ఆచార్య పరిస్థితి విషమం: వైద్యులు | Attacker of Mamata's nephew in critical condition | Sakshi
Sakshi News home page

ఆచార్య పరిస్థితి విషమం: వైద్యులు

Published Mon, Jan 5 2015 6:52 PM | Last Updated on Sat, Sep 2 2017 7:15 PM

అభిషేక్ బెనర్జీని చెంపదెబ్బ  కొట్టిన ఆచార్య

అభిషేక్ బెనర్జీని చెంపదెబ్బ కొట్టిన ఆచార్య

కోల్ కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీని చెంపదెబ్బ కొట్టిన దేబశిష్ ఆచార్య ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తామ్లక్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. అతడి తలకు తీవ్రగాయాలయ్యాయని వెల్లడించారు. మరో మూడు చోట్ల కూడా అతడికి గాయాలున్నాయని చెప్పారు.  

అందరూ చూస్తుండగా అభిషేక్ చెంపచెళ్లు మనిపించాడు ఆచార్య. దీంతో కోపోద్రిక్తులైన తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు ఆచార్యను చావబాదారు. తూర్పు మిడ్నాపూర్ జిల్లా చాందీపూర్ లో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా, తనను చెంపదెబ్బ కొట్టిన దేబశిష్ ఆచార్యను క్షమిస్తున్నానని అభిషేక్ బెనర్జీ అన్నారు. అతడు త్వరగా కోలువాలని ఆకాంక్షిస్తున్నట్టు ఫేస్ బుక్ ద్వారా తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement