విపక్షాల నిరసనలతో దద్దరిల్లిన పార్లమెంట్
న్యూఢిల్లీ : విపక్షాల నిరసనల మధ్యే మూడోరోజు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. బుధశారం లోక్సభ సమావేశాలు ప్రారంభం కాగానే స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రశ్నోత్తరాలు ప్రవేశపెట్టారు. అయితే పోలవరం ఆర్డినెన్స్పై సభలో గందరగోళం నెలకొంది. టీఆర్ఎస్, బీజేడీ ఎంపీలు...స్పీకర్ పోడియం వద్ద ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలతో నిరసనకు దిగారు. దాంతో సభ్యుల నిరసనలతో లోక్ సభ మధ్యాహ్నం 12గంటల వరకూ వాయిదా పడింది.
మరోవైపు రాజ్యసభ తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు నిరసనలతో హోరెత్తింది. దాంతో టీఎంసీ సభ్యుల ఆందోళనతో సభ ప్రారంభం అయిన కొద్ది నిమిషాలకే 15 నిమిషాల పాటు వాయిదా పడింది. అంతకు ముందు బీజేపీ ఎంపీల తీరుపై టీఎంసీ సభ్యులు ఆందోళనకు దిగారు. బీజేపీ ఎంపీలపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో సభా కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడటంతో సమావేశాలు పదిహేను నిమిషాలు వాయిదా పడ్డాయి.