న్యూఢిల్లీ : ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసులో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. అభిషేక్ బెనర్జీ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించింది.
టీచర్ రిక్రూట్‌మెంట్ కేసులో ఈడీ జారీ చేసిన సమన్లను సవాల్ చేస్తూ అభిషేక్ బెనర్జీ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై సోమవారం (సెప్టెంబర్9)న సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ఈడీ తీరును సమర్థించింది. అభిషేక్ బెనర్జీ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది
అభిషేక్ బెనర్జీ దంపతులపై ఈడీ కేసు
ఎంపీ అభిషేక్ బెనర్జీ, ఆయన సతీమణి రుజీరా బెనర్జీ టీచర్ రిక్రూట్‌మెంట్ కుంభకోణంలో మనీ లాండరింగ్‌కు పాల్పడినట్లు ఈడీ ఆరోపిస్తుంది. టీచర్ కుంభణంలో ఎంపీ అభిషేక్ బెనర్జీ దంపతులకు పెద్దమొత్తంలో ముడుపులు అందాయని, కేసు విచారణ చేపట్టేందుకు ఢిల్లీకి రావాలని సమన్లు జారీ చేసింది.
ఢిల్లీకి రాలేను.. మీరే కోల్‌కతాకు రండి
ఇదే అంశంపై ఈడీ జారీ చేసిన సమన్లపై అభిషేక్ బెనర్జీ స్పందించలేదు. కేసు దర్యాప్తు చేసేందుకు ఢిల్లీకి రావాలంటూ సమన్లు ఇవ్వడాన్ని అభ్యంతరం వ్యక్తం చేశారు. కేసు విచారణను కోల్‌కతాలోని తన నివాసంలోనే విచారించాలని, ఢిల్లీకి రావాల్సిన అవసరం లేదని..ఈడీని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తాజాగా, విచారణ చేపట్టిన కోర్టు అభిషేక్ బెనర్జీ పిటిషన్‌ను కొట్టి వేసింది. దీంతో ఆయన ఢిల్లీలోనే ఈడీ విచారణను ఎదుర్కోనున్నారు.
నిధులు మళ్లించే..
పశ్చిమ బెంగాల్ ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసులో గతేడాది ఈడీ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో అభిషేక్ బెనర్జీ పేరును ప్రస్తావించింది. ఈడీ సమాచారం మేరకు.. ప్రభుత్వ పాఠశాలలో అక్రమ మార్గంలో ఉద్యోగం పొందేలా పలువురు అప్పటి అధికార టీఎంసీ నేతలకు డబ్బులు చెల్లించారు. ఆ నేతల్లో కుంతల్ ఘోష్ ఒకరు. కుంతల్ ఘోష్ తనకు అందిన ముడుపుల్ని అభిషేక్ బెనర్జీకి ఆర్థిక సంబంధిత వ్యవహారాలను నిర్వహించే సుజయ్ కృష్ణ భద్రకు అందించారు. ఆ డబ్బును ప్రైవేట్ కంపెనీలకు మళ్లించగా.. ఆ ప్రైవేట్ కంపెనీ డైరెక్టర్లలో ఎంపీ అభిషేక్ బెనర్జీ భార్య రుజీరా ఒకరని ఈడీ వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment