బాలీవుడ్ నటుడు అభిషేక్ బెనర్జీ ప్రస్తుతం రెండు క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తున్నాడు. స్త్రీ 2 అనే కామెడీ హారర్ మూవీలో, రానా నాయుడు 2 అనే వెబ్‌సిరీస్‌లో ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. యాక్టర్‌గా ఫుల్ బిజీగా ఉన్న ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో అనేక విషయాలను పంచుకున్నాడు. 'యాక్టింగ్ ఇండస్ట్రీ అనేది ఎప్పుడూ కలర్‌ఫుల్‌గా ఉండదు. కొన్నిసార్లు ఒంటరిగా నడవాల్సి వస్తుంది. ఎన్నో విషయాలను ఒంటరిగానే నేర్చుకోవాల్సి వస్తుంది. నిరంతరం ప్రయత్నాలు చేస్తూనే ఉండాలి.
అందరూ అతిగా ఆశించరు
అలాగే ఇక్కడ ప్రతి ఒక్కరూ భారీ పారితోషికాలు ఆషించరు. కొందరు ఉన్నదాంతోనే సంతృప్తి పడతారు. నేను కొన్ని సినిమాలు, షోలకు కాస్టింగ్ డైరెక్టర్‌గానూ పని చేశాను. ఆ సమయంలో కొందరు స్టార్స్ చాలా భారీగా డిమాండ్ చేసేవారు. దీనివల్ల మిగతా నటులకు ఇవ్వడానికి డబ్బు మిగిలేది కాదు. అందుకే మన దగ్గరున్న బడ్జెట్‌ను దృష్టిలో పెట్టుకుని యాక్టర్స్‌ను పిలుద్దాం అని చిత్రయూనిట్‌కు చెప్పేవాడిని.
మంచి నటుల వల్ల విలువ..
ఆయా పెద్ద హీరోలకే ఎక్కువ డబ్బు ముట్టజెప్పడం వల్ల మంచి నటీనటులకు కూడా తగినంత డబ్బు అందేది కాదు. ఈ విషయం వారికి తెలుసో, లేదో నాకు తెలియదు. వాళ్ల వల్ల జనాలు టికెట్లు కొని థియేటర్‌కు వస్తారు. అదే సమయంలో మంచి యాక్టర్ వల్ల సినిమా విలువ పెరుగుతుంది. అలాంటివారికి తక్కువ డబ్బు ఇచ్చి పని చేయించుకోవడం కరెక్ట్ కాదు కదా! హీరో బాడీగార్డ్ కంటే నటుడికి తక్కువ జీతం ఇవ్వాల్సిన దుస్థితి రాకూడదు' అని అభిషేక్ చెప్పుకొచ్చాడు.
చదవండి: 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' గ్రాండ్ ఓపెనింగ్.. తొలిరోజు కలెక్షన్స్ ఎంతంటే?
Comments
Please login to add a commentAdd a comment