
కోల్‌కతా: ఓపిక ఉన్నంత వరకు కాదు ఊపిరి ఉన్నంత వరకు తన ప్రయాణం తన మేనత్త, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీతోనేనని ఆమె మేనల్లుడు టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ స్పష్టం చేశారు. సీఎం మమతతో విభేదాలున్నాయన్న ప్రచారాన్ని ఖండించారు. గొంతు కోసినా బీజేపీలో చేరని పునరుద్ఘాటించారు.
వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ అధికార తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో తాను బీజేపీలో చేరనున్నారనే ప్రచారం జరుగుతోంది. నా మెడలు విరిచినా సరే ఆ పని చేయను’ అని స్పష్టం చేశారు.
కోల్‌కతాలోని నేతాజీ ఇండోర్ స్టేడియంలో గురువారం టీఎంసీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ అభిషేక్ బెనర్జీ తన రాజకీయ భవిష్యత్తు గురించి జరుగుతున్న ప్రచారంపై మాట్లాడారు.
VIDEO | TMC MP Abhishek Banerjee (@abhishekaitc) addresses party workers at Netaji Indoor Stadium, Kolkata. He says, "Till the time all of you are with us, we will continue to demolish BJP's 'chakravyuh'... Those who spoke ill about the party have been identified. I was the one… pic.twitter.com/4HeVzVAZVY
— Press Trust of India (@PTI_News) February 27, 2025
కొంతమంది నా గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వాళ్లెవరో నాకు తెలుసంటూ.. టీఎంసీ మాజీ నేతలు ముకుల్ రాయ్,సువేందు అధికారి పేర్లను ప్రస్తావించారు. నేను మోసగాణ్ని కాదు. నా మెడలు విరిచినా, నా నాలుక చీల్చినా బీజేపీలో చేరను. మమతా బెనర్జీ జిందాబాద్ అంటూ.. తనకు తన మేనత్త సీఎం మమతా బెనర్జీకి మధ్య విబేధాలున్నాయన్న ప్రచారాన్ని కొట్టి పారేశారు. ఓపిక ఉన్నంత వరకు కాదు ఊపిరి ఉన్నంత వరకు నేను టీఎంసీలోనే కొనసాగుతా. వచ్చే ఏడాది ఎన్నికలకు ముందు స్వార్థ ప్రయోజనాల కోసం స్వార్థరాజకీయాలు చేస్తున్న ముకుల్ రాయ్, సువేందు అధికారి ద్రోహులుగా అభివర్ణించారు.
అనంతరం,టీచర్ రిక్రూట్‌మెంట్ స్కాంలో తనని విచారణ చేపట్టేందుకు సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్ గురించి ప్రస్తావించారు. ప్రతిపక్ష నేతలతో సీబీఐ ఎలా వ్యవహరించిందో నాతో అలాగే వ్యవహరిస్తోంది. పాపం సీబీఐ ఏం చేస్తోంది? చెప్పండి. దాని రాజకీయ గురువుల ఆదేశానుసారం వ్యవహరిస్తోంది.
టీచర్ స్కాంలో తన గురించి ఒక్క ఆధారం బయటపెట్టలేదు. ఇదే విషయం గురించి సీబీఐని అడుగుతుంటే ఒక్క సమాధానం చెప్పడం లేదు. చెప్పడానికి సంకోచిస్తోంది. ఒక్కోసారి సీబీఐ తీరు చూస్తుంటే నాకు ఆశ్చర్యం వేస్తోంది. ఐదేళ్ల క్రితం ఇదే విషయం చెప్పా. ఇప్పుడు కూడా అదే చెబుతున్నాను. టీచర్ స్కాంలో నేను నేరస్తుడిని అని నిరూపిస్తూ సీబీఐ కోర్టుకు ఆధారాల్ని అందిస్తే నాకు నేనుగా ఉరివేసుకుంటాను’ అని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment