![West Bengal BJP MP Apologises Publicly Making Facebook Comments On BJP Leaders - Sakshi](/styles/webp/s3/article_images/2021/07/26/Saumitra-Khan.jpg.webp?itok=DDdUl02o)
కోల్‌కతా: బీజేపీ నాయకులు సువేందు అధికారి, దిలీప్ ఘోష్‌లపై సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలకు పశ్చిమ బెంగాల్ రాష్ట్ర యువజన విభాగం చీఫ్ సౌమిత్రా ఖాన్ బహిరంగ క్షమాపణలు చెప్పారు. ఆదివారం జరిగిన బీజేపీ యూత్ వింగ్ సమావేశంలో సౌమిత్రా ఖాన్ మాట్లాడుతూ.. “ఫేస్‌బుక్‌లో ఓ ప్రకటన చేయడం నా వంతు తప్పు. నేను క్షమాపణ కోరుతున్నాను. నేను సోషల్ మీడియాలో అలాంటి వ్యాఖ్య చేయకూడదు.” అని అన్నారు.
ఉద్యమాన్ని మరింత ముందుకు
అధికార తృణమూల్ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా మరింత తీవ్రమైన ఉద్యమాన్ని ప్రారంభిస్తానని ప్రతిజ్ఞ చేశారు. టిఎంసి 211 అసెంబ్లీ నియోజకవర్గాలను దక్కించుకోగలిగితే, భవిష్యత్తులో బీజేపీ 250 సీట్లను ఎందుకు పొందలేం? మనం ముందుకు సాగాలి, పార్టీకి నాయకత్వం వహించే వారు ఆ బాధ్యతలు స్వీకరిస్తారని అన్నారు. బెంగాల్‌లో ఎన్నికల్లో జరిగిన హింసపై టీఎంసీని తీవ్రంగా విమర్షించారు. ఇక టీఎంసీ "టీఎంసీ 211 అసెంబ్లీ నియోజకవర్గాలను దక్కించుకోగలిగితే, భవిష్యత్తులో బీజేపీ 250 సీట్లను ఎందుకు పొందలేము? మనం ముందుకు సాగాలి, పార్టీకి నాయకత్వం వహించే వారు ఆ బాధ్యతలు స్వీకరిస్తారు" అని ఆయన అన్నారు.
సౌమిత్రా ఖాన్ ఒక ఉద్వేగభరితమైన వ్యక్తి
కాగా ఈ నెల (జూలై) లో ఫేస్ బుక్‌లో స్పందిస్తూ.. ‘‘ ఓ నాయకుడు తరచే ఢిల్లీకి పర్యటనలు చేస్తున్నాడు. పార్టీ సాధించే ప్రతి విజయానికి ఆయనకే పేరు వచ్చింది. ఢిల్లీ నాయకులను ఆయన తప్పుదారి పట్టిస్తున్నాడు. బెంగాల్‌లో పార్టీ ఆయనే పెద్ద నాయకుడిగా భావిస్తున్నాడు. ఇక రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాష్ట్రంలో ఏం జరుగుతుందో.. సగమే అర్థం చేసుకోగలడు. అతను ఇవన్నీ అర్థం చేసుకోలేడు. ’’ అంటూ కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక దిలీప్ ఘోష్ స్పందిస్తూ.. "సౌమిత్రా ఖాన్ ఒక ఉద్వేగభరితమైన వ్యక్తి. నేను అతని పట్ల ఎటువంటి చెడు భావాలను కలిగి లేను. అతను యువ మోర్చాకు నాయకత్వం వహిస్తాడు" అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment