'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' గ్రాండ్ ఓపెనింగ్.. తొలిరోజు కలెక్షన్స్‌ ఎంతంటే? | Gangs Of Godavari Movie Day 1 Worldwide Box Office Collection | Sakshi
Sakshi News home page

Gangs Of Godavari Collection: ఫస్ట్ డే వసూళ్లలో రచ్చ లేపిన గ్యాంగ్స్

Jun 1 2024 11:13 AM | Updated on Jun 1 2024 11:26 AM

Gangs Of Godavari Movie Day 1 Worldwide Box Office Collection

విశ్వక్ సేన్ హీరోగా నటించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' థియేటర్లలోకి వచ్చేసింది. తొలిరోజు మిశ్రమ స్పందన వచ్చింది. కానీ వసూళ్లు మాత్రం దుమ్మరేపాయి. మరీ ముఖ్యంగా ఆంధ్రాలో ఈ సినిమాకు మంచి ఆదరణ దక్కింది. చాన్నాళ్లుగా సరైన మూవీస్ రిలీజ్ కాకపోవడం కూడా ఈ చిత్రానికి ప్లస్ అయింది. అలా గ్రాండ్ ఓపెనింగ్ లభించింది. ఇంతకీ 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' తొలిరోజు వసూళ్లు ఎంతంటే?

(ఇదీ చదవండి: 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' ఆ ఓటీటీలోనే.. వచ్చేది ఎప్పుడంటే?)

విశ్వక్ సేన్, నేహాశెట్టి, అంజలి కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాని పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్ స్టోరీతో తీశారు. ఇప్పటివరకు గోదావరి అంటే పచ్చని పొలాలు, చెరువులు లాంటివి చూపించేవారు. కానీ ఇందులో మాత్రం నరుక్కోవడం, చంపుకోవడం లాంటివి చూపించి షాకిచ్చారు. అయితే సినిమాలో సరిగా డ్రామా పండలేదని పలువురు ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఏదేమైనా సరే ఓ మాదిరి టాక్‌ సొంతం చేసుకున్న 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' చిత్రానికి తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.8.2 కోట్ల గ్రాస్ వచ్చినట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది. ఈ వీకెండ్‌ అయ్యేసరికి ఎన్ని కోట్ల గ్రాస్ వస్తుంది అనే దానిబట్టి లాభాల్లోకి వెళ్తుందా? లేదా అనేది తెలిసిపోతుంది.

(ఇదీ చదవండి: గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి మూవీ రివ్యూ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement