దేశంలో ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికలు జరుగుతుండగా, అదేసమయంలో తృణమూల్ కాంగ్రెస్‌లో వివాదాలు బహిర్గతమవుతున్నాయి. తాజాగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవి నుంచి కునాల్ ఘోష్‌ను తొలగించారు. పార్టీ అభిప్రాయాలను వ్యతిరేకించినందుకు కునాల్ ఘోష్‌ను ఆ పదవి నుంచి తొలగించినట్లు ప్రభుత్వం ఒక లేఖలో పేర్కొంది. ఈ నేపధ్యంలో తృణమూల్ కాంగ్రెస్‌లో మమత వర్సెస్ అభిషేక్ వివాదం నడుస్తోందని విపక్ష పార్టీ నేతలు పేర్కొంటున్నారు. కునాల్ ఘోష్‌ను ఆ పదవి నుంచి తొలగించిన తర్వాత ఈ అంశం మరింత చర్చనీయాంశంగా మారింది.
కునాల్ ఘోష్ తొలగింపు వెనుక తృణమూల్ కాంగ్రెస్ లాబీ పనిచేస్తోందని ప్రతిపక్ష పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం తృణమూల్ కాంగ్రెస్‌లో రెండు లాబీలు ఉన్నాయని ఒకటి మమతా బెనర్జీ, మరొకటి అభిషేక్ బెనర్జీ అని వారంటున్నారు. కునాల్ ఘోష్ గతంలో మమతా బెనర్జీ లాబీ వర్గంలో ఉండేవాడని, ప్రస్తుతం అభిషేక్ బెనర్జీకి మద్దతుదారుగా మారారని ప్రతిపక్షాలు పేర్కొంటున్నాయి.
ఇది అసలే అత్త, మేనల్లుడి మధ్య పోరు అని బీజేపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. అత్త, మేనల్లుడి మధ్య జరిగిన పోరులో కునాల్ ఘోష్‌ను తొలగింపునకు గురయ్యారని వారు అంటున్నారు. ఉత్తర కోల్‌కతా నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి సుదీప్ బందోపాధ్యాయ మమత వర్గానికి చెందినవాడని, అయితే సుదీప్ బెనర్జీ గెలవడం అభిషేక్ బెనర్జీకి ఇష్టం లేదని వారు ఆరోపిస్తున్నారు.
ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల సమయంలో ఓ అరుదైన ఘట్టం కనిపించింది. ఇటీవల తపస్ రాయ్ తృణమూల్‌ను వీడి బీజేపీలో చేరి, కోల్‌కతా నార్త్ అభ్యర్థిగా మారారు. ఈ నేపధ్యంలో తృణమూల్ రాజ్యసభ మాజీ ఎంపీ, తృణమూల్ అధికార ప్రతినిధి కునాల్ ఘోష్.. తపస్ రాయ్‌పై ప్రశంసలు కురిపించారు. తపస్ రాయ్ టీఎంసీలోనే ఉండాలనుకున్నమని, అయితే అది కుదరలేదని కునాల్ పేర్కొన్నారు. ఆయన చాలా మంచి అభ్యర్థి అని, ప్రజలు కూడా అతనిని అర్థం చేసుకుని ఓటు వేస్తారని కూడా అన్నారు. ఈ వ్యాఖ్యల నేపధ్యంలోనే కునాల్‌పై పార్టీలో వేటు పడిందని, స్థానిక బీజేపీ నేతలు అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment