Abhishek Banerjee
-
‘ఓపిక ఉన్నంత వరకు కాదు ఊపిరి ఉన్నంత వరకు’.. దీదీతోనే నా ప్రయాణం
కోల్‌కతా: ఓపిక ఉన్నంత వరకు కాదు ఊపిరి ఉన్నంత వరకు తన ప్రయాణం తన మేనత్త, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీతోనేనని ఆమె మేనల్లుడు టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ స్పష్టం చేశారు. సీఎం మమతతో విభేదాలున్నాయన్న ప్రచారాన్ని ఖండించారు. గొంతు కోసినా బీజేపీలో చేరని పునరుద్ఘాటించారు. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ అధికార తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో తాను బీజేపీలో చేరనున్నారనే ప్రచారం జరుగుతోంది. నా మెడలు విరిచినా సరే ఆ పని చేయను’ అని స్పష్టం చేశారు.కోల్‌కతాలోని నేతాజీ ఇండోర్ స్టేడియంలో గురువారం టీఎంసీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ అభిషేక్ బెనర్జీ తన రాజకీయ భవిష్యత్తు గురించి జరుగుతున్న ప్రచారంపై మాట్లాడారు.VIDEO | TMC MP Abhishek Banerjee (@abhishekaitc) addresses party workers at Netaji Indoor Stadium, Kolkata. He says, "Till the time all of you are with us, we will continue to demolish BJP's 'chakravyuh'... Those who spoke ill about the party have been identified. I was the one… pic.twitter.com/4HeVzVAZVY— Press Trust of India (@PTI_News) February 27, 2025 కొంతమంది నా గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వాళ్లెవరో నాకు తెలుసంటూ.. టీఎంసీ మాజీ నేతలు ముకుల్ రాయ్,సువేందు అధికారి పేర్లను ప్రస్తావించారు. నేను మోసగాణ్ని కాదు. నా మెడలు విరిచినా, నా నాలుక చీల్చినా బీజేపీలో చేరను. మమతా బెనర్జీ జిందాబాద్ అంటూ.. తనకు తన మేనత్త సీఎం మమతా బెనర్జీకి మధ్య విబేధాలున్నాయన్న ప్రచారాన్ని కొట్టి పారేశారు. ఓపిక ఉన్నంత వరకు కాదు ఊపిరి ఉన్నంత వరకు నేను టీఎంసీలోనే కొనసాగుతా. వచ్చే ఏడాది ఎన్నికలకు ముందు స్వార్థ ప్రయోజనాల కోసం స్వార్థరాజకీయాలు చేస్తున్న ముకుల్ రాయ్, సువేందు అధికారి ద్రోహులుగా అభివర్ణించారు. అనంతరం,టీచర్ రిక్రూట్మెంట్ స్కాంలో తనని విచారణ చేపట్టేందుకు సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్ గురించి ప్రస్తావించారు. ప్రతిపక్ష నేతలతో సీబీఐ ఎలా వ్యవహరించిందో నాతో అలాగే వ్యవహరిస్తోంది. పాపం సీబీఐ ఏం చేస్తోంది? చెప్పండి. దాని రాజకీయ గురువుల ఆదేశానుసారం వ్యవహరిస్తోంది.టీచర్ స్కాంలో తన గురించి ఒక్క ఆధారం బయటపెట్టలేదు. ఇదే విషయం గురించి సీబీఐని అడుగుతుంటే ఒక్క సమాధానం చెప్పడం లేదు. చెప్పడానికి సంకోచిస్తోంది. ఒక్కోసారి సీబీఐ తీరు చూస్తుంటే నాకు ఆశ్చర్యం వేస్తోంది. ఐదేళ్ల క్రితం ఇదే విషయం చెప్పా. ఇప్పుడు కూడా అదే చెబుతున్నాను. టీచర్ స్కాంలో నేను నేరస్తుడిని అని నిరూపిస్తూ సీబీఐ కోర్టుకు ఆధారాల్ని అందిస్తే నాకు నేనుగా ఉరివేసుకుంటాను’ అని వ్యాఖ్యానించారు. -
సీఎం మమతా బెనర్జీ మేనల్లుడికి ఎదురు దెబ్బ
న్యూఢిల్లీ : ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసులో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. అభిషేక్ బెనర్జీ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. టీచర్ రిక్రూట్మెంట్ కేసులో ఈడీ జారీ చేసిన సమన్లను సవాల్ చేస్తూ అభిషేక్ బెనర్జీ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై సోమవారం (సెప్టెంబర్9)న సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ఈడీ తీరును సమర్థించింది. అభిషేక్ బెనర్జీ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసిందిఅభిషేక్ బెనర్జీ దంపతులపై ఈడీ కేసు ఎంపీ అభిషేక్ బెనర్జీ, ఆయన సతీమణి రుజీరా బెనర్జీ టీచర్ రిక్రూట్మెంట్ కుంభకోణంలో మనీ లాండరింగ్‌కు పాల్పడినట్లు ఈడీ ఆరోపిస్తుంది. టీచర్ కుంభణంలో ఎంపీ అభిషేక్ బెనర్జీ దంపతులకు పెద్దమొత్తంలో ముడుపులు అందాయని, కేసు విచారణ చేపట్టేందుకు ఢిల్లీకి రావాలని సమన్లు జారీ చేసింది. ఢిల్లీకి రాలేను.. మీరే కోల్‌కతాకు రండిఇదే అంశంపై ఈడీ జారీ చేసిన సమన్లపై అభిషేక్ బెనర్జీ స్పందించలేదు. కేసు దర్యాప్తు చేసేందుకు ఢిల్లీకి రావాలంటూ సమన్లు ఇవ్వడాన్ని అభ్యంతరం వ్యక్తం చేశారు. కేసు విచారణను కోల్‌కతాలోని తన నివాసంలోనే విచారించాలని, ఢిల్లీకి రావాల్సిన అవసరం లేదని..ఈడీని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తాజాగా, విచారణ చేపట్టిన కోర్టు అభిషేక్ బెనర్జీ పిటిషన్‌ను కొట్టి వేసింది. దీంతో ఆయన ఢిల్లీలోనే ఈడీ విచారణను ఎదుర్కోనున్నారు.నిధులు మళ్లించే.. పశ్చిమ బెంగాల్ ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసులో గతేడాది ఈడీ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో అభిషేక్ బెనర్జీ పేరును ప్రస్తావించింది. ఈడీ సమాచారం మేరకు.. ప్రభుత్వ పాఠశాలలో అక్రమ మార్గంలో ఉద్యోగం పొందేలా పలువురు అప్పటి అధికార టీఎంసీ నేతలకు డబ్బులు చెల్లించారు. ఆ నేతల్లో కుంతల్ ఘోష్ ఒకరు. కుంతల్ ఘోష్ తనకు అందిన ముడుపుల్ని అభిషేక్ బెనర్జీకి ఆర్థిక సంబంధిత వ్యవహారాలను నిర్వహించే సుజయ్ కృష్ణ భద్రకు అందించారు. ఆ డబ్బును ప్రైవేట్ కంపెనీలకు మళ్లించగా.. ఆ ప్రైవేట్ కంపెనీ డైరెక్టర్లలో ఎంపీ అభిషేక్ బెనర్జీ భార్య రుజీరా ఒకరని ఈడీ వెల్లడించింది. -
ఎంపీ అభిషేక్ బెనర్జీ కుమార్తెకు అత్యాచార బెదిరింపులు
కోల్‌కతా : పశ్చిమ బెంగాల్లో జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటన దేశాన్ని కుదిపేస్తోంది. ఈనేపథ్యంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడైన ఎంపీ అభిషేక్ బెనర్జీ 11ఏళ్ల కుమార్తెపై అత్యాచారం చేస్తామని పలువురు బెదిరించిన వీడియోలు పశ్చిమ బెంగాల్ బాలల హక్కుల సంఘం దృష్టికి వచ్చాయి. ఆర్జీకార్ ఆస్పత్రిలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటనపై నిరసనర్యాలీ జరిగింది. ఆ ర్యాలీలో ఓ వ్యక్తి అభిషేక్ బెనర్జీ కుమార్తెపై దారుణానికి ఒడిగడతామని బెదిరించగా.. మరో వ్యక్తి దారుణానికి ఒడిగట్టిన వారికి రూ.10కోట్లు బహుమతి ఇస్తామని చెప్పిన వీడియో వైరల్‌గా మారింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియోపై పిల్లల హక్కుల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బహిరంగంగా ఇలాంటి అసభ్యకర వ్యాఖ్యలు చేయడం పిల్లల భద్రతకు హాని కలిగించేలా ఉంది’అని కమిషన్ ఓ ప్రకటనలో పేర్కొంది.అంతేకాదు ఈ రకమైన వ్యాఖ్యలు చేసిన నిందితులపై పోక్సో, జువెనైల్ జస్టిస్ యాక్, బాలల హక్కులపై ఐక్యరాజ్యసమితి కన్వెన్షన్ కింద చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరింది.ఈ ఘటనపై రెండు రోజుల్లో చర్యలు తీసుకుని నివేదిక ఇవ్వాలని బాలల హక్కుల సంఘం పోలీసులను కోరింది.జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటన నేపథ్యంలో మమతా బెనర్జీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. దీదీ రాజీనామా చేయాలని రాజకీయ ప్రత్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ఇన్ని పరిణామాలు జరుగుతున్నప్పటికీ.. ఇంతటి క్లిష్ట సమయంలో మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీ మాత్రం చురుగ్గా కనిపించడం లేదు. దాంతో పార్టీలో అంతర్గతంగా లుకలుకలున్నాయని వార్తలు వస్తున్నాయి. అభిషేక్ ఎక్కడ..? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. -
Kolkata Doctor Case: 50 రోజుల్లో శిక్ష పడేలా చట్టాలు రావాలి: అభిషేక్ బెనర్జీ
కోల్‌కతా: కోల్‌కతాలో ఆర్జీకార్ వైద్య కళాశాలలో వైద్య విద్యార్ధిని హత్యాచారం ఘటనలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో, ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ విభేదిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. సీబీఐ వెంటనే దర్యాప్తు చేసి బాధితురాలికి న్యాయం చేయాలంటూ సీఎం మమతా చేస్తున్న ర్యాలీలకు అతడు దూరంగా ఉండటం ఈ వాదనలకు మరింత బలం చేకూరుస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఆయన స్పందించారు.ఆర్జీ కర్ ఆసుపత్రిలో జరిగిన హత్యాచార ఘటనపై నిరసనలు వ్యక్తమవుతోన్న తరుణంలో.. దేశంలో ఆ తరహాలో ఎన్నో కేసులు వెలుగు చూశాయని టీఎంసీ అగ్రనేత అభిషేక్ బెనర్జీ ఆందోళన వ్యక్తం చేశారు. అత్యాచార కేసుల్లో 50 రోజుల్లోగా విచారణ పూర్తి చేసి, దోషులకు శిక్షపడేలా చట్టాలు రావాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ‘పది రోజులుగా ఆర్జీ కర్ ఆసుపత్రిలో జరిగిన ఘటనపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. న్యాయం కావాలంటూ వైద్యులు, ఇతరులు రోడ్లపై నినదిస్తున్నారు. ఈ దిగ్భ్రాంతికర నేరానికి వ్యతిరేకంగా ప్రజలు రోడ్లపై ఉన్న సమయంలోనే దేశంలో అలాంటివి మరో 900 కేసులు వెలుగులోకి వచ్చాయి. రోజూ 90 అత్యాచార కేసులు నమోదవుతున్నాయి. వీటిని నిరోధించడానికి నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. కేవలం వాగ్దానాలకే పరిమితం కాకుండా 50 రోజుల్లోగా విచారణలు పూర్తయి శిక్షలు ఖరారయ్యేలా కఠిన చట్టాలు రావాలి. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి’’ అని పోస్టు పెట్టారు.Over the past 10 days, while the nation has been protesting against the #RGKarMedicalcollege incident and demanding justice, 900 RAPES have occurred across different parts of India - DURING THE VERY TIME WHEN PEOPLE WERE ON THE STREETS PROTESTING AGAINST THIS HORRIBLE CRIME.…— Abhishek Banerjee (@abhishekaitc) August 22, 2024 -
ఉన్నదంతా స్టార్ హీరోలకే.. మిగతా యాక్టర్స్‌కు ఏం మిగలట్లేదు!
బాలీవుడ్ నటుడు అభిషేక్ బెనర్జీ ప్రస్తుతం రెండు క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తున్నాడు. స్త్రీ 2 అనే కామెడీ హారర్ మూవీలో, రానా నాయుడు 2 అనే వెబ్‌సిరీస్‌లో ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. యాక్టర్‌గా ఫుల్ బిజీగా ఉన్న ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో అనేక విషయాలను పంచుకున్నాడు. 'యాక్టింగ్ ఇండస్ట్రీ అనేది ఎప్పుడూ కలర్ఫుల్గా ఉండదు. కొన్నిసార్లు ఒంటరిగా నడవాల్సి వస్తుంది. ఎన్నో విషయాలను ఒంటరిగానే నేర్చుకోవాల్సి వస్తుంది. నిరంతరం ప్రయత్నాలు చేస్తూనే ఉండాలి. అందరూ అతిగా ఆశించరుఅలాగే ఇక్కడ ప్రతి ఒక్కరూ భారీ పారితోషికాలు ఆషించరు. కొందరు ఉన్నదాంతోనే సంతృప్తి పడతారు. నేను కొన్ని సినిమాలు, షోలకు కాస్టింగ్ డైరెక్టర్‌గానూ పని చేశాను. ఆ సమయంలో కొందరు స్టార్స్ చాలా భారీగా డిమాండ్ చేసేవారు. దీనివల్ల మిగతా నటులకు ఇవ్వడానికి డబ్బు మిగిలేది కాదు. అందుకే మన దగ్గరున్న బడ్జెట్‌ను దృష్టిలో పెట్టుకుని యాక్టర్స్‌ను పిలుద్దాం అని చిత్రయూనిట్‌కు చెప్పేవాడిని. మంచి నటుల వల్ల విలువ..ఆయా పెద్ద హీరోలకే ఎక్కువ డబ్బు ముట్టజెప్పడం వల్ల మంచి నటీనటులకు కూడా తగినంత డబ్బు అందేది కాదు. ఈ విషయం వారికి తెలుసో, లేదో నాకు తెలియదు. వాళ్ల వల్ల జనాలు టికెట్లు కొని థియేటర్‌కు వస్తారు. అదే సమయంలో మంచి యాక్టర్ వల్ల సినిమా విలువ పెరుగుతుంది. అలాంటివారికి తక్కువ డబ్బు ఇచ్చి పని చేయించుకోవడం కరెక్ట్ కాదు కదా! హీరో బాడీగార్డ్ కంటే నటుడికి తక్కువ జీతం ఇవ్వాల్సిన దుస్థితి రాకూడదు' అని అభిషేక్ చెప్పుకొచ్చాడు.చదవండి: 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' గ్రాండ్ ఓపెనింగ్.. తొలిరోజు కలెక్షన్స్ ఎంతంటే? -
హ్యాట్రిక్ కోసం అభిషేక్ బెనర్జీ.. మళ్ళీ అక్కడ నుంచే పోటీ
కోల్‌కతా: దేశంలో ఇప్పటికే మూడు దశల్లో లోక్‌సభ ఎన్నికలు పూర్తయ్యాయి. ఇంకా నాలుగు దశల్లో వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ తరుణంలో తృణమూల్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి, 'అభిషేక్ బెనర్జీ' పశ్చిమ బెంగాల్‌లోని సౌత్ 24 పరగణాస్ జిల్లాలోని డైమండ్ హార్బర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.అభిషేక్ బెనర్జీ డైమండ్ హార్బర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయడం ఇది వరుసగా మూడోసారి. నామినేషన్ దాఖలు చేయడానికి ఈయన కాళీఘాట్ నుంచి నడిచి.. అలీపూర్‌లోని జిల్లా కలెక్టర్ ఆఫీసులో తన నామినేషన్ పత్రాలను సమర్పించారు.నామినేషన్ దాఖలు చేసిన తరువాత తృణమూల్ కాంగ్రెస్ అఖిల భారత ప్రధాన కార్యదర్శి 'అభిషేక్ బెనర్జీ' మాట్లాడుతూ.. డైమండ్ హార్బర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి హ్యాట్రిక్ సాధించడంపై దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఈ నియోజకవర్గాన్ని నెంబర్ స్థానానికి తీసుకురావడమే లక్ష్యమని అన్నారు.#WATCH | TMC candidate from Diamond Harbour seat, Abhishek Banerjee files nomination for Lok Sabha elections#LokSabhaElections2024 pic.twitter.com/SLymSD1IHq— ANI (@ANI) May 10, 2024 -
తృణమూల్‌లో మమతా vs అభిషేక్ బెనర్జీ?
దేశంలో ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికలు జరుగుతుండగా, అదేసమయంలో తృణమూల్ కాంగ్రెస్‌లో వివాదాలు బహిర్గతమవుతున్నాయి. తాజాగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవి నుంచి కునాల్ ఘోష్‌ను తొలగించారు. పార్టీ అభిప్రాయాలను వ్యతిరేకించినందుకు కునాల్ ఘోష్‌ను ఆ పదవి నుంచి తొలగించినట్లు ప్రభుత్వం ఒక లేఖలో పేర్కొంది. ఈ నేపధ్యంలో తృణమూల్ కాంగ్రెస్‌లో మమత వర్సెస్ అభిషేక్ వివాదం నడుస్తోందని విపక్ష పార్టీ నేతలు పేర్కొంటున్నారు. కునాల్ ఘోష్‌ను ఆ పదవి నుంచి తొలగించిన తర్వాత ఈ అంశం మరింత చర్చనీయాంశంగా మారింది. కునాల్ ఘోష్ తొలగింపు వెనుక తృణమూల్ కాంగ్రెస్ లాబీ పనిచేస్తోందని ప్రతిపక్ష పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం తృణమూల్ కాంగ్రెస్‌లో రెండు లాబీలు ఉన్నాయని ఒకటి మమతా బెనర్జీ, మరొకటి అభిషేక్ బెనర్జీ అని వారంటున్నారు. కునాల్ ఘోష్ గతంలో మమతా బెనర్జీ లాబీ వర్గంలో ఉండేవాడని, ప్రస్తుతం అభిషేక్ బెనర్జీకి మద్దతుదారుగా మారారని ప్రతిపక్షాలు పేర్కొంటున్నాయి.ఇది అసలే అత్త, మేనల్లుడి మధ్య పోరు అని బీజేపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. అత్త, మేనల్లుడి మధ్య జరిగిన పోరులో కునాల్ ఘోష్‌ను తొలగింపునకు గురయ్యారని వారు అంటున్నారు. ఉత్తర కోల్‌కతా నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి సుదీప్ బందోపాధ్యాయ మమత వర్గానికి చెందినవాడని, అయితే సుదీప్ బెనర్జీ గెలవడం అభిషేక్ బెనర్జీకి ఇష్టం లేదని వారు ఆరోపిస్తున్నారు.ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల సమయంలో ఓ అరుదైన ఘట్టం కనిపించింది. ఇటీవల తపస్ రాయ్ తృణమూల్‌ను వీడి బీజేపీలో చేరి, కోల్‌కతా నార్త్ అభ్యర్థిగా మారారు. ఈ నేపధ్యంలో తృణమూల్ రాజ్యసభ మాజీ ఎంపీ, తృణమూల్ అధికార ప్రతినిధి కునాల్ ఘోష్.. తపస్ రాయ్‌పై ప్రశంసలు కురిపించారు. తపస్ రాయ్ టీఎంసీలోనే ఉండాలనుకున్నమని, అయితే అది కుదరలేదని కునాల్ పేర్కొన్నారు. ఆయన చాలా మంచి అభ్యర్థి అని, ప్రజలు కూడా అతనిని అర్థం చేసుకుని ఓటు వేస్తారని కూడా అన్నారు. ఈ వ్యాఖ్యల నేపధ్యంలోనే కునాల్‌పై పార్టీలో వేటు పడిందని, స్థానిక బీజేపీ నేతలు అంటున్నారు. -
అభిషేక్ బెనర్జీ హెలికాప్టర్లో ఐటీ సోదాలు
కలకత్తా: తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ప్రధాన కార్యదర్శి, సీఎం మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీ హెలికాప్టర్‌ను ఆదివారం(ఏప్రిల్14) ఇన్కమ్ ట్యాక్స్(ఐటీ) అధికారులు తనిఖీ చేశారు. కలకత్తాలోని బెహలా ఫ్లైయింగ్ క్లబ్లో ఈ తనిఖీలు జరిగాయి. హెలికాప్టర్ వెళ్లకుండా ఐటీ అధికారులు చాలా సేపు అడ్డుకున్నారని టీఎంసీ వర్గాలు తెలిపాయి. తనిఖీల సందర్భంగా అభిషేక్ బెనర్జీ సెక్యూరిటీ సిబ్బందికి ఐటీ అధికారులకు మధ్య వాగ్వాదం జరిగింది. తనిఖీలపై అభిషేక్‌బెనర్జీ ట్విటర్(ఎక్స్)లో స్పందించారు.‘ఇటీవల ప్రజల ఆగ్రహానికి గురైన ఎన్ఐఏ స్థానిక డీజీ, ఎస్పీలను తొలగించకుండా నా హెలికాప్టర్లో తనిఖీలకు ఐటీ అధికారులను పంపించారు. వారికి తనిఖీల్లో ఏం దొరకలేదు. జమీందార్లు ఎన్నిరకాల ఒత్తిళ్లు పెట్టినా బెంగాల్ తలవంచదు’ అని పోస్టులో బెనర్జీ పేర్కొన్నారు. అభిషేక్ బెనర్జీ ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో డైమండ్ హార్బర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో తొలి దశ పోలింగ్ ఏప్రిల్ 19న జరగనుంది. ఇదీ చదవండి.. బీజేపీ మేనిఫెస్టోపై మల్లిఖార్జున ఖర్గే విమర్శలు -
‘ఎన్ఐఏ’పై దాడి.. అభిషేక్ బెనర్జీ సంచలన ఆరోపణలు
కలకత్తా: పశ్చిమబెంగాల్లో వేసవితో పాటు పార్లమెంట్ ఎన్నికల ప్రచార వేడి అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) బృందంపై తూర్పు మిడ్నపూర్‌లో స్థానికులు దాడి చేయడంపై రాజకీయ దుమారం రేగుతోంది. ఆదివారం(ఏప్రిల్ 7)న జల్పాయ్గురిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించిన ప్రధాని మోదీ ఎన్ఏఐ బృందంపై దాడి తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) పనేనని ఆరోపించారు. తృణమూల్ నేతలకు రాజ్యాంగం, శాంతిభద్రతలు ఏవీ పట్టవని ఆరోపించారు. ప్రధాని చేసిన ఈ వ్యాఖ్యలకు తృణమూల్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ, స్వయానా సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ కౌంటర్ ఇచ్చారు. ఎన్ఐఏ ఉన్నతాధికారులను బీజేపీ నేతలు వెళ్లి కలిసిన తర్వాతే తమ పార్టీ నేతలకు బాంబు పేలుడు కేసులో నోటీసులు వచ్చాయని అభిషేక్ బెనర్జీ ఆరోపించారు. అవసరమైతే బీజేపీ నేతలు ఎన్ఐఏ పోలీసు అధికారులను కలిసిన వీడియో కూడా విడుదల చేస్తామని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల ముందు టీఎంసీ నేతలను అరెస్టు చేసేందుకు ఎన్ఐతో కలిసి బీజేపీ కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. అభిషేక్ బెనర్జీ ఈ వ్యాఖ్యలు చేసిన వెంటనే ఎన్ఐఏ స్పందించింది. అభిషేక్ వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారమైనవని కొట్టిపారేసింది. ఇదీ చదవండి.. తిరువనంతపురం ఫైట్.. కేంద్రమంత్రిపై ఈసీకి ఫిర్యాదు -
మోదీ గ్యారెంటీలకు 'జీరో వారంటీ'.. టీఎంసీ నేత కీలక వ్యాఖ్యలు
మోదీ గ్యారెంటీలకు జీరో వారంటీ ఉందని 'జన గర్జన్ సభ' ర్యాలీ సందర్భంగా టీఎంసీ నాయకుడు 'అభిషేక్ బెనర్జీ' అన్నారు. బీజేపీ నాయకులు బయటి వ్యక్తులని, బెంగాల్ వ్యతిరేకులని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో మాత్రమే రాష్ట్రాన్ని సందర్శిస్తారని అభిషేక్ వ్యాఖ్యానించారు. ఎన్నికల సమయంలో మాత్రమే వారికి రాష్ట్రం గుర్తొస్తుంది, వారందరికీ రాష్ట్ర ప్రజలు తగిన సమాధానం చెబుతారని అభిషేక్ బెనర్జీ వెల్లడించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న టీఎంసీ మాత్రమే.. హామీలను నిలబెట్టుకుంటుందని పేర్కొన్నారు. బీజేపీ ఇప్పటికే రాష్ట్రానికి రావాల్సిన నిధులను నిలిపేశారని అన్నారు. తృణమూల్ కాంగ్రెస్ తన లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని ఈ రోజు (ఆదివారం) గ్రాండ్ ర్యాలీ నుంచి ప్రారంభించింది. తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధినేత్రి 'మమతా బెనర్జీ' పశ్చిమ బెంగాల్లో రాబోయే లోక్‌సభ ఎన్నికలకు మొత్తం 42 మంది అభ్యర్థుల పేర్లను నేడు ప్రకటించనుంది. -
TMC: నేతల్లో అంతరాలు లేవు.. మమతా నాయకత్వంలోనే..
కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(TMC) అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ నాయకత్వంలో తమ పార్టీ నేతలందరూ ఐకమత్యంతో ఉన్నారని ఎంపీ అభిషేక్ బెనర్జీ తెలిపారు. ఇటీవల టీఎంసీలో సీనియర్ నాయకులు, జూనియర్ నాయకులు మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే అటువంటి అంతరాలు తమ పార్టీ నేతల్లో లేవని సీఎం మమతా బెనర్జీ నాయకత్వంలో తామంతా పనిచేస్తున్నామని అభిషేక్ స్పష్టం చేశారు. ఆయన 24 పరగణాల నియోజవర్గంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తాను పార్టీలో క్రియాశీలకంగా ఉండటం లేదని వస్తున్న వార్తలు కూడా అసత్యమని, పూర్తిగా ఆధారాలు లేనివని అన్నారు. తమ పార్టీలో సీనియర్, జూనియర్ నాయకులు అనే అంతరాలు ఎక్కడా లేవని తెలిపారు. తాము అంతా కలిసికట్టుగా సీఎం మమతా నాయకత్వంలోనే పని చేస్తున్నామని అభిషేక్ పేర్కొన్నాము. ఇక.. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో టీఎంసీ గెలుపే లక్ష్యంగా కృషి చేస్తున్నామని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికలు వస్తున్న సమయంలో తన నియోజకవర్గంలో ప్రచారంపై దృష్టి పెట్టానని తెలిపారు. అంతే కానీ, తాను పార్టీ కార్యకలాపాలకు ఎప్పుడూ దూరంగా లేనని వెల్లడించారు. పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ.. తనకు అప్పగించే ఏ బాధత్యనైనా పార్టీ కోసం తప్పకుండా పాటిస్తానని అన్నారు. చదవండి: దుండగుల కాల్పుల్లో టీఎంసీ నేత దారుణ హత్య -
అభిషెక్ బెనర్జీకి ఈడీ సమన్లు
కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషెక్ బెనర్జీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మరోసారి సమన్లు జారీ చేసింది. పాఠశాల ఉద్యోగాల కుంభకోణం దర్యాప్తులో భాగంగా నవంబర్ తొమ్మిదో తేదీన(నేడు) కోల్‌కతాలో తమ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఈ విషయాన్ని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమశాఖ మహిళా మంత్రి, పార్టీ అధికార ప్రతినిధి అయిన శశి పంజా చెప్పారు. ‘ మా పార్టీ జాతీయ స్థాయి ప్రధాన కార్యదర్శి అభిషెక్‌ను ఈడీ కక్షపూరిత రాజకీయాలకు బాధితుడిగా మార్చేసింది’ అని ఆమె ఆరోపించారు. సమన్లలో పేర్కొన్న మేరకు అభిషెక్ బెనర్జీ గురువారం ఈడీ ఎదుట హాజరుకానున్నారు. ‘‘వచ్చే సంవత్సరం కీలకమైన ఎన్నికలు సమీపిస్తున్న వేళ తమ నేతలను బెదిరించడానికి బీజేపీ ఇటువంటి రాజకీయాలకు పాల్పడుతోంది’’ అని శశి అన్నారు. దీనిపై పశి్చమబెంగాల్ బీజేపీ రాష్ట్ర విభాగం స్పందించింది. ‘ కక్షసాధింపు రాజకీయాలపై మాకు నమ్మకం లేదు. జాతీయ దర్యాప్తు సంస్థలు కోర్టు ఆదేశాల మేరకే ఇలా సమన్లు జారీ చేస్తాయి. మీకేమైనా అభ్యంతరాలుంటే కోర్టును ఆశ్రయించండి’ అని బీజేపీ అధికార ప్రతినిది సంబిత్ పాత్రా అన్నారు. ఇప్పటికే అక్టోబర్‌లో బెనర్జీ ఈడీ ఎదుట హాజరైన విషయం విదితమే. సెపె్టంబర్ 13వ తేదీన ఆయనను ఈడీ అధికారులు ఏకంగా తొమ్మిది గంటలపాటు సుదీర్ఘంగా విచారించారు. కీలక ‘ఇండియా’ కూటమి సమావేశంలో పాల్గొనకుండా టీఎంసీ నేతలను అడ్డుకునేందుకే ఈడీ ఆనాడు అలా చేసిందని అప్పుడే అభిషెక్ ఆరోపించారు. గతంలో బొగ్గు కుంభకోణం కేసులో 2021, 2022 సంవత్సరాల్లో అభిషేక్‌ను ఈడీ అధికారులు రెండు పర్యాయాలు ప్రశ్నించారు. -
సీఎం మమతా బెనర్జీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ..
ఢిల్లీ: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. టీచర్ రిక్రూట్మెంట్ కుంభకోణంలో సీబీఐ, ఈడీ విచారణలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీకి మధ్యంతర ఉపశమనం కల్పించకూడదన్న కలకత్తా హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. ఈ మేరకు టీఎంసీ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. టీఎంసీ దాఖలు చేసిన పిటీషన్‌పై విచారణ చేపట్టిన సీజేఐ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మానసం.. టీచర్ రిక్రూట్మెంట్, మున్సిపల్ రిక్రూట్మెంట్ స్కాంలు లింక్ అయి ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ రెండు స్కాంలలో అభ్యర్థుల ఓఎమ్ఆర్లు తయారు చేసిన వ్యక్తి ఒకరేనని గుర్తించినట్లు వెల్లడించారు. ఇందులో సీబీఐ దర్యాప్తు పూర్తి అయినందున, హైకోర్టు వద్ద సమాచారం తక్కువ ఉందని ఎలా చెప్పగలమని ప్రశ్నించారు. ఈ మేరకు తీర్పును వెల్లడించారు. వాదనలు వినిపించిన అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు.. అర్హత లేని వ్యక్తులకు టీచర్ పోస్టులను ఇచ్చినట్లు గుర్తించిన వ్యవహారంలో రూ.350 కోట్లు చేతులు మారినట్లు ధర్మాసనానికి చెప్పారు. చాలా ఓఎమ్ఆర్ పత్రాలు ధ్వంసమైనట్లు వెల్లడించారు. రూ.5 కోట్ల డబ్బు, నగలు గుర్తించినట్లు పేర్కొన్నారు. విద్యాశాఖ మంత్రిని కూడా అరెస్టు చేసినట్లు ధర్మాసనానికి చెప్పారు. ప్రతిపవాదనలు వినిపించిన సీనియర్ లాయర్ కపిల్ సిబల్.. ఇక్కడ ఈడీ దర్యాప్తు చేయాల్సిన అవసరం లేదని అన్నారు. ఈ కేసులో మనీ లాండరింగ్ జరగలేదని న్యాయమూర్తికి విన్నవించారు. ఇదీ చదవండి: పార్కుకు 'వాజ్‌పేయీ' పేరు మార్పు.. బీజేపీ ఆందోళనలు.. -
ఇది వేధించడం గాక ఇంకేంటి?.. ఆమెను అడ్డుకోవడంపై మమత ఫైర్
బొగ్గు కేసులో విచారణలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్‌కు చెందని అభిషేక్ బెనర్జీ భార్య రుజీరాను అధికారులు కోల్‌కతా విమానాశ్రయంలో అడ్డుకోవడాన్ని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తప్పుపట్టారు. ఆమె తన ప్రయాణ ప్రణాళికలు గురించి ఈడికి తెలియజేసినప్పటకీ అడుకున్నారని సీరియస్ అయ్యారు. ఇది వేధించడం గాక ఇంకేమిటి అని మండిపడ్డారు. ఈడీ, సీబీఐ వ్యవహరిస్తున్న తీరు దురదృష్టకరం అని అన్నారు. అభిషేక్ బెనర్జీ అత్తగారికి అనారోగ్యంగా ఉంది. అందువల్ల అతడి భార్య తన తల్లిని కలిసేందుకు వెళ్లింది. ఆమె కోల్‌కతాను విడిచి వెళ్లాలంటే ముందుగానే ఈడీకి తెలియజేయాలని సుపప్రీం కోర్టు పేర్కొంది. ఆ ప్రకారమే ఆమె ఈడీకి సమాచారం అందించినప్పటికి అలా ఎలా చేసింది ఈడీ అని ప్రశ్నించారు. ఆమెనున విమానాశ్రయంలో అడ్డుకోవడం పిలిపించడం ఇవన్నీ వేధింపులు గాక మరొకటి కాదని అన్నారు మమతా. ఇదిలా ఉండగా, అభిషేక్ బెనర్జీ ఈ విషయమై మాట్లాడుతూ..తన భార్య ప్రయాణం ప్రణాళిక గురించి ముందుగానే ఈడీకి తెలియజేశామని అన్నారు. దుర్మార్గపు ఉద్దేశాలు ఉంటే వారికి తెలియజేయాల్సిన అవసరం ఉండదు కదా అని అనఆనరు. తాను చేస్తున్న తృణమూలే నబో జోవర్ ప్రచారానికి వచ్చిన ప్రతిస్పందనతో బీజేపీ ఉలిక్కిపడుతోందన్నారు. ఈ యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి ప్రతిపక్ష పార్టీ దానిని అడ్డుకోవాలని చూస్తుంది. మమ్మల్ని వేధించడానికి మార్గాలు వెతుకుతోందని ఆరోపణలు చేశారు. ప్రధాని మోదీని ఉద్దేశించి మాట్లాడుతూ..నా భార్యను, నా పిల్లలను లేదా నన్ను ఈడీ అరెస్టు చేసినా తాను తల వంచేదే లేదని తేల్చి చెప్పారు. ప్రధాని కుర్చిపై ఉన్న గౌరవంతో ఆయనకు ఒకటి గుర్తు చేయాలనుకుంటున్నానని అన్నారు. నావయసు ఆయన రాజకీయ అనుభవం అంత కాకపోవచ్చు..కానీ మీరు నాతో రాజకీయంగా ప్రజాకోర్టులో పోరాడలేకపోతున్నారని విమర్శించారు అభిషేక్ బెనర్జీ. అభిషేక్ ఆరోపణలపై బీజేపీ స్పందిస్తూ..ఈడీ స్వతంత్ర సంస్థ అని, బీజేపీకి ఈడీ లేదా సీబీఐతో ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది. ఆ ఆరోపణలు నిరాధారమైనవని, ఏవైన ఫిర్యాదులు ఉంటే ఎప్పుడైన వారు కోర్టుని ఆశ్రయించవచ్చు అని బీజేపీ నాయకుడు రాహుల్ సిన్హా అన్నారు. (చదవండి: ఆ దుర్ఘటన తర్వాత టికెట్లు రద్దయ్యాయి!..వివరణ ఇచ్చిన రైల్వేస్) -
పశ్చిమబెంగాల్లో కాంగ్రెస్ ఖాళీ.. టీఎంసీలో చేరిన ఏకైక ఎమ్మెల్యే
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే బేరాన్ బిస్వాస్ సోమవారం అధికార తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. పశ్చిమ మెదినీపూర్ జిల్లాఆలో టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ సమక్షంలో పార్టీ కండువ కప్పుకున్నారు. కాగా ముర్షిదాబాద్ జిల్లాలోని మైనార్టీల ప్రాబల్యం ఉన్న సాగర్డిఘి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన బేరాన్ బిస్వాస్.. పశ్చిమబెంగాల్లో కాంగ్రెస్‌కు ఉన్న ఏకైక శాసన సభ్యుడు. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన సాగర్‌డిఘీ ఉప ఎన్నికలో టీఎంసీ అభ్యర్థిపై దేబాశిష్ బెనర్జీపై 22 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించాడు. తాజాగా ఆయన కూడా పార్టీ మారడంతో రాష్టంంలో హస్తం పార్టీ ఖాళీ అయ్యింది. Today, during the ongoing #JonoSanjogYatra in the presence of Shri @abhishekaitc, INC MLA from Sagardighi Bayron Biswas joined us. We wholeheartedly welcome him to the Trinamool Congress family! To strengthen your resolve to fight against the divisive and discriminatory… pic.twitter.com/CyCaUKTyRs — All India Trinamool Congress (@AITCofficial) May 29, 2023 బైరాన్ చేరిక అనంతరం టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ మాట్లాడుతూ.. బిస్వాస్‌ను తృణమూల్ కాంగ్రెస్‌ల కుటుంబంలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నామన్నారు. రాష్ట్రంలో బీజేపీ వ్యతిరేకంగా కేవలం టీఎంసీ మాత్రమే పోరాడగలదని పేర్కొన్నారు. కాషాయ పార్టీ విభజన, వివక్షపూరిత రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడేందుకు సరైన వేదికను ఎంచుకున్నారని తెలిపారు. కలిసి కట్టుగా పోరాడి గెలుస్తామని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా 2021లో జరిగిన పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లోకాంగ్రెస్ కనీసం ఖాతా తెరవలేకపోయింది. ఈ ఏడాది ఉప ఎన్నికలో బిశ్వాస్ కాంగ్రెస్ టిక్కెట్‌పై సాగర్డిఘి స్థానాన్ని గెలుచుకున్నారు. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏకైక ఎమ్మెల్యేగా ఇప్పటి వరకు ఆయన ఉన్నారు. చదవండి: ఆందోళన వద్దు.. ఆర్టీసీ బస్సుల్లో రూ. 2 వేల నోట్లకు ఓకే -
టీఎంసీ ర్యాలీపై పిడుగు.. కార్యకర్త మృతి.. 25 మందికి గాయాలు..
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ బంకుర జిల్లా ఇందాస్లో టీఎంసీ ఆదివారం నిర్వహించిన ర్యాలీలో విషాదం చోటుచేసుకుంది. ర్యాలీ సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలోనే పక్కనే ఉన్న చెట్టుపై పిడుగు పడింది. దీంతో దాని కింద ఉన్న ఓ కార్యకర్త అక్కడికక్కడే కుప్పకూలాడు. హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. అతను అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. వర్షం పడుతుండటంతో సభ పక్కనే ఉన్న ఈ చెట్టుకిందకు వెళ్లి కార్యకర్తలు తలదాచుకున్నారు. అయితే దురదృష్టవశాత్తు పిడుగుపడి చెట్టుకూలిపోవడంతో దాని కింద ఉన్న 25 మంది గాయపడ్డారు. వీరందరినీ వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఏడుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. (చదవండి: కేంద్రం కీలక నిర్ణయం: పాక్ నుంచి మెసేజ్‌లు.. ఆ 14 యాప్స్ బ్లాక్) కాగా.. ఈ ఘటనపై టీఎంసీ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. చనిపోయిన కార్యకర్త కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపింది. తప్పకుండా సాయం అందిస్తామని హామీ ఇచ్చింది. గాడపడినవారికి మెరుగైన చికిత్స అందిస్తామని చెప్పింది. ఈమేరకు ట్వీట్ చేసింది. ఈ ర్యాలీకి సీఎం మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. టీఎంసీ యుత్ లీడర్ దేవాన్షు భట్టాచార్య ప్రసంగిస్తుండగా పిడుగు ఘటన జరిగింది. దీంతో వేదికపైనే ఉన్న అభిషేక్.. క్షతగాత్రులకు సాయం చేయాలని ఇతర కార్యకర్తలను కోరారు. చదవండి: మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు, వడగళ్ల వానలు: వాతావరణ శాఖ -
సీఎం మమతా బెనర్జీ మేనల్లుడికి సుప్రీంకోర్టులో భారీ ఊరట..
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీకి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. స్కూల్ రిక్రూట్మెంట్ స్కాంకు సంబంధించి ఆయనను సీబీఐ, ఈడీ ప్రశ్నించవచ్చంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం స్టే విధించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 24కు వాయిదా వేసింది. దీంతో అప్పటివరకు దర్యాప్తు సంస్థలు ఆయనను ప్రశ్నించే అవకాశం లేకుండా పోయింది. అలాగే బెంగాల్ పోలీసులు.. సీబీఐ, ఈడీ అధికారులపై ఎలాంటి ఎఫ్ఐఆర్లు నమోదు చేయవద్దని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై కూడా సీజేఐ జస్డిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం స్టే విధించింది. ఫలితంగా టీఎంసీ సర్కార్‌కు ఊరట లభించినట్లయింది. బెంగాల్ టీచర్ రిక్రూట్మెంట్ స్కాంకు సంబంధించి మాజీ మంత్రి పార్థ చటర్జీ, మాణిక్ భట్టాచార్యలను ఇదివరకే అరెస్టు చేసింది సీబీఐ. తాజాగా ఇవాళ మరో ఎమ్మెల్యే జీవన్ కృష్ణ సాహాను కూడా అదుపులోకి తీసుకుంది. అయితే ఈ స్కాంతో అభిషేక్ బెనర్జీకి కూడా సంబంధంముందని సీబీఐ ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే ఆయనను ప్రశ్నించేందుకు ప్రయత్నిస్తోంది. చదవండి: కాంగ్రెస్ గూటికి మాజీ సీఎం.. బీజేపీపై కీలక వ్యాఖ్యలు.. -
అమిత్ షాపై దారుణంగా ట్రోల్స్
బెంగాల్ టీఎంసీ నేతలు, బీజేపీ నేతల మధ్య మాటల వార్ నడుస్తోంది. కొద్దిరోజులుగా బెంగాల్‌లోని టీఎంసీ నేతలపై ఈడీ దాడులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాను టార్గెట్ చేసి టీఎంసీ నేతలు షాకింగ్ కామెంట్స్ చేశారు. వివరాల ప్రకారం.. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై నేరుగా దాడికి దిగారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు బెంగాల్‌లోని పలువురు మంత్రులను టార్గెట్ చేయడంతో అమిత్ షాను ‘ఇండియాలోనే అతిపెద్ద పప్పు’ అని అన్నారు. అభిషేక్.. అమిత్ షాను కామెంట్ చేసిన అనంతరమే.. దేశంలోనే అతిపెద్ద పప్పు అనే క్యాప్షన్ ఉన్న టీ-షర్టులను టీఎంసీ కార్యకర్తలకు పంపిణీ చేశారు. ఈ నేపథ్యంలో తన వ్యాఖ్యలపై అభిషేక్ బెనర్జీ వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒకసారి ఢిల్లీ నేరాల రేటు చూడండి. కోల్‌కతాలో క్రైమ్ రేట్ తక్కువగా ఉందని మీ స్వంత ఏజెన్సీ తెలిపింది. ఢిల్లీ పోలీసులు మాత్రం హోం మంత్రిత్వ శాఖ ఆధీనంలో ఉన్నారు. అయినా అక్కడ క్రైమ్ రేట్ ఏ స్థాయిలో ఉందో చూడండి. అమిత్‌షా అందరికీ జాతీయవాదాన్ని బోధిస్తారు. కానీ తన కొడుకు బీసీసీఐ కార్యదర్శి జై షాకి మాత్రం జాతీయ జెండా పట్టుకోవడంలో ఇబ్బంది ఉంది. ముందుగా అతనికి నేర్పించండి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాగా, ఆసియా కప్‌లో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ సందర్భంగా జై షా జాతీయ జెండాను ఊపేందుకు నిరాకరించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఇదిలా ఉండగా.. “మాకింగ్ అనేది కమ్యూనికేట్ చేయడంలో అత్యంత శక్తివంతమైన రూపం. ఇది మా జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ చేసిన వ్యాఖ్య నుంచి ప్రారంభమైంది. ఇది సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యింది. అది టీ-షర్టులపైకి వచ్చింది” అని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ చెప్పారు. కాగా, టీ షర్టులు తెలుపు, పసుపు, బ్లాక్ రంగుల్లో వస్తున్నాయని వీటిని ఆన్లైన్ నుంచి కొనుగోలు చేయవచ్చని తెలిపారు. టీ షర్టు ధరను రూ. 300గా నిర్ణయించినట్టు స్పష్టం చేశారు. You cannot give someone a title just because you feel like it. The person must truly deserve it! Listen to the many reasons why this gentleman has truly EARNED the title #IndiasBiggestPappuAmitShah VIDEO 👇 pic.twitter.com/vGHsyAjR5Z — Derek O'Brien | ডেরেক ও'ব্রায়েন (@derekobrienmp) September 5, 2022 -
బొగ్గు స్కాం కేసు: మమతా బెనర్జీ మేనల్లుడికి ఈడీ సమన్లు
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అధికార పార్టీకి మరో షాక్ ఇచ్చింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ). ఇప్పటికే స్కూల్ జాబ్స్ స్కామ్‌లో కీలక నేత పార్థా ఛటర్జీని అరెస్ట్ చేయగా.. తాజాగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీకి సమన్లు జారీ చేసింది. బొగ్గు అక్రమ రవాణా కుంభకోణం కేసులో భాగంగా శుక్రవారం కోల్‌కతాలోని తమ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని స్పష్టం చేసింది. ‘మా అధికారుల ముందు విచారణకు హాజరుకావాలని అభిషేక్ బెనర్జీకి సమన్లు జారీ చేశాం. ఆయను విచారించేందుకు ఢిల్లీ నుంచి మా అధికారులు వస్తారు.’ అని తెలిపారు ఈడీ సీనియర్ అధికారి ఒకరు. మరోవైపు.. కోల్‌కతాలో ఓ ర్యాలీలో సోమవారం పాల్గొన్న మమత బీజేపీపై విమర్శలు గుప్పించారు. తన మేనల్లుడికి కేంద్ర దర్యాప్తు సంస్థలు నోటీసులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని ఆరోపించారు. ఆమె భావించినట్లుగానే ఆ మరుసటి రోజునే ఈడీ సమన్లు జారీ చేయటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇదీ చదవండి: ‘మీకు చేతనైతే నన్ను అరెస్ట్ చేయండి’.. బీజేపీకి మమతా బెనర్జీ సవాల్ -
దేశం ప్రమాదంలో ఉంది.. పోరాడాల్సిందే
గువాహటి: బీజేపీ పాలనలో దేశం ప్రమాదంలో పడిందని తృణమూల్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ అన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో టీఎంసీని బలోపేతం చేసే ప్రయత్నాల్లో భాగంగా అసోం రాజధాని గువాహటిలో పార్టీ కార్యాలయాన్ని ఆయన బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘హిందువులు ప్రమాదంలో ఉన్నారని కొందరు అంటున్నారు. ముస్లింలు ప్రమాదంలో ఉన్నారని మరికొందరు అంటున్నారు. మీ మతం కళ్లద్దాలు తీసి చూడండి భారతదేశం ప్రమాదంలో ఉంద’ని వ్యాఖ్యానించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో అసోంలోని 14 లోక్‌సభ స్థానాలకు గాను 10 స్థానాలు గెలుచుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశారు. గెలిచే వరకు విశ్రమించబోం అసోం నుంచి అవినీతి బీజేపీని తరిమి కొట్టడానికి టీఎంసీ అన్ని ప్రయత్నాలు చేస్తుందని అభిషేక్ బెనర్జీ చెప్పారు. ‘టీఎంసీ ఎక్కడ అడుగుపెట్టినా చివరి వరకు గట్టిగా పోరాడింది. రెండేళ్లలో బీజేపీని తరిమికొట్టేందుకు ప్రాణాలు ఫణంగా పెట్టి పోరాటం చేస్తాం. ఈ రాష్ట్రంలో గెలిచే వరకు విశ్రమించబోం. పోరాటం ప్రారంభించిన తర్వాత వెనక్కి తిరిగి చూడబోం. అసోంలో అసెంబ్లీ ఎన్నికలకు నాలుగేళ్ల సమయం ఉంది. లోక్‌సభ ఎన్నికలు రెండేళ్లలో జరగనున్నాయి. ఇక్కడ 14 సీట్లకు గాను 10 స్థానాల్లో పోరాడి గెలుస్తామ’ని అన్నారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న త్రిపుర, మేఘాలయా రెండింటిలోనూ తమ పార్టీ అధికారంలోకి వస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. (క్లిక్: జేపీ మీటింగ్‌కు రాహుల్ ద్రవిడ్..?) భారీగా చేరికలు ఈశాన్య రాష్ట్రాల్లో పార్టీని పటిష్టం చేయడంపై టీఎంసీ అధినాయకత్వం దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా రిపున్ బోరాను అసోం టీఎంసీ అధ్యక్షుడిగా నియమించింది. ఆయన ఇలీవలే కాంగ్రెస్ పార్టీని వీడి మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీలో చేరారు. కాగా, కొద్ది రోజుల్లోనే జిల్లా, బ్లాక్ కమిటీలను ఏర్పాటు చేస్తామని అభిషేక్ బెనర్జీ తెలిపారు. 2022 చివరి నాటికి అన్ని బూత్‌లలో కమిటీలు ఉండేలా చూస్తామన్నారు. మరోవైపు ప్రాంతీయ, జాతీయ పార్టీలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో అభిషేక్ బెనర్జీ సమక్షంలో తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. (క్లిక్: అవార్డ్ తిరిగి ఇచ్చేసిన రచయిత్రి.. బీజేపీ, టీఎంసీ మాటల యుద్ధం) -
తృణమూల్‌లో ట్వీట్ చిచ్చు
కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్‌లో ‘వన్ పర్సన్, వన్ పోస్ట్’ ట్వీట్ దుమారం రేపుతోంది. దీనిపై పార్టీలో నాయకులు కొందరు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. అభిషేక్ బెనర్జీకి అనుకూలురైన నాయకులు ఈ పోస్టును సమర్ధిస్తూ మాట్లాడగా, పార్టీలో పాత కాపులు మాత్రం ఇదంతా క్రమశిక్షణా రాహిత్యమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏఐటీసీలో ఒక వ్యక్తికి ఒక పదవిని తాము సమర్థ్ధిస్తున్నామని అభిషేక్ సన్నిహితులు అదితి, ఆకాశ్ ట్వీట్ చేశారు. చాలా రోజులుగా ఒక వ్యక్తికి ఒకే పదవి ఉండాలంటూ అభిషేక్ సూచిస్తున్నారు. అయితే పార్టీలో కొందరు సీనియర్లు అటు పార్టీలో, ఇటు ప్రభుత్వంలో పదవులు అనుభవిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజా ట్వీట్‌పై కోల్‌కతా మేయర్‌గా, కేబినెట్లో మంత్రిగా పనిచేస్తున్న ఫిర్హాద్ హకీమ్ స్పందించారు. నాయకత్వాన్ని సంప్రదించకుండా ఇలాంటి పోస్టులు పెట్టడం పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించడమేనన్నారు. టీఎంసీ సెక్రటరీ జనరల్ పార్థా చటర్జీ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. తన అనుమతి లేకుండా తన అకౌంట్నుంచి ఎవరో ఇదే ఈ్వట్ చేశారని మంత్రి చంద్రిమా భట్టాచార్య ఆరోపించారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల జాబితాలు ప్రకటించినప్పటినుంచి పార్టీలో నేతల మధ్య వివాదాలు మొదలయ్యాయి. అంతర్గత విభేదాలపై నేడు భేటీ పశ్చిమ బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాల పరిష్కారంపై పార్టీ అధినేత, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. శనివారం పార్టీ సీనియర్ నేతలతో భేటీ కావాలని నిర్ణయించారు. మమత నివాసంలో సాయంత్రం 5 గంటలకు ఈ సమావేశం జరుగుతుందని తృణమూల్ కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. భేటీకి కేవలం ఆరుగురు నేతలకు పిలుపు అందించినట్లు సమాచారం. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ, సెక్రెటరీ జనరల్ పార్థా చటర్జీ, పార్టీ బెంగాల్ విభాగం అధ్యక్షులు సుబ్రతా బక్షీ, మంత్రులు ఫిర్హాద్ హకీం, అరూప్ బిశ్వాస్, చంద్రిమా భట్టాచార్యకు పిలుపు వెళ్లినట్లు తెలిసింది. పార్టీ నేతల మధ్య విభేదాలు ముదురుతుండడం, ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటుండడంపై మమతా బెనర్జీ ఆగ్రహంతో ఉన్నారు. పార్టీ ప్రతిష్టను దిగజారుస్తున్న వారికి గట్టి సందేశం ఇవ్వాలని ఆమె నిర్ణయించుకున్నట్లు తృణమూల్ కాంగ్రెస్ నేత ఒకరు చెప్పారు. -
మీర్జాపూర్ వెబ్ సిరీస్ వివాదం.. హైకోర్టు కీలక నిర్ణయం
అలహాబాద్: మీర్జాపూర్ వెబ్ సిరీస్ రూపకర్తలకు ఊరట లభించింది. నిర్మాతలు ఫర్హాన్ అఖర్, రితేష్ సిధ్వానీలపై దాఖలైన ఎఫ్ఐఆర్ను అలహాబాద్ హైకోర్టు శుక్రవారం రద్దు చేసింది. జస్టిస్ ఎంసీ త్రిపాఠి, జస్టిస్ సుభాష్ విద్యార్థిలతో కూడిన బెంచ్ ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది. దర్శక-రచయితలు కరణ్ అన్షుమాన్, గుర్మీత్ సింగ్, పునీత్ కృష్ణ, వినీత్ కృష్ణలపై నమోదైన ఎఫ్ఐఆర్ను కూడా హైకోర్టు రద్దు చేసింది. ఉత్తరప్రదేశ్ ప్రతిష్టకు భంగం కలిగేలా వెబ్ సిరీస్ రూపొందించారని ఆరోపిస్తూ కొత్వాలి దేహత్ పోలీస్ స్టేషన్ (మీర్జాపూర్)లో స్థానిక జర్నలిస్ట్ అరవింద్ చతుర్వేది జనవరి, 17న ఫిర్యాదు చేశారు. దీంతో ఐపీసీ సెక్షన్ 295-ఏ, 504, 505, 34, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్ 67-ఏ కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వెబ్ సిరీస్‌లో మీర్జాపూర్ పట్టణాన్ని చెడుగా చిత్రీకరించి మత, సామాజిక, ప్రాంతీయ మనోభావాలను దెబ్బతీశారని పిటిషనర్ ఆరోపించారు. తమపై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని కోరుతూ ముందుగా నిర్మాతలు కోర్టు ఆశ్రయించారు. తర్వాత దర్శక-రచయితలు కూడా న్యాయస్థానం తలుపు తట్టారు. జనవరి, ఫిబ్రవరిలో వీరిని అరెస్ట్ చేయకుండా కోర్టు ఆదేశిలిచ్చింది. మీర్జాపూర్ వెబ్ సిరీస్ పూర్తిగా కల్పితమని, అన్ని మతాలను తాము గౌరవిస్తామని అంతకుముందు ఉన్నత న్యాయస్థానానికి వీరు విన్నవించుకున్నారు. వీరి వాదనలను పరిగణనలోకి తీసుకుని ఎఫ్ఐఆర్లను కోర్టు రద్దు చేసింది. (చదవండి: సినిమా చూసేందుకు ఆటోలో వచ్చిన స్టార్ హీరోయిన్) అమెజాన్ ప్రైమ్ వీడియోస్‌లో విడుదలైన మీర్జాపూర్ వెబ్ సిరీస్‌కు వీక్షకుల నుంచి ఆదరణ లభించింది. ఇప్పటికే రెండు సిరీస్‌లు విడుదలయ్యాయి. పంకజ్ త్రిపాఠి, అలీ ఫజాల్, దివ్యేందు శర్మ, కుల్‌భూషణ్ ఖర్బందా, రసికా దుగల్, శ్వేతా త్రిపాఠి, ప్రమోద్ పాఠక్, హర్షిత గౌర్, షాజీ చౌదరి తదితరులు నటించారు. ఇదిలావుంటే మూడో మీర్జాపూర్ వెబ్ సిరీస్ మూడో సీజన్ కోసం వీక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. (చదవండి: మీ మగబుద్ధే వంకరబుద్ధి అంటున్న సమంత!) -
ఆనంద్ దేవరకొండ`హైవే` కాన్సెప్ట్ పోస్టర్ వచ్చేసింది!
Anand Deverakonda Highway Concept Poster: 'పుష్పక విమానం' సినిమాతో మంచి విజయం సాధించాడు యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ. ఆయన హీరోగా కేవీ గుహన్ దర్శకత్వంలో రూపొందుతోన్న సైకో క్రైమ్ థ్రిల్లర్ `హైవే`. ఈ సినిమాలో పూర్తిగా సరికొత్త లుక్‌లో కనిపించనున్నాడు ఆనంద్. మలయాళ ముద్దుగుమ్మ మానస రాధాకృష్ణన్ హీరోయిన్గా నటిస్తోంది. నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ పతాకంపై ప్రొడక్షన్ నెం.2గా వెంకట్ తలారి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మీర్జాపూర్, పాతాళ్‌లోక్ వంటి సిరీస్‌లతో తెలుగులోనూ ఫేమస్ అయిన బాలీవుడ్ నటుడు అభిషేక్ బెనర్జీ కీలకపాత్ర పోషిస్తుండగా బాలీవుడ్ హాట్ బ్యూటీ సయామీఖేర్ ముఖ్య పాత్రలో నటిస్తోంది. తాజాగా నటీనటుల కాన్సెప్ట్ పోస్టర్స్ రిలీజయ్యాయి. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత వెంకట్ తలారి మాట్లాడుతూ.. ‘‘118 వంటి సూపర్‌హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన గుహన్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ, మానస రాధా కృష్ణన్ హీరో హీరోయిన్లుగా హైవే చిత్రం రూపొందుతోంది. మా బ్యానర్లో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా తెరకెక్కించాం. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు చివరిదశలో ఉన్నాయి`` అన్నారు. చిత్ర దర్శకుడు కేవీ గుహన్ మాట్లాడుతూ – ‘‘ఒకరితో ఒకరికి సంబంధం లేని నలుగురు వ్యక్తుల కథే `హైవే’. పూర్తిగా హైవే నేపథ్యంలోనే సాగే సీట్ ఎడ్జ్ థ్రిల్లర్. టెక్నికల్ పరంగా హై స్టాండర్డ్‌లో ఉంటుంది`` అన్నారు. #KVGuhan Stuns Yet Again Amazing Concept Posters From Sensational #AnandDevarakonda's Nerve-Wracking Crime Thriller #Highwaymovie💥 ⭐Ing @ananddeverkonda #manasaradhakrishnan @SaiyamiKher @nowitsabhi A @kvguhan 's Directorial📽️ Produced by #VenkatTalari 💸 🎹 @simonkking pic.twitter.com/ZDdGPE4J6x — BA Raju's Team (@baraju_SuperHit) December 2, 2021 -
బీజేపీ అనే వైరస్‌కు వ్యాక్సిన్ మమతే.. అభిషేక్ బెనర్జీ తీవ్ర విమర్శలు
అగర్తలా: తృణమూల్ కాంగ్రెస్‌లోకి వలసలు మొదలయ్యాయి. పశ్చిమ బెంగాల్ మాజీ మంత్రి రజీబ్ బెనర్జీ, త్రిపుర బీజేపీ ఎమ్మెల్యే అశిష్‌దాస్ శనివారం త్రిపురలోని అగర్తలాలో జరిగిన ఒక కార్యక్రమంలో టీఎంసీ గూటికి చేరారు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ సమక్షంలో తృణమూల్ తీర్థం పుచ్చుకున్నారు. 2011, 2016లో పశ్చిమ బెంగాల్లో టీఎంసీ ప్రభుత్వంలో మంత్రిగా చేసిన రజీబ్ గత ఎన్నికల సమయంలో బీజేపీలో చేరి దోమ్జూర్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. తృణమూల్ అధికారంలోకి రావడంతో బీజేపీ నుంచి మళ్లీ మాతృసంస్థకి చేరుకున్నారు. గోవా నుంచి త్రిపుర వరకు పార్టీని విస్తరించడానికి చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా అగర్తాలలో తృణమూల్ కాంగ్రెస్ సభ నిర్వహించింది. ఈసారి త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో లెఫ్ట్, రైట్ అందరినీ మట్టికరిపిస్తామని అభిషేక్ధీమా వ్యక్తం చేశారు. ‘‘బీజేపీ అనే వైరస్‌కి వ్యాక్సిన్ ఒక్కటే ఉంది. దాని పేరు మమతా బెనర్జీ. త్రిపుర ఓటర్లు ఆ వైరస్‌కి రెండు డోసుల వ్యాక్సిన్ ఇవ్వాలి. మొదటిది వచ్చే నెలలో జరిగే స్థానిక ఎన్నికల్లోనూ, 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోనూ రెండో డోసు ఇవ్వాలి’’ అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. అగర్తలా ర్యాలీ నిర్వహించాలని గత కొద్ది రోజులుగా టీఎంసీ ప్రయత్నిస్తున్నప్పటికీ అక్కడ రాష్ట్ర బీజేపీ ప్రభుత్వం అడ్డు చెబుతూ వస్తోంది. కరోనా నిబంధనల వల్ల ర్యాలీలకు అనుమతించేది లేదని పోలీసులు తెగేసి చెప్పారు. దీంతో టీఎంసీ కోర్టుకెళ్లింది. చివరికి త్రిపుర హైకోర్టు ర్యాలీకి అనుమతించింది. -
బొగ్గు కుంభకోణం: అభిషేక్ బెనర్జీకి హైకోర్టులో చుక్కెదురు
న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీకి ఢిల్లీ హైకోర్టులో చుక్కె దురైంది. మనీల్యాండరింగ్ కేసులో ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) జారీ చేసిన సమన్లపై స్టే విధించాలంటూ పెట్టుకున్న పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. అయితే, నోటీసులకు సంబంధించి అభిషేక్ బెనర్జీతోపాటు ఆయన భార్య రుజిరా పెట్టుకున్న వినతులను పరిశీలించాలని ఈడీని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈనెల 27వ తేదీకి వాయిదా వేసింది. పశ్చిమ బెంగాల్లో చోటుచేసుకున్న బొగ్గు కుంభకోణంలో మనీల్యాండరింగ్ అభి యోగాలపై ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో మంగళవారం జరిగే విచారణకు అభిషేక్, రుజిరా వ్యక్తిగతం హాజరు కావాల్సి ఉంది. -
మొన్నటి వరకూ కేంద్రమంత్రి.. ఇప్పుడు టీఎంసీ గూటికి
కలకత్తా: ఇటీవల చేపట్టిన కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో పోస్టు కోల్పోయిన కేంద్ర మాజీ మంత్రి బాబుల్ సుప్రియో బీజేపీకి బైబై చెప్పేసి ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. కొన్ని రోజులు కిందట బీజేపీకి రాజీనామా చేసిన ఆయన తాజాగా శనివారం టీఎంసీ గూటికి చేరారు. బాబుల్ సుప్రియోను ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ, రాజ్య సభ సభ్యుడు డెరెక్ బబ్రెయిన్ సాదర స్వాగతం పలికారు. చదవండి: మహిళలను గౌరవిస్తే మీకు 23 సీట్లు వచ్చేవి కావు:హోంమంత్రి మరోసారి కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో జూలై 31వ తేదీన ఇక రాజకీయాల నుంచే వైదొలుగుతున్నట్లు సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. లోక్‌సభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తానని ప్రకటించారు కూడా. పశ్చిమ బెంగాల్‌కు చెందిన బాబుల్ సుప్రియో ప్రముఖ గాయకుడు. 2014 ఎన్నికల సమయంలో బీజేపీలో చేరి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. సార్వత్రిక ఎన్నికల్లో అస్సనోల్ నుంచి పోటీ చేసి తొలిసారి ఎంపీగా గెలిచారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ తొలి మంత్రివర్గంలో బాబుల్ సుప్రియో చేరారు. పట్టణ అభివృద్ధి సహాయ మంత్రిగా పని చేశారు. 2019 ఎన్నికల్లో మళ్లీ అస్సనోల్ నుంచి గెలుపొంది కేంద్రమంత్రిగా నియమితులయ్యారు. చదవండి: పొట్టి దుస్తులు వేసుకోవడం నేరమా? అయితే ఇటీవల కేంద్రమంత్రివర్గంలోకి తనను తీసుకోకపోవడంతో బీజేపీకి బైబై చెప్పేశారు. వాటితోపాటు మరికొన్ని కారణాలుకూడా ఉన్నాయి. కొన్ని నెలల కిందట జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా బాబుల్ సుప్రియోను బీజేపీ బరిలో దింపింది. అనూహ్యంగా సుప్రియో తృణమూల్ కాంగ్రెస్ చేతిలో పరాజయం పొందాడు. దీంతోపాటు రాష్ట్రంలో బీజేపీ ఆశించిన ఫలితాలు పొందలేదు. ఇది దృష్టిలో ఉంచుకుని బీజేపీ అధినాయకత్వం కేంద్ర మంత్రివర్గం నుంచి ఆయనను తొలగించింది. ఈ క్రమంలోనే ఆయన మనస్తాపానికి గురయ్యారు. ఆ క్రమంలోనే బీజేపీకి రాజీనామా చేశారు. తాజాగా తృణమూల్‌లో చేరడంతో ఆయన రాజకీయ సన్యాసం చేస్తారనే వార్తలకు తెర పడింది. Today, in the presence of National General Secretary @abhishekaitc and RS MP @derekobrienmp, former Union Minister and sitting MP @SuPriyoBabul joined the Trinamool family. We take this opportunity to extend a very warm welcome to him! pic.twitter.com/6OEeEz5OGj — All India Trinamool Congress (@AITCofficial) September 18, 2021 -
టీఎంసీ ఎంపీకి మూడోసారి ఈడీ సమన్లు
సాక్షి, న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోసారి సమన్లు జారీ చేసింది. ఈ నెల 21 న ఢిల్లీలో విచారణకు హాజరుకావాలని ఈడీ ఆదేశించింది. మనీ లాండరింగ్ కేసులో అభిషేక్‌కు సమన్లు జారీ చేయడం ఇది మూడోసారి. బొగ్గు అక్రమ రవాణా కేసులో విచారణకు బెనర్జీ శుక్రవారం హాజరు కావాల్సి ఉంది కానీ సమయం తక్కువగా ఉందంటూ అభిషేక్ బెనర్జీ హాజరు కాలేదు. దాంతో ఈ నెల 21 న హాజరుకావాలని మరోసారి సమన్లు ఇచ్చింది. అలాగే సెప్టెంబరు 1న విచారణకు హాజరు కావాలని అభిషేక్ భార్య రుజిరాను ఈడీ సమన్లు జారీచేసింది. అయితే కోవిడ్ పరిస్థితులు కారణంగా చిన్నపిల్లలతో తాను ఢిల్లీకి కాలేనని, దీనికి బదులుగా ఆమె కోల్‌కతా ఇంటిలో ఆమెను ప్రశ్నించాలని ఈడీని కోరారు. సోమవారం (సెప్టెంబర్ 6) ఢిల్లీలోని జామ్ నగర్ హౌస్‌లో ఈడీ అధికారులు అభిషేక్ బెనర్జీని ఎనిమిది గంటలకు పైగా విచారించారు. కుటుంబ సభ్యులతో సంబంధమున్న రెండు సంస్థలు అందుకున్న లెక్కకు మించిన డబ్బు గురించి ప్రత్యేకంగా ప్రశ్నించినట్టు సమాచారం. ఈ విషయంలో పూర్తి సమాచారాన్ని అందించడంలో బెనర్జీని విఫలమైనట్టు తెలుస్తోంది.బొగ్గు అక్రమ రవాణా ద్వారా వచ్చిన నగదు విషయంలో వినయ్ మిశ్రా కీలక పాత్ర పోషించారని ఈడీ ఆ రోపిస్తోంది. ఈ నేపథ్యంలో పరారీలో ఉన్న నిందితుడైన టీఎంసీ యువనేత వినయ్ మిశ్రాతో ఉన్న సంబంధాలపై బెనర్జీని సోమవారం ప్రశ్నించగా ఈ ఆరోపణలన్నింటిని తోసిపుచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు ఈశాన్య రాష్ట్రంపై పట్టు సాధించేందుకు తృణమూల్ కాంగ్రెస్ భారీ కసరత్తే చేస్తోంది. 2023 లో అసెంబ్లీ ఎన్నికలే లక్క్ష్యంగా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో ఎంపీ అభిషేక్ బెనర్జీ రానున్న బుధవారం (సెప్టెంబరు 15 ) త్రిపురలోని అగర్తలాలో రోడ్‌షో నిర్వహించ నున్నారని టీఎంసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కునాల్ ఘోష్ వెల్లడించారు. -
ఈడీ ఎదుటకు టీఎంసీ ఎంపీ అభిషేక్
న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీని సోమవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు సుదీర్ఘంగా దాదాపు 9 గంటలపాటు విచారణ జరిపారు. రాష్ట్రంలో జరిగిన బొగ్గు కుంభకోణంలో మనీల్యాండరింగ్ ఆరోపణలకు సంబంధించి అభిషేక్ సోమవారం ఢిల్లీలోని జామ్‌నగర్ హౌస్‌లో ఉన్న ఈడీ కార్యాలయానికి ఉదయం 11 గంటలకు చేరుకున్నారు. తిరిగి ఆయన రాత్రి 8 గంటల సమయంలో వెళ్లిపోయారు. ఈ కేసులో ఇతర నిందితులతో సంబంధాలు, తన కుటుంబీకులకు చెందిన రెండు కంపెనీల్లో జరిగిన అక్రమ లావాదేవీలపై అభిషేక్‌ను అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌కు చెందిన బొగ్గు గనుల్లో అనేక కోట్ల అక్రమాలు చోటుచేసుకున్నట్లు 2020లో సీబీఐ నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ మనీల్యాండరింగ్ కేసు నమోదు చేసింది. ఈ కేసులో అనూప్ మాఝి అలియాస్ లాలాను ప్రధాన నిందితుడిగా పేర్కొంది. ఈ అక్రమాల్లో అభిషేక్ కూడా లబ్ధి పొందినట్లు ఈడీ ఆరోపిస్తోంది. ఇందులో భాగంగానే అభిషేక్ భార్య రుజిరాకు కూడా నోటీసులు జారీ చేసింది. కానీ, ఆమె కరోనా తీవ్రత దృష్ట్యా రాలేకపోతున్నట్లు సమాచారం అందించడంతో, కోల్‌కతాలోనే అధికారులు ఆమెను ప్రశ్నించారు. ఈ కేసులో ఇద్దరిని అరెస్ట్ చేసిన ఈడీ.. కొందరు ఐపీఎస్ అధికారులతోపాటు, ఒక లాయర్‌ను కూడా విచారణకు రావాలంటూ సమన్లు జారీ చేసింది. -
ఈ డీ విచారణకు హాజరైన దీదీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ
-
ఇమ్రాన్ డకౌట్.. మీ వైఖరేమిటి?
సోషల్ నెట్ వర్కింగ్ వెబ్సైట్లు ఫేస్బుక్, ట్విట్టర్లలో సెలబ్రిటీల ‘మనసులోని మాట’లు తాజాగా ఇలా...! ఇమ్రాన్ డకౌట్ ఆహార హక్కు మనిషి ప్రాథమిక హక్కు. ఇందులో రాజకీయాలకు తావు లేదు. పాకిస్తాన్లో ఆహార అభద్రత ఈ మూడేళ్లలో రెట్టింపయింది. దేశం ఆకలితో అలమటిస్తోంది. ప్రమాద ఘంటికలు చెవులకు వినబడటం లేదా? ఇదేమీ యుద్ధంతో చితికిపోయిన దేశం కాదు. ఇలా ఉండటానికి ఏ హేతువూ లేదు. విఫల, అవినీతి మయ, అసమర్థ ప్రభుత్వమే దీనికి కారణం. – భక్తవార్ భుట్టో జర్దారీ, ‘బేనజీర్ భుట్టో’ కూతురు మీ వైఖరేమిటి? సినీ నటుడు నసీరుద్దీన్ షా ఇండియాను విమర్శించినప్పుడు ఉదారవాదులు స్వాగతించారు. అదే నసీరుద్దీన్ షా తాలిబన్‌ను విమర్శిస్తే మాత్రం ఉదారవాదులు కోపంగా ఉన్నారు. ఊహించండి ఇదెలా ఉందో! – అభిషేక్ బెనర్జీ, మ్యాథెమెటీషియన్ నాయకుడి పనితనం నాయకత్వమూ, పనితనము విషయంలో గందరగోళపడొద్దు. రెండూ వేర్వేరు అంశాలు. నువ్వు గొప్ప పనితనం చూపవచ్చు, కానీ గొప్ప నాయకుడివి కాకపోవచ్చు. – రిషాద్ ప్రేమ్‌జీ, పారిశ్రామికవేత్త ఇదా కారణం? చాలామంది పండితులు చెప్పేదేమంటే– అఫ్గాన్ ఇస్లామిస్టులకు పాకిస్తాన్ మద్దతి వ్వడానికి ప్రధాన కారణం, పష్తూన్లు పాకి స్తాన్ అనే భావనను అంగీకరించరన్న భయం, ఇప్పటి సరిహద్దులను గౌరవించరన్న ఆందోళన. – సదానంద్ ధూమే, కాలమిస్ట్ మాట్లాడితే గొప్పా? ఇది నేను ప్రైవేటు రంగం లోనూ, ప్రభుత్వ రంగంలోనూ గమనించాను. బాగా ప్రెజెంటే షన్లు ఇవ్వగలిగి, ఇంగ్లిష్‌లో ధారాళంగా మాట్లాడగలిగేవారు నిజంగా కష్టపడి పనిచేసే మనుషులను కమ్మేస్తారు. కానీ నిజమైన బాస్‌కు ఎవరు ఎంత పనిమంతులో కచ్చితంగా తెలుస్తుంది. అయితే అలా పసిగట్టగలిగే స్పృహ మాత్రం ఒక అరుదైన గుణమే. – ప్రభ్‌జ్యోత్ సింగ్, ఇస్రో మాజీ సైంటిస్ట్ లెక్క చెప్పగలవా! ఈమధ్య ఎందుకో ఇది నా మనసులో కొచ్చింది. కానీ దీని కోసం ప్రభుత్వ వెబ్ సైట్లలో వెతకడానికి చేసిన ప్రయత్నం నిష్ఫలం అయింది. ఎక్కడా ఒక స్థిరమైన సమాధానం దొరకలేదు. అందుకే నేరుగా మిమ్మల్నే అడుగుతున్నా: ప్రస్తుతం ఇండియాలో ఎన్ని జిల్లాలున్నాయి? – గౌతమ్ మీనన్, ప్రొఫెసర్ మెరుగైన చరిత్ర గత కొన్ని వారాలుగా టీకా కార్య క్రమం బ్రహ్మాండంగా కొనసాగుతోంది. మొత్తంగా మన ప్రజారోగ్య రంగ కష్టాల్లో చూస్తే, టీకాల విషయంలో మాత్రం మనం మెరుగ్గా ఉన్నాం. ముఖ్యంగా ఉక్రెయిన్‌కు చెందిన వాల్దెమార్ హాఫ్కిన్ ఇండియా వచ్చినప్పటినుంచి. (ఆయన కలరా టీకాను ఇండియాలో విజయవంతం చేశాడు). ఇరవయ్యో శతాబ్ది తొలినాళ్లలో పుణేలోని హాఫ్కిన్ ఇన్స్టిట్యూట్ ఉన్నచోటే ఇప్పుడు సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉన్నది. – చిన్మయ్ తుంబే, చరిత్రకారుడు -
ఈడీ సమన్లు: దీదీ తాజా సవాల్
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీజేపీ సర్కార్‌పై మరోసారి విరుచుకుపడ్డారు. బొగ్గు స్మగ్లింగ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో తృణమూల్ ఎంపీ అభిషేక్ బెనర్జీ, అతని భార్య రుజీరా బెనర్జీకి ఈడీ సమన్లు జారీచేసిన నేపథ్యంలో ఆమె కేంద్రంపై మండిపడ్డారు. దేశాన్ని తెగనమ్మేసిన బీజేపీ బొగ్గు కుంభకోణంలో టీఎంసీని వేలెత్తి చూపినందువల్ల ప్రయోజనం లేదని, అది కేంద్ర పరిధిలోనిదన్నారు. దమ్ముంటే తమ పార్టీని రాజకీయంగా ఎదుర్కోవాలని ఆమె సవాల్ విసిరారు. చదవండి : Coal scam: అభిషేక్, భార్య రుజీరాకు ఈడీ సమన్లు బొగ్గు స్కాం వ్యవహారంలో తమ పార్టీపై దాడిచేయడాన్ని ప్రశ్నించిన మమతా అది కేంద్రం పరిధిలోనిదని పేర్కొన్నారు. మరి బొగ్గు గనుల స్వాహాలో బీజేపీ మంత్రుల సంగతేంటి? బెంగాల్, అసన్సోల్ ప్రాంతంలోని కోల్ బెల్ట్‌ను దోచుకున్న బీజేపీ నాయకుల సంగతేంటని ప్రశ్నించారు. గుజరాత్ చర్రిత ఏంటో తెలుసు.. తమపై ఒక కేసు పెడితే, తాము మరిన్ని కేసులను వెలుగులోకి తీసుకొస్తామని ఈ సందర్భంగా దీదీ హెచ్చరించారు. దీనిపై తిరిగి ఎలా పోరాడాలో తమకు తెలుసని ఆమె పేర్కొన్నారు. తమకు వ్యతిరేకంగా ఈడీని ఎందుకు వాడుకుంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బొగ్గు వంటి సహజ వనరుల హక్కుల కేటాయింపు కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుందని మమతా గుర్తు చేశారు. -
అభిషేక్ బెనర్జీకి షాకిచ్చిన ఈడీ
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ ఎంపీ, అభిషేక్ బెనర్జీకి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. కోల్ స్కాం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అభిషేక్, ఆయన భార్య రుచిరా బెనర్జీకి సమన్లు జారీ చేసింది. సెప్టెంబర్ 6 న అభిషేక్, సెప్టెంబర్ 1 న రుజీరా ఈడీ ముందు హాజరు కావాలని ఆదేశించింది. రాష్ట్రంలో జరిగిన బొగ్గు కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో విచారణకు హాజరు కావాలని అభిషేక్ దంపతులను ఆదేశించింది. అలాగే బెనర్జీల తరఫు న్యాయవాది సంజయ్ బసు సెప్టెంబర్ 3 , వీరితోపాటు ఇదే కేసులో బెంగాల్ పోలీసు ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులు శ్యామ్ సింగ్, జ్ఞవంత్ సింగ్‌లు సెప్టెంబర్ 8 ,9 తేదీల్లోహాజరుకావాలని ఈడీ ఆదేశించింది. కోట్లరూపాయల అవినీతి సంబంధించి సీబీఐ (నవంబర్, 2020) దాఖలు చేసిన కేసు అధారంగా ఈ సమన్లు జారీ చేసినట్టు ఈడీ అధికారులు తెలిపారు.ఈ కేసుకు సంబంధించిన మరికొంతమందిని కూడా వచ్చే నెలలో హాజరుకావాలని సమన్లు జారీ చేశామన్నారు. మరోవైపు ఈ ఆరోపణలను ఖండించిన అభిషేక్ దర్యాప్తు సంస్థల ద్వారా బీజీపీ సర్కారు తమపై వేధింపులకు పాల్పడుతోందని అభిషేక్ ఆరోపించారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ పరిణామమని మండిపడ్డారు. కాగా పశ్చిమ బెంగాల్లో కునుస్తోరియా, కజోరా ప్రాంతాల్లోని ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌కు(ఈసీఎల్) చెందిన బొగ్గు గనుల్లో బొగ్గును అక్రమంగా తవ్వుకొని, స్వాహా చేశారని ఆరోపిస్తూ సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ వ్యవహారంతో రుచిరా బెనర్జీకి, మరదలు మేనకా గంభీర్‌కు కూడా సంబంధం ఉన్నట్లు సీబీఐ గుర్తించింది. అలాగే అక్రమమైనింగ్ వ్యవహారంలో అభిషేక్ ప్రధాన లబ్ధిదారుని గతంలో ఈడీ ఆరోపించిన సంగతి తెలిసిందే. -
మమతా బెనర్జీ అల్లుడి కాన్వాయ్‌పై దాడి
-
మమతా బెనర్జీ మేనల్లుడి కాన్వాయ్‌పై దాడి
అగర్తల: టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ కాన్వాయ్‌పై దాడి జరిగింది. అది కూడా వేరే రాష్ట్రంలో. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఆ వివరాలు.. డైమండ్ హర్బర్ టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ సోమవారం త్రిపుర అగర్తలలో పర్యటించారు. ఈ క్రమంలో ఆయన కాన్వాయ్‌పై కొందరు వ్యక్తులు దాడి చేశారు. బీజేపీ నేతలే కావాలని తనపై దాడి చేయించారని అభిషేక్ బెనర్జీ ఆరోపించారు. ఈ మేరకు అభిషేక్ బెనర్జీ ట్విటర్లో ‘‘బీజేపీ నాయకత్వంలోని త్రిపురలో ప్రజాస్వామ్యం ఇలా ఉంది. విప్లవ్ దేవ్ మీరు రాష్ట్రాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లారు.. మిమ్మల్ని అభినందిస్తున్నాను’’ అంటూ తన కాన్వాయ్‌పై జరిగిన దాడికి సంబంధించిన వీడియోని ట్విటర్లో పోస్ట్ చేశారు. దీనిలో అభిషేక్ బెనర్జీ ప్రయాణిస్తున్న రోడ్డు పక్కన.. కొందరు వ్యక్తులు నిలుచుని ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం వీడియోలో చూడవచ్చు. వీరిలో కొందరి చేతిలో బీజేపీ జెండా ఉంది. కాన్వాయ్ అలా ముందుకు వెళ్తుండగా.. ఓ వ్యక్తి కర్రతో అభిషేక్ బెనర్జీ ప్రయాణిస్తున్న వాహనంపై దాడి చేశాడు. వేరే రాష్ట్రంలో పర్యటిస్తున్న తమ ఎంపీ కాన్వాయ్‌పై దాడి చేయడాన్ని టీఎంసీ నాయకులు ఖండించారు. ఈ క్రమంలో టీఎంసీ రాజ్యసభ ఎంపీ డెరెక్ ఓ బ్రెయిన్ అభిషేక్ బెనర్జీ కాన్వాయ్‌పై జరిగిన దాడిని ఖండించడమేకాక ఈ విషయాన్ని పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. అభిషేక్ బెనర్జీ త్రిపురలో పర్యటిస్తుండటంతో.. అగర్తలలో బీజేపీ కార్యకర్తలు తమ పార్టీ పోస్టర్లను చించేశారని టీఎంసీ నాయకులు ఆరోపించారు. -
అభిషేక్ బెనర్జీ భార్య, మరదలికి సీబీఐ నోటీసు
న్యూఢిల్లీ/కోల్‌కతా: త్వరలో శాసనసభ ఎన్నికలు జరుగనున్న పశ్చిమ బెంగాల్లో రాజకీయ వేడి రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభిషేక్ బెనర్జీ భార్య రుజీరా బెనర్జీకి, మరదలు మేనకా గంభీర్‌కు కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) ఆదివారం నోటీసు జారీ చేసింది. బొగ్గు అక్రమ తవ్వకం, దొంగతనం కేసులో విచారణకు సహకరించాలని పేర్కొంది. సీబీఐ బృందం కోల్‌కతాలోని అభిషేక్ బెనర్జీ భార్య, మరదలి నివాసాలకు వెళ్లి, నోటీసు అందజేసింది. పశ్చిమ బెంగాల్లో కునుస్తోరియా, కజోరా ప్రాంతాల్లోని ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌కు(ఈసీఎల్) చెందిన బొగ్గు గనుల్లో బొగ్గును అక్రమంగా తవ్వుకొని, స్వాహా చేశారని ఆరోపిస్తూ సీబీఐ గత ఏడాది నవంబర్‌లో పలువురిపై కేసు నమోదు చేసింది. నిందితుల్లో ఈసీఎల్ జనరల్ మేనేజర్, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్, సెక్యూరిటీ ఇన్చార్జి తదితరులు ఉన్నారు. ఈ వ్యవహారంతో రుజీరా బెనర్జీకి, మేనకా గంభీర్‌కు కూడా సంబంధం ఉన్నట్లు సీబీఐ గుర్తించింది. విచారణకు సహకరించాలంటూ తాజాగా నోటీసు జారీ చేసింది. సోమవారం విచారించే అవకాశం ఉందని, ఈ కేసుకు సంబంధించి కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుందని నోటీసులో పేర్కొంది. అలాగే పశువుల స్మగ్లింగ్ కేసులో అభిషేక్ బెనర్జీకి సన్నిహితుడైన వినయ్ మిశ్రాకు సీబీఐ సమన్లు జారీ చేసింది. బీజేపీకి లొంగే ప్రసక్తే లేదు తన భార్యకు సీబీఐ నోటీసు ఇవ్వడం పట్ల అభిషేక్ బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టంపై తమకు నమ్మకం ఉందని చెప్పారు. కేసులతో తమను బెదిరించలేరని బీజేపీ పెద్దలను హెచ్చరించారు. బీజేపీకి లొంగిపోయే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న బీజేపీకి వచ్చే ఎన్నికల్లో బెంగాల్ ప్రజలు తగిన బుద్ధి చెబుతారని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. బీజేపీ నుంచి మిత్రపక్షాలన్నీ దూరమయ్యాయని, ఇప్పుడు సీబీఐ, ఈడీ మాత్రమే బీజేపీ కూటమిలో ఉన్నాయని విమర్శించింది. బొగ్గు దొంగతనం కేసులో సీబీఐ విచారణను తృణమూల్ కాంగ్రెస్ రాజకీయం చేస్తోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాశ్ విజయ్‌వర్గీయా ఆరోపించారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని, తప్పు చేసిన వారు ఎంతటివారైనా శిక్ష అనుభవించాల్సిందేనని తేల్చిచెప్పారు. -
అమిత్ షాకు బెంగాల్ కోర్టు సమన్లు
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తలమునకలైన కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు భారీ షాక్ తగిలింది. రాష్ట్రంలోని ప్రజా ప్రతినిధుల(ఎంపీ, ఎమ్మెల్యే) కోర్టు శుక్రవారం అమిత్ షాకు సమన్లు జారీ చేసింది. ఈ నెల 22న వ్యక్తిగతంగా లేదా లాయర్ ద్వారా కోర్టు ముందు హాజరుకావాలని ఆదేశించింది. టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ అమిత్ షాపై దాఖలు చేసిన పరువు నష్టం కేసుకు సంబంధించి కోర్టు ఈ సమన్లు జారీ చేసింది. ఈ సందర్భంగా ‘‘ఫిబ్రవరి 22న ఉదయం 10 గంటలకు అమిత్ షా వ్యక్తిగతంగా లేదా న్యాయవాది ద్వారా కోర్టు ముందు హాజరు కావాలి’’ అని బిధన్నగర్ లోని ఎంపీ, ఎమ్మెల్యే కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి ఆదేశించారు. అంతేకాక అమిత్ షా మీద ఐపీసీ సెక్షన్ 500 కింద నమోదైన పరువు నష్టం కేసులో సమాధానం ఇవ్వాలని తెలిపారు. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ వేసిన పరువునష్టం కేసుకు సంబంధించి కోర్టు ఈ నోటీసులు జారీ చేసింది. 2018 ఆగస్టు 11న కోల్‌కతాలో మాయో రోడ్లో బీజేపీ చేపట్టిన ఓ ర్యాలీలో టీఎంసీ ఎంపీ బెనర్జీని కించపరిచేలా అమిత్ షా వ్యాఖ్యలు చేశారని.. బెనర్జీ లాయర్ సంజయ్ బసు ప్రెస్ నోట్లో పేర్కొన్నారు. చదవండి: దమ్ముంటే నా మేనల్లుడిపై పోటీ చేయ్ -
దమ్ముంటే నా మేనల్లుడిపై పోటీ చేయ్
కోల్కత్తా: అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తుండడంతో పశ్చిమ బెంగాల్లో రాజకీయాలు సెగ పుట్టిస్తున్నాయి. తాజాగా తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా మధ్య విమర్శల జోరు నడుస్తోంది. పరివర్తన్ యాత్రలో అమిత్ షా మమతా మేనల్లుడు అభిషేక్ బెనర్జీ లక్ష్యంగా విమర్శలు చేయగా దానికి మమతా ధీటుగా స్పందిస్తున్నారు. తాజాగా తన మేనల్లుడిపై ఆరోపణలు చేస్తున్న అమిత్ షాకు సవాల్ విసిరారు. దమ్ముంటే నా అల్లుడు అభిషేక్ బెనర్జీపై అమిత్ షా పోటీ చేయాలని కోరారు. ఆ తర్వాత నాపై పోటీ చేయండి అని సలహా ఇచ్చారు. మొదట అభిషేక్ బెనర్జీపై పోటీ చేసి గెలిచి చూపించాలని సవాల్ విసిరారు. గురువారం దక్షిణ 24 పరగణాల జిల్లా పైలాన్‌లో జరిగిన ప్రచార కార్యక్రమంలో మమతా బెనర్జీ మాట్లాడారు. రాజ్యసభకు వెళ్లే అవకాశం ఉన్నా ప్రజా తీర్పు కోసం తన అల్లుడు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశాడని వివరించారు. అమిత్ షా చేస్తున్న విమర్శలను తిప్పికొట్టారు. తన అల్లుడిపై విమర్శలు చేసే ముందు మీ కుమారుడు 2019లో చేసిన ఘన కార్యంపై స్పందించాలని మమతా విజ్ఞప్తి చేశారు. బీసీసీఐ కార్యదర్శిగా ఉండి కోట్లాది రూపాయలు దోచుకోలేదా అని ప్రశ్నించారు. అతడిని రాజకీయాల్లోకి తీసుకొచ్చే దమ్ము ఉందా? నిలదీశారు. ఈ విధంగా తృణమూల్, బీజేపీ మధ్య విమర్శల వాన కురుస్తోంది. ఇరు పక్షాలు ఒకరిపై ఒకరు ప్రత్యారోపణలు చేసుకుంటూ రాష్ట్రంలో సెగలు పుట్టిస్తున్నారు. ఆ ఒక్కటి కూడా కాంగ్రెస్‌కే: బీజేపీకి సున్నా పుదుచ్చేరి సంక్షోభం: గవర్నర్ కీలక నిర్ణయం -
నిరూపిస్తే బహిరంగంగా ఉరి వేసుకుంటా; ఎంపీ సవాల్
కోల్కత్తా: పశ్చిమబెంగాల్ రాజకీయాల్లో బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ మధ్య తీవ్ర వివాదం కొనసాగుతోంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, డైమండ్ హర్బర్ ఎంపీ అభిషేక్ బెనర్జీ స్పందించి బీజేపీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బెంగాల్లో కుటుంబపాలన కొనసాగుతోందని విమర్శిస్తున్నబీజేపీకి అభిషేక్ ఒక సంచలన సవాల్ విసిరారు. ‘‘ఒక కుటుంబం నుంచి ఒకరే రాజకీయాల్లోకి రావాలనే చట్టాన్ని తీసుకొచ్చే ధైర్యం బీజేపీకి ఉందా? అని ప్రశ్నించారు. అలాంటి చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటాను’’ అని సంచలన ప్రకటన చేశారు. ‘‘తనపై చేస్తున్న అవినీతి ఆరోపణలు నిరూపిస్తే బహిరంగంగా తనకు తానే ఉరేసుకుంటా’’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. కోల్‌కతాలో ఆదివారం జరిగిన ఎన్నికల ర్యాలీలో అభిషేక్ బెనర్జీ మాట్లాడారు. వారసత్వ రాజకీయాలపై మాట్లాడే బీజేపీలో కైలాష్ విజయ్‌వర్గీయ నుంచి సువేందు అధికారి, ముకుల్ రాయ్ నుంచి రంజిత్‌సింగ్ వరకు ఈ నేతల కుటుంబసభ్యులంతా బీజేపీలోని ముఖ్యమైన పదవులను అనుభవించడం లేదా? అని ప్రశ్నించారు. ఒకవేళ ఒక కుటుంబం నుంచి ఒక్కరే క్రియాశీల రాజకీయాల్లో ఉండాలని చట్టం తీసుకొస్తే.. మా కుటుంబం నుంచి సీఎం మమతా బెనర్జీ మాత్రమే టీఎంసీలోఉంటారని.. తాను వాగ్దానం చేస్తున్నట్లు తెలిపారు. పశ్చిమబెంగాల్ అసెంబ్లీకి కొద్ది నెలల్లో ఎన్నికలు రాబోతుండడంతో రాజకీయం వేడెక్కింది. ప్రధానంగా తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని మమతాబెనర్జీ తీవ్ర ప్రయత్నాలు చేస్తుండగా.. ఎలాగైనా బెంగాల్లో కాషాయ జెండా ఎగురవేయాలని బీజేపీ భావిస్తోంది. దీంతో ఈ రెండు పార్టీల మధ్య యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. -
బెంగాల్ ఫైట్: బీజేపీ నేత సువేందు అధికారికి నోటీసులు
కోల్‌కతా: బీజేపీ నేత సువేందు అధికారి తనపై చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలపై తృణమూల్ కాంగ్రెస్ నేత అభిషేక్ బెనర్జీ మండిపడ్డారు. జనవరి 19న ఖేజూరిలో జరిగిన బహిరంగ సభలో తన పరువుకు భంగం కలిగే విధంగా అసత్యమైన ప్రకటనలు చేశారని ఆరోపిస్తూ సువేందు అధికారికి లీగల్ నోటీసులు పంపారు. 36 గంటల్లో బేషరతుగా క్షమాపణ చెప్పకపోతే, అతనిపై చట్టపరమైన చర్యలను ప్రారంభిస్తామని అభిషేక్ బెనర్జీ తరపున లాయర్ పేర్కొన్నారు. క్రిమినల్ కేసుల్లో నిందితుడైన సువేందు.. తనపై నిరాధారమైన ఆరోపణలు చేయడం ఏంటని అభిషేక్ ప్రశ్నించారు. అహంకారంతో విర్రవీగుతున్న సువేందు.. ప్రజలకు వ్యతిరేకంగా చేసిన నేరాలను మరిచిపోయారని ధ్వజమెత్తారు. శారదా చిట్ ఫండ్ స్కాం, నారద లంచం కేసుల్లో సువేందు ప్రమేయాన్ని నోటీసుల్లో ప్రస్థావించారు. అభిషేక్ బెనర్జీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి స్వయానా మేనల్లుడు. కాగా, గతంలో టీఎంసీ కీలక నేతల్లో ఒకరైన సువేందు.. మమతా బెనర్జీ ప్రభుత్వంలో కీలక మంత్రిగా వ్యవహరించారు. ఆయన ఇటీవలే టీఎంసీని వీడి బీజేపీలో చేరారు. సువేందుతో పాటు పలువురు టీఎంసీ నేతలు కమల తీర్ధం పుచ్చుకున్నారు. త్వరలో బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో.. అధికార టీఎంసీ, భాజపాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మమతను గద్దె దించడమే లక్ష్యంగా బీజేపీ అగ్రనేతలు పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగానే అధికార పార్టీ ఎమ్మెల్యేలను ఒక్కొక్కరిగా తమ పార్టీలో చేర్చుకుంటున్నారు. -
ఆ వైరస్ పీడ విరగడైంది.. సంతోషం: ఎంపీ
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసీ), బీజేపీల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. పరస్పర విమర్శలు, ఆరోపణలతో ఇరువర్గాలు రాజకీయ వేడిని పెంచుతున్నాయి. ఈ క్రమంలో టీఎంసీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, ఎంపీ అభిషేక్ బెనర్జీ, బీజేపీ నేత సువేందు అధికారిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నారద, శారద పోంజి స్కాం వంటి కుంభకోణాల్లో తనకు భాగస్వామ్యం లేదంటూ తనపై చేసిన ఆరోపణలను తిప్పికొట్టారు. తాను అధికార దుర్వినియోగానికి పాల్పడ్డానని రుజువు చేస్తే బహిరంగంగా ఉరివేసుకోడానికి సిద్ధమని సవాల్ విసిరారు. కాగా ఇటీవలే టీఎంసీని వీడి బీజేపీలో చేరిన సీనియర్ నేత సువేందు.. పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాలో ఆదివారం జరిగిన ఓ ర్యాలీలో ప్రసంగిస్తూ.. అభిషేక్ బెనర్జీపై విమర్శలు గుప్పించారు. తోలాబాజ్(అధికార దుర్వినియోగానికి పాల్పడి బలవంతపు వసూళ్లు చేసేవాడు) అంటూ విరుచుకుపడ్డారు. అలాంటి వాళ్లను రాష్ట్రం నుంచి తరిమికొట్టాలంటూ పిలుపునిచ్చారు. ఇక తన నియోజకవర్గమైన డైమండ్ హార్బర్లో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న అభిషేక్ బెనర్జీ సువేందు వ్యాఖ్యలకు దీటుగా బదులిచ్చారు. పార్టీకి వెన్నుపోటు పొడిచిన వారికి తనను విమర్శించే హక్కులేదన్నారు. (చదవండి: 21 ఏళ్లు.. అందుకు సిగ్గుపడుతున్నా!) ఈ మేరకు.. ‘‘లక్షణాలు బయటపడని కోవిడ్-19 రోగులు మన పార్టీలో చాలా మందే ఉండేవారు. వారి కార్యకలాపాలను మేం ట్రేస్ చేశాం. వారిని గుర్తించాం. 2019 లోక్‌సభ ఎన్నికల నాటి నుంచి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ, పార్టీని నాశనం చేసేందుకు ప్రయత్నించిన వైరస్ వెళ్లిపోవడం పట్ల నాకు చాలా సంతోషంగా ఉంది. నిజమైన తోలాబాజే నన్ను ఆ మాట అంటున్నారు. శారద స్కాంలో ఆయన పేరు బయటకి వచ్చింది. ఒక్క విషయం చెప్పనా ఫ్రెండ్.. నేను నారద, శారద కుంభకోణాల్లో భాగస్వామిని కాను. ఈడీ, సీబీఐ నాపై దాడులు చేసినా ప్రతిఫలం ఉండదు. ఏం చేయాలనుకుంటున్నారో చేసుకోండి’’ అని సువేందుకు కౌంటర్ ఇచ్చారు. -
‘తల్లికి నమ్మకద్రోహం చేస్తే.. అధోగతే’
కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) సీనియర్ నాయకుడు, రవాణా శాఖ మంత్రి సువేందు అధికారి శుక్రవారం మమతా బెనర్జీ మంత్రి వర్గం నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘తాను పైకి ఎదగడానికి లిఫ్ట్ ఉపయోగించలేదని, పార్టీ కార్యకర్తలే తన బలమని, పారాచూట్ ఉపయోగించి కిందికి రాలేను’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలపై టీఎంసీ యూత్ వింగ్ చీఫ్, డైమండ్ హార్బర్ ఎంపీ అభిషేక్ బెనర్జీ తన నియోజకవర్గమైన సత్గాచియాలో జరిగిన బహిరంగ ర్యాలీలో స్పందిస్తూ.. టీఎంసీ పార్టీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ పార్టీ సభ్యులకు తల్లిలాంటిదన్నారు. పార్టీ సభ్యులు అంచెలంచెలుగా ఎదగడానికి, ప్రజల కోసం పని చేయడానికి ఆమె అవకాశం ఇచ్చారన్నారు. వ్యక్తిగత లాభాల కోసం ఎవరైనా తల్లి నమ్మకాన్ని వమ్ము చేస్తే, పార్టీకి నష్టం కలిగిస్తే అతను తల్లికి నమ్మకదోహం చేసినట్లా? కాదా? అని ప్రశ్నించారు. నమ్మకద్రోహం చేస్తే అది అతని పతనానికి నాందని ఆయన అన్నారు. (చదవండి: షాకింగ్‌గా ఉంది.. ఇలా జరగాల్సింది కాదు!) టీఎంసీ నిర్వహించిన రిజర్వేషన్ సమస్యల సమావేశంలో పశ్చిమ బెంగాల్‌లోని అనేక జిల్లాల్లో పట్టున్న నాయకుడు, ప్రముఖ ఎంపీ సౌగతా రాయ్‌తో సుబేందు రిజర్వేషన్లపై తన అభిప్రాయం పంచుకున్నారు. ఆయన వామపక్ష ఫ్రంట్‌ను ఓడించి మమతా బెనర్జీ అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించారు. నందిగ్రామ్ భూస్వామ్య వ్యతిరేక ఉద్యమానికి ఆయన వెన్నుముకగా నిలిచారు. అయితే కొంత కాలంగా టీఎంసీ పార్టీ కార్యకలాపాలకు సువేందు దూరంగా ఉంటున్నారు. -
అమిత్ షా వర్సెస్ టీఎంసీ
న్యూఢిల్లీ/కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం శ్రామిక్ రైళ్లను రాష్ట్రంలోకి ప్రవేశించకుండా అడ్డుకోవడం అన్యాయమని హోం మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఈ మేరకు బెంగాల్ సీఎం మమతకు లేఖ రాశారు. ‘వేరే ప్రాంతాల్లో చిక్కుకున్న కూలీలను సొంతూళ్లకు తీసుకువచ్చేందుకు కేంద్రం రైళ్లను ఏర్పాటు చేసింది. కానీ, బెంగాల్ ప్రభుత్వం మాకు సహకరించడం లేదు. ఆ రైళ్లను రాష్ట్రంలోకి అనుమతించడం లేదు. దీంతో కార్మికులు మరిన్ని కష్టాలు ఎదుర్కొంటున్నారు’ అని పేర్కొన్నారు. ఈ ఆరోపణలపై అధికార టీఎంసీ నేత, సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అయిన అభిషేక్ బెనర్జీ తీవ్రంగా స్పందించారు. ‘లాక్డౌన్ సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో ఘోరంగా విఫలమైన హోం మంత్రి.. బెంగాల్ ప్రజల సంక్షేమాన్ని గాలికొదిలేసిన ఆయన.. చాలా వారాల మౌనం తర్వాత గొంతు విప్పారు. ఆయన చెప్పేవన్నీ అబద్ధాలే. షా తన ఆరోపణలను రుజువు చేయాలి లేదా రాష్ట్ర ప్రభుత్వానికి క్షమాపణ చెప్పాలి’ అని ట్విట్టర్లో డిమాండ్ చేశారు. కర్ణాటక, తమిళనాడు, పంజాబ్, తెలంగాణల్లో ఉన్న రాష్ట్రానికి చెందిన వలస కూలీల తరలింపునకు ఇప్పటికే 8 రైళ్లను ఏర్పాటు చేశామనీ, ఇందులో మొదటిది త్వరలోనే హైదరాబాద్ నుంచి మాల్దాకు చేరుకోనుందని తెలిపారు. రాష్ట్రంలోకి వలస కార్మికులను రానివ్వడంలేదంటూ ఆరోపిస్తున్న అమిత్ షా..మహారాష్ట్రలో 16 మంది కూలీల మరణానికి రైల్వే మంత్రిని బాధ్యుణ్ని చేస్తారా అని టీఎంసీ ఎంపీ కకోలీ ఘోష్ దస్తీదార్ ప్రశ్నించారు. -
‘మోదీని ఆ దేవుడు కూడా కాపాడలేడు’
కోల్‌కతా : సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీకి ఓటమి తథ్యమని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ అన్నారు. ఓటమి నుంచి ఆయనను దేవుడు కూడా కాపాడలేడని వ్యాఖ్యానించారు. టీఎంసీ తరఫున ఎన్నికల బరిలో దిగిన అభిషేక్ డైమండ్ హార్బర్ నియోజవర్గం నుంచి పోటీచేస్తున్న సంగతి తెలిసిందే. ఆదివారం ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం ఆయన మాట్లాడుతూ...‘ ఈ ఎన్నికల్లో ఓడిపోకుండా ప్రధాని నరేంద్ర మోదీని ఆ దేవుడు కూడా రక్షించలేడు. ఆయనను అలాగే ధ్యానం చేసుకోనివ్వండి. బెంగాల్‌లోని 42 లోక్‌సభ సీట్లు గెలిచి క్లీన్‌స్వీప్ చేస్తామనే నమ్మకం ఉంది. మతతత్త్వ పార్టీ అయిన బీజేపీని తరిమికొట్టాలని ప్రజలు ఎప్పుడో నిర్ణయం తీసుకున్నారు’ అని పేర్కొన్నారు. కాగా ఓ ప్రచార కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోదీ తన ప్రతిష్టకు భంగం కలిగేలా మాట్లాడారంటూ అభిషేక్ ఆయనకు పరువు నష్టం నోటీసులు పంపించిన సంగతి తెలిసిందే. డైమండ్ హార్బర్లో అభిషేక్‌పై పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి నీలాంజన్ రాయ్‌కు మద్దతుగా మే 15న మోదీ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పశ్చిమబెంగాల్లో డెమోక్రసీ గూండాక్రసీగా మారిందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. టీఎంసీ గూండాలు మమత, అభిషేక్ ప్రజల జీవితాలను నరకప్రాయం చేశారంటూ మండిపడ్డారు. ఈ నేపథ్యంలో తనకు 36 గంటల్లోగా మోదీ క్షమాపణ చెప్పాలని, లేదంటే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. ఈ క్రమంలో తన లాయర్ ద్వారా నోటీసులు పంపించారు. -
మోదీకి పరువు నష్టం నోటీసులు
కోల్కత్తా: ప్రధాని నరేంద్ర మోదీకి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ పరువు నష్టం నోటీసులు ఇచ్చారు. ప్రచారంలో భాగంగా మోదీ తనపై నిరుపణలేని ఆరోపణలు చేశారని, వ్యక్తిగతంగా తనను కించపరిచేలా మాట్లాడారని తన న్యాయవాది ద్వారా నోటీసులు పంపారు. బెంగాల్‌లోని డైమండ్ హార్బర్లో ఈనెల 15న జరిగిన ఎన్నికల ర్యాలీలో అభిషేక్‌పై మోదీ తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసిన అభిషేక్ పరువునష్టం కేసు వేశారు. డైమండ్ హార్బర్ నియోజవర్గం నుంచి టీఎంసీ తరఫున అభిషేక్ బెనర్జీ పోటీచేస్తూండగా.. బీజేపీ నుంచి నీలాంజన్ రాయ్ బరిలో నిలిచారు. నీలాంజన్ రాయ్ తరఫున ఈనెల 15న ప్రచారం చేసిన మోదీ, మమతా, ఆమె మేనల్లుడు పాలనను చిత్రహింసల పాలనగా పేర్కొన్నారు. ప్రజలు బీజేపీకి వెన్నుదన్నుగా నిలిచి వారికి గట్టి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. 'పశ్చిమబెంగాల్లో గూండాక్రసీగా డెమోక్రసీ మారింది. టీఎంసీ గూండాలు ప్రజల జీవితాలను నరకప్రాయం చేశారు. గూండాక్రసీకి త్వరలో తెరపడనుంది' అని మోదీ అన్నారు. -
అల్లుడొచ్చాడు
మమత వారసుడు అభిషేక్ సాధారణ కుటుంబంలో పుట్టి రాజకీయాల్లో పోరాట పటిమతో అసాధారణ విజయాలు సాధించిన ఉక్కు మహిళ మమతా బెనర్జీ. రాజకీయాలు, అధికారం ఆమెకు వారసత్వంగా వచ్చినవి కావు. కాంగ్రెస్‌లో పార్టీ సహచరులతో ఒకపక్క, 34 ఏళ్లు వామపక్ష సర్కారుకు నేతృత్వం వహించిన సీపీఎంతో మరోపక్క ఎడతెగని పోరాటం చేశాక 2011లో మమత అధికారంలోకి వచ్చారు. మార్క్సిస్టులను పశ్చిమ బెంగాల్ అధికార పీఠం ‘రైటర్స్ బిల్డింగ్’ నుంచి కూలదోసి తన చిరకాల స్వప్నమైన ముఖ్యమంత్రి పదవిని ఆమె దక్కించుకున్నారు. కాంగ్రెస్ నుంచి వైదొలగి సొంత పార్టీ ఆలిండియా తృణమూల్ కాంగ్రెస్ స్థాపించిన 14 ఏళ్లలోపే సీఎం అయ్యారు. అత్త అండతో అందలం సీఎం అయిన ఏడాదికే ఆమె తన తమ్ముడు అమిత్ కొడుకు, మేనల్లుడు అభిషేక్ బెనర్జీని ఒకే ఒక నిర్ణయంతో 2012లో పార్టీ యువజన విభాగం అధ్యక్షుడిని చేయగలిగారు. పార్టీలో చేరిన వెంటనే పాతికేళ్ల యువకుడు అభిషేక్‌కు అంత పెద్ద బాధ్యతను మేనత్త అప్పగించారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో రాజధాని కోల్‌కతా సమీపంలోని డైమండ్ హార్బర్ నియోజకవర్గం నుంచి అభిషేక్‌ను తృణమూల్ అభ్యర్థిగా బరిలోకి దింపారు మమత. ఆయన తన తొలి ఎన్నికల పోరులో తన సమీప సీపీఎం ప్రత్యర్థి అబుల్ హస్నత్‌ను 71 వేలకు పైగా ఓట్లతో ఓడించారు. లోక్‌సభ సమావేశాలకు ఆయన హాజరు 28 శాతమే కానీ, పశ్చిమ బెంగాల్లో మేనత్త మమత ప్రాపకంతో అభిషేక్ తన స్థాయికి మించి అధికారం చెలాయిస్తున్నారు. రాజ్యాంగేతర శక్తి అనే ముద్ర ఇంకా ఆయనకు పడలేదు కానీ, ఆయన మాటను జవదాటే సాహసం పార్టీలో, ప్రభుత్వంలోనూ ఎవరికీ లేదు. 2019 ఎన్నికల్లో మళ్లీ డైమండ్ హార్బర్ నుంచే అభిషేక్ తృణమూల్ తరఫున బరిలోకి దిగుతున్నారు. ఈ స్థానంలో చివరి దశలో మే 19న పోలింగ్ జరుగుతున్న కారణంగా ఆయన రాష్ట్రంలోని ఇతర నియోజకవర్గాల్లో ఉధృతంగా పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నారు. మేనల్లుడి ప్రైవేటు సైన్యం ప్రభుత్వంలో, పార్టీలో అభిషేక్ పెత్తనం సాగుతుండడంతో సీపీఎం, బీజేపీ ఈ పరిణామంపై విరుచుకుపడుతున్నాయి. ‘ముఖ్యమంత్రి మమత బెంగాల్ ప్రభుత్వాన్ని ప్రైవేటు సైన్యంలా నడుపుతున్నారు. ఆమె మేనల్లుడు రాష్ట్రంలో భయోత్పాతం సృష్టిస్తున్నారు’ అని బీజేపీ నాయకుడు చెప్పారు. నెహ్రూ–గాంధీ కుటుంబం, ములాయం కుటుంబంతో పోలిస్తే బెనర్జీ కుటుంబం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బెంగాల్లో కుటుంబ పాలనకు కాస్త నెమ్మదిగానే పునాదులు పడుతున్నాయి. తనకు సీఎం కావడానికి ఎక్కువ సమయం పట్టడంతో చాలా వేగంగా తన మేనల్లుడికి పదవులు, అధికారం అప్పగిస్తున్నారు మమత. మేనల్లుడి దూకుడుగా ఎదిగే క్రమంలో తృణమూల్ బలోపేతం కావడానికి కష్టపడిన అనేక మంది సీనియర్ నేతలు పక్కకు తప్పుకోవాల్సి వస్తోంది. గతంలో తృణమూల్‌లో రెండో స్థానంలో అధికారం చెలాయించిన నేత ముకుల్ రాయ్ ఇటీవల రాజీనామా చేసి బీజేపీలో చేరారు. అభిషేక్‌ను అడ్డగోలుగా పైకి తీసుకురావడంతో నొచ్చుకున్న ముకుల్ పార్టీ నుంచి బయటికి పోవాల్సి వచ్చింది. జనవరిలో కోల్‌కతాలో ప్రతిపక్ష పార్టీల భారీ రాజకీయ ర్యాలీకి ఏర్పాట్లు చేయడానికి పార్టీ నేతలతో అనేక కమిటీలు ఏర్పాటు చేసినా తెర వెనుక ఈ వ్యవహారం నడిపించింది మాత్రం మమత మేనల్లుడే. మమతను భవిష్యత్తులో బీజేపీయేతర కూటమి ప్రధానిగా ప్రజలకు చూపించే ప్రయత్నాన్ని అభిషేక్ విజయవంతంగా పూర్తి చేశారు. తృణమూల్ వారసత్వ రాజకీయాలకు తెర తీసిందన్న ఆరోపణలు ఖండిస్తూ, ‘బీజేపీ మాదిరిగా కుటుంబ రాజకీయాలపై తృణమూల్‌కు నమ్మకం లేదు. బీజేపీ సీనియర్ నేతలు అమిత్‌షా, రాజ్‌నాథ్‌సింగ్, గోపీనాథ్ ముండే తమ కుటుంబ సభ్యులను పార్టీలోకి తీసుకొచ్చారు’ అంటూ అభిషేక్ వివరించారు. దక్షిణ కోల్‌కతాలో మమత పెరిగిన ఇంట్లోనే అభిషేక్ పెరిగి పెద్దవాడయ్యారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్లో ఆయన ఎంబీఏ (హ్యూమన్ రిసోర్స్ అండ్ మేనేజ్మెంట్) చదివారు. పాతికేళ్లకే తృణమూల్ కాంగ్రెస్ యువజన విభాగం నాయకత్వం లభించినా ఇంకా రాజకీయ యుక్తులు, నైపుణ్యాలు నేర్చుకునే దశలోనే అభిషేక్ ఉన్నారు. -
సీబీఐ తర్వాతి టార్గెట్ ఆయనే!
కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. శారదా చిట్‌ఫండ్ కుంభకోణంలో సీబీఐ తర్వాతి టార్గెట్ అభిషేక్ అని వార్తలు వస్తున్న నేపథ్యంలో బెంగాల్ ప్రభుత్వం ఈ మేరకు వ్యవహరించింది. దక్షిణ కోల్‌కతాలోని హరీశ్ ముఖర్జీ రోడ్డులో ఉన్న అభిషేక్ నివాసం ‘శాంతినికేతన్’ వద్ద భద్రతను పెంచింది. క్యూఆర్టీ దళం (క్విక్ రెస్పాన్స్ టీమ్), కానిస్టేబుల్స్ పాటు కనీసం ఆరుగురు అధికారులు ఎల్లప్పుడూ అభిషేక్ ఇంటి వద్ద గస్తీ కాస్తున్నారని పేరు చెప్పడానికి ఇష్టపడని అధికారి ఒకరు వెల్లడించారు. 30 అడుగుల ఎత్తులో రెండు పోలీసు పోస్ట్‌లను కూడా ఏర్పాటు చేసినట్టు చెప్పారు. సాయుధులతో కూడిన క్యూఆర్టీ బృందం నిరంతరం కాపలాగా ఉంటుందన్నారు. (శారదా మోసంలో ఎవరి వాటా ఎంత?) లోక్‌సభ ఎంపీ, తృణమూల్ యువజన విభాగం అధ్యక్షుడిగా ఉన్న అభిషేక్ నివాసం వద్ద ఇంత మంది పోలీసులను తాము ఎప్పుడూ చూడలేదని స్థానికులు చెబుతున్నారు. బారికేడ్లు, పోలీసుల వాహనాల కారణంగా తాము ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. ఈ వ్యవహారంపై స్పందించేందుకు అభిషేక్ అందుబాటులో లేరు. తృణమూల్ నేతలు మీడియా ముఖంగా మాట్లాడేందుకు ఇష్టపడటం లేదు. ‘మా పార్టీపై ఒత్తిడి పెంచేందుకు అభిషేక్‌ను సీబీఐ టార్గెట్ చేసిందని అందరికీ తెలుసు. శారదా కుంభకోణంతో ఆయన పేరు ఎక్కడా ప్రస్తావనకు రాలేదు. నారద స్టింగ్ ఆపరేషన్ దర్యాప్తులో సీబీఐ ఉద్దేశపూర్వకంగా తన ఎఫ్ఐఆర్ అభిషేక్ పేరు చేర్చింది. బీజేపీ ఆదేశానుసారమే ఇదంతా చేసింద’ని తృణమూల్ నాయకుడొకరు ఆరోపించారు. (కోల్‌కతాలో ‘దీదీ’గిరి!) నారద స్టింగ్ ఆపరేషన్ ఎఫ్ఐఆర్లో ఆరు చోట్ల అభిషేక్ పేరు ఉంది. ఇందులో 12 మంది ఎంపీలు, ఎమ్మెల్యేల పేర్లు ఉండటంతో తృణమూల్ కాంగ్రెస్ నేతలు వణుకుతున్నారు. శారదా స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న కోల్‌కతా పోలీసు కమిషనర్ రాజీవ్ కుమార్‌ను సీబీఐ అధికారులు శనివారం షిల్లాంగ్‌లో ప్రశ్నించారు. దాదాపు నాలుగు గంటల పాటు విచారణ కొనసాగింది. తమకు రాజీవ్ కుమార్ సహకరించలేదని సీబీఐ అధికారులు ఆరోపించారు. -
కిషన్‌జీని చంపింది మమత సర్కారే
తృణమూల్ ఎంపీ అభిషేక్ బెనర్జీ వ్యాఖ్యలు బెల్పహారి/కోల్‌కతా: మావోయిస్టు అగ్రనేత కిషన్‌జీ అలియాస్ మల్లోజుల కోటేశ్వరరావును మమతా బెనర్జీ ప్రభుత్వమే చంపిందంటూ ఆమె మేనల్లుడు, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2011, నవంబర్ 24న పశ్చిమ మిడ్నాపూర్ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో కిషన్‌జీ చనిపోయారంటూ గతంలో భద్రతా దళాలు, పశ్చిమబెంగాల్ ప్రభుత్వం చెబుతుండగా, తాజాగా అభిషేక్ అందుకు విరుద్ధమైన వ్యాఖ్యలు చేయడంతో మమత సర్కారు ఇరకాటంలో పడింది. దీనిపై మమత వివరణ ఇవ్వాలంటూ విపక్షాలు, హక్కుల సంఘాలు డిమాండ్ చేశాయి. ‘ఇంతకుముందు పత్రికలు తిరగేసినప్పుడు జంగల్‌మహల్‌లోని మరణాలపై నిత్యం కథనాలు కనిపించేవి. అయితే గత నాలుగేళ్ల కాలంలో ఒకే ఒక వ్యక్తి మరణించారు. ఆయన ఎవరో కాదు మావోయిస్టు నేత కిషన్‌జీనే. మమత ఆయనను చంపేసి రానున్న కాలంలో ప్రజలు చెప్పిందే అంతిమ తీర్పు అని రుజువుచేశారు’ అని అభిషేక్ శుక్రవారం రాత్రి బెల్పహారిలో జరిగిన సభలో చెప్పారు. ‘ప్రభుత్వం ఆయుధాలను వాడేది ప్రజల మంచి కోసమే. ఉగ్రవాదం కోసం కాదు’ అని ఆయన పేర్కొన్నారు. దీంతో విపక్షాలు మమత సర్కారుపై అగ్గిమీద గుగ్గిలమయ్యాయి. మమత అక్రమానికి పెట్టింది పేరని దీన్ని బట్టి స్పష్టమవుతోందని బీజేపీ నేత సిద్ధార్థ్నాథ్ సింగ్ మండిపడ్డారు. అభిషేక్ మాటలకు మమత కట్టుబడి ఉంటారా అని ఆయన నిలదీశారు. మమత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మావోయిస్టు నేత ఆజాద్ మరణంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారని, అయితే అధికారంలోకి వచ్చాక కిషన్‌జీని చంపేందుకు రాష్ట్ర బలగాలను వాడుకున్నారని దుయ్యబట్టారు. -
'మమ్మల్ని ఎదిరిస్తే.. కళ్లు పీకేసి, చేతులు నరికేస్తాం'
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తృణమాల్ కాంగ్రెస్ పాలనను ఎవరైనా ఎదిరిస్తే చేస్తే వారి కళ్లు పీకేసి, చేతులు నరికేస్తామని అభిషేక్ అన్నారు. తృణమాల్ కాంగ్రెస్ యూత్ విభాగం అధ్యక్షుడైన అభిషేక్ పార్టీ కార్యక్రమంలో మాట్లాడుతూ తృణమాల్ వ్యతిరేకులపై నిప్పులు చెరిగారు. బెంగాల్ ప్రజల ప్రయోజనాలను కాపాడటానికి మమతా బెనర్జీ, తృణమాల్ కాంగ్రెస్ శక్తివంచన లేకుండా కృషిచేస్తున్నారని అన్నారు. మమ్మల్ని ఎవరైనా ధిక్కరిస్తే వారి కళ్లు పీకేస్తామని హెచ్చరించారు. రోడ్డు మీదకు ఈడ్చి చేతులు నరికేస్తామని చెప్పారు. ఇదిలావుండగా, గత జనవరిలో ఓ ర్యాలీ సందర్భంగా ఓ యువకుడు అభిషేక్‌ను చెంపదెబ్బ కొట్టాడు. -
ఆచార్య పరిస్థితి విషమం: వైద్యులు
కోల్ కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీని చెంపదెబ్బ కొట్టిన దేబశిష్ ఆచార్య ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తామ్లక్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. అతడి తలకు తీవ్రగాయాలయ్యాయని వెల్లడించారు. మరో మూడు చోట్ల కూడా అతడికి గాయాలున్నాయని చెప్పారు. అందరూ చూస్తుండగా అభిషేక్ చెంపచెళ్లు మనిపించాడు ఆచార్య. దీంతో కోపోద్రిక్తులైన తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు ఆచార్యను చావబాదారు. తూర్పు మిడ్నాపూర్ జిల్లా చాందీపూర్ లో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా, తనను చెంపదెబ్బ కొట్టిన దేబశిష్ ఆచార్యను క్షమిస్తున్నానని అభిషేక్ బెనర్జీ అన్నారు. అతడు త్వరగా కోలువాలని ఆకాంక్షిస్తున్నట్టు ఫేస్ బుక్ ద్వారా తెలిపారు. -
మమత మేనల్లుడికి చెంపదెబ్బ
తామ్లక్: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీకి చేదు అనుభవం ఎదురైంది. పార్టీ కార్యకర్త ఒకరు ఆయన చెంప చెళ్లుమనిపించారు. తూర్పు మిడ్నాపూర్ జిల్లాలో చందీపూర్ లో ఆదివారం ర్యాలీలో పాల్గొన్నారు. ఆయన ప్రసంగిస్తుండగా హఠాత్తుగా వేదికపైకి వచ్చిన కార్యకర్త చెంపదెబ్బ కొట్టి పారిపోయేందుకు ప్రయత్నించాడు. పార్టీ కార్యకర్తలు అతడిని పట్టుకుని చితకొట్టారు. అతడిని ఆస్పత్రికి తరలించారు. తృణమూల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న అభిషేక్ పార్టీ కార్యకర్తలకు చేసిందేమీ లేదన్న ఆగ్రహంతో అతడీ చర్యకు పాల్పడ్డాడు.