కలకత్తా: తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ప్రధాన కార్యదర్శి, సీఎం మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీ హెలికాప్టర్‌ను ఆదివారం(ఏప్రిల్14) ఇన్‌కమ్ ట్యాక్స్(ఐటీ) అధికారులు తనిఖీ చేశారు. కలకత్తాలోని బెహలా ఫ్లైయింగ్ క్లబ్‌లో ఈ తనిఖీలు జరిగాయి. హెలికాప్టర్ వెళ్లకుండా ఐటీ అధికారులు చాలా సేపు అడ్డుకున్నారని టీఎంసీ వర్గాలు తెలిపాయి.
తనిఖీల సందర్భంగా అభిషేక్ బెనర్జీ సెక్యూరిటీ సిబ్బందికి ఐటీ అధికారులకు మధ్య వాగ్వాదం జరిగింది. తనిఖీలపై అభిషేక్‌బెనర్జీ ట్విటర్(ఎక్స్)లో స్పందించారు.‘ఇటీవల ప్రజల ఆగ్రహానికి గురైన ఎన్‌ఐఏ స్థానిక డీజీ, ఎస్పీలను తొలగించకుండా నా హెలికాప్టర్‌లో తనిఖీలకు ఐటీ అధికారులను పంపించారు.
వారికి తనిఖీల్లో ఏం దొరకలేదు. జమీందార్లు ఎన్నిరకాల ఒత్తిళ్లు పెట్టినా బెంగాల్ తలవంచదు’ అని పోస్టులో బెనర్జీ పేర్కొన్నారు. అభిషేక్ బెనర్జీ ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో డైమండ్ హార్బర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌లో తొలి దశ పోలింగ్ ఏప్రిల్ 19న జరగనుంది.
ఇదీ చదవండి.. బీజేపీ మేనిఫెస్టోపై మల్లిఖార్జున ఖర్గే విమర్శలు
Comments
Please login to add a commentAdd a comment