Suvendu Adhikari
-
అలా మాట్లాడటం కంటే చావడం మేలు: సీఎం మమత సంచలన వ్యాఖ్యలు
కోల్‌కతా: పశ్చిమబెంగాల్లో మరోసారి రాజకీయం వేడెక్కింది. బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై అసెంబ్లీలో ప్రతిపక్ష నేత సువేందు అధికారి తీవ్ర ఆరోపణలు చేశారు. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా సరిహద్దులు దాటి వచ్చే చొరబాటుదార్లను ఆమె ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. పొరుగుదేశం నుంచి వచ్చిన ఉగ్రవాదులు బెంగాల్లో స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారన్నారు. సీఎం తీరుతో రాష్ట్ర జనాభా తీరుతెన్నులు మారనున్నాయని ఆరోపించారు.ఇదే సమయంలో ఆధ్యాత్మికంగా ఎంతో ముఖ్యమైన మహా కుంభ్‌ను ఆమె మృత్యు కుంభ్ అంటూ వర్ణించడం ద్వారా కోట్లాదిమంది హిందువుల మనోభావాలను దెబ్బతీశారని మండిపడ్డారు. మంగళవారం అసెంబ్లీ నుంచి సస్పెండైన అనంతరం అసెంబ్లీ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా సువేందు.. ‘అక్రమ చొరబాటుదార్లను అస్సాం ఎస్టీఎఫ్ పట్టుకుంటే మీరు నిద్రపోతున్నారు. కోల్‌కతాలోని కొన్ని ప్రాంతాలు బంగ్లాదేశ్‌లా ఉన్నాయని స్వయంగా మీరే అన్నారు. ఒక మతం జనాభా విపరీతంగా పెరిగిపోతున్నా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. రాష్ట్ర జనాభా తీరుతెన్నులు మారితే మీకు సంతోషమా? మీరు అలా చేయడాన్ని మేం ఒప్పుకోం’ అని హెచ్చరించారు.రుజువు చేస్తే రాజీనామా చేస్తా: మమత బంగ్లాదేశ్‌లోని అతివాదులు, ఉగ్రవాదులతో తనకు సంబంధాలున్నాయంటూ బీజేపీ ఎమ్మెల్యేలు ఆరోపించడంపై సీఎం మమత మండిపడ్డారు. చేతనైతే రుజువు చేయాలని వారికి సవాల్ విసిరారు. ఆధారాలు చూపిస్తే పదవికి రాజీనామా చేస్తానన్నారు. తప్పుడు ఆరోపణలు చేయడం కంటే చావడం మేలని వ్యాఖ్యానించారు. బీజేపీ ఎమ్మెల్యేల నిరాధార ఆరోపణల విషయమై ప్రధాని మోదీకి లేఖ రాస్తానన్నారు. బంగ్లా సరిహద్దులోని చచార్లో రాత్రి కర్ఫ్యూసిల్చార్: తీవ్రవాద శక్తులు, స్మగ్లర్ల కదలికలను నివారించే లక్ష్యంతో భారత్–బంగ్లాదేశ్ సరిహద్దుల్లోని అస్సాం రాష్ట్రం చచార్ జిల్లాలో రాత్రి కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది. శాంతిభద్రతలను కాపాడేందుకు కఠిన నిబంధనలను అమల్లోకి తెస్తూ చచార్ జిల్లా మేజిస్ట్రేట్ మృదుల్ యాదవ్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. సరిహద్దులకు కిలోమీటర్ పరిధిలో సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం వరకు రెండు నెలల పాటు ఇవి అమల్లో ఉంటాయని తెలిపారు. ఈ సమయంలో భారత భూభాగంలోని సుర్మా నది ఒడ్డున ఎవరూ సంచరించరాదని, అనుమతులున్న స్థానిక మత్స్యకారులు మాత్రమే చేపలు పట్టుకోవాలన్నారు. విధి నిర్వహణలో ఉండే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నిబంధనలు వర్తించవని మేజిస్ట్రేట్ స్పష్టం చేశారు. -
‘ఇక మీవంతు’..మమతకు బీజేపీ హెచ్చరిక
కోల్‌కతా: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయంతో ఉత్సాహంలో మునిగితేలుతున్న బెంగాల్ బీజేపీ నేత సువేందు అధికారి ఎసీఎం మమతా బెనర్జీని టార్గెట్‌గా చేసుకుని ‘ఇక మీవంతు’ అని హెచ్చరించారు. కోల్‌కతాతో విలేకరులతో మాట్లాడిన సువేందు అధికారి ‘ఢిల్లీలొ విజయం మనదే.. ఇక 2026లో బెంగాల్ వంతు వస్తుంది’ అని అన్నారు.ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సాధించిన చారిత్రాత్మక విజయం దేశానికి ఎంతో అవసరమని, అవినీతి, అబద్ధాల రాజకీయాల ముగింపునకు ఇది నాంది అని సువేందు అధికారి పేర్కొన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, అవినీతికి పాల్పడిందని, దీనికి ఢిల్లీ ప్రజలు తగిన సమాధానం ఇచ్చారని ఆయన అన్నారు.ఢిల్లీ దేశ రాజధాని అని, దీనిని అంతర్జాతీయ స్థాయి నగరంగా మార్చాల్సివుందని, కానీ ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీని నాశనం చేసిందని ఆరోపించారు. మోదీ ప్రభుత్వ నాయకత్వంలో దేశంలో అభివృద్ధి జరిగినట్లే, ఢిల్లీలో కూడా జరిగి ఉండాల్సిందని ఆయన అన్నారు. బీజేపీ ప్రభుత్వం యమునా ఎక్స్‌ప్రెస్‌వేతో పాటు ఇతర మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసిందని, అయితే ఢిల్లీ ప్రభుత్వం వాటిని నిర్వహించడంలో విఫలమైందన్నారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి ఢిల్లీలోని 90 శాతం బెంగాలీ ఓటర్లు బీజేపీకి అనుకూలంగా ఓటు వేశారని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీలోని బంగ్లాదేశ్, రోహింగ్యా చొరబాటుదారులకు కేజ్రీవాల్ ప్రభుత్వం ఆధార్ కార్డు, ఓటరు ఐడీ కార్డులను ఇవ్వడం ద్వారా ఉచిత విద్యుత్, నీరు వంటి సౌకర్యాలను అందించిందని, ఇది దేశ భద్రతకు ముప్పు అని ఆయన పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వం ఇలాంటి కార్యకలాపాలకు మద్దతు ఇచ్చినట్లే, ఢిల్లీలో జరిగిన అన్ని దేశ వ్యతిరేక కార్యకలాపాలలో కేజ్రీవాల్ పాత్ర ఉందని ఆయన ఆరోపించారు. -
బీజేపీ వస్తే మమత జైలుకే: బెంగాల్ ప్రతిపక్ష నేత సువేందు
కోల్‌కతా:పశ్చిమబెంగాల్ బీజేపీ నేత సువేందు అధికారి తృణమూల్ కాంగ్రెస్ అధినేత, సీఎం మమతా బెనర్జీకి గట్టి వార్నింగ్ ఇచ్చారు. బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వస్తే మమత అరెస్టు తప్పదన్నారు. సందేశ్‌ఖాలీలో మహిళలను టీఎంసీ నేతలు వేధించిన ఘటనలకు మమత బాధ్యత వహించాల్సిందేనని తేల్చిచెప్పారు. ‘2026లో బెంగాల్లో బీజేపీ పవర్లోకి వస్తే సందేశ్‌ఖాలీ ఘటనలపై విచారణ కమిషన్ వేస్తాం. సీఎం మమత కూడా జైలుకు వెళ్లకతప్పదు. సందేశ్‌ఖాలీలో మన తల్లులు, అక్కచెల్లెలను తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపించారు.దీనికి ప్రతిఫలం అనుభవించక తప్పదు’అని సువేందు అధికారి హెచ్చరించారు. మమతా బెనర్జీ సందేశ్‌ఖాలీలో పర్యటించిన మరుసటి రోజే పోటీగా అక్కడ నిర్వహించిన బీజేపీ బహిరంగ సభలో సువేందు ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.కాగా,గతేడాది ప్రారంభంలో తృణమూల్ నేత షాజహాన్‌షేక్ తమ భూములు కబ్జా చేయడమే కాకుండా తమను లైంగికంగా వేధిస్తున్నాడని ఉత్తరపరగణాల జిల్లా సందేశ్‌ఖాలీలో మహిళలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. అనంతరం షేక్‌షాజహాన్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. -
గూండాల చేతిలో పశ్చిమ బెంగాల్: సువేందు అధికారి
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో వరుసగా జరుగుతున్న లైంగిక వేధింపుల ఘటనలు మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేతృత్వంలోని మమత ప్రభుత్వంపై బీజేపీ నేత సువేందు అధికారి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెంటనే రాజీనామా చేయాలని, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని సువేందు అధికారి డిమాండ్ చేశారు. పశ్చిమ బెంగాల్ గూండాలు, రేపిస్టుల చేతుల్లో ఉందని సువేందు ఆరోపించారు. శనివారం నుంచి ఇప్పటి వరకు ఏడు లైంగిక వేధింపుల ఘటనలు జరిగాయని అన్నారు. నిందితులు టీఎంసీతోప్రత్యక్ష సంబంధం కలిగినవారేనని, వీరని మమతా బెనర్జీ పెంచిపోషిస్తున్నారని ఆరోపించారు. మమతా సాగిస్తున్న అవినీతిని బీజేపీ బయటపెడుతుందని అన్నారు. అంతకుముందు బీర్భూమ్లో నర్సుపై వేధింపుల ఘటనపై కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత్ మజుందార్ సీఎం మమతపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పరిపాలనతో పాటు పోలీసింగ్ వైఫల్యమే ఇటువంటి ఘటనలకు కారణమన్నారు. మమతకు పదవిలో కొనసాగే నైతిక హక్కు లేదన్నారు. ఆమె తప్పుకుంటే రాష్ట్రానికి మేలు జరుగుతుందని వ్యాఖ్యానించారు. -
ఎన్నికల్లో ఓటమి.. బీజేపీ నేత కొత్త నినాదం!
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ప్రతిపక్ష బీజేపీ నేత సువేందు అధికారి కీలక వ్యాఖ్యలు చేశారు. బెంగాల్లో బీజేపీ పార్టీకి సంబంధించిన మైనార్టీ విభాగాన్ని రద్దు చేయాలని అన్నారు. ప్రధాని మోదీ ఇచ్చిన సబ్కా సాత్ సబ్కా వికాశ్ నినాదం చేయవద్దని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కోల్‌కతాలో జరిగిన రాష్ట్ర బీజేపీ ఎగ్జిక్యూటీవ్ సమావేశంలో మంగళవారం ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఒక కొత్త నినాదాన్ని చేశారు. జో హమారే సాత్, హమ్ ఉన్కే సాత్ ( ఎవరైతే మాతో ఉంటారో.. వారితో మేము ఉంటాం)అని అన్నారు. ‘జాతీయవాద ముస్లీంల గురించి నేను మాట్లాడితే.. మీరంతా సబ్కా సాత్, సబ్‌గా వికాస్ అని నినాదాలు చేసేవారు. కానీ ఇక నుంచి ఆ నినాదాన్ని నేను పలకను. ఇప్పుడు నేను మరో నినాదాన్ని పలకుతాను. అదేంటి అంటే.. ‘జో హమారే సాత్, హమ్ ఉన్కే సాత్’. మీరు కూడా సబ్కా సాత్, సబ్కా వికాస్ అనటం మానేయండి. ఇక నుంచి మనకు మైనార్టీ మోర్చా అవసరం లేదు’అని అన్నారు. లోక్ సభ ఎన్నికలు, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకోనివాళ్ల కోసం ఓ పోర్టల్‌ను సువేందు అధికారి ప్రారంభించారు.మరోవైపు.. ‘సుమారు 50 లక్షల మంది హిందూ ఓటర్లను లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేయటానికి అనుమతించలేదు. అదేవిధంగా ఇటీవల జరిగిన నాలుగు అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలో సైతం సుమారు 2 లక్షల హిందూ ఓటర్లను ఓటు వేయడానికి అనుమతించలేదు’ అని ‘ఎక్స్’లో తెలిపారు.లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అనుకున్న స్థాయిలో ఎంపీ స్థానాలు గెలచుకోలేకపోయింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో 18 స్థానాలు గెలుచుకున్న బీజేపీ ఈసారి కేవలం 12 సీట్లకే పరిమితమైంది. ఇటీవల జరిగిన నాలుగు అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల్లో మొత్తం అధికారం టీఎంసీ క్లీన్ స్వీప్ చేసింది. ఎన్నికల్లో తమ బీజేపీ గెలుపునుకు ముస్లీం ఓటు బ్యాంక్ అడ్డంకిగా మారిందని బీజేపీ నేత సువేందు అధికారి భావిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక.. కులం, మతాలకు అతీతంగా భారతీయులంతా అభివృద్ధి చెందాలని ప్రధాని మోదీ 2014లో ‘సబ్ కా సాత్, సబ్ కా వికాస్’ నినాదం ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో తమ పార్టీ గెలుపునకు ముస్లిం ఓట్లు ఆశించినంత పడకపోవటంపై సువేందు అధికారి అసంతృప్తితో ఉన్నట్లు పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. -
‘టీఎంసీని ఉగ్రసంస్థగా ప్రకటించి.. సీఎం మమతను అరెస్ట్ చేయాలి’
కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ)ని ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలని, సీఎం మమతా బెనర్జీని వెంటనే అరెస్ట్ చేయాలని బీజేపీ నేత సువేందు అధికారి అన్నారు. సందేశ్‌కాళీలో టీఎంసీ బహిష్కృత నేత షాజహాన్ సన్నిహితుడి వద్ద ఆయుధాలు, మందుగుడు సామాగ్రిని సీబీఐ స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో సువేందు టీఎంసీ, సీఎం మమతపై తీవ్ర ఆరోపణలు చేశారు. అక్కడ లభ్యమైన అన్ని ఆయుధాలు విదేశాలకు చెందినవని తెలిపారు. ‘సందేశ్‌కాళీలో లభించిన అన్ని ఆయుధాలు విదేశాలకు చెందినవి. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు ఉపయోగించే ప్రమాదకరమైన ఆర్డీఎక్స్ వంటి పేలుడు పదార్థాలు ఉన్నాయి. ఈ ఆయుధాలు అన్ని అంతర్జాతీయ ఉగ్రవాదులు ఉపయోగించేవి. అందుకే టీఎంసీని ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నా. అప్పడే పశ్చిమ బెంగాల్ ప్రశాంతంగా ఉంటుంది. సందేశ్‌కాళీలో ఆయుధాలకు సంబంధించి ఘటనకు సీఎం మమత బాధ్యత వహించాలి. సీఎం మమతను వెంటనే అరెస్ట్ చేయాలి’ అని సువేందు డిమాండ్ చేశారు.Paschim Medinipur, West Bengal | Bengal Assembly LoP Suvendu Adhikari says, "All the weapons found in Sandeshkhali are foreign. Explosives like RDX are used in horrific anti-national activities. All these weapons are used by international terrorists. I demand to declare Trinamool… pic.twitter.com/IOfFUknMFL— ANI (@ANI) April 27, 2024 శుక్రవారం సందేశ్‌కాళీలో సీబీఐ జరిపిన సోదాల్లో టీఎంసీ సస్పెండెడ్ నేత షాజహాన్ షేక్ సన్నిహితుడి వద్ద ఆయుధాలు, మందు గుండు సామాగ్రి, ఒక పోలీసు తుపాకీ లభించింది. వాటిని సీబీఐ స్వాధీనం చేసుకుంది. ఈ దాడులపై టీఎంసీ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. ‘రెండో విడత లోక్‌సభ ఎన్నికల పోలింగ్ వేళ (శుక్రవారం) సీబీఐ పలు చోట్ల సోదాలు చేపట్టింది’ అని ఆరోపణలు చేసింది.జనవరిలో ఈడీ అధికారులుపై టీఎంసీ కార్యకర్తలు చేసిన దాడికి సంబంధించి శుక్రవారం సీబీఐ పలు చోట్లు సోదాలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఇక.. షాజహాన్ షేక్‌ను బెంగాల్ పోలీసులు ఫ్రిబవరి 29న అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. -
బీజేపీకి అభ్యర్థులు కావలెను. ఆసక్తి రేపుతున్న ‘టీఎంసీ’ పోస్టర్లు
కలకత్తా: లోక్‌సభ ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్లో బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) మధ్య జరుగుతున్న పోస్టర్ వార్ ఆసక్తిరేపుతోంది. బీజేపీ ఇప్పటికీ అభ్యర్థులను ప్రకటించని అసన్సోల్, డైమండ్ హార్బర్ లోక్‌సభ సీట్ల విషయంలో టీఎంసీ గోడలపై పోస్టర్లు వేసింది. క్యాండిడేట్ వాంటెడ్ అని షాడో ఫేస్ ఉన్న పోస్టర్లను వీధుల్లో అంటించారు. దమ్ముంటే బీజేపీ లెజిస్లేచర్ పార్టీ నేత సువేందు అధికారి డైమండ్ హార్బర్ సీటు నుంచి పోటీ చేయాలని టీఎంసీ సవాల్ విసురుతోంది. ఇక్కడి నుంచి ప్రస్తుతం టీఎంసీ జనరల్ సెక్రటరీ, సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక అసన్సోల్ నుంచి బీజేపీ క్యాండిడేట్‌గా ప్రకటించిన పవన్‌సింగ్ మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి పోటీ నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి కొనితెచ్చుకున్నారు. దీంతో బీజేపీ ఇక్కడ ఇప్పటివరకు అభ్యర్థిని ప్రకటించలేదు. అసన్సోల్లో పోటీ చేసేందుకు బీజేపీకి అభ్యర్థులే లేరని టీఎంసీ ఎద్దేవా చేస్తోంది. కాగా, పశ్చిమ బెంగాల్లో ఈ నెల 19న తొలి దశ లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఇదీ చదవండి.. బీజేపీకి షాక్ శివసేన(ఉద్ధవ్)లోకి సిట్టింగ్ ఎంపీ -
‘సువేందును పోటీకి దింపాలి’.. బీజేపీకి టీఎంసీ సవాల్
కోల్‌కతా: లోక్ సభ ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న వేళ పార్టీలు అభ్యర్థుల ఎంపిక, జాబితా విడుదల చేయటంలో బిజీగా ఉంటున్నాయి. ఎన్డీయే కూటమిలో భాగంగా బీజేపీ.. ఇండియా కూటమిలో భాగంగా కాంగ్రెస్ పోటాపోటీగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాలను విడుదల చేస్తున్నాయి. ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసీ) నేత కునాల్ ఘోష్ బీజేపీకి సవాల్ విసిరారు. బెంగాల్‌లోని డైమండ్ హార్బర్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిని ప్రకటించటంలో జాప్యం చేస్తుందని అన్నారు. ఆ స్థానంలో పోటీకి నిలపడానికి బీజేపీకి అభ్యర్థులే దొరకటం లేదని ఎద్దేవా చేశారు. డైమండ్ హార్బర్ నియోజకవర్గంలో బీజేపీ నేత సువేందు అధికారిని పోటీకి దింపాలని టీఎంసీ నేత కునాల్ ఘోష్ సవాల్ విసిరారు. ‘బీజేపీ నేత సువేందు అధికారికి నేను బహిరంగ వివాల్ విసురుతున్నా. ఆయిన డైమండ్ హార్బర్ సెగ్మెంట్లో మా నేత అభిషేక్ బెనర్జీపై పోటీ చేయలి’ అని కునాల్ అన్నారు. ఇప్పటికీ డైమండ్ హార్బర్ సెగ్మెంట్లో బీజేపీ ఎవరినీ పోటీకి దింపలేదు. ఇక.. ఈ సీటులో పోటీ చేయాలని బీజేపీ తమ అభ్యర్థులను కోరుతోందని ఎద్దేవా చేశారు. అయితే టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీకి కంచుకోట అయిన డైమండ్ హార్బర్ సెగ్మెంట్ నుంచి బీజేపీ అభ్యర్థిని ప్రకటించకపోవటం గమనార్హం. సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ 2014, 2019 రెండు సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజర్టీతో గెలుపొందారు. ఆదివారం బీజేపీ ఐదో జాబితాలో భాగంగా 111 మంది అభ్యర్థులు ప్రకటించింది. అందులో బెంగాల్ నుంచి 19 మంది అభ్యర్థులు పోటీకి దింపింది. ఇప్పటి వరకు మొత్తం 38 మంది అభ్యర్థులను బీజేప ప్రకటించింది. ఇక.. పశ్చిమ బెంగాల్లో మొత్తం ఏడు విడతల్లో ఎన్నికల పోలింగ్ జరగనుంది. చదవండి: ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు.. డీఎంకే మంత్రిపై కేసు -
రసవత్తరంగా కోల్‌కతా రాజకీయాలు..
సాక్షి,కోల్‌కతా : దేశంలో ఎన్నికల రణరంగంలో ఆసక్తికర పరిణామాలు చేటు చేసుకుంటున్నాయి. ప్రజా సంక్షేమం కోసం కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి పదవికి రాజీనామా చేసిన అనంతరం జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ త్వరలో రాజకీయాల్లోకి అడుగపెట్టనున్నారు. బీజేపీ లోక్‌సభ అభ్యర్ధిగా పోటీ చేయనున్నట్లు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఇటీవల జస్జిస్ అభిజిత్ గంగోపాధ్యాయ పశ్చిమ్ బెంగాల్ స్కూళ్లలో ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర పోస్టుల ఎంపికలో అవకతవకలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టారు. సీబీఐ, ఈడీలకు సైతం దర్యాప్తు చేయాలని ఆదేశాలిచ్చారు. ఈ అంశం కోల్‌కతాతో పాటు దేశ వ్యాప్తంగా చర్చాంశనీయంగా మారింది. తమ్లుక్ లోక్‌సభ అభ్యర్ధిగా.. ఇప్పుడు ఆయనే స్వయంగా రాజకీయాల్లో అడుగు పెడుతుండడంతో కోల్‌కతా రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఈ తరుణంలో పశ్చిమ బెంగాల్‌లోని తమ్లుక్ పార్లమెంటరీ నియోజకవర్గం నుండి ఆయనను బీజేపీ అభ్యర్థిగా నిలబెట్టవచ్చని ఊహాగానాలు వెలువడ్డాయి. ఒకప్పుడు ఈ స్థానంలో పశ్చిమ బెంగాల్ ప్రతిపక్షనేత, బీజేపీ నేత సువేందు అధికారి ఎంపీగా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం సువేందు అధికారి తమ్ముడు, టీఎంసీ నేత దిబ్యేందు అధికారి ఎంపీగా కొనసాగుతున్నారు. పార్టీల కోసం.. మరోవైపు కోల్కత్తా హైకోర్టు న్యాయమూర్తి అభిజిత్ గంగోపాధ్యాయ రాజీనామాపై ఆయన బీజేపీలో చేరుతారనే ఊహాగానాల మధ్య శివసేన (యుబిటి) ఎంపీ సంజయ్ రౌత్ స్పందించారు.‘హైకోర్టు, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జీలు రాజీనామా చేసి రాజకీయాల్లోకి రావడం అంటే న్యాయం చేయడం లేదు. పార్టీ కోసం పనిచేస్తున్నారని వ్యాఖ్యానించారు. -
‘మమత అక్క కాదు.. గయ్యాళి అత్త’
పశ్చిమ బెంగాల్లో సందేశ్‌ఖాలీ ఘటన వెలుగు చూసినప్పటి నుంచి మమత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ ఉద్యమించాయి. అయితే రాష్ట్రంలోని శాంతియుత వాతావరణాన్ని బీజేపీ చెడగొట్టిందని అధికార పార్టీ ఆరోపిస్తోంది. ఇప్పుడు బెంగాల్ రాజకీయాలన్నీ సందేశ్‌ఖాలీ చుట్టూ తిరుగుతున్నాయి. పశ్చిమ బెంగాల్ బీజేపీ సీనియర్ నేత శుభేందు అధికారి మరోసారి బెంగాల్ ముఖ్యమంత్రిని టార్గెట్ చేశారు. మమతా బెనర్జీ ఇప్పుడు అక్క(దీదీ) కాదని, గయ్యాళి అత్తగా మారిపోయారని ఆరోపించారు. ఇకపై మమతా బెనర్జీని ‘దీదీ’ అని పిలవడం మానేయాలని అన్నారు. ఇది అత్త, మేనల్లుడి ప్రభుత్వమని ఆరోపించారు. దీదీ అనే పేరులో మానవత్వం స్ఫురిస్తుందని, అయితే మమతా బెనర్జీలో క్రూరత్వం ప్రతిబింబిస్తోందని ఆరోపించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్‌లో ఆమెను ఓడించానని, అందుకే తనపై 42 కేసులు పెట్టారని శుభేందు అధికారి ఆరోపించారు. పశ్చిమ బెంగాల్‌లోని నార్త్ 24 పరగణ జిల్లాలో ఉన్న సందేశ్‌ఖాలీ గ్రామం నిరసనలకు సాక్షిగా మారింది. ఈ ప్రాంతానికి చెందిన మహిళలు ఇటీవల టీఎంసీ నేత షాజహాన్ షేక్‌తో పాటు ఇతర నేతలు తమ భూములను స్వాధీనం చేసుకున్నారని, లైంగిక దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. ఈ నేపధ్యంలోనే ఈ ప్రాంతం నిరసనలకు నిలయంగా మారింది. -
పోలీస్ అధికారిపై ‘ఖలిస్తానీ’ వ్యాఖ్యలు...చిక్కుల్లో బీజేపీ నేత
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో ‘సందేశ్‌ఖాలీ’ వివాదం సద్దుమణగడం లేదు. నార్త్ 24 పరిగణాల జిల్లాలోని సందేశ్‌ఖాలీలో టీఎంసీ నేతలు భూఆక్రమణలు, మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారనే ఆరోపణలు గత వారం రోజులుగా రాజకీయ దుమారాన్ని రేపుతోంది. ఈ వ్యవహారంలో తాజాగా సిక్కు పోలీస్ అధికారిని ఖలిస్తానీ అంటూ దూషించడంతో రాష్ట్ర బీజేపీ నేత సువేందు అధికారి చిక్కుల్లో పడ్డారు. ఈ వీడియోను పశ్చిమ బెంగాల్ పోలీసులు మంగళవారం షేర్ చేయడంతో తాజా వివాదం రాజుకుంది. ‘మా అధికారులలో ఒకరిని రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి 'ఖలిస్తానీ' అని పిలిచారు. అది తప్పు. అతను గర్వించదగిన సిక్కు, అలాగే చట్టాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్న సమర్థుడైన పోలీసు అధికారి. ఈ వ్యాఖ్యలు మతపరంగా రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి. ఇది నేరపూరిత చర్య. ఒక వ్యక్తి మతపరమైన విశ్వాసాలను దెబ్బతీసేలా చేసిన ఈ వ్యాఖ్యలను మేము ఖండిస్తున్నాం’ అని రాష్ట్ర పోలీసు అధికారిక హ్యాండిల్ నుంచి ట్వీట్ చేశారు. చదవండి: సీనియర్ లాయర్ ఫాలీ నారీమన్ కన్నుమూత We, the West Bengal Police fraternity, are outraged to share this video, where one of our own officers was called ‘Khalistani’ by the state's Leader of the Opposition. His ‘fault’: he is both a proud Sikh, and a capable police officer who was trying to enforce the law…(1/3) — West Bengal Police (@WBPolice) February 20, 2024 సువేందు అధికారి వ్యాఖ్యలను సీఎం మమతా బెనర్జీ ఖండించారు. బీజేపీ విభజన రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. బీజేపీ నేతపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు. మరోవైపు ఈ ఆరోపణలను బీజేపీ ఖండించింది. పోలీసులు అధికార టీఎంసీకి లోబడి పనిచేస్తున్నారని మండిపడింది. Stern legal action is being initiated. (3/3)#Honourandduty #WBP pic.twitter.com/ucHCZTLFvk — West Bengal Police (@WBPolice) February 20, 2024 అయితే సువేందు అధికారి నేతృత్వంలో నిరసనకారులు సందేశ్‌ఖాలీని సందర్శించేందుకు వెళ్తుండగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఆ తర్వాత జరిగిన ఘర్షణలో, నిరసనకారులలో ఒకరు సంఘటన స్థలంలో విధులు నిర్వహిస్తున్న సీనియర్ పోలీసు అధికారిని ‘ఖలిస్తానీ’ అని పిలిచినట్లు తెలుస్తోంది. దీంతో కోపోద్రిక్తుడైన అధికారి ‘నేను తలపాగా వేసుకున్నాను, అందుకే నన్ను ఖలిస్తానీ అంటారా? దీనిపై నేను చర్య తీసుకుంటాను. మీరు నా మతంపై దాడి చేయలేరు. మీ మతం గురించి నేను ఏమీ చెప్పలేదు" అని అధికారి చెబుతున్నట్లు వీడియోలో వినిపిస్తోంది. -
Sandeshkhali: బెంగాల్ సర్కార్‌పై హైకోర్టు సీరియస్
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీలో చోటు చేసుకున్న అశాంతి విషయంలో కోల్‌కతా హైకోర్టు సీరియస్ అయింది. సీఎం మమతా బెనర్జీ ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేసింది. ఈ ఘటనకు సంబంధించిన కేసును మంగళవారం కోల్‌కతా హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సందేశ్‌కాలీ ఘటనపై ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఎంసీ నేత షాజాహాన్ షేక్ పరారీలోనే ఉండటానికి వీలులేదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆయన్ను సమర్థించకూడదని పేర్కొంది. సందేశ్‌ఖాలీని సందర్శించేందుకు అనుమతి ఇవ్వాలని బీజేపీ నేత సువేందు అధికారి అభ్యర్థించారు. ఆయన విజ్ఞప్తిపై ప్రధాన న్యాయమూర్తి టీఎస్ శివజ్ఞానం స్పదించారు. సందేశ్‌కాళీ ప్రాంతంలోని మహిళలు చేసిన ఆరోపణలను హైకోర్టు గుర్తించిందని తెలిపారు. ‘మేము అక్కడి మహిళలకు సంబంధించి బాధలను చూశాం. ఆ ప్రాంతంలోని మహిళలు సమస్యలపై నిరసన తెలిపారు. అక్కడ కొంత భూమి ఆక్రమణకు గురైంది. ఈ కేసులో ప్రాథమికంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఎంసీ నేత షాజాహాన్ షేక్ పరారీలోనే ఉండటానికి వీలులేదు. రాష్ట్రం ప్రభుత్వం కూడా విషయాన్ని సమర్ధించదు. ఆయన లొంగిపోవాలి. ఆయన చట్టాన్ని ధిక్కరించడం సాధ్యం కాదు’అని ప్రధాన న్యాయమూర్తి అన్నారు. ‘నేరాలకు పాల్పడిన వ్యక్తి పరారీలో ఉన్నాడు. ఆయన రక్షించబడుతున్నాడో? లేదో? మాకు తెలియదు. రాష్ట్ర పోలీసులు మాత్రం పలు ఘటనల్లో కీలకంగా ఉన్న షాజాహాన్ షేక్‌ను అరెస్ట్ చేయలేకపోయారు’ అని ప్రధాన న్యాయమూర్తి తెలిపారు. చదవండి: Sandeshkhali: సువేందు అధికారిని మరోసారి అడ్డుకున్న పోలీసులు -
Sandeshkhali: సువేందు అధికారిని మరోసారి అడ్డుకున్న పోలీసులు
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో సందేశ్‌ఖాలీ వ్యవహారం రోజురోజుకీ రాజకీయ దుమారం రేపుతోంది. తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సందేశ్‌ఖాలీని సందర్శించడానికి వెళ్లిన రాష్ట్ర ప్రతిపక్ష నేత, బీజేపీ నేత సువేందు అధికారి, సీపీఎం బృందా కారత్ను పోలీసులు మంగళవారం అడ్డుకున్నారు. సువేందు అధికారి తన మద్దతు దారులతో కలిసి సందేశ్ ఖాలీకి వెళ్తుండగా ధమాఖలి వద్ద పోలీసులు, అల్లర్ల నియంత్రణ దళం సిబ్బంది బారికేడ్లతో అడ్డుకున్నారు. దీంతో బీజేపీ, సీపీఎం మద్దతుదారులు ధమాఖలీలో వేర్వేరుగా నిరసనలు చేపట్టారు. కాగా నార్త్ 24 పరిగణాల జిల్లాలోని సందేశ్శాలీలో కొందరు టీఎంసీ నేతలు భూఆక్రమణలు, మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారనే బీజేపీ ఆరోపణలతో ఇటీవల పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు వెళ్లువెత్తుతున్న విషయం తెలిసిందే. టీఎంసీ నేతలపై ఆరోపణల అనంతరం నందిగావ్ బీజేపీ ఎమ్మెల్యే సువేందు సందేశ్ ఖాలీని సందర్శించడం ఇది మూడోసారి. బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు ఆయన అంతకముందు రెండుసార్లు ప్రయత్నించినప్పటికీ పోలీసులు అడ్డుకున్నారు. చదవండి: 2018 పరువునష్టం కేసులో రాహుల్‌కు ఊరట.. అయితే సందేశ్‌కాలీ గ్రామంలో పర్యటించేందుకు బీజేపీ నేత సువేందు అధికారితోపాటు ఎమ్మెల్యే శంకర్ ఘోష్‌కు కోల్‌కతా హైకోర్టు సోమవారం అనుమతి ఇచ్చింది. తన మద్దతుదారులతో కలిసి వెళ్లవద్దని పేర్కొంది. భద్రతా సిబ్బందితో వెళ్లొచ్చని తెలిపింది. అలాగే రెచ్చగొట్టే ప్రసంగాలేవీ చేయవద్దని, శాంతిభద్రతలకు విఘాతం కలగనీయరాదని హెచ్చరించింది. అదే విధంగా బీజేపీ నేత సందేశ్‌ఖాలీని సందర్శించడంపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును మంగళవారం ఉదయం హైకోర్టు డివిజన్ బెంచ్ సమర్థించింది, సందేశ్ కాలీ వెళ్లేందుకు కోర్టు అనుమతి ఇచ్చినా కూడా తనను అడ్డుకుంటున్నారని సువేందు అధికారి అసహనం వ్యక్తం చేశారు. ఇది దురదృష్టకరమని అన్నారు. ఈ విషయాన్ని కోల్‌కతా హైకోర్టు దృష్టికి ఈసుకెళ్తానని తెలిపారు. మమతా బెనర్జీ ప్రభుత్వం, రాష్ట పోలీసులు కలకత్తా హైకోర్టు ఆదేశాలను పాటించడం లేదని మండిపడ్డారు. -
ఘోర ప్రమాదం.. ఎమ్మెల్యే కారు ఢీకొని వ్యక్తి మృతి
లక్నో: పశ్చిమబెంగాల్ బీజేపీ ఎమ్మెల్యే సువేందు అధికారి కాన్వాయ్‌లోని కారు ఢీకొనడంతో ఓ వ్యక్తి మరణించాడు. ఈ ఘటన రాష్ట్రంలోని పుర్భా మేదినీపూర్ జిల్లాలోని చందీపూర్‌లో గురువారం రాత్రి జరిగింది. పెట్రోల్‌బంక్ వద్ద సీక్ ఇస్రాఫిల్ అనే వ్యక్తి రోడ్డు దాటుతుండగా కారు ఢికొట్టిన్నట్లు ప్రత్యక్ష సాక్షులు, స్థానికులు తెలిపారు. అంతేగాక ప్రమాదం జరిగిన తర్వాత కూడా కారు ఆపకుండా వెళ్లిపోయినట్లు పేర్కొన్నారు. కాగా రోడ్డు ప్రమాదానికి కారణమైన కారు నందిగ్రామ్ ఎమ్మెల్యే కాన్వాయ్‌కు చెందినదో కాదో విషయంపై పోలీసులు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. అయితే సువేందు అధికారి మోయినాలో జరిగిన పార్టీ కార్యక్రమం నుంచి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగినట్లు జాతీయ మీడియా నివేదించింది. మరోవైపు ప్రమాదానికి కారణమైన సువేందు అధికారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ స్థానికులు రోడ్డుపై బైఠాయించి నిరసనలు వ్యక్తం చేశారు. ఇక నందిగ్రామ ఎమ్మెల్యే సువేందు అధికారి ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. దీనిపై సీనియర్ పోలీస్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ‘ రాత్రి 10.30 గంటలకు పెట్రోల్ బంక్ దగ్గర రహదారి దాటుతుండగా కారు ఢీకొట్టింది. స్థానిక ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించాడు. మృతుడిని సీక్ ఇస్రాఫిల్‌గా గుర్తించాం. ఎమ్మెల్యే సువేందు కాన్వాయ్ కారు గుద్దడంతోనే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనిని ఇంకా ధృవీకరించలేదు. దీనిపై సువేందు అధికారితో సహా బీజేపీ నాయకులెవరూ స్పందించలేదు.’ అని తెలిపారు. చదవండి: కలబురిగిలో నువ్వా.. నేనా! హైదరాబాద్ కన్నడనాట తీవ్ర పోటీ -
టీఎంసీకి జాతీయ హోదా రద్దుపై షాకు దీదీ ఫోన్ చేశారన్న సువేందు
-
మమతా దీదీకి బీజేపీ సవాల్!...దమ్ముంటే ఈ చట్టాన్ని ఆపండి!
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో బీజేపీ నాయకుడు సువేందు అధికారి రాష్ట్రంలో పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలవుతోందని నొక్కి చెప్పారు. ఈ మేరకు ఆయన బంగ్లాదేశ్ మూలాలు ఉన్న మతువా ఆధిపత్య ప్రాంతమైన నార్త్ 24 పరగణాస్ జిల్లాలోని ఠాకూర్ నగర్లో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ....విస్వసనీయ పత్రాలతో కూడిన నివాసి అయితే వారికి పౌరసత్వం తీసివేయబడుతుందని సీఏఏ సూచించలేదు. తాము అనేకసార్లు సీఏఏ గురించి చర్చించాం. కచ్చితంగా రాష్ట్రంలో అములు చేయబడుతుంది. దీంతో అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుంచి వచ్చిన సిక్కు, బౌద్ధ, జైన్, పార్సీ, క్రైస్తవ వర్గాలకు చెందిన వలసదారులకు పౌరసత్వం మంజూరు అయ్యేలా సీఏఏ సులభతరం చేస్తోంది. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఉద్దేశిస్తూ....దీదీజీ మీకు దమ్ముంటే దీన్ని ఆపండి అంటూ సవాలు విసిరారు. ఐతే ఆ చట్టం కింద ఉన్న నిబంధనలను ప్రభుత్వం ఇంకా రూపొందించనందున ఇప్పటివరకు ఎవరికీ ఆ చట్టం ద్వారా పౌరసత్వం మంజూరు కాలేదు. కానీ నందిగ్రామ్ బీజేపీ ఎమ్మెల్యే సువేందు అధికారి మతువా కమ్యూనిటీ సభ్యులకు కూడా పౌరసత్వం ఇవ్వబడుతుందని చెప్పారు. రాజకీయంగా ప్రాముఖ్యమున్న ఈ కమ్యూనిటీ బీజేపీ, తృణమాల్ శిభిరాలుగా చీలిపోయారు. రాష్ట్రంలో సుమారు 30 లక్షల మంది మతువాలతో నాడియా, నార్త్, సౌత్24 పరగణాస్ జిల్లాలో కనీసం ఐదు లోక్‌సభ స్థానాల తోపాటు దాదాపు 50 అసెంబ్లీ స్థానాల్లో ఈ సంఘం ప్రభావం ఉంది. అలాగే కేంద్ర మంత్రి బొంగావ్‌కు చెందిన బీజేపీ ఎంపీ శంతను ఠాకూర్ కూడా కచ్చితంగా సీఏఏ అమలవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యం సాధించేందకు కట్టుబడి ఉన్నాం అన్నారు. ఇదిలా ఉండగా, తృణమాల్ నాయకుడు పశ్చిమబెంగాల్ సీనియర్ మంత్రి ఫిర్హాద్ హకీమ్ మాట్లాడుతూ...2023 పంచాయతీ ఎన్నికలు, 2024లో లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ సీఏఏ కార్డుతో ఓటు బ్యాంకు రాజకీయాలపై ఫోకస్ పెట్టి ఇలా నాటకమాడుతోందని విమర్శించారు. ఐనా అలా ఎప్పటికీ జరగనివ్వం అని హకీమ్ దృఢంగా అన్నారు. (చదవండి: గుజరాత్ ఎన్నికల చిత్రం.. పటేళ్ల రూటు ఎటు?) -
ముందు షారుక్‌ను తీసేసి గంగూలీని పెట్టు.. మమతకు బీజేపీ కౌంటర్
కోల్‌కతా: బీసీసీఐ అధ్యక్ష రేసు నుంచి సౌరవ్ గంగూలీని తప్పించడం తనను షాక్‌కు గురి చేసిందని మమతా బెనర్జీ చెప్పిన విషయం తెలిసిందే. ఈ విషయంలో మోదీ జోక్యం చేసుకోవాలని, గంగూలీని ఐసీసీకి పంపాలని ఆమె కోరారు. అయితే మమత వ్యాఖ్యలకు బీజేపీ గట్టి కౌంటర్ ఇచ్చింది. గంగూలీ గొప్పతనం గురించి నిజంగా ఆమెకు తెలిస్తే.. బెంగాల్ బ్రాండ్ అంబాసిడర్‌గా షారుక్ ఖాన్‌ను తప్పించాలని, ఆ స్థానాన్ని దాదాతో భర్తీ చేయాలని డిమాండ్ చేసింది. ఆ తర్వాతే మమత మాట్లాడాలని తెలిపింది. బీజేపీ నేత, బెంగాల్ ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి ఈమేరకు వ్యాఖ్యానించారు. అంతేకాదు క్రీడలపై రాజకీయం చేయొద్దని మమతకు సూచించారు సువేందు అధికారి. ఇలాంటి విషయాలకు ప్రధాని మోదీ చాలా దూరంగా ఉంటారని, ఆయన ప్రస్తావన తీసుకురావద్దని హితవు పలికారు. క్రికెట్ వ్యవహారాల్లో ప్రధాని జోక్యం చేసుకోరని మమతకు ఆ మాత్రం తెలియదా? అని సెటైర్లు వేశారు. అంతకుముందు గుంగూలీకి మద్దతుగా మాట్లాడారు మమతా బెనర్జీ. ఆయన ఏం తప్పు చేశారని బీసీసీఐ అధ్యక్ష రేసు నుంచి తప్పించారని ప్రశ్నించారు. ప్రధాని మోదీ అయినా జోక్యం చేసుకుని గంగూలీని ఐసీసీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అమిత్ షా కుమారుడు జైషాను మాత్రం రెండోసారి బీసీసీఐ కార్యదర్శిగా కొనసాగించడాన్ని ప్రశ్నించారు. చదవండి: గంగూలీ వ్యవహారంపై మమతా బెనర్జీ తీవ్ర అసంతృప్తి.. ‘ఇది నిజంగా షాక్’ -
‘నేను మగవాడిని.. నా శరీరాన్ని ఈడీ, సీబీఐ తాకలేవు’
కోల్‌కతా: మహిళా పోలీసులు తనతో దురుసుగా ప్రవర్తించారంటూ ఇటీవల పశ్చిమబెంగాల్ బీజేపీ ఎమ్మెల్యే, ప్రతిపక్ష నేత సువేందు అధికారి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ చేపట్టిన ర్యాలీని పోలీసులు అడ్డుకొని.. సువేందు అధికారిని వ్యాన్‌లోకి ఎక్కిస్తున్న తరుణంలో మహిళా పోలీసులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీరు మహిళా అధికారి. నన్ను టచ్ చేయొద్దు.. పురుష సిబ్బందిని పిలవండి’ అని వారించారు. తాజాగా సువేందు అధికారి వ్యాఖ్యలకు టీఎంసీ ఎమ్మెల్యే కౌంటర్ ఇచ్చారు. టీఎంసీ శాసన సభ్యుడు ఇద్రిస్ అలీ ‘ఈడీ, సీబీఐ నా శరీరాన్ని తాకలేవు.. నేను మగవాడిని’ అని రాసి ఉన్న కుర్తా ధరించి అసెంబ్లీ లోపలికి వెళ్లాడు. టీఎంసీ ఎమ్మెల్యే ఇలాంటి డ్రెస్ ధరించి అసెంబ్లీకి ఎందుకు వచ్చారని మీడియా ప్రశ్నించగా.. ‘తనను సీబీఐ, ఈడీ తాకలేవని భావించే ఓ బీజేపీ నేత ఉన్నారు’ అంటూ సువేందు అధికారిని ఉద్ధేశిస్తూ చురకలంటించారు. చదవండి: సహనం కోల్పోతున్నాం: హిజాబ్ వాదనలపై సుప్రీం కాగా పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని ఆరోపిస్తూ ‘నబానా ఛలో’ పేరుతో బీజేపీ ర్యాలీ చేపట్టిన విషయం తెలిసిందే ఈ క్రమంలో ఓ మహిళా పోలీస్ తనతో దురుసుగా ప్రవర్తించారని ప్రతిపక్ష నేత సువేందు అధికారి ఆరోపణలు చేశారు. ర్యాలీని అడ్డుకున్న పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. కొంతమంది మహిళా పోలీసులు అతన్ని వ్యాన్‌లోకి ఎక్కిస్తున్న తరుణంలో వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ‘నన్ను టచ్ చేయొద్దు’ అని వారించారు. అనంతరం ఇదే విషయంపై ఆయన మాట్లాడుతూ.. ప్రతి మహిళా కళ్లల్లో దుర్గామాతను చూస్తానని, మహిళలంటే ఎంతో గౌరవమని తెలిపారు. -
మాట్లాడింది మమతేనా? మోదీకి సపోర్ట్ చేయడమేంటి?
కోల్‌కతా: ప్రధాని నరేంద్ర మోదీపై వీలుచిక్కినప్పుడల్లా విమర్శలు, కుదిరితే సెటైర్లు వేస్తుంటారు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. అసెంబ్లీ ఎన్నికల సమయంలో వీరిద్దరి మధ్య మాటల యుద్ధమే నడిచింది. అయితే ఇప్పుడు మమతలో అనూహ్య మార్పు వచ్చింది. బెంగాల్ అసెంబ్లీలో మోదీకి మద్దతుగా ఆమె మాట్లాడటం ఇప్పుడు చర్చనీయాంశమైంది. కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగంపై బెంగాల్ అసెంబ్లీలో సోమవారం చర్చ జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన మమత.. సీబీఐ, ఈడీకి బయపడి దేశంలోని వ్యాపారస్థులు విదేశాలకు పారిపోతున్న విషయాన్ని ప్రస్తావించారు. అయితే దీనికి మోదీ కారణం కాదని తాను భావిస్తున్నట్లు చెప్పారు. సీబీఐ హోంశాఖ పరిధిలోకి వస్తుందని, ప్రధాని కార్యాలయానికి దీనితో సంబంధం లేదని చెప్పారు. కొందరు బీజేపీ నేతలు తరచూ హోంమంత్రిని కలిసి తమపై కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. ఎప్పుడూ మోదీపై విమర్శలు గుప్పించే మమత.. ఇప్పుడు ఆయనకు మద్దతుగా మాట్లాడటం సొంత పార్టీ నేతలను కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. కుతంత్రం.. అయితే మమత వ్యాఖ్యలపై బీజేపీ నేత సువేంధు అధికారి స్పందించారు. బొగ్గు కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అల్లుడు అభిషేక్ బెనర్జీని కాపాడుకునేందుకే ఆమె ఇలా మాట్లాడుతున్నారని విమర్శించారు. మమత కుతంత్రాలను బీజేపీ ఆ మాత్రం పసిగట్టలేదా అని సెటైర్లు వేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగానికి వ్యతిరేకంగా బెంగాల్ అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదించారు సీఎం మమతా బెనర్జీ. అయితే ఈ చర్యను బీజేపీ తప్పుబట్టింది. తర్వాత న్యాయవ్యవస్థకు వ్యతిరేకంగా ఇలాగే తీర్మానాన్ని తీసుకొస్తారా? అని ప్రశ్నించింది. చదవండి: కాంగ్రెస్ అధ్యక్ష బరిలో శశి థరూర్! సోనియాతో కీలక భేటీ -
బెంగాల్ సీఎం మమతకు ఊహించని షాక్.. భారీ విజయం అందుకున్న బీజేపీ
బెంగాల్ రాజకీయాల్లో అధికార టీఎంసీ, బీజేపీ మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమనే వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల నుంచి రెండు పార్టీల నేతల మధ్య మాటల వార్ ఇంకా నడుస్తూనే ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన బెంగాల్లో కాషాయ జెండా ఎగురవేయాలన్న బీజేపీకి చేదు అనుభవమే ఎదురైనప్పటికీ సీట్ల విషయం మాత్రం పుంజుకుంది. ఇదిలా ఉండగా, తాజాగా అధికార టీఎంసీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మమతా బెనర్జీకి బీజేపీ గట్టి షాకిచ్చింది. పూర్బా మేదినీపూర్ జిల్లాలోని నందిగ్రామ్‌లో జరిగిన సహకార సంఘం ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం సాధించింది. గతంలో ఇక్కడ అధికార తృణమూల్ కాంగ్రెస్ అధికారంలో ఉండేది. కాగా ఆదివారం భేకుటియా సమబే కృషి సమితికి జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఊహించని విధంగా భారీ విజయాన్ని అందుకుంది. ఎన్నికల్లో 12 సీట్లకు గానూ 11 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. ఇక, ఈ ఎన్నికల్లో అధికార టీఎంసీ ఒక్క సీటుకే పరిమితమైంది. మరోవైపు.. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నందిగ్రామ్ నుంచి బరిలోకి దిగిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీని బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి ఓడించారు. ఇక, బీజేపీ విజయంపై సువేందు అధికారి స్పందిస్తూ.. బీజేపీని గెలిపించినందుకు నందిగ్రామ్ నియోజకవర్గం, భేకుటియా సమబే కృషి ఉన్నయన్ సమితి సహకార సంఘం ఓటర్లందరికీ ధన్యవాదాలు. ఇలాంటి విజయాలు భవిష్యత్తులో గొప్ప విజయానికి బాటలు వేస్తాయి అని కామెంట్స్ చేశారు. Big SETBACK for Mamata Banerjee, BJP wins 11 out of 12 seats in Nandigram co-operative body election Nandigram: Bhekutia Samabay Krishi Samity, which was held by Mamata Banerjee's Trinamool Congress (TMC) for a long time, took over by the Saffron camphttps://t.co/q55vSFd14i — Selvam 🚩 (@tisaiyan) September 19, 2022 -
కోవిడ్ వ్యాక్సినేషన్ పూర్తవగానే అమలులోకి ‘పౌరసత్వ’ చట్టం!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచనలంగా మారిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలు మరోమారు తెరపైకి తీసుకొచ్చారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. కోవిడ్-19 టీకాల పంపిణీ పూర్తవగానే పౌరసత్వ చట్టం అమలు చేస్తామని వెల్లడించారు. పశ్చిమ బెంగాల్ ప్రతిపక్ష నేత సువేందు అధికారితో మంగళవారం పార్లమెంట్ హౌస్‌లో సమావేశమైన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు హోంమంత్రి. బెంగాల్లో బీజేపీ కార్యవర్గ సమస్యలపై చర్చించేందుకు ఇరువురు సమావేశమైనట్లు తెలిసింది. అనంతరం మాట్లాడిన సువేందు అధికారి సీఏఏ అంశాన్ని తెలిపారు. ‘కోవిడ్-19 మూడో డోసు పంపిణీ పూర్తవగానే దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సీఏఏ అమలు చేస్తామని అమిత్ షా చెప్పారు.’ అని పేర్కొన్నారు అధికారి. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఏడాది ఏప్రిల్‌లో బుస్టర్ డోసుల పంపిణీని ప్రారంభించింది కేంద్రం. అది తొమ్మిది నెలల్లో పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయని అంచనా. మే నెలలో పశ్చిమ బెంగాల్‌లోని న్యూ జల్పాయ్గురిలో నిర్వహించి సభలో సీఏఏపై మాట్లాడారు అమిత్ షా. సీఏఏను అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమిపాలైన తర్వాత తొలిసారి రాష్ట్రంలో పర్యటించిన సందర్భంగా సీఏఏ ప్రస్తావన తీసుకొచ్చారు కేంద్ర మంత్రి. పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ వంటి దేశాల నుంచి భారత్‌కు వలస వచ్చిన అక్కడి మైనారిటీ హిందూ, సిక్కు, జైన్, బౌద్ధ, పార్సీ, క్రిస్టియన్ మతాలకు చెందిన వారికి పౌరసత్వం కల్పించేందుకు సీఏఏ సవరణ చట్టాన్ని తీసుకొచ్చింది కేంద్రం. అయితే.. 2014, డిసెంబర్ 31లోపు వచ్చిన వారికి మాత్రమే పౌరసత్వం కల్పించాలని నిర్ణయించారు. 2019, డిసెంబర్లో ఈ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. దాంతో దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. మతం పేరుతో వివక్ష, రాజ్యాంగ సూత్రాలను ఉల్లంఘిస్తోందని ఆరోపించారు. భారత్‌లోని ముస్లింలను లక్ష్యంగా చేసుకునే నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్, సీఏఏలు ఉన్నాయని పేర్కొన్నారు నిరసనకారులు. ఆ వాదనలను తోసిపుచ్చారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. నిరసనలు రాజకీయంగా ప్రేరేపితమైనవేనని పేర్కొన్నారు. ఏ ఒక్క భారతీయుడు తన పౌరసత్వాన్ని కోల్పోడని హామీ ఇచ్చారు. ఇదీ చదవండి: భవిష్యత్‌లో చరిత్రను నిర్దేశించేది డేటానే - ప్రధాని మోదీ -
బెంగాల్ అసెంబ్లీలో టీఎంసీ-బీజేపీ ఎమ్మెల్యేల కొట్లాట
-
బెంగాల్ అసెంబ్లీలో రచ్చ రచ్చ.. కొట్టుకున్న ఎమ్మెల్యేలు, వీడియో వైరల్
లక్నో: పశ్చిమబెంగాల్ శాసనసభలో అధికార పార్టీ టీఎంసీ, బీజేపీ ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా నేతల మధ్య తోపులాటలు జరిగాయి. రాంపూర్హాట్, బీర్భూమ్ హింసాత్మక ఘటనలపై చర్చలు జరపాలంటూ బీజేపీ ఎమ్మెల్యే, ప్రతిపక్షనేత సువేందు అధికారి డిమాండ్ చేశారు. స్పీకర్ పోడియం వద్ద నిరసనలు తెలియజేశారు. ఈ నేపథ్యంలో టీఎంసీ, బీజేపీ నేతల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఎమ్మెల్యేలు ఒకరినొకరు కొట్టుకున్నారు. ఈ గొడవలో బీజేపీ ఎమ్మెల్యే మనోజ్ తిగ్గ బట్టలు చిరిగిపో.. టీఎంసీ ఎమ్మెల్యే అసిత్ మజుందర్ ముక్కుకు గాయమైంది. మరోవైపు శాసనసభలో జరిగిన గందరగోళం నేపథ్యంలో శాసనసభ ప్రతిపక్షనేత సువేందుతో సహా అయిదుగురు బీజేపీ ఎమ్మెల్యేలను స్పీకర్ సస్పెండ్ చేశారు. స్పీకర్ చర్యపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సువిందు సహా బీజేపీ సభ్యులందరూ సభ భయట నిరసనకు దిగారు. బీజేపీ నేతలపై జరిగిన దాడి నేపథ్యంలో స్పీకర్ చర్యలు తీసుకోకుంటే న్యాయపరమైన పోరాటం చేస్తామని తెలిపారు. చదవండి: కశ్మీర్ ఫైల్స్.. కేజ్రీవాల్‌కు స్ట్రాంగ్ కౌంటర్ కాగా పశ్చిమబెంగాల్లోని బీర్భూమ్ జిల్లాలో పది ఇళ్లకు నిప్పంటించిన ఘటనలో ఎనిమిది మంది సజీవ దహనమైన విషయం తెలిసిందే. టీఎంసీ నాయకుడు తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు బాద్ షేక్ హత్యకి ప్రతీకారంగా మార్చి 21న ఈ ఘటన చోటుచేసుకుంది. బీర్భూమ్ సజీవ దహనాలపై విచారణ బాధ్యతను కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ స్వీకరించింది. ఈ దారుణ ఘటనపై పలు కేసులు నమోదు చేసింది. -
తృణమూల్ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు.. వీడియో వైరల్
కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం బెంగాల్లో వివాదాన్ని రేకెత్తిస్తోంది. దానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పశ్చిమ బెంగాల్‌లోని ఓ పబ్లిక్ మీటింగ్‌లో పాల్గొన్న తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఎమ్మెల్యే మనోరంజన్ బయాపరి బిహార్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కోల్‌కతాలోని బుక్ ఫెయిర్ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన సభలో టీఎంసీ ఎమ్మెల్యే మనోరంజన్ బయాపరి ప్రసంగిస్తూ.. ‘మీలో బెంగాలీ రక్తం ప్రవహిస్తే, ఖుదీరామ్, నేతాజీ(సుభాష్ చంద్రబోస్)ల రక్తం ప్రవహిస్తే.. మాతృభాషను, మాతృభూమిని ప్రేమిస్తే.. ఒక బీహార్ వ్యక్తి వంద వ్యాధులతో సమానం’ అని గట్టిగా అరవాలని వ్యాఖ్యానించారు. బెంగాలీలకు వ్యాధులు వద్దని, బెంగాల్‌ను వ్యాధి రహితంగా మార్చాలని పేర్కొన్నారు. తృణమూల్ ఎమ్మెల్యే చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను బీజేపీ నేత సువేందు అధికారి తీవ్రంగా తప్పుపట్టారు. ఎమ్మెల్యే మనోరంజన్ బయాపరి మాట్లాడిన వీడియో తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ముందు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ యూపీ, బిహారిలు లేని పశ్చిమ బెంగాల్‌గా మార్చాలని అన్నారు. ఎమ్మెల్యే మనోరంజన్ బయాపరి మొదటిసారిగా 2021 బెంగాల్ ఎన్నికల్లో హుగ్లీ నుంచి గెలిచారు. First his leader @MamataOfficial labels Biharis & UPites as "Bohiragotos" & now this clarion call to make Bengal free of Biharis.@BJP4Bihar @BJP4India @renu_bjp @SanjayJaisw @girirajsinghbjp @BJP4Jharkhand@YashwantSinha @PavanK_Varma — Suvendu Adhikari • শুভেন্দু অধিকারী (@SuvenduWB) March 14, 2022 -
2018లో బాడీగార్డు మృతి.. బీజేపీ నేత సువేందుకు సమన్లు
కోల్‌కతా: పశి్చమబెంగాల్ ప్రతిపక్ష నేత సువేందు అధికారికి రాష్ట్ర సీఐడీ అధికారులు సమన్లు జారీ చేశారు. సువేందుకు బాడీగార్డుగా పని చేసిన సబ్ ఇన్స్పెక్టర్ సుభభ్రత చక్రవర్తి మరణానికి సంబంధించిన కేసులో ఆయనకు సీఐడీ సమన్లు జారీ చేసింది. సోమవారం ఉదయం 11 గంటలకు కోల్‌కతాలోని భవాని భనవ్ సీఐడీ ప్రధాన కార్యాలయంలో హాజరు కావాల్సిందిగా చెప్పింది. 2018లో బాడీగార్డు చక్రవర్తి మరణించారు. తుపాకీతో తనకు తానే కాల్చుకొని మరణించినట్లు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. అయితే ఈ ఏడాది జూలైలో తన భర్త కేసును మళ్లీ దర్యాప్తు చేయాల్సిందిగా చక్రవర్తి భార్య రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడంతో కేసు సీఐడీ చేతికి వెళ్లింది. ఈ నేపథ్యంలో సువేందు అధికారికి సీఐడీ సమన్లు జారీ చేసింది. (చదవండి: వింత జబ్బు: 40 ఏళ్లుగా నిద్రపోని మహిళ) -
ఫేస్బుక్ కామెంట్స్ పై బీజేపీ ఎంపీ బహిరంగ క్షమాపణలు
కోల్‌కతా: బీజేపీ నాయకులు సువేందు అధికారి, దిలీప్ ఘోష్‌లపై సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలకు పశ్చిమ బెంగాల్ రాష్ట్ర యువజన విభాగం చీఫ్ సౌమిత్రా ఖాన్ బహిరంగ క్షమాపణలు చెప్పారు. ఆదివారం జరిగిన బీజేపీ యూత్ వింగ్ సమావేశంలో సౌమిత్రా ఖాన్ మాట్లాడుతూ.. “ఫేస్బుక్లో ఓ ప్రకటన చేయడం నా వంతు తప్పు. నేను క్షమాపణ కోరుతున్నాను. నేను సోషల్ మీడియాలో అలాంటి వ్యాఖ్య చేయకూడదు.” అని అన్నారు. ఉద్యమాన్ని మరింత ముందుకు అధికార తృణమూల్ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా మరింత తీవ్రమైన ఉద్యమాన్ని ప్రారంభిస్తానని ప్రతిజ్ఞ చేశారు. టిఎంసి 211 అసెంబ్లీ నియోజకవర్గాలను దక్కించుకోగలిగితే, భవిష్యత్తులో బీజేపీ 250 సీట్లను ఎందుకు పొందలేం? మనం ముందుకు సాగాలి, పార్టీకి నాయకత్వం వహించే వారు ఆ బాధ్యతలు స్వీకరిస్తారని అన్నారు. బెంగాల్లో ఎన్నికల్లో జరిగిన హింసపై టీఎంసీని తీవ్రంగా విమర్షించారు. ఇక టీఎంసీ "టీఎంసీ 211 అసెంబ్లీ నియోజకవర్గాలను దక్కించుకోగలిగితే, భవిష్యత్తులో బీజేపీ 250 సీట్లను ఎందుకు పొందలేము? మనం ముందుకు సాగాలి, పార్టీకి నాయకత్వం వహించే వారు ఆ బాధ్యతలు స్వీకరిస్తారు" అని ఆయన అన్నారు. సౌమిత్రా ఖాన్ ఒక ఉద్వేగభరితమైన వ్యక్తి కాగా ఈ నెల (జూలై) లో ఫేస్ బుక్‌లో స్పందిస్తూ.. ‘‘ ఓ నాయకుడు తరచే ఢిల్లీకి పర్యటనలు చేస్తున్నాడు. పార్టీ సాధించే ప్రతి విజయానికి ఆయనకే పేరు వచ్చింది. ఢిల్లీ నాయకులను ఆయన తప్పుదారి పట్టిస్తున్నాడు. బెంగాల్లో పార్టీ ఆయనే పెద్ద నాయకుడిగా భావిస్తున్నాడు. ఇక రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాష్ట్రంలో ఏం జరుగుతుందో.. సగమే అర్థం చేసుకోగలడు. అతను ఇవన్నీ అర్థం చేసుకోలేడు. ’’ అంటూ కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక దిలీప్ ఘోష్ స్పందిస్తూ.. "సౌమిత్రా ఖాన్ ఒక ఉద్వేగభరితమైన వ్యక్తి. నేను అతని పట్ల ఎటువంటి చెడు భావాలను కలిగి లేను. అతను యువ మోర్చాకు నాయకత్వం వహిస్తాడు" అని అన్నారు. -
కోర్టుకు కాకపోతే మరెక్కడికైనా వెళ్లు.. సువేందుపై ముకుల్ రాయ్ ఫైర్
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ బీజేపీ శాసనసభా పక్ష నేత సువేందు అధికారిపై తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నాయకుడు ముకుల్ రాయ్ మండిపడ్డారు. తాను పార్టీ మారడంపై సువేందు అధికారి కోర్టుకు కాకపోతే మరెక్కడికైనా వెళ్లవచ్చని ఘాటుగా వ్యాఖ్యానించారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీఎంసీని వీడి బీజేపీలో చేరిన ముకుల్ రాయ్.. ఆ పార్టీ తరుఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం ఆయన తిరిగి టీఎంసీ గూటికి చేరారు. అయినప్పటికీ ఆయన బీజేపీ శాసనసభ్యుడిగానే కొనసాగుతున్నారు. Why only court? He can go wherever he wishes to go: TMC leader Mukul Roy on Leader of Opposition Suvendu Adhikari's statement that BJP will approach Calcutta High Court for enforcing anti-defection law in West Bengal pic.twitter.com/9AIxVrl9Bx— ANI (@ANI) July 16, 2021 ఈ నేపథ్యంలో ముకుల్ రాయ్‌పై పార్టీ ఫిరాయింపు వ్యతిరేక చట్టాన్ని అమలు చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. ఈ విషయమై ప్రతిపక్ష నేత సువేందు అధికారి బెంగాల్ అసెంబ్లీ స్పీకర్ బిమన్ బెనర్జీకు ఫిర్యాదు చేయగా, ఇవాళ ఐదు నిమిషాల పాటు విచారణ జరిపించారు. అనంతరం తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. మరోవైపు ముకుల్ రాయ్‌పై పార్టీ ఫిరాయింపు చట్టాన్ని అమలు చేయాలని కోరుతూ కలకత్తా హైకోర్టును ఆశ్రయిస్తామని సువేందు అధికారి పేర్కొన్నారు. సువేందు చేసిన ఈ ప్రకటనపై మండిపడిన ముకుల్ రాయ్.. కోర్టుకు కాకపోతే మరెక్కడికైనా వెళ్లవచ్చని ఘాటుగా వ్యాఖ్యానించారు. కాగా, ముకుల్ రాయ్ ప్రస్తుతం బెంగాల్ అసెంబ్లీలో పీఏసీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. గత ఎన్నికల్లో ఆయన కృష్ణానగర్ నార్త్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్ధిగా ఎన్నికయ్యారు. -
మమత పిటిషన్‌పై 12న విచారణ
