
కలకత్తా: పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్‌లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై బీజేపీ సీనియర్ నేత 'దిలీప్ ఘోష్' చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఘోష్ వ్యాఖ్యలపై తృణమూల్ కాంగ్రెస్ నేతలు మండి పడ్డారు.
తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 504, 509 సెక్షన్ల కింద దుర్గాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు (ఎఫ్‌ఐఆర్) నమోదైంది. ఘోష్ వ్యాఖ్యలు వైరల్ అయిన తరువాత ముఖ్యమంత్రి పట్ల తనకు వ్యక్తిగత శత్రుత్వం లేదని క్షమాపణలు చెప్పారు.
''మమత బెనర్జీ గోవా వెళ్లి గోవా బిడ్డను అంటుంది, త్రిపుర వెళ్లి త్రిపుర బిడ్డనంటుంది, బెంగాల్‌లో బెంగాల్ బిడ్డను అంటుంది. అసలు తన తండ్రి ఎవరో ముందు మమత నిర్ణయించుకోవాలి'’ అని ఘోష్ వ్యాఖ్యానించడం వల్ల ఈ రోజు అతనిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. అంతే కాకుండా టీఎంసీ ఫిర్యాదు మేరకు దిలీప్ ఘోష్‌కు ఈసీ షోకాజ్ నోటీసులు జారీ చేసి మార్చి 29 సాయంత్రం లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. ఘోష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి కాదు.
Case registered against West Bengal BJP MP Dilip Ghosh in Durgapur PS under sections 504 and 509 of the Indian Penal Code over his remarks on CM Mamata Banerjee.
— ANI (@ANI) March 28, 2024