కోల్‌కతా: కోల్‌కతాలో ఆర్జీకార్ వైద్య కళాశాలలో వైద్య విద్యార్ధిని హత్యాచారం ఘటనలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో, ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ విభేదిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. సీబీఐ వెంటనే దర్యాప్తు చేసి బాధితురాలికి న్యాయం చేయాలంటూ సీఎం మమతా చేస్తున్న ర్యాలీలకు అతడు దూరంగా ఉండటం ఈ వాదనలకు మరింత బలం చేకూరుస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఆయన స్పందించారు.
ఆర్‌జీ కర్ ఆసుపత్రిలో జరిగిన హత్యాచార ఘటనపై నిరసనలు వ్యక్తమవుతోన్న తరుణంలో.. దేశంలో ఆ తరహాలో ఎన్నో కేసులు వెలుగు చూశాయని టీఎంసీ అగ్రనేత అభిషేక్ బెనర్జీ ఆందోళన వ్యక్తం చేశారు. అత్యాచార కేసుల్లో 50 రోజుల్లోగా విచారణ పూర్తి చేసి, దోషులకు శిక్షపడేలా చట్టాలు రావాలని డిమాండ్ చేశారు.
ఈ మేరకు ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ‘పది రోజులుగా ఆర్‌జీ కర్ ఆసుపత్రిలో జరిగిన ఘటనపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. న్యాయం కావాలంటూ వైద్యులు, ఇతరులు రోడ్లపై నినదిస్తున్నారు. ఈ దిగ్భ్రాంతికర నేరానికి వ్యతిరేకంగా ప్రజలు రోడ్లపై ఉన్న సమయంలోనే దేశంలో అలాంటివి మరో 900 కేసులు వెలుగులోకి వచ్చాయి.
రోజూ 90 అత్యాచార కేసులు నమోదవుతున్నాయి. వీటిని నిరోధించడానికి నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. కేవలం వాగ్దానాలకే పరిమితం కాకుండా 50 రోజుల్లోగా విచారణలు పూర్తయి శిక్షలు ఖరారయ్యేలా కఠిన చట్టాలు రావాలి. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి’’ అని పోస్టు పెట్టారు.
Over the past 10 days, while the nation has been protesting against the #RGKarMedicalcollege incident and demanding justice, 900 RAPES have occurred across different parts of India - DURING THE VERY TIME WHEN PEOPLE WERE ON THE STREETS PROTESTING AGAINST THIS HORRIBLE CRIME.…
— Abhishek Banerjee (@abhishekaitc) August 22, 2024
Comments
Please login to add a commentAdd a comment