కోల్‌కతా/న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్‌లో బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి చేతిలో ఓటమిపాలైన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆ ఎన్నికలను సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను కలకత్తా హైకోర్టు స్వీకరించింది. ఆగస్టు 12న ఆ పిటిషన్‌పై విచారణ జరుపుతామని బుధవారం వెల్లడించింది. ఈ వ్యవహారానికి సంబంధించి ప్రతిపక్ష నేత సువేందు అధికారికి నోటీసులు ఇవ్వనున్నట్లు తెలియజేసింది. నందిగ్రామ్ ఓట్లకు సంబంధించిన అన్ని రికార్డులను భద్రపర్చాలని ఎన్నికల సంఘానికి(ఈసీ) సూచించింది. మమతా బెనర్జీ పిటిషన్‌ను జస్టిస్ షంపా సర్కార్ విచారించారు. మొదటగా ఈ పిటిషన్ జస్టిస్ కౌశిక్ చంద్ర వద్దకు వెళ్లినప్పటికీ, విచారణ నుంచి ఆయనే స్వయంగా తప్పుకున్నారు. దీంతో యాక్టింగ్ చీఫ్ జస్టిస్ రాజేశ్ బిందాల్ ఈ కేసును జస్టిస్ షంపా సర్కార్ ధర్మాసనానికి బదిలీ చేశారు. మమత పిటిషన్‌ను బదిలీ చేయండి నందిగ్రామ్‌లో తన గెలుపును సవాలు చేస్తూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కలకత్తా హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను రాష్ట్రం వెలుపలి కోర్టుకు బదిలీ చేయాలని బీజేపీ నేత సువేందు అధికారి కోరారు. ఈ మేరకు ఆయన బుధవారం సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. మమత పిటిషన్‌పై పశ్చిమ బెంగాల్ బయట విచారణ జరపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సీఈసీని కలవనున్న టీఎంసీ నేతలు పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు జరగాల్సిన అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలు నిర్వహించకపోవడంపై జూలై 15న కేంద్ర ఎన్నికల కమిషన్‌ను (సీఈసీ) కలవనున్నట్లు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. నందిగ్రామ్‌లో బీజేపీ నేత సువేందు అధికారిపై సీఎం మమతా బెనర్జీ పోటీ చేసిన సంగతి తెలిసిందే. అయితే, అసెంబ్లీకి ఎన్నిక కాని వ్యక్తి రాజ్యాంగం ప్రకారం కేవలం ఆరు నెలలు మాత్రమే సీఎం పదవిలో ఉండగలరు. మమతా బెనర్జీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఆరు నెలల్లోగా ఏదో ఒక స్థానం నుంచి గెలవాల్సిన అత్యవసర పరిస్థితి ఇప్పుడు ఎదురైంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఐదు అసెంబ్లీ స్థానాలకు, శాసన సభ్యులు మరణించగా ఖాళీ అయిన మరో రెండు స్థానాలకు ఎన్నికలు ప్రకటించాలన్న డిమాండ్‌తో తృణమూల్ నేతలు ఢిల్లీలో కేంద్ర ఎన్నికల కమిషన్‌ను కలవనున్నారు. ఎన్నికలు నిర్వహించేందుకు థర్డ్ వేవ్ వచ్చేవరకు వేచి చూస్తున్నారా? అంటూ తృణమూల్ ఎంపీ సుఖేందు శేఖర్ రాయ్ ఎన్నికల కమిషన్‌ను విమర్శించారు. -
దీదీ పిటిషన్‌పై విచారణ వాయిదా
సాక్షి, కోల్‌కతా : నందిగ్రామ్ ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయంటూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హైకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌పై జస్టిస్ కౌశిక్ చందా నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. తదుపరి విచారణను ఈనెల 24కు వాయిదా వేసింది. కాగా, దీదీపై సువేందు అధికారి రెండు వేల ఓట్ల కంటే తక్కువ తేడాతో నందిగ్రామ్ నుంచి గెలుపొందిన విషయం తెలిసిందే. కౌంటింగ్ రోజు నాటకీయ పరిణామాలు జరగ్గా.. రీ కౌంటింగ్ కోసం తృణమూల్ కాంగ్రెస్ చేసిన విజ్ఞప్తిని ఎన్నికల కమిషన్ తోసిపుచ్చింది. ఇక ఫలితాల మరుసటి రోజే మమతా బెనర్జీ, సువేందు ఎన్నికపై కోర్టును ఆశ్రయిస్తానని ప్రకటించారు. అంతేకాదు ఆ సమయంలో ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ కిషోర్ బిశ్వాస్ ప్రాణాలకు ముప్పు కలిగే అవకాశం ఉందని ఆరోపిస్తూ.. ఆయనకు భద్రత కల్పించింది మమత సర్కార్. -
West Bengal: సువేందుకు ఝలక్.. ఇవాళే విచారణ
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ప్రతిపక్ష నేత, బీజేపీ చీఫ్ సువేందు అధికారికి ఝలక్ తగిలింది. ఆయన ఎన్నికపై అనుమానాలున్నాయంటూ సవాల్ చేస్తూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కలకత్తా హైకోర్టును ఆశ్రయించారు. దీనిని పరిశీలించిన ఉన్నత న్యాయస్థానం ఇవాళ (శుక్రవారం) ఉదయం 11 గం. పిటిషన్ విచారణ చేపట్టనుంది. కాగా, దీదీపై సువేందు రెండు వేల ఓట్ల కంటే తక్కువ తేడాతో నందిగ్రామ్ నుంచి గెలుపొందిన విషయం తెలిసిందే. కౌంటింగ్ రోజు నాటకీయ పరిణామాలు జరగ్గా.. రీ కౌంటింగ్ కోసం తృణమూల్ కాంగ్రెస్ చేసిన విజ్ఞప్తిని ఎన్నికల కమిషన్ తోసిపుచ్చింది. ఇక ఫలితాల మరుసటి రోజే మమతా బెనర్జీ, సువేందు ఎన్నికపై కోర్టును ఆశ్రయిస్తానని ప్రకటించారు. ఈ మేరకు ఆమె పిటిషన్ దాఖలు చేయగా, జస్టిస్ కౌశిక్ చందా నేతృత్వంలో ధర్మాసనం పిటిషన్‌పై విచారణ చేపట్టనుంది. అంతేకాదు ఆ సమయంలో ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ కిషోర్ బిశ్వాస్ ప్రాణాలకు ముప్పు కలిగే అవకాశం ఉందని ఆరోపిస్తూ.. ఆయనకు భద్రత కల్పించింది మమత సర్కార్. కాగా, 2011 నుంచి భాబనీపూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్న మమత.. 2021 ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి పోటీ చేసి ఓటమిపాలైంది. అయినప్పటికీ భారీ స్థానాలు గెల్చుకుని టీఎంసీ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో పాటు ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ ప్రమాణం చేసింది. చదవండి: సువేందుపై చోరీ కేసు -
సువేందును భయపెడుతున్న ఆ 24 మంది..
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో కాషాయ పార్టీకి షాకుల మీద షాకుల తగులుతున్నాయి. బీజేపీ తరఫున గెలిచిన ముకుల్ రాయ్ తృణమూల్ గూటికి చేరిన సంగతి తెలిసిందే. ఆయన బాటలో మరి కొందరు పయణించే అవకాశం ఉందనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలో ఎమ్మెల్యేలందరు తమతోనే ఉన్నారని నిరూపించుకునేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలకు గండి పడింది. బీజేపీ ఎమ్మెల్యే సువేందు అధికారి, గవర్నర్ భేటీకి పలువురు ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. ఈ సంఘటనతో మరికొందరు బీజేపీ ఎమ్మెల్యేలు టీఎంసీలోకి తిరుగుపయనం కానున్నారనే వార్తలకు బలం చేకూరినట్లయ్యింది. సువేందు అధికారి సోమవారం సాయంత్రం గవర్నర్ జగ్దీప్ ధన్కర్తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న అనుచిత సంఘటనలు, వాటి పరిణామాలతో పాటు ముఖ్యమైన అంశాలపై చర్చించారు. ఈ క్రమంలో బీజేపీకి చెందిన 24 మంది ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి హాజరుకాలేదు. దాంతో వారంతా తిరిగి టీఎంసీలో చేరతారనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఎన్నికలకు కొన్ని నెలల ముందు పార్టీలోకి వచ్చిన సువేందుకు ప్రతిపక్ష నేత పదవి కట్టబెట్టడాన్ని పలువురు నేతలు జీర్ణించుకోలకపోతున్నారు. సువేందు నాయకత్వాన్ని అంగీకరించడానికి వారు సుముఖంగా లేరు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఇప్పటికే ముకుల్ రాయ్ టీఎంసీలో చేరిన సంగతి తెలిసిందే. ఆయన బాటలోనే మరికొందరు బీజేపీని వీడి తృణమూల్‌లో చేరతారని భావిస్తున్నారు. 30 మంది బీజేపీ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారంటూ టీఎంసీ ప్రకటించడం గమనార్హం. చదవండి: ముకుల్‌రాయ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి -
ముకుల్‌రాయ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి
కోల్‌కతా: ఇటీవలే అధికార తృణమూల్ కాంగ్రెస్ గూటికి తిరిగొచ్చిన ముకుల్ రాయ్ తన ఎమ్మెల్యే పదవికి తక్షణం రాజీనామా చేయాలని ప్రతిపక్ష నేత సువేందు అధికారి (బీజేపీ) సోమవారం డిమాండ్ చేశారు. 24 గంటల్లోగా రాజీనామా చేయకపోతే ముకుల్ రాయ్‌పై పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అసెంబ్లీ స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. నాలుగేళ్ల కిందట తృణమూల్‌ను వీడి... బీజేపీలో చేరిన సీనియర్ నేత ముకుల్ రాయ్ కమలం పార్టీలో జాతీయ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. తన సీనియారిటీని పట్టించుకోకుండా ఎన్నికలకు ముందు పార్టీలోకి వచ్చిన సువేందుకు ప్రతిపక్ష నేత పదవిని కట్టబెట్టడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయారు. దాంతో కొద్దిరోజుల కిందట తృణమూల్ కాంగ్రెస్‌లోకి తిరిగివచ్చారు. అయితే తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన బీజేపీ టికెట్‌పై ఉత్తర క్రిష్ణానగర్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ‘ఉత్తర క్రిష్ణానగర్ ఎమ్మెల్యే ఇటీవలే పార్టీ మారారు. ఆయన 24 గంటల్లోగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి. లేకపోతే బుధవారం స్పీకర్‌కు పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద ఫిర్యాదు చేస్తాం’ అని ముకుల్ రాయ్ పేరు ఎత్తకుండానే సువేందు అన్నారు. కాగా మరోవైపు సువేందు నేతృత్వంలో 50 మంది పైచిలుకు ఎమ్మెల్యేలు సోమవారం రాజ్‌భవన్‌లో బెంగాల్ గవర్నర్ జగ్దీప్ ధన్కర్ను కలిశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని, అరాచకం రాజ్యమేలుతోందని బీజేపీ ఎమ్మెల్యేలు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. మహిళలపై దాడులు పెరిగిపోయాయని పేర్కొన్నారు. దాడులు జరగొచ్చనే భయంతో 17 వేల మంది బీజేపీ కార్యకర్తలు ఇళ్లు విడిచి ఇతర ప్రాంతాల్లో తలదాచుకుంటున్నారని సువేందు అన్నారు. చదవండి: సువేందు అధికారి ఢిల్లీ పర్యటన.. కారణం ఇదేనా! చదవండి: Coronavirus: దేశంలో తగ్గిన కరోనా తీవ్రత -
సువేందు అధికారి ఢిల్లీ పర్యటన.. కారణం ఇదేనా!
న్యూఢిల్లీ: బెంగాల్ బీజేపీ నాయకుడు సువేందు అధికారి మంగళవారం ఉదయం హోం మంత్రి అమిత్ షాను ఢిల్లీలోని ఆయన నివాసంలో కలుసుకున్నారు. అంతకుముందు నౌకాయాన శాఖ మంత్రి మనసుఖ్ లాల్ మాండవీయను కలిసిన ఆయన అమిత్‌షా నివాసానికి చేరుకున్నారు. అంతేకాకుండా సువేందు ఈ రోజు సాయంత్రం బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలువనున్నారు. ఇక బుధవారం సువేందు అధికారి ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీని నందిగ్రామ్ ఎన్నికల యుద్ధంలో సువేందు ఓడించిన సంగతి తెలిసిందే. బెంగాల్లో మమతను ఎదుర్కొవడానికి ప్రజా సమస్యలపై పోరాడేందుకు సువేందు నాయకత్వమే సరియైందని బీజేపీ నేతలు భావిస్తున్నట్టు సమాచారం. పశ్చిమ బెంగాల్ ఎన్నికల తర్వాత సువేందు అధికారి ఢిల్లీ పర్యటనకు బయల్దేరి వెళ్లటం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. (చదవండి: వైరల్: పెళ్లి కొడుకు హుషారు చూసి పెళ్లి కూతురు షాక్!) -
WestBengal: సువేందు బ్యాడ్ టైం స్టార్ట్!
బీజేపీ శాసనసభ పక్ష నేత సువేందు అధికారిపై టీఎంసీ రివెంజ్ మొదలైందా? తాజా పరిణామాలతో ‘అవుననే’ అంటున్నారు అక్కడి రాజకీయ విశ్లేషకులు. రానున్న రోజుల్లో అది మరింతగా ఉండబోతుందని వాళ్లు అంచనా వేస్తున్నారు. కోల్‌కతా : వెస్ట్ బెంగాల్ ప్రతిపక్ష నేత, బీజేపీ లీడర్ సువేందు అధికారిపై ఓ కేసు నమోదైంది. కంతి మున్సిపాలిటీ నుంచి లక్షల విలువైన సామాగ్రిని దొంగతనం చేశారనే ఫిర్యాదు మేరకు సువేందు అధికారి, అతని సోదరుడు సౌమేందు అధికారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కంతి మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ బోర్డ్ సభ్యుడు రత్నదీప్ మన్నా ఈ నెల 1న చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, సువేందు అధికారి, మాజీ కంతి మున్సిపాలిటీ చీఫ్ సౌమేందు అధికారి ఇద్దరూ మే 29న కార్యాలయ గోడౌన్‌లోకి అక్రమంగా చొరబడి లక్షలు విలువచేసే సామాగ్రిని దోచుకువెళ్లారు అని మన్నా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దొంగతనంలో బీజేపీ నేతలు కేంద్ర సాయుధ బలగాలను సైతం ఉపయోగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక ఈ తృణముల్ మాజీ నేత మమతపై నెగ్గిన విషయం తెలిసిందే. ప్రధాని మోదీ తుపాన్ సమీక్షలో ఈయన కూడా పాల్గొనడంతోనే.. దీదీ ఎగ్గొట్టిందన్న వాదన వినిపించింది కూడా. ముఖ్య అనుచరుడీ అరెస్ట్ ఇక సువేందు అధికారి ముఖ్య అనుచరుడు రేఖాల్ బెరాను కోల్‌కతా పోలీసులు అరెస్ట్ చేశారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికి వందల మంది నుంచి డబ్బులు వసూలు చేశారనేది రేఖాల్ పై ప్రధాన ఆరోపణ. ఇది 2019 జులై, సెప్టెంబర్‌లో జరిగిందని ఫిర్యాదులో సుజిత్ డే అనే వ్యక్తి పేర్కొన్నాడు. తన నుంచి రెండు లక్షల రూపాయలు రేఖాల్ తీసుకున్నారని సుజిత్ తెలిపాడు. కాగా, దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. ఈ ఫేక్ జాబ్ రాకెట్ స్కాంలో మరికొంత మంది నిందితుల కోసం గాలింపు చేపట్టారు. చదవండి: రసవత్తరంగా కోల్డ్‌వార్ -
Nandigram: నందిగ్రామ్.. హై టెన్షన్
కోల్‌కతా: తృణమూల్ చీఫ్ మమతా బెనర్జీ తొలిసారి బరిలో నిలిచిన పశ్చి మ బెంగాల్‌లోని నందిగ్రామ్ నియోజకవర్గ ఫలితాలు నరాలు తెగే ఉత్కంఠత రేపాయి. కౌంటింగ్ కొనసాగుతున్న కొద్దీ మమతా బెనర్జీ, బీజేపీ నేత సువేంధు అధికారి మధ్య క్షణ క్షణం మారిపోతున్న ఓట్ల మెజారిటీ... మొత్తం రాష్ట్ర ఎన్నికల ఘట్టంలోనే అత్యంత ప్రధానమైనదిగా నిలిచింది. ఇద్దరు ప్రధాన పార్టీల ప్రత్యర్థుల మధ్య అటూ ఇటూ దోబూచులాడిన మెజారిటీ.. చివరకు సువేంధు అధికారిని వరించింది. మమతా బెనర్జీపై స్వల్ప ఆధిక్యంతో గెలిచినట్లు ఎన్నికల సంఘం ఎట్టకేలకు ప్రకటించింది. అయితే, నందిగ్రామ్ ఫలితాలపై తాను కోర్టుకు వెళ్తానని మమతా ప్రకటించారు. అంతకుముందు ఆదివారం ఉదయం కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమవగా కొద్దిసేపటికే సువేంధు మమత కంటే ఆధిక్యంలోకి వచ్చారు.ఆ తర్వాత సువేంధు మెజారిటీ ఏకంగా ఎనిమిది వేల దాకా వెళ్లింది. మధ్యాహ్నందాకా సువేంధుదే పైచేయి. మధ్యాహ్నం నుంచి నెమ్మదిగా పుంజుకుని మమత ఆధిక్యంలోకి వచ్చారు. ఆ తర్వాత మళ్లీ ఆధిక్యత మరొకరి చెంతకు చేరింది. ఒకానొక దశలో సువేంధు కేవలం ఆరు ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఓట్ల లెక్కింపులో ప్రతీ రౌండ్లో మెజారిటీ సువేంధు, మమత మధ్య మారుతూ వచ్చింది. సువేంధు 1,200 ఓట్ల మెజారిటీలో గెలిచారని వార్తలు రాగా, ఓట్ల లెక్కింపు కొనసాగుతోందని ఎన్నికల సంఘం తెలిపింది. ఆ తర్వాత కొద్దిసేపటికే 1,956 ఓట్ల ఆధిక్యంతో సువేంధు అధికారి గెలిచారని ఎన్నికల సంఘం ప్రకటించింది. త్యాగాలు తప్పవు.. ఈసీ ప్రకటనపై మమతా బెనర్జీ వెంటనే స్పందించారు. ‘‘నందిగ్రామ్‌లో ఓటమిని అంగీకరిస్తున్నాను. మరేం ఫరవాలేదు. అయితే, నందిగ్రామ్‌లో అక్రమాలు జరిగాయని విన్నాను. దీనిపై కోర్టుకు వెళతాను. మనం మొత్తం రాష్ట్రాన్నే గెలిచాం. ఇంతటి ఘన విజయం సాధించినపుడు ‘నందిగ్రామ్’లో ఓటమిలాంటి త్యాగాలు తప్పవు’’ అని ఫలితాల అనంతరం మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. నందిగ్రామ్‌లో రీకౌంటింగ్ జరపాలని ఈసీని టీఎంసీ కోరగా అందుకు ఈసీ నిరాకరించింది. -
మమతకు చెమటలు పట్టిస్తున్న సువేందు
-
నందిగ్రామ్ ఫలితంపై నరాలు తెగే ఉత్కంఠ
లేటెస్ట్ అపడేట్ : నందిగ్రామ్ ఫలితంపై నరాలు తెగే ఉత్కంఠ కోలకత: పశ్చిమబెంగాల్లో నందీగ్రామ్ ఎన్నికల ఫలితం కీలకంగా మారింది. క్షణ క్షణానికిమారుతున్న ఆధిత్యంతో నరాలు తెగే ఉత్కంఠను రాజేస్తోంది. సమీప ప్రత్యర్ధి,బీజేపీ అభ్యర్థి సువేందుపై ప్రారంభంలో వెనుకబడిన మమతా, ఆ తరువాత లీడింగ్‌లోకి వచ్చారు. 16వ రౌండ్ ముగిసే సమయానికి సువేందుకు కంటే కేవలం 6 ఓట్లు వెనకబడి ఉన్నారు. దీదీ-సువేందు మధ్య నెలకొన్ని హోరాహోరీ పోరు టీ20 మ్యాచ్‌ను తలపిస్తోంది. చివరిదైనా 17వ రౌండ్ ఫలితంపైనే అందరి దృష్టి నెలకొంది. ఒకవైపు మమతా బెనర్జీ నేతృత్వంలోని పాలక తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) మ్యాజిక్ ఫిగర్ స్థానాలను దాటి లీడింగ్‌లో దూసుకుపోతుండగా ముఖ్యమంత్రి మమత మాత్రం వెనకంజలో ఉండటం గమనార్హం. అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కీలకమైన స్థానంలో దూసుకుపోతోంది. తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీకి సన్నిహితుడు, అప్పటి మంత్రి సువేందు అధికారిని తనవైపు తిప్పుకున్న బీజేపీ నందీగ్రామ్‌నుంచి గట్టిపోటీ ఇస్తోంది. తొలి రౌండ్‌నుంచీ వెనుకంజలో ఉన్న దీదీ నాలుగు రౌండ్ల తరవాత కూడా సువేందుకంటే 8 వేలకు పైగా ఓట్లు వెనుకబడి ఉన్నారు. నందిగ్రామ్‌లోమమతను తాను 50 వేల ఓట్ల ఆధిక్యంతో ఓడిస్తానని, అలా చేయలేకపోతే రాజకీయాల నుంచి వైదొలగుతానని సవాల్ చేసిన అధికారి ఆ దిశగా సాగి పోతున్నారు. అయితే క్షణక్షణానికి మారుతున్న ప్రస్తుత తరుణంలో పూర్తి ఫలితం వచ్చేవరకు నందీగ్రామ్ ఫలితంపై ఉత్కంఠకు తెరపడదు. కాగా టీఎంసీకి గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరిన, మాజీమంత్రి సువేందు అధికారి సవాల్‌కు ప్రతిసవాల్‌గా నందీగ్రామ్‌నే మమత ఎన్నుకున్న సంగతి తెలిసిందే. అటు టీఎంసీ 200 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, బీజేపీ 89 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది, -
66 ఏళ్ల ఆంటీ.. నోరు అదుపులో పెట్టుకో!
సాక్షి, కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై , బీజేపీ నేత నందీగ్రామ్‌లో ఆమె ప్రత్యర్థి సువేందు అధికారి నోరు పారేసుకున్నారు. మాజీ టీఎంసీ నేత అయిన సువేందు సీఎం మమతా 66 ఏళ్ల ఆంటీ అనుచిత వ్యాఖ్యలు చేశారు. బీజేపీపై ఇటీవల మమతా విమర్శల నేపథ్యంలో సువేందు కౌంటర్ ఎటాక్ చేశారు. దీదీ ఈ వయస్సులో నోటిని అదుపులో పెట్టుకోవాలని, భాషను మార్చుకోవాలంటూ హితవు పలికారు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో ఆమెకు ఓటమి తప్పదని హెచ్చరించారు. అలాగే మే 2వ తేదీన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతాయని, ఆ తర్వాత కూడా కేంద్ర బలగాలు రాష్ట్రంలోనే ఉండాలని సువేందు వ్యాఖ్యానించారు. ఒక ముఖ్యమంత్రిగా ఆమె తన నోటిని అదుపులో పెట్టుకోవాలని, ప్రధాని మోదీపై ఆమె అభ్యంతరకర రీతిలో భాషను వాడుతున్నారని ఆరోపించారు.ఈ సందర్బంగా బెంగాల్ సీఎంను ఆంటీ అంటూ ఆయన సంబోధించారు. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా మమతా మీడియాతో మాట్లాడారని మండిపడ్డారు. కాగా రెండో దశ ఎన్నికల్లో భాగంగా నందిగ్రామ్ నియోజకవర్గంలో పోలింగ్ కొనసాగుతోంది. ఈ సందర్బంగా తన ఓటుహక్కును వినియోగించుకున్న సువేందు అధికారి, ప్రశాంతంగా ఓటింగ్ కొనసాగుతోందని, రీపోలింగ్ అనే ప్రశ్నే ఉత్పన్నం కాదని తెలిపారు. బెంగాల్ ప్రజలు అభివృద్ధికి ఓటేస్తారని భావిస్తున్నట్టు చెప్పారు. పెద్ద ఎత్తున ఓటర్లు తరలివచ్చి ఓటు వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. -
బెంగాల్, అస్సాం రెండో విడత పోలింగ్
కోల్‌కతా/గువాహటి: పశ్చిమ బెంగాల్, అసోం రాష్ట్రాల్లో రెండో విడత పోలింగ్ కొనసాగుతుంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు బెంగాల్లో 37.42 శాతం, అసోంలో 33.24 శాతం పోలింగ్ నమోదైంది. 294 అసెంబ్లీ స్థానాలున్న బెంగాల్లో ఎనిమిది విడతల్లో, 126 అసెంబ్లీ స్థానాలున్న అసోంలో మూడు విడతల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే మార్చి 27న తొలి విడత ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. రెండు రాష్ట్రాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. బెంగాల్లో రెండో విడతలో 30 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుండగా.. 171 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 75,94,549 మంది ఓటర్లు వారి భవితవ్యం నిర్ణయించనున్నారు. ఎన్నికల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆయా నియోజకవర్గాల పరిధిలో 10,620 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇవాళ ఓటింగ్ జరిగే అన్ని ప్రాంతాలను సున్నితమైనవిగా ఎన్నికల కమిషన్ ప్రకటించింది. అస్సాంలో.. రెండో దశలో ఎన్నికలు జరగనున్న 39 స్థానాల్లో మొత్తం 345 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. బీజేపీ 34 సీట్లలో, మిత్రపక్షాలైన అస్సాం గణ పరిషత్ 6 స్థానాల్లో, యూపీపీఎల్ 3 సీట్లలో పోటీ చేస్తున్నాయి. రెండు స్థానాల్లో బీజేపీ, ఏజీపీ మధ్య, రెండు స్థానాల్లో బీజేపీ, యూపీపీఎల్ మధ్య స్నేహపూర్వక పోటీ నెలకొని ఉంది. మహా కూటమి నుంచి కాంగ్రెస్ 28 సీట్లలో, ఏఐయూడీఎఫ్ 7 స్థానాల్లో, బీపీఎఫ్ 4 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. కొత్తగా ఏర్పడిన అస్సాం జాతీయ పరిషత్ 19 స్థానాల్లో అభ్యర్థులను నిలిపింది. 25 స్థానాల్లో ఎన్డీయే, మహా కూటమి మధ్య ద్విముఖ పోటీ నెలకొన్నది. ఈ రెండో దశ ఎన్నికల బరిలో ఐదుగురు మంత్రులు, డిప్యూటీ స్పీకర్ ఉన్నారు. ఈ రెండో దశ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ బరిలో నిలిచిన నందిగ్రామ్ నియోజకవర్గంపైననే అందరి దృష్టి ఉంది. మమతను ఓడించాలనే లక్ష్యంతో ఉన్న బీజేపీ అగ్ర నేతలు ఈ స్థానంలో గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.మమతకు పోటీగా ఒకప్పటి ఆమె విశ్వసనీయ సహచరుడు, టీఎంసీ నుంచి బీజేపీలోకి వచ్చిన సువేందు అధికారిని బీజేపీ పోటీలో నిలిపిన విషయం తెలిసిందే. బెంగాల్లో 30 స్థానాలకు గానూ మొత్తం 191 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వారి భవితవ్యాన్ని 75 లక్షల మంది ఓటర్లు తేల్చనున్నారు. మొత్తం 10,620 పోలింగ్ బూత్‌లను సమస్యాత్మకమైనవిగా ఎన్నికల సంఘం నిర్ధారించి, ఆయా బూత్‌ల వద్ద అదనపు బలగాలను నిలిపింది. తూర్పు మెదినీపుర్(9), పశ్చిమ మెదినీపుర్(9), దక్షిణ 24 పరగణ(4), బంకురా(8) జిల్లాల్లో ఈ రెండో దశ ఎన్నికలు జరుగుతున్నాయి. టీఎంసీ, బీజేపీలు మొత్తం 30 స్థానాల్లో అభ్యర్థులను నిలిపాయి. సీపీఎం 15, కాంగ్రెస్ 13, ఐఎస్ఎఫ్ 2 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. రెండో దశ ఎన్నికలు జరుగుతున్న దాదాపు అన్ని నియోజకవర్గాల్లో మమతా బెనర్జీ ప్రచారం నిర్వహించారు. కాలికి గాయమైన ఆమె వీల్చెయిర్పైననే ఈ ప్రచారంలో పాల్గొన్నారు. బీజేపీ ప్రచారంలో అగ్రనేతలు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా తదితరులు పాల్గొన్నారు. చదవండి: భారీ పోలింగ్ మా విజయానికి సంకేతం నందిగ్రామ్‌లో దీదీ ఓటమి తథ్యం: సర్వే -
నందిగ్రామ్‌లో దీదీ ఓటమి తథ్యం: సర్వే
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు మొదటి దశ పూర్తైన సంగతి తెలిసిందే. రెండో దశ ఎన్నికలు ఏప్రిల్ 1న జరగనున్నాయి. ఈ ఎన్నిక పట్ల బెంగాల్ వాసులతో పాటు దేశప్రజలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే రెండో దశ పోలింగ్‌లో మమతా బెనర్జీ పోటీ చేస్తున్న నందిగ్రామ్‌లో కూడా ఓటింగ్ జరగనుంది. పార్టీ నుంచి బయటకు వెళ్లి బీజేపీలో చేరిన సువేందు అధికారి నందిగ్రామ్‌లో మమతతో తలపడనున్నారు. దాంతో దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఆ సంగతి పక్కకు పెడితే గత రెండు మూడు రోజులుగా నందిగ్రామ్ ఫలితాలకు సంబంధించి రెండు, మూడు సర్వేలు బెంగాల్ సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. వీటి సారాంశం ఏంటంటే మమతా బెనర్జీ నందిగ్రామ్‌లో ఘోర పరాజయం చవి చూడబోతున్నారు. సువేందు దీదీని దారుణంగా ఓడించబోతున్నాడని సర్వేలు తెలిపాయి. ఇక్కడ మరో ఆసక్తికర అంశం ఏంటంటే ఈ సర్వేలన్నింటిని పోల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిశోర్ సంస్థ ఐ పాక్ నిర్వహించిందనే వార్తలు జనాలను మరింత ఆశ్చర్యచకితులను చేశాయి. ఈ క్రమంలో ఐ పాక్ సంచలన ప్రకటన చేసింది. తమ సంస్థ నిర్వహించినట్లు చెప్పుకుంటున్న సదరు సర్వే ఫేక్ అని స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఐపాక్ ‘‘గత కొద్ది రోజులుగా నందిగ్రామ్ ఓటింగ్‌కు సంబంధించి సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న సర్వే ఫేక్. బీజేపీ నాయకులు, వారి హామీల్లానే ఈ సర్వే కూడా అవాస్తవం. ఇలాంటి ఫేక్ రిపోర్ట్స్‌ను ప్రచారం చేసి జనాలను ప్రభావితం చేయాలని భావిస్తున్నారు. కానీ వారి ప్రయత్నాలు ఫలించవు. అసలు ఐ పాక్ డెస్క్ టాప్‌లను వినియోగించదు.. మరింత స్మార్ట్‌గా ఆలోచించండి’’ అంటూ ట్వీట్ చేసింది. Facing imminent defeat, @BJP4Bengal has now gone down to the level of using FAKE surveys in the name of I-PAC to keep the morale of their workers up!! P.S: In I-PAC, no one uses desktops so at-least be smart in your effort to create fake survey / reports! 😉🤣 pic.twitter.com/lFaOo0DshU — I-PAC (@IndianPAC) March 31, 2021 చదవండి: నేను పులి: ‘నందిగ్రామ్’లో మమతా బెనర్జీ గర్జన -
West Bengal Election 2021: ‘నందిగ్రామ్’ పోరు రసవత్తరం
సాక్షి, న్యూఢిల్లీ: దశాబ్దాల వామపక్ష పాలనకు చరమగీతం పాడుతూ, మమతా బెనర్జీని అధికార పీఠంపై కూర్చోపెట్టడంలో కీలకంగా మారిన నందిగ్రామ్.. 14 ఏళ్ల తర్వాత మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో కేంద్ర బిందువైంది. పశ్చిమ బెంగాల్లో మొదటి దశ పోలింగ్ తరువాత ఇప్పుడు అందరి దృష్టి నందిగ్రామ్‌పైనే ఉంది. ఎందుకంటే ఏప్రిల్ 1న రాష్ట్రంలో జరిగే రెండో దశ ఎన్నికలలో బంకురా, పశ్చిమ మేదినీపూర్, తూర్పు మేదినీపూర్, దక్షిణ 24 పరగణాల పరిధిలోని నాలుగు జిల్లాలలో కలిపి 30 అసెంబ్లీ నియోజకవర్గాలలో పోలింగ్ జరుగనుంది. ఈ దశలో హాట్ టాపిక్‌గా మారిన నందిగ్రామ్ నుంచి బీజేపీ అభ్యర్థి సువేందు అధికారిపై సీఎం మమతా బెనర్జీ పోటీ చేస్తున్నారు. నందిగ్రామ్‌లోనే మకాం వేసిన సువేందును ఢీకొట్టేందుకు టీఎంసీ అభ్యర్థి, సీఎం మమతా బెనర్జీ సోమ, మంగళవారాల్లో రెండు రోజుల వ్యవధిలో 6 ర్యాలీల్లో పాల్గొన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలనే పట్టుదలతో ఉన్న బెనర్జీ నందిగ్రామ్‌లో ఒక ఇంటిని కూడా అద్దెకు తీసుకొని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. మరోవైపు సువేందు అధికారి తరఫున కమలదళం తరపున హోం మంత్రి అమిత్ షా మంగళవారం భారీ రోడ్‌షో నిర్వహించారు. పరస్పరం తీవ్ర ఆరోపణలు ఏప్రిల్ 1వ తేదీన పోలింగ్ జరుగబోయే నందిగ్రామ్‌లో ప్రచారపర్వం మంగళవారం సాయంత్రంతో ముగిసింది. నందిగ్రామ్‌లో పోటీ చేస్తున్న మమతా బెనర్జీని కనీసం 50 వేల ఓట్ల తేడాతో ఓడిస్తానని, లేనిపక్షంలో రాజకీయాలను విడిచి పెడతానని సువేందు అధికారి ప్రతిజ్ఞ చేసిన విషయం తెలిసిందే. ఇటీవల ఒక ర్యాలీలో సువేందు, అతని తండ్రి శిశిర్, సోదరుడు సౌమేందులు విషసర్పాలుగా మారుతారనే విషయం తనకు అర్థం కాలేదని దీదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కీలకంగా ఆ ముగ్గురు నేతలు నందిగ్రామ్‌లో సువేందు హిందుత్వ ఎజెండాతో హిందూ ఓట్ల ఏకీకరణే లక్ష్యంగా దూసుకెళ్తుండగా, మమతా బెనర్జీ తన అభివృద్ధి పనులతో పాటు, అధికారి కుటుంబాన్ని టార్గెట్‌గా చేసుకొని ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ జనాభాలో 30 శాతం ఉన్న ముస్లిం ఓట్లు తమకే పడతాయని దీదీ నమ్మకంతో ఉన్నారు. 2016లో టీఎంసీ టికెట్‌తో 68 వేల ఓట్లతో సువేందు గెలిచారు. అయితే పోలింగ్‌కు ఇంకా కొద్ది రోజులు మాత్రమే సమయం ఉండడంతో బీజేపీ, టీఎంసీలు స్థానికంగా పేరున్న నాయకులు సుఫియాన్ షేక్, అబూ తాహెర్, మేఘనాథ్ పాల్‌లకు సంబంధించిన సమస్యలపై పోరాడుతున్నాయి. ఒక సమయంలో ఈ ముగ్గురు నాయకులు సువేందుకు చాలా దగ్గరగా ఉండేవారు. మారిన పరిణామాల నేపథ్యంలో అబూ తాహెర్, సుఫియాన్ షేక్ మమతా బెనర్జీకి అండగా నిలబడగా, మేఘనాథ్ పాల్ సువేందుతో కొనసాగుతున్నారు. అయితే సువేందుకు వీరిద్దరు దూరమైన తర్వాత తాహెర్, షేక్‌లపై కొనసాగుతున్న కేసులపై దర్యాప్తు జరపాలంటూ ఇటీవల కోర్టులో పిటిషన్ దాఖలైంది. మరోవైపు మేఘనాథ్ పాల్ ఇంట్లో సువేందు గుండాలు దాక్కున్నారని ఆరోపిస్తూ టీఎంసీ ఇప్పటికే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఈ ముగ్గురు స్థానిక నాయకులు నందిగ్రామ్‌లో ఎవరు గెలవాలన్న అంశంపై గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తారు. ఉద్ధండులు వర్సెస్ ఫైర్‌బ్రాండ్ మరోవైపు ఇద్దరు ఉద్ధండులను ధీటుగా ఎదుర్కొనేందుకు వామపక్షాలు ఫైర్ బ్రాండ్‌గా పేరున్న డివైఎఫ్ నాయకురాలు మీనాక్షి ముఖర్జీని బరిలోకి దింపాయి. ఆమె ఒకప్పుడు వామపక్షాల కంచుకోట అయిన నందిగ్రామ్‌లో తిరిగి ఎర్రజెండా రెపరెపలాడించేందుకు గ్రామాల్లో పర్యటిస్తూ ప్రచారాన్ని చేస్తున్నారు. ఇటీవల సౌతఖాలీ, గార్చక్రబేరియా, కాళిచరణ్, సోనాచురా బజార్, తఖాలీ వంటి ప్రాంతాల్లో మీనాక్షి ప్రచార ర్యాలీలు చేపట్టారు. అంతేగాక 2011లో వామపక్ష కూటమి ప్రభుత్వం పడిపోవడానికి కారణమైన నందిగ్రామ్ భూసేకరణ అంశాన్ని అప్పుడు వ్యతిరేకించిన భూమి ఉచ్చేద్ ప్రతిరోధ్ కమిటీలోని ప్రముఖులు మీనాక్షికి మద్దతు ఇస్తున్నారు. బెంగాల్, అస్సాంలలో ముగిసిన ప్రచారం కోల్‌కతా/గువాహటి: పశ్చిమబెంగాల్, అస్సాంలలో ఏప్రిల్ ఒకటో తేదీన జరగనున్న రెండో దశ పోలింగ్‌కు మంగళవారం సాయంత్రంతో ప్రచారం ముగిసింది. అస్సాం అసెంబ్లీలోని 126 సీట్లకుగాను 39 స్థానాలకు, బెంగాల్‌లోని 284 నియోజకవర్గాలకు గాను 30 చోట్ల ఏప్రిల్ ఒకటో తేదీన పోలింగ్ జరగనుంది. అస్సాంలో రెండోదశలో అదృష్టాన్ని పరీక్షించుకోనున్న 345 మంది అభ్యర్థుల్లో 174 మంది స్వతంత్రులున్నారు. మొత్తం 345 మందిలో 37 మందికి నేర చరిత్ర ఉండగా అందులో 30 మందిపై తీవ్ర నేరారోపణలున్నాయి. నేర చరితుల్లో బీజేపీకి చెందిన 11 మంది, కాంగ్రెస్, ఏఐయూడీఎఫ్‌కు చెందిన ఐదుగురు చొప్పున ఉండటం గమనార్హం. అదేవిధంగా, బెంగాల్‌లోని నాలుగు జిల్లాల్లో రెండోదశ పోలింగ్ జరిగే 30 నియోజకవర్గాల్లో 171 మంది బరిలో నిలిచారు. పోలింగ్ బందోబస్తు కోసం 651 కంపెనీల కేంద్ర సాయుధ పోలీసులను రంగంలోకిదించారు. -
బీజేపీ గూండాలను తరమండి
కోల్‌కతా/నందిగ్రామ్: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోకుండా చేయడానికి బీజేపీ కుట్రలు పన్నుతోందని, బయటి నుంచి గూండాలను దిగుమతి చేస్తోందని తృణమూల్ చీఫ్ మమతా బెనర్జీ ఆరోపించారు. గరిటెలు, అట్లకాడలు, వంట పాత్రలతో బీజేపీ గూండాలను తరిమికొట్టాలని మహిళలకు పిలుపునిచ్చారు. పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాలోని నారాయణగఢ్, పింగ్లాలో శనివారం ఎన్నికల ప్రచార సభల్లో ఆమె ప్రసంగించారు. నందిగ్రామ్‌లో తనపై బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సువేందు అధికారిపై మరోసారి విరుచుకుపడ్డారు. ఆయన కుటుంబ సభ్యులు ద్రోహులని దుయ్యబట్టారు. సువేందు అధికారి కుటుంబ సభ్యుడొకరు శుక్రవారం రాత్రి ఓటర్లకు డబ్బులు పంచుతూ దొరికిపోయాడని అన్నారు. అతడిని మహిళలు పట్టుకొని పోలీసులకు అప్పగించారని చెప్పారు. బయటి నుంచి వచ్చిన మరో 30 మంది గూండాలను కూడా మహిళలు పోలీసులకు అప్పగించారని పేర్కొన్నారు. నందిగ్రామ్‌లో ద్రోహులపై కన్నేశా: అసెంబ్లీ ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి మమతా బెనర్జీ విజ్ఞప్తి చేశారు. నందిగ్రామ్‌లో మీర్ జాఫర్లపై(ద్రోహులు) ఓ కన్నేసి ఉంచానని వ్యాఖ్యానించారు. సువేందు అధికారికి, అతడి సోదరులకు మంచి పదవులు కట్టబెట్టానని గుర్తుచేశారు. అయినప్పటికీ వారు తృణమూల్ కాంగ్రెస్‌ను దగా చేసి, బీజేపీలో చేరారని విమర్శించారు. డబ్బుకు అమ్ముడుపోయారని ధ్వజమెత్తారు. బీజేపీ, తృణమూల్ కార్యకర్తల ఘర్షణ పూర్బ మేదినీపూర్ జిల్లాలోని నందిగ్రామ్‌లో శనివారం బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు గాయపడ్డారని పోలీసులు వెల్లడించారు. సీఎం మమతా బెనర్జీ పోటీ చేస్తున్న నందిగ్రామ్ స్థానంలో ఏప్రిల్ 1న ఎన్నికలు జరుగనున్నాయి. బీజేపీ బయటి నుంచి తీసుకొచ్చిన రౌడీలు తమపై దాడి చేశారని మమతా బెనర్జీ ఎలక్షన్ ఏజెంట్ షేక్ సూఫియాన్ ఆరోపించారు. తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు ముగ్గురు గాయాలపాలయ్యారని అన్నారు. -
సువేందు అధికారి ద్రోహి
కాంతి దక్షిణ్: తానొక పెద్ద గాడిదనని(అమీ ఏక్తా బోరో గధా), అందుకే సువేందు అధికారి అసలు రంగును గుర్తించలేకపోయానని పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ నియోజకర్గం నుంచి ఆమెపై బీజేపీ అభ్యర్థిగా సువేందు అధికారి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో మమతకు అత్యంత సన్నిహితుడిగా పేరున్న సువేందు అధికారి అభిప్రాయభేదాల వల్ల దూరమయ్యారు. మమతా బెనర్జీ ఆదివారం పూర్బ మేదినీపూర్ జిల్లా కాంతి దక్షిణ్‌లో ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు. సువేందు కుటుంబం రూ.5వేల కోట్ల ఆస్తులు కూడగట్టినట్లు తాను విన్నానని చెప్పారు. ఆ డబ్బుతో ఓట్లు కొనేయాలని సువేందు ప్రయత్నిస్తున్నాడని, అతడికి ఓటు వేయొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మళ్లీ అధికారంలోకి వస్తే అతడి అవినీతిపై విచారణ జరిస్తానన్నారు. బీజేపీని తరిమికొట్టాలి సువేందు అధికారి కుటుంబాన్ని ద్రోహుల(మీర్ జాఫర్) కుటుంబంగా మమతా బెనర్జీ అభివర్ణించారు. అతడికి ఓటేయవద్దని ప్రజలను కోరారు. బీజేపీ వంచకులు, గూండాల పార్టీ అని మండిపడ్డారు. బెంగాల్లో శాంతి భద్రతలను కాపాడాలన్నా, అభివృద్ధిని కొనసాగించాలన్నా బీజేపీని తరిమికొట్టాలని సూచించారు. -
బెంగాల్ దంగల్: మోదీ–దీదీ మాటల యుద్ధం
ఖరగ్‌పూర్/ హల్దియా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో ప్రచారం ఒక్కసారిగా వేడెక్కింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మధ్య మాటల తూటాలు పేలాయి. మమత సర్కార్ దోపిడి విధానాలను మోదీ ఎత్తి చూపిస్తే, బీజేపీ ప్రపంచంలోనే అతి పెద్ద దోపిడి పార్టీ అంటూ దీదీ ఎదురు దాడి చేశారు. శనివారం ఖరగ్‌పూర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీకి భారీగా తరలివచ్చిన జన సమూహాన్ని ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. మమత సర్కార్ దోపిడి విధానాల వల్ల రాష్ట్రంలో ఎన్నో పరిశ్రమలు మూతపడ్డాయని, కేవలం మాఫియా ఇండస్ట్రీ మాత్రమే పని చేస్తోందని ధ్వజమెత్తారు. మమత మేనల్లుడు, డైమండ్ హార్బర్ ఎంపీ అభిషేక్ బెనర్జీని సింగిల్ విండోగా అభివర్ణించారు. ఆయనతో మాట్లాడకపోతే ఒక్క పని జరగడం లేదని పారిశ్రామికవేత్తలందరూ హడలెత్తిపోతున్నారని అన్నారు. ‘‘పారిశ్రామికీకరణ కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సింగిల్ విండో విధానాన్ని ఏర్పాటు చేసింది. దేశంలోని అన్ని రాష్ట్రాలు దీనిని పాటిస్తూ అభివృద్ధి పథంలో నడుస్తున్నాయి. బెంగాల్లో కూడా సింగిల్ విండో ఉంది. మమత మేనల్లుడే ఇక్కడ సింగిల్ విండో. ఆ విండోని దాటకుండా ఒక్క పని కూడా జరగదు’’అని ఆరోపించారు. అన్నీ అమ్మేస్తున్నారు హల్దియా రేవు పట్టణంలో జరిగి ఎన్నికల సభకి వీల్ చైర్లోనే హాజరైన సీఎం మమతా బెనర్జీ మోదీ మాటల్ని తిప్పి కొట్టారు. ప్రపంచంలోనే బీజేపీ అతి పెద్ద దోపిడీ పార్టీ అని ఆరోపణలు గుప్పించారు. పీఎం కేర్స్ఫండ్ ద్వారా ఆ పార్టీ ఎంత డబ్బు సంపాదించిందో ఒక్క సారి చూడండని అన్నారు. మోదీని మించిన అమ్మకం దారుడు మరెవరూ లేరని ధ్వజమెత్తారు. ప్రధాని అన్నీ అమ్మేస్తూ భారత ఆర్థిక వ్యవస్థని సర్వనాశనం చేస్తున్నారని అన్నారు. ౖ‘‘రెల్వేలను ప్రైవేటు పరం చేశారు. బొగ్గు, బీఎన్ఎన్ఎల్, బీమా, బ్యాంకులు ఇలా అన్నీ అమ్మేస్తున్నారు’’అంటూ విమర్శించారు. ఏదో ఒక రోజు హల్దియా ఓడరేవుని కూడా అమ్మకానికి పెట్టేస్తారని హెచ్చరించారు.. బెంగాల్‌ని కాపాడుకోవాలంటే తృణమూల్ కాంగ్రెస్‌కే ఓట్లు వేయాలని విజ్ఞప్తి చేసిన మమత అప్పుడే రాష్ట్రంలో శాంతిభద్రతలకు భంగం వాటిల్లదని అన్నారు. -
అధినాయకి వర్సెస్ అధికారి
సరిగ్గా పద్నాలుగేళ్ల క్రితం నందిగ్రామ్ పేరు తొలిసారిగా వార్తల్లోకెక్కింది. సెజ్‌ల ఏర్పాటు కోసం రైతుల నుంచి భూసేకరణకు నిరసనగా నందిగ్రామ్‌లో ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమ సెగలు దేశం నలుమూలలకీ పాకాయి. పోలీసు కాల్పుల్లో 14 మంది రైతులు మరణించడంతో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ అన్నదాతలకు అండగా నిలిచి ఉద్యమాన్ని తన చేతుల్లోకి తీసుకున్నారు. నందిగ్రామ్ వేదికగా నాలుగేళ్లు సుదీర్ఘ పోరాటమే చేసి కాలం మారింది కామ్రేడ్స్ అని గర్జిస్తూ 2011 అసెంబ్లీ ఎన్నికల్లో కమ్యూనిస్టు కంచుకోటని బద్దలు కొట్టారు. మళ్లీ ఇన్నేళ్లకి మమత నందిగ్రామ్ అసెంబ్లీ బరిలో దిగడంతో దేశవ్యాప్తంగా మరోసారి నందిగ్రామ్ పేరు మారుమోగుతోంది. ఇన్నాళ్లూ తనకి కుడి భుజంగా ఉంటూ గత డిసెంబర్లోనే బీజేపీలో చేరిన సువేందు అధికారి సవాల్‌ని స్వీకరించి మరీ నందిగ్రామ్ బరిలో మమత దిగడంతో ఆ నియోజకవర్గంలో రాజకీయ సంగ్రామం వేడెక్కింది. వ్యూహ ప్రతివ్యూహాలు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నందిగ్రామ్‌లో నామినేషన్ వేసిన సమయంలో కాలికి అయిన గాయాన్ని తనకి అనుకూలంగా మలుచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. వీల్‌చైర్ మీదే ఎన్నికల ర్యాలీల్లో పాల్గొంటూ సానుభూతి ఓట్లు దక్కేలా వ్యూహాలు రచిస్తున్నారు. బీజేపీ తనని నాలుగ్గోడల మధ్య పరిమితం చేయడానికే నందిగ్రామ్‌లో తనపై దాడికి దిగిందని ఆరోపిస్తున్నారు. తన గెలుపు కోసం పూర్ణేందు బసు అనే సీనియర్ మంత్రిని ప్రత్యేకంగా నియమించారు. పూర్ణేందు అధికారి సాక్షితో మాట్లాడుతూ మమతా బెనర్జీ చేపట్టిన సంక్షేమ పథకాలే ఆమెని గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. మమతను వెన్ను పోటు పొడిచి పార్టీ వీడిన సువేందు అధికారి తప్పు చేశారని, ఆయన చేసిన తప్పులే దీదీకి ఓట్లను కురిపిస్తాయని అన్నారు. నందిగ్రామ్ ఎమ్మెల్యేగా ఉన్న సువేందు అధికారి చేసిన అవినీతి పనులే ఆయనని ఓటమి పాలు చేస్తాయని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ ధోలాసేన్ జోస్యం చెప్పారు. నందిగ్రామ్‌లో మహిళలకి రాజకీయ చైతన్యం ఎక్కువ. తరచుగా ఉద్యమాల్లో పాల్గొంటారు. 49 శాతం ఓట్లు ఉన్న మహిళా ఓటర్లు మమతకే అండగా ఉండే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి వన్ మ్యాన్ ఆర్మీగా దూసుకుపోతున్నారు. 2016 ఎన్నికల్లో 67% ఓట్లు కొల్లగొట్టిన సువేందు అ«ధికారి కుటుంబానికి ఇక్కడ మంచి పలుకుబడి ఉంది. సువేందు అధికారి తండ్రి, సోదరుడు కూడా ఎంపీలుగా పని చేశారు. జూట్ మిల్లు కార్మిక కుటుంబాలతో వీరికి సన్నిహిత సంబంధాలున్నాయి. నందిగ్రామ్ నియోజకవర్గం ఉన్న మిడ్నాపూర్ ఉమ్మడి జిల్లాలో వీరి కుటుంబానికి ఎదురే లేదు. హిందూ ఓట్లను ఏకం చేయడంతో పాటుగా ముస్లిం ఓట్లను రాబడితే గెలుపు ఖాయమన్న ధీమాలో అధికారి ఉన్నారు. బీజేపీకి కేడర్ లేకపోవడం ఆయనకు మైనస్‌గా మారింది. సమఉజ్జీల మధ్య సమరంలో ముస్లింలు, కమ్యూనిస్టు ఓటు బ్యాంకుపైనే వారి గెలుపు ఆధారపడి ఉంది. ముస్లిం ఓటు బ్యాంకు ఎటు ? నందిగ్రామ్ నియోజకవర్గంలో 30% ఉన్న ముస్లింలు ఈ సారి ఎన్నికల్లో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తున్నారు. ముస్లింలు మొదట్లో కమ్యూనిస్టులకు అండగా ఉండేవారు. 2007లో జరిగిన భూ సేకరణలో భూములు కోల్పోయిన వారు మమతకి మద్దతుగా నిలిచారు. మమతా బెనర్జీ ఈ ఎన్నికల్లో ముస్లిం ఓటు బ్యాంకుపైనే ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు. సువేందు అధికారి తనకున్న వ్యక్తిగత పరిచయాలతో ముస్లిం ఓట్లను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక సీపీఎం, కాంగ్రెస్, ఐఎస్ఎఫ్ ఒక కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేస్తోంది. ఐఎస్ఎఫ్ నాయకుడు అబ్బాస్ సిద్ధి్దఖికి నందిగ్రామ్‌లో గట్టి పట్టు ఉంది. ఆయన ప్రభావంతో ముస్లింలు తిరిగి కమ్యూనిస్టుల వైపు మళ్లితే మమతా బెనర్జీ గెలుపు అవకాశాలు ప్రమాదంలో పడిపోతాయి. హిందూత్వ కార్డు నందిగ్రామ్‌లో 70% హిందూ ఓట్లన్నీ గంపగుత్తలా తమకే పడేలా బీజేపీ వ్యూహరచన చేస్తోంది. బీజేపీ కరడుగట్టిన హిందూత్వ వాదాన్ని ఎదుర్కోవడానికి మమత కూడా హిందూత్వ బాట పట్టారు. గుళ్లు గోపురాలు తి రుగుతూ, ఎన్నికల ర్యాలీల్లో శ్లోకాలు వల్లె వేస్తున్నారు. తమదీ హిందూ కుటుంబమే అని చెబుతున్నారు. బ్రాహ్మణ్ సమ్మేళన్ నిర్వహించడానికి ప్రణాళికలు రచిస్తూ దుర్గా పూజ కమిటీలకు సాయం చేస్తున్నారు. హిందువుల్లో వైçష్ణవ ఓటర్లు చెప్పుకోదగిన సంఖ్యలో ఉన్నారు. వీరు తులసిమాల ధరిస్తారు. విభూదిని బొట్టుగా పెట్టుకుంటారు. మమత గెలిస్తే విభూది పెట్టుకోవాలన్నా అనుమతి తీసుకోవాలంటూ సువేందు ప్రచారం చేస్తున్నారు. మత్స్యకారుల పాత్ర హుగ్లీ నది సముద్రంలో కలిసే ప్రాంతం నందిగ్రామ్‌లో ఉంది. దీంతో ఇక్కడ భారీ సంఖ్యలో మత్స్యకార కుటుంబాలు ఉన్నాయి. సముద్రపు నీటిని చట్టవిరుద్ధంగా కాలువల ద్వారా గ్రామాల్లోకి తీసుకువచ్చి వేలాది ఎకరాల్లో రొయ్యల సాగు చేస్తున్నారు. రొయ్యల సాగుని అడ్డుకుంటామని మమత ప్రభుత్వం చెప్పినప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు. సువేందు అధికారి రొయ్యల వ్యాపారుల సిండికేట్‌తో కలిసి వ్యాపారం చేస్తున్నారు. ఈ మత్స్యకారుల్లో దళితులు, ముస్లింలు కూడా ఎక్కువే ఉన్నారు. వీరంతా అధికారి వైపే ఉంటారన్న అంచనాలున్నాయి. సీపీఎం ప్రభావం ? నందిగ్రామ్‌లో సీపీఎం ప్రభావం ఎన్నికల్లో కీలకం కానుంది. చాలా ఏళ్లు ఈ నియోజకవర్గం కమ్యూనిస్టులకు కంచుకోట. 2007లో జరిగిన కాల్పుల ఘటనతో వారి ఇమేజ్ బాగా డ్యామేజ్ అయింది. కేడర్ పెద్ద సంఖ్యలో పార్టీని విడిచి వెళ్లిపోయారు. అయితే టీఎంసీ అధికారంలోకి వచ్చాక సీపీఎం నాయకులపైనా, కార్యకర్తలపైనా దాడులు జరగడంతో మమతపై వారంతా గుర్రుగా ఉన్నారు. వీరు 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేశారన్న విశ్లేషణలు ఉన్నాయి. సీపీఎం విద్యార్థి నాయకురాలైన మీనాక్షి ముఖర్జీ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీకి దిగింది. వాక్పటిమ కలిగిన మీనాక్షి ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. కమ్యూనిస్టులు తమ ఓటు బ్యాంకును తిరిగి కొల్లగొడితే సువేందు అధికారిపై వ్యతిరేక ప్రభావాన్ని చూపించే అవకాశాలున్నాయి. – నందిగ్రామ్ నుంచి సాక్షి ప్రతినిధి -
మమత నామినేషన్ తిరస్కరించాలంటూ బీజేపీ ఫిర్యాదు
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని నందిగ్రామ్ శాసనసభ స్థానం నుంచి పోటీ చేయడానికి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత మమతా బెనర్జీ దాఖలు చేసిన నామినేషన్‌ను తిరస్కరించాలని ఆమె ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి ఎన్నికల సంఘాన్ని కోరారు. మమతా బెనర్జీపై ఉన్న ఆరు క్రిమినల్ కేసులను ఆమె నామినేషన్లో ప్రస్తావించలేదని చెప్పారు. ఇందులో ఐదు కేసులు అస్సాంలో, ఒక కేసు బెంగాల్లో సీబీఐ నమోదు చేసిందని తెలిపారు. ఆమె వాటిని నామినేషన్ పత్రాల్లో పేర్కొనకుండా తొక్కిపెట్టారని విమర్శించారు. ఈ మేరకు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. కేసు నంబర్లను కూడా తన ఫిర్యాదులో ప్రస్తావించానని సువేందు అధికారి చెప్పారు. ప్రస్తుతం ఆయా కేసులు విచారణ దశలో ఉన్నాయన్నారు. చట్ట ప్రకారం మమతా బెనర్జీపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. సువేందు అధికారి ఫిర్యాదుపై అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఇంకా స్పందించలేదు. అది ఓటర్ల ప్రాథమిక హక్కు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ ఆస్తులు, తమపై ఉన్న క్రిమినల్ కేసులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని నామినేషన్ పత్రాల్లో పేర్కొనకపోతే ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ ఆ నామినేషన్‌ను తిరస్కరించవచ్చని 2018 మార్చి నెలలో సుప్రీంకోర్టు ఓ తీర్పులో స్పష్టం చేసింది. అభ్యర్థుల గురించి పూర్తిగా తెలుసుకోవడం ఓటర్ల ప్రాథమిక హక్కు అని పేర్కొంది. నామినేషన్ పత్రాల్లో కొన్ని కాలమ్స్‌ను ఖాళీగా ఉంచడం ఆ హక్కుకు భంగం కలిగించినట్లే అవుతుందని తేల్చిచెప్పింది. -
మమతను ఢీకొట్టేందుకు రెడీ..
కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, ప్రస్తుత బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఢీకొట్టేందుకు బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి సిద్ధమవుతున్నారు. ఆయన ఈ నెల 12న నందిగ్రామ్‌లో నామినేషన్ దాఖలు చేయనున్నట్లు ప్రకటించారు. గతంలో దీదీకి అత్యంత నమ్మకస్తుడిగా పేరున్న సువేందు.. మారిన సమీకరణల కారణంగా బీజేపీ తీర్ధం పుచ్చుకొని, ఏకంగా ఆమెపైనే పోటీకి సిద్ధం కావడంతో అందరి కళ్లు ఈ స్థానంపైనే పడ్డాయి. దీదీ ప్రతిసారీ పోటీ చేసే భవానీపూర్‌ను కాదని నందిగ్రామ్ నుంచి బరిలోకి దిగబోతున్నట్లు ప్రకటించిన వెంటనే, బీజేపీ వేగంగా పావులు కదిపి ఆమెకు సరితూగే బలమైన అభ్యర్ధిని బరిలో దించింది. దీంతో పోరాటాల పురిటిగడ్డ అయిన నందిగ్రామ్ మరోసారి వార్తల్లోకెక్కింది. -
దీదీ వర్సెస్ సువేందు
న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బరిలో ఉన్న నందిగ్రామ్‌లో ఆమెకు పోటీగా బీజేపీ సువేందు అధికారిని అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. శనివారం 57 మంది అ«భ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది. మాజీ క్రికెటర్ అశోక్ దిందా, మాజీ ఐపీఎస్ అధికారి భారతి ఘోష్‌లకు తొలి జాబితాలో చోటు దొరికింది. 57 మంది పేర్లతో కూడిన జాబితాను పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ విలేకరుల సమావేశంలో విడుదల చేశారు. ఒక్క స్థానాన్ని మిత్రపక్షం ఏజేఎస్‌యూకి కేటాయించారు. మార్చి 27 నుంచి ఏప్రిల్ 29 మధ్య ఎనిమిది దశల్లో జరగనున్న బెంగాల్ ఎన్నికల్లో తొలి రెండు విడతల్లో జరిగే 60 స్థానాలకు గాను 57 స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేస్తూ బీజేపీ జాబితా రూపొందించింది. 2011లో ఉవ్వెత్తున ఎగసిన నిరసన ప్రదర్శనలతో మమత అధికారంలోకి రావడానికి కారణమైన నందిగ్రామ్ ఈ సారి ఎన్నికల్లో మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది. 2016లో తృణమూల్ కాంగ్రెస్ తరఫున నందిగ్రామ్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన సువేందు అధికారి ఇటీవల బీజేపీలో చేరడానికి ముందు తన పదవికి రాజీనామా చేశారు. -
బెంగాల్ ఫైట్: బీజేపీ నేత సువేందు అధికారికి నోటీసులు
కోల్‌కతా: బీజేపీ నేత సువేందు అధికారి తనపై చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలపై తృణమూల్ కాంగ్రెస్ నేత అభిషేక్ బెనర్జీ మండిపడ్డారు. జనవరి 19న ఖేజూరిలో జరిగిన బహిరంగ సభలో తన పరువుకు భంగం కలిగే విధంగా అసత్యమైన ప్రకటనలు చేశారని ఆరోపిస్తూ సువేందు అధికారికి లీగల్ నోటీసులు పంపారు. 36 గంటల్లో బేషరతుగా క్షమాపణ చెప్పకపోతే, అతనిపై చట్టపరమైన చర్యలను ప్రారంభిస్తామని అభిషేక్ బెనర్జీ తరపున లాయర్ పేర్కొన్నారు. క్రిమినల్ కేసుల్లో నిందితుడైన సువేందు.. తనపై నిరాధారమైన ఆరోపణలు చేయడం ఏంటని అభిషేక్ ప్రశ్నించారు. అహంకారంతో విర్రవీగుతున్న సువేందు.. ప్రజలకు వ్యతిరేకంగా చేసిన నేరాలను మరిచిపోయారని ధ్వజమెత్తారు. శారదా చిట్ ఫండ్ స్కాం, నారద లంచం కేసుల్లో సువేందు ప్రమేయాన్ని నోటీసుల్లో ప్రస్థావించారు. అభిషేక్ బెనర్జీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి స్వయానా మేనల్లుడు. కాగా, గతంలో టీఎంసీ కీలక నేతల్లో ఒకరైన సువేందు.. మమతా బెనర్జీ ప్రభుత్వంలో కీలక మంత్రిగా వ్యవహరించారు. ఆయన ఇటీవలే టీఎంసీని వీడి బీజేపీలో చేరారు. సువేందుతో పాటు పలువురు టీఎంసీ నేతలు కమల తీర్ధం పుచ్చుకున్నారు. త్వరలో బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో.. అధికార టీఎంసీ, భాజపాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మమతను గద్దె దించడమే లక్ష్యంగా బీజేపీ అగ్రనేతలు పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగానే అధికార పార్టీ ఎమ్మెల్యేలను ఒక్కొక్కరిగా తమ పార్టీలో చేర్చుకుంటున్నారు. -
రాళ్లదాడి.. బీజేపీకి చేదు అనుభవం
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో బీజేపీకి మరో సారి చేదు అనుభవం ఎదురయ్యింది. గతంలో టీఎంసీ కార్యకర్తలు బీజేపీ జాతీయాధ్యక్షడు జేపీ నడ్డా కాన్వాయ్‌పై దాడి చేయగా.. ప్రస్తుతం బీజేపీ నాయకుడు సువేందు అధికారి పాల్గొన్న ర్యాలీలో ఇరు వర్గాల కార్యకర్తలు రాళ్లు రువ్వుకున్నారు. ఈ ర్యాలీలో కేంద్రమంత్రి దేవశ్రీ చౌధురి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్, మాజీ మంత్రి సువేందు అధికారి పాల్గొన్నారు. దాడికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.. ఈ సందర్భంగా బీజేపీ నాయకుడు సువేందు అధికారి మాట్లాడుతూ.. ‘ఇది ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి. ఓటమి భయంతోనే టీఎంసీ నాయకులు మాపై దాడి చేశారు. వారంతా మిని పాకిస్తాన్‌కు చెందిన వారు’ అన్నారు. (చదవండి: వ్యూహాత్మక ఎత్తుగడ: బీజేపీకి దీదీ సవాల్) వచ్చే ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి పోటీ చేస్తానంటూ మమతా బెనర్జీ ప్రకటించిన కొద్ది గంటల్లోనే ఈ హింస చోటుచేసుకోవడం గమనార్హం. 2019 ఎన్నికల్లో 42 లోక్‌సభ స్థానాల్లో 18 స్థానాలు గెలుచుకున్న బీజేపీ.. ఏప్రిల్- మే నెలల్లో జరగబోయే బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బెంగాల్లో పాగా వేయాలనే పట్టుదలతో ముందుకెళ్తోంది. ఇందులో భాగంగానే ఈ రోజు పరివర్తన్ ర్యాలీ నిర్వహించింది. అయితే, ఈ ర్యాలీపై కొందరు వ్యక్తులు వాటర్ బాటిళ్లు విసిరారు. అంతేకాకుండా తృణమూల్ కాంగ్రెస్ జెండాలను పట్టుకొన్న కొందరు వ్యక్తులు ‘గో బ్యాక్’ నినాదాలు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దాంతో దక్షిణ కోల్‌కతాలోని ముదియాలి ప్రాంతంలో పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. గతేడాది జేపీ నడ్డా పర్యటన సందర్భంగా కూడా కోల్‌కతాలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఇక మమతా బెనర్జీ నందిగ్రామ్ నుంచి పోటీ చేస్తానంటూ చేసిన ప్రకటనపై సువేందు స్పందించారు. ఆమెని 50 వేల ఓట్ల మెజారిటీతో ఓడిస్తానని తెలిసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేను ఆమెని(దీదీ) నందిగ్రామ్‌లో అర లక్ష ఓట్ల తేడాతో ఓడిస్తాను. లేదంటే రాకీయాల నుంచి తప్పుకుంటాను అన్నారు. -
దీదీకి షాక్.. మరో ఎమ్మెల్యే రాజీనామా
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే సీనియర్ నేత సువేందు అధికారి టీఎంసీకి గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. తాజాగా మరో మంత్రి పార్టీకి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే, రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి లక్ష్మి రతన్ శుక్లా తన పదవికి రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ నేతలు ఒక్కొక్కరు టీఎంసీ వీడుతూ దీదీకి షాక్ ఇస్తున్నారు. ఈ క్రమంలో రతన్ శుక్లా తన రాజీనామా లెటర్ ఒక కాపీని ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి, మరో దాన్ని గవర్నర్ జగదీప్ ధంకర్‌కు అందజేశారు. గతంలో బెంగాల్ రంజీ టీమ్‌కి కెప్టెన్‌గా వ్యవహరించిన రతన్ శుక్లా హౌరా(ఉత్తర) నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. రతన్ శుక్లా రాజీనామాపై స్పందిస్తూ.. ‘పార్టీకి, నాకు మధ్య ఎలాంటి విబేధాలు లేవు. రాజకీయాల నుంచి రిటైర్ అవుదామనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాను’ అన్నారు. (చదవండి: మమతకు వరుస షాక్‌లు.. స్పీకర్ ట్విస్టు!) ఇక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బెంగాల్లో పాగా వేసేందుకు బీజేపీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతూ.. మమతకు కంటికి మీద కునుకు లేకుండా చేస్తోంది. సువేంధు అధికారి పార్టీ నుంచి బయటకు వచ్చిన నాటి నుంచి టీఎంసీలో చీలికలు మొదలయ్యాయి. ఇక కేంద్ర హోం మినిస్టర్ అమిత్ షా ఎన్నికల నాటికి టీఎంసీలో దీదీ మాత్రమే మిగులుతుందని పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రెబెల్ తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు సువేందు అధికారి తమ్ముడు కూడా బీజేపీలో చేరారు. సౌమేందు అధికారి తూర్పు మిడ్నాపూర్ జిల్లాలోని మునిసిపాలిటీకి కౌన్సిలర్, చైర్‌పర్సన్‌గా ఉన్నారు. గత వారం ఆయనతో కలిసి మరో డజను మంది ఇతర పార్టీ కౌన్సిలర్లు బీజేపీలో చేరారు. అయితే అధికారి కుటుంబానికి చెందిన మరో ఇద్దరు సభ్యులు సువేందు అధికారి తండ్రి సిసిర్, సోదరుడు దిబ్యేండుల్‌లు మాత్రం టీఎంసీలో కొనసాగుతున్నారు. -
ఆ వైరస్ పీడ విరగడైంది.. సంతోషం: ఎంపీ
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసీ), బీజేపీల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. పరస్పర విమర్శలు, ఆరోపణలతో ఇరువర్గాలు రాజకీయ వేడిని పెంచుతున్నాయి. ఈ క్రమంలో టీఎంసీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, ఎంపీ అభిషేక్ బెనర్జీ, బీజేపీ నేత సువేందు అధికారిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నారద, శారద పోంజి స్కాం వంటి కుంభకోణాల్లో తనకు భాగస్వామ్యం లేదంటూ తనపై చేసిన ఆరోపణలను తిప్పికొట్టారు. తాను అధికార దుర్వినియోగానికి పాల్పడ్డానని రుజువు చేస్తే బహిరంగంగా ఉరివేసుకోడానికి సిద్ధమని సవాల్ విసిరారు. కాగా ఇటీవలే టీఎంసీని వీడి బీజేపీలో చేరిన సీనియర్ నేత సువేందు.. పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాలో ఆదివారం జరిగిన ఓ ర్యాలీలో ప్రసంగిస్తూ.. అభిషేక్ బెనర్జీపై విమర్శలు గుప్పించారు. తోలాబాజ్(అధికార దుర్వినియోగానికి పాల్పడి బలవంతపు వసూళ్లు చేసేవాడు) అంటూ విరుచుకుపడ్డారు. అలాంటి వాళ్లను రాష్ట్రం నుంచి తరిమికొట్టాలంటూ పిలుపునిచ్చారు. ఇక తన నియోజకవర్గమైన డైమండ్ హార్బర్లో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న అభిషేక్ బెనర్జీ సువేందు వ్యాఖ్యలకు దీటుగా బదులిచ్చారు. పార్టీకి వెన్నుపోటు పొడిచిన వారికి తనను విమర్శించే హక్కులేదన్నారు. (చదవండి: 21 ఏళ్లు.. అందుకు సిగ్గుపడుతున్నా!) ఈ మేరకు.. ‘‘లక్షణాలు బయటపడని కోవిడ్-19 రోగులు మన పార్టీలో చాలా మందే ఉండేవారు. వారి కార్యకలాపాలను మేం ట్రేస్ చేశాం. వారిని గుర్తించాం. 2019 లోక్‌సభ ఎన్నికల నాటి నుంచి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ, పార్టీని నాశనం చేసేందుకు ప్రయత్నించిన వైరస్ వెళ్లిపోవడం పట్ల నాకు చాలా సంతోషంగా ఉంది. నిజమైన తోలాబాజే నన్ను ఆ మాట అంటున్నారు. శారద స్కాంలో ఆయన పేరు బయటకి వచ్చింది. ఒక్క విషయం చెప్పనా ఫ్రెండ్.. నేను నారద, శారద కుంభకోణాల్లో భాగస్వామిని కాను. ఈడీ, సీబీఐ నాపై దాడులు చేసినా ప్రతిఫలం ఉండదు. ఏం చేయాలనుకుంటున్నారో చేసుకోండి’’ అని సువేందుకు కౌంటర్ ఇచ్చారు. -
21 ఏళ్లు.. అందుకు సిగ్గుపడుతున్నా!
కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఓ కంపెనీలా మారిందని, అక్కడ ఎవరికీ క్రమశిక్షణ లేదంటూ బీజేపీ నేత సువేందు అధికారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సుదీర్ఘకాలం పాటు ఆ పార్టీలో కొనసాగినందుకు తాను సిగ్గుపడుతున్నానని పేర్కొన్నారు. టీఎంసీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేబినెట్లో మంత్రిగా విధులు నిర్వర్తించిన ఆయన ఇటీవలే తన పదవికి రాజీనామా చేసి కాషాయ కండువా కప్పుకొన్న విషయం తెలిసిందే. గత అసెంబ్లీ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించిన తనకు సముచిత స్థానం దక్కకపోవడం, మమతతో విభేదాలు తలెత్తడం వంటి పరిణామాల నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలో బీజేపీ కార్యాలయంలో పార్టీ శ్రేణులను ఉద్దేశించి సువేందు అధికారి శనివారం ప్రసంగించారు. (చదవండి: ఒక్కొక్కరికి రూ. 2.5 లక్షలు: అమిత్ షా) ‘‘డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ త్యాగ ఫలితంగానే మనం నేడు బెంగాల్లో జీవించగలుగుతున్నాం. రాష్ట్రంలో ప్రస్తుతం నిరుద్యోగం పెరిగిపోయింది. కేంద్రంలోని ఎన్డీయే సర్కారు తోడు బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరితేనే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది’’ అని పేర్కొన్నారు. ఇక పార్టీ మారడం గురించి మాట్లాడుతూ.. ‘‘21 ఏళ్ల పాటు తృణమూల్‌తో బంధం కొనసాగించినందుకు సిగ్గుపడుతున్నా. ఆ పార్టీలో అసలు ఇప్పుడు క్రమశిక్షణ లేదు. బీజేపీ ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ. జాతీయత, దేశ భక్తి, క్రమశిక్షణకు మారు పేరైన ఈ పార్టీలో ఇప్పుడు నేను కూడా సభ్యుడిని. అధిష్టానం మార్గదర్శకత్వంలో రాష్ట్రాన్ని సోనార్ బంగ్లాగా తీర్చిదిద్దడమే మన అందరి లక్ష్యం’’ అంటూ అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాల గురించి దిశానిర్దేశం చేశారు. ‘‘బీజేపీ కార్యకర్తలపై విచక్షణా రహిత దాడులు జరుగుతున్నాయి. తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. పార్టీ కోసం ఇప్పటికే 135 మంది కార్యకర్తలు ప్రాణత్యాగం చేశారు. ఇవన్నీ పోలీసులకు కనిపించవు’’ అని మమత ప్రభుత్వాన్ని విమర్శించారు. అదే విధంగా పీఎం- కిసాన్ యోజన అమలు చేయకుండా రైతులకు అన్యాయం చేస్తున్నారని సువేందు మండిపడ్డారు.(చదవండి: రాష్ట్రాన్ని నాశనం చేశారు: ప్రధాని మోదీ) -
మమత మాత్రమే మిగులుతారు!
మిడ్నాపూర్: రాబోయే బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నాటికి అధికార తృణమూల్ కాంగ్రెస్‌లో ఎవరూ మిగలరని, కేవలం మమతా బెనర్జీ మాత్రమే పార్టీ్టలో ఉంటారని బీజేపీ నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎద్దేవా చేశారు. శనివారం బెంగాల్లో ఆయన టీఎంసీకి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా టీఎంసీ సీనియర్ నేత సువేందు అధికారి సహా పలు పార్టీల నేతలు బీజేపీలో చేరారు. టీఎంసీ నినాదమైన ‘‘మా, మాటి, మనుష్(తల్లి, జన్మభూమి, ప్రజ) కాస్తా ‘‘దోపిడీ, అవినీతి, బంధుప్రీతి’’గా మారిపోయిందని అమిత్ షా దుయ్యబట్టారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ 200 పైగా సీట్లు గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. బెంగాల్ ప్రజలు మార్పు కోసం బీజేపీ వెనుక నడిస్తే మమతకు ఏమి సమస్యని ఆయన ప్రశ్నించారు. బంధుప్రీతి, బుజ్జగింపులే కారణం ప్రత్యర్థి పార్టీలకు చెందిన నాయకులు బీజేపీలో చేరడానికి టీఎంసీ అనుసరిస్తున్న బంధుప్రీతి, బుజ్జగింపు రాజకీయాలే కారణమని అమిత్ షా విమర్శించారు. కాంగ్రెస్, సీపీఎం, టీఎంసీ నుంచి పలువురు నేతలు సువేందు అధికారి నేతృత్వంలో బీజేపీలో మోదీ నాయకత్వంలో పనిచేయడానికి చేరారని చెప్పారు. టీఎంసీలో చీలికలను బీజేపీ ప్రోత్సహిస్తోందన్న విమర్శలపై స్పందిస్తూ 1998లో టీఎంసీ ఏర్పడిందే కాంగ్రెస్ నుంచి చీలిపోయాయని గుర్తు చేశారు. టీఎంసీ నుంచి నేతలు వీడడం ఆరంభమేనని, నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా టీఎంసీని వీడుతున్నారన్నారు. ఇదే విధంగా వలసల జోరు కొనసాగితే ఎన్నికల నాటికి టీఎంసీలో మమత మాత్రమే మిగులుతారన్నారు. 9 మంది ఎంఎల్ఏలు, ఒక ఎంపీ అధికార టీఎంసీకి చెందిన కీలక నేత సువేందు అధికారి సహా వివిధ పార్టీలకు చెందిన 9 మంది ఎంఎల్ఏలు, ఒక టీఎంసీ ఎంపీ అమిత్‌షా సమక్షంలో బీజేపీలో చేరారు. ఇటీవలే టీఎంసీకి సువేందు రాజీనామా చేశారు. బర్ధమాన్ పుర్బాకు చెందిన ఎంపీ సునీల్ మండల్, టీఎంసీ ఎంఎల్ఏలు బన్సారీ మైటీ, శిలభద్ర దత్తా, బిస్వజిత్ కుందు, సుక్రా ముండా, సైకత్ పంజా, సీపీఎం నుంచి టీఎంసీలో చేరిన ఎంఎల్ఏ దిలీప్ బిస్వాస్, సీపీఎంకే చెందిన మరో ఎంఎల్ఏ తపసి మండల్, సీపీఐ ఎంఎల్ఏ అశోక్దిండా, కాంగ్రెస్ ఎంఎల్ఏ సుదీప్ ముఖర్జీ బీజేపీలో చేరారు. మాజీ ఎంపీ దశరధ్ టిర్కీ కూడా బీజేపీ కండువా కప్పుకున్నారు. వీరితో పాటు టీఎంసీ, లెఫ్ట్, పలువురు కాంగ్రెస్ జిల్లాస్థాయి నేతలు బీజేపీలో చేరారు. రైతు ఇంట భోజనం... పశ్చిమబెంగాల్లో పర్యటిస్తున్న హోంమత్రి అమిత్‌షా శనివారం ఒక రైతు ఇంట మధ్యాహ్న భోజనం చేశారు. బెంగాల్‌లోని పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాలోని బలిజ్హరిలో నివాసముండే సనాతన్ సింగ్ నివాసానికి వెళ్లిన అమిత్‌షా అక్కడే నేలపై కూర్చొని భోజనం చేశారు. ఆయనతోపాటు బీజేపీ నేతలు కైలాస్ విజయ్వర్ఘీయ్, ముకుల్‌రాయ్, దిలీప్ ఘోష్ భోజనాలు చేశారు. అంతకుముందు స్థానిక ఆలయంలో అమిత్ పూజలు నిర్వహించారు. తన ఇంట్లో హోంమంత్రి విందారగించడంపై సనాతన్ సింగ్ ఆనందం వ్యక్తం చేశారు. కేవలం పప్పు, రోటీలను మాత్రమే భోజనంలో ఇవ్వగలిగానన్నారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు కదం తొక్కుతున్న వేళ రైతు ఇంట విందుకు అమిత్ వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. వచ్చేఎన్నికల్లో రైతులను ఆకట్టుకునే వ్యూహంలో ఇది ఒక భాగమని భావిస్తున్నారు. ఎవరీ సువేందు? మమతా బెనర్జీ ప్రస్తుత ప్రభుత్వంలో సువేందు అధికారి రవాణా, నీటిపారుదల–జల వనరుల మంత్రిగా పనిచేశారు. నవంబర్ 27 న ఆయన మంత్రి పదవికి, డిసెంబర్ 16న ఎమ్మెల్యే పదవికిడిసెంబర్ 17న టీఎంసీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో మమతా బెనర్జీ తరువాత సువేందు అధికారికి జనాదరణ ఎక్కువగా ఉందంటారు. 2007నందిగ్రామ్ ఉద్యమంలో అధికారి కీలక పాత్ర పోషించారు. అనంతరం ‘జంగల్ మహల్’గా పేరుతెచ్చుకున్న పశ్చిమ మిడ్నాపూర్, పురూలియా, బంకురా జిల్లాల్లో తృణమూల్ కాంగ్రెస్‌ను క్షేత్రస్థాయిలో బలోపేతం చేశారు. రెండు మార్లు లోక్‌సభ ఎంపీగా కూడా ఆయన ఎన్నికయ్యారు. వెస్ట్ మిడ్నాపూర్, బంకురా, పురులియా, ఝూర్గ్రామ్, బీర్భూమిలోని కొన్ని ప్రాంతాలతో కలిపి మొత్తం 60 నుంచి 65 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అధికారి కుటుంబ ప్రభావం ఉంటుందని విశ్లేషకుల అంచనా. అతనే కారణమా? ఇటీవల తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాల కారణంగానే సీనియర్ నాయకులు పార్టీని వీడుతున్నారని బయటకు వినిపిస్తున్నా, అసలు కారణం వేరే ఉందని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి పార్టీలోని ఇతర సీనియర్ నాయకులకన్నా ప్రాధాన్యం పెరగడం, అభిషేక్‌ను తన వారసునిగా మమత సిద్ధం చేయడమే సువేందు అధికారి సహా అనేకమంది సీనియర్ల అసంతృప్తికి అసలు కారణమంటున్నారు. -
మమతకు వరుస షాక్‌లు.. స్పీకర్ ట్విస్టు!
కోల్‌కతా: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పశ్చిమ బెంగాల్లో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. అధికార తృణమూల్ పార్టీని దెబ్బకొట్టి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీని గద్దె దించడమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. ఈ క్రమంలో మమతకు కుడిభుజంగా ఉన్న ముకుల్ రాయ్‌ను మూడేళ్ల క్రితమే తమ పార్టీలో చేర్చుకున్న కాషాయ దళం.. ఇప్పుడు టీఎంసీ ముఖ్యనేతలను పార్టీలోకి ఆహ్వానించేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పిన మంత్రి సువేందు అధికారి తన ఎమ్మెల్యే పదవికి బుధవారం రాజీనామా చేశారు. ఇక ఈరోజు మరో ఎమ్మెల్యే శిల్భద్ర దత్తా సహా మైనార్టీ సెల్ నాయకుడు కాబిరుల్ ఇస్లాం టీఎంసీని వీడారు. అదే విధంగా 24 గంటల్లోనే నలుగురు ముఖ్యనేతలు పార్టీని వీడటం, రానున్న రోజుల్లో భారీ ఎత్తున క్షేత్రస్థాయి కార్యకర్తలు పార్టీకి గుడ్‌బై చెప్పేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే టీఎంసీ మరో ఎమ్మెల్యే జితేంద్ర తివారి సహా ఆయన అనుచరుడు, దక్షిణ బెంగాల్ రాష్ట్ర రవాణా సంస్థ చీఫ్, గ్రీవెన్స్ సెల్ హెడ్ కల్నల్ దీప్తాంశు చౌదరి కూడా రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ, గవర్నర్‌కు లేఖ పంపించారు. కాగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ వారంతంలో బెంగాల్లో పర్యటించనున్న నేపథ్యంలో వీరంతా అప్పుడే కాషాయ కండువా కప్పుకొనేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ పరిణామాలు టీఎంసీలో కలవరం రేపుతున్నాయి.(చదవండి: కేంద్రంపై నిప్పులు చెరిగిన సీఎం) మమతకు వరుస షాకులు.. గవర్నర్ నిర్ణయం టీఎంసీ పార్టీ తరఫున ఎన్నికైన ఎమ్మెల్యే సువేందు అధికారి రాజీనామాను స్పీకర్ అంగీకరించలేదు. ఈనెల 21న ఈ అంశంపై వివరణ ఇవ్వాలని ఆయనకు సందేశం పంపారు. ఇదిలా ఉండగా.. బారక్‌పోర్ నుంచి గెలుపొందిన శిల్భద్ర దత్తా మాత్రం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు పార్టీని వీడుతున్నట్లు మమతకు రాసిన లేఖలో.. ‘‘ ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీలో ఇమడలేనని నాకు అనిపిస్తోంది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయను. అయినా నేనెందుకు రాజీనామా చేయాలి? ప్రజలు ఓట్లు వేసి నన్ను గెలిపించారు. నేను పదవిలో లేనట్లయితే వాళ్లు ఎవరిని ఆశ్రయిస్తారు. కేవలం పార్టీని మాత్రమే వీడుతున్నాను’’అని ఆయన పేర్కొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. తనలాంటి రెబల్స్‌ను బుజ్జగించేందుకు టీఎంసీకి ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరిస్తున్న ప్రశాంత్ కిషోర్ లేదా ఆయన టీం రంగంలోకి దిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. సెటైర్లు వేసిన బీజేపీ ఐటీ సెల్ ముకుల్ రాయ్ సహకారంతో లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటిన బీజేపీ.. శాసన సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు కైవసం చేసుకునే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. 294 అసెంబ్లీ సీట్లలో 200 మేర స్థానాల్లో విజయం సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. మమత సర్కారును విమర్శించే ఏ ఒక్క అవకాశాన్ని వదలకుండా మాటల దాడి చేస్తోంది. ఇక బీజేపీ సోషల్ మీడియా వింగ్ సైతం విమర్శనాస్త్రాలు సంధిస్తూ దూసుకుపోతుంది. ఈ క్రమంలో రాష్ట్రంలోని తాజా పరిణామాలపై స్పందించిన బీజేపీ ఐటీసెల్ చీఫ్ అమిత్ మాలవీయ.. ‘‘ఈస్థాయిలో టీఎంసీ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తున్నారంటే.. ఆంటీ తన కార్యాలయంలో రాజీనామా లేఖలు కలెక్ట్ చేసుకునేందుకు ప్రత్యేకంగా ఓ సెంటర్ పెడితే సరిపోతుంది’’అంటూ ట్విటర్ వేదికగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ ప్రాంతంపై అధికారికి పట్టు! ఓవైపు టీఎంసీ ఎన్నికల వ్యూహానికి పదును పెడుతుండగా.. మరోవైపు బీజేపీ ఆ పార్టీ ముఖ్యనేతలకు గాలం వేస్తూ రోజురోజుకీ బలం పెంచుకుంటోంది. సువేందు అధికారి బీజేపీలో చేరడం లాంఛనమే అని పార్టీ వర్గాలు చెబుతున్న విషయం తెలిసిందే. కాగా అధికారిని చేర్చుకోవడం వల్ల కాషాయ దళానికి భారీగా ప్రయోజనం చేకూరే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. రాష్ట్రంలోని పశ్చిమ ప్రాంతంపై ఆయనకు పట్టు ఉంది. సుమారు 50 సీట్లలో పార్టీని గెలిపించే సత్తా ఆయనకు ఉంది. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీకి ఈ ప్రాంతంలోని నియోజకవర్గాల్లో ఎక్కువ సీట్లు రావడంలో ఆయన కీలకపాత్ర పోషించారు. ఇక బీజేపీ తీరుపై ఇటీవలి కూచ్‌బెహర్ పర్యటనలో భాగంగా మమతా బెనర్జీ ఘాటు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. తమ పార్టీ నేతలకు ఫోన్లు చేస్తూ ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరతీశారని మండిపడ్డారు. అదే విధంగా రాజీనామా చేసిన ఎమ్మెల్యేలను ఉద్దేశించి.. ‘‘కొంతమంది అలల్లాగా వస్తారు పోతారు. కానీ టీఎంసీ ఉనికిని ఎవరూ ఎన్నటికీ మాయం చేయలేరు’’ అని చెప్పుకొచ్చారు. కాగా పశ్చిమబెంగాల్లో గతంలో కమ్యూనిస్టుల ప్రాబల్యంలో ఉన్న పార్లమెంటు నియోజకవర్గాలన్నింటిలో బీజేపీ క్రమంగా పట్టుబిగిస్తోంది. 2016లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల డేటాని బట్టి చూసినా కామ్రేడ్ల స్థానాన్ని కాషాయం ఆక్రమిస్తున్న విషయం దృఢపడుతోంది. -
ఎమ్మెల్యే పదవికి సువేందు అధికారి రాజీనామా
కోల్‌కతా: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పశ్చిమ బెంగాల్లో రాజకీయం వేడెక్కుతోంది. లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటిన బీజేపీ, శాసనసభ ఎన్నికల్లోనూ తన మార్కు చూపించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెక్ పెట్టే విధంగా వ్యూహాలు రచిస్తోంది. ఈ క్రమంలో బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్‌పై దాడి ఎపిసోడ్ సహా ఇప్పటికే పలు అంశాల్లో కేంద్రం వర్సెస్ మమత అన్నట్లుగా ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో టీఎంసీ అసంతృప్త నేత సువేందు అధికారి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. త్వరలోనే ఆయన బీజేపీలో చేరనున్నట్లు సమాచారం. (చదవండి: కేంద్రంతో మమత ఢీ) కాగా టీఎంసీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో విభేదాలు తలెత్తిన నేపథ్యంలో సువేందు తన మంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. రోడ్డు రవాణా, నీటిపారుదల శాఖా మంత్రిగా పనిచేసిన ఆయన హూగ్లీ రివర్ బ్రిడ్జి కమిషన్ చైర్మన్ పదవి నుంచి కూడా వైదొలిగారు. దీంతో ప్రభుత్వానికి, సువేందుకు మధ్య దూరం పెరిగింది. ఈ క్రమంలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ ఆయన అనుచరులు పలువురిని బహిష్కరిస్తూ ఆదివారం పార్టీ నిర్ణయం తీసుకుంది. కాగా సుభేందు అధికారి టీఎంసీని వీడినట్లయితే మమత సర్కారు కుప్పకూలూతుందంటూ బీజేపీ ఎంపీ అర్జున్ సింగ్ ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అంతేగాక సువేందు బీజేపీలో చేరినట్లయితే తాము ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమన్నారు. మా నాయకుడికి బీజేపీ నేతల ఫోన్: మమతా బెనర్జీ అధికార దాహంతో బీజేపీ తమ పార్టీ నేతలను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నిస్తోందని టీఎంసీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం ఆరోపించారు. కూచ్‌బెహర్ జిల్లాలో ఆమె మాట్లాడుతూ.. ‘‘బీజేపీ మా నాయకులకు ఫోన్‌కాల్స్ చేస్తోంది. మా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సుబ్రతా భక్తికి ఢిల్లీ బీజేపీ నేతల నుంచి, అనుబ్రతా మొండాల్‌కు బీర్భూమ్ నుంచి కాల్ వచ్చింది. చూడండి వాళ్లెంత ప్రమాదకరమో చూడండి. మా నాయకులను లాక్కొనేందుకు వారి ప్రయత్నాలు చూడండి’’ అని విమర్శించారు. ‘‘బీజేపీ దొంగలు, గూండాలు, చంబల్ దోపిడీదారుల పార్టీ. కూచ్‌బెహర్‌లో వాళ్లు చేసిన అభివృద్ధి ఏమీలేదు. వలస కార్మికుల రైలు చార్జీలు నేను చెల్లించాను. మైనార్టీలను అక్కున చేర్చుకున్నాను. బీజేపీని నమ్ముకుంటే లాభం లేదు’’ అని పేర్కొన్నారు. -
రసవత్తరం కానున్న బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి. తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) సీనియర్ నాయకుడు, తిరుగుబాటు నేత సువేందు అధికారి ఆ పార్టీకి తల నొప్పిగా మారనున్నారు. టీఎంసీ పార్టీ నాయకుడు సౌగతా రాయ్(49) అయిదుగు పార్టీ నాయకులతో రెండు రోజుల పాటు కీలక సమావేశం నిర్వహించారు. సువేందు నిర్ణయంలో ఏదైనా మార్పు ఉంటే మళ్లీ చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన అన్నారు. (చదవండి: పశ్చిమ బెంగాల్లో విషాదం, 11 మంది మృతి) పార్టీలో మొదలైన ముసలం టీఎంసీ యూత్ వింగ్ చీఫ్, డైమండ్ హార్బర్ ఎంపీ అభిషేక్ బెనర్జీకి పార్టీలో ప్రాధాన్యత పెరగడంతో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సన్నిహితుల మధ్య విభేదాలు మొదలయ్యాయి. దీంతో పార్టీ ఫిరాయించిన చాలా మంది బీజేపీలో చేరడంతో గత సంవత్సరం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపింది. బెంగాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కేవలం రెండు సీట్లు మాత్రమే గెలుచుకుంటే.. లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం 40 స్థానాలకు గానూ 18 గెలుచుకుంది. మారనున్న సమీకరణాలు సువేందు పార్టీ మారకపోయినా.. పార్టీ నుంచి నిష్క్రమిస్తే మాల్డా, ముర్షిదాబాద్, పురులియా, బంకురా, పశ్చిమ మిడ్నాపూర్ ప్రాంతాల్లోని స్థానిక నాయకులపై ప్రభావం చూపనుంది. సువేందు పదవిని రద్దు చేసే వరకు ఈ ప్రాంతంలో ఆయన అధికారి పార్టీ ఇన్చార్జిగా ఉన్నారు. ఆయన తండ్రి, సోదరుడు ఇద్దరు కూడా టీఎంసీ పార్టీ ఎంపీలుగా కొనసాగుతున్నారు. ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో సువేందు మాట్లాడుతూ.. అభిషేక్ బెనర్జీకి పార్టీలో అగ్రస్థానం చేరుకోవడానిక దొడ్డి దారి ఎంచుకున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే దీనిపై బెనర్జీ స్పందిస్తూ... ‘‘నేను డైమండ్ హార్బర్ వంటి కఠినమైన నియోజకవర్గం నుంచి ఎంపీ కావడానికి పారాచూట్, నిచ్చెనను ఉపయోగించలేదు. డైమండ్ హార్బర్ నా సొంత నియోజకవర్గం. మా కుటుంబంలో వారు కూడా చాలా పదవులు కలిగి ఉన్నారు’ అని అన్నారు. మంగళవారం ఉత్తర కోల్‌కత్తాలో జరిగిన సమావేశంలో ఎన్నికల ప్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌తోపాటు బెనర్జీ హాజరయ్యారు. -
‘తల్లికి నమ్మకద్రోహం చేస్తే.. అధోగతే’
కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) సీనియర్ నాయకుడు, రవాణా శాఖ మంత్రి సువేందు అధికారి శుక్రవారం మమతా బెనర్జీ మంత్రి వర్గం నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘తాను పైకి ఎదగడానికి లిఫ్ట్ ఉపయోగించలేదని, పార్టీ కార్యకర్తలే తన బలమని, పారాచూట్ ఉపయోగించి కిందికి రాలేను’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలపై టీఎంసీ యూత్ వింగ్ చీఫ్, డైమండ్ హార్బర్ ఎంపీ అభిషేక్ బెనర్జీ తన నియోజకవర్గమైన సత్గాచియాలో జరిగిన బహిరంగ ర్యాలీలో స్పందిస్తూ.. టీఎంసీ పార్టీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ పార్టీ సభ్యులకు తల్లిలాంటిదన్నారు. పార్టీ సభ్యులు అంచెలంచెలుగా ఎదగడానికి, ప్రజల కోసం పని చేయడానికి ఆమె అవకాశం ఇచ్చారన్నారు. వ్యక్తిగత లాభాల కోసం ఎవరైనా తల్లి నమ్మకాన్ని వమ్ము చేస్తే, పార్టీకి నష్టం కలిగిస్తే అతను తల్లికి నమ్మకదోహం చేసినట్లా? కాదా? అని ప్రశ్నించారు. నమ్మకద్రోహం చేస్తే అది అతని పతనానికి నాందని ఆయన అన్నారు. (చదవండి: షాకింగ్‌గా ఉంది.. ఇలా జరగాల్సింది కాదు!) టీఎంసీ నిర్వహించిన రిజర్వేషన్ సమస్యల సమావేశంలో పశ్చిమ బెంగాల్‌లోని అనేక జిల్లాల్లో పట్టున్న నాయకుడు, ప్రముఖ ఎంపీ సౌగతా రాయ్‌తో సుబేందు రిజర్వేషన్లపై తన అభిప్రాయం పంచుకున్నారు. ఆయన వామపక్ష ఫ్రంట్‌ను ఓడించి మమతా బెనర్జీ అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించారు. నందిగ్రామ్ భూస్వామ్య వ్యతిరేక ఉద్యమానికి ఆయన వెన్నుముకగా నిలిచారు. అయితే కొంత కాలంగా టీఎంసీ పార్టీ కార్యకలాపాలకు సువేందు దూరంగా ఉంటున్నారు. -
టీఎంసీ పతనం ఆరంభం: సువేందుకు స్వాగతం
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికలు వచ్చే ఏడాది ఏప్రిల్-మేలో జరిగే అవకాశం ఉందన్న అంచనాల మధ్య రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టేందుకు బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. అటు అధికారాన్నికాపాడుకునేందుకు తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో పార్టీలో రగులుతున్న అసమ్మతి సెగలు, రాజీనామాలతో టీఎంసీ కష్టాల్లో కూరుకుపోతోంది. మరోవైపు తిరుగుబాటు నాయకులను బుజ్జగించి కాషాయ దళంలో చేర్చుకునేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. తాజా పరిణామాలపై మాజీ టీఎంసీ నేత, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు ముకుల్ రాయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర రవాణా మంత్రి, సీనియర్ నాయకుడు సువేందు అధికారి రాజీనామాను స్వాగతించిన ఆయన టీఎంసీ ముగింపు ప్రారంభమైందని వ్యాఖ్యానించారు. ఆయన బీజేపీలో చేరితే పార్టీకి, ఆయనకు ప్రయోజనకరంగా ఉంటుందని పేర్కొన్నారు. సువెందు మంత్రి పదవికి రాజీనామా చేసిన కొద్ది గంటలకే ఆయన ఈ మేరకు స్పందించారు. (క్లిష్ట సమయంలో మమతకు భారీ షాక్) మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ స్పందిస్తూ సువేందు అధికారికి బీజేపీ ద్వారాలు తెరిచే ఉన్నాయని పేర్కొన్నారు. అధికార పార్టీ తీరు పట్ల మరికొంతమంది నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారనీ, వారికి కూడా బీజేపీలోకి ఆహ్వానం పలుకుతున్నామన్నారు. సువెంద్ రాజీనామా టీఎంసీ పతనానికి సంకేతమనీ, ఇక ఆ పార్టీ తెరమరుగవ్వడం ఖాయమన్నారు. అంతేకాదు "ఈ రోజు పెద్ద వికెట్ పడిపోయింది" ఇక ఆత్మగౌరవమున్న నాయకులంతా టీఎంసీకి గుడ్‌బై చెబుతారని ఘోష్ జోస్యం చెప్పారు. అదొక మునిగిపోతున్న ఓడ, అందులో కెప్టెన్ మినహా ఎవరూ ఎవ్వరూ ఉండరన్నారు. 2019 (లోక్‌సభ ఎన్నికలు) బీజేపీకి సెమీ ఫైనల్. తామిపుడు 202 (అసెంబ్లీ ఎన్నికలు) లో ప్రధాన లక్ష్యానికి ముందుకుపోతున్నాం.. సువెందు అధికారి తమ పార్టీలోచేరితే ఇది మరింత ఊపందుకుంటుదన్నారు. కాగా టీఎంసీ సీనియర్ నేత రవాణ శాఖ మంత్రి సువేందు అధికారి ఈరోజు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీనికి ముందు గురువారం ఆయన రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని హుగ్లీ రివర్ బ్రిడ్జి కమిషనర్స్ చైర్మన్ పదవికి కూడా గుడ్‌బై చెప్పారు. మరోవైపు కూచ్బెహార్కు చెందిన టీఎంసీ మాజీ ఎమ్మెల్యే మిహిర్ గోస్వామి శుక్రవారం సాయంత్రం బీజేపీ తీర్థం పుచ్చుకన్నారు. దీంతో 294 మంది సభ్యుల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోరు రసవత్తరంగా మారనుంది. -
క్లిష్ట సమయంలో మమతకు భారీ షాక్
కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఎదురు దెబ్బ తగిలింది. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీ సీనియర్ నాయకుడు, రెబెల్ రవాణా శాఖ మంత్రి సువేందు అధికారి మంత్రి పదవికి రాజీనామా చేశారు. గత కొంత కాలంగా పార్టీకి దూరంగా ఉంటున్న ఆయన చివరకు ప్రభుత్వంనుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. దీంతో రానున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు తృణమూల్ చీఫ్ మమతా బెనర్జీకి భారీ షాక్ తగిలినట్టయింది. గురువారం కీలక పదవికి రాజీనామా చేసిన ఆయన తాజాగా మంత్రి పదవికి గుడ్‌బై చెప్పారు. ఈ మేరకు ఆయన సీఎంకు శుక్రవారం ఒక లేఖ రాశారు. తన రాజీనామాను వెంటనే అంగీకరించాలని కోరారు. రాష్ట్ర ప్రజలకు సేవ చేయడానికి తనకు అవకాశం ఇచ్చినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. నిబద్ధత, అంకితభావం, చిత్తశుద్ధితో పనిచేశానని లేఖలో పేర్కొన్నారు. కాగా రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి మరోమారు అధికారాన్ని చేజిక్కించుకోవాలని చూస్తున్న మమతా బెనర్జీకి అసమ్మతి సెగ భారీగానే తగులుతోంది. క్లిష్ట సమయంలో పెనుసవాళ్లు ఎదురవుతున్నాయి. అండగా ఉండాల్సిన నాయకులు, కార్యకర్తలు ఒక్కొక్కరుగా పార్టీకి దూరమవుతున్నారు. ముఖ్యంగా ఈ నెలలో జరిగిన కేబినెట్ సమావేశానికి ఐదుగురు మంత్రులు గైర్హాజరు కావడం టీఎంసీలో కలవరం రేపిన సంగతి తెలిసిందే. మరోవైపు గత కొన్ని వారాలుగా అధినాయకత్వాన్ని ప్రశ్నిస్తున్న అధికారి గురువారం హూగ్లీ రివర్ బ్రిడ్జ్ కమిషన్ చైర్మన్ పదవినుంచి తప్పుకున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కళ్యాణ్ బెనర్జీని కొత్తగా నియమించింది. దీంతో తృణమూల్ కాంగ్రెస్‌లో తాజా తిరుగుబాటు చర్చనీయాంశంగా మారింది. -
శారద స్కాం: ఎంపీని ప్రశ్నించిన సీబీఐ
కోల్‌కతా: పశ్చిమబెంగాల్లో కోట్లాది రూపాయల శారద చిట్‌ఫండ్ స్కాంలో సీబీఐ విచారణ ముమ్మరంగా సాగుతోంది. బుధవారం తృణమాల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ సువేందు అధాకారిని ప్రశ్నించారు. సీబీఐ అధికారులు దాదాపు గంటసేపు ఆయనను ప్రశ్నించారు. అనంతరం అధికారి మాట్లాడుతూ.. 'సాక్షిగా నన్ను విచారించారు. నాకు తెలిసిన విషయాలను వారికి చెప్పా' అని అన్నారు. ఈస్ట్ మిడ్నాపూర్ జిల్లాలోని తమ్లుక్ నియోజకవర్గం నుంచి ఆయన పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సీబీఐ ఈ కేసులో పలువురు ఎంపీలతో పాటు సీనియర్ ఐపీఎస్ అధికారులను ఇటీవల ప్రశ్నించారు.