్రాముఖ్యత, కాపాడుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెబుతూ రేపటి పౌరులకు అవగాహన కల్పిస్తున్నారు. వాతావరణంలో చోటు చేసుకుంటోన్న మార్పులు, నీటి సంరక్షణ, మనుషులు– జంతువుల మధ్య ఏర్పడే సంఘర్షణలపై విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు వివిధ రకాల డాక్యుమెంటరీలను ప్రదర్శన ఏర్పాటు చేసింది. ఇప్పటిదాకా 347 గ్రామాలు, వివిధ స్కూళ్లలో ప్రదర్శించిన డాక్యుమెంటరీలతో రెండున్నర లక్షలమందికిపైగా అవగాహన కల్పించింది. వ్యాన్‌కు పెద్ద ఎల్ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేసి పర్యావరణ పరిరక్షణ గురించి వివరించి చెబుతున్నారు. ఈ కార్యక్రమం గురించి ఆమె మాటల్లోనే... ‘‘ఈ మధ్యకాలంలో తరచూ అడవుల్లో మంటలు రేగి చాలా వృక్షాలు కాలిపోతున్నాయి. దీనివల్ల పర్యావరణ సమతుల్యం దెబ్బతింటోంది. అసలు అడవులు ఎందుకు తగలబడుతున్నాయో కూడా ఈ చుట్టుపక్కల నివసిస్తోన్న చాలామందికి తెలీదు. ఏనుగులకు, మనుషులకు మధ్య తరచూ సమస్యలు ఏర్పడుతున్నాయి. ఇలాంటి వాటన్నింటిని అధిగమించడానికి తీసుకొచ్చిందే ఈ కార్యక్రమం. అందుకే ఆడియో–వీడియో జంతువులకు ఎలాగూ అర్థం చేయించలేము. మనమే అర్థం చేసుకుని వాటికి అడ్డు తగలకుండా, మూగజీవాలు మనకి ఇబ్బంది కలిగించకుండా మనమే సర్దుకుపోవాలి. అందుకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ... కూర్చోబెట్టి చెపితే ఎవరూ వినరు. అందుకే ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేసి వారి ఆసక్తిని ఇటు మళ్లిస్తున్నాం. కొంతవరకైనా గుర్తుపెట్టుకుని పాటిస్తారు. ఈ డాక్యుమెంటరీలలో నాలుగు విభిన్న అంశాలపై వీడియోలు ప్లే చేస్తున్నాం. మనుష్యులు– జంతువుల సంఘర్షణ మొదటిది, రెండో వీడియోలో అడవులు తగలబడినప్పుడు ఏం చేయాలి... మూడో అంశంగా కర్బన ఉద్గారాలు విడుదలవకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉంటాయి. నాలుగో అంశం మొక్కల పెంపకం, మొక్కలను ఎలా కాపాడాలి, నీటిసంరక్షణ గురించి సరళమైన భాషలో చెబుతున్నాం. వీటివల్ల విద్యార్థులు, గ్రామస్థులకు సులభంగా అర్థమవుతుంది. స్కూళ్లు, పబ్లిక్ ప్లేసుల్లో.. ఇప్పటిదాకా స్కూళ్ళతో పాటు, గ్రామాల్లోని పబ్లిక్ పేసుల్లో వ్యాన్ వీడియోలు ప్లేచేసి వీలైనంత అవగాహన కల్పించాం. పాఠ్యపుస్తకాల్లో సిలబస్ కాకుండా కొత్త విషయాలు తెలుసుకున్నందుకు వాళ్లు చాలా సంతోషపడుతున్నారు. -
పీఎఫ్ఆర్డీఏ చైర్మన్‌గా దీపక్ మొహంతీ
న్యూఢిల్లీ: పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ) చైర్మన్‌గా దీపక్ మొహంతీను ప్రభుత్వం నియమించింది. జనవరిలో పదవీకాలం ముగిసిన సుప్రతిమ్ బంద్యోపాధ్యాయ స్థానంలో ఆయన నియామకం జరిగింది. ప్రస్తుతం పీఎఫ్ఆర్డీఏ సభ్యునిగా ఆయన పనిచేస్తున్నారు. మొహంతీ ఆగస్టు 2020లో మూడేళ్ల కాలానికి లేదా 62 ఏళ్ల వయస్సు వచ్చే వరకు పీఎఫ్ఆర్డీఏ మెంబర్‌గా (ఎకనామిక్) గతంలో నియమితులయ్యారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేసిన అపార అనుభవం కూడా ఆయనకు ఉంది. తాజా నియామకానికి సంబంధించి వెలువడిన ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం, ఇళ్లు, కారు సౌకర్యం లేకుండా మొహంతీ నెలకు రూ.4.50 లక్షల కన్సాలిడేటెడ్ వేతనం పొందుతారు. పదవి బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి 65 ఏళ్లు వచ్చే వరకు లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఈ బాధ్యతల్లో ఆయన పనిచేస్తారు. మెంబర్‌గా...మమతా శంకర్ మొహంతీ తాజా నియామకం నేపథ్యంలో ఆయన స్థానంలో పీఎఫ్ఆర్డీఏ మెంబర్‌గా (ఎకనామిక్) మమతా శంకర్ నియమితులయ్యారు. ఇండియన్ ఎకనమిక్ సర్వీస్ (1993)లో ఉన్న ఆమె ప్రస్తుతం ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖలో సీనియర్ ఎకనమిక్ అడ్వైజర్‌గా పనిచేస్తున్నారు. మూడేళ్ల కాలానికి లేదా 62 ఏళ్ల వయస్సు వచ్చే వరకు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు (ఏది ముందుగా అయితే) ఆమె ఈ బాధ్యతల్లో కొనసాగుతారని ప్రత్యేక నోటిఫికేషన్ పేర్కొంది. పెన్షన్ నిధులు ఇలా... నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్) అలాగే అటల్ పెన్షన్ యోజన కింద నిర్వహణలో ఉన్న మొత్తం ఆస్తుల (ఏయూఎం) విలువ 2023 మార్చి 4వ తేదీ నాటికి రూ. 8.81 లక్షల కోట్లు. దేశంలోని పెన్షన్ పరిశ్రమను ప్రోత్సహించడం, నియంత్రించడం, అభివృద్ధి చేయడం లక్ష్యంగా 2003లో పీఎఫ్ఆర్డీఏ ఏర్పాటయ్యింది. దీనిని మొదట్లో ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా నిర్దేశించడం జరిగింది. అయితే తదుపరి స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తులు, ఎన్‌ఆర్‌ఐలుసహా అన్ని భారత పౌరులు అందరికీ అథారిటీ సేవలను విస్తరించడం జరిగింది. వ్యవస్థీకృతంగా పెన్షన్ నిధుల ప్రోత్సాహం, అభివృద్ధి, నియంత్రణ వంటి కీలక కార్యకలపాలాను అథారిటీ నిర్వహిస్తుంది. ప్రజల వృద్ధాప్య ఆదాయ అవసరాలను, వనరులను స్థిర ప్రాతిపదికన అందించడంలో ఎన్పీఎస్ కీలక పాత్ర పోషిస్తోంది. -
వేతన వివక్ష
జెండర్ ఈక్వాలిటీ కోసం సమాజంలో దశాబ్దాలుగా ఒక నిశ్శబ్ద ఉద్యమం సాగుతూనే ఉంది. కానీ మహిళ అయిన కారణంగా వేతనంలో వివక్ష ఇంకా కొనసాగుతూనే ఉంది. వేతనంలో అసమానతలకు బీజాలు అడుగడుగునా పడుతూనే ఉన్నాయి. ఈ విషయంలో పాశ్చాత్య దేశాల పరిస్థితి కొంత మెరుగ్గా ఉందని, మనదేశంలో సమానత సాధనలో అంతరం పెరుగుతోందని, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ఐఎల్వో) నివేదికను ఉదహరించారు సామాజిక కార్యకర్త మమతా రఘువీర్. ఆమె తన అధ్యయన వివరాలను సాక్షితో పంచుకున్నారు. ఐటీలోనూ ఉంది! ‘‘చదువులో సమానత్వసాధనలో లక్ష్యానికి దగ్గరకు వస్తున్నట్లే చెప్పాలి. కానీ ఉద్యోగాల దగ్గరకు వచ్చేటప్పటికి సమానత్వం చాలాదూరంలోనే ఉంది. అలాగే ఉద్యోగంలో వేతనాలు కూడా. ఐఎల్వో గ్లోబల్ రిపోర్ట్ 2020–21లో విడుదల చేసిన నివేదిక అతిపెద్ద ఆశనిపాతం. 1993–94లో మగవాళ్లకు ఆడవాళ్లకు మధ్య వేతన దూరం 48 శాతం ఉండేది. 2018–19 నాటికి ఆ దూరం తగ్గి 28 శాతానికి చేరింది. అయితే కరోనా కుదుపుతో మహిళల వేతనాల తగ్గుదల ఏడు శాతం పెరిగింది. ఇప్పుడు మగవాళ్లకు మహిళలకు మధ్య వేతన అసమానత 35 శాతం. వ్యవసాయరంగం, భవన నిర్మాణరంగం వంటి అవ్యవస్థీకృత రంగాల్లోనే ఈ అసమానత అనుకుంటాం. కానీ ఐటీ, సాఫ్ట్వేర్ రంగాల్లో కూడా తేడా ఉంటోందని లింక్డ్ ఇన్ చేసిన సర్వేలో వెల్లడైంది. వేతనంలో కనిపిస్తున్న జెండర్ గ్యాప్, జెండర్ డిస్క్రిమినేషన్తోపాటు హెరాస్‌మెంట్‌ను కూడా ప్రస్తావించింది లింక్డ్ ఇన్. మెటర్నిటీ లీవులేవీ! వేతనంలో జెండర్ డిస్క్రిమినేషన్‌కు గురి కానిది ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే. కాంట్రాక్ట్ ఉద్యోగులు, ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగులు ఈ వివక్షకు గురవుతూనే ఉన్నారు. మరో విషయం ఏమిటంటే. ఒకేసారి ఉద్యోగంలో చేరిన మగవాళ్లకు ఆడవాళ్లకు మధ్య ఏళ్లు గడిచేకొద్దీ వేతనంలో తేడా పెరుగుతూనే ఉంటోంది. ఇందుకు కారణం కుటుంబ బాధ్యతలు, తల్లి అయినప్పుడు తీసుకునే విరామం. చాలా కంపెనీలు మహిళలకు వేతనంతో కూడిన మెటర్నిటీ లీవు ఇవ్వడం లేదు. గర్భిణి అనగానే ఏదో ఓ కారణంతో ఉద్యోగం నుంచి తొలగించడంతోపాటు ఒకవేళ సెలవు ఇచ్చినా వేతనం ఇవ్వని కంపెనీలు కొల్లలు. ఇక కాంట్రాక్టు ఉద్యోగంలో ఉన్న మహిళలకు జరిగే అన్యాయం మీద దృష్టి పెట్టే సమయం ప్రభుత్వాలకు ఉండడం లేదు. ఏడేళ్లే ఉంది! యూఎన్ఓ సూచించిన లక్ష్యాల్లో ‘సస్టెయినబుల్ డెవలప్మెంట్ గోల్ నంబర్ 8’ ఒకటి. దీని ప్రకారం 2030 నాటికి సమాన వేతన సాధన అనే లక్ష్యాన్ని సాధించాలి. ఆ గడువు ముగియడానికి ఏడేళ్లే ఉంది. లక్ష్య సాధనలో మనం మరింత దూరం జరుగుతున్నాం తప్ప దగ్గరకు చేరడం లేదు. నాకు తెలిసిన ఐఐటీ , ఐఐఎమ్‌లో చదివిన మహిళలు కూడా కంపెనీ వైస్ ప్రెసిడెంట్ వరకు వెళ్ల గలుగుతున్నారు. ఆ తర్వాత స్థానాలకు వెళ్లడం లేదు, వెళ్లడం లేదు అనేకంటే వెళ్లనివ్వడం లేదు అనడమే కరెక్ట్. సంఖ్యాపరంగా మహిళా ఉద్యోగులు దాదాపు సమానంగా ఉన్న కంపెనీల్లో కూడా ప్రెసిడెంట్, డైరెక్టర్ స్థానాల్లో మహిళలను చూడలేం. ఆశావహంగా అనిపించే విషయం ఏమిటంటే... మునుపటి తరం కంటే ఈ తరం అమ్మాయిలు గట్టిగా నిలబడగలుగుతున్నారు. రాబోయే తరం ఇంకా గట్టి మనో నిబ్బరంతో ముందడుగు వేస్తారని నా ఆకాంక్ష’’ అన్నారామె. అవకాశాల్లోనే హంసపాదు పబ్లిక్ సెక్టార్‌లోనూ, ప్రభుత్వ రంగంలోనూ అనేక ఆఫీసుల్లో వర్క్ ప్లేస్ హెరాస్మెంట్ కమిటీల్లో మెంబర్‌గా ఉన్నాను. మగ అధికారులు ఉద్యోగినులతో ‘నీకు ఇవన్నీ రావు, పక్కన ఉండు’ అంటారని తెలిసింది. ఐటీ రంగంలో అయితే కంపెనీ ప్రతినిధిగా బయటి నగరాలకు, విదేశాలకు వెళ్లి ప్రాజెక్టు నిర్వహించే అవకాశాలు మహిళలకు కాకుండా జూనియర్ అయిన మగవాళ్లకు దక్కుతున్న సందర్భాలే ఎక్కువ. చాలెంజింగ్ ప్రాజెక్టుల్లో తమను తాము నిరూపించుకునే అవకాశాల దగ్గరే వెనక్కు లాగుతుంటే... ‘ఒకే సీనియారిటీ – ఒకే వేతనం’ అనే సమానత్వం ఎక్కడ నుంచి వస్తుంది? – మమతారఘువీర్ ఆచంట, ఫౌండర్, తరుణి స్వచ్ఛంద సంస్థ, టెక్నికల్ డైరెక్టర్, భరోసా, తెలంగాణ – వాకా మంజులారెడ్డి -
మానవత్వం: మమతమ్మా... నీ మేలు మరువనమ్మా!
సమైక్య భావన స్ఫూర్తి గురించి చెప్పడానికి... పెద్ద పెద్ద సిద్ధాంతాలే అక్కర్లేదు. చిన్న సంఘటనలు చాలు! ఆరోజు ఏమైందంటే... థానే (ముంబై)లోని దివ రైల్వేస్టేషన్, ప్లాట్‌ఫామ్ నంబర్:1 ఎప్పటిలాగే ఆ ఉదయం రైలు బండ్ల శబ్దాలు, ప్రయాణికుల అరుపులు, కేకలతో ౖరైల్వేస్టేషన్ సందడిగా ఉంది. తిత్వాల ప్రాంతానికి చెందిన నజ్‌మింజహాన్ తన భర్త ఫసిముద్దీన్తో కలిసి ప్లాట్‌ఫామ్ పైకి వచ్చింది.ఆమె గర్భిణి. రొటీన్–చెకప్‌లో భాగంగా నాయర్ హాస్పిటల్ వెళ్లడానికి రైల్వేస్టేషన్‌కు వచ్చింది. కొద్దిసేపటి తరువాత... ఆమెకు పురిటినొప్పులు మొదలయ్యాయి. భర్త ఆందోళన పడుతున్నాడు. అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు గానీ ఏం చేయాలో ఎవరికీ పాలుపోవడంలేదు. ‘ఎవరో ఒకరు ఆమెను హాస్పిటల్‌కు తీసుకెళతారులే’ అని ఎవరికి వారు అనుకుంటున్నట్లుగా ఉంది పరిస్థితి. కొందరు మాత్రం రైల్వే అధికారులకు ఫోన్ చేశారు. హుటాహుటిన రైల్వే అధికారులతోపాటు అక్కడికి వచ్చింది ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ మమత దంగి. నొప్పులు ఎక్కువయ్యాయి. ప్లాట్‌ఫామ్‌పై ఉన్న మహిళా రైల్వే ఉద్యోగులు, మహిళా ప్రయాణికులతో మాట్లాడి వారిని నజ్‌మింజహాన్ దగ్గరకు తీసుకువచ్చింది మమత. అందుబాటులో ఉన్న వస్తువులతో మేక్‌షిఫ్ట్ క్లాత్ కర్టెన్ను తయారుచేసింది. అందరిలో ఉత్కంఠ! ఏమవుతుందో ఏమో!! ఎవరి ఇష్ట దైవాన్ని వారు ప్రార్థిస్తున్నారు. వారి ప్రార్థనలు ఫలించాయి. నజ్‌మింజహాన్ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది... ‘హమ్మయ్య’ అనుకున్నారు జనాలు. ‘ఆమె మీ ఇంటి అమ్మాయే అనుకోండి... ఒకసారి రండి.... ప్లీజ్... చేతులెత్తి దండం పెడతాను’ అనే మమత మాటలు ప్రయాణికులను కదిలించాయి. ఆ తరువాత...తల్లీబిడ్డలను దివలోని ఒక ప్రైవెట్ హాస్పిటల్లో చేర్పించారు. తల్లీబిడ్డలను హాస్పిటల్లో చేర్పించడానికి ప్రయాణికులు కొందరు తమ ప్రయాణాలు మానుకొని మరీ హాస్పిటల్‌కు వచ్చారు. ఇప్పుడు తల్లీబిడ్డలు ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. ‘ఇలాంటి దృశ్యాలను సినిమాల్లో చూస్తుంటాం. నిజజీవితంలో చూడడం ఇదే మొదటిసారి. నిజానికి ఆరోజు నేను అర్జంటుగా వేరే చోటుకు వెళ్లాలి. ట్రైన్ వచ్చే సమయం అయింది. అయితే మమత మాటలు నన్ను కదిలించాయి. నా పని, ప్రయాణం గురించి పట్టించుకోకుండా ఆమెతోపాటు వెళ్లాను’ అంటుంది సహాయక కార్యక్రమంలో పాల్గొన్న గాయత్రి. సెంట్రల్ రైల్వే చీఫ్ పీఆర్వో శివాజీ సతారా మమత కృషిని ప్రత్యేకంగా ప్రశంసించారు. -
కలెక్టర్ కాకపోయినప్పటికీ.. ప్రతిభా, నైపుణ్యాలు, కాలం కలిసివచ్చి..
జీవితంలో ఎన్నో అనుకుంటాము. వాటిలో కొన్ని మాత్రమే జరుగుతాయి. అనుకున్నవి జరగలేదని బాధపడుతూ అక్కడే ఆగిపోయేవారు కొందరైతే.. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని ముందుకు సాగిపోతుంటారు మరికొందరు. ఈ కోవకు చెందిన మమతా తివారి తొలుత ఐఏఎస్ కావాలనుకుంది. అయితే కొన్ని పరిస్థితుల కారణంగా కలెక్టర్ కాకపోయినప్పటికీ.. తన ప్రతిభా నైపుణ్యాలు, కలిసొచ్చిన కాలాన్ని ఒడిసిపట్టుకుని సామాజిక సేవాకార్యక్రమాలు చేస్తూ ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తోంది. మధ్యప్రదేశ్‌లోని నర్సింగ్ఘడ్కు చెందిన ఓ జడ్జి కుటుంబంలో 1963 మే 14న పుట్టింది మమతా తివారి. తండ్రి వృత్తిరీత్యా వివిధ ప్రాంతాల్లో మమత బాల్యం గడిచింది. ఆ సమయంలో చూడడానికి టీవీలు పెద్దగా అందుబాటులో ఉండేవి కావు. దీంతో పుస్తకాలతోనే కాలక్షేపమయ్యేది. ఏడో తరగతి నుంచే మమత తన తండ్రి గ్రంథాలయం నుంచి పుస్తకాలను తెచ్చుకుని చదువుకునేది. బాల్యంలోనే బెంగాలి సాహిత్యం మొత్తం చదివింది. అమృత ప్రీతమ్, ప్రేమ్‌చంద్, గీతాంజలితోపాటు అనేక మంది కొత్త కవుల రచనలను చదివేది. వయసుతోపాటు తన అభిరుచులు మారడంతో నవలలు చదవడమేగాక, గద్యాలను రాయడం ప్రారంభించింది మమత. ఐఏఎస్ అనుకుంది కానీ... రసాయన శాస్త్రంలో ఎమ్మెస్సీ చేసిన మమత.. రెండేళ్లపాటు టీచర్‌గా పనిచేసింది. ఇంట్లో అందరికంటే చిన్నది కావడంతో అంతా ఐఏఎస్ లేదా పీహెచ్డీ చేయమని ప్రోత్సహించారు. వారి సలహా మేరకు ఐఏఎస్ ప్రిపరేషన్ ప్రారంభించింది. కానీ కొంతకాలానికే మంచి సంబంధం రావడంతో పెళ్లి చేసుకుని భోపాల్ వెళ్లింది. పదిహేనేళ్ల తరువాత... పెళ్లయ్యాక పదిహేనేళ్లపాటు గృహిణిగా ఇంటిబాధ్యతలు చూసుకుంటూనే కంప్యూటర్ కోర్సు నేర్చుకుంది. మమత భర్త ఓ నిరుపేద విద్యార్థిని చదివించి ఇంజినీర్ని చేశాడు. అతను చూసుకుంటాడన్న నమ్మకంతో కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ను పెట్టాడు. కానీ అతను మోసం చేసి వెళ్లిపోయాడు. దీంతో ఇన్స్టిట్యూట్ పరిస్థితి ఎలాగా... అనుకుంటోన్న సమయంలో... మమత మరిది మీరు చూసుకోండి వదినా.. అని ప్రోత్సహించడంతో కంప్యూటర్ సెంటర్ నిర్వహణ బాధ్యతలు భుజాన వేసుకుంది. ప్రారంభంలో గృహిణులకు ఉచితం గా కంప్యూటర్ కోర్సులు నేర్పించడం ప్రారంభించింది. తర్వాత దివ్యాంగ పిల్లలకు కోర్సులు నేర్పించేది. ఒకపక్క ఇన్స్టిట్యూట్ను నడుపుతూనే ‘సమీరా’ అనే మ్యాగజీన్లో ప్రచురితమయ్యే సాహిత్యం కంటెంట్‌ను ఎడిట్ చేసేది. మరోపక్క తను రాసిన గద్యాలతో ‘వాట్ ఈజ్ లైఫ్ సేయింగ్’ పేరిట తొలి పుస్తకాన్ని విడుదల చేసింది. ఆ తరువాత ఈ పుస్తకం మీద మరికొన్ని సిరీస్‌లు విడుదల చేసింది. ఇప్పటిదాక మమత స్వయంగా రాసి విడుదల చేసిన పుస్తకాలు పదకొండు. ఈ సాహిత్య రచనలకు అనేక పురస్కారాలు, అవార్డులు మమతను వరించాయి. సేవా కార్యక్రమాలు.. కంప్యూటర్ కోర్సులు నేర్పించడంతోపాటు, సాహిత్య రచనలు ఇంకా ‘న్యూ పర్వర్రీష్’ పేరిట అనాథ ఆశ్రమం స్థాపించి అనాథ పిల్లలకు భోజన వసతి సదుపాయాలు కల్పిస్తుంది మమత. కవిత్వం రాయడంతోపాటు, ఆర్టికల్స్‌ను రచిస్తోంది. కొన్నిసార్లు దూరదర్శన్‌లో, ఆల్ ఇండియా రేడియోలో కవిత్వాలు చదివి వినిపించింది. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లలో యాక్టివ్‌గా ఉంటూ కవితలు పోస్టు చేస్తుంది. ‘జీవితం అనేక అవకాశాలు ఇస్తుంది. వాటిని అందిపుచ్చుకుని ముందుకు సాగుతున్నాను. వాటిలో కొన్ని సమాజానికి ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాను’’ అని చెబుతోంది మమతా తివారి. చదవండి: Chaganti Koteswara Rao: సచిన్ ఇల్లు కట్టుకుంటున్న వేళలో..... అలా చేశాడు కాబట్టే! -
మమతకు చాముండేశ్వరీనాథ్ రూ. 5 లక్షల చెక్
హైదరాబాద్ సీనియర్ మహిళల క్రికెట్ జట్టు వికెట్ కీపర్ మమతకు తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం ఉపాధ్యక్షుడు చాముండేశ్వరీనాథ్ ప్రోత్సాహక నగదు బహుమతి అందించారు. ఇటీవల అండర్–19 చాలెంజర్ ట్రోఫీలో ఇండియా ‘బి’ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన మమతకు చాముండేశ్వరీనాథ్ రూ. 5 లక్షల చెక్‌ను ప్రదానం చేశారు. ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రాంజల నవీ ముంబై: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య మహిళల టోర్నీలో హైదరాబాద్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. మంగళవారం జరిగిన సింగిల్స్ తొలి రౌండ్లో ప్రాంజల 6–4, 5–7, 6–1తో వైదేహి (భారత్) పై గెలిచింది. మరో తొలి రౌండ్ మ్యాచ్‌లో హైదరాబాద్‌కే చెందిన రష్మిక 2–6, 4–6తో డయానా (లాత్వియా) చేతిలో ఓడింది. చదవండి: INDIA Vs South Africa: షమీ చేతిలో సఫారీ సఫా.. 197 ఆలౌట్.. భారత్‌కు భారీ ఆధిక్యం -
మమత బదిలీ.. మరునాడే నిలిపివేత!
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ)లోని కూకట్పల్లి జోనల్ కమిషనర్ వి.మమత బదిలీని మున్సిపల్ పరిపాలన శాఖ ఒక్కరోజులోనే నిలిపివేసింది. ఆమెను ఎల్.బి.నగర్ జోనల్ కమిషనర్‌గా బదిలీ చేస్తూ ప్రభుత్వకార్యదర్శి సి.సుదర్శన్‌రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆమెతోపాటు మరో నలుగురు జీహెచ్ఎంసీ పరిధిలోని జోనల్/అదనపు కమిషనర్లను కూడా బదిలీ చేశారు. అయితే విధుల్లో చేరకముందే బుధవారం సాయంత్రానికల్లా మమత బదిలీని నిలిపివేస్తూ తాజాగా ఉత్తర్వులు వెలువడ్డాయి. కూకట్పల్లి జోనల్ కమిషనర్‌గా బదిలీ అయిన జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ పంకజను తాజాగా ఎల్.బి.నగర్‌కు మార్చారు. రాష్ట్రవ్యాప్తంగా దీర్ఘకాలికంగా ఒకేచోట పనిచేస్తున్న స్పెషల్, సెలక్షన్ గ్రేడ్, అదనపు డైరెక్టర్, అదనపు కమిషనర్ స్థాయి అధికారులను బదిలీ చేయాలని మున్సిపల్ పరిపాలన శాఖ నిర్ణయించింది. జీహెచ్ఎంసీ పరిధిలోని నగర శివారు జోన్ల కమిషనర్లను తొలుత బదిలీ చేసింది. శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ రవికిరణ్‌ను ఖైరతాబాద్‌కు, ప్రధాన కార్యాలయంలో ఉన్న అదనపు కమిషనర్, ఐఏఎస్ అధికారి ప్రియాంకను శేరిలింగంపల్లికి బదిలీ చేశారు. ఎల్బీ నగర్ జోనల్ కమిషనర్ ఉపేందర్‌ను నల్లగొండ మున్సిపల్ కమిషనర్‌గా బదిలీచేశారు. త్వరలోనే మరిన్ని బదిలీలు రాష్ట్రంలోని పలు కార్పొరేషన్లు, ఏ గ్రేడ్ మున్సిపాలిటీలకు చెందిన కమిషనర్ల పనితీరు ఆధారంగా త్వరలో బదిలీల ప్రక్రియ సాగనుందని సమాచారం. స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు, మేయర్లతో సత్సంబంధాలు కొనసాగించనివారిపై కూడా బదిలీ వేటు పడే అవకాశముందని తెలుస్తోంది. జీహెచ్ఎంసీతోపాటు శివార్లలో కొత్తగా ఏర్పాటైన కార్పొరేషన్లు, మున్సిపాలిటీలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులు కూడా స్థానభ్రంశం చెందనున్నారు. ఈ మేరకు కసరత్తు పూర్తి చేసిన అధికారులు ఆమోదం కోసం సర్కారుకు ఫైల్ పంపించినట్లు సమాచారం. -
మమత హత్య కేసు: వీడని మిస్టరీ!
సాక్షి, నిజామాబాద్: సిరికొండ మండలం న్యావనందిలో జరిగిన మమత హత్య కేసు మిస్టరీ ఇంకా వీడలేదు. ఎన్నో హత్య కేసులు ఛేదించిన పోలీసులకు ఈ కేసు మాత్రం ముచ్చెమటలు పట్టిస్తోంది. హత్య జరిగి 45 రోజులు గడుస్తున్నా పోలీసులకు కనీసం ఆధారాలు కూడా లభించకపోవడంతో రాజకీయ దుమారం రేగుతోంది. అధికార పార్టీకి చెందిన వారి హస్తం ఉందంటూ ప్రతిపక్ష పార్టీ ఆరోపిసోతంది. అనవసర ఆరోపణలు చేస్తున్నారని అధికార పార్టీ నేతలు తిప్పికొడుతున్నారు. ఇటీవల బీజేపీ నేతలు గ్రామస్తులతో కలిసి సీపీ కార్యాలయం వద్ద ఆందోళన సైతం నిర్వహించారు. ఈ హత్య కేసు రాజకీయ రంగు పులుముకోవడంతో పోలీసులపై తీవ్ర ఒత్తిడి పెరిగినట్లు తెలుస్తోంది. అక్టోబర్ 3న హత్య న్యావనంది గ్రామంలో అక్టోబర్ 3న మమత తన పొలంలో పని చేసుకునేందుకు వెళ్లింది. రాత్రి అయినా తిరిగి రాకపోవడంతో బంధువులు వెతకసాగారు. ఈ క్రమంలో మమత తన పొలంలోనే శవమై కనిపించింది. గ్రామస్తులకు సమాచారం తెలియడంతో హుటహుటిన పొలంలోకి తరలివెళ్లారు. మమత హత్యకు గురైందని పోలీసులకు సమచారం అందించారు. దీంతో సిరికొండ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేశారు. అయితే కేసులో ఎంతకీ పురోగతి కనిపించకపోవడంతో పార్టీల మధ్య ఆరోపణలు ప్రారంభమయ్యాయి. ఆధారాలు దొరకక అవస్థలు మమత హత్యకేసును ఛేదించే క్రమంలో పోలీసులకు సరైన ఆధారాలు లభించడంలేదు. దీంతో అన్ని కోణాల్లో విచారణ చేస్తున్న పోలీసులు అనుమానం ఉన్న వారందరినీ విచారిస్తున్నారు. అయినా సరైన ఆధారాలు లభించకపోవడంతో మరింత లోతుగా విచారిస్తున్నారు. హత్య చేయబడిన స్థలానికి గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో అక్కడ ఆధారాలను గుర్తించలేకపోయిన ట్లు పోలీసులు చెబుతున్నారు. మరో వైపు గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్న వారిని సైతం విచారిస్తున్నారు. అయినా కూడా సరైన ఆధారాలు లభించడంలేదని పోలీసులు తెలుపుతున్నారు. ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు మమత హత్య కేసును ఛేదించేందుకు సీపీ కార్తికేయ ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఏర్పాటు చేశారు. ఇందులో సీసీఎస్ ఏసీపీ స్వామి, రుద్రూర్ సీఐ అశోక్‌రెడ్డి, టాస్క్‌ఫోర్స్ సీఐ శాకీర్ అలీ, సిరికొండ ఎస్సై రాజశేఖర్ ఉన్నారు. వీరు కేసును శోధిస్తున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం తీసుకోవాలని భావిస్తున్నారు. మరోవైపు రోజురోజుకు నిరసనలు పెరుగుతుండడంతో పోలీసులు ఈ కేసును త్వరగానే ముగించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. రాజకీయ దుమారం మమత హత్య కేసు రాజకీయ దుమారం రేపుతోంది. బీజేపీ నాయకులు, ఎంపీ అర్వింద్ ఇప్పటికే పలుమార్లు మమత కుటుంబాన్ని పరామర్శించారు. ఇటీవల జిల్లా కేంద్రంలోని సీపీ కార్యాలయం ముందు గ్రామస్తులతో కలిసి నిరసన తెలిపారు. గ్రామస్తులు సిరికొండ పోలీసు స్టేషన్‌ను కూడా ముట్టడించారు. మంత్రి, ఎమ్మెల్యేలు కూడా మమత కుటుంబాన్ని పరామర్శించారు. దీంతో ఈ కేసులో రాజకీయ నాయకుల మధ్య ఆరోపణలు కొనసాగుతున్నాయి. హత్య కేసులో అధికార పార్టీ నాయకుల హస్తం ఉందంటూ బీజేపీ నేతలు పలుమార్లు ఆరోపణలు చేశారు. అనవసర ఆరోపణలు చేస్తున్నారని అధికారి పార్టీ నాయకులు తిప్పికొడుతున్నారు. రాజకీయంగా ఈ కేసు దుమారం రేపుతుండడంతో పోలీసులపై తీవ్రమైన ఒత్తిళ్లు పెరిగాయి. దీంతో పోలీసులు కేసు ఛేదనను చాలెంజ్‌గా తీసుకున్నారు. నిందితులను త్వరగా అరెస్టు చేస్తాం మమత హత్యకేసుకు సంబంధించి విచారణ కొనసాగుతోంది. పక్కా ఆధారాలతో నిందితులు ఎవరైనా సరే పట్టుకొని అరెస్టు చేస్తాం. ప్రస్తుతం విచారణ లోతుగా కొనసాగుతోంది. సరైన ఆధారాల కోసం అన్వేషణ జరుగుతోంది. హత్యకు సంబంధించి వివరాలు, అనుమానిత వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేస్తూ పకడ్బందీగా విచారణ చేస్తున్నాం. ఈ కేసుల్లో ఎలాంటి ఒత్తిళ్లు లేవు. నిందితులు ఎంతటివారైనా సరే ఆధారాలతో సహా అరెస్టుచేసి తీరుతాం. – శ్రీనివాస్‌కుమార్, ఏసీపీ -
దీదీ బెంగాల్లో అవినీతికి గెట్లు ఎత్తేశారు
-
పుట్టింటి పోలీసులు
పోలీసులు పెళ్లి చేశారు. అలాగని మేజర్ అయిన అమ్మాయి, అబ్బాయి ‘మా ఇంట్లో ఒప్పుకోవడం లేదు’ అని ఆశ్రయం కోరి వచ్చిన వాళ్లకు పెళ్లి చేయడం కూడా కాదు. ఒక పేదింటి అమ్మాయికి పుట్టింటి వాళ్లుగా మారి చేసిన పెళ్లి! రాజస్తాన్‌లో బాగా వెనుకబడిన జిల్లా టోంక్. ఆ జిల్లాలో ఓ చిన్న పట్టణం లాంటి పల్లె దత్వాస్. పోలీసులు పెళ్లి చేసింది ఆ ఊళ్లోని అమ్మాయికే. మమతా మహావర్ నెలల బిడ్డగా ఉన్నప్పుడే తండ్రి పోయాడు. పదేళ్లు నిండే లోపు తల్లి పోయింది. ఇక మిగిలింది తను, అన్న. అతడు కూడా అనారోగ్యంతో మంచం పట్టి, కొంతకాలానికి చనిపోయాడు. మమతకి మిగిలింది చిన్న గూడు, అన్న ఆరోగ్యం కోసం చేసిన అప్పులు. ఆమె ఎంజీఎన్ఆర్ఈజీఏ (మహాత్మాగాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్, 2005) ఉపాధి పనులతో పొట్ట నింపుకునేది. అన్నకూ ఇంత పెట్టేది. అతడు పోయాక రోజూ పనికి పోతూ డబ్బు వెనకేసుకుంది. అప్పులు కొంత కొంత తీరుతూ వచ్చాయి. పూర్తిగా తీరిపోయిన తర్వాత ‘ఉపాధి’ పనుల డబ్బును సర్పంచ్ దగ్గరే దాచుకుంది. ఊళ్లో వాళ్లు మంచి పిల్ల అని మురిసిపోయారు. ఆమెకో వరుణ్ని కూడా వెదకి తెచ్చారు. ఇక పెళ్లే ఆలస్యం. మమత ఆ ఊరి సర్పంచ్ దగ్గరకెళ్లి తనకు పెళ్లి కుదిరిందని చెప్పింది. తను పని చేసిన రోజులకు లెక్కకట్టి డబ్బంతా ఇచ్చేస్తే పెళ్లి పనులు చేసుకుంటానని అడిగింది. సర్పంచ్ మాట తప్పాడు! సర్పంచ్‌కి డబ్బు ఇవ్వబుద్ధి కాలేదు. కాళ్లరిగేలా తిరిగినా మనసు కరగలేదు. పెళ్లి దగ్గరకు వస్తోంది. ఇక మమత పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. ఉపాధి హామీలో భాగంగా గతంలో ఆ పోలీస్ స్టేషన్ పనులు కూడా చేసి ఉందామె. స్టేషన్ నిర్మాణంలో పని చేసిన అమ్మాయి ఇప్పుడు న్యాయం కోసం మెట్లెక్కింది. సర్పంచ్ దగ్గర నుంచి రావాల్సిన డబ్బు వచ్చినా కూడా అది పెళ్లి ఖర్చులకు సరిపోయేట్టు కనిపించలేదు. చివరికి పోలీసులు తామే అదనంగా కొంత డబ్బు ఇచ్చి మమత పెళ్లి చేయడానికి ముందుకొచ్చారు. స్టేషన్లో పెళ్లి మండపం రెడీ అయింది. పోలీసులే అమ్మాయి తరఫు వారు. హెడ్ కానిస్టేబుల్ దయారామ్.. మమత తండ్రి పాత్ర తీసుకున్నాడు. ఇటీవలే అక్షయ తృతీయ రోజు పెళ్లి చేశారు. సర్పంచ్ ఇవ్వాల్సిన డబ్బును విడిపించి మమత చేతిలో పెట్టి అత్తగారింటికి పంపించారు.‘‘సర్పంచ్ మొదటే ఇవ్వాల్సిన డబ్బు ఇచ్చేసి ఉంటే మమత పెళ్లి అన్నీ అమర్చినట్లు ఇంత చక్కగా జరిగేది కాదేమో. దేవుడు ఆమెకు లక్షణంగా పెళ్లి చేయడానికే ఇదంతా చేశాడు’’ అని సంతోషపడుతున్నారు ఆమె ఆత్మీయులు. పోలీసోళ్లు పుట్టింటోళ్లయితే అత్తగారింటి వాళ్లు అమ్మాయిని చక్కగా చూసుకుంటారని కూడా నవ్వుతూ అనుకుంటున్నారు. – మను -
మల్లెపువ్వుంత స్వచ్ఛంగా..
మమత, నరేంద్ర, షఫీ, ప్రియ ముఖ్య తారలుగా గౌతమ్. ఎమ్ రూపొందిస్తున్న మెసేజ్ ఓరియంటెడ్ చిత్రం ‘సిరిమల్లె పువ్వా’. ఎస్.ఎమ్ క్రియేషన్స్ పతాకంపై కౌసర్ జహాన్ నిర్మిస్తున్నారు. తెలంగాణ ఫైనాన్స్ మినిస్టర్ ఈటెల రాజేందర్ చేతుల మీదగా ఈ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. దర్శకుడు గౌతమ్ మాట్లాడుతూ– ‘‘ఇదొక మెసేజ్ ఉన్న వెరైటీ చిత్రం. ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునేలా ఉంటుంది. టైటిల్‌కు తగ్గట్టుగానే సిరిమల్లె పువ్వంత స్వచ్ఛంగా ఉంటుంది’’ అన్నారు. ‘‘గౌతమ్‌గారు చెప్పిన కథ ఎంతో నచ్చింది. మెసేజ్‌తో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి’’ అన్నారు కౌసర్ జహాన్. తెలంగాణ వెనుకబడిన తరగతుల కమిషన్ అధ్యక్షులు డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహనరావు, సు«ధాకర్ గోగికర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సినిమాకు కెమెరా: సూర్య, ప్రభాకర్, ఫిరోజ్, సంగీతం: రామ్ మోహన్. -
ఫోన్ మాట్లాడుతూ భవనంపై నుంచి పడి యువతి మృతి
చైతన్యపురి: అపార్ట్మెంట్ టెర్రస్‌పై ఫోన్లో మాట్లాడుతున్న ఓ యువతి ప్రమాదవశాత్తు నుంచి కిందపడి తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందిన సంఘటన సరూర్‌నగర్ పోలీసుస్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. ఎస్సై ప్రభాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం పత్తిపాక గ్రామానికి చెందిన ఏదుల కుమార్ బతుకుదెరువు కోసం రెండేళ్ల క్రితం నగరానికి వచ్చి సరూర్‌నగర్‌లోని జనప్రియ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నాడు. కుమార్‌కు నలుగురు కూతుళ్లు. నాల్గో కూతురు మమత (18) దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ కళాశాలలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతోంది. మమత గురువారం అపార్ట్మెంట్ రెండో అంతస్తులో టెర్రస్‌పై ఫోన్లో మాట్లాడుతూ ప్రమాదవశాత్తు కిందపడింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. -
కోర్టు తీర్పుతో మమ్మల్ని వెంటాడుతున్నారు!
న్యూఢిల్లీ: నారద స్టింగ్ ఆపరేషన్‌పై సీబీఐ దర్యాప్తు జరపాలని న్యాయస్థానాలు ఆదేశించిన నేపథ్యంలో ఈ స్టింగ్ ఆపరేషన్ నిర్వహించిన జర్నలిస్టులకు వేధింపులు, బెదిరింపులు ఎదురవుతున్నాయి. కోర్టు తీర్పు వెలువడిన తర్వాత కొందరు వ్యక్తులు తమను వెంటాడుతున్న విషయాన్ని గుర్తించామని తాజాగా నారద న్యూస్ ఆన్లైన్ పోర్టల్ సీఏవో ఏంజెల్ అబ్రహం పేర్కొన్నారు. ఈ స్టింగ్ ఆపరేషన్‌లో పాల్గొన్న నారద న్యూస్ కు చెందిన పాత్రికేయులందరికీ ఇదేవిధంగా బెదిరింపులు, వెంటాడటాలు ఎదురవుతున్నాయని ఆమె చెప్పారు. పలువురు తృణమూల్ కాంగ్రెస్ నేతలు ముడుపులు తీసుకుంటూ నారద న్యూస్ స్టింగ్ ఆపరేషన్‌లో అడ్డంగా దొరికిపోవడం కలకలం రేపింది. ఈ నేపథ్యంలో ఈ స్టింగ్ ఆపరేషన్‌పై ప్రాథమిక విచారణ చేయాలని కలకత్తా హైకోర్టు సీబీఐని ఆదేశించింది. స్టింగ్ ఆపరేషన్‌కు సంబంధించిన సమాచారాన్ని, వస్తువులను 24 గంటల్లో స్వాధీనం చేసుకోవాలని, 72 గంటల్లో ప్రాథమిక విచారణ పూర్తి చేయాలని ధర్మాసనం సీబీఐని ఆదేశించింది. ప్రాథమిక విచారణ పూర్తయిన తర్వాత అవసరమైతే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, తర్వాత దర్యాప్తు కొనసాగించాలని పేర్కొంది. అయితే, హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ తృణమూల్ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సుప్రీంకోర్టుకు వెళ్లినా.. అక్కడ ఆమెకు చుక్కెదురైంది. గతేడాది పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ముందు నారద స్టింగ్ ఆపరేషన్‌కు సంబంధించిన వీడియోలను పలు వార్తా చానళ్లు ప్రసారం చేశాయి. మొదట ఈ వీడియోలు ‘నారదన్యూస్.కామ్’లో ప్రసారమయ్యాయి. దీనిలో కొందరు నేతలు డబ్బులు తీసుకుంటున్నట్లుగా దృశ్యాలు ఉన్నాయి. కాగా, ఇవి ట్యాంపర్ చేసిన వీడియోలు కావని చండీగఢ్‌లోని సెంట్రల్ ఫొరెన్సిక్ సైన్స్ ల్యాబొరెటరీ (సీఎఫ్ఎస్ఎల్) ఇచ్చిన నివేదికను ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది. ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిలో మంత్రులు, ఎంపీలు, సీనియర్ నేతలు ఉన్నందువల్ల రాష్ట్ర సంస్థలు కాకుండా సీబీఐ అయితేనే స్వతంత్రంగా దర్యాప్తు నిర్వహించగలదని కోర్టు పేర్కొంది. -
‘నారద’ కేసు సీబీఐకి
-
‘నారద’ కేసు సీబీఐకి
3 రోజుల్లో ప్రాథమిక విచారణ పూర్తి చేయాలి: కలకత్తా హైకోర్టు కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ఆ రాష్ట్ర హైకోర్టు షాకిచ్చింది. పలువురు తృణమూల్ కాంగ్రెస్ నేతలు ముడుపులు తీసుకుంటూ నారద న్యూస్ చేసిన స్టింగ్ ఆపరేషన్‌లో దొరికిన వ్యవహారంలో ప్రాథమిక విచారణ చేయాలని కలకత్తా హైకోర్టు శుక్రవారం సీబీఐని ఆదేశించింది. స్టింగ్ ఆపరేషన్‌కు సంబంధించిన సమాచారాన్ని, వస్తువులను 24 గంటల్లో స్వాధీనం చేసుకోవాలని, 72 గంటల్లో ప్రాథమిక విచారణ పూర్తి చేయాలని ధర్మాసనం సీబీఐని ఆదేశించింది. ప్రాథమిక విచారణ పూర్తయిన తర్వాత అవసరమైతే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, తర్వాత దర్యాప్తు కొనసాగించాలని పేర్కొంది. ప్రముఖుల ప్రవర్తన ఇతరులు వేలెత్తి చూపేలా ఉండకూడదని, అవినీతి ప్రజల నమ్మకాన్ని దెబ్బతీస్తోందని జస్టిస్ చక్రవర్తి పేర్కొన్నారు. హైకోర్టు ఆదేశాన్ని సుప్రీం కోర్టులో సవాలు చేస్తామని సీఎం మమత చెప్పారు. గతేడాది పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ముందు నారద స్టింగ్ ఆపరేషన్‌కు సంబంధించిన వీడియోలను పలు వార్తా చానళ్లు ప్రసారం చేశాయి. మొదట ఈ వీడియోలు ‘నారదన్యూస్.కామ్’లో ప్రసారమయ్యాయి. దీనిలో కొందరు నేతలు డబ్బులు తీసుకుంటున్నట్లుగా దృశ్యాలు ఉన్నాయి. కాగా, ఇవి ట్యాంపర్ చేసిన టేపులు కావని చండీగఢ్‌లోని సెంట్రల్ ఫొరెన్సిక్ సైన్స్ ల్యాబొరెటరీ (సీఎఫ్ఎస్ఎల్) ఇచ్చిన నివేదికను ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది. ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిలో మంత్రులు, ఎంపీలు, సీనియర్ నేతలు ఉన్నందువల్ల రాష్ట్ర సంస్థలు కాకుండా సీబీఐ అయితేనే స్వతంత్రంగా దర్యాప్తు నిర్వహించగలదని కోర్టు పేర్కొంది. స్టింగ్ ఆపరేషన్ బూటకం: మమత హైకోర్టు ఆదేశం దురదృష్టకరమని, దీన్ని రాజకీయంగా, న్యాయపరంగా ఎదుర్కొంటామని మమత చెప్పారు. ‘స్టింగ్ ఆపరేషన్ నాటకం. వీడియోను బీజేపీ కార్యాలయంలో విడుదల చేశారు’ అని అన్నారు. ఆపరేషన్‌లో లంచం తీసుకుంటూ కనిపించిన టీఎంసీ ఎంపీలపై చర్యలు తీసుకోవాలని వామపక్షాలు లోక్‌సభలో డిమాండ్ చేశాయి. దర్యాప్తు పరిధిలోకి సీఎంను తేవాలనే డిమాండ్‌తో లెఫ్ట్ ఫ్రంట్ పార్టీలు కోల్‌కతా భారీ ర్యాలీ నిర్వహించాయి. -
ప్రతిపక్ష పార్టీలు మళ్లీ విఫలం
న్యూఢిల్లీ: కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశంలో పెద్ద నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న తొందరపాటు నిర్ణయం కోట్లాది మంది భారతీయులను ఇక్కట్ల పాలు చేసినా ఐక్యతా రాగం వినిపించడంలో ప్రతిపక్ష పార్టీలు మరోసారి విఫలమయ్యాయి. విపక్షంలో ఎవరికి వారే కూటమికి నాయకత్వం వహించాలనే ధోరణియే ప్రధానంగా అందుకు కారణం. పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై పార్లమెంట్‌ను స్తంభింపచేయడంలో కలిసొచ్చిన విపక్షాలు పార్లమెంట్ వెలుపల కలవడానికి ససేమిరా అంటూ కకావికలం అవుతున్నాయి. పక్కా ముందస్తు వ్యూహం లేకుండా నోట్లను రద్దు చేయడంతో తగులుతున్న ఎదురుదెబ్బలను ప్రతిపక్షాల అనైక్యత కారణంగా మోదీ తెలివిగా తప్పించుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు మంగళవారం ఏర్పాటు చేసిన విపక్షాల సమావేశానికి ఎన్సీపీ, జేడీయూ, బీఎస్పీ, ఎస్పీ, వామపక్ష పార్టీలు దూరం జరిగాయి. మోదీ పెద్ద నోట్లను రద్దు చేయడాన్ని పార్లమెంట్లో ప్రతిపక్షాలన్నీ ఎండగడుతున్న నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాలైన చివరి రోజున, అంటే డిసెంబర్ 16వ తేదీన రాహుల్ గాంధీ చెప్పాపెట్టకుండా మోదీని కలుసుకోవడం వామపక్షాలకు, ఆర్జేడీలకు కోపం తెప్పించింది. అందుకనే ఈ రోజు సమావేశానికి ఆ పార్టీలు స్పందించలేదు. యూపీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బీఎస్పీ, ఎస్పీ పార్టీలు కూడా కాంగ్రెస్‌తో కలసిరాలేదు. ఇక మొదటి నుంచి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, పెద్ద నోట్లను రద్దు చేస్తూ మోదీ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ వస్తున్నారు. దాని వెనక కూడా మతలబు ఉందని అంతర్గత పార్టీ వర్గాలు తెలియజేస్తున్నాయి. మోదీ నిర్ణయాన్ని వ్యతిరేకించినట్లయితే రాహుల్ గాంధీ పిలిచే ఇలాంటి సమావేశాలకు హాజరుకావాల్సి ఉంటుంది. రాహుల్ ప్రతిపక్ష కూటమి నాయకుడిగా ఎదగడం ఆయనకు ఇష్టం లేదట. తానే కేంద్ర స్థాయిలో ప్రతిపక్షం కూటమికి నాయకుడిని కావాలన్నది ఆయన అభిలాష అట. అయితే బీహార్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని కలపుకొని సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతున్నందున మోదీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే రాహుల్‌తో కలసి నడవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నది ఆయన దూరాలోచనని తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మమతా బెనర్జీ మొదట్లో తానే విపక్షం కూటిమికి నాయకురాలిగా చొరవ చూపిస్తూ వచ్చారు. ఇప్పుడు రాహుల్ గాంధీ కాస్త ముందుకు వచ్చినా, ఆయనతో కలసి నడవక తప్పడం లేదు. అందుకే ఈ రోజు విపక్షాల సమావేశంలో వారిద్దరు కలసి వేదికను అలంకరించారు. యాభై రోజులు ఓపిక పట్టండి, నోట్ల కష్టాలు తీరుతాయంటూ నరేంద్ర మోదీ ప్రజలకిచ్చిన భరోసాకు గడువు బుధవారంతో తీరిపోనుంది. అయినప్పటికీ ప్రజలకు నోట్ల కష్టాలు ఇప్పట్లో తీరేలా లేదు. విపక్షాల తీరు ఇప్పటికైనా మారకపోతే మోదీ మాయ మాటలకు ప్రజలు మోసపోతూనే ఉంటారు. కష్టాలు పడుతూనే ఉంటారు. –––––ఓ సెక్యులరిస్ట్ కామెంట్ -
మమత, గవర్నర్ల మధ్య వాగ్యుద్ధం
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో శనివారం ఆ రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రుల మధ్య వాగ్యుద్ధం చోటు చేసుకుంది. బెంగాల్లో టోల్ గేట్ల వద్ద ఆర్మీని మోహరించడంపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మూడు రోజులుగా ఆగ్రహం వ్యక్తం చేస్తుండటం తెలిసిందే. ఈ విషయంపై గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠి మమతను ఉద్దేశించి మాట్లాడుతూ ‘ఆర్మీ లాంటి బాధ్యతాయుతమైన వ్యవస్థలపై ఆరోపణలు చేసేముందు జాగ్రత్తగా ఉండాలి. ఆర్మీని అప్రతిష్టపాలు చేయకూడదు’ అని అన్నారు. అనంతరం మమత స్పందిస్తూ ‘గవర్నర్ కేంద్ర ప్రభుత్వం పక్షాన మాట్లాడుతున్నారు. ఆయన ఎనిమిది రోజులుగా నగరంలో లేరు. ఏదైనా మాట్లాడేముందు అన్ని వివరాలను సరిచూసుకోవాల్సింది. ఆయన ఇలా మాట్లాడటం దురదృష్టకరం’ అన్నారు. తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటానని తర్వాత గవర్నర్ పేర్కొన్నారు. -
ఆర్మీ మోహరింపుపై దుమారం
• మిలటరీ తిరుగుబాటు చేద్దామనుకుంటున్నారా? • కేంద్రాన్ని ప్రశ్నించిన మమత.. గురువారం రాత్రంతా సెక్రటేరియట్‌లోనే నిరసన • పార్లమెంటులోనూ విపక్షాల ఆందోళన • మమత వ్యాఖ్యలు రాజకీయ నైరాశ్యంతో కూడుకున్నవి: పరీకర్ కోల్‌కతా/న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్లోని టోల్ ప్లాజాల వద్ద ఆర్మీ మోహరింపు రాజకీయ దుమారం రేపుతోంది. రాష్ట్రానికి ఏమాత్రం సమాచారం లేకుండా కేంద్ర బలగాలను ఎలా పంపింస్తారంటూ కేంద్రంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ సర్కారు తీరుకు నిరసనగా.. గురువారం రాత్రంతా కోల్‌కతాలోని సెక్రటేరియట్‌లోనే ఉన్నారు. ఈ అంశంపై విపక్షాలు పార్లమెంటులో ఆందోళన వ్యక్తం చేశారుు. ప్రభుత్వ తీరుకు నిరసనగా సభాకార్యక్రమాలను స్తంభింపజేశారుు. అరుుతే మమత రాజకీయ నైరాశ్యం కారణంగానే ఇలా మాట్లాడుతున్నారని కేంద్ర ప్రభుత్వం తిప్పికొట్టింది. ఇందులో కుట్ర కోణమేదీ లేదని.. రోటీన్ నాకాబందీయేనని రక్షణ మంత్రి మనోహర్ పరీకర్ తెలిపారు. మోదీ సర్కారు కుట్ర పన్నింది: మమత పశ్చిమబెంగాల్లో ఆర్మీ మోహరింపు విషయంలో పార్లమెంటులో కేంద్రం ప్రకటన కుట్ర పూరితంగా ఉందని మమత బెనర్జీ ఆరోపించారు. బల ప్రదర్శన ద్వారా అనిశ్చితి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. రాష్ట్ర పోలీసులకు సమాచారం ఇచ్చామన్న కేంద్రం ప్రకటన అత్యవసరమని శుక్రవారం ఖండించారు. అంతకుముందు గురువారం రాత్రి కోల్‌కతా సెక్రటేరియట్లో మమత మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో మిలటరీ తిరుగుబాటు చేద్దామనుకుంటున్నారా? మా ప్రభుత్వానికి తెలియకుండానే ఇక్కడ సైన్యాన్ని ఎలా మోహరిస్తారు? నేను ఇక్కడే ఉంటాను’అని హెచ్చరించారు. రాష్ట్రంలో మోహరించిన బలగాలను వెంటనే కేంద్రం వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై పార్లమెంటులో తృణమూల్ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. వీరికి ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ మద్దతు పలికింది. కాగా, శుక్రవారం సాయంత్రం మమత 36 గంటల నిరసన విరమించి సచివాలయం నుంచి బయటకు వచ్చారు. అనవసర రాద్ధాంతం: పరీకర్ ఆర్మీ మోహరింపుపై పార్లమెంటులో విపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని రక్షణ మంత్రి మనోహర్ పరీకర్ తెలిపారు. దేశవ్యాప్తంగా పలుచోట్ల ప్రతి ఏడాదీ ఇలాంటి నాకాబందీలు నిర్వహిస్తున్నారని, ఇందులో భాగంగానే పశ్చిమబెంగాల్లో టోల్ ప్లాజాల వద్ద సాయుధ బలగాలను మోహరించినట్లు లోక్‌సభలో వెల్లడించారు. గత నెలలో ఉత్తరప్రదేశ్, బిహార్, జార్ఖండ్‌ల్లోనూ టోల్ ప్లాజాల వద్ద భారీ వాహనాల వివరాలు సేకరించామన్నారు. షెడ్యూల్ ప్రకారం నవంబర్ 28-30 తేదీల్లోనే ఆర్మీ పశ్చిమబెంగాల్లో సోదాలు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ భారత్ బంద్ పిలుపు కారణంగా డిసెంబర్ 1-2 తేదీలకు వారుుదా వేసినట్లు తెలిపారు. ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నందున కోల్‌కతా పోలీసుల సహకారంతోనే సోదాలు చేస్తున్నామన్నారు. ఆర్మీని అనవసరంగా వివాదాల్లోకి లాగుతున్నారని పరీకర్ అన్నారు. ఆర్మీ కూడా ఒక ప్రకటనలో మమత వ్యాఖ్యలను ఖండించింది. కోల్‌కతా పోలీసులకు ముందస్తు సమాచారం ఇచ్చినట్లు వెల్లడించింది. కాగా, ఒక రాష్ట్రంలో సోదాలు నిర్వహించే ముందు ఆర్మీ.. ఆ రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని నిబంధనలున్నాయని తృణమూల్ రాజ్యసభ పక్ష నేత డెరిక్ ఒబ్రెరుున్ తెలిపారు. తాజా ఘటనలో పశ్చిమబెంగాల్ ప్రభుత్వం ఆర్మీని ఆహ్వానించినట్లుగాఉన్న లేఖలను కేంద్రం బహిరంగపరచాలని ఆయన డిమాండ్ చేశారు. తృణమూల్ ప్రభుత్వంపై మోదీ సర్కారు కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. -
కోల్‌కతలో మమతా బెనర్జీ నయకత్వంలో ర్యాలీ
-
నియంతృత్వం, కిరాతకం
-
నియంతృత్వం, కిరాతకం
• మమత ధ్వజం.. పార్లమెంటు నుంచి రాష్ట్రపతి భవన్‌కు ర్యాలీ • పాలుపంచుకున్న ఆప్, నేషనల్ కాన్ఫరెన్స్, శివసేన న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పశ్చిమబెంగాల్ సీఎం మమ తా బెనర్జీతోపాటు నేషనల్ కాన్ఫరెన్స్, ఆప్, ఎన్డీఏ భాగస్వామి శివసేన నాయకులు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. రూ. 500 / 1000 నోట్ల రద్దు తో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తంచేస్తూ రాష్ట్రపతికి వినతిపత్రం సమర్పించారు. బుధవారం పార్లమెంటు నుంచి రాష్ట్రపతి భవన్ వరకు ర్యాలీగా వెళ్లిన ఈ బృందానికి మమత నేతృత్వం వహించారు. ఆమె వెంట తృణమూల్ ఎంపీలు, ఆప్ ఎంపీ భగవంత్ మన్, శివసేన ఎంపీ హర్సుల్, నేషనల్ కాన్ఫరెన్స నేత ఒమర్ అబ్దుల్లా తదితరులున్నారు. రాష్ట్రపతిని కలసిన అనంతరం మమత మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితి రాజ్యాంగ సంక్షోభానికి దారి తీసేలా ఉందన్నారు. ‘సామాన్యుల కష్టాలను రాష్ట్రపతికి వివరించాం. దీనిపై ప్రభుత్వంతో మాట్లాడి, దేశంలో సాధారణ పరిస్థితులు నెలకొనేలా చేయాలని కోరాం’ అని చెప్పారు. దీనికి రాష్ట్రపతి సానుకూలంగా స్పందించి, ఈ విషయాన్ని పరిశీలిస్తామని చెప్పారన్నారు. గురువారం లోక్‌సభలో వారుుదా తీర్మానాన్ని ప్రవేశపెడతామన్నారు. మోదీ చర్యను నియంతృత్వ, కిరాతక చర్యగా అభివర్ణించారు. సరిపడా నిత్యావసరాలు మార్కెట్లో సరఫరా అయ్యేలా చూడాలని డిమాండ్ చేశారు. శివసేన ప్రభుత్వ చర్యను సమర్థించినప్పటికీ, పాత నోట్ల మార్పిడికి గడువును మరింత పొడిగించాలని చెప్పింది. -
ప్రతిపక్షాల బాధ్యతారాహిత్యం
-
ప్రతిపక్షాల బాధ్యతారాహిత్యం
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ - నల్ల ప్రభుత్వం..నల్ల నిర్ణయమన్న మమత న్యూఢిల్లీ/కోల్‌కతా: నోట్ల రద్దు నిర్ణయంపై ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ విమర్శించారు. రాజకీయ వ్యవస్థను బాగుచేసేందుకు జరుగుతున్న ప్రయత్నానికి కొందరు ఇబ్బందు పడుతున్నారన్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ విమర్శలపై శనివారం జైట్లీ స్పందించారు. నోట్ల మార్పిడికి మరో వారం రోజులు అవకాశం ఇవ్వాలన్న సలహాను ఆయన తోసిపుచ్చారు. ఇలా చేస్తే తమ లక్ష్యం దెబ్బతింటుందని చెప్పారు. వ్యక్తుల సంపాదన న్యాయబద్దమైనదా, కాదా, పన్ను కట్టాడా, లేదా తెలుసుకునే హక్కు ప్రభుత్వానికి ఉందని, తామదే పని చేస్తున్నామన్నారు. ప్రతిరాష్ట్రంలో ఉప్పు నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని.. దీనిపై వదంతులు నమ్మొదన్నారు. 7వ పేకమిషన్ బకారుులు ఉద్యోగులకు చెల్లించిన కారణంగా జూలై, సెప్టెంబర్ త్రైమాసికంలో బ్యాంకు నిల్వలు పెరిగాయన్నారు. జన్‌ధన్ యోజన అకౌంట్లలో గణనీయంగా డబ్బులు డిపాజిట్ అవుతున్న విషయాన్ని గుర్తించినట్లు జైట్లీ తెలిపారు. కాగా, కేంద్రం తీసుకున్న నోట్ల మార్పిడి నిర్ణయంపై బెంగాల్ సీఎం మమత తీవ్రంగా విరుచుకుపడ్డారు. ‘నల్ల ప్రభుత్వపు నల్ల నిర్ణయం’ అని ఆమె విమర్శించారు. కోల్‌కతాలో ఏటీఎంలు, బ్యాంకుల ముందు బారులుదీరిన ప్రజలతో ఆమె మాట్లాడారు. కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంంగా జరుగుతున్న పోరులో సీపీఐ (ఎం) సహా అన్ని విపక్షాలతో కలిసి పనిచేస్తామన్నారు. క్యూ లైన్లలో ఉన్న వారికి కావాల్సిన సాయం చేయాలని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పార్టీ కార్యకర్తలకు సూచించారు. -
భువనగిరిలో దారుణం
కుటుంబ కలహాలతో విసిగి వేసారిపోయిన మహిళ తన ఐదు నెలల చిన్నారిని నీటితొట్టెలో పడేసి అనంతరం తాను ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన నల్లగొండ జిల్లా భువనగిరి మండలం గౌస్‌నగర్‌లో ఆదివారం వెలుగచూసింది. స్థానికంగా నివాసముంటున్న భాస్కర్‌కు, మమత(21)తో రెండేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఆరు నెలల పాప ఉంది. గత కొన్ని రోజులుగా వీరి మధ్య గొడవలు జరగుతున్నాయి. తాజాగా శనివారం అర్ధరాత్రి దాటాక ఇంటికి వచ్చిన భాస్కర్ మరోసారి గొడవపడటంతో మనస్తాపానికి గురై తన ఆరు నెలల చిన్నారి నీటితొట్టెలో పడేసి వంటి పై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
మమత ఏకగ్రీవ ఎన్నిక
కోల్ కతా: తృణముల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీ శాసన సభా పక్ష నేతగా మమతాబెనర్జీని ఆపార్టీ శాసన సభ సభ్యులు శుక్రవారం సమావేశమై ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. టీఎంసీ సెక్రెటరీ జనరల్ పార్థ చటర్జీ మమత పేరును మొదట ప్రతిపాదించారు. తర్వాత కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఆమె పేరును ప్రతిపాదించారు. ఏకగ్రీవంగా ఎన్నికైన తర్వాత మమత రాజ్ భవన్ కు వెళ్లి ప్రభుత్వ ఏర్పాటుపై గవర్నర్ తో చర్చించారు. -
అపార్ట్‌మెంటుపై నుంచి దూకి యువతి ఆత్మహత్య
అంబర్‌పేట: అపార్ట్‌మెంట్‌పై నుంచి దూకి యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన అంబర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ ఏపీ ఆనంద్ కుమార్ కథనం ప్రకారం... ప్రధాన రోడ్డు పక్కనే ఉన్న భవనంపై ఓ యువతి కిందకు దూకింది. చెట్టుపై పడి ఒక్కసారిగా పెద్ద శబ్ధం రావడంతో హనుమాన్ జయంతి సందర్భంగా శోభాయాత్రగా వెళ్తున్న యువకులు చెట్ల కొమ్మల్లో చిక్కుకున్న ఆమెను కిందకి దింపి పోలీసులకు సమాచారం అందించారు. హత్యా.. ఆత్మహత్య? అంబర్‌పేట సీపీఎల్ రోడ్డులో సాయి దుర్గా రెసిడెన్సీ ఐదు అంతస్తుల భవనంపై నుంచి సుమారు 25 సంవత్సరాల గుర్తుతెలియని యువతి దూకిందని సమాచారం అందిందన్నారు. అక్కడి వారిని ఆరా తీయగా ఆమె ఎవరో తెలియదని అపార్ట్మెంట్ వాసులు తెలిపారు. దీంతో మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించామన్నారు. విచారణ చేపట్టిన పోలీసులు మృతురాలు ప్రేమ్‌నగర్‌లో నివసించే శంకర్, పుష్పల కూతురు మమత(25) అని గుర్తించారు. తల్లిదండ్రులకు జరిగిన విషయం చెప్పడంతో స్నేహితురాలి ఇంటికి వెళ్తానని ఇంట్లో చెప్పి ఆత్మహత్య చేసుకుందని వారు పోలీసులతో కన్నీరుమున్నీరయ్యారు. తమ కుమార్తెకు మానసికస్థితి సరిగ్గా ఉండేది కాదని తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు హత్యా..? ఆత్మహత్య? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. -
దాడి చేసిన వారితో ఆటలా: ఉద్ధవ్
ముంబై: టీ20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్ క్రికెట్ టీమ్‌కు భద్రత కల్పిస్తామంటూ పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నారని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్‌ఠాక్రే మండిపడ్డారు. భారత్‌లోకి ప్రాయోజిత చొరబాటును పాక్ ఆపేంతవరకు ఆ దేశంతో మనం ఒక్క మ్యాచ్ కూడా ఆడకూడదని ఆదివారం చంద్రాపూర్‌లో జరిగిన కార్యక్రమంలో ఉద్ధవ్ పేర్కొన్నారు. హిమాచల్‌ప్రదేశ్ సీఎం వీరభద్రసింగ్ తన దేశభక్తిని చాటుకోగా, మమతాబెనర్జీ మాత్రం ఎన్నికల నేపథ్యంలో ఓటుబ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు. భారత్‌పై దాడిచేసిన వారితో మనం ఆడాలా? అని ప్రశ్నించారు. ఒక చేతిలో క్రికెట్, మరో చేతిలో బాంబు కుదరదని, మీరు బాల్‌నన్నా వదిలేయండి లేదా పాక్‌తో ఆడటాన్ని అయినా వదిలేయండి అని అన్నారు. -
అక్కడ కొట్టుకుందాం.. ఇక్కడ కలిసివెళ్దాం!
న్యూఢిల్లీ: త్వరలో పశ్చిమ బెంగాల్, కేరళలో అసెంబ్లీ ఎన్నికలు రానుండటంతో కాంగ్రెస్, వామపక్షాల మధ్య పొత్తు అంశం హాట్ టాపిక్‌గా మారింది. పశ్చిమ బెంగాల్లో వామపక్షాలతో కలిసి వెళ్లాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. బెంగాల్లో సుత్తెకొడవలితో కలిసి వెళ్లేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆ రాష్ట్ర కాంగ్రెస్ విభాగం పార్టీ అధిష్ఠానానికి నివేదించినట్టు తెలుస్తోంది. దీంతో వామపక్షాలతో వ్యూహాత్మక సర్దుబాటు చేసుకొని మమతా బెనర్జీని ఎదుర్కోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. అయితే, బహిరంగంగా బెంగాల్లో కాంగ్రెస్, వామపక్షాలు పొత్తు పెట్టుకొనే పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే అదే సమయంలో కేరళలో అసెంబ్లీ ఎన్నికలు ఉండటం. అక్కడ ఈ రెండు పార్టీలు బద్ధ శత్రువులుగా ఒకరితో ఒకరు తలపడటం.. ఈ నేపథ్యంలో బెంగాల్‌లోని రాజకీయ సమీకరణలపై ఆ రాష్ట్ర పరిశీలకులుగా ఉన్న కాంగ్రెస్ నేతలు త్వరలోనే అధిష్టానానికి నివేదిక ఇవ్వనున్నారు. అధికార తృణమూల్ కాంగ్రెస్‌ను ఓడించాలనే లక్ష్యంతోనే కాంగ్రెస్, వామపక్షాలు కలిసి ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నాయని, పొత్తు పెట్టుకోవడమే మంచిదనే అభిప్రాయంతో రెండు పార్టీల శ్రేణులు కూడా ఉన్నాయని బెంగాల్ కాంగ్రెస్ చీఫ్ అధీర్ రంజన్ చౌదరి పేర్కొన్నారు. కాంగ్రెస్, వామపక్షాల పొత్తుతో బెంగాల్లో రాజకీయ ముఖచిత్రం సమూలంగా మారిపోతుందని ఆయన అన్నారు. -
మిత్రా బెయిల్‌పై మమత 'నో కామెంట్స్'
పశ్చిమ బెంగాల్: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన శారదా కుంభకోణంలో నిందితుడు, తన మంత్రి వర్గ సభ్యుడు మదన్ మిత్రాకు బెయిల్ లభించడంపై మాట్లాడడానికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిరాకరించారు. శారదా కుంభకోణం కేసులో గత సంవత్సరం డిసెంబర్ 12 న క్రీడలు, రవాణా మంత్రిగా పనిచేస్తున్న మదన్ మిత్రాను సీబీఐ అరెస్టు చేసింది. కాగా శనివారం ఆయనకు సిటీకోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ మంజూరు విషయంపై మమతా బెనర్జి మాట్లాడుతూ.. 'అది కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశమైనందున దానిపై నేను మాట్లాడలేను' అని అన్నారు. -
'దేశాలు తిరిగితే దేశాన్నెవరు చూస్తారు'
కోల్‌కతా: విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్రమోదీ పై తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిప్పులు చేరిగారు. 'అచ్చే సర్కార్' అంటూ ఊదరగొడుతన్న మోదీ పాలనలో...9 నెలలు 11 విదేశీ పర్యటనలు మాత్రం కనబడుతున్నాయన్నారు. ఆయన విదేశీ పర్యటనలతో నాకేమీ ఇబ్బందిలేదు కానీ ఎక్కువ సమయం విదేశాల్లోనే ఉంటే దేశాన్ని ఎవరు చూడాలని మమత మండిపడ్డారు. అవాస్తవాలు చెప్పుతూ భూసేకరణ బిల్లుతో దేశాన్ని తప్పుదొవ పట్టిస్తున్నారన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) ప్రధానమంత్రి కనుసన్నల్లో నడుస్తోందని మమతా బెనర్జీ ఆరోపించారు. సీబీఐ ప్రధానమంత్రి విభాగం(పీఎం డిపార్ట్ మెంట్)గా మారిందని విమర్శించారు. ప్రధాని ఆదేశాల మేరకే సీబీఐ నడుస్తోందని మండిపడ్డారు. -
మారుతున్న దీదీ స్వరం!
-
అమ్మ.. నేను చనిపోతున్నా
ఈ సంఘటన మెదక్ మండల పరిధిలోని మంబోజిపల్లిలో మంగళవారం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి మృతురాలి కుటుంబీకుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన మేకల పద్మ, మల్లేశం దంపతులకు మమత(19), స్వప్న, వేణు ముగ్గురు సంతానం. 9 ఏళ్ల క్రితమే తండ్రి మరణించడంతో కూలినాలి చేసుకుంటూ పద్మ తన పిల్లలను పోషించుకుంటోంది. పెద్ద కూతురు మమతను పట్టణంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ వరకు చదివించింది. అనంతరం గత మే 13న జోగిపేటకు చెందిన అల్మాయిపేట కిషన్, ఇందిర దంపతుల కొడుకు యాదగిరికి ఇచ్చి పెళ్లి జరిపించింది. కట్నకానుకల కింద రూ.4 లక్షల విలువ గల బంగారం, ఇంటి సామగ్రి ఇచ్చి ఉన్నంతలో ఘనంగా పెళ్లి చేసింది. పెళ్లై ఆరుమాసాలు కావస్తున్న ఏనాడు తనతో కలిసి లేడని బాధితురాలు మమత తన తల్లికి రాసిన ఉత్తరంలో పేర్కొంది. తన పెళ్లికి వరకట్నంగా ఇచ్చిన రూ.4 లక్షలను తిరిగి తల్లికి ఇప్పించాల్సిందిగా పోలీసులను కోరుతూ ఉత్తరంలో పేర్కొంది. నేను బతికుండి అమ్మకు ఇబ్బంది పెట్టడం కన్నా చావే మార్గమని ఆత్మహత్య చేసుకుంటున్నానని రాసింది. నా చావుకు భర్త, అత్తతో పాటు మా చిన్నత్త కూడా కారణమంటూ రాసిన ఉత్తరాన్ని బీరువాలో దాచిపెట్టి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఇది గమనించిన ఇరుగుపొరుగు వారు మంటలార్పి హుటాహుటిన ఆమెను మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో బీరువాలో దాచిన ఉత్తరం గురించి వైద్యులు, కుటుంబీకులకు తెలిపింది. పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రథమ చికిత్స అనంతరం వైద్యులు మమతను గాంధీకి తరలించారు. ఆమె ఒంటిపై 85 శాతం మేర కాలిన గాయాలున్నాయని చెప్పారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఆనందం.. ఆపై విషాదం
ఖమ్మం రూరల్/కూసుమంచి: ఖమ్మంలో ఘోరం జరిగింది. ద్విచక్ర వాహనంపై వెళుతున్న యువ దంపతులను వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొంది. వారిద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. వారి కుటుంబీకులు తెలిపిన ప్రకారం... కూసుమంచి మండలం చౌటపల్లికి చెందిన సోమనబోయిన ఉపేందర్(30), మమత(28) దంపతులు. వీరిద్దరూ శుక్రవారం చౌటపల్లి నుంచి ద్విచక్ర వాహనంపై ఖమ్మం వస్తున్నారు. ఖమ్మం రూరల్ మండలం కోదాడ క్రాస్ రోడ్ సమీపంలో వీరి వాహనాన్ని, వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొంది. రోడ్డుపై పడిపోయిన ఉపేందర్, మమత మీద నుంచి ఆ లారీ దూసుకెళ్లింది. తీవ్ర గాయాలతో కొన ఊపిరితో ఉన్న వీరిద్దరినీ, అక్కడికి సమీపంలోని పెట్రోల్ బంకు వద్దనున్న 108 సిబ్బంది వెంటనే ఖమ్మం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మమత మృతిచెందింది. ఆస్పత్రిలో చేర్చిన కొద్దిసేపటి తరువాత ఉపేందర్ కూడా మృతిచెందాడు. ఈ దంపతులకు పిల్లలు లేరు. మృతదేహాలకు పోస్టుమార్టం అనంతరం, ఎస్ఐ లక్ష్మినారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఉద్యోగంలో చేరేందుకు ఆనందంగా వెళుతూ.. ఉపేందర్‌కు, నల్గొండ జిల్లా చివ్వెంలకు చెందిన మమతతో 2011లో వివాహమైంది. ఉపేందర్ ఎంఎస్సీ బీఈడీ, మమత బీఎస్సీ పూర్తిచేశారు. వీరిద్దరూ నర్శింహులగూడెంలో ప్రయివేటు పాఠశాల నెలకొల్పారు. నిర్వహణాపరమైన ఇబ్బందులు, ఆర్థిక సమస్యల కారణంగా ఈ పాఠశాలను నెల రోజుల కిందట వేరే వారికి అప్పగించారు. అప్పటి నుంచి ఖమ్మంలోని ప్రైవేట్ పాల కేంద్రంలో సూపర్వైజర్గా ఉపేందర్ పనిచేస్తున్నాడు. అక్కడే మమతకు కూడా ఉద్యోగం చూశాడు. శుక్రవారమే ఆమె విధుల్లో చేరాల్సుంది. ‘ఒకేచోట ఉద్యోగం చేయబోతున్నామన్న ఆనందంతో వారిద్దరూ శుక్రవారం ఉదయం చౌటపల్లి నుంచి ద్విచక్ర వాహనంపై ఖమ్మం బయల్దేరారు. మమత గర్భవతి కావడంతో ఆస్పత్రికి కూడా వెళ్లాలనుకున్నారు’ అని, వారి కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా రోదిస్తూ చెప్పారు. కొడుకా... మేమెలా బతకాలి.. ఉపేందర్‌కు తల్లిదండ్రులు, తమ్ముడు ఉన్నా రు. ‘ఇంటికి పెద్ద దిక్కువు నువ్వే లేకపోతే నీ తమ్ముడు, మేము ఎలా బతకాలిరా..’ అంటూ, ఆస్పత్రిలో ఉపేందర్ తల్లిదండ్రులు గుండలెవిసేలా రోదించారు. క్రితం రోజే జన్మదిన వేడుక... ఉపేందర్-మమతది అన్యోన్య దాంపత్యమని బంధువులు, స్థానికులు చెప్పారు. ‘గురువారం రోజే మమత పుట్టిన రోజు. ఆ మరుసటి రోజునే ఆమె ఉద్యోగంలో చేరనుంది. త్వరలోనే తల్లి కూడా కాబోతోంది. ఇలా, సంతోషాలన్నీ ఒకేసారి రావడంతో.. పుట్టిన రోజు వేడుకను అందరం ఆనందంగా జరుపుకున్నాం’ అని, ఉపేందర్-మమత దంపతుల కుటుంబీకులు రోదిస్తూ చెప్పారు. వృతదేహాలను చూసేందుకు ఖమ్మం ఆస్పత్రికి చౌటపల్లి గ్రామస్తులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. -
కలిసి ఉంటే కలదు కుర్చీ
-
ఓటింగ్ లేకుండా బిల్లు ఏలా ఆమోదిస్తారు: మమత
-
2014లో సత్తా చాటనున్న ప్రాంతీయపార్టీలు
-
మాయ 'లేడీ'కి ఆరు నెలలు జైలు శిక్ష
మియాపూర్ : వాహనదారుడిని లిప్ట్ అడిగి....కారుతో పాటు ఉడాయించిన ఓ మాయలేడికి కూకట్పల్లి 9 ఎంఎం కోర్టు న్యాయమూర్తి వి. సత్యనారాయణ ఆరు నెలల జైలుశిక్ష విధించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజేష్ కథనం ప్రకారం... హర్యానాకు చెందిన మమత రాణి అలియాస్ మేఘన నాలుగు నెలల క్రితం మాదాపూర్‌లో కారులో వెళ్తున్న జి.వెంకట్ రెడ్డిని లిప్ట్ అడిగి కారు ఎక్కింది. కొద్ది దూరం వెళ్లాక ఆయన ఓ హోటల్ వద్ద కారు ఆపి లోపలికి వెళ్లాడు. తిరిగి వచ్చేసరికి మమత అతని కారు తీసుకొని ఉడాయించింది. కాగా, వెంకట్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన మాదాపూర్ పోలీసులు నిందితురాలిని గత మే 20న అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. దర్యాప్తు అనంతరం కోర్టులో ఛార్జ్ షీట్ వేశారు. కేసు పూర్వాపరాలను పరిశీలించిన న్యాయమూర్తి నిందితురాలికి ఆరు నెలల జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. నిందితురాలు మమతపై ఇలాంటివే మరో రెండు కేసులున్నాయి. -
జగన్ వాదనతో ఏకీభవించిన మమత
-
కోల్‌కతా చేరుకున్న YS జగన్
-
మమతతో జగన్ భేటీ పై హెడ్ లైన్ షో