
మమత మేనల్లుడికి చెంపదెబ్బ
తామ్లక్: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీకి చేదు అనుభవం ఎదురైంది. పార్టీ కార్యకర్త ఒకరు ఆయన చెంప చెళ్లుమనిపించారు. తూర్పు మిడ్నాపూర్ జిల్లాలో చందీపూర్ లో ఆదివారం ర్యాలీలో పాల్గొన్నారు.
ఆయన ప్రసంగిస్తుండగా హఠాత్తుగా వేదికపైకి వచ్చిన కార్యకర్త చెంపదెబ్బ కొట్టి పారిపోయేందుకు ప్రయత్నించాడు. పార్టీ కార్యకర్తలు అతడిని పట్టుకుని చితకొట్టారు. అతడిని ఆస్పత్రికి తరలించారు. తృణమూల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న అభిషేక్ పార్టీ కార్యకర్తలకు చేసిందేమీ లేదన్న ఆగ్రహంతో అతడీ చర్యకు పాల్పడ్డాడు.