untraceable
-
మిస్ అయిన మాజీ రైల్వే మంత్రి.. హఠాత్తుగా ఢిల్లీలో ప్రత్యక్షమై..
తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి ముకుల్ రాయ్‌కి అత్యంత విచిత్రమైన పరిణామం ఎదురైంది. ఒక పక్క కుటుంబ సభ్యులు ఆయన కనిపించటం లేదని హైరానా పడుతుంటే అకస్మాత్తుగా ప్రత్యక్షమై అందర్నీ షాక్‌కి గురి చేశారు. ఈ మేరకు ఆయన హఠాత్తుగా ఢిల్లీ విమానాశ్రయంలో ఎస్కార్ట్‌తో సహా కనిపించాడు. ఎయిర్‌పోర్టులో ఆయన చుట్టూ రక్షణగా కొందరు వ్యక్తులు ఉండి తరలించడం కనిపించింది. ఈ దృశ్యాలను బట్టి 69 ఏళ్ల ముకుల్ రాయ్ అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఆయన సోమవారం ఢిల్లీ బయలుదేరారు. ఆ తర్వాత నుంచి ఆయన కుటుంబంతో అందుబాటులో లేకుండా పోయారు. దీంతో ముకుల్ చుట్టూ చిత్రమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ మేరకు ఒక్కసారిగా ప్రత్యక్షమైన ఆయన్నుచూసిన మీడియా పలు ప్రశ్నలు సంధించగా..తాను ముఖ్యమైన పనిపై ఇక్కడకు వచ్చానని చెప్పారు. తాను ఎంపీనని తనకు ఢిల్లీలో పని ఉందని చెప్పారు. చికిత్స కోసం రాలేదని చెప్పారు. ఇదిలా ఉండగా, ఆయన కుటుంబ సభ్యులు ముకుల్ జాడ లేదంటూ మిస్సింగ్ కేసు పెట్టారు. ఈ మేరకు ఆయన కుమారుడు సుభ్రాగ్షు మాట్లాడుతూ..తన తండ్రి ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యిందని, కొందరూ వ్యక్తులు ఆయన్ను తీసుకువెళ్లినట్లు తెలిపారు. అతని మానసిక స్థితి బాగోలేదని, కొన్ని పార్టీలు ముకుల్ రాయ్‌తో డర్టీ పాలిటిక్స్ ఆడుతున్నట్లు చెప్పుకొచ్చారు. కొంతమంది ఆయన్ను తీసుకువెళ్లిపోవడంతోనే తాను ఆయన్ని కనుగొనలేకపోయానని తెలిపారు. ముకుల్ బీజేపీలో చేరుతున్నారనే వార్తలను కొట్టిపారేశారు. ఆయన ఇప్పుడూ బీజేపీలో ఉన్నా ఆయన మానసిక స్థితిలో ఎలాంటి మార్పు లేదని, అందువల్ల ముందు ఆయనకి చికిత్స అందించడమే ముఖ్యం అని చెప్పారు. కాగా, కేంద్ర మాజీ మంత్రి ముకుల్ రాయ్ 2017లో తృణమూల్ నాయకురాలు మమతా బెనర్జీతో విభేదాలు రావడంతో బీజేపీలో చేరారు. ఆయన్ను బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా నియమించిది. 2021లో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ టికెట్‌పై గెలిచి మళ్లీ కొద్ది రోజులకే సొంత గూటికే వెళ్లిపోయారు. ఆయన గతంలో యూపీఏ హయాంలలో రైల్వే శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. (చదవండి: ఆ విలువ లేని డిగ్రీలే భారత్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్నాయ్!) -
Omicron కలకలం: దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన 10 మంది మిస్సింగ్
బెంగళూరు: ఒమిక్రాన్ వేరింయట్ ప్రపంచ దేశాలను ఒణికిస్తోంది. తాజాగా భారత్‌లో రెండు ఒమిక్రాన్ కేసులు వెలుగు చేసిన సంగతి తెలిసిందే. కర్ణాటకలో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో బృహన్ బెంగళూరు మహనగర పాలికే (బీబీఎంపీ) చేసిన ఓ ప్రకటన రాష్ట్రంలో కలకలం రేపుతోంది. దక్షిణాఫ్రికా నుంచి బెంగళూరు వచ్చిన 10 మంది విదేశీ ప్రయాణికులు పత్తా లేకుండా పోయినట్లు వెల్లడించింది. ఆరోగ్య శాఖ అధికారులు వీరి జాడ తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నట్లు బీబీఎంపీ వెల్లడించింది. ఈ సందర్భంగా బీబీఎంపీ కమిషనర్ గౌరవ్ గుప్తా మాట్లాడుతూ.. ‘‘విదేశీ ప్రయాణికులు ఆచూకీ కోసం తీవ్రంగా గాలిస్తున్నాం. ఇది నిరంతరం సాగే ప్రక్రియ. కొందరు ఫోన్ కాల్స్‌కు స్పందించడం లేదు. అలాంటి వారి కోసం కేంద్రం ఓ ప్రామాణిక ప్రోటోకాల్ జారీ చేసింది. దాన్ని అనుసరిస్తాం. ఈ సందర్భంగా ప్రజలకు నేను చేసే విజ్ఞప్తి ఒక్కటే.. జాగ్రత్తగా ఉండండి.. భద్రతా ప్రమాణాలు పాటించండి’’ అని కోరారు. (చదవండి: తరుముకొస్తున్న ఒమిక్రాన్.. టీకా రక్షిస్తుందా.. లేదా..?!) ఈ సందర్భంగా కర్ణాటక హెల్త్ మినిస్టర్ మాట్లాడుతూ.. ‘‘దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ వెలుగు చూసిన తర్వాత అక్కడ నుంచి 57 మంది బెంగళూరుకి వచ్చారు. వీరిలో 10 మంది ఆచూకీ లభించడం లేదు. బీబీఎంపీ వారిని వెతికే పనిలో ఉంది. సదరు ప్రయాణికులు ఫోన్ నంబర్లు స్విచ్ఛాఫ్ వస్తున్నాయి. వారు ఇచ్చిన అడ్రెస్‌కు వెళ్లి చూడగా.. అక్కడ ఎవరూ లేరు. వారిని వెతికి పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాం’’ అని తెలిపారు. (చదవండి: Omicron: భారత్‌లో ఒమిక్రాన్ బయటపడింది ఇలా..!) కర్ణాటకలో గురువారం రెండు ఒమిక్రాన్ కేసులు వెలుగు చూసినటుల కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీరిలో ఓ విదేశీ ప్రయాణికుడు ఇప్పటికే దేశం విడిచిపోయాడని.. మరోక వ్యక్తి కర్ణాటక స్థానికుడని.. అతడికి ఎలాంటి ప్రయాణ చరిత్రలేదని ఆరోగ్యశాఖ తెలపింది. చదవండి: దడ పుట్టిస్తున్న ఒమిక్రాన్.. 9 రోజుల్లోనే 30 దేశాలకు.. -
పరారీలో హీరోయిన్ దీపిక మేనేజర్
సాక్షి, ముంబై: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత బాలీవుడ్లో డ్రగ్స్ వినియోగంపై పెను దుమారం రేగిన సంగతి తెలిసిందే. రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీఖాన్, శ్రద్ధ కపూర్, దీపికా పదుకొనేలను నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) విచారించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దీపిక టాలెంట్ మేనేజర్ కరిష్మా ప్రకాష్‌కి ఎన్సీబీ అధికారులు మంగళవారం సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే నాటి నుంచి ఆమె పరారీలో ఉన్నారు. బాలీవుడ్ డ్రగ్స్ దర్యాప్తు కేసులో అరెస్టయిన డ్రగ్ పెడ్లర్‌ను విచారించినప్పుడు కరిష్మా ప్రకాష్ పేరు వెలుగులోకి వచ్చిందని ఎన్సీబీ అధికారులు తెలిపారు. వెర్సోవాలోని కరిష్మా నివాసంలో మంగళవారం ఎన్సీబీ అధికారుల దర్యాప్తులో 1.7 గ్రాముల హషీష్, సీబీడీ ఆయిల్ మూడు బాటిళ్లనిస్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆమెకు సమన్లు జారీ చేశారు. కానీ ఆమె నుంచి ఎలాంటి స్పందన రాలేదన్నారు. (చదవండి: ప్రతి ఒక్కర్నీ దోషులుగా చూడకండి) కరిష్మా ప్రకాష్‌కు డ్రగ్ పెడ్లర్‌తో సంబంధాలుండటం, ఆమె నివాసం నుంచి డ్రగ్స్ రికవరీ, ఎన్సీబీకి సహకరించకపోవడం, సమన్లు జారీ చేశాక విచారణకు హాజరుకాకపోవడం వంటి పనులు ఆమెను మరింత ఇబ్బందుల్లోకి నెట్టవచ్చని.. ఎన్సీబీ ఆమెపై కఠినమైన చర్యలు తీసుకోవచ్చని అధికారులు తెలిపారు. డ్రగ్స్ కేసు విచారణలో ఎన్సీబీ అధికారులు కరిష్మా ప్రకాష్, దీపికా పదుకొనే మధ్య జరిగిన అనుమానాస్పద మెసేజ్‌లను గుర్తించారు. దీని ఆధారంగా ఈ ఇద్దరినీ గత నెలలో ఎన్సీబీ అధికారులు ప్రశ్నించారు. కరిష్మా ప్రకాష్ మాత్రమే కాక, ఆమె సహోద్యోగి జయ సాహా, నటులు రకుల్ ప్రీత్, శ్రద్ధా కపూర్, సారా అలీ ఖాన్‌లను కూడా గత నెలలో ఎన్సీబీ అధికారులు ప్రశ్నించారు. కానీ ఎలాంటి ఫలితం లేదని సమాచారం. (చదవండి: నలుగురిదీ ఒక్కటే మాట..) సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణానికి సంబంధించిన డ్రగ్స్ కేసులో ఎన్సీబీ ఇప్పటివరకు 23 మందిని అరెస్టు చేసింది. అతని స్నేహితురాలు రియా చక్రవర్తిని అరెస్టు చేసింది. ఒక నెల జైలు శిక్ష తరువాత ఆమె బెయిల్ పొందిన సంగతి తెలిసిందే. -
సృతి, కపిల్ సిబల్ ల డాక్యుమెంట్లు లేవు
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి సృతి ఇరానీ, కాంగ్రెస్ పార్టీ నేత కపిల్ సిబల్ 2004 ఎన్నికల్లో దాఖలు చేసిన అఫిడవిట్ లు, డాక్యుమెంట్లు కనిపించడం లేదని ఢిల్లీ ఎలక్షన్ కమిషన్ కోర్టుకు తెలిపింది. వీరిరువురు 2004 సార్వత్రిక ఎన్నికల్లో ఛాందినీ చౌక్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేశారు. దీనికి సంబంధించిన డాక్యుమెంట్లను, సమాచారాన్ని తమవెబ్ సైట్లో అందుబాటులో ఉంచినట్టు ఎలక్షన్ కమిషన్ కోర్టుకు వెల్లడించింది. సృతి విద్యార్హతలు అసలైనవి కావని వాటిని పరిశీలించాలని కోర్టులో అహ్మర్ ఖాన్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. వాదనలు విన్న కోర్టు కేసును అగస్టు 27 కు కేసును వాయిదా వేసింది. -
ఇరాక్‌లో జాడలేని 40 మంది భారతీయులు
న్యూఢిల్లీ: ఇరాక్‌లో తీవ్రవాదులు ఆక్రమించిన మొసుల్ పట్టణంలో ఉన్న 40 మంది భారతీయుల ఆచూకీ ఇంకా తెలియడం లేదు. భారతీయుల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. మాజీ దూత సురేష్ రెడ్డిని బాగ్దాద్‌కు పంపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. మొసుల్‌లో ఉన్న 40 మంది భారతీయులతో సంప్రదించేందుకు సాధ్యంకావడం లేదని విదేశాంగ శాఖ ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ చెప్పారు. తీవ్రవాదులు వీరిని బంధీలుగా ఉంచారా అన్న ప్రశ్నకు.. ఈ విషయాన్ని తాము నిర్ధారించలేమని సమాధానమిచ్చారు. ఇరాక్‌లో ఘర్షణలు జరుగుతున్న ప్రాంతాల్లో ఉన్న భారతీయులకు సాయం చేసేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నామని, సయ్యద్ తెలిపారు. తీవ్రవాదుల లక్ష్యం భారతీయులు కాదని, దాడుల్లో ఇప్పటి వరకూ ఒక్కరూ గాయపడినట్టుగా వార్తలు రాలేదని చెప్పారు.