కోల్‌కత : పాలన గాలికొదిలేసి పర్యటనల పేరుతో కోట్లు ఖర్చు చేస్తున్నాడంటూ ప్రతిపక్షాలు చేసే విమర్శలకు ప్రధాని నరేంద్ర మోదీ కౌంటర్ ఇచ్చారు. విదేశాల్లో పర్యటించింది భారత్ పేరును మారుమోగించేందుకేనని అన్నారు. నేడు ప్రపంచ వేదికపై భారత్ సగర్వంగా తన వాదన వినిపింస్తోందని ఆనందం వ్యక్తం చేశారు. సమస్యలు, సవాళ్లపై మాట్లాడేందుకు అంతర్జాతీయంగా భారత్ ఐదేళ్ల క్రితం ఇబ్బందులు పడేదని, కానీ నేడు ఆ పరిస్థితి లేదన్నారు. ఎన్నికల ప్రచారం భాగంగా మోదీ బెంగాల్‌లోని బిర్భూమ్ జిల్లాలో జరిగిన ప్రచార సభలో ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు.
బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఉద్దేశిస్తూ.. ‘కొన్ని రోజుల క్రితం ఎక్కడో చదివా.. విదేశాల్లో విహరిస్తూ చాయ్‌వాలా బిజీ అయ్యాడని ఎవరో అన్నారు. కానీ, ఈ ఐదేళ్ల కాలంలో నా పర్యటనలు దేశ ప్రతిష్టను పెంచాయి. అంతర్జాతీయంగా గళం విప్పేందుకు భారత్‌కు ఇప్పుడు ఎలాంటి బెరుకు లేదు’ అని చెప్పుకొచ్చారు. ‘20 - 25 సీట్లలో పోటీ చేసే వారు కూడా హాట్ సీట్‌కోసం అర్రులు చాస్తారు. ప్రధాని పీఠం ఎక్కాలని ఉబలాటపడతారు’ అని వ్యాఖ్యానించారు. ఇక ఇప్పటికే మూడు దశల్లో పూర్తయిన పోలింగ్ సరళి చూస్తుంటే.. బెంగాల్‌లో దీదీ కథ ముగిసినట్టు వార్తలొస్తున్నాయని అన్నారు. ఫ్రీ అండ్ ఫేర్‌గా ఎన్నికలు నిర్వహిస్తున్న ఎన్నికల కమిషన్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment