తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి ముకుల్ రాయ్‌కి అత్యంత విచిత్రమైన పరిణామం ఎదురైంది. ఒక పక్క కుటుంబ సభ్యులు ఆయన కనిపించటం లేదని హైరానా పడుతుంటే అకస్మాత్తుగా ప్రత్యక్షమై అందర్నీ షాక్‌కి గురి చేశారు. ఈ మేరకు ఆయన హఠాత్తుగా ఢిల్లీ విమానాశ్రయంలో ఎస్కార్ట్‌తో సహా కనిపించాడు. ఎయిర్‌పోర్టులో ఆయన చుట్టూ రక్షణగా కొందరు వ్యక్తులు ఉండి తరలించడం కనిపించింది. ఈ దృశ్యాలను బట్టి 69 ఏళ్ల ముకుల్ రాయ్ అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఆయన సోమవారం ఢిల్లీ బయలుదేరారు. ఆ తర్వాత నుంచి ఆయన కుటుంబంతో అందుబాటులో లేకుండా పోయారు. దీంతో ముకుల్ చుట్టూ చిత్రమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి.
ఈ మేరకు ఒక్కసారిగా ప్రత్యక్షమైన ఆయన్నుచూసిన మీడియా పలు ప్రశ్నలు సంధించగా..తాను ముఖ్యమైన పనిపై ఇక్కడకు వచ్చానని చెప్పారు. తాను ఎంపీనని తనకు ఢిల్లీలో పని ఉందని చెప్పారు. చికిత్స కోసం రాలేదని చెప్పారు. ఇదిలా ఉండగా, ఆయన కుటుంబ సభ్యులు ముకుల్ జాడ లేదంటూ మిస్సింగ్ కేసు పెట్టారు. ఈ మేరకు ఆయన కుమారుడు సుభ్రాగ్షు మాట్లాడుతూ..తన తండ్రి ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యిందని, కొందరూ వ్యక్తులు ఆయన్ను తీసుకువెళ్లినట్లు తెలిపారు.
అతని మానసిక స్థితి బాగోలేదని, కొన్ని పార్టీలు ముకుల్ రాయ్‌తో డర్టీ పాలిటిక్స్ ఆడుతున్నట్లు చెప్పుకొచ్చారు. కొంతమంది ఆయన్ను తీసుకువెళ్లిపోవడంతోనే తాను ఆయన్ని కనుగొనలేకపోయానని తెలిపారు. ముకుల్ బీజేపీలో చేరుతున్నారనే వార్తలను కొట్టిపారేశారు. ఆయన ఇప్పుడూ బీజేపీలో ఉన్నా ఆయన మానసిక స్థితిలో ఎలాంటి మార్పు లేదని, అందువల్ల ముందు ఆయనకి చికిత్స అందించడమే ముఖ్యం అని చెప్పారు.
కాగా, కేంద్ర మాజీ మంత్రి ముకుల్ రాయ్ 2017లో తృణమూల్ నాయకురాలు మమతా బెనర్జీతో విభేదాలు రావడంతో బీజేపీలో చేరారు. ఆయన్ను బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా నియమించిది. 2021లో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ టికెట్‌పై గెలిచి మళ్లీ కొద్ది రోజులకే సొంత గూటికే వెళ్లిపోయారు. ఆయన గతంలో యూపీఏ హయాంలలో రైల్వే శాఖ మంత్రిగా కూడా పనిచేశారు.
(చదవండి: ఆ విలువ లేని డిగ్రీలే భారత్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్నాయ్!)
Comments
Please login to add a commentAdd a comment