మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి దీదీ | Mamata Banerjee On PM Modi Oath Taking Ceremony | Sakshi
Sakshi News home page

మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి దీదీ

Published Tue, May 28 2019 7:13 PM | Last Updated on Tue, May 28 2019 7:15 PM

Mamata Banerjee On PM Modi Oath Taking Ceremony - Sakshi

కోల్‌కతా : సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. ఈ నెల 30న నరేంద్ర మోదీ రెండో సారి ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా హాజరవుతున్నారు. ఈ విషయం గురించి మమతా మాట్లాడుతూ.. ‘ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లానే నాకు కూడా మోదీ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం అందింది. ఈ విషయం గురించి ఇతర సీఎంలతో  చర్చించాను. దేశ ప్రధాని ప్రమాణ స్వీకార కార్యక్రమం కాబట్టి హాజరవ్వాలని నిర్ణయించుకున్నాను’ అని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement