Trinamool
-
తృణమూల్‌లో మమతా vs అభిషేక్ బెనర్జీ?
దేశంలో ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికలు జరుగుతుండగా, అదేసమయంలో తృణమూల్ కాంగ్రెస్‌లో వివాదాలు బహిర్గతమవుతున్నాయి. తాజాగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవి నుంచి కునాల్ ఘోష్‌ను తొలగించారు. పార్టీ అభిప్రాయాలను వ్యతిరేకించినందుకు కునాల్ ఘోష్‌ను ఆ పదవి నుంచి తొలగించినట్లు ప్రభుత్వం ఒక లేఖలో పేర్కొంది. ఈ నేపధ్యంలో తృణమూల్ కాంగ్రెస్‌లో మమత వర్సెస్ అభిషేక్ వివాదం నడుస్తోందని విపక్ష పార్టీ నేతలు పేర్కొంటున్నారు. కునాల్ ఘోష్‌ను ఆ పదవి నుంచి తొలగించిన తర్వాత ఈ అంశం మరింత చర్చనీయాంశంగా మారింది. కునాల్ ఘోష్ తొలగింపు వెనుక తృణమూల్ కాంగ్రెస్ లాబీ పనిచేస్తోందని ప్రతిపక్ష పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం తృణమూల్ కాంగ్రెస్‌లో రెండు లాబీలు ఉన్నాయని ఒకటి మమతా బెనర్జీ, మరొకటి అభిషేక్ బెనర్జీ అని వారంటున్నారు. కునాల్ ఘోష్ గతంలో మమతా బెనర్జీ లాబీ వర్గంలో ఉండేవాడని, ప్రస్తుతం అభిషేక్ బెనర్జీకి మద్దతుదారుగా మారారని ప్రతిపక్షాలు పేర్కొంటున్నాయి.ఇది అసలే అత్త, మేనల్లుడి మధ్య పోరు అని బీజేపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. అత్త, మేనల్లుడి మధ్య జరిగిన పోరులో కునాల్ ఘోష్‌ను తొలగింపునకు గురయ్యారని వారు అంటున్నారు. ఉత్తర కోల్‌కతా నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి సుదీప్ బందోపాధ్యాయ మమత వర్గానికి చెందినవాడని, అయితే సుదీప్ బెనర్జీ గెలవడం అభిషేక్ బెనర్జీకి ఇష్టం లేదని వారు ఆరోపిస్తున్నారు.ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల సమయంలో ఓ అరుదైన ఘట్టం కనిపించింది. ఇటీవల తపస్ రాయ్ తృణమూల్‌ను వీడి బీజేపీలో చేరి, కోల్‌కతా నార్త్ అభ్యర్థిగా మారారు. ఈ నేపధ్యంలో తృణమూల్ రాజ్యసభ మాజీ ఎంపీ, తృణమూల్ అధికార ప్రతినిధి కునాల్ ఘోష్.. తపస్ రాయ్‌పై ప్రశంసలు కురిపించారు. తపస్ రాయ్ టీఎంసీలోనే ఉండాలనుకున్నమని, అయితే అది కుదరలేదని కునాల్ పేర్కొన్నారు. ఆయన చాలా మంచి అభ్యర్థి అని, ప్రజలు కూడా అతనిని అర్థం చేసుకుని ఓటు వేస్తారని కూడా అన్నారు. ఈ వ్యాఖ్యల నేపధ్యంలోనే కునాల్‌పై పార్టీలో వేటు పడిందని, స్థానిక బీజేపీ నేతలు అంటున్నారు. -
కాంగ్రెస్‌కు భారీ ఝలక్
పశ్చిమ బెంగాల్‌లోని మొత్తం 42 లోక్‌సభ స్థానాల్లో తాము సొంతంగా పోటీ చేస్తామని తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) పునరుద్ఘాటించడంతో ఇండియా కూటిమి ఆనందం ఆవిరయ్యింది. టీఎంసీ ప్రకటనతో కాంగ్రెస్‌కు మరోమారు చుక్కెదురయ్యింది. దీనికిముందు ఇండియా కూటమి, టీఎంసీల మధ్య లోక్‌సభ ఎన్నికల్లో పోటీ విషయమై సీట్ల భాగస్వామ్య చర్చలు జరిగాయి. ఈ నేపధ్యంలో తృణమూల్ వర్గాలు తమ పార్టీకి మూడవ వంతు సీట్లు కూడా దక్కలేదని మీడియాకు తెలిపాయి. తృణమూల్ నేత డెరెక్ ఓబ్రెయిన్ మీడియాతో మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్‌లోని మొత్తం 42 లోక్‌సభ స్థానాల్లోనూ తృణమూల్ కాంగ్రెస్ పోటీ చేస్తుందని పార్టీ చైర్పర్సన్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారన్నారు. ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీతో సీట్ల కేటాయింపుపై ఒప్పందం కుదుర్చుకున్న కాంగ్రెస్.. ఢిల్లీ, గుజరాత్, గోవాలలో ‘ఆప్’తో సీట్ల కేటాయింపుపై రాజీ కుదుర్చుకుంది. అయితే పశ్చిమబెంగాల్లో ఇండియా కూటమికి ఎదురుదెబ్బ తగిలింది. లోక్‌సభకు అత్యధిక ఎంపీలను పంపే రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్ మూడవ స్థానంలో ఉంది. కాగా అసోంలో తృణమూల్‌కు రెండు, మేఘాలయలో ఒక సీటు ఇవ్వడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. చర్చలు సానుకూల దిశలో సాగుతున్నాయని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. పశ్చిమ బెంగాల్లో తమ పార్టీ మాత్రమే బీజేపీని ఎదుర్కోగలదని, అందుకే రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేస్తామని తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ గతంలో చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ నేత డెరెక్ ఓబ్రెయిన్ పునరుద్ఘాటించారు. కాంగ్రెస్‌కు పశ్చిమ బెంగాల్లో ఎమ్మెల్యేలు లేరని, అయినా వారికి రెండు ఎంపీ సీట్లను ఇచ్చి, గెలిపించేందుకు సిద్ధమయ్యామని, దానికి వారు నిరాకరించారని ఆయన తెలిపారు. దీంతో కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా ఇవ్వబోమని సీఎం మమతా బెనర్జీ స్పష్టం చేశారని ఓబ్రెయిన్ పేర్కొన్నారు. -
వివాదంలో సినీ నటి.. ఈడీకి ఫిర్యాదు!
తృణమూల్ ఎంపీ, నటి నుస్రత్ జహాన్ తాజాగా వివాదంలో చిక్కుకుంది. పశ్చిమ బెంగాల్‌లోని 24 పరగణాలు జిల్లాలో ఆమె మోసానికి పాల్పడిందంటూ ఈడీకి ఫిర్యాదు చేశారు. గతంలో ఆమె కేవలం రూ.6 లక్షలకే త్రిబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ ఇస్తామని డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపించారు. అయితే ఆమె ప్రకటించిన ఐదేళ్లు పూర్తయినా ఇప్పటివరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదు. దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. (ఇది చదవండి: అతడితో డేటింగ్ వల్ల బరువు తగ్గాను: రాశీఖన్నా) తమకు త్రిబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్స్ తక్కువ ధరకే అందిస్తామని మోసం చేశారంటూ సాల్ట్ లేక్ ఈడీ కార్యాలయంలో బాధితులు ఫిర్యాదు చేశారు. సెవెన్ సెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో మోసాలకు పాల్పడ్డారని వారు ఆరోపించారు. ప్రస్తుతం ఎంపీగా ఉన్న నుస్రత్ జహాన్ దాదాపు రూ.24 కోట్ల మోసాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. కాగా.. ఇప్పటికే ఈ వ్యవహారంపై గతంలో కోర్టులో కేసు దాఖలైంది. ఈ కేసులో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్ కోర్టుకు హాజరు కాలేదని బాధితులు తెలిపారు. దీంతో చివరికీ ఈడీని ఆశ్రయించామని తెలిపారు. అయితే ఈ విషయంలో జహాన్ ఇప్పటివరకు స్పందించలేదు. కాగా.. నుస్రత్ జహాన్ బెంగాలీ సినిమా ఇండస్ట్రీకి చెందిన నటి. ఆమె 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరపున బసిర్హాట్ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఎంపీగా గెలిచింది. కాగా.. గతంలో ఫిబ్రవరి 2012లో పార్క్ స్ట్రీట్‌లో ఆంగ్లో-ఇండియన్ మహిళపై జరిగిన సామూహిక అత్యాచారం తర్వాత జహాన్ వివాదంలో చిక్కుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఖాదర్ ఖాన్‌కు ఆశ్రయం కల్పించినట్లు జహాన్‌పై ఆరోపణలు ఉన్నాయి. మార్చి 2015లో అత్యాచార బాధితురాలు మరణించింది. నిందితుడు ఖాదర్ ఖాన్ ఇంకా పరారీలో ఉన్నాడు. (ఇది చదవండి: 'మేడ్ ఇన్ హెవెన్' లో ట్రాన్స్ వుమెన్.. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా?) -
మిస్ అయిన మాజీ రైల్వే మంత్రి.. హఠాత్తుగా ఢిల్లీలో ప్రత్యక్షమై..
తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి ముకుల్ రాయ్‌కి అత్యంత విచిత్రమైన పరిణామం ఎదురైంది. ఒక పక్క కుటుంబ సభ్యులు ఆయన కనిపించటం లేదని హైరానా పడుతుంటే అకస్మాత్తుగా ప్రత్యక్షమై అందర్నీ షాక్‌కి గురి చేశారు. ఈ మేరకు ఆయన హఠాత్తుగా ఢిల్లీ విమానాశ్రయంలో ఎస్కార్ట్‌తో సహా కనిపించాడు. ఎయిర్‌పోర్టులో ఆయన చుట్టూ రక్షణగా కొందరు వ్యక్తులు ఉండి తరలించడం కనిపించింది. ఈ దృశ్యాలను బట్టి 69 ఏళ్ల ముకుల్ రాయ్ అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఆయన సోమవారం ఢిల్లీ బయలుదేరారు. ఆ తర్వాత నుంచి ఆయన కుటుంబంతో అందుబాటులో లేకుండా పోయారు. దీంతో ముకుల్ చుట్టూ చిత్రమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ మేరకు ఒక్కసారిగా ప్రత్యక్షమైన ఆయన్నుచూసిన మీడియా పలు ప్రశ్నలు సంధించగా..తాను ముఖ్యమైన పనిపై ఇక్కడకు వచ్చానని చెప్పారు. తాను ఎంపీనని తనకు ఢిల్లీలో పని ఉందని చెప్పారు. చికిత్స కోసం రాలేదని చెప్పారు. ఇదిలా ఉండగా, ఆయన కుటుంబ సభ్యులు ముకుల్ జాడ లేదంటూ మిస్సింగ్ కేసు పెట్టారు. ఈ మేరకు ఆయన కుమారుడు సుభ్రాగ్షు మాట్లాడుతూ..తన తండ్రి ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యిందని, కొందరూ వ్యక్తులు ఆయన్ను తీసుకువెళ్లినట్లు తెలిపారు. అతని మానసిక స్థితి బాగోలేదని, కొన్ని పార్టీలు ముకుల్ రాయ్‌తో డర్టీ పాలిటిక్స్ ఆడుతున్నట్లు చెప్పుకొచ్చారు. కొంతమంది ఆయన్ను తీసుకువెళ్లిపోవడంతోనే తాను ఆయన్ని కనుగొనలేకపోయానని తెలిపారు. ముకుల్ బీజేపీలో చేరుతున్నారనే వార్తలను కొట్టిపారేశారు. ఆయన ఇప్పుడూ బీజేపీలో ఉన్నా ఆయన మానసిక స్థితిలో ఎలాంటి మార్పు లేదని, అందువల్ల ముందు ఆయనకి చికిత్స అందించడమే ముఖ్యం అని చెప్పారు. కాగా, కేంద్ర మాజీ మంత్రి ముకుల్ రాయ్ 2017లో తృణమూల్ నాయకురాలు మమతా బెనర్జీతో విభేదాలు రావడంతో బీజేపీలో చేరారు. ఆయన్ను బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా నియమించిది. 2021లో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ టికెట్‌పై గెలిచి మళ్లీ కొద్ది రోజులకే సొంత గూటికే వెళ్లిపోయారు. ఆయన గతంలో యూపీఏ హయాంలలో రైల్వే శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. (చదవండి: ఆ విలువ లేని డిగ్రీలే భారత్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్నాయ్!) -
20 సీట్లు కూడా లేనోళ్లు ఓ వచ్చేస్తారు : మోదీ
కోల్‌కత : పాలన గాలికొదిలేసి పర్యటనల పేరుతో కోట్లు ఖర్చు చేస్తున్నాడంటూ ప్రతిపక్షాలు చేసే విమర్శలకు ప్రధాని నరేంద్ర మోదీ కౌంటర్ ఇచ్చారు. విదేశాల్లో పర్యటించింది భారత్ పేరును మారుమోగించేందుకేనని అన్నారు. నేడు ప్రపంచ వేదికపై భారత్ సగర్వంగా తన వాదన వినిపింస్తోందని ఆనందం వ్యక్తం చేశారు. సమస్యలు, సవాళ్లపై మాట్లాడేందుకు అంతర్జాతీయంగా భారత్ ఐదేళ్ల క్రితం ఇబ్బందులు పడేదని, కానీ నేడు ఆ పరిస్థితి లేదన్నారు. ఎన్నికల ప్రచారం భాగంగా మోదీ బెంగాల్‌లోని బిర్భూమ్ జిల్లాలో జరిగిన ప్రచార సభలో ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఉద్దేశిస్తూ.. ‘కొన్ని రోజుల క్రితం ఎక్కడో చదివా.. విదేశాల్లో విహరిస్తూ చాయ్‌వాలా బిజీ అయ్యాడని ఎవరో అన్నారు. కానీ, ఈ ఐదేళ్ల కాలంలో నా పర్యటనలు దేశ ప్రతిష్టను పెంచాయి. అంతర్జాతీయంగా గళం విప్పేందుకు భారత్‌కు ఇప్పుడు ఎలాంటి బెరుకు లేదు’ అని చెప్పుకొచ్చారు. ‘20 - 25 సీట్లలో పోటీ చేసే వారు కూడా హాట్ సీట్కోసం అర్రులు చాస్తారు. ప్రధాని పీఠం ఎక్కాలని ఉబలాటపడతారు’ అని వ్యాఖ్యానించారు. ఇక ఇప్పటికే మూడు దశల్లో పూర్తయిన పోలింగ్ సరళి చూస్తుంటే.. బెంగాల్లో దీదీ కథ ముగిసినట్టు వార్తలొస్తున్నాయని అన్నారు. ఫ్రీ అండ్ ఫేర్‌గా ఎన్నికలు నిర్వహిస్తున్న ఎన్నికల కమిషన్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. -
మరో తృణమూల్ ఎంపీ అరెస్ట్
రోజ్ వ్యాలీ చిట్ స్కాంలో సీబీఐ అదుపులో సుదీప్ ♦ పీఎంఓ ఒత్తిడితోనే: పశ్చిమబెంగాల్ సీఎం మమత కోల్‌కతా: చిట్ ఫండ్ స్కాంలో వారం తిరగక ముందే మరో తృణమూల్ కాంగ్రెస్ నేత అరెస్టయ్యారు. రోజ్ వ్యాలీ చిట్ ఫండ్ స్కాం కేసులో తృణమూల్ ఎంపీ, లోక్‌సభలో ఆ పార్టీ పార్లమెంటరీ నేత అయిన సుదీప్ బంధోపాధ్యాయ్ని సీబీఐ మంగళవారం అరెస్ట్ చేసింది. ఇక్కడి సీబీఐ ఆఫీసుకు వచ్చిన ఆయనను 4గంటలపాటు సదీర్ఘంగా విచారించి అనంతరం అదుపులోకి తీసుకుంది. ఆయన దర్యాప్తునకు సహకరించలేదని, రోజ్ వ్యాలీ కంపెనీ స్పాన్సర్ చేసిన విదేశీ పర్యటనపై ప్రశ్నలకు జవాబులివ్వలేదని సీబీఐ వర్గాలు చెప్పాయి. తృణమూల్ చీఫ్ మమతా బెనర్జీ, ఎంపీలు సీబీఐ కార్యాలయానికి వెళ్లి ఆయనను కలుసుకుని మద్దతు తెలిపారు. ఈ కేసులో ఆయనకు ఇదివరకు మూడుసార్లు దర్యాప్తు సంస్థ సమన్లు జారీ చేసింది. ఇదే స్కాంలో మరో తృణమూల్ ఎంపీ తపస్ పాల్‌ను శుక్రవారం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. సుదీప్ అరెస్ట్‌తో రెచ్చిపోయిన తృణమూల్ అనుబంధ విద్యార్థి సంఘం కార్యకర్తలు నగరంలోని బీజేపీ ప్రధాన కార్యాలయంపై రాళ్లు రువ్వి, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ కార్యకర్తలు 15 మంది గాయపడ్డారని బీజేపీ తెలిపింది. మోదీ దమ్ముంటే అరెస్ట్ చేయండి సుదీప్ అరెస్ట్‌పై తృణమూల్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అగ్గిమీద గుగ్గిలమయ్యారు. ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) ఒత్తిడితోనే అరెస్ట్ చేశారని, మోదీని, అమిత్ షాను ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. దమ్ముంటే తనను, తమ పార్టీ ఎంపీలందర్నీ అరెస్ట్ చేయాలని ప్రధానికి సవాల్ విసిరారు. నోట్ల రద్దును వ్యతిరేకిస్తున్న వారిపై మోదీ సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఆదాయ పన్ను శాఖలను ఉసిగొల్పుతూ కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ‘ఆయన ఇతరులను నోరుమూయించగలరు కానీ నన్ను కాదు. ప్రజల గొంతుకను నొక్కలేరు. ఆయన చేతిలో ప్రభుత్వం ఉంది. నా చేతిలోనూ ప్రభుత్వం ఉంది. అల్లర్లకు పాల్పడ్డవారిని నేను అరెస్ట్ చేయించగలను. కానీ ప్రజాస్వామ్యంపై నాకు నమ్మకముంది కాబట్టి ఆ పని చేయలేదు’ అని అన్నారు. కాగా, అనధికార లెక్కల ప్రకారం రూ. 60వేల కోట్ల విలువైన రోజ్ వ్యాలీ చిట్ స్కాం దేశంలోనే అతి పెద్ద చిట్ ఫండ్ స్కాం అని భావిస్తున్నారు. -
పార్లమెంటులో అదే రచ్చ
బలమున్నా ఓటింగ్‌కు భయమెందుకు: తృణమూల్ - దేశంలో ఆర్థిక అత్యవసర పరిస్థితి ఉందా?: ఆజాద్ - విపక్షాల సూచనలు స్వీకరిస్తామన్న కేంద్రం న్యూఢిల్లీ: విపక్షాల ఆందోళనలతో పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో మరో రోజూ ఎలాంటి చర్చ లేకుండానే వాయిదా పడింది. నోట్ల రద్దుపై జరుగుతున్న రచ్చతో ఉభయ సభల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. లోక్‌సభలో నోట్లరద్దుపై రూల్ 184 కింద చర్చించాలన్న డిమాండ్‌తో విపక్షాలు సోమవారం నిరసన తెలిపాయి. అరుుతే కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ జోక్యం చేసుకుని.. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి విపక్షాల సూచనలు వింటామన్నారు. ఏ రూల్ కింద చర్చ జరగాలనే విషయంపై నిర్ణయాధికారం స్పీకర్‌కే వదిలేద్దామని చెప్పారు. అరుునా విపక్షాల ఆందోళన తగ్గలేదు. దీంతో రూల్ 193 చర్చ (ఓటింగ్ ఉండదు)కు స్పీకర్ యత్నించారు. టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి చర్చను ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. ఇంతలోనే తృణమూల్ ఎంపీ ఒకరు జితేందర్ మైక్రో ఫోన్ లాక్కొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో సభ వారుుదా పడింది. ‘మేం రూల్ 56 నుంచి రూల్ 184కు తగ్గాం. ప్రభుత్వం కూడా 193 నుంచి కాస్త తగ్గాలి’అని ఖర్గే చేసిన వ్యాఖ్యలు సభలో నవ్వులు పూరుుంచారుు. అనారోగ్యం నుంచి కోలుకున్న కాంగ్రెస్ చీఫ్ సోనియా సభకు రాగా, జయ అనారోగ్యం కారణంగా అన్నాడీఎంకే ఎంపీలంతా గైర్హాజరయ్యారు. ఆర్థిక ఎమర్జెన్సీ ఉందా?: అటు రాజ్యసభలోనూ.. నోట్ల రద్దు కారణం గా ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నారని నిరసిస్తూ విపక్షాలు ఆందోళన చేశారుు. కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ, తృణమూల్ ఎంపీలు వెల్‌లోకి వచ్చి నినాదాలు చేశారు.దేశంలో ఆర్థిక ఎమర్జెన్సీ ఉందా అని ఆజాద్ (కాంగ్రెస్) ప్రశ్నించారు. ఇక కొత్త ఐఐటీల్లేవ్: కొత్తగా ఏ రాష్ట్రం లోనూ ఐఐటీ, ఐఐఎం, ట్రిపుల్‌ఐటీలను స్థాపించే ఉద్దేశం లేదని కేంద్ర మంత్రి మహేంద్రనాథ్ తెలిపారు. ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ అందించే పథకాలను ఎక్కువ మందికి అందించేందుకు వేతన పరిమితిని రూ.15వేల నుంచి రూ.25వేలకు పెంచాలని ప్రతిపాదనలు అందినట్లు కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. -
బీజేపీ, టీఎంసీ కార్యకర్తల ఘర్షణ
కోల్ కత్తా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆదివారం రెండో విడత పోలింగ్ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), బీజేపీ కార్యకర్తలు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘర్షణలో 8మంది గాయపడ్డారు. ఈ సంఘటన బిర్భూమ్ జిల్లా దమ్ రుత్ గ్రామంలో చోటుచేసుకుంది. పోలింగ్ జరుగుతున్న సమయంలో ఘర్షణ జరిగిందని, ఇరు వర్గాలకు చెందిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. దాడులకు గురైంది తమ పార్టీ సభ్యులేనని బీజేపీ పేర్కొంది. పోలింగ్ బూత్ లో ఉన్న తమ పార్టీ సభ్యునిపై తృణమూల్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డాడని బీజేపీ ఆరోపించింది. ఉత్తర బెంగాల్ లోని ఆరు జిల్లాల్లో ఈ రోజు పోలింగ్ జరిగింది. కొన్ని చోట్ల ఏవీయంలు మొరాయించగా, సిబ్బంది సరిచేశారు. -
‘దీదీ’కే మరోసారి అధికారం?
రాజకీయ చైతన్యానికి మారుపేరుగా మార్మోగిన పశ్చిమ బెంగాల్ 16వ అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల్లో ప్రస్తుత పాలకపార్టీ ఆలిండియా తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) మరోసారి గెలుస్తుందనే విషయంపై భిన్నాభిప్రాయాలు లేవు. అయినా, ఈ ఎన్నికలపై మీడియాలో, రాజకీయవర్గాల్లో ఆసక్తి తగ్గలేదు. 294 సీట్లున్న ఈ రాష్ట్రంలో కిందటి(2011) ఎన్నికల్లో తృణమూల్‌తో పొత్తుపెట్టుకుని పోటీచేసిన కాంగ్రెస్ దశాబ్దాలుగా రాజకీయ బద్ధశత్రువులుగా ఉన్న కమ్యూనిస్టులతో కలిసి పోటీచేస్తోంది. 1972 అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని రకాల అక్రమాలకు పాల్పడి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్. అప్పటి నుంచీ ప్రధాన వామపక్షమైన సీపీఎంతో శత్రుత్వమే ఉంది. అలాంటిది కిందటి ఎన్నికల్లో తృణమూల్ నేత మమతా బెనర్జీతో చేతులు కలిపి 34 ఏళ్లు పాలించిన సీపీఎంను కూలదోయడంలో కీలకపాత్ర పోషించింది. ఆ తర్వాత పరిణామాల వల్ల కాంగ్రెస్ తృణమూల్‌కు దూరమైంది. మమత ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక వర్గాల ప్రజలతోపాటు ముస్లింలు తృణమూల్‌కు దగ్గరయ్యారు. సంప్రదాయ ఓటర్లుగా ఉన్న ఈ మైనారిటీలు సీపీఎంకు దూరమయ్యారు. దాదాపు 25 శాతం ముస్లింలు ఉన్న బెంగాల్లో మమత వారి సంక్షేమానికి తీసుకున్న చర్యలు వారిని తృణమూల్‌కు దగ్గరయ్యేలా చేశాయి. ఫలితంగా మతం రంగు పులుముకున్న రాజకీయాలు రాష్ర్టంలో బీజేపీ బలపడడానికి అవకాశమిచ్చాయి. కాంగ్రెస్, సీపీఎం-దాని మిత్రపక్షాలు, బీజేపీ విడివిడిగా పోటీ చేస్తే, తృణమూల్‌కు ప్రధాన ప్రత్యర్థి పక్షంగా బీజేపీయే ఆవిర్భవించవచ్చనే అంచనాతో కాంగ్రెస్, సీపీఎంలు చేతులు కలిపాయి. ఈ కొత్త రాజకీయ సమీకరణతో వామపక్షాలు, కాంగ్రెస్ బాగా దెబ్బతినే ప్రమాదం తప్పిందని భావిస్తున్నారు. అదీగాక బీజేపీ ఎదుగుదలకు బ్రేక్ పడడానికి ఈ పొత్తు ఉపకరిస్తుందని విశ్లేషిస్తున్నారు. రే, బసు, బుద్ధ మినహా అందరు సీఎంలూ అవివాహితులే... బీసీ రాయ్ నుంచి మమత వరకూ బెంగాల్‌కు 8 మంది ముఖ్యమంత్రులుగా పనిచేయగా వారిలో వరుసగా సీఎంలైన ముగ్గురు సిద్ధార్థ శంకర్‌రే(1972-77), జ్యోతి బసు(1977-2000), బుద్ధదేవ్ భట్టాచార్య(2000-2011) మాత్రమే వివాహితులు. మిగిలిన ఐదుగురూ(పీసీ ఘోష్, బీసీ రాయ్, పీసీ సేన్, అజయ్ ముఖర్జీ(1967-69, 1969-70), మమతా బెనర్జీ(2011 నుంచి ఇప్పటి వరకూ) పెళ్లి చేసుకోలేదు. అవివాిహ తులుగా ఉండిపోవడం, ఆలస్యంగా పెళ్లాడడం బెంగాలీ సమాజంలో మామూలే. 34 ఏళ్ల మార్క్సిస్టుల పాలన 1977 అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎం నాయకత్వంలోని వామపక్ష ఫ్రంట్(సీపీఎంకు సొంతగానే మెజారిటీ) సంపూర్ణ మెజారిటీ సాధించింది. సీనియర్ నేత జ్యోతిబసు ముఖ్యమంత్రిగా వరుసగా 1982, 87, 91, 96 ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలో కొనసాగింది. వరుసగా 23 ఏళ్ల 137 రోజులు ముఖ్యమంత్రి పదవిలో కొనసాగి జ్యోతిబసు రికార్డు సృష్టించారు. 2000 నవంబర్‌లో ఆరోగ్యకారణాలతో ఆయన పదవి నుంచి వైదొలగడంతో ఆయన అనుచరుడు, తర్వాతి తరం నేత 56 ఏళ్ల బుద్ధదేవ్ భట్టాచార్యకు సీఎం పదవి దక్కింది. అన్నివిధాలా బసుకు మంచి వారసునిగా పేరుతెచ్చుకున్న బుద్ధదేవ్ కొద్ది నెలలకే 2001 మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పాలక కూటమిని విజయపథాన నడిపించారు. మళ్లీ ఐదేళ్ల మంచి పాలన తర్వాత 2006లో సీపీఎంను, లెఫ్ట్ ఫ్రంట్‌ను అంతకు ముందు కనీవినీ ఎరగని రీతిలో గెలిపించి, రికార్డు స్థాయిలో మెజరిటీ సాధించిపెట్టారు. సీపీఎం జ్యోతిబసు హయాంలో జరిగిన ఎన్నికల్లో కన్నా ఈ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు(294కు 176 సీట్లు) గెలుచుకుంది. రెండోసారి అన్నీ తప్పిదాలు బుద్ధదేవ్ 2006 భారీ విజయం తర్వాత సింగూరు టాటా-నానో కార్ల ఫ్యాక్టరీకి స్థల సేకరణ, నందిగ్రామ్‌లో ఇండొనీసియా కంపెనీకి భూసేకరణ సందర్భాల్లో ప్రజలపై ప్రభుత్వ దమనకాండకు నాయకత్వం వహించి అప్రతిష్టపాలయ్యారు. ఈ సమయంలో జన ం తరఫున పోరాడుతూ బలపడుతున్న మావోయిస్టుల అణచివేత పేరుతో అటవీ ప్రాతాల్లో ఆదివాసీలపై పోలీసుదాడులు, జులుం పెరిగిపోయాయి. మొదట్నించీ కమ్యూనిస్టులకు సానుభూతిపరులుగా ఉన్న మధ్యతరగతి ప్రజలు (భద్రలోక్) మార్క్సిస్టులకు దూరమయ్యారు. ఈ క్రమంలో మావోయిస్టుల నుంచి మధ్యతరగతి మేధావులు, పేద ప్రజలు తృణమూల్ బలపడడానికి కారకులయ్యారు. ఫలితంగా 34 సుదీర్ఘ పాలన తర్వాత కమ్యూనిస్టులు, పదేళ్ల ఏలుబడి తర్వాత బుద్ధదేవ్ 2011 అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరపరాజయాన్ని చవిచూడాల్సివచ్చింది. బుద్ధదేవే తన నియోజకవర్గంలో తృణమూల్ చేతిలో ఓడిపోయారు. అక్రమాలతో, అణచివేతతో జరిగిన 1972 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రమే జ్యోతిబసు ఓడిపోయారు (అక్రమాలను పసికట్టి పోలింగ్‌కు ముందే పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు ఆయన ప్రకటించారు.). దాదాపు మూడున్నర దశాబ్దాలు సాగిన పాలనలో మార్క్సిస్టుల తప్పిదాలు, ముఖ్యంగా బుద్ధదేవ్ చివరి సంవత్సరాల్లో చేసిన పెద్ద పొరపాట్లు 2011 ఎన్నికల్లో తృణమూల్-కాంగ్రెస్ కూటమికి ఘనవిజయం సాధించిపెట్టాయి. పదేళ్లకు పైగా ముఖ్యమంత్రిగా కొనసాగిన బుద్ధదేవ్ సీపీఎం అధికారం కోల్పోవడానికి ప్రధాన ముద్దాయిగా కనిపించారు. జ్యోతిబసు కాలం నుంచీ పాలకపక్షమైన సీపీఎం కార్యకర్తలతో జరిపిన వీధిపోరాటాలతో రాటుదేలిన మమత అంతకు ముందు ఎవరూ ఊహించనిరీతిలో కాంగ్రెస్ వీడి, ప్రాంతీయపార్టీ స్థాపించి మెజారిటీ సాధించి ముఖ్యమంత్రి అయ్యారు. తృణమూల్ పాలనలో సీపీఎం ఛాయలు ప్రతిపక్షంలో ఉండగా సీపీఎంనే అనుకరించిన మమత అధికారంలోకి వచ్చాక కూడా లెఫ్ట్ ఫ్రంట్ విధానాలు కొన్నింటిని అనుసరించారు. ప్రధానంగా ప్రతిపక్షాలను అణచివేయడంలో, అధికారాన్ని గరిష్టస్థాయిలో కార్యకర్తలు, నాయకులకు ఉపయోగపడేలా చూడడంలోనూ మార్క్సిస్టుల దారిలోనే మమత ప్రయాణిస్తున్నారనే ఆరోపణలు ఇప్పటికే బాహాటంగా వినిపిస్తున్నాయి. పాతికేళ్లకు పైగా మార్క్సిస్టులతో పోరాడిన మమతా బెనర్జీ మనుషులు తాము అధికారపార్టీ అనే విషయం మరచి వీధిపోరాటాలు కొనసాగిస్తున్నారు. అలాగే, 34 ఏళ్లు పాలకపక్షంగా కొనసాగిన సీపీఎం అధికారం కోల్పోయి ఐదేళ్లు దాటినా సమరశీల ప్రతిపక్షపార్టీ పాత్ర పోషించడం ఇంకా నేర్చుకోలేకపోతోంది. ఈసారి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కోల్‌కతాలోని సీపీఎం రాష్ర్ట ప్రధాన కార్యాలయం(అలీముద్దీన్ స్ట్రీట్‌లోని ముజఫర్ అహ్మద్ భవన్) వైపు వెళ్లిన మీడియా ప్రతిధులకు నిర్మానుష్యంగా కనిపించింది. ఎన్నికల సమయంలో ఉండాల్సిన కోలాహలం, కార్యకర్తల్లో ఉత్సాహం కరువయ్యాయి. అత్యాచారాలు, అవినీతి, కుంభకోణాలు తృణమూల్ కాంగ్రెస్ ఐదేళ్ల పాలనలో మహిళలపై అత్యాచారాలు, ప్రతిపక్షాలపై హింసాత్మక దాడులు జరిగాయి. సీపీఎం సర్కారు మాదిరిగానే మావోయిస్టులను, వారి నేతలను బూటకపు ఎన్కౌంటర్లలో పోలీసులు చంపివేశారని వార్తలొచ్చాయి. తెలుగు ప్రాంతానికి చెందిన మావోయిస్టు అగ్రనేత మల్లోజుల కోటేశ్వరరావును అదే పద్ధతిలో బెంగాల్ పోలీసులు కాల్చిచంపారు. శారదా కుంభకోణంలో తృణమూల్ ఎంపీలు, అగ్రనేతలు, మంత్రుల ప్రమేయం ఉందని ఆరోపణలొచ్చాయి. ఇంత జరుగుతున్నా బెంగాల్ ప్రజలు మమతనే మరోసారి ముఖ్యమంత్రిని చేసేలా ఉన్నారని ఎన్నికల సర్వేలు సూచిస్తున్నాయి. వరుసగా ఏడు అసెంబ్లీ ఎన్నికల్లో మార్క్సిస్టుల నేతృత్వంలోని వామపక్షాలను గద్దెనెక్కించిన బెంగాలీలు మమతకు మరో అవకాశం తప్పక ఇస్తారని 2011 నుంచి జరుగుతున్న ఉప ఎన్నికలు, స్థానిక ఎన్నికలు నిరూపిస్తున్నాయి. 63 నుంచి 86 ఏళ్ల వరకూ బసుకు సీఎం పదవి రెండుసార్లు ఉపముఖ్యమంత్రిగా బంగ్లా కాంగ్రెస్ నేత అజయ్‌కుమార్ ముఖర్జీ నేతృత్వంలోని లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వాల్లో పనిచేసిన జ్యోతి బసు ఇంగ్లండ్‌లో న్యాయశాస్త్రం చదువుకున్న బారిస్టర్. కులీన కాయస్థ కుటుంబంలో జన్మించిన బసు చివరికి 1977లో 63 ఏళ్ల వయసులో సీఎం అయ్యారు. 86వ ఏట పదవి నుంచి స్వచ్ఛందంగా వైదొలిగారు. డాక్టర్ సీఎం బీసీ రాయ్ స్వాతంత్య్రం వచ్చాక రెండో ముఖ్యమంత్రిగా 1948లో అధికారం చేపట్టిన కాంగ్రెస్ నేత డాక్టర్ బిధాన్ చంద్ర(బీసీ)రాయ్ మొత్తం 14 ఏళ్ల 157 రోజులు సీఎంగా 1962 వరకూ కొనసాగారు. ఆ తర్వాత సీఎం పదవి చేపట్టిన ఏ కాంగ్రెస్ నేతా ఇంత కాలం పదవిలో లేరు. 1972 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంతో సీఎం అయిన సిద్ధార్థ శంకర్‌రే(రాయ్) ఐదేళ్లు 1977 ఎన్నికల వరకూ పదవిలో కొనసాగారు. ఆయనే రాష్ట్రంలో చివరి కాంగ్రెస్ ముఖ్యమంత్రి. 1957 అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి సీఎం బీసీ రాయ్ కలకత్తా నగరంలోని బౌబజార్ అసెంబ్లీ స్థానంలో ఓట్ల లెక్కింపు రోజు మధ్యాహ్నం వరకూ కమ్యూనిస్టు(సీపీఐ)అభ్యర్థి మహ్మద్ ఇస్మాయిల్ కన్నా దాదాపు 200 ఓట్లు వెనకబడి ఉండి, సాయంత్రానికి పుంజుకుని అతి స్వల్ప మెజారిటీతో విజయం సాధించడం సంచలనమైంది. ఫలితం ప్రకటించడానికి ముందు లెక్కింపు కేంద్రంలో కరెంటు పోవడం అనుమానాలకు దారితీసిందని ప్రఖ్యాత ఆర్థికవేత్త, జ్యోతి బసు కేబినెట్లో ఆర్థికమంత్రిగా ఉన్న డా.అశోక్‌మిత్రా ఓ ఆంగ్ల వార పత్రికలో రాసిన వ్యాసంలో వెల్లడించారు. 1984లో జెయింట్ కిల్లర్..2011లో సీఎం పదవి.. మమతా బెనర్జీ కాంగ్రెస్ టికెట్‌పై 1984 డిసెంబర్ ఆఖరులో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో జాదవ్‌పూర్‌లో సీనియర్ సీపీఎం నేత సోమనాథ్ చటర్జీని ఓడించి ‘జెయింట్ కిలర్’ వెలుగులోకి వచ్చారు. అయితే, సీపీఎం నేతలు, కార్యకర్తలతో వీధిపోరాటాలకు దిగుతున్న మమతను ఓడించాలనే దృఢ లక్ష్యంతో 1989 డిసెంబర్ లోక్‌సభ ఎన్నికల్లో అదే జాదవ్‌పూర్ నియోజకవర్గంలో ఆమెపై జాదవ్‌పూర్ యూనివర్సిటీలో ఇంగ్లిష్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న మాలినీ భట్టాచార్యను సీపీఎం తరఫున ఎన్నికల బరిలోకి దింపారు. మమతను మాలిని ఓడించారు గాని ఏడాదిన్నరకే లోక్‌సభ రద్దుతో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో జాదవ్‌పూర్‌లోనే మమత చేతిలో ఓడిపోయారు. -
మమతపై హత్య కేసు నమోదు చేయాలి
కోలకతా: కోలకతా లో ఫ్లై ఓవర్ కూలిన ఘటనపై మమతా బెనర్జీ ప్రభుత్వంపై బీజేపీ తన దాడిని ఎక్కుపెట్టింది. రాష్ట్రంలో కొనసాగుతున్న అవినీతి పాలనకు ఈ ఘటనే తార్కాణమని బీజేపీ మండిపడింది పశ్చిమ బెంగాల్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ కైలాష్ విజయ వార్గీయ ఫ్లై ఓవర్ కూలిన దుర్ఘటనపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై విమర్శలు గుప్పించారు. మమత ప్రభుత్వం అవినీతి పాలనకు ఇదొక అద్భుతమైన ఉదాహరణ అని ఆయన ట్విట్ చేశారు. కైలాష్ విజయ వార్గీయ.. తన వరుస ట్విట్లలో మమత పై విరుచుకుపడ్డారు. ఈ సంఘటనపై మమతపై హత్యకేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆమె అవినీతి వల్ల అమాయక ప్రజలను బలి తీసుకుందన్నారు. దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. మృతులకు సంతాపం తెలిపిన కైలాష్ విజయ వార్గీయ క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అటు నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్ కూలిపోవడం బాధ గలిగించిందని జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ట్విట్ చేశారు. సహాయక చర్యల్లో సహకరించాల్సిందిగా పార్టీ రాష్ట శాఖ పార్టీకి ఆదేశాలు జారీచేసినట్టు ఆయన తెలిపారు.కాగా ఉత్తర కోల్‌కతాలోని గణేశ్ థియేటర్ గిరీశ్ పార్క్ ఏరియా సమీపంలో నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ హఠాత్తుగా కూలిపోయింది. ఈ ఘటనలో 14 మంది మరణించగా, మరో 100 మందికి పైగా గాయపడిన సంగతి తెలిసిందే. సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. -
దద్దరిల్లిన పార్లమెంట్... ఎథిక్స్ కమిటీ
న్యూఢిల్లీ : 'స్టింగ్ ఆపరేషన్‌పై పార్లమెంటు బుధవారం అట్టుడికిపోయింది. తృణమూల్ కాంగ్రెస్ సభ్యుని ముడుపుల వ్యవహారంపై ప్రతిపక్షాలు సృష్టించిన రభసతో ఉభయ సభలు దద్దరిల్లాయి. తృణమూల్ నేతలు ముడుపులు తీసుకున్న టేపులపై విచారణ చేపట్టాలని వామపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆ అంశాన్ని పార్లమెంటరీ ఎథిక్స్ కమిటీకి అప్పగించారు. ముడుపులు తీసుకున్న అంశంపై విచారణ అనంతరం ఈ కమిటీ నివేదికను ఇస్తుందని స్పీకర్ తెలిపారు. దీంతో తృణమూల్ కాంగ్రెస్ నిరసనకు దిగింది. కనీస తీర్మానం లేకుండా ఏక పక్షంగా నిర్ణయం తీసుకున్నారని ఇది అన్యాయమని సీనియర్ తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు సౌగత్ రాయ్ ఆరోపించారు. ఈ సందర్భంగా తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. అయితే గతంలో కూడా, ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని స్పీకర్ వివరణ ఇచ్చారు. ప్రశ్నోత్తరాల సమయం ముగిసిన వెంటనే స్పీకర్ కమిటీని సభలో ప్రకటించారు. బీజేపీ సీనియర్ నేత అద్వానీ అద్వానీ నేతృత్వంలో అర్జున్ మేఘ్వాల్, కరియా ముండా (బీజేపీ), బి మహతాబ్ (బిజూ జనతా దళ్), నినాంగ్ ఎరింగ్ (కాంగ్రెస్), అక్షయ్ యాదవ్ (సమాజ్‌వాదీ పార్టీ) తదితర 15 మంది సభ్యులతో ఎథిక్స్ కమిటీ కమిటీని ఏర్పాటు చేశారు. బీజేపీ సీనియర్ అద్వానీ నేతృత్వంలోని ఎథిక్స్ కమిటీపై నమ్మకముందని, తమకు న్యాయ జరుగుతుందన్న విశ్వాసాన్ని రాయ్ వ్యక్తం చేశారు. కాగా పశ్చిమబెంగాల్ కు చెందిన టీఎంసీ మంత్రులు, ఎంపీలు కొందరు ఓ ప్రైవేటు కంపెనీ దగ్గర పనుల కోసం ముడుపులు తీసుకుంటూ రహస్య కెమెరాకు చిక్కిన వ్యవహారం బెంగాల్లో, ఢిల్లీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. -
విపక్షాల నిరసనలతో దద్దరిల్లిన పార్లమెంట్
న్యూఢిల్లీ : విపక్షాల నిరసనల మధ్యే మూడోరోజు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. బుధశారం లోక్‌సభ సమావేశాలు ప్రారంభం కాగానే స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రశ్నోత్తరాలు ప్రవేశపెట్టారు. అయితే పోలవరం ఆర్డినెన్స్‌పై సభలో గందరగోళం నెలకొంది. టీఆర్ఎస్, బీజేడీ ఎంపీలు...స్పీకర్ పోడియం వద్ద ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలతో నిరసనకు దిగారు. దాంతో సభ్యుల నిరసనలతో లోక్ సభ మధ్యాహ్నం 12గంటల వరకూ వాయిదా పడింది. మరోవైపు రాజ్యసభ తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు నిరసనలతో హోరెత్తింది. దాంతో టీఎంసీ సభ్యుల ఆందోళనతో సభ ప్రారంభం అయిన కొద్ది నిమిషాలకే 15 నిమిషాల పాటు వాయిదా పడింది. అంతకు ముందు బీజేపీ ఎంపీల తీరుపై టీఎంసీ సభ్యులు ఆందోళనకు దిగారు. బీజేపీ ఎంపీలపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో సభా కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడటంతో సమావేశాలు పదిహేను నిమిషాలు వాయిదా పడ్డాయి. -
రెండు చోట్లా కాంగ్రెస్ గెలుపు
గంగావతి, న్యూస్‌లైన్ : జిల్లా పంచాయతీ, తాలూకా పంచాయతీలకు జరిగిన ఉప ఎన్నికల్లో రెండు స్థానాల్లోనూ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. జిల్లాలోని హిట్నాళ్ జిల్లా పంచాయతీ స్థానంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కే.రమేష్ హిట్నాళ్ గెలుపొందాడు. ఆయన సమీప ప్రత్యర్థి నింగనగౌడ బేవూరుపై 6,585 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కొప్పళ ఎమ్మెల్యే రాఘవేంద్ర హిట్నాళ్, తన సోదరుడు కే.రమేష్ హిట్నాళ్ గెలుపొందడంతో కౌంటింగ్ సెంటర్‌కు వచ్చి అతనితో కలిసి ప్రమాణ పత్రాన్ని స్వీక రించారు. కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు కౌంటింగ్ కేంద్రం వద్ద పెద్ద ఎత్తున బాణసంచా పేల్చి రంగులు జల్లుకుని ఆనందోత్సవాల్లో మునిగిపోయారు. అలాగే గంగావతి తాలూకాలోని చిక్కడంకనకల్లు తాలూకా పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శారదమ్మ తన సమీప బీజేపీ అభ్యర్థి యంకమ్మపై గెలుపొందారు. శారదమ్మకు 2,652 ఓట్లు లభించగా, యంకమ్మ 1656 ఓట్లు లభించాయి.