
న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ ముకుల్ రాయ్ పార్టీ అధినేత మమతా బెనర్జీకి షాక్ ఇచ్చారు. బుధవారం రాజ్యసభ స్థానంతో పాటు పార్టీ పదవులన్నింటికి రాజీనామా చేశారు. నారదా, శారదా కుంభకోణాల్లో మమతకు క్లీన్ చిట్ వచ్చేందుకు రాజీనామాకు సిద్దపడ్డారని సమాచారం. రాజీనామా అనంతరం ముకుల్ రాయ్ మీడియాతో మాట్లాడారు. ఈసందర్భంగా ఆయన పార్టీపై ఎటువంటి విమర్శలు చేయలేదు. బీజేపీలో చేరబోతున్నాడంటూ వస్తున్న వార్తలను కూడా ఆయన ఖండించలేదు.
కానీ ప్రస్తుతానికి ఆయన ఏపార్టీలో చేరబోతున్నారనే అంశంపై ఉత్కంఠత ఉంది. అనుచరులు మాత్రంలో త్వరలోనే బీజేపీలో చేరబోతున్నారని విశ్వసనీయ సమాచారం. దీనిపై పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోస్ మాట్లాడుతూ బంతి ఇంకా తృణమూల్ కోర్టులోనే ఉందన్నారు. ఒక వేళ ముకుల్ రాయ్ బీజేపీలో చేరతామనంటే ఆహ్వానిస్తామని, ఆయన పార్టీలో చేరాలని ఆకాంక్షిస్తున్నట్లు ఘోష్ తెలిపారు. రాయ్ లాంటి నాయకుడు ప్రతి రాజకీయ పార్టీకి విలువైన వాడేనని ఆయన అన్నారు. అయితే బీజేపీలో చేరడంపై ముకుల్‌రాయ్ దీపావళి తరువాత ప్రకటించే అవకాశం ఉంది.
రాయ్ రాజీనామాపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పార్థా ఛటర్జీ స్పందించారు. శుభపరిణామం అన్నారు. గతనెల 27న నజ్రుల్ మంచాఆలో పార్టీ విస్తరణ సమావేశంలోను రాయ్ సైలెంట్‌గానే ఉన్నారు. రాయ్ లాంటి సీనియర్ నేతలను ఎలా ఉపయోగించుకోవాలో తృణమూల్ సంస్థాగత సమావేశంలో నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. ఒక వేళ రాయ్ తృణుముల్ కాంగ్రెస్‌ను విడిచి బీజేపీలో చేరితే, వచ్చే ఏడాది జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో తృణముల్‌కు ఎదురుగాలి వీచే అవకాశం ఉంది.