లేటెస్ట్ అపడేట్ :
నందిగ్రామ్ ఫలితంపై నరాలు తెగే ఉత్కంఠ
కోలకత: పశ్చిమబెంగాల్‌లో నందీగ్రామ్ ఎన్నికల ఫలితం కీలకంగా మారింది. క్షణ క్షణానికిమారుతున్న ఆధిత్యంతో నరాలు తెగే ఉత్కంఠను రాజేస్తోంది. సమీప ప్రత్యర్ధి,బీజేపీ అభ్యర్థి సువేందుపై ప్రారంభంలో వెనుకబడిన మమతా, ఆ తరువాత లీడింగ్‌లోకి వచ్చారు. 16వ రౌండ్ ముగిసే సమయానికి సువేందుకు కంటే కేవలం 6 ఓట్లు వెనకబడి ఉన్నారు. దీదీ-సువేందు మధ్య నెలకొన్ని హోరాహోరీ పోరు టీ20 మ్యాచ్ను తలపిస్తోంది. చివరిదైనా 17వ రౌండ్ ఫలితంపైనే అందరి దృష్టి నెలకొంది.
ఒకవైపు మమతా బెనర్జీ నేతృత్వంలోని పాలక తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) మ్యాజిక్ ఫిగర్ స్థానాలను దాటి లీడింగ్‌లో దూసుకుపోతుండగా ముఖ్యమంత్రి మమత మాత్రం వెనకంజలో ఉండటం గమనార్హం. అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కీలకమైన స్థానంలో దూసుకుపోతోంది. తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీకి సన్నిహితుడు, అప్పటి మంత్రి సువేందు అధికారిని తనవైపు తిప్పుకున్న బీజేపీ నందీగ్రామ్‌నుంచి గట్టిపోటీ ఇస్తోంది. తొలి రౌండ్‌నుంచీ వెనుకంజలో ఉన్న దీదీ నాలుగు రౌండ్ల తరవాత కూడా సువేందుకంటే 8 వేలకు పైగా ఓట్లు వెనుకబడి ఉన్నారు. నందిగ్రామ్‌లోమమతను తాను 50 వేల ఓట్ల ఆధిక్యంతో ఓడిస్తానని, అలా చేయలేకపోతే రాజకీయాల నుంచి వైదొలగుతానని సవాల్ చేసిన అధికారి ఆ దిశగా సాగి పోతున్నారు. అయితే క్షణక్షణానికి మారుతున్న ప్రస్తుత తరుణంలో పూర్తి ఫలితం వచ్చేవరకు నందీగ్రామ్ ఫలితంపై ఉత్కంఠకు తెరపడదు.
కాగా టీఎంసీకి గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరిన, మాజీమంత్రి సువేందు అధికారి సవాల్‌కు ప్రతిసవాల్‌గా నందీగ్రామ్‌నే మమత ఎన్నుకున్న సంగతి తెలిసిందే. అటు టీఎంసీ 200 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, బీజేపీ 89 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది,
Comments
Please login to add a commentAdd a comment