![Modi Ki Guarantee Has Zero Warranty Says Abhishek Banerjee - Sakshi](/styles/webp/s3/article_images/2024/03/10/tmc-mamatha-benerjee.jpg.webp?itok=bfQGIpZ2)
మోదీ గ్యారెంటీలకు జీరో వారంటీ ఉందని 'జన గర్జన్ సభ' ర్యాలీ సందర్భంగా టీఎంసీ నాయకుడు 'అభిషేక్ బెనర్జీ' అన్నారు. బీజేపీ నాయకులు బయటి వ్యక్తులని, బెంగాల్ వ్యతిరేకులని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో మాత్రమే రాష్ట్రాన్ని సందర్శిస్తారని అభిషేక్ వ్యాఖ్యానించారు.
ఎన్నికల సమయంలో మాత్రమే వారికి రాష్ట్రం గుర్తొస్తుంది, వారందరికీ రాష్ట్ర ప్రజలు తగిన సమాధానం చెబుతారని అభిషేక్ బెనర్జీ వెల్లడించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న టీఎంసీ మాత్రమే.. హామీలను నిలబెట్టుకుంటుందని పేర్కొన్నారు. బీజేపీ ఇప్పటికే రాష్ట్రానికి రావాల్సిన నిధులను నిలిపేశారని అన్నారు.
తృణమూల్ కాంగ్రెస్ తన లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని ఈ రోజు (ఆదివారం) గ్రాండ్ ర్యాలీ నుంచి ప్రారంభించింది. తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధినేత్రి 'మమతా బెనర్జీ' పశ్చిమ బెంగాల్‌లో రాబోయే లోక్‌సభ ఎన్నికలకు మొత్తం 42 మంది అభ్యర్థుల పేర్లను నేడు ప్రకటించనుంది.
Comments
Please login to add a commentAdd a comment