లక్నో: పశ్చిమబెంగాల్ బీజేపీ ఎమ్మెల్యే సువేందు అధికారి కాన్వాయ్‌లోని కారు ఢీకొనడంతో ఓ వ్యక్తి మరణించాడు. ఈ ఘటన రాష్ట్రంలోని పుర్భా మేదినీపూర్ జిల్లాలోని చందీపూర్‌లో గురువారం రాత్రి జరిగింది. పెట్రోల్‌బంక్ వద్ద సీక్ ఇస్రాఫిల్ అనే వ్యక్తి రోడ్డు దాటుతుండగా కారు ఢికొట్టిన్నట్లు ప్రత్యక్ష సాక్షులు, స్థానికులు తెలిపారు. అంతేగాక ప్రమాదం జరిగిన తర్వాత కూడా కారు ఆపకుండా వెళ్లిపోయినట్లు పేర్కొన్నారు.
కాగా రోడ్డు ప్రమాదానికి కారణమైన కారు నందిగ్రామ్ ఎమ్మెల్యే కాన్వాయ్‌కు చెందినదో కాదో విషయంపై పోలీసులు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. అయితే సువేందు అధికారి మోయినాలో జరిగిన పార్టీ కార్యక్రమం నుంచి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగినట్లు జాతీయ మీడియా నివేదించింది. మరోవైపు ప్రమాదానికి కారణమైన సువేందు అధికారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ స్థానికులు రోడ్డుపై బైఠాయించి నిరసనలు వ్యక్తం చేశారు. ఇక నందిగ్రామ ఎమ్మెల్యే సువేందు అధికారి ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు.
దీనిపై సీనియర్ పోలీస్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ‘ రాత్రి 10.30 గంటలకు పెట్రోల్ బంక్ దగ్గర రహదారి దాటుతుండగా కారు ఢీకొట్టింది. స్థానిక ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించాడు. మృతుడిని సీక్ ఇస్రాఫిల్‌గా గుర్తించాం. ఎమ్మెల్యే సువేందు కాన్వాయ్ కారు గుద్దడంతోనే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనిని ఇంకా ధృవీకరించలేదు. దీనిపై సువేందు అధికారితో సహా బీజేపీ నాయకులెవరూ స్పందించలేదు.’ అని తెలిపారు.
చదవండి: కలబురిగిలో నువ్వా.. నేనా! హైదరాబాద్ కన్నడనాట తీవ్ర పోటీ
Comments
Please login to add a commentAdd a comment