సాక్షి, న్యూఢిల్లీ : బెంగాలీ విద్యావేత్త ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రెండు రోజుల క్రితం కోల్‌కతాలో అమిత్ షా రోడ్డు షో సమయంలో జరిగిన అల్లర్లలలో ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ విగ్రహం ధ్వంసమైన విషయం తెలిసిందే. అయితే విగ్రహం ధ్వంసం అయిన చోటే మరో భారీ విగ్రహాన్ని ప్రతిష్టాపన చేస్తానని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు.
ఉత్తర ప్రదేశ్‌లోని మావు పట్టణంలో గురువారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోదీ మాట్లాడుతూ... ఈ వ్యాఖ్యలు చేశారు. ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.బెంగాల్‌లో హింస చెలరేగడానికి కారణం ముఖ్యమంత్రి మమతా బెనర్జీయే కారణమని ఆరోపించారు. ఈ రోజు సాయంత్రం బెంగాల్‌లో జరగబోయే తన సభను కూడా మమత అడ్డుకుంటుందన్నారు. విద్యాసారగ్ విగ్రహాన్ని కూల్చింది టీఎంసీ కార్యకర్తలేనని ఆరోపించారు. విద్యాసాగర్ విజన్‌కు తాము కట్టుబడి ఉన్నామని, పంచలోహాలతో తయారు చేసిన విద్యాసాగర్ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని మోదీ హామీ ఇచ్చారు.
అయితే మోదీఘీశ్వర్ చంద్ర విగ్రహం ప్రతిష్టిస్తామని ప్రకటన చేయగానే.. టీఎంసీ నేత డెరిక్ ఒబ్రెయిన్ స్పందించారు. తన ట్విటర్‌లో మోదీని తీవ్రంగా విమర్శించారు. మోదీ అబద్దాల కోరు అంటూ ఘాటుగా ట్విట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment