West Bengal Election 2021
-
దీదీ చేతులు రక్తంతో తడిశాయి : నడ్డా
కోల్‌కతా: రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు వెలువడినాటి నుంచి కొనసాగుతున్న దాడులు, అల్లర్లు, రాజకీయ హింస నుంచి బెంగాల్‌ను, బెంగాల్ ప్రజలను కాపాడు తానని బీజేపీ అధ్యక్షులు జేపీ నడ్డా ప్రతిజ్ఞ చేశారు. రెండ్రోజుల పర్యటనలో భాగంగా బెంగాల్‌కు వచ్చిన నడ్డా బుధవారం కోల్‌కతా నడిబొడ్డున ఉన్న గాంధీ విగ్రహం వద్ద ధర్నాలో పాల్గొని ప్రసంగించారు. ‘నార్త్ 24 పరగణాల సహా పలు జిల్లాల్లో అమానుష దాడుల్లో చనిపోయిన బీజేపీ సభ్యుల కుటుంబాలను కలుస్తా. ఇక్కడి దారుణ ఘటనల వివరాలను మొత్తం భారతావనికి తెలియజేస్తా. బెంగాల్ ప్రజలకు బీజేపీ సేవా కార్యక్రమాలు ఇకపైనా కొనసాగుతాయి. హింస కారణంగా 14 మంది బీజేపీ కార్య కర్తలు, మద్దతుదారులు ప్రాణాలు కోల్పోయా రు. మహిళలు అత్యాచారాలకు గురయ్యారు. అల్లర్ల కారణంగా దాదాపు లక్ష మంది స్థానికులు సొంతూర్లను వదిలేసిపోయారు. ఈ కుట్ర వెనుక ఆమె ప్రమేయం ఉందిగనుకే ఆమె నోరు మెదపకుండా ఉన్నారు. హింసను ప్రేరేపించిన మమత చేతులు రక్తంతో తడిశాయి. గత ఏడాది అంపన్ తుపాను కారణంగా గ్రామాల్లో విధ్వంసం చూశాం. నేడు మమత కారణంగా అదే విధ్వంసం పునరావృతమైంది. హింస కారణంగా బెంగాళీలు పొరుగున ఉన్న అస్సాంకు వలసవెళ్లారు’ అని నడ్డా వ్యాఖ్యానించారు. -
Bengal Results: మరీ దారుణం.. ఒక్కచోటా గెలవని కమ్యూనిస్టులు
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ను 1977 నుంచి 2011 దాకా.. 34 ఏళ్లపాటు అప్రతిహతంగా పాలించిన లెఫ్ట్ ఫ్రంట్ నేడు దయనీయ స్థితికి దిగజారింది. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకొని పోటీ చేసినా ఈ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా దక్కించుకోలేక చతికిలపడింది. ప్రజా ఉద్యమాలు, భూ సంస్కరణలతో ఒకప్పుడు బెంగాలీల మనసు గెలుచుకొని సుదీర్ఘ కాలం అధికారంలో ఉన్న కమ్యూనిస్టులకు.. ఈ దుస్థితి ఎందుకు దాపురించిందన్న ప్రశ్నకు రకరకాల కారణాలు చెబుతుంటారు. అందులో ప్రధానమైంది.. 2008లో భారత్–అమెరికా అణు ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ యూపీఏ ప్రభుత్వానికి లెఫ్ట్ పార్టీలు మద్దతును ఉపసంహరించుకున్నాయి. దీంతో బెంగాల్లో కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులను పక్కనపెట్టి, తృణమూల్‌తో జట్టుకట్టింది. అప్పటి నుంచే బెంగాల్లో కమ్యూనిస్టు పార్టీల పతనం మొదలయ్యింది. తర్వాత జరిగిన ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీలపై తృణమూల్ ఆధిక్యత సాధించడం ప్రారంభించింది. బెంగాల్లో లెఫ్ట్ ఫ్రంట్‌లోని ప్రధాన పార్టీలు సీపీఎం, సీపీఐ, ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్(ఏఐఎఫ్బీ), రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ(ఆర్ఎస్పీ). 2004 లోక్‌సభ ఎన్నికల్లో ఈ నాలుగు పార్టీలు కలిసి బెంగాల్లో 50.7 శాతం ఓట్లు సాధించగా, 2009 ఎన్నికల్లో 43.3 శాతం ఓట్లు దక్కించుకోగలిగాయి. 2007లో జరిగిన నందిగ్రామ్ భూసేకరణ వ్యతిరేక పోరాటంలో తృణమూల్ అధినేత మమతా బెనర్జీ కీలకంగా వ్యవహరించారు. 2008లో పంచాయతీ ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీలను మట్టికరిపించారు. నందిగ్రామ్ ఉద్యమం తర్వాత రాష్ట్రంలో చాలా వర్గాలు కమ్యూనిస్టులకు దూరమయ్యాయి. 2011లో సీపీఐ 2, సీపీఎం 40 సీట్లు మాత్రమే గెలుచుకోగలిగాయి. మొదటిసారిగా తృణమూల్ అధికారంలోకి వచ్చింది. 2016 శానసనభ ఎన్నికల్లో సీపీఐ ఒక్కటి, సీపీఎం 26 స్థానాలకే పరిమితమయ్యాయి. ఓట్ల శాతం భారీగా తగ్గింది. ఇప్పుడు ఖాతా కూడా తెరవలేదు. ఇక 2014 లోక్‌సభ ఎన్నికల్లో లెఫ్ట్ కూటమి కేవలం 2 సీట్లు గెలుచుకొని, 29.71 శాతం ఓట్లు సాధించగా, 2019లో ఒక్క స్థానం కూడా సొంతం చేసుకోలేకపోయింది. ఓట్ల శాతం 6.34 శాతానికి పడిపోయింది. చదవండి: West Bengal Election Result 2021: దీదీ హ్యాట్రిక్! -
దీదీకి అభినందనలు తెలిపిన మోదీ
సాక్షి, న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ విజయం దిశగా పయనిస్తోంది. ఉత్కంఠభరితంగా సాగిన నందిగ్రామ్ కౌంటింగ్‌లో మమతా బెనర్జీ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఇక బెంగాల్లో టీఎంసీ విజయంపై ప్రధాని నరేంద్ర మోదీ దీదీకి అభినంధనలు తెలిపారు. బెంగాల్ ప్రభుత్వానికి కేంద్రం నుంచి సహాయ, సహకారాలు ఉంటాయన్నారు. బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ బాగా బలం పుంజుకుంది అన్నారు మోదీ. కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ తదితరులు దీదీకి అభినందనలు తెలిపారు. చదవండి: దీదీ నందిగ్రామ్‌లో క్లీన్‌బౌల్డ్: మోదీ -
ఇప్పుడేమంటారు మోదీ సార్ : ఆర్జీవీ
హోరాహోరిగా సాగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార టీఎంసీ విజయం దిశగా దూసుకెళ్తోంది. దాదాపు 200 స్థానాలకు పైగా అధిక్యంగా నిలిచి ప్రతిపక్ష బీజేపీకి గట్టి షాక్ ఇచ్చింది. మమతా బెనర్జీ పని అయిపోయింది, ఇక ఆమె రెస్ట్ తీసుకుంటే మంచిదని ఎద్దేవా చేసిన బీజేపీ నేతలకు గట్టి షాకిచ్చారు బెంగాల్ ప్రజలు. ఒంటి కాలుతోనే బెంగాల్లో విజయం సాధిస్తానని శపథం చేసిన దీదీ.. అన్నట్టుగానే భారీ ఆధిక్యంతో హ్యాట్రిక్ విజయం దిశగా దూసుకెళ్తున్నారు. బెంగాల్లో మోదీ- అమిత్ షా వ్యూహం బెడిసికొట్టింది. నిన్నటి వరకు బెంగాల్లో దీదీ పని అయిపోయిందని ఎద్దేవా చేసిన మోదీ, అమిత్ షాలకు బెంగాల్ ప్రజలు షాకిచ్చారు. ఇదిలా ఉంటే దేశంలో కరోనా కేసుసు పెరిగినప్పటి నుంచి బీజేపీ నేతలు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై విమర్శలు చేస్తూ వస్తున్న సంచలన దర్శకుడు.. తాజాగా బెంగాల్ ఫలితాలపై కూడా తనదైన శైలీలో స్పందించారు. ట్విటర్ వేదికగా ప్రధాని మోదీకి చురకలు అంటించారు. ‘నరేంద్ర మోదీ సార్.. నిన్నటి వరకు దీదీ ఫినిష్ అని అన్నారు. మరి ఇప్పుడేమంటారు సార్’ అని ట్విటర్ వేదికగా ప్రశ్నించారు. Sir @narendramodi ji, Till yesterday you were saying DIDI IS FINISHED ..Now what do you say sir ? — Ram Gopal Varma (@RGVzoomin) May 2, 2021 అంతకు ముందు మరో ట్వీట్లో సోనియాకు క్షమాపణలు చెబుతానని పేర్కొన్నారు. ‘నరేంద్రమోదీ మృత్యు వ్యాపారి నరేంద్రమోదీ ఓ మృత్యు వ్యాపారి అంటూ 2014లో సోనియా గాంధీ ఆరోపణలు చేస్తే నాకు అప్పుడు సరిగా అర్థం కాలేదు. ఆమెకు అంత గొప్ప విజనరీ ఉంటుందని నేను ఊహించలేదు. అందుకు నేను బేషరుతుగా సోనియా గాంధీకి క్షమాపణ చెబుతున్నాను. ఒకవేళ వీలైతే నీ కాళ్లను ఫోటో తీసి పంపండి. వాటిని డిజిటల్ రూపంలో తాకి మొక్కుతాను’ అని వర్మ ట్వీట్ చేశారు SONIA GANDHI in 2014 said @narendramodi is MAUT ka SAUDAGAR ..I never knew that she is such a tremendously far sighted visionary and I profusely apologise to u madam Soniaj,and if possible please text ur feet so that I can digitally touch them 🙏🙏🙏 — Ram Gopal Varma (@RGVzoomin) May 1, 2021 -
వ్యూహకర్తగా తప్పుకుంటున్నా, విశ్రాంతి కావాలి: ప్రశాంత్ కిశోర్
కోల్‌కతా: దేశవ్యాప్తంగా వేర్వేరు రాష్ట్రాల్లో పలు రాజకీయ పార్టీలకు ఎన్నికల వ్యూహరచనల్లో సాయపడిన ‘ఎన్నికల వ్యూహకర్త’ ప్రశాంత్ కిషోర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై రాజకీయ పార్టీల తరఫున ఎన్నికల వ్యూహకర్తగా బాధ్యతలు స్వీకరించబోనని ఆదివారం ప్రకటించారు. గతంలో ఆయన బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్), వైఎస్ఆర్సీపీ, డీఎంకే పార్టీలకు ఎన్నికల వ్యూహకర్తగా పనిచేశారు. తాను ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన వేళ ప్రశాంత్ ఇలా అనూహ్య నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఆదివారం ఇండియా టుడే టీవీ చానెల్లో మాట్లాడిన సందర్భంగా ప్రశాంత్ తన నిర్ణయాన్ని బయట పెట్టారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రశాంత్ కేంద్ర ఎన్నికల సంఘం... బీజేపీకి మరో రూపం అంటూ తీవ్రమైన ఆరోపణలు చేసిన సంగతి తెల్సిందే. ‘ ఇంతగా ఒకటే రాజకీయ పార్టీ కోసం పనిచేసే కేంద్ర ఎన్నికల సంఘంను నేనెప్పుడూ చూడలేదు. బీజేపీకి సాయపడేందుకు ఈసీ చేయాల్సినదంతా చేసింది. మతం కార్డును వాడు కోవడం, ఎన్నికల షెడ్యూల్‌ను బీజేపీకి అనుకూ లంగా తీర్చిదిద్దడం, నియమాలను తుంగలో తొక్కడం.. ఇలా ప్రతీ అంశంలో బీజేపీకి అనువు గా ఈసీ వ్యవహరించింది’ అని ప్రశాంత్ ఆరోపించారు. ‘బెంగాల్లో ఫలితాలు ఎలా ఉన్నా బీజేపీ మాత్రం బెంగాల్లో బలమైన పార్టీ గా ఎదిగింది’ అని ప్రశాంత్ వ్యాఖ్యానించారు. బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ 100లోపు స్థానాలనే గెలుస్తుందని గత ఏడాది డిసెంబర్లో ప్రశాంత్ చేసిన వ్యాఖ్యల వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది. 2014లో మోదీతో మొదలై.. రాజకీయ శ్రేణుల్లో పీకేగా ముద్దుగా పిలుచుకునే ప్రశాంత్‌కిశోర్ మొదటిసారిగా నేరుగా రాజకీయపార్టీల కోసం పనిచేసింది మాత్రం 2014లోనే. గుజరాత్ సీఎంగా ఉన్న నరేంద్ర మోదీ తొలిసారిగా ప్రధాని అభ్యర్థిగా బరిలోకి దిగినపుడు ‘ఛాయ్ పే చర్చ’ అంటూ మొదలైన వినూత్న ప్రచార కార్యక్రమ వ్యూహాల్లో ప్రశాంత కీలక భూమిక పోషించారని కలకత్తా రీసెర్చ్ గ్రూప్ సభ్యుడు, రాజకీయ విశ్లేషకుడు అయిన రజత్ రాయ్ చెప్పారు. 2015లో బిహార్‌లో నితీశ్‌కుమార్ కోసం ఎన్నికల వ్యూహాల్లో ప్రశాంత్ కిశోర్ చాలా నెలలు పనిచేశారు. పంజాబ్‌లో కాంగ్రెస్ సీనియర్ నేత అమరీందర్ సింగ్‌తో కలిసి పీకే ఎత్తుగడలు వేశారు. 2019లో ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధించడంలోనూ ప్రశాంత్ పాత్ర కీలకమైంది. 2020లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ అధినేత కేజ్రీవాల్‌కు అండగా నిలిచారు. బాల్య వివాహాల ను ఆపేలా, అమ్మాయిల చదువులు కొనసాగేలా చేసిన ఐక్యరాజ్యసమితి అవార్డు పొందిన ‘కన్యాశ్రీ’ వంటి పథకాలతో మహిళా పక్షపాత ప్రభుత్వమని టీఎంసీకి పేరు తెచ్చిన ఘనత పీకేదే. ఈసారి తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ఎన్నికల వ్యూహకర్తగా పీకే పనిచేశారు. ఎన్నికల వ్యూహాలు ఇక రచించను Trends show BJP crossed double digits now waiting for @PrashantKishor to quit Twitter pic.twitter.com/KeqxsxWpJv — Exsecular (@ExSecular) May 2, 2021 -
టీఎంసీ హ్యాట్రిక్: ప్రశాంత్ కిశోర్ సంచలన వ్యాఖ్యలు
కోలకత : పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటి కాలుతోనే బెంగాల్‌ను గెలుచుకుంటానని శపథం చేసిన కలకత్తా కాళి మమతా బెనర్జీ హ్యాట్రిక్ విజయం దిశగా దూసుకుపోతున్నారు. దాదాపు 200కు పైగా స్థానాల్లో లీడింగ్‌లో నిలిచిన టీఎంసీ బీజేపీకి గట్టి షాకే ఇస్తోంది. మరోవైపు బెంగాల్లో దీదీకే మళ్లీ పట్టం అని పదే పదే నొక్కి వక్కాణించిన వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ స్ట్రాటజీ 100 శాతం నిజమైంది. ఈ సందర్బంగా గతంలో పీకే ట్వీట్లు ఇపుడు మళ్లీ ట్రెండింగ్‌లోకి వచ్చాయి. తాజా ఫలితాల సరళి నేపథ్యంలో ప్రశాంత్ కిశోర్ స్పందించారు. మోదీ పాపులర్ వ్యక్తి అయినంత మాత్రానా బీజేపీ అన్ని రాష్ట్రాల ఎన్నికల్లో గెలిచి తీరాలన్న గ్యారంటీ ఏమీ లేదంటూ వ్యాఖ్యానించారు. టీఎంసీకి విజయం ఏకపక్షమే అయిన తీవ్ర పోటీ ఎదురైందన్నారు. ఎన్నికల కమిషన్ పాక్షికం వ్యవహరించి, తమ ప్రచారాన్నిఅడ్డుకుందని, దీంతో చాలా కష్టపడాల్సి వచ్చిందని పీకే వ్యాఖ్యానించారు. బెంగాల్లో గెలవబోతున్నామంటూ బీజేపీ భారీ ప్రచారాన్ని చేపట్టింది. అయినా ఊహించని విజయాన్ని ప్రజలు టీఎంసీ కిచ్చారంటూ పీకే సంతోషం వ్యక్తం చేశారు. మరోవైపు 294 మంది సభ్యుల అసెంబ్లీలో బీజేపీ డబుల్ డిజిట్ దాటడం కూడా కష్టమే అంటూ ప్రశాంత్ కిషోర్ డిసెంబర్ 21 ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో బీజేపీ నాయకులు పీకేపై మండిపడుతున్నారు. దీంతో బెంగాల్లో టీఎంసీ ప్రభుత్వం అధికారం నిబెట్టుకున్నా.. బీజేపీ సునామీతో ఒక ఎన్నికల వ్యూహకర్తను కోల్పోనుందని బీజేపీ సీనియర్ నాయకుడు కైలాష్ విజయవర్గియా ట్వీట్ చేశారు. కాగా గత సంవత్సరకాలంగా, ముఖ్యంగా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను ప్రకటించినప్పటినుంచి మోదీషా ద్వయం బెంగాల్లో మమతను అధికార పీఠంనుంచి దూరం చేసేందుకు పావులు కదిపారు. కానీ బెంగాల్ ప్రజలు మాత్రం దీదీవైపై మొగ్గారు. అయితే గత ఎన్నికల్లో కేవలం మూడు స్థానాలకు పరిమితమైన బీజేపీ తన బలాన్ని గణనీయంగా పెంచుకునేదశగా కదులుతోంది. ప్రస్తుతం 74 స్థానాల్లో అధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. మరోవైపు కమ్యూనిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ పరిస్థితి కూడా దాదాపు ఇదే. గత ఎన్నికల్లో 76 స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ లెఫ్ట్ కూటమి ఒక స్థానమైనా దక్కించుకుంటుందా అనేది ప్రశ్నార్థకమే. -
మోదీకి షాకిచ్చిన దీదీ: వైరలవుతున్న మీమ్స్
కోలకత : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోరు రాజకీయ ప్రముఖులనుంచి సామాన్యుల దాకా దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠను రాజేసింది. బెంగాల్ టీఎంసీ కోటలో పాగా వేయాలని బీజేపీ ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ఎన్నికల వ్యూహాన్ని రచించింది. అధాకార టీఎంసీ నుంచి కీలక నాయకులను తనపైపు తిప్పుకుని ఎలాగైనా దీదీని దెబ్బకొట్టాలని పావులు కదిపింది. ఈ క్రమంలో మమతకు కీలకమైన నందీగ్రామ్‌నుంచే టీఎంసీ మాజీ మంత్రి సువేందు అధికారిని బీజేపీ తరపున బరిలో నిలిపి గట్టి సవాల్ విసిరింది. దీంతో తాను కూడా నందీగ్రామ్‌నుంచే పోటీ చేస్తానని ప్రకటించిన దీదీ బీజేపీకి ప్రతిసవాల్ విసిరారు. బెంగాల్ ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి, నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షా హోరెత్తించారు. అటు ఎన్నికల ర్యాలీలో గాయపడిన మమత కూడా ఏమాత్రం తగ్గకుండా వీల్‌చైర్‌లోనే ప్రచార పర్వాన్ని కొనసాగించి బెంగాల్ ఓటర్ల మనసు గెల్చుకునేందుకు ప్రయత్నించారు. దీంతో బెంగాల్ బెబ్బులి అంటూ ఆమెపై ప్రశంసలు వెల్లువెత్తాయి. తాజాగా 200 పైగా స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యంతో టీఎంసీ దూసుకుపోతున్న క్రమంలో మమతపై సోషల్ మీడియాలో మీమ్స్ హల్చల్ చేస్తున్నాయి. బెంగాలీలు దుర్గా మాత ఆరాధకులంటూ వ్యాఖ్యలు వెల్లువెత్తాయి. (బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు: టీఎంసీ జోరు, మమత ఆధిక్యం) కాగా శనివారం ఉదయం ఆరంభమైన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో టీఎంసీ భారీ మెజార్టీ దిశగా దూసుకుపోతోంది. మొత్తం 292 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ జరగ్గా 204 స్థానాల్లో లీడ్ లో ఉండి బీజీపీకి ఊహించని షాక్ ఇస్తోంది. ప్రధానంగా నందీగ్రామ్‌లో సీఎం మమత తొలి రౌండ్‌నుంచి సువేందు అధికారి కంటే వెనకబడతూ వచ్చారు. కానీ నాలుగో రౌండ్‌కి వచ్చేసరికి దీదీ ముందుకు దూసుకువచ్చారు. సువేందు అధికారిపై ఇప్పటిదాకా దాదాపు 8వేలకు పైగా ఓట్ల వెనుకంజలో ఉన్న మమత 6 వ రౌండ్‌కు 1427 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతుండటం విశేషం. Khela Hobe... The game is on pic.twitter.com/sE3VRE5sLJ — Ravi Nair (@t_d_h_nair) May 2, 2021 इतने प्यार से कोई दीदी ओ दीदी बोलेगा , तो दुर्गा माँ तो इनकी इच्छा पूरी करेंगी ही। pic.twitter.com/3y7mhO5jLK — Abhisar Sharma (@abhisar_sharma) May 2, 2021 -
మమతకు చెమటలు పట్టిస్తున్న సువేందు
-
నందిగ్రామ్ ఫలితంపై నరాలు తెగే ఉత్కంఠ
లేటెస్ట్ అపడేట్ : నందిగ్రామ్ ఫలితంపై నరాలు తెగే ఉత్కంఠ కోలకత: పశ్చిమబెంగాల్లో నందీగ్రామ్ ఎన్నికల ఫలితం కీలకంగా మారింది. క్షణ క్షణానికిమారుతున్న ఆధిత్యంతో నరాలు తెగే ఉత్కంఠను రాజేస్తోంది. సమీప ప్రత్యర్ధి,బీజేపీ అభ్యర్థి సువేందుపై ప్రారంభంలో వెనుకబడిన మమతా, ఆ తరువాత లీడింగ్‌లోకి వచ్చారు. 16వ రౌండ్ ముగిసే సమయానికి సువేందుకు కంటే కేవలం 6 ఓట్లు వెనకబడి ఉన్నారు. దీదీ-సువేందు మధ్య నెలకొన్ని హోరాహోరీ పోరు టీ20 మ్యాచ్‌ను తలపిస్తోంది. చివరిదైనా 17వ రౌండ్ ఫలితంపైనే అందరి దృష్టి నెలకొంది. ఒకవైపు మమతా బెనర్జీ నేతృత్వంలోని పాలక తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) మ్యాజిక్ ఫిగర్ స్థానాలను దాటి లీడింగ్‌లో దూసుకుపోతుండగా ముఖ్యమంత్రి మమత మాత్రం వెనకంజలో ఉండటం గమనార్హం. అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కీలకమైన స్థానంలో దూసుకుపోతోంది. తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీకి సన్నిహితుడు, అప్పటి మంత్రి సువేందు అధికారిని తనవైపు తిప్పుకున్న బీజేపీ నందీగ్రామ్‌నుంచి గట్టిపోటీ ఇస్తోంది. తొలి రౌండ్‌నుంచీ వెనుకంజలో ఉన్న దీదీ నాలుగు రౌండ్ల తరవాత కూడా సువేందుకంటే 8 వేలకు పైగా ఓట్లు వెనుకబడి ఉన్నారు. నందిగ్రామ్‌లోమమతను తాను 50 వేల ఓట్ల ఆధిక్యంతో ఓడిస్తానని, అలా చేయలేకపోతే రాజకీయాల నుంచి వైదొలగుతానని సవాల్ చేసిన అధికారి ఆ దిశగా సాగి పోతున్నారు. అయితే క్షణక్షణానికి మారుతున్న ప్రస్తుత తరుణంలో పూర్తి ఫలితం వచ్చేవరకు నందీగ్రామ్ ఫలితంపై ఉత్కంఠకు తెరపడదు. కాగా టీఎంసీకి గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరిన, మాజీమంత్రి సువేందు అధికారి సవాల్‌కు ప్రతిసవాల్‌గా నందీగ్రామ్‌నే మమత ఎన్నుకున్న సంగతి తెలిసిందే. అటు టీఎంసీ 200 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, బీజేపీ 89 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది, -
హోరాహోరీ: దీదీనా? మోదీనా?
సాక్షి,కోలకతా : దేశంలో జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ప్రధానంగా బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పశ్చిమ బెంగాల్ పీఠం ఎవరికి దక్కనుందనే అంశానికి ఈ రోజు తెరపడనుంది. వరసగా మూడోసారి అధికార పీఠాన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలని తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ఆశిస్తుండగా, టీఎంసీ కోటలో పాగా వేయాలని బీజేపీ వ్యూహ ప్రతివ్యూహాలతో కదిలింది. ఈ నేపథ్యంలో అధికార పార్టీ టీఎంసీకి, బీజేపీ మధ్య హోరాహోరీగా నడిచిన ఈ పోరులో ఉత్కంఠకు నేటితో తెరపడనుంది. టీఎంసీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నందీగ్రామ్‌లో దీదీ ప్రస్తుతం వెనుకంజలో ఉన్నారు. టీఎంసీ మంత్రి పదవికి రాజీనామా చేసి బీజేపీ తరపున ఇక్కడ బరిలో ఉన్న సువేందు అధికారి ముందంజలో ఉన్నారు. దీంతో మరింత ఉత్కంఠ పెరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎనిమిది దఫాలుగా పోలింగ్ నిర్వహించిన బెంగాల్ కోటలో అధికార పీఠం ఎవరికి దక్కనుంది. ఈ టఫ్ ఫైట్‌లో నిలిచేదెవరు..గెలిచేదెవరు..? దీదీనా, మోదీనా? దేశవ్యాప్తంగా ఇదే హాట్ హాట్‌టాపిక్. మెజార్టీ సర్వేలు మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ అధికారం నిలబెట్టుకుట్టు కుటుందని అంచనా వేశాయి. కాగా బెంగాల్లో మొత్తం 292 సీట్లకు గాను పోలింగ్ జరిగింది. బెంగాల్లో అధికారంలోకి రావాలంటే 148 సీట్లు (మ్యాజిక్ ఫిగర్) సాధించాలి. (బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు: లెక్కింపు ప్రారంభం) -
నేడే ఐదు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు
న్యూఢిల్లీ/కోల్‌కతా/చెన్నై/తిరువనంతపురం: ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆదివారం వెలువడనున్నాయి. ఓట్ల లెక్కింపు కోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి శాసనసభలకు ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఐదు రాష్ట్రాల్లో మొత్తం 822 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. 2016లో ఆయా రాష్ట్రాలన్నింటిలో కలిపి 1,002 కౌంటింగ్ హాళ్లు ఏర్పాటు చేయగా, ఈసారి 2,364 హాళ్లు సిద్ధం చేశారు. అంటే హాళ్ల సంఖ్యను ఏకంగా 200 శాతం పెంచారు. అత్యధికంగా పశ్చిమ బెంగాల్లో 1,113, కేరళలో 633, అస్సాంలో 331, తమిళనాడులో 256, పుదుచ్చేరిలో 31 హాళ్లను ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు కేంద్రాలను కనీసం 15 సార్లు శానిటైజేషన్ చేయనున్నట్లు అధికారులు చెప్పారు. మాస్కు ధరించడం, సామాజిక దూరం పాటించడం వంటి నిబంధనలు కచ్చితంగా అమలు చేస్తామన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద జనం గుంపులుగా చేరడానికి వీల్లేదన్నారు. ఆదివారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలవుతుందని, రాత్రి పొద్దుపోయే దాకా కొనసాగే అవకాశం ఉందని తెలిపారు. మొత్తం ప్రక్రియను పర్యవేక్షించడానికి 1,100 మంది పరిశీలకులను నియమించామని పేర్కొన్నారు. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, రాజకీయ పార్టీల ఏజెంట్లు కౌంటింగ్ కేంద్రాల్లోకి అడుగు పెట్టాలంటే కరోనా నెగటివ్ రిపోర్టు లేదా డబుల్ డోస్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ సమర్పించాలని తేల్చిచెప్పారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎవరైనా కరోనా ప్రోటోకాల్స్‌ను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఎన్నికల సంఘం హెచ్చరించింది. కీలకమైన పశ్చిమ బెంగాల్లో మార్చి 27 నుంచి ఏప్రిల్ 29 దాకా 8 దశల్లో 294 స్థానాలకు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 108 కేంద్రాల్లో మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు. 256 కంపెనీల కేంద్ర బలగాలను రంగంలోకి దించారు. ఓట్ల లెక్కింపునకు ముందే ఈవీఎంలు, వీవీప్యాట్లను శానిటైజ్ చేయనున్నారు. 126 అసెంబ్లీ స్థానాలున్న అస్సాంలో మార్చి 27 నుంచి ఏప్రిల్ 6 దాకా మూడు దశల్లో ఎన్నికలు జరిగాయి. కేరళలో 140 శాసనసభ స్థానాలున్నాయి. ఏప్రిల్ 6న జరిగిన ఎన్నికల్లో వివిధ పార్టీల నుంచి 957 మంది అభ్యర్థులు పోటీ చేశారు. తమిళనాడు, పుదుచ్చేరిలో ఏప్రిల్ 6న ఒకే దశలో ఎన్నికలు జరిగాయి. తమిళనాడులో 234 స్థానాలుండగా, దాదాపు 4 వేల మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలతోపాటు కన్యాకుమారి లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించారు. పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ సీట్లున్నాయి. ఓట్ల లెక్కింపు సందర్భంగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. బెంగాల్ ఎవరిదో? దేశవ్యాప్తంగా అందరి దృష్టి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కేంద్రీకృతమయ్యింది. ప్రధానంగా పశ్చిమ బెంగాల్ ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. మళ్లీ అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత మమతా బెనర్జీ ఎన్నికల్లో సర్వశక్తులూ ఒడ్డారు. ప్రతిపక్ష బీజేపీ సైతం గట్టి పోటీ ఇచ్చింది. బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్–బీజేపీ మధ్య హోరాహోరీ పోరు తప్పదని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెల్లడించాయి. అస్సాంలో అధికార బీజేపీ కూటమి ముందంజలో ఉన్నట్లు తేలింది. కేరళలో అధికార లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్) మళ్లీ అధికారంలోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. పుదుచ్చేరిలో కాంగ్రెస్‌కు పరాభవం తప్పదని అంటున్నారు. ఇక్కడ బీజేపీ–ఏఐఏడీఎంకే–ఏఐఎన్ఆర్సీ కూటమి విజయం సాధిస్తుందని చెబుతున్నారు. తమిళనాడులో అధికార ఏఐఏడీఎంకే–బీజేపీ కూటమికి భంగపాటు ఎదురవుతుందని, ప్రతిపక్ష డీఎంకే–కాంగ్రెస్ కూటమి గద్దెనెక్కబోతోందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. -
బెంగాల్లో ఆడియో టేపుల కలకలం!
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ఎన్నికల వేళ ఒక ప్రముఖ చానెల్ సంచలనాత్మక విషయాన్ని బయటపెట్టింది. విచారణా సంస్థలకు సంబంధించిన వర్గాల నుంచి కొన్ని ఆడియో టేపులు సంపాదించినట్లు పేర్కొంది. ఈ టేపుల్లో సీఎం మమత మేనల్లుడు అభిషేక్ అక్రమంగా సొమ్ములు సేకరిస్తున్నట్లుంది. తొలి టేపులో కోల్ స్మగ్లింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న అనూప్ మాంఝీ సహచరుడు గణేశ్ బగారియా మాటలున్నాయి. రాష్ట్రంలో అవినీతి రాకెట్ ఎలా విస్తరించింది గణేశ్ వివరించాడు. రెండో టేపులో మమత రాజకీయంగా ఎదుగుతుంటే, అభిషేక్ ఎలా కిందకు లాగుతున్నది మాట్లాడుకున్నారు. మూడో టేపులో దాదాపు రూ. 45 కోట్ల కట్‌మనీ అభిషేక్ వద్దకు ఎలా చేరిందో చర్చించుకున్నట్లుంది. 4వ టేపులో మమతా గుడ్డిగా అభిషేక్‌ను నమ్ముతున్నారని ఉంది. చివరిటేపులో ఎక్సైజ్ కమిషనర్‌ను అభిషేక్ మిత్రుడు వినయ్ మిశ్రా లంచం అడగడం, కోల్మైనర్లను అభిషేక్ లంచం అడిగిన అంశం ఉన్నాయి. బెంగాల్‌కే అవమానం! మమత మేనల్లుడిపై ఆరోపణలు గుప్పిస్తూ విడుదలైన ఆడియో టేపులపై బీజేపీ మండిపడింది. మమతా బెనర్జీ, ఆమె బంధువులు పశ్చిమబెంగాల్ ప్రజలకు తలవంపులు తెచ్చారని విమర్శించింది. ప్రజలను మోసం చేసినందుకు మమత క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. మమత ఇచ్చే రక్షణతో కొందరు చెలరేగిపోతున్నారని, బెంగాల్లో అవినీతి దందా నడుపుతున్నారని ఆరోపించింది. ఆడియో టేపుల వ్యవహారంపై టీఎంసీ నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. మమత పాలనలో దోపిడీదారుల ధైర్యం ఇలాగుందని, ఒక సమావేశంలో అభిషేక్ బెనర్జీకి దగ్గరైన ఒక దోపిడీదారుడు కమిషనర్‌కు దగ్గరగా కూర్చుని అక్రమ డిమాండ్లు చేయడం ఎలాంటి సందేశమిస్తుందని బీజేపీ ప్రశ్నించింది. మమతకు తెలిసే రాష్ట్రంలో ఇలాంటివన్నీ జరుగుతున్నాయని ఆరోపించింది. -
‘కూల్.. కూల్ దీదీ.. మేం 200 సీట్లు గెలుస్తాం’: మోదీ
కోల్కత్తా: ‘మేం పక్కా 200 సీట్లు గెలుస్తాం.. ఇంకా అంతకన్నా ఎక్కువ కూడా గెలుస్తాం.. మీలాగా సీజనల్ భక్తులం కాదు’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు చేశారు. మొదటి దశ పోలింగ్‌తో తెలిసింది.. ప్రజలు మమ్మల్ని కోరుకుంటున్నారని అని పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా జయనగర్‌లో గురువారం ఏర్పాటుచేసిన బహిరంగ సభలో మోదీ మాట్లాడారు. ఈ సందర్భంగా మమత బెనర్జీపై విమర్శలు చేస్తూనే తాము గెలవబోతున్నట్లు ధీమా వ్యక్తం చేశారు. ‘‘కూల్ కూల్.. 200 అసెంబ్లీ స్థానాలు బీజేపీ గెలవబోతోంది. మొదటి దశ పోలింగ్‌తో అధికంగా గెలుస్తామని తెలుస్తోంది. ప్రజల గళానికి దేవుడి ఆశీర్వాదం ఉంది.’ అని పేర్కొన్నారు. నేను ఆలయాలకు వెళ్లడం గర్వంగా భావిస్తా.. మీలాగా పూటకోలాగ ఉండను’ అని బంగ్లాదేశ్ పర్యటనపై తృణమూల్ చేసిన విమర్శలను ప్రస్తావిస్తూ మోదీ ఘాటుగా బదులిచ్చారు. నేను ఆలయాన్ని సందర్శించడం తప్పా? అని ప్రజలను పశ్నించారు. మమతాకు కాషాయ వస్త్రాలు, దుర్గ మాత నిమజ్జనాలు, జై శ్రీరామ్ నినాదాలు అన్నీ ఆక్రోశం తెప్పిస్తున్నాయని తెలిపారు. బెంగాల్లో బీజేపీ హవా.. కమలం హవా కొనసాగుతుందని.. రెండో దశ పోలింగ్‌కు వస్తున్న ఓటర్లను చూస్తుంటే తెలుస్తోందని మోదీ పేర్కొన్నారు. -
మమతా గాల్లో వస్తోంది.. గాల్లోనే మాయమవుతుంది
నందిగ్రామ్ : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మైనారిటీలను బుజ్జగించటంలో మునిగిపోయారని, ఆమెకు ఓటు వేసి అధికారంలోకి రానిస్తే బెంగాల్ ఓ మినీ పాకిస్తాన్ అవుతుందని బీజేపీ నాయకుడు సువేధు అధికారి వ్యాఖ్యానించారు. సోమవారం నందిగ్రామ్‌లోని ఓ దేవాలయంలో ఆయన పూజలు నిర్వహించారు. అనంతరం ఓటర్లను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘‘ మమతా బెనర్జీ తరచూ ఈద్ ముబారక్ అంటూ శుభాకాంక్షలు చెబుతుంది. అదే అలవాటుగా మారిపోయి ఇప్పుడు హోలీ రోజున కూడా హోలీ ముబారక్ అంటూ ప్రజలకు శుభాకాంక్షలు చెబుతోంది. బేగం(బెనర్జీ)కి ఓటు వేయకండి. ఆమెకు ఓటు వేస్తే బెంగాల్ మినీ పాకిస్తాన్ అవుతుంది. ఈ ఎన్నికల్లో ఓడిపోతానన్న భయంతోనే ఆమె గుళ్ల చుట్టూ తిరుగుతోంది. యోగీ ఆధిత్యనాథ్ యూపీని పాలిస్తున్నట్లుగానే మేము కూడా బెంగాల్‌ని పాలిస్తాము. గతంలో ఆమె కారులో తిరిగేది. ఇప్పుడు హెలికాప్టర్లో తిరుగుతోంది. ఒకప్పుడు రూ. 400 చీర కట్టేది. ఇప్పుడు రూ. 6 వేల చీరకడుతోంది. ఒకప్పుడు అజంతా షూలు వాడేది.. ఇప్పుడు బ్రాండెడ్ షూలు వాడుతోంది. నేను మాత్రం ఏమీ మారలేదు. 2004నుంచి అలానే ఉన్నాను. మీకు బేగం(బెనర్జీ) కావాలో.. మీ కుమారుడు, సోదరుడు, ఓ మిత్రుడు కావాలో తేల్చుకోండి. మమతా గాల్లో వస్తోంది.. గాల్లోనే మాయమవుతుంది’’ అంటూ ఏద్దేవా చేశారు. చదవండి, చదివించండి : 25 మంది మరణించారు.. 6 నెలల బాలుడు బ్రతికాడు! -
మీ మైండ్ గేమ్స్ ఇక్కడ పనిచేయవు : ఎంపీ
కోల్‌కతా : తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ దెరెక్ ఓ బ్రియెన్ కేంద్ర మంత్రి అమిత్ షాపై విమర్శలు చేశారు. ఆదివారం ట్విటర్ వేదికగా ఆయన స్పందిస్తూ.. ‘‘ మోదీ-అమిత్ షా, మీ మైండ్ గేమ్స్ పనిచేయవు. మీ సీట్ల లెక్కల స్టంట్లన్నీ గుజరాత్‌లోని జిమ్‌ఖానాలో ప్రయత్నించండి. ఇది బెంగాల్’’ అని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ శనివారం జరిగిన 30 అసెంబ్లీ స్థానాలను క్లీన్ స్వీప్ చేస్తుందని ఆయన తెలిపారు. కాగా, ఈ ఉదయం అమిత్ షా పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలపై మాట్లాడుతూ.. ‘‘ పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుంది. గ్రౌండ్ లెవెల్‌నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ ప్రకారం 30 స్థానాకు గాను 26 గెలుచుకుంటాం. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అస్సాంలోనూ 47 స్థానాలకు 37 గెలుస్తాం. ప్రశాంతంగా జరిగిన ఎన్నికలు, అత్యధికంగా నమోదైన పోలింగ్ శాతం మాకు పాజిటివ్ సంకేతాలు. ఎలక్షన్ కమిషన్‌కు కృతజ్ఞతలు’’ అని అన్నారు. Mind games won’t work, Mo-Sha. Try your seat prediction stunts at the Gujarat Gymkhana. This is Bengal. #KhelaHobe #TMCSweepsPhase1 — Derek O'Brien | ডেরেক ও'ব্রায়েন (@derekobrienmp) March 28, 2021 -
గడ్డాలు పెంచడం, పేర్లు మార్చడమే తెలుసు: సీఎం ఫైర్!
కోల్‌కతా: అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ పోలింగ్ సమీపించిన వేళ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శల వర్షం కురిపించారు. గడ్డాలు పెంచడం, స్టేడియాల పేర్లు మార్చడమే తప్ప పారిశ్రామిక అభివృద్ధి చేతకాదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అదే విధంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై కూడా విమర్శలు ఎక్కుపెట్టారు. ఈ మేరకు శుక్రవారం నాటి ప్రచారంలో మమతా బెనర్జీ మాట్లాడుతూ.. ‘‘వారికి రెండు సిండికేట్లు ఉన్నాయి. ఒకరు.. ఢిల్లీ, గుజరాత్, యూపీలో అల్లర్లు చెలరేగేందుకు ప్రోత్సహిస్తారు.. ఇక మరొకరు పారిశ్రామిక అభివృద్ధిని కుంటుపడేలా చేసి గడ్డం పెంచుతూ ఉంటారు. ఒక్కోసారి.. గాంధీజీ, రవీంద్రనాథ్ ఠాగోర్ కంటే తానే గొప్ప వాడినని భావిస్తారు. మరోసారి తనను తాను స్వామి వివేకానంద అని చెప్పుకొంటారు. మైదానాలకు తన పేరు పెట్టుకుంటారు. ఏదో ఒకరోజు దేశానికే తన పేరు పెట్టుకుని, అమ్మేసినా అమ్మేస్తారు. నాకెందుకో వారి మెదడులోనే ఏదో సమస్య ఉందని అనిపిస్తుంది. బహుశా స్క్రూ లూజ్ అయి ఉంటుంది’’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాగా గతంలోనూ మమత ఇదే తరహాలో ప్రధాని మోదీని విమర్శించారు. ‘‘గుజరాత్‌లోని స్టేడియానికి ప్రధాన మంత్రి తన పేరు పెట్టుకున్నారు. కోవిడ్-19 వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లపై తన ఫొటోలు వేయించుకుంటున్నారు. అంతేకాదు తన ఛాయాచిత్రాన్ని అంతరిక్షంలోకి పంపేందుకు ఇస్రోతో మాట్లాడారు. ఇలాగే చూస్తూ ఉంటే, దేశానికి తన పేరు పెట్టుకుంటారు’’ అని మండిపడ్డారు. ఇక పశ్చిమ బెంగాల్లో 8 విడతలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. మార్చి 27న తొలి విడత పోలింగ్ జరుగనుంది. పోలింగ్ తేదీలు: ►తొలి విడత: మార్చి 27 ►రెండో విడత: ఏప్రిల్ 1 ►మూడో విడత: ఏప్రిల్ 6 ►నాలుగో విడత: ఏప్రిల్ 10 ►ఐదో విడత: ఏప్రిల్ 17 ►ఆరో విడత: ఏప్రిల్ 22 ►ఏడో విడత: ఏప్రిల్ 26 ►ఎనిమిదో విడత: ఏప్రిల్ 29 చదవండి: దొంగల రాజ్యానికి రాజులు -
దెబ్బతిన్న పులి మరింత ప్రమాదకారి: దీదీ
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని నందిగ్రామ్‌లో నామినేషన్ వేసిన తర్వాత జరిగిన ఘటనలో కాలికి గాయమైన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నాలుగు రోజుల తర్వాత మళ్లీ ప్రజల్లోకి వచ్చారు. తనలోని పోరాట పటిమను ప్రదర్శిస్తూ వీల్‌చైర్‌లో కూర్చొనే తృణమూల్ కాంగ్రెస్ నిర్వహించిన ప్రదర్శనలో పాల్గొన్నారు. 2007లో నందిగ్రామ్‌లో రసాయన ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం జరిపిన భూ సేకరణ రణరంగంగా మారి పోలీసు కాల్పుల్లో మరణించిన 14 మంది గ్రామస్తుల స్మృత్యర్థం నందిగ్రామ్ దివస్ కార్యక్రమం ఆదివారం జరిగింది. సీనియర్ నాయకులు వెంటరాగా మాయో రోడ్డు నుంచి హజ్రా వరకు అయిదు కి.మీ. రోడ్ షోలో మమత పాల్గొన్నారు. భద్రతా సిబ్బంది వీల్‌చైర్‌ని ముందుకు తోస్తూ ఉంటే, ఆమె ముకుళిత హస్తాలతో ప్రజలకు అభివాదం చేస్తూ కనిపించారు. గంట సేపు కొనసాగిన ర్యాలీ అనంతరం ప్రజలనుద్దేశించి మమత మాట్లాడారు. తనపై ఎన్నో సార్లు దాడులు జరిగాయని, అయినప్పటికీ ఎవరికీ తలవంచే ప్రసక్తే లేదని అన్నారు. తన కాలికి అయిన గాయాన్ని చూపిస్తూ గాయపడ్డ పులి మరింత ప్రమాదకారి అని విపక్ష పార్టీలకు హెచ్చరికలు జారీ చేశారు. ‘‘వైద్యులు నన్ను ఇంకా విశ్రాంతి తీసుకోవాలని చెప్పారు. ఇవాళ ఎన్నికల ప్రచారానికి వెళ్లొద్దని సూచించారు. కానీ ఎలాగైనా ఇవాళ ప్రజల ముందుకు రావాలని అనుకున్నాను. తమ నియంతృత్వ విధానాలతో ప్రజాస్వామ్యానికి హాని చేస్తూ ఉండడంతో ప్రజలు అనుభవిస్తున్న బాధతో పోల్చుకుంటే నా బాధ చాలా చిన్నది’’అంటూ కేంద్రంపై ధ్వజమెత్తారు. మమత భద్రతా అధికారిపై ఈసీ వేటు భారతీయ జనతా పార్టీ కుట్రపూరితంగా తనపై దాడి చేయించిందని మమతా బెనర్జీ చేస్తున్న ఆరోపణలకి ఎలాంటి ఆధారాలు లేవని ఎన్నికల సంఘం తేల్చి చెప్పింది. మమత భద్రతా అధికారుల వైఫల్యం కారణంగానే ఆమెకి గాయాలయ్యాయని ఈసీ వర్గాలు ఆదివారం వెల్లడించాయి. ఈ ఘటనపై ఎన్నికల సంఘం నియమించిన ఇద్దరు పరిశీలకులు అజయ్ నాయక్, వివేక్ దూబేలు ఇచ్చిన నివేదికలు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదికలను సమీక్షించిన అనంతరం దీదీపై జరిగింది దాడి కాదని ఈసీ వెల్లడించింది. ఈ దాడికి బాధ్యతగా మమత భద్రతా డైరెక్టర్, ఐపీఎస్ అధికారి వివేక్ సహాయ్ని విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ‘‘జడ్ ప్లస్ భద్రత ఉన్న సీఎంకి సరైన రక్షణ కల్పించాలన్న ప్రాథమిక కర్తవ్యాన్ని నిర్వర్తించడంలో వివేక్ విఫలమయ్యారు. ఆయనపై వారంలోగా అభియోగాలు నమోదు చెయ్యాలి’’అని పేర్కొంది. రాష్ట్ర ప్రధానకార్యదర్శి, డీజీపీ చర్చించుకొని వెంటనే కొత్త భద్రతా డైరెక్టర్‌ను నియమించాలని ఆదేశాలిచ్చింది. ముఖ్యమంత్రి అయి ఉండి బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని మమత వాడకపోవడం భద్రతాపరమైన లోపమేనని ఈసీ తెలిపింది. మమత సాధారణ వాహనంలో ప్రయాణిస్తూ ఉంటే, ఆమె భద్రతా అధికారి వివేక్ సహాయ్ బుల్లెట్ ఫ్రూప్ కారులో ప్రయాణిస్తూ ప్రచారానికి వెళ్లిన విషయాన్ని గుర్తు చేసింది. బందోబస్తు సరిగా నిర్వహించనందుకు పూర్వ మిడ్నాపూర్ ఎస్పీ ప్రవీణ్ ప్రకాశ్‌ని సస్పెండ్ చేసింది. ఆయన స్థానంలో సునీల్ కుమార్ యాదవ్‌ను నియమించింది. జిల్లా ఎన్నికల అధికారిగా విభూ గోయెల్ స్థానంలో ఐఏఎస్ అధికారిణి స్మితా పాండేను ఈసీ నియమించింది. -
‘బంగారు బంగ్లా’ చేస్తాం: అమిత్ షా
ఖరగ్‌పూర్(పశ్చిమబెంగాల్)/మార్ఘెరిటా(అస్సాం): అధికారంలోకి వచ్చిన తరువాత పశ్చిమబెంగాల్‌ను బంగారు బంగ్లాగా మారుస్తామని, రాష్ట్రంలో నిజమైన మార్పు తీసుకువస్తామని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పశ్చిమబెంగాల్, అస్సాంల్లో ఆయన ఆదివారం ప్రచారంలో పాల్గొన్నారు. బెంగాల్‌లోని ఖరగ్‌పూర్‌లో, అస్సాంలోని నజీరా, మార్ఘెరిటాల్లో అమిత్ షా రోడ్ షోలను నిర్వహించారు. ఖరగ్‌పూర్‌లో తన రోడ్ షోకు భారీగా తరలివచ్చిన ప్రజలను చూస్తుంటే.. వారు మార్పు కోసం ఎంతగా ఎదురుచూస్తున్నారో అర్థమవుతుందని షా వ్యాఖ్యానించారు. వేలాదిగా జనం రావడంతో కిలోమీటరు దూరం రోడ్ షో సాగడానికే చాలా సమయం పట్టింది. ప్రచారంలో షా తో పాటు బీజేపీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ విజయ్ వర్గియ, రాష్ట్ర శాఖ అధ్యక్షుడు దిలిప్ ఘోష్ తదితరులు పాల్గొన్నారు. ఖరగ్‌పూర్ సదర్ స్థానం నుంచి బీజేపీ తరఫున నటుడు హిరణ్ చటర్జీ పోటీ చేస్తున్నారు. ఊహించని స్థాయిలో, భారీగా జనం తరలిరావడంతో అమిత్ షాతో పాటు ఇతర నాయకుల్లో ఉత్సాహం వెల్లివిరిసింది. ప్రజలవైపు విక్టరీ సంకేతం చూపుతూ, ప్రజలపై గులాబీ రేకులు విసురుతూ ఆద్యంతం అమిత్ షా నవ్వుతూ, ఉత్సాహంగా కనిపించారు. దారి పొడవునా ‘ఈబర్ బీజేపీ(ఈసారి బీజేపీ)’ అనే నినాదం హోరెత్తింది. అస్సాం ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌పై అమిత్ షా విరుచుకుపడ్డారు. దేశాన్ని విడగొట్టాలని ప్రయత్నిస్తున్న పార్టీలతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుందని ఆరోపించారు. బీజేపీ ఎన్నడూ ఓటుబ్యాంక్ రాజకీయాలు చేయబోదన్నారు. 15 ఏళ్లు అధికారంలో ఉండి కూడా, రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించిన నేత ప్రధానిగా ఉండి కూడా రాష్ట్రంలో అక్రమ వలసల సమస్యను పరిష్కరించడానికి కాంగ్రెస్ ప్రయత్నించలేదన్నారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో ఆయన రాజ్యసభలో అస్సాంకు ప్రాతినిధ్యం వహించిన విషయం తెలిసిందే. గెలవడం కోసం కాంగ్రెస్ ఏమైనా చేస్తుందని, అస్సాంలో బద్రుద్దీన్ అజ్మల్‌కు చెందిన ఐఏయూడీఎఫ్తో, కేరళలో ముస్లింలీగ్‌తో, పశ్చిమబెంగాల్లో ఐఎస్ఎఫ్తో పొత్తు పెట్టుకుందని విమర్శించారు. అజ్మల్ చేతుల్లో అస్సాం సురక్షితంగా ఉండబోదని హెచ్చరించారు. రాష్ట్రంలో ప్రజల సంక్షేమం కోసం అజ్మల్ ఆలోచిస్తారా? లేక ప్రధాని మోదీ ఆలోచిస్తారా? ప్రజలే నిర్ణయించుకోవాలన్నారు. గత ఐదేళ్ల పాలనలో బీజేపీ రాష్ట్రం నుంచి చొరబాటుదారులను ఏరివేసిందన్నారు. హింస, ఆందోళనలు, అవినీతి లేని పాలన అందించిందన్నారు. ఇప్పుడు కాంగ్రెస్‌కు అధికారమిస్తే చొరబాటుదారులకు మళ్లీ అవకాశమిచ్చినట్లు అవుతుందన్నారు. ‘ఇప్పుడు మీరు కాంగ్రెస్‌కు ఓటేస్తే అది అజ్మల్ ఏఐయూడీఎఫ్‌కు వేసినట్లు అవుతుంది. వాళ్లు చొరబాట్లను ప్రోత్సహిస్తారు. చొరబాటుదార్లను ప్రోత్సహించే ప్రభుత్వం కావాలా? లేక వారిని ఏరివేసే ప్రభుత్వం కావాలా? మీరే నిర్ణయించుకోండి’ అన్నారు. ‘అధికారమిస్తే రాష్ట్రంలో అందోళనలు, మిలిటెన్సీ లేకుండా చేస్తానని నేను ఐదేళ్ల క్రితం హామీ ఇచ్చాను. ఆ హామీ నెరవేర్చాం. ఇప్పుడు రాష్ట్రంలో మిలిటెన్సీ లేదు. ఎలాంటి ఆందోళనలు లేవు. రెండు వేలకు పైగా మిలిటెంట్లు జనజీవన స్రవంతిలో కలిశారు’ అని షా వివరించారు. ఇప్పుడు రాష్ట్రం శాంతియుతంగా, అభివృద్ధి పథంలో వెళ్తోందని, ముఖ్యమంత్రి శర్బానంద్ సొనొవాల్ ఆ దిశగా కృషి చేశారని పేర్కొన్నారు. మరో ఐదేళ్లు అవకాశమిస్తే రాష్ట్రంలో వరదల సమస్యను, చొరబాటుదారుల సమస్యను పరిష్కరిస్తామన్నారు. -
West Bengal Election 2021 బెంగాల్ దంగల్: దీదీకి మొదలైన తలనొప్పి
సాక్షి, న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికలకోసం మిషన్ బెంగాల్లో భాగంగా రాజకీయ పార్టీలు ఎత్తులు పైఎత్తులతో ప్రణాళికలు రచించడంలో నిమగ్నమయ్యాయి. త్వరలో జరిగే పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ప్రధాన పోటీ అధికార తృణమూల్ కాంగ్రెస్‌కు బీజేపీకి మధ్యే ఉంటుందని అందరూ అంచనా వేస్తున్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లను సమీకరించేందుకు పలు ప్రాంతీయ పార్టీలు దృష్టిపెట్టడంపై రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఐదు స్థానాల్లో జెండా ఎగురవేసిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ బెంగాల్ ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించి దుమారానికి తెరలేపారు. ఒవైసీ రంగప్రవేశంతో రాష్ట్రంలో ఉన్న 30 శాతం మంది ముస్లింల ఏకీకరణ జరుగుతుందని దీదీకి కలవరం మొదలైంది. ఇప్పడా కలవరం మరింత పెరుగుతోంది. బంగ్లాదేశ్ ముస్లింల ప్రభావంతో, ఫుర్ఫురా షరీఫ్ దర్గాకు చెందిన ఫిర్జాదా అబ్బాస్ సిద్దిఖీ ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ అనే పార్టీని ఏర్పాటు చేసి తాను బరిలో ఉన్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఒవైసీ–సిద్దిఖీల మధ్య ముస్లింల ఏకీకరణ అనే అంశంలో ఎవరు పైచేయి సాధిస్తారు? ఎవరు ప్రయోజనం పొందుతారు? అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. అయితే వీరిద్దరి మధ్య పోటీ దీదీకి కలిసొస్తుందని తృణమూల్ నాయకులు ఆశిస్తున్నారు. బెంగాల్ ఎన్నికల్లో ప్రధాన పోటీ తృణమూల్, బీజేపీ మధ్య ఉన్నప్పటికీ కాంగ్రెస్– వామపక్షాలు కలిసి పోటీ చేస్తుండడంతో పోటీ ఇప్పుడు త్రిముఖపోటీగా ఉండనుంది. బెంగాల్లో తమ భవితవ్యాన్ని పరీక్షించుకునేందుకు ఇతర రాష్ట్రాల్లోని మరికొన్ని పార్టీలు అసెంబ్లీ ఎన్నికలకు ఓట్ల సమీకరణపై దృష్టిపెట్టాయి. అయితే ఈ ప్రాంతీయ పార్టీలు ఎవరి విజయావకాశాలను దెబ్బతీస్తాయనే విషయంపై స్పష్టత కరువైంది. హిందుత్వ ఎజెండాతో బరిలో దిగే బీజేపీ దూకుడుకు కళ్లెంవేసేందుకు శివసేన వ్యూహరచన చేస్తోంది. బెంగాల్ ఎన్నికల్లో జార్ఖండ్ రాజకీయ పార్టీలు తమ ప్రాధాన్యతను పెంచుకునే పనిలోఉన్నాయి. ఇప్పటికే జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ఝాడ్‌గ్రామ్ జిల్లాలో జరిగిన మొదటి ఎన్నికల సమావేశంలో తమ పార్టీ 40 స్థానాల్లో బరిలో దిగనుందని ప్రకటించి ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. జార్ఖండ్‌లో బీజేపీ మిత్రపక్షమైన ఏజేఎస్‌యూ నాయకులు బెంగాల్ సరిహద్దు ప్రాంతాల్లో ఇప్పటికే సమావేశాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ), జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ), లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ), హిందూస్తానీ లెఫ్ట్ ఫ్రంట్ (హమ్), బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ)తో సహా శివసేన వంటి పార్టీలు బెంగాల్ బరిలో తమ వ్యూహాలు రచిస్తున్నాయి. హేమంత్ సోరెన్‌కు మమతా బెనర్జీతో మంచి సంబంధాలే ఉన్నప్పటికీ, బెంగాల్ ఎన్నికల్లో జేఎంఎం బరిలో దిగుతుందన్న సోరెన్ ప్రకటనను దీదీ జీర్ణించుకోలేకపోతున్నారు. హేమంత్ బెంగాల్ వచ్చి రాజకీయాలు చేస్తున్నాడని మమత వ్యాఖ్యానించారు. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 54 పార్టీలు తమ అభ్యర్థులను బరిలో దింపాయి. బీఎస్పీ 161, ఎస్పీ 23 మంది, శివసేన 21 మంది అభ్యర్థులను నిలబెట్టింది. జేఎంఎం, ఏజేఎస్‌యూ, ఎల్జేపీ, ఎన్సీపీ, ఆర్జేడీ అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు కానీ ఫలితంలేకుండా పోయింది. పదేళ్లు అధికారంలో ఉన్న కారణంగా ఏర్పడిన ప్రభుత్వ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకోవాలని అన్ని ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. రాష్ట్రంలోని 294 అసెంబ్లీ స్థానాల్లో 193 సీట్లలో పోటీకి సంబంధించి కాంగ్రెస్, వామపక్షాలు ఒప్పందం పూర్తయింది. దీంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయేందుకు అవకాశాలు మెండుగా ఉంటాయని తృణమూల్ నాయకులు భావిస్తున్నారు. త్రిముఖ పోటీలో చిన్న పార్టీల పాత్ర కీలకంగా మారబోతోంది. ఒవైసీ– సిద్దిఖీలు ముస్లిం ఓటు బ్యాంకుపై దృష్టిసారించగా, జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం), ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్(ఏజేఎస్‌యూ) గిరిజనులు ఎక్కువగా ఉన్న పురూలియా, ఝాడ్‌గ్రామ్, పశ్చిమ మేదినీపూర్, బంకురా, తూర్పు మరియు పశ్చిమ బర్ధమాన్, వీర్‌భూం వంటి జిల్లాలపై దృష్టిసారిస్తున్నారు. ఈ జిల్లాల్లోని గిరిజన ఓట్లు చాలా సీట్ల విజయావకాశాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. చదవండి: అద్దంలో చూస్కోండి: బీజేపీ నేతలకు మమత సలహా కాంగ్రెస్‌లో చేరనున్న మాజీ సీఎం