Dilip Ghosh
-
పోలింగ్ ఏజెంట్లను బూత్‌లలోకి రానివ్వడం లేదు: దిలీప్ ఘోష్
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని వర్ధమాన్ - దుర్గాపూర్ లోక్‌సభ నియోజకవర్గానికి నాలుగో దశ పోలింగ్ సోమవారం ప్రారంభం కాగానే, ఆ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి దిలీప్ ఘోష్.. టీఎంసీ గూండాలు పోలింగ్ ఏజెంట్లను బూత్‌లలోకి రానివ్వడం లేదని ఆరోపించారు.నిన్న రాత్రి ప్రిసైడింగ్ అధికారితో సహా పోలింగ్ ఏజెంట్లను బూత్‌లలోకి రానివ్వడం లేదని, పరిస్థితి చక్కబడేలా.. ఓటింగ్ సజావుగా జరిగేలా చూడాలని దిలీప్ ఘోష్ అన్నారు. ప్రతి బూత్ దగ్గర పోలీస్ బలగాలు ఉన్నప్పటికీ టీఎంసీ నేతలు ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని అన్నారు.వర్ధమాన్-దుర్గాపూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన కీర్తి ఆజాద్, సీపీఐ(ఎం)కి చెందిన సుకృతి ఘోషల్ పోటీ చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో ఈరోజు ఎనిమిది స్థానాలకు పోలింగ్ జరుగుతుంది.2014 లోక్‌సభ ఎన్నికలలో, పశ్చిమ బెంగాల్లో టీఎంసీ 34 స్థానాల్లో గెలిచింది. అయితే అప్పుడు బీజేపీ కేవలం 2 సీట్లను మాత్రమే సొంతం చేసుకోగలిగింది. సీపీఐ(ఎం) 2, కాంగ్రెస్ 4 స్థానాల్లో విజయం సాధించాయి. ఈ సారి బీజేపీ మరిన్ని స్థానాల్లో గెలుపొందటానికి ప్రయత్నిస్తోంది. -
దిలీప్ ఘోష్‌పై కేసు నమోదు - కారణం ఇదే..
కలకత్తా: పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్‌లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై బీజేపీ సీనియర్ నేత 'దిలీప్ ఘోష్' చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఘోష్ వ్యాఖ్యలపై తృణమూల్ కాంగ్రెస్ నేతలు మండి పడ్డారు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 504, 509 సెక్షన్ల కింద దుర్గాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు (ఎఫ్ఐఆర్) నమోదైంది. ఘోష్ వ్యాఖ్యలు వైరల్ అయిన తరువాత ముఖ్యమంత్రి పట్ల తనకు వ్యక్తిగత శత్రుత్వం లేదని క్షమాపణలు చెప్పారు. ''మమత బెనర్జీ గోవా వెళ్లి గోవా బిడ్డను అంటుంది, త్రిపుర వెళ్లి త్రిపుర బిడ్డనంటుంది, బెంగాల్లో బెంగాల్ బిడ్డను అంటుంది. అసలు తన తండ్రి ఎవరో ముందు మమత నిర్ణయించుకోవాలి'’ అని ఘోష్ వ్యాఖ్యానించడం వల్ల ఈ రోజు అతనిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. అంతే కాకుండా టీఎంసీ ఫిర్యాదు మేరకు దిలీప్ ఘోష్‌కు ఈసీ షోకాజ్ నోటీసులు జారీ చేసి మార్చి 29 సాయంత్రం లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. ఘోష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి కాదు. Case registered against West Bengal BJP MP Dilip Ghosh in Durgapur PS under sections 504 and 509 of the Indian Penal Code over his remarks on CM Mamata Banerjee. — ANI (@ANI) March 28, 2024 -
కంగనా, మమతపై వివాదాస్పద వ్యాఖ్యలు.. ఈసీ షోకాజ్ నోటీసులు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ మహిళా నేత సుప్రియా శ్రీనాథే, బీజేపీ నేత దిలీప్ ఘోష్‌లకు కేంద్ర ఎన్నికల సంఘం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. మహిళలను కించపరిచేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈసీ ఈ చర్యలు చేపట్టింది. ఇది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్(ఎన్నికల కోడ్)ని ఉల్లంఘించినట్లు ఈసీ తెలిపింది. మార్చి 29 సాయంత్రం 5 గంటల వరకు సుప్రియా శ్రీనాథే, దిలీప్‌ఘోష్ తమ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని పేర్కొంది. కాగా హిమాచల్ ప్రదేశ్‌లోని మండి స్థానం నుంచి కంగనా రనౌత్‌ను బీజేపీ ఎన్నికల బరిలోకి దించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కంగనా అభ్యర్ధిత్వాన్ని వ్యతిరేకిస్తూ సుప్రియా శ్రీనాథే సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆమె వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద దుమారమే రేపాయి. అనంతరం ఆమె ట్వీట్‌కు కంగనా ధీటుగా బదులిచ్చారు. అయితే ఆ పోస్టు తాను చేయలేదని, తన సోషల్ మీడియా అకౌంట్ యాక్సెస్ కలిగిన ఎవరో చేసి ఉంటారని సుప్రియా తెలిపారు. మరోవైపు పశ్చిమ బెంగాల్ బీజేపీ మాజీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ కూడా మహిళా గౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేయడంపై ఎన్నికల సంఘం సీరియస్ అయింది. బర్ధమాన్-దుర్గాపూర్ లోక్‌సభ స్థానం నుంచి లోక్‌సభ బరిలో నిలిచచిన దిలీప్ ఘోష్ తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ కుటుంబ నేపథ్యాన్ని ఎగతాళి చేశారు. రాష్ట్ర కుమార్తెగా చెప్పుకుంటున్న మమతా..ముందుగా తన తండ్రి ఎవరో నిర్ణయించుకోవాలని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే మహిళల గౌరవాన్ని తగ్గిస్తూ.. అభ్యంతరకరమైన, అవమానకరమైన వ్యాఖ్యలు చేశారంటూ ఇరు నేతలకు ఈసీ షోకాజ్ నోటీసులు ఇచ్చింది. చదవండి: సీఎం పినరయ్ విజయన్ కుమార్తెపై మనీ లాండరింగ్ కేసు -
‘ఇండియా కూటమి ఎక్కడ? అందరూ వెళ్లిపోతున్నారు’
ప్రతిపక్ష ‘ఇండియా కూటమి’లో ఒక్కొక్కరుగా తమ పార్టీలు వైదొలుగుతన్నట్లు ప్రకటించటం వల్ల కాంగ్రెస్ ఢీలా పడిపోతుంది. ఇదే సమయంలో ఇండియా కూటమిపై బీజేపీ నేతలు విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ప్రతిపక్షాల ‘ఇండియా కూటమి’ ఎక్కడ ఉందని బీజేపీ ఎంపీ దిలీప్ ఘోష్ ప్రశ్నించారు. బెంగాల్లో టీఎంసీ, పంజాబ్‌లో ఆప్.. ఇండియా కూటమి నుంచి బయటకు వచ్చి ఒంటరిగా పోటీ చేస్తామన్న విషయం తెలిసిందే. మరోవైపు బిహార్‌లో కూడా నితీష్ కుమార్ ‘ఇండియా కూటమి’కి గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరి మళ్లీ సీఎం అవుతారని విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష ‘ఇండియా కూటమి’పై బీజేపీ ఎంపీ దిలీప్ ఘోష్ తీవ్ర విమర్శలు చేశారు. ‘ఇండియా కూటమి ’ అనేది దేశంలోని ఓటర్లలో అపనమ్మకాలను సృష్టించి.. వారిని మోసం చేయడానికే ఏర్పాటు చేశారని మండిపడ్డారు. దేశంలో కూటమి కనిపించటం లేదన్నారు. ‘అసలు కూటమి అనేదే లేదు. అందులో ఉండే భాగస్వామ్య పార్టీలు బయటకు వెళ్తున్నాయి. బెంగాల్లో ఇండియా కూటమి లేదు. ప్రజలు, ఓటర్లను మోసం చేయడానికి ప్రతిపక్షాలు ఈ కూటమిని ఏర్పాటు చేశారు. చివరికి సీపీఐ(ఎం) కూడా కూటమిలో లేమని ప్రకటించింది’ అని ఎంపీ దిలీప్ ఘోష్ మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ మొత్తం ఒక్క సీటు కూడా గెవలకుండా తుడిచిపెట్టుకుపోతుందని అన్నారు. ఇక.. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఈసారి సగం కంటే తక్కువ సీట్లకే పరిమితం కానుందని తెలిపారు. బిహార్‌లో నెలకొన్న రాజకీయ అనిశ్చితిపై దిలీప్ ఘోష్ స్పందిస్తూ.. అక్కడ విడిగా పోటీ చేయలేరు.. అలా అని కలిసి పోటీ చేయలేని పరిస్థితి ఉందని కూటమి పార్టీలపై విమర్శలు గుప్పించారు. చదవండి: కేరళ గవర్నర్‌కు జెడ్ ప్లస్ కేటగిరి భద్రత పెంపు.. ఎందుకంటే? -
‘గోవా, త్రిపుర కాదు.. బెంగాల్‌పై దృష్టి పెట్టండి’
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ బీజేపీ వైస్ ప్రెసిడెంట్ దిలీప్ ఘోష్ అధికార తృణమూళ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. టీఎంసీ జనరల్ సెక్రటరీ అభిషేక్ బెనర్జీ త్రిపుర పర్యటనపై విరుచుకపడ్డారు. టీఎంసీ త్రిపురలో ఏం చేయలేదని, అభిషేక్ బేనర్జీ అక్కడి వెళ్లడం దండగని ఎద్దేవా చేశారు. టీఎంసీ త్రిపురలో తన ఉనికిని నిలుపుకోలేదని అక్కడి ప్రజలు స్పష్టం చేస్తారని తెలిపారు. బెంగాల్ ప్రజలు ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా చూసుకోవాలని మండిపడ్డారు. టీఎంసీ త్రిపుర, గోవాల రాష్ట్రాల వైపు చూడటం కాదని, ముందుగా బెంగాల్ అభివృద్దిపై దృష్టిపెట్టాలని హితవు పలికారు. గోవా, త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి టీఎంసీ దేశవ్యాప్తంగా విస్తరించాలని ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. పశ్చిమ బెంగాల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రతిష్టాత్మంగా భావించే.. 'దువారే సర్కార్' పథకం ప్రారంభం కావాల్సింది కాస్త నిధుల కొరత కారణంగా రద్దయిందని ఆరోపించారు. ప్రణాళికలు, నిధుల కొరత వల్ల ప్రాజెక్టులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయని విమర్శించారు. దిలీప్ ఘోష్ వ్యాఖ్యలపై టీఎంసీ ఎంపీ సౌగత రాయ్ స్పందిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాను దిలీప్ ఘోష్ పరిశీలించాలని అన్నారు. -
West Bengal: పశ్చిమ బెంగాల్ బీజేపీలో అనూహ్య పరిణామం
Sukanta Majumdar: పశ్చిమ బెంగాల్ బీజేపీలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. బలూర్ఘాట్ బీజేపీ ఎంపీ సుకాంత మజుందార్‌ను. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడుగా సోమవారం నియమించింది. దిలీప్ ఘోష్ స్థానంలో నూతనంగా సుకాంత్ను నియమించినట్లు బీజేపీ అధిష్టానం పేర్కొంది. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సుకాంతను రాష్ట్ర అధ్యక్షుడుగా నియమించినట్లు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ వెల్లడించారు. చదవండి:Sonu Sood: ప్రతి రూపాయి ప్రజల కోసమే: సోనూ సూద్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్, ఉత్తరాఖండ్ మాజీ గవర్నర్ బేబీ రాణి మౌర్యలను బీజేపీ జాతీయ ఉపాధ్యాక్షులుగా పార్టీ ప్రమోట్ చేసింది. పశ్చిమ బెంగాల్లో మరో పది రోజుల్లో భవానిపూర్‌లో ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు అంశం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 41ఏళ్ల సుకాంత మజుందార్.. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ప్రచారక్‌గా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టారు. 2014లో ఆయన బీజేపీలో చేరారు. చదవండి: 24న మోదీ– బైడెన్ భేటీ 2019లో బీజేపీ తరఫున బలూర్ఘాట్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి మొదటిసారిగా ఎంపీగా గెలుపొందారు. సెప్టెంబర్ 30న భవానీపూర్‌తో పాటు సంసర్‌గంజ్, జంగిపూర్ అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు జరగనున్నాయి. ఇక ఈ ఉప ఎన్నికల ఇన్ఛార్జ్ బాధ్యతలను సుకాంతకు ఇటీవల అప్పగించిన విషయం తెలిసిందే. అదే విధంగా భవానీపూర్ నియోజకవర్గంలో సీఎం మమతా బెనర్జీపై బీజేపీ ప్రియాంక టిబ్రేవాల్ బరిలోకి దించిన విషయం తెలిసిందే. -
ఫేస్బుక్ కామెంట్స్ పై బీజేపీ ఎంపీ బహిరంగ క్షమాపణలు
కోల్‌కతా: బీజేపీ నాయకులు సువేందు అధికారి, దిలీప్ ఘోష్‌లపై సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలకు పశ్చిమ బెంగాల్ రాష్ట్ర యువజన విభాగం చీఫ్ సౌమిత్రా ఖాన్ బహిరంగ క్షమాపణలు చెప్పారు. ఆదివారం జరిగిన బీజేపీ యూత్ వింగ్ సమావేశంలో సౌమిత్రా ఖాన్ మాట్లాడుతూ.. “ఫేస్బుక్లో ఓ ప్రకటన చేయడం నా వంతు తప్పు. నేను క్షమాపణ కోరుతున్నాను. నేను సోషల్ మీడియాలో అలాంటి వ్యాఖ్య చేయకూడదు.” అని అన్నారు. ఉద్యమాన్ని మరింత ముందుకు అధికార తృణమూల్ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా మరింత తీవ్రమైన ఉద్యమాన్ని ప్రారంభిస్తానని ప్రతిజ్ఞ చేశారు. టిఎంసి 211 అసెంబ్లీ నియోజకవర్గాలను దక్కించుకోగలిగితే, భవిష్యత్తులో బీజేపీ 250 సీట్లను ఎందుకు పొందలేం? మనం ముందుకు సాగాలి, పార్టీకి నాయకత్వం వహించే వారు ఆ బాధ్యతలు స్వీకరిస్తారని అన్నారు. బెంగాల్లో ఎన్నికల్లో జరిగిన హింసపై టీఎంసీని తీవ్రంగా విమర్షించారు. ఇక టీఎంసీ "టీఎంసీ 211 అసెంబ్లీ నియోజకవర్గాలను దక్కించుకోగలిగితే, భవిష్యత్తులో బీజేపీ 250 సీట్లను ఎందుకు పొందలేము? మనం ముందుకు సాగాలి, పార్టీకి నాయకత్వం వహించే వారు ఆ బాధ్యతలు స్వీకరిస్తారు" అని ఆయన అన్నారు. సౌమిత్రా ఖాన్ ఒక ఉద్వేగభరితమైన వ్యక్తి కాగా ఈ నెల (జూలై) లో ఫేస్ బుక్‌లో స్పందిస్తూ.. ‘‘ ఓ నాయకుడు తరచే ఢిల్లీకి పర్యటనలు చేస్తున్నాడు. పార్టీ సాధించే ప్రతి విజయానికి ఆయనకే పేరు వచ్చింది. ఢిల్లీ నాయకులను ఆయన తప్పుదారి పట్టిస్తున్నాడు. బెంగాల్లో పార్టీ ఆయనే పెద్ద నాయకుడిగా భావిస్తున్నాడు. ఇక రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాష్ట్రంలో ఏం జరుగుతుందో.. సగమే అర్థం చేసుకోగలడు. అతను ఇవన్నీ అర్థం చేసుకోలేడు. ’’ అంటూ కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక దిలీప్ ఘోష్ స్పందిస్తూ.. "సౌమిత్రా ఖాన్ ఒక ఉద్వేగభరితమైన వ్యక్తి. నేను అతని పట్ల ఎటువంటి చెడు భావాలను కలిగి లేను. అతను యువ మోర్చాకు నాయకత్వం వహిస్తాడు" అని అన్నారు. -
‘పెళ్లి కాలేదంటున్నావ్.. గర్భవతివి ఎలా అయ్యావ్?’
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ టీఎంసీ ఎంపీ నుస్రత్ జహాన్ పెళ్లిపై రేగిన వివాదం ఇప్పట్లో సద్దు మణిగేలా లేదు. ఈ క్రమంలో నుస్రత్ వ్యవహారంపై బెంగాల్ బీజేపీ నాయకులు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలో బెంగాల్ బీజేపీ ఎంపీ దిలీప్ ఘోష్.. నుస్రత్ జహాన్ పెద్ద మోసగత్తె.. పెళ్లి కాలేదని చెప్తున్న ఆమె.. నుదుటన సింధూరం ఎందుకు ధరిస్తున్నారు అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా దిలీప్ ఘోష్ మాట్లాడుతూ.. ‘‘ఎంత మోసం.. టీఎంసీ టికెట్ ఇచ్చింది ఆమెకు.. పార్లమెంట్ సాక్షిగా ఆమె తనకు వివాహం అయ్యిందని ప్రమాణ స్వీకారం చేసింది. కానీ ఇప్పుడు ఆమె తనకు వివాహామే కాలేదంటుంది. అయినప్పటికి ఈమె గతంలో సింధూరం ధరించింది.. రథ యాత్రలో పాల్గొంది.. పూజలు చేసింది... ఎన్నికల్లో గెలిచింది. జనాలను ఎంత మోసం చేసింది’’ అంటూ విమర్శించారు. 2019 లో కోల్‌కతాలో ఇస్కాన్ నిర్వహించిన రథయాత్రలో నుస్రత్ జహాన్, నిఖిల్ జైన్ దంపతులుగా పాల్గొన్నారు. ఈ క్రమంలో దిలీప్ ఘోష్ రథయాత్ర గురించి ప్రస్తావిస్తూ.. నుస్రత్ జహాన్‌ను నిందించడమే కాక, 2019 లో నుస్రత్, నిఖిల్ రిసెప్షన్‌కు హాజరైన పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని కూడా నిందించారు. "వివాహామే చేసుకోలేదని ప్రకటించిన ఓ వ్యక్తి పెళ్లికి మమతా బెనర్జీ ఎలా హాజరయ్యారు. ఆమె తనకు పెళ్లి కాలేదని అంటుంది.. కానీ నుదుటున సింధూరం ధరిస్తుంది.. జనాలు ఆమె గర్భవతి అయ్యిందంటున్నారు. అసలు ఏంటి ఈ మోసం’’ అని ఆయన ప్రశ్నించారు. నుస్రత్ జహాన్ బుధవారం వ్యాపారవేత్త నిఖిల్ జైన్‌తో తన వివాహం చట్టబద్ధమైనది కాదని, టర్కీలో జరిగిన వారి వివాహానికి భారత చట్టంలో గుర్తింపు లేనందున లైవ్-ఇన్ రిలేషన్ మాత్రమే అని తెలిపారు. కొంతకాలంగా నుస్రత్ జహాన్ నటుడు యష్ దాస్‌గుప్తాతో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వినిసిస్తున్నాయి. చదవండి: భర్తతో విడిపోవడంపై టీఎంసీ ఎంపీ నుస్రత్ కీలక వ్యాఖ్యలు వైరల్: పి. మమతా బెనర్జీ వెడ్స్ ఏఎం సోషలిజం... -
Yass Cyclone: ముందు పొగిడారు.. ఒక్క రోజులోనే మాట మార్చారు
కోల్‌కతా: అత్యంత తీవ్ర తుఫానుగా మారిన 'యాస్' పశ్చిమ బెంగాల్లో పెను విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. తూర్పు మిడ్నాపూర్ జిల్లాలోని దిఘాపై తుపాను ప్రభావం తీవ్రంగా ఉంది. శంకర్‌పుర్, మందర్మని, తేజ్పూర్‌ల్లోని చాలా ప్రాంతాలు నీటమునిగాయి. అయితే ముందు జాగ్రత్త చర్యలతో మమతా బెనర్జీ ప్రభుత్వం లక్షలాది మందిని సురక్షిత ప్రాంతానికి తరలించింది.ఈ నేపథ్యంలో బీజేపీ నేత.. ఎంపీ దిలీప్ ఘోష్ బుధవారం బెంగాలీ దినపత్రిక సంగబాద్ ప్రతిదిన్తో మాట్లాడుతూ మమతా ప్రభుత్వాన్ని ప్రశంసల్లో ముంచెత్తారు. ''యాస్ తుఫాను విధ్వంసాన్ని ముందే ఊహించి ఎక్కువ ప్రాణనష్టం జరగకుండా ప్రభుత్వం తీసుకున్న ముందు చర్య నాకు నచ్చింది. గతంలో 'అంఫన్' తుఫాన్ సృష్టించిన విధ్వంసం నుంచి పాఠాలు నేర్చుకున్న మమతా ప్రభుత్వం ఈసారి మంచి పని చేసింది. తీరప్రాంతాల్లోని ప్రజలకు తుఫాను గురించి ముందే అవగాహన కల్పించి వారని సురక్షిత ప్రాంతానికి తరలించి ప్రాణనష్టం జరగకుండా చూసుకున్నారు. ప్రస్తుతం తుఫాను ప్రభావంతో రాష్ట్రం అల్లకల్లోలంగా ఉందని.. పరిస్థితి మాములుకు వచ్చిన తరువాత నష్టం విలువ తెలుస్తుంది. అయితే మమతా ముందు చూపుతో నష్టం తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది'' అని పేర్కొన్నారు. అయితే ఒక్క రోజు తేడాతోనే దిలీప్ ఘోష్ మాట మార్చారు. తుఫాను కట్టడిలో ముందస్తు చర్యలు బాగానే ఉన్నా ప్రభుత్వం సరైన లెక్కలు చెప్పడం లేదన్నారు. . '' రాష్ట్రంలో 134 నదీ తీరాలు తుఫాను కారణంగా కొట్టుకుపోయాయని ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతుంది. వారు ఈ నంబర్ ఎక్కడ నుంచి పొందారో నాకు తెలియదు. రానున్న తుఫాను ముందే పసిగట్టిన మమత ప్రభుత్వం సంఖ్యలను ముందే నిర్థారించారించింది'' అని చురకలంటించారు కాగా అంతకముందు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తుఫాను ప్రభావంపై స్పందించారు. రాష్ట్రంలో దాదాపు కోటి మందిపై ఈ తుపాను ప్రభావం చూపిందని ఆమె తెలిపారు. 15 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు. 3 లక్షల ఇళ్లు ధ్వంసమయ్యాయన్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాలకు రూ. 10 కోట్ల విలువైన సహాయసామగ్రిని పంపిణీ చేశామని తెలిపారు. భీకర ఈదురుగాలులు, భారీ వర్షాలను తీసుకువస్తూ బుధవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో ఒడిశాలోని ధమ్ర పోర్ట్ సమీపంలో తుపాను తీరం దాటింది. మధ్యాహ్నానికి బలహీనపడి జార్ఖండ్ దిశగా వెళ్లింది. చదవండి: తుఫాన్ వస్తుంటే బయటకొచ్చావ్ ఏంటి.. రిప్లై ఏంటో తెలుసా! -
మహిళలపై అవాక్కులు!
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారంటే సాధారణ పౌరులు బెంబేలెత్తే పరిస్థితులొచ్చాయి. ఎన్నికల ప్రచారసభల్లో, మీడియా సమావేశాల్లో, ర్యాలీల్లో, సామాజిక మాధ్యమాల్లో రాజకీయ నాయకులు ఎలాంటి దుర్భాషలతో విరుచుకుపడతారో, ఏం వినవలసివస్తుందోనన్న భయాందోళనలు కలుగుతున్నాయి. మహిళలనూ, అట్టడుగు కులాలవారినీ కించపరుస్తూ మాట్లాడే నేతల పరువు ఎటూ పోతుంది. కానీ సామాజిక మాధ్యమాల్లో ఆ వ్యాఖ్యలు వైరల్ అవుతూ దేశ పరువుప్రతిష్టలు సైతం దెబ్బతింటున్నాయి. తాజాగా పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీనుద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఆ మాదిరే వున్నాయి. తన కాలికి అయిన గాయాన్ని ప్రదర్శించదల్చుకుంటే ఆమె చీరెకు బదులు బెర్ముడా షార్ట్‌లు ధరించాలని ఆయనగారు సలహా ఇచ్చారు. ఈ నెల 10న నందిగ్రామ్ జిల్లాలో పర్యటిస్తున్న సమయంలో ఆమె కాలికి గాయమైంది. రెండు రోజులు ఆసుపత్రిలో వుండి వచ్చారు. అప్పటినుంచీ ఆమె గాయానికి కట్టుతోనే చక్రాల కుర్చీలో కూర్చుని ప్రచారసభల్లో పాల్గొంటున్నారు. కారు డోరు తీసుకుని వుండగా కొందరు దుండ గులు దాడి చేయటానికి ప్రయత్నిస్తున్న సమయంలో కాలు ఇరుక్కుని గాయమైందని ఆమె వివరణ నిచ్చారు. ఇదంతా సానుభూతి పొందటానికి ఆడుతున్న డ్రామా అని బీజేపీ కొట్టిపారేసింది. గాయమైందంటే కనీసం సానుభూతి ప్రకటించటానికి కూడా సిద్ధపడలేదన్న విమర్శలొచ్చాయిగానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అలాంటి వాతావరణాన్ని ఆశించలేం. అది లేకపోగా హద్దు మీరి వస్త్రధార ణపై సలహా ఇచ్చేవరకూ పోయిందంటే ఎన్నికల ప్రచార సరళి రాను రాను ఎలా దిగజారుతున్నదో అర్థం చేసుకోవచ్చు.మమతా బెనర్జీ ప్రస్తుతం దేశంలో ఏకైక మహిళా ముఖ్యమంత్రి. ప్రత్యర్థులపై నిప్పులు చెరగటం ఆమె నైజం. అలా మాట్లాడటం కొందరికి నచ్చకపోవచ్చు. కానీ విమర్శ ఆ అంశానికి పరిమితం కావాలి తప్ప కించపరిచేలా మాట్లాడటం సరికాదు. దిలీప్ ఘోష్ వ్యాఖ్య అసభ్యకరంగా వున్నదని విమర్శలొస్తే ఆయన మరింత హీన స్థాయిలో మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆమె బెంగాల్ సంస్కృతిని ప్రతిబింబించేలా వ్యవహరించాలట. చీరె ధరించిన మహిళ కాళ్లు చూపటం సభ్యత కాదట. తన మాటల్లో వివాదమేమీ లేదని, వాటిపై వివరణనివ్వాల్సిన అవసరం లేదని దిలీప్ ఘోష్ అభిప్రాయం. ఆయన అయిదేళ్లక్రితం కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేసి వివాదా స్పదుడయ్యారు. జాదవ్‌పూర్ యూనివర్సిటీ విద్యార్థినులనుద్దేశించి ‘వారు మగపిల్లల సాహచర్యం కోసం దొరికే ఏ అవకాశాన్ని వదులుకోని సిగ్గుమాలిన వార’ంటూ వ్యాఖ్యానించారు. 2019 ఆగస్టులో ‘నేను చంపటం మొదలెట్టానంటే తృణమూల్ కార్యకర్తల కుటుంబాలు తుడిచిపెట్టుకుపోతాయ’ న్నారు. వాస్తవానికి ఇలాంటి ధోరణి ఏ ఒక్క పార్టీకో, నాయకుడికో పరిమితమైంది కాదు. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన సమాజ్‌వాదీ నేత ఆజంఖాన్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సినీ నటి జయప్రదనుద్దేశించి 2019 లోక్‌సభ ఎన్నికలప్పుడు దారుణమైన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రకు చెందిన బీజేపీ నేత గోపాల్ షెట్టి తన ప్రత్యర్థిగా పోటీ చేస్తున్న సినీ నటి ఊర్మిళా మంటోద్కర్ విషయంలో ఇదే మాదిరి మాట్లాడారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీపైనా ఆ ఎన్నికల్లో మహారాష్ట్ర పీపుల్స్ రిపబ్లికన్ పార్టీ నేత జయదీప్ కవాడే ఇలాగే వ్యాఖ్యానించారు. ఆమె నుదుటన ధరించే సిందూరం పెద్దగా వుండటాన్ని ప్రస్తావిస్తూ ‘భర్తల్ని మార్చినప్పుడల్లా ఆ సిందూరం పరిమాణం పెరుగుతుంటుంద’న్నారు. చిత్రమేమంటే పురుషులు మాత్రమే కాదు... మహిళా నేతలు సైతం తోటి మహిళలపట్ల ఇలాంటి వ్యాఖ్యలే చేస్తుంటారు. గతంతో పోలిస్తే ఇప్పుడు మెరుగుపడి వుండొచ్చుగానీ... పాశ్చాత్య దేశాలతో పోలిస్తే మహిళలు భిన్న రంగాల్లో చొరవగా ముందుకు రావటం మన దేశంలో ఇప్పటికీ తక్కువే. అన్నిచోట్లా గూడుకట్టుకున్న పితృస్వామిక భావజాలమే ఇందుకు కారణం. సైన్యంలో పనిచేసే మహిళలకు శాశ్వత కమిషన్ హోదా ఇవ్వాలన్న పిటిషన్‌పై తీర్పునిస్తూ, మన సమాజంలోని అన్ని రకాల నిర్మాణాలూ పురుషుల కోసం పురుషులే ఏర్పాటుచేసుకున్నవని సుప్రీం కోర్టు గురువారం వ్యాఖ్యానించింది. మహిళల వస్త్ర ధారణ ఎలావుండాలో, వారెలా మెలగాలో, ఎలా మాట్లాడాలో చెప్పేవారంతా ఇలాంటి పితృస్వామిక భావజాల ప్రభావంతోనే మాట్లాడుతున్నారు. అందుకోసం సంస్కృతిని అడ్డం పెట్టుకుంటున్నారు. రాజకీయ రంగంలోవున్నవారిని సమాజం గమనిస్తుంటుంది గనుక వారి ప్రవర్తన, భాష ఇతరులకు ఆదర్శప్రాయంగా వుండాలి. దేశ రాజకీయాల్లో మహిళలు కూడా ఇప్పుడిప్పుడే చురుగ్గా వుంటున్నారు. రాష్ట్రపతి, విదేశాంగమంత్రి, రక్షణమంత్రి వంటి పదవులు చేపట్టి తాము పురుషులకు ఏమాత్రం తీసిపోమని నిరూపించారు. ప్రస్తుత కేంద్ర ఆర్థికమంత్రి కూడా మహిళే. కానీ కొందరు రాజకీయ నాయకులు చవకబారు వ్యాఖ్యలు చేసి తమను తాము దిగజార్చుకోవటమే కాదు... సమాజానికి కూడా తప్పుడు సంకేతాలు పంపుతున్నారు. కేంద్రమంత్రి స్మృతి ఇరానీ గురువారం ఒక సదస్సులో ప్రసంగిస్తూ ప్రజలు ఎలాంటి దుస్తులు వేసుకోవాలో, వారు ఏం తినాలో, వ్యక్తులుగా వారేం చేయాలో చెప్పే ధోరణి రాజకీయ నాయకులకు తగదన్నారు. దిలీప్ ఘోష్ అయినా, మరొ కరైనా ఈ విషయాన్ని గుర్తెరగాలి. జాగ్రత్తగా మాట్లాడటం నేర్చుకోవాలి. -
బ్యాండేజీ కనబడాలంటే షార్ట్స్ వేసుకోండి...
కోల్‌కతా: విరిగిన కాలు మరింత బాగా ప్రదర్శించేందుకు మమతా బెనర్జీ బెర్ముడా షార్ట్స్ వేసుకోవాలన్న బీజేపీ బెంగాల్ నేత దిలీప్‌ఘోష్ ఒక వీడియోలో చేసిన వ్యాఖ్యలపై వివాదం నెలకొంది. ఇది అత్యంత హేయమైన వ్యాఖ్యగా టీఎంసీ నిప్పులు చెరగగా, పలువురు మహిళలు సైతం సోషల్‌మీడియాలో తమ ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు వీడియోలో దిలీప్ ఎవరిపేరును నేరుగా ప్రస్తావించకపోయినా, అది మమత గురించేనని భావిస్తున్నారు. ‘చీర కట్టిన ఆమె ఒక కాలు కవర్ చేస్తూ, కట్టుకట్టిన కాలు మాత్రం ప్రదర్శిస్తున్నారు. ఇలాంటి చీరకట్టు ఎక్కడా చూడలేదు. దీనిబదులు కాలుబ్యాండేజీ ప్రదర్శన కోసం బెర్ముడా షార్ట్స్ ఆమె ధరించడం మంచిది. షార్ట్స్‌తో మంచి ప్రదర్శన చూపవచ్చు’ అని వీడియోలో ఉన్నట్లు సంబంధితవర్గాలు తెలిపాయి. ఇలాంటి నీచమైన మాటలు దిలీప్ నుంచే వస్తాయని టీఎంసీ ఒక ట్వీట్లో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యాఖ్యలను ఇంతగా వివాదాస్పదం చేయాల్సిన పనిలేదని బీజేపీ ప్రతినిధి షమిక్ అన్నారు. మీటింగుల్లో మమతాబెనర్జీ తమ పార్టీనేతలపై ఇంతకన్నా ఘోరమైన వ్యాఖ్యలు చేశారన్నారు. -
బెంగాల్ దంగల్: బీజేపీ చీఫ్ సంచలన నిర్ణయం
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ రాష్ట్ర బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ సంచలన ప్రకటన చేశారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని తెలిపారు. తాజాగా ప్రకటించిన బీజేపీ అభ్యర్థుల జాబితాలో కూడా ఆయన పేరు లేదు. దీనిపై భిన్న ఊహాగానాలు వెలువడుతుండటంతో దిలీప్ ఘోష్ ఈ అంశంపై స్పందించారు. బెంగాల్లో ఎన్నికల ప్రచారం మొత్తం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి అధ్వర్యంలో జరగాలని హై కమాండ్ నిర్ణయింది. అందువల్లే తాను పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని తెలిపారు. ఈ సందర్భంగా దిలీప్ ఘోష్ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐతో మాట్లాడుతూ.. ‘‘ఎన్నికల్లో పోటీ చేయబోతున్న అభ్యర్థుల జాబితాలో నా పేరు లేదు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండటం వల్ల నేను ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. ఎందుకంటే రాష్ట్రంలో నా అధ్వర్యంలో పార్టీ తరఫున ప్రచారం జరగాలని హై కమాండ్ నిర్ణయించింది’’ అన్నారు. My name won't be there in the list of candidates contesting polls. Being state chief, the party has decided that poll campaigns in the state will be done under my supervision: BJP West Bengal chief Dilip Ghosh in New Town Kolkata pic.twitter.com/2RX4MiuLuU — ANI (@ANI) March 18, 2021 బెంగాల్లో మూడో, నాల్గవ దశల ఎన్నికలకు సంబంధించి బీజేపీ 63 మంది అభ్యర్థుల పేర్లను ఆదివారం ప్రకటించింది. వీరిలో కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో, టీఎంసీ మాజీ నాయకుడు రాజిబ్ బెనర్జీ ఉన్నారు. బెంగాల్లో మొదటి రెండు దశల ఎన్నికలకు 58 మంది అభ్యర్థుల జాబితాను బీజేపీ గతంలోనే విడుదల చేసింది. 294 మంది సభ్యులున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు మొత్తం ఎనిమిది దశల్లో జరగనున్నాయి. వీటిలో షెడ్యూల్డ్ కులాలకు మొత్తం 68 సీట్లు, షెడ్యూల్డ్ తెగలకు 16 సీట్లు కేటాయించారు. ప్రస్తుత పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ పదవీకాలం మే 30 తో ముగియనుంది. 2021 పశ్చిమ బెంగాల్ ఎన్నికలలో మొదటి దశ ఓటింగ్ మార్చి 27 న ప్రారంభం కాగా.. ఎనిమిదవ దశ ఓటింగ్ ఏప్రిల్ 27న జరుగుతుంది. చదవండి: దేశాన్ని రక్షించేందుకు బీజేపీని గెలిపించాలి సీఎం అభ్యర్థిపై ప్రకటన.. బీజేపీలో కలకలం -
దేశాన్ని రక్షించేందుకు బీజేపీని గెలిపించాలి
కోల్‌కతా: పార్టీ సైద్ధాంతిక భావజాల వ్యాప్తికే కాక, దేశంలో శాంతిని భగ్నం చేసేందుకు ప్రయత్నిస్తోన్న ఉగ్రవాదుల నుంచి దేశాన్ని రక్షించేందుకు కూడా బీజేపీ బెంగాల్లో గెలిచి తీరాలని, బీజేపీ బెంగాల్ చీఫ్ దిలీప్ ఘోష్ పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు తృణమూల్ కాంగ్రెస్ సభ్యులను బీజేపీలోకి చేర్చుకోవడంపై ఘోష్ మాట్లాడుతూ కాషాయ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకోవడానికి ఇతర రాజకీయ పార్టీల నుంచి చేరికలు అవసరమని అంగీకరించారు. బీజేపీ భావజాలం, ప్రధాని నరేంద్ర మోదీకి ఉన్న ప్రజాదరణ బీజేపీకి బలమని, అయితే వివిధ స్థాయిల్లో పాపులర్ వ్యక్తులు లేకపోవడం రాష్ట్రంలో పార్టీ ఎదుర్కొంటోన్న లోపమని దిలీప్ ఘోష్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఇంటర్వ్యూలోని పలు అంశాలు ఆయన మాటల్లోనే.. తృణమూల్ విఫలం.. జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యామ ప్రసాద్ ముఖర్జీ ఈ గడ్డపై పుట్టినవాడు కనుక పశ్చిమబెంగాల్లో గెలుపు బీజేపీకి కీలకం. దేశ భద్రత గెలుపుతో ముడిపడి ఉంది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు చాలాకాలం ఎదురుచూశాం. ఇక్కడ గెలుపు మా లక్ష్యం, అదే మాకు సవాల్ కూడా. కశ్మీర్, ఇతర సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్రం శాంతిని స్థాపించగలిగింది. అయితే దేశంలో అశాంతిని సృష్టించే ఉగ్రవాదుల చొరబాటుకి తూర్పుసరిహద్దులు కేంద్రంగా మారాయి. మూడింట రెండొంతుల మెజారిటీతో రాష్ట్రంలో అధికారంలోకి రాబోతున్నాం. 2011 ఎన్నికల్లో ఓటు వేసి, గెలిపించిన ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో తృణమూల్ కాంగ్రెస్ వైఫల్యం చెందింది. తృణమూల్ పార్టీ ప్రజలకు ద్రోహం చేసింది. పాపులర్ ఫేసెస్ కావాలి.. వందలాది మంది పార్టీ కార్యకర్తల త్యాగాలూ, రాష్ట్రంలో కార్యకర్తల తిరుగులేని స్ఫూర్తి బీజేపీ అధికారంలోకి రావడానికి దోహదపడతాయి. అయితే పార్టీలో వివిధ స్థాయిల్లో పాపులర్ ముఖాలు లేకపోవడం పార్టీకి లోపం. రాష్ట్రంలో అధికార పార్టీకి చాలా మంది ప్రముఖులు ఉన్నారు. అయితే అది ఆ పార్టీ సమర్థత మాత్రం కాదు, గత పదేళ్ళుగా వారు అధికారంలో ఉన్నందువల్లనే. పార్టీలో పాత తరం వారికీ, కొత్తవారికీ మధ్య విభేదాలు పార్టీని ప్రభావితం చేయవు. పార్టీ నియమ నిబంధనలకు అందరూ కట్టుబడి ఉండాల్సిందే. రాజకీయాల్లో కొన్ని తప్పవు.. పశ్చిమబెంగాల్లో బీజేపీ రోజు రోజుకీ బలోపేతం అవుతోంది. తృణమూల్ కాంగ్రెస్‌తో సహా ఇతర రాజకీయ పార్టీల నుంచి బీజేపీలోకి చేరుతున్నారని, ఒకవేళ మేం వారిని చేర్చుకోకపోతే, మేం ఎలా పురోగతిని సాధిస్తాం. అందరికీ టిక్కెట్రాదు. కొందరు మాత్రమే అభ్యర్థులుగా నిలబడతారు, మిగిలిన వారు వారికి అప్పగించిన బాధ్యతలను నెరవేర్చేందుకు కృషి చేయాలి. అయితే ఏ ఒక్కరూ పార్టీకన్నా గొప్ప వాళ్ళు కాదు. ఎన్నికల రాజకీయాల్లో కొన్ని తప్పవు. ప్రజాస్వామ్యంలో నంబర్ కీలకపాత్ర పోషిస్తుంది. మేం ఆ సంఖ్యను పొందాలంటే పార్టీలో చేరికలు అవసరం, వారి మద్దతుదారులు కూడా మా పార్టీలోకి వస్తారు. టీఎంసీ అవినీతి పార్టీ... 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, టీఎంసీ కంటే కేవలం నాలుగు సీట్లు తక్కువగా బీజేపీ 18 స్థానాలు గెలుచుకుంది. రాష్ట్రంలో అధికార పార్టీ నుంచి 26 మంది శాసన సభ్యులు, ఇద్దరు ఎంపీలు, సీపీఐ, సీపీఎం, సీపీఐ(ఎంఎల్)నుంచి ముగ్గురు శాసన సభ్యులు పార్టీలో చేరారు. పార్టీలో చేరికలు పార్టీ అవినీతి రహిత పోరాటంపై ఎటువంటి ప్రభావం చూపవు. గతంలో వారున్న పార్టీ అవినీతి పార్టీ, అందుకనుగుణంగానే వారు ఆ పార్టీలో పని చేశారు. అయితే బీజేపీలో చేరాక, మా పార్టీ సూత్రాలకనుగుణంగా వారు పనిచేస్తారు. పార్టీలో చేరిన వాళ్ళందరికీ టిక్కెట్టు ఇవ్వరు. వారి గెలుపు అంచనాలను బట్టి మాత్రమే పార్టీ టిక్కెట్టు ఇస్తారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన ప్రజా ప్రతినిధులం దరికీ టిక్కెట్టు ఇవ్వాలని ఏమీ లేదు. కేవలం పార్టీ సిద్దాంతాలను, భావజాలాన్ని, బీజేపీ విధానాలను చూసే ప్రజలు పార్టీకి ఓటేస్తారు తప్ప, పార్టీలో చేరిన వారిని చూసి కాదు. తృణమూల్ కాంగ్రెస్ కారణంగా రాష్ట్రంలో మత రాజకీయాలు పెరిగాయి. ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించాలా వద్దా అనేది పార్టీ అధినాయకత్వం నిర్ణయిస్తుంది. అయితే మాకు బలమున్న రాష్ట్రాల్లో మేము ముఖ్యమంత్రిని ముందుగానే ప్రకటించం, ఎక్కడైతే మేం బలహీనంగా ఉంటామో అక్కడ కొన్నిసార్లుసీఎం అభ్యర్థిని ముందుకు తెస్తాం, యిప్పుడు పశ్చిమబెంగాల్లో మాది బలమైన పార్టీ. మిథున్ చక్రవర్తి సీఎం అభ్యర్థి కాదు ‘ఇటీవల పార్టీలో చేరిన మిథున్ చక్రవర్తి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి అభ్యర్థి కాదు. నేను బీజేపీలో నమ్మకస్తుడైన సైనికుడిని, నాకు అప్పగించిన బాధ్యతలను స్వీకరించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను. పార్టీ ఏ బాధ్యతలు అప్పగించినా నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తిస్తాను. పశ్చిమ బెంగాల్లో స్థానికులు, స్థానికేతరులు అనే చర్చపై టీఎంసీకి మాట్లాడేందుకు ఏమీ లేదు. మాది ఒక జాతీయ పార్టీ, మాకు సాయం చేయడానికి మా నాయకులు ఇక్కడకు వస్తారు’ అని ఘోష్ సర్దిచెప్పుకున్నారు. -
Mithun Chakraborty: బీజేపీలోకి మిథున్ చక్రవర్తి
కోల్‌కతా: బాలీవుడ్ ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తి భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆదివారం కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాశ్ విజయ్‌వర్గీయా, పార్టీ బెంగాల్ శాఖ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. సమాజంలో అణగారిన వర్గాల సంక్షేమం కోసం పని చేయాలని తాను కోరుకుంటున్నట్లు మిథున్ చక్రవర్తి చెప్పారు. తన ఆకాంక్షను నెరవేర్చుకునేందుకు బీజేపీ ఒక వేదికగా ఉపయోగపడుతుందని అన్నారు. బెంగాలీని అని చెప్పుకోవడం తనకెంతో గర్వకారణమని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా అభిమానుల కోరిక మేరకు తాను నటించిన బెంగాలీ సినిమాలోని ఒక డైలాగ్ చెప్పి అలరించారు. అమీ జోల్దోరవో నోయి, బెలె బొరావో నోయి.. అమీ ఏక్తా కోబ్రా, ఏక్ చోబోల్–యి చోబి (నేను హాని చేయని పామును అనుకొని పొరపాటు పడొద్దు. నేను నాగుపామును. ఒక్క కాటుతో చంపేస్తా జాగ్రత్త) అనే డైలాగ్ చెప్పారు. తాను గతంలో తృణమూల్ కాంగ్రెస్‌లో చేరి తప్పు చేశానని మిథున్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతుగా ప్రచారం చేస్తానని తెలిపారు. బీజేపీ గెలిస్తే ముఖ్యమంత్రి ఎవరవుతారన్నది పార్టీ నాయకత్వమే నిర్ణయిస్తుందన్నారు. బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్ సభలో ప్రధాని ప్రసంగిస్తూ.. ఈరోజు బంగ్లార్ చెలే(బెంగాలీ బిడ్డ) మిథున్ చక్రవర్తి మనతో ఉన్నారని చెప్పారు. ఆయన జీవితం, సాగించిన పోరాటం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. మిథున్ చక్రవర్తికి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో గతంలో సన్నిహిత సంబంధాలు ఉండేవి. ఆయన 2014లో టీఎంసీ తరపున రాజ్యసభకు కూడా ఎన్నికయ్యారు. అనారోగ్య కారణాలతో 2016లో రాజీనామా చేశారు. శారదా కుంభకోణంలో మిథున్ పేరు వెలుగులోకి వచ్చింది. ఆయన అవకాశవాది అని టీఎంసీ, కమ్యూనిస్టు పార్టీలు విమర్శించాయి. -
సీఎం అభ్యర్థిపై ప్రకటన.. బీజేపీలో కలకలం
కోల్కత్తా : పశ్చిమ బెంగాల్లో కాషాయ జెండా ఎగరేయాలని కలలు కంటున్న బీజేపీకి ఆ పార్టీలోని నేతల మధ్య విభేదాలు పెద్ద తలనొప్పిగా మారాయి. ఇప్పటికే ఉన్న పాత లీడర్లతో పాటు అధికార తృణమూల్ కాంగ్రెస్ నుంచి పెద్ద ఎత్తున కాషాయతీర్థం పుచ్చుకున్న నేతల మధ్య సమన్వయం కొరవడింది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీలో అంతర్గత సంక్షోభం తలెత్తకుండా పార్టీ పెద్దలు చర్యలు చేపడుతున్నప్పటికీ ఏదో ఓమూలన అసంతృప్తి జ్వాలలు ఎసిపడుతూనే ఉన్నాయి. టీఎంసీ నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్న మమతా బెనర్జీతో సరితూగే నేత బెంగాల్ బీజేపీలో లేకపోవడం ఆ పార్టీకి సమస్యగా మారింది. మరోవైపు ఎన్నికలకు నాలుగు నెలలు మాత్రమే ఉన్నా.. సీఎం అభ్యర్థిపై ఎటూ తేల్చుకోలేపోవడం స్థానిక నేతల్ని అయోమయానికి గురిచేస్తోంది. (బీజేపీ వ్యూహం.. మమతకు చెక్) తామంటే తామే సీఎం అభ్యర్థి అంటూ ఎవరికి వారే అనుచరుల వద్ద గొప్పలు చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ సీనియర్ నేత, ఆ పార్టీ యువమోర్చా జాతీయ అధ్యక్షుడు సౌమిత్రా ఖాన్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ ముఖ్యమంత్రి అభ్యర్థి అంటూ బాంబు పేల్చారు. రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే ఆయనే సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తారని, ఆయన అభ్యర్థిత్వం ఇప్పటికే ఖరారైందని కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే ఆయన చేసిన ప్రకటనపై దిలీప్ అనుచరవర్గం సంబరాలు చేసుకోగా.. ఆయన వ్యతిరేక వర్గంతో పాటు ఇటీవల టీఎంసీ నుంచి బీజేపీలో చేరిన నేతలంతా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సౌమిత్రా వ్యాఖ్యలపై బీజేపీ పెద్దలు సైతం గుర్రుగా ఉన్నారు. సీఎం అభ్యర్థిపై తాము ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, పక్కా బెంగాలీ వ్యక్తే సీఎంగా ఉంటారని ఆ పార్టీ ముఖ్యనేతలు చెబుతున్నారు. పార్టీలో చర్చించకుండా బహిరంగ సభల్లో ఇలాంటి ప్రకటనలు చేయడం సరైనది కాదని సౌమిత్రాను సముదాయించారు. (ఆపరేషన్ బెంగాల్.. దీదీకి ఓటమి తప్పదా?) మరోవైపు టీఎంసీ సైతం మరింత దూకుడు పెంచింది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలపై అనేక ప్రకటనలు చేస్తున్న అమిత్ షా.. ముందుగా బీజేపీ అభ్యర్థి ఎవరో తేల్చాలని ఆ పార్టీ నేతలు సవాలు విసురుతున్నారు. మమతా బెనర్జీకి సరితూగే నేత బీజేపీలో లేరని ఎద్దేవా చేస్తున్నారు. అంతేకాకుండా బెంగాల్లో బీజేపీకి అధికారం అప్పగిస్తే ఇతర రాష్ట్రానికి చెందిన వ్యక్తికి సీఎం బాధ్యతలు అప్పగిస్తారని జోరుగా ప్రచారం చేస్తున్నారు. కాగా 294 అసెంబ్లీ స్థానాలున్న బెంగాల్లో మరో నాలుగైదు నెలల్లో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. -
మార్నింగ్ వాక్కు వెళ్లిన బీజేపీ చీఫ్‌పై దాడి
కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్‌పై కొందరు దుండగలు దాడికి పాల్పడారు. బుధవారం మార్నింగ్ వాక్ వెళ్లిన తనపై రాజర్హట్ ప్రాంతంలో టీఎంసీ మద్దతుదారులు దాడికి చేసినట్టుగా దిలీప్ ఆరోపించారు. ఈ దాడిలో తన వాహనం కూడా ధ్వంసం అయిందని తెలిపారు. తనను రక్షించాలని చూసిన భద్రతా సిబ్బందిపై కూడా టీఎంసీ మద్దతుదారులు దాడి చేశారని చెప్పారు. ఈ ఘటన చూస్తుంటే బెంగాల్ శాంతి భద్రతల పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. (చదవండి : విషాదం: బాయిలర్ పేలి ఐదుగురు మృతి) ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘నేను రాజర్హట్ న్యూటౌన్ ప్రాంతంలో ఉంటాను. ముందుగా అనుకున్న ప్రకారం ఈ రోజు ఉదయం నేను కోచ్‌పుకుర్ గ్రామ సమీపంలోని ఓ టీ స్టాల్ వద్దకు వెళ్లాలి. అక్కడ నా కోసం మా పార్టీ కార్యకర్తలు వేచి ఉన్నారు. కానీ అక్కడికి చేరుకోక ముందే తృణమూల్ మద్దతుదారులు నన్ను అడ్డుకున్నారు. నాపై చేయి చేసుకోవడమే కాకుండా.. నా సెక్యూరిటీ గార్డ్స్‌పైన కూడా దాడి చేశారు. నా పర్యటన గురించి స్థానిక పోలీసులకు ముందే సమాచారం ఇచ్చినప్పటికీ.. వారు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. చిరకు నేను ఆ టీ స్టాల్ వద్దకు చేరుకునే సరికి అక్కడ రోడ్లపై ఖాలీ కుర్చీలు దర్శనమిచ్చాయి’ అని తెలిపారు. అలాగే టీఎంసీ నాయకుడు టపాక్ ముఖర్జీ నేతృత్వంలోనే ఈ దాడి జరిగిందని ఆరోపించారు. అయితే దిలీప్ ఆరోపణలను ముఖర్జీ ఖండించారు. -
కుక్కల్ని కాల్చినట్టు.. కాల్చేశాం
కోల్‌కతా: పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేస్తున్న వారిని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కుక్కులను కాల్చినట్టు కాల్చేశామని పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ చేసిన వ్యాఖ్యలు దుమారం లేపాయి. సొంత పార్టీ నేతలు సైతం ఘోష్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించగా, కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో ఆ వ్యాఖ్యలకు, పార్టీకీ ఏమాత్రం సంబంధం లేదని వ్యాఖ్యానించడం గమనార్హం. నాడియా జిల్లాలో ఆదివారం జరిగిన ఒక బహిరంగ సభలో దిలీప్ ఘోష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘ఆస్తులు ధ్వంసం చేస్తున్నా తనకు ఓటేశారన్న కారణంగా దీదీ (మమత) ఆందోళనకారులపై కాల్పులు జరపలేదు. ఉత్తరప్రదేశ్, అసోం, కర్ణాటకల్లోని మా ప్రభుత్వాలు మాత్రం ఆందోళనకారులను కుక్కలను కాల్చినట్టు కాల్చేశారు’ అని దిలీప్ వ్యాఖ్యానించారు. అయితే కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో..‘యూపీ, అసోంలలోని బీజేపీ ప్రభుత్వాలు ఏ కారణంగానూ ప్రజలపై కాల్పులకు దిగలేదు. ఇది దిలీప్ ఊహల్లో పుట్టిన ఆలోచన కావచ్చు. ఏ కారణంగా చేసినా దిలీప్ వ్యాఖ్యలు బాధ్యతరహితమైనవి.’ అని ట్విట్టర్లో పేర్కొన్నారు. మరోవైపు దిలీప్ వ్యాఖ్యలపై అధికార తృణమూల్ కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. యూపీలో ‘సీఏఏ’ ప్రారంభం లక్నో: వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలు ప్రక్రియను ఉత్తరప్రదేశ్ ప్రారంభించింది. 75 జిల్లాలకు గాను తొలి దశలో 21 జిల్లాల్లోని 32 వేల మంది శరణార్థులను గుర్తించామని మంత్రి శ్రీకాంత్ శర్మ తెలిపారు. ఫిలిబిత్‌లో అత్యధికంగా శరణార్థులున్నట్లు సమాచారం. -
కుక్కల్ని కాల్చినట్లు.. కాల్చిపారేస్తున్నారు!
కోల్‌కతా: ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తున్న వారిపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎటువంటి చర్యలు తీసుకోవడంలేదని ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ ఆరోపించారు. బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్, అసోం, కర్ణాటక రాష్ట్రాల్లో ఇలాంటి వాళ్లను కుక్కల్ని కాల్చినట్లు కాల్చిపారేస్తున్నారంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. తనకు ఓట్లు వేసిన వాళ్లను కాపాడుకునేందుకే దీదీ ఇలా చేస్తున్నారని విమర్శించారు. నదియా జిల్లాలో ఆదివారం జరిగిన సభకు హాజరైన దిలీప్ ఘోష్ మమత సర్కారుపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ డిసెంబరులో జరిగిన ఆందోళనల్లో భారీగా ప్రజా ఆస్తులు ధ్వంసమయ్యాయన్నారు. రైల్వే, రవాణా ఆస్తులకు నష్టం కలిగించిన వారిపై లాఠీచార్జీకి ముఖ్యమంత్రి ఆదేశాలు జారీచేయలేదన్నారు.(‘తొలుత ఇక్కడే అమలు.. ఎవరూ ఆపలేరు’) ‘మీరు ధ్వంసం చేస్తున్న ఆస్తులు ఎవరివి అనుకుంటున్నారు. అవి మీ నాన్నవి కాదు... ప్రభుత్వ ఆస్తులు. పన్ను కడుతున్న ప్రజలవి. మీరు ఇక్కడికి వస్తారు. మా తిండి తింటారు. ప్రజా ఆస్తుల్ని ధ్వంసం చేస్తారు. ఇదేమైనా మీ జాగీరా? మిమ్మల్ని లాఠీలతో చితక్కొడతాం. కాల్చిపడేస్తాం. జైళ్లో పెడతాం అంటూ దిలీప్ ఘోష్ ఆందోళనకారులను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అదే విధంగా... దేశంలోకి దాదాపు రెండు కోట్ల మంది ముస్లింలు చొరబడ్డారని.. వారిలో కోటి మంది పశ్చిమ బెంగాల్లో ఉన్నారని వ్యాఖ్యానించారు. బెంగాలీ హిందువుల హక్కులకు భంగం కలిగిస్తున్న వారిని మమత రక్షించడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. కాగా డిసెంబరు 31, 2014 నాటికి ఆఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్ లేదా పాకిస్తాన్ నుంచి భారత్‌లోకి ప్రవేశించిన హిందూ, సిక్కు, బౌద్ధులు, జైనులు, పార్శీలు, క్రిస్టియన్లకు భారత పౌరసత్వం కల్పించేలా నరేంద్ర మోదీ సర్కారు చట్టం తీసుకవచ్చిన విషయం తెలిసిందే. ఇక పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలుపై పునరాలోచన చేయాలని, జాతీయ పౌర పట్టిక(ఎన్నార్సీ), జాతీయ జనాభా పట్టిక(ఎన్పీఆర్)లను వెనక్కి తీసుకోవాలని ప్రధాని మోదీని కోరినట్లు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేర్కొన్న విషయం విదితమే. (సీఏఏ-ఎన్నార్సీ-ఎన్పీఆర్ వద్దు.. ప్రధానితో మమత) చదవండి: ఆమె తలపై ఉన్నది రక్తమేనా; కంపరంగా ఉంది -
ఆమె తలపై ఉన్నది రక్తమేనా; కంపరంగా ఉంది
కోల్‌కత/న్యూఢిల్లీ : ఢిల్లీలోని ప్రతిష్టాత్మక జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) విద్యార్థులపై దాడి ఘటనను దేశవ్యాప్తంగా ప్రజలు ఖండిస్తుండగా పశ్చిమ బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జేఎన్‌యూ స్టూడెంట్ లీడర్ ఆయిషీ ఘోష్ తలపై ఉన్నది రక్తమా... లేక పెయింటా..? అని చవకబారుగా మాట్లాడారు. కాగా, ముసుగులు ధరించిన దుండుగులు చేతిలో కర్రలతో యూనివర్సిటీలోకి చొరబడి పలువురు విద్యార్థులు, టీచర్లపై ఆదివారం దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో జేఎన్‌యూ కాంగ్రెస్ విద్యార్థి యూనియన్ ప్రెసిడెంట్ (జేఎన్‌యూఎస్‌యూ) ఆయిషీ ఘోష్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆయిషీ ఘోష్ సహా 18 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనలో వర్సిటీ ఆస్తులు కూడా ధ్వంసమయ్యాయి. (చదవండి : జేఎన్‌యూలో దీపిక) ‘చదువులను గాలికొదిలేసి విద్యార్థులంతా రోజూ ఇదే అంశాన్ని లేవనెత్తుతూ నిరసనలకు దిగుతున్నారు. ఇంతకూ ఆయిషీ ఘోష్ తలపై ఉన్నది రక్తమేనా.. లేక ఎరుపు రంగా..? ఇదంతా కావాలనే చేస్తున్నట్టుగా ఉంది’అని దిలీప్ ఘోష్ మంగళవారం ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ అన్నారు. కాగా, ఆయిషీ తల్లి షర్మిష్ఠా ఘోష్ మాట్లాడుతూ.. ‘బీజేపీ నేత దిలీప్ వ్యాఖ్యలపై స్పందించాలంటేనే కంపరంగా ఉంది. జేఎన్‌యూలో పరిస్థితులు మెరుగు పడకుంటే.. ప్రస్తుతం ఉన్న వీసీనే ఇంకా కొనసాగితే.. అక్కడ చదువుకోవడానికి పిల్లల్ని అనుమతించం’ అన్నారు. దిలీప్ కాస్త మనిషిగా ఆలోచిస్తే మంచిదని బెంగాల్ విద్యాశాఖ మంత్రి పార్థా ఛటర్జీ హితవు పలికారు. (చదవండి : ‘జేఎన్‌యూ దాడి మా పనే’) జేఎన్‌యూ దాడిలో కొత్త విషయాలు జేఎన్‌యూలో దుండగుల వీరంగం -
‘తొలుత ఇక్కడే అమలు.. ఎవరూ ఆపలేరు’
కోల్‌కతా: పౌరసత్వ సవరణ చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేయకుండా అడ్డుకోవడం ఎవరితరం కాదని పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ అన్నారు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా బెంగాల్లోనే తొలుత ఈ చట్టం అమలు జరిగి తీరుందని వ్యాఖ్యానించారు. వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టాన్ని తమ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనో అంగీకరించబోమని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అదే విధంగా ఈ చట్టంపై నిరసన వ్యక్తం చేస్తున్న ఈశాన్య రాష్ట్రాల ఆందోళనకారులకు ఆమె సంఘీభావం ప్రకటించారు. ఈ నేపథ్యంలో దిలీప్ ఘోష్ మీడియాతో మాట్లాడుతూ... పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకించడానికి గల కారణలేమిటో స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. ఓటు బ్యాంకు గల్లంతవుతుందనే భయంతోనే ఆమె ఇలా చేస్తున్నారా అని ప్రశ్నించారు. ‘మమత ఇదివరకు ఆర్టికల్ 370 రద్దు, నోట్ల రద్దును కూడా వ్యతిరేకించారు. అయితే కేంద్ర ప్రభుత్వం వాటిని అమలు చేయడాన్ని ఆపలేకపోయారు. ఇప్పడు కూడా అంతే.. మమతా బెనర్జీ గానీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ గానీ ఈ చట్టం అమలును అడ్డుకోలేరు. నిజానికి ఈ రాష్ట్రంలో తొలుత పౌరసత్వ సవరణ చట్టం అమలు జరుగుతుంది. అయినా మమతకు అక్రమవలసదారుల పట్ల ఉన్న ప్రేమ.. హిందూ శరణార్థుల పట్ల ఎందుకు లేదో అర్థంకావడం లేదు. అక్రమ వలసదారుల గురించే ఆమె బాధ పడుతున్నారు’ అని దిలీప్ ఘోష్ మమతను విమర్శించారు. ఇక మరో బీజేపీ నేత కైలాశ్ విజయ్‌వర్గియా సైతం మమతా బెనర్జీ వ్యాఖ్యలను ఖండించారు. ఆమె వ్యాఖ్యలు ఈశాన్య రాష్ట్రాల ప్రజలను రెచ్చగొట్టేలా ఉన్నాయని మండిపడ్డారు. కాగా పార్లమెంటు ఆమోదం పొందిన వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లుపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సంతకం చేయడంతో చట్టరూపం దాల్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మూడు పొరుగు దేశాలైన.. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌లలో మతపరమైన వేధింపులు ఎదుర్కొని భారత్‌కు వచ్చిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వం కల్పించే వీలు కలుగుతుంది. -
‘కుక్క మాంసం తినండి.. ఆరోగ్యంగా ఉండండి’
కోల్‌కతా : గోమాంసం తినేవాళ్లందరూ కుక్క మాంసం కూడా తినాలంటూ పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మేధావులంతా రోడ్లపై బీఫ్ తింటున్నారని... ఇకపై వారు అన్ని రకాల జంతువులను కూడా ఇలాగే చంపి తింటే ఆరోగ్యం బాగుంటుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అయితే రోడ్డుపై కాకుండా ఇంట్లోనే ఆ వంటకాలు తయారు చేసుకుని తినాలని సూచించారు. బుర్దావన్‌లో సోమవారం జరిగిన గోపా అష్టమి కార్యక్రమంలో దిలీప్ ఘోష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గో హత్య మహాపాతకమని పేర్కొన్నారు. ‘ గోవు మన తల్లి. ఆమె పాలు తాగి మనం ఈరోజు జీవిస్తున్నాం. కాబట్టి ఇటువంటి నా తల్లితో ఎవరైనా చెడుగా ప్రవర్తిస్తే నేను సహించను. పవిత్రమైన భారత భూమిపై గోవధ చేసి ఆ మాంసం తినటం క్షమించరాని నేరం. ఆవు పాలు బంగారం వంటివి. అందులో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఆవు మాంసం తింటే మంచిదంటూ రోడ్లపై పడి భోజనం చేస్తున్నవాళ్లు కుక్క మాంసంతో పాటు అన్ని రకాల జంతువుల మాంసం తింటే ఇంకా ఆరోగ్యంగా ఉంటారు. అయితే ఏదైనా మీ ఇంట్లోనే తినండి. రోడ్లపై నానాయాగీ చేయకండి’ అని మేధావివర్గంపై విమర్శలు గుప్పించారు. కాగా దిలీప్ ఘోష్ గతంలోనూ ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. దేశీ ఆవులు అమ్మతో సమానం గనుక.. వాటికి ప్రాధాన్యం ఇవ్వాలని.. విదేశీ ఆవు జాతులను పెంచడం శ్రేయస్కరం కాదని పేర్కొన్నారు. ఈ క్రమంలో విదేశీ వనితలను భార్యలుగా చేసుకున్న వారు ఎలాంటి సమస్యల్లో చిక్కుకుపోయారో గమనించాలని విఙ్ఞప్తి చేశారు. అంతేగాకుండా తూర్పు మిడ్నాపూర్‌లో తమ కార్యకర్తలపై దాడులను ప్రోత్సహిస్తున్నారంటూ.. అక్కడ విధులు నిర్వర్తిస్తున్న పోలీసు ఉన్నతాధికారిని చంపుతానని బెదిరించారు. బీజేపీ కార్యకర్తలతో తప్పుగా ప్రవర్తిస్తే అంత్యక్రియలు చేసేందుకు శవం కూడా దొరకకుండా చేస్తామని ఆయనను హెచ్చరించారు. -
‘5 నిమిషాల్లో 3 హత్యలు; అదంతా కట్టుకథ’
కోల్‌కతా : స్కూల్ టీచర్ బంధు ప్రకాశ్ పాల్(35) కుటుంబం హత్య పశ్చిమ బెంగాల్లో రాజకీయ దుమారం రేపుతోంది. ఆరెస్సెస్ కార్యకర్త అయినందుకు వల్లే బంధు కుటుంబం దారుణ హత్యకు గురైందని బీజేపీ ఆరోపిస్తుండగా... ఆర్థిక లావాదేవీల నేపథ్యంలోనే ఈ నేరం జరిగిందని పోలీసులు ధ్రువీకరించారు. ఈ కేసులో నిందితుడిగా భావిస్తున్న కూలీ ఉత్పల్ బెహరాను అరెస్టు చేశామని.. అతడు నేరం అంగీకరించాడని వెల్లడించారు. బంధు నిర్వహిస్తున్న ఫిక్స్డ్ డిపాజిట్ స్కీంలో ఖాతాదారుడైన ఉత్పల్... తన డబ్బులు తనకు ఇచ్చేందుకు నిరాకరించడంతోనే బంధు కుటుంబాన్ని హతమార్చినట్లు పేర్కొన్నారు. మంగళవారం మధ్యాహ్నం 12.06 నుంచి 12.11 ప్రాంతంలో ఈ దారుణం జరిగిందని.. ఆ సమయంలో బంధు ఇంటి నుంచి ఉత్పల్ బయటికి రావడం తాను చూసినట్లు పాలు అమ్ముకునే వ్యక్తి వాంగ్మూలం ఇచ్చాడని తెలిపారు. అంతేగాక ఉత్పల్ ఫోన్‌కాల్ లిస్టు, ఘటనాస్థలంలో దొరికిన ఆయుధంపై అతడి వేలిముద్రలు దొరికాయని పోలీసులు వెల్లడించారు. దీంతో ఉత్పల్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడని పేర్కొన్నారు. తొలుత బంధును మాత్రమే చంపాలనుకున్నానని.. అయితే ఆ సమయంలో అతడి భార్యా పిల్లలు తనని చూస్తే పోలీసులకు చెబుతారనే భయంతోనే వారిని కూడా హత్య చేసినట్లు ఉత్పల్ విచారణలో చెప్పినట్లు పోలీసులు తెలిపారు.(చదవండి : అందుకే ఆ ముగ్గురినీ చంపేశాడు!) ఈ నేపథ్యంలో తమ కుమారుడు అలాంటి వాడు కాదని.. పోలీసులే తనను కేసులో ఇరికించారని ఉత్పల్ తండ్రి మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశాడు. తన తల్లిదండ్రులు అనారోగ్యంతో బాధ పడుతున్నారని... తమకు ఉత్పల్ సంపాదన తప్ప ఇతర జీవనాధారం లేదని అతడి సోదరి వాపోయింది. నిజమైన హంతకులను పట్టుకుని తన సోదరుడిని విడుదల చేయాలని ప్రభుత్వానికి విఙ్ఞప్తి చేసింది. కాగా ఈ విషయంపై రాష్ట్ర బీజేపీ నాయకుడు దిలీప్ ఘోష్ స్పందించారు. మమత సర్కారు అభాసుపాలుకాకుండా పోలీసులు ఓ కట్టుకథ అల్లారని ఆరోపించారు. ‘కేవలం రూ. 48 వేల కోసం ఓ వ్యక్తి కుటుంబం మొత్తాన్ని అంతమొందించాడన్నది నేటి కథ. ఇది అస్సలు నమ్మశక్యంగా లేదు. ప్రభుత్వాన్ని కాపాడేందుకు పోలీసులు కంటితుడుపు చర్యగా ఓ రోజూవారీ కూలీని అరెస్టు చేశారు. ఈ కేసును కేంద్ర ప్రభుత్వ సంస్థచేత విచారణ జరిపించాలి’ అని డిమాండ్ చేశారు. కేవలం 5 నిమిషాల్లో ఓ వ్యక్తి ముగ్గురిని చంపి.. వెంటనే అక్కడి నుంచి పారిపోవడం సాధ్యమయ్యే విషయమేనా అని ప్రశ్నించారు. కాగా ఇటీవల కాలంలో పశ్చిమ బెంగాల్లో వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. పలువురు బీజేపీ, అధికార తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందుతున్నారు. ఈ క్రమంలో ఇరు పార్టీలు పరస్పర ఆరోపణలకు దిగుతున్నాయి. అయితే పోలీసులు మాత్రం ఈ హత్యల వెనుక ఎటువంటి రాజకీయ కారణాలు లేవని స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మమత ప్రభుత్వం, బీజేపీ వ్యవహారశైలిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.(చదవండి : తల్లిదండ్రులు, చిన్నారి పాశవిక హత్య) -
హిజాబ్ ధరించి హిందూ కార్యక్రమానికి వెళతావా?
కోల్‌కతా : హనుమాన్ చాలీసా పఠనానికి హాజరైన బీజేపీ నేత, ట్రిపుల్ తలాఖ్ పిటిషనర్ ఇష్రత్ జహాన్‌కు చేదు అనుభవం ఎదురైంది. హనుమాన్ చాలీసా పఠనానికి హిజాబ్ ధరించి వెళ్లినందుకు చంపుతామని బెదిరింపులు వస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. ఈ ఘటన కోల్‌కతాలో చోటు చేసుకుంది. కోల్‌కతాలో నివసిస్తున్న ఇష్రత్ జహాన్ మంగళవారం ఇంటి దగ్గర్లోని సామూహిక హనుమాన్ చాలీసా కార్యక్రమానికి హిజాబ్ ధరించి హాజరయింది. దీంతో ఆగ్రహించిన కొందరు వ్యక్తులు బుధవారం ఇష్రత్ జహాన్ ఇంటికి వస్తున్న సమయంలో ఆమెను చుట్టుముట్టారు. ఆమెపై దూషణల పర్వానికి దిగారు. నువ్వు చేసిన పని వల్ల ముస్లిం సమాజాన్ని కించపరిచావని ఆరోపించారు. నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టమంటూ భయభ్రాంతులకు గురిచేశారు. దీంతో ఇష్రత్ జహాన్ తనకు రక్షణ కల్పించాలంటూ పోలీసులను ఆశ్రయించారు. తనపై బెదిరింపులకు దిగుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయం గురించి ఇష్రత్ జహాన్ మాట్లాడుతూ.. ‘మా బావ, ఇంటి యజమాని సైతం అసభ్యంగా దూషించారు. ఇల్లు ఖాళీ చేయాలని వేధిస్తున్నారు. నన్ను చంపేస్తామంటూ బెదిరిస్తున్నారు. ఏ క్షణమైనా నాకు హాని తలపెట్టవచ్చు ’ అని వాపోయారు. దీనిపై గొలాబరి పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు విచారణ ప్రారంభించారు. ఈ ఘటనపై బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ మాట్లాడుతూ.. ‘తనకు నచ్చినట్టుగా ఉండటంలో తప్పేంటి?’ అని ప్రశ్నించారు. అయినా మమతా బెనర్జీ, టీఎంసీ నాయకులు నమాజ్ ఇచ్చినపుడు ప్రశ్నించని నోళ్లు ఇప్పుడు ఎందుకు లేస్తున్నాయో అర్థం కావట్లేదని మండిపడ్డారు. కాగా ట్రిపుల్ తలాక్ కేసు వేసిన ఐదుగురు పిటిషనర్లలో ఇష్రత్ జహాన్ ఒకరు. ఆమెకు ఒక కొడుకుతో పాటు 14 సంవత్సరాల కూతురు కూడా ఉంది. ఆమె భర్త 2014లో దుబాయ్‌లో ఫోన్ నుంచి ట్రిపుల్ తలాక్ చెప్పి విడాకులు తీసుకోగా ఆమె అపెక్స్ కోర్టును ఆశ్రయించింది. 2017 ఆగస్టు 22న సుప్రీంకోర్టు ట్రిపుల్ తలాక్‌ను కొట్టివేసిన సంగతి తెలిసిందే. గత సంవత్సరం జనవరి 1న జహాన్ బీజేపీలో చేరారు. -
బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు
కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. భారతీయ జనతా పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గురువారం మీడియాతో ఆమె మాట్లాడుతూ.. భాజాపాను ఓ ఉగ్రవాద సంస్థగా అభివర్ణించారు. ‘మా పార్టీ(టీఎంసీ పార్టీ) బీజేపీలా కాదు. క్రైస్తవులు, ముస్లింలతోపాటు హిందువుల మధ్య కూడా వాళ్లు(బీజేపీ) చిచ్చు పెట్టాలని చూస్తున్నారు. బీజేపీ ఓ ఉగ్రవాద సంస్థ. రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించాలని యత్నిస్తున్నారు’ అంటూ మమతా వ్యాఖ్యానించారు. గత కొన్ని నెలలుగా బెంగాల్లో బీజేపీ-టీఎంసీ కార్యకర్తల మధ్య దాడులు-ప్రతిదాడులు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. కార్యకర్తల అనుమానాదాస్పద మృతులతో ఇరు పార్టీలు ‘రాజకీయ హత్యలు’గా పరస్పరం ఆరోపించుకుంటున్నాయి. ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ టీఎంసీ పార్టీ నేతలను, కార్యకర్తలను బెదిరించారు. గతవారం జల్పైగురిలో నిర్వహించిన ఓ నిరసన ప్రదర్శన సందర్భంగా ‘రౌడీయిజానికి పాల్పడితే టీఎంసీ కార్యకర్తలను అరెస్ట్ చేయిస్తానని, ఎన్కౌంటర్ చేయిస్తానని’ దిలీప్ బహిరంగంగా వ్యాఖ్యాలు చేశారు. ఈ నేపథ్యంలోనే మమతా ఇలా తీవ్రంగా స్పందించారు. మరోపక్క తీవ్ర వ్యాఖ్యలకుగానూ దిలీప్ క్షమాపణలు చెప్పినప్పటికీ, టీఎంసీ నేతల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. మమతా బెనర్జీ.. దిలీప్ ఘోష్ -
తృణమూల్‌కు షాక్, బీజేపీలోకి సీనియర్ నేత!
న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ ముకుల్ రాయ్ పార్టీ అధినేత మమతా బెనర్జీకి షాక్ ఇచ్చారు. బుధవారం రాజ్యసభ స్థానంతో పాటు పార్టీ పదవులన్నింటికి రాజీనామా చేశారు. నారదా, శారదా కుంభకోణాల్లో మమతకు క్లీన్ చిట్ వచ్చేందుకు రాజీనామాకు సిద్దపడ్డారని సమాచారం. రాజీనామా అనంతరం ముకుల్ రాయ్ మీడియాతో మాట్లాడారు. ఈసందర్భంగా ఆయన పార్టీపై ఎటువంటి విమర్శలు చేయలేదు. బీజేపీలో చేరబోతున్నాడంటూ వస్తున్న వార్తలను కూడా ఆయన ఖండించలేదు. కానీ ప్రస్తుతానికి ఆయన ఏపార్టీలో చేరబోతున్నారనే అంశంపై ఉత్కంఠత ఉంది. అనుచరులు మాత్రంలో త్వరలోనే బీజేపీలో చేరబోతున్నారని విశ్వసనీయ సమాచారం. దీనిపై పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోస్ మాట్లాడుతూ బంతి ఇంకా తృణమూల్ కోర్టులోనే ఉందన్నారు. ఒక వేళ ముకుల్ రాయ్ బీజేపీలో చేరతామనంటే ఆహ్వానిస్తామని, ఆయన పార్టీలో చేరాలని ఆకాంక్షిస్తున్నట్లు ఘోష్ తెలిపారు. రాయ్ లాంటి నాయకుడు ప్రతి రాజకీయ పార్టీకి విలువైన వాడేనని ఆయన అన్నారు. అయితే బీజేపీలో చేరడంపై ముకుల్‌రాయ్ దీపావళి తరువాత ప్రకటించే అవకాశం ఉంది. రాయ్ రాజీనామాపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పార్థా ఛటర్జీ స్పందించారు. శుభపరిణామం అన్నారు. గతనెల 27న నజ్రుల్ మంచాఆలో పార్టీ విస్తరణ సమావేశంలోను రాయ్ సైలెంట్‌గానే ఉన్నారు. రాయ్ లాంటి సీనియర్ నేతలను ఎలా ఉపయోగించుకోవాలో తృణమూల్ సంస్థాగత సమావేశంలో నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. ఒక వేళ రాయ్ తృణుముల్ కాంగ్రెస్‌ను విడిచి బీజేపీలో చేరితే, వచ్చే ఏడాది జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో తృణముల్‌కు ఎదురుగాలి వీచే అవకాశం ఉంది